వివేక చూడామణి - 41 / Viveka Chudamani - 41
🌹. వివేక చూడామణి - 41 / Viveka Chudamani - 41 🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
🍀. ఆత్మ స్వభావము - 9 🍀
147. ఈ రకమైన బంధనాలను గాలి, అగ్ని, ఆయుధాలు మరియు లక్షల కొలది జన్మలు కూడ నాశనము చేయలేవు. కేవలము ఆశ్యర్యకరమైన విజ్ఞానమనే ఖడ్గముతో మంచి, చెడులను వేరుచేసి దైవము యొక్క దయతో నశింపజేయవలెను.
148. ఎవరైతే పట్టుదలతో, భక్తిభావముతో సృతుల ఆధారముతో స్థిరత్వాన్ని సాధించి, స్వధర్మాన్ని పాటిస్తూ స్వచ్ఛమైన మనస్సును పెంపొందించు కుంటాడో అలాంటి స్వచ్ఛమైన మనస్సు కలిగిన వ్యక్తి మాత్రమే అత్యున్నతమైన ఆత్మను తెలుసుకొనగలడు. అపుడే సంసార దుఃఖాలను కూకటి వేళ్ళతో సహా నశింపజేయగలడు.
149. పంచకోశాలతో కప్పివేయబడిన ఈ భౌతిక శరీరము మరియు దాని అంగములు ఆత్మ యొక్క శక్తి వలననే ఉత్పత్తి అయినవి. ఎలానంటే చెరువులోని నీరు తుంగలతో నిండిఉన్నట్లు.
150. తుంగను తొలగించినప్పుడు చెరువులోని నీరు స్వచ్ఛముగా ఉండి దప్పిక తీర్చుకొనుటకు అనువుగా నుండి ఆనందాన్ని కలిగిస్తవి. ఏవిధమైన అడ్డంకి ఉండదు. అలానే ఆత్మ చుట్టూ ఆవరించి ఉన్న అడ్డంకులను తొలగించిన స్వచ్ఛమైన ఆత్మ వ్యక్తమగును.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 41 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 Nature of Soul - 9 🌻
147. This bondage can be destroyed neither by weapons nor by wind, nor by fire, nor by millions of acts –by nothing except the wonderful sword of knowledge that comes of discrimination, sharpened by the grace of the Lord.
148. One who is passionately devoted to the authority of the Shrutis acquires steadiness in his Svadharma, which alone conduces to the purity of his mind. The man of pure mind realises the Supreme Self, and by this alone Samsara with its root is destroyed.
149. Covered by the five sheaths –the material one and the rest –which are the products of Its own power, the Self ceases to appear, like the water of a tank by its accumulation of sedge.
150. On the removal of that sedge the perfectly pure water that allays the pangs of thirst and gives immediate joy, appears unobstructed before the man.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
08 Mar 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment