భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 189


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 189 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - సద్గురువు -అవతార పురుషుడు. - 3 🌻

ఆధ్యాత్మిక అధికారపీఠము

ప్రతి అవతార యుగ కాలప్రమాణము 700సం|| నుండి 1400సం||తో అంత్యమగును.

709. ప్రతి అవతార యుగములో పదునొకండు కాలములుండును.

710. ఒక్కొక్క కాలప్రమాణము 65సం|| నుండి 125 సం|| లతో అంత్యమగును.

711. ప్రతి కాలమందును 5 గురు సద్గురువులుందురు.

712. ప్రతి అవతార యుగాంత్యమందును పదునొకండవ కాలములో అవతార పురుషుడుండును.

713. ఐదుగురు సద్గురువులు + ఒక అవతార పురుషుడే గాక ప్రతియుగమందును 56 బ్రహ్మీభూతులుందురు. వీరు సృష్టిలీలయిందు కర్తవ్యము లేనివారైయుందురు.

భూతులుందురు వీరిలో 8 గురు ప్రజా బాహుళ్యమునకు తెలిసియుందురు. ఆధ్యాత్మిక అధికారపీఠములో కార్యనిర్వాహక సభ్యులై కార్యాధ్యక్షులై పనిచేయుచుందురు ఆదివార పీఠము 7000 మంది సభ్యులతో కూడియుండును. వీరు వారివారి ఆధ్యాత్మిక సత్తాను, స్థాయిని అనుసరించి భూమికలలో వారికి నియోగింపబడిన ఉద్యోగ ధర్మములను నిర్వహించుచుందురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


08 Mar 2021

No comments:

Post a Comment