🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. కండూప మహర్షి - 2 🌻
11. రోగికేకదా ఔషదం. కాబట్టి ఇదేదో(గాయత్రీ మంత్రంలోని ఈ నాలుగవపాదం)చేస్తే, సంసారం అంతా పాడయి పోతుందేమోనని, ధనాదులు పోతాయేమోనని కొందరికి భయం.
12. సన్యాసి మాత్రం ఇది చేయాలనే కొందరు అంటారు. కాని ఇది మోక్ష విద్య. అది కోరేవారు సంసారం మనసులో వదలవచ్చు. ప్రామాణిక గ్రంథాల్లోకాని, మహర్షుల బోధల్లోగాని, స్మృతుల్లోకాని, తురీయపాదాన్ని చేయకూడదు అనిలేదు.
13. అయితే గాయత్రియొక్క తురీయపాదం – అంతర్ముఖుడు, విరాగి, ఇంచుమించు సన్యాసదీక్షలో ఉండేవాడికిమాత్రమే యోగ్యమైన మంత్రం అన్నారు. అంటే అర్థం ఏమిటి? అందరూ మంత్రం జపిస్తే, మళ్ళీ ఈ మోహంతో ఇలాంటి కర్మలు చేయకూడదు అని అర్థం.
14. తన దృక్పథం, సాధన వలన వ్యక్తికి ముక్తివస్తుంది. కాని అతడివల్ల ఇతరులపై ప్రభావంలేదు.
15. ఎవరు జపిస్తారో వారియందే భగవంతుడి అనుగ్రహం, అతడుమాత్రమే ఆ పరమపదం అందుకుంటాడు. పరమవస్తువు అది. సత్త్వంకాదు, రజస్సు కాదు. ‘పరోరజసి’ అది. అటువంటి వస్తువు ప్రాప్తమని చెప్పాలి.
16. మన కోరికలు చాలా పెద్దవి. ఉదాహరణకు లోక కల్యాణం అంటాం. మంచి వాళ్ళందరూ సుఖంగా ఉండాలని కోరుకున్నట్లయితే, దనిని ప్రసాదించగల శక్తి సామాన్యమైన యజ్ఞానికి ఎందుకుంటుంది? యజ్ఞానికి ఉండదు. యజ్ఞం నిర్వహించి దానిని పరమేశ్వరార్పణం చేస్తే, పరమేశ్వరుడి అనుగ్రహానికి అంతటి ఫలాన్ని ఇవ్వగల శక్తి ఉంటుంది.
17. నేను చేసిన యజ్ఞమో, నేనుచేసిన తపస్సో అంతా అల్పమే! అది ఎవరికి అర్పించబడ్డదో, వారికి అనంతమైన శక్తి ఉన్నది కాబట్టి, ఈ కోరిక నెరవేరుతుందనే భావంతోటే చెయ్యాలి. సర్వమూ పరమేశ్వరార్పణం అని కదా మనం సమస్తకర్మలనూ ముగించేది!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
25 Sep 2020
No comments:
Post a Comment