శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 9 / Sri Lalitha Chaitanya Vijnanam - 9





🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 9 / Sri Lalitha Chaitanya Vijnanam - 9 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత

రాగాస్వరుప పాశాడ్యా క్రోధా కారంకుశోజ్జ్వల

🌻 9. 'క్రోధాకారాంకుశోజ్జ్వలా' 🌻

క్రోధమనెడు గుణమునకు ఆకారము దాల్చినదిగా దేవి అంకుశమును తెలియవలెను. అట్టి అంకుశమును ధరించిన ఉజ్జ్వల మూర్తిగా ఈ నామము దీనిని ప్రస్తుతి చేయుచున్నది. మదించిన ఏనుగు వంటి స్వభావమును కూడ నియమింపగలనని అంకుశము

తెలుపును. మదించిన వారికి భయము లేదు. భక్తి ఉండదు. అట్టి వారిని సైతము ఉజ్జ్వలమైన తన క్రోధమను అంకుశముతో సర్వశక్తిమయి అయిన దేవి శిక్షించి, రక్షించగలదు.

మదము కరుడుగట్టిన అజ్ఞానము. దానిని పటాపంచలు చేయగల ఆయుధముగ దేవి అంకుశమును భావింపవలెను. యమించునది అంకుశమను సత్యము తెలియవలెను. అంకుశాకారము జ్యోతిషమున శనిగ్రహమునకు వినియోగింతురు. లోకమున ధర్మము తప్పి వర్తించు వారిని యముని రూపమున దేవియే శాసించు చుండును.

కాలక్రమమున ఎంతటి మొనగాడినైనను శనిగ్రహ చారము దేవి బలహీన పరచగలదు. ఏనుగైనను కాలవశమున పీనుగ కాగలదు కదా! కాల రూపమున సమస్త జీవులను నిష్కర్షగా నియమించు శనిగ్రహ తత్త్వమును అంకుశముగా వేదఋషులు సంకేతించిరి. ధర్మమున దేవి జీవులను నియమించునని సందేశ మిచ్చుటకే క్రోధమే ఆకారముగా గల అంకుశమును ధరించినట్లుగా తెలియవలెను. సామాన్యులను కాలము రూపమున దేవి నియమించును.

కొందరిని కష్టముల ద్వారా, మరికొందరిని నష్టముల ద్వారా, ఇంకొందరిని అజపయము, అపకీర్తి రోగముల ద్వారా మరియు పీడల ద్వారా కర్మఫలముల ననుభవింపజేసి, ధర్మమార్గమున నిలబెట్టును. అన్నిటికీ మించి, మృత్యువు రూపమున జీవుల సమస్త సంపాదనములను హరించి, జీవనము పునః ప్రారంభమగునట్లు చేయును.

విశేష ప్రజ్ఞకలిగి అధర్మము నాచరించువారిని తానే అవతారమూర్తిగ దిగివచ్చి శిక్షించును. అతి విశేష శక్తులతో విజృంభించిన మహిష, భండాసురాదులను తానే స్వయముగ దిగివచ్చి శిక్షించును.

ఎవనికి ఏ శిక్ష విధించిన రక్షింపబడునో అట్టి శిక్షను సమతూకముగ అందించగల శక్తియే అంకుశమను దేవి ఆయుధము. త్రిమూర్తులు సైతము ఆమె ఆజ్ఞకు లోబడి సృష్టి నిర్వహణము గావించుచున్నారు.

వారికి సృష్టియం దవరోధము లేర్పడినచో తానే స్వయముగ చక్కదిద్దగలదు.

అజ్ఞానాంధకారమును తగు విధముగ శిక్షించి జీవప్రజ్ఞను జ్ఞానమునందు నిలుపు ఉపకరణముగ అంకుశము వినియోగపడుచున్నది. కావున దేవి భక్తులు క్రోధముతో కూడిన ఈ అంకుశమును జ్ఞాన ప్రదమని భావించి, నమస్కరించి స్తుతింతురు. రాగమను పాశము ఒక హస్తమున ధరించిన దేవి, మరియొక హస్తమున క్రోధమను అంకుశమును ధరించి, సృష్టి జీవుల యందు రాగము మితిమీర కుండునట్లుగ చక్కబెట్టుకొనుచున్నది.

సృష్టియందు ఈ విధముగ రాగమును పెంచునది, మితిమీరినపుడు త్రుంచునది కూడ దేవియే. సత్సాధకుడు వీనిని గమనించి, కష్టనష్టములు, అపజయము కలిగినపుడు దేవియే కాలరూపమున త్రుంచుచున్నదని భావించి, ప్రతీకార వాంఛ లేక, నిరాశా నిస్పృహలు చెందక, దేవిని శరణు పొంది ధర్మమున తనను తాను నియమించుకొనును.

ఇష్టకాలము వచ్చువరకు తలదాచుకొని మౌనముగ జీవించును. నలుడు, ధర్మరాజు, హరిశ్చంద్రుడు వంటి మహాత్ముల జీవితములయందు ఈ సత్యమును గమనింపవచ్చును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹  Sri Lalitha Chaitanya Vijnanam - 9  🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 9. Krodhākāraṅkuśojvalā क्रोधाकारङ्कुशोज्वला 🌻

She holds an elephant hook in her right upper arm. Krodha means hatred and akāra means knowledge.

This nāma talks about subtle body. Knowledge is always subtle. She uses this elephant hook to destroy the hatred if developed in Her devotees and gives them knowledge.

A bīja of Kālī, kroṁ (क्रों) is hidden in this nāma. Kālī is the destroyer of all evils. This right upper arm is represented by Sampathkarī Devi.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


WhatsApp, Telegram, Facebook groups:

25 Sep 2020

No comments:

Post a Comment