మంత్ర పుష్పం - భావగానం - 6



🌹.   మంత్ర పుష్పం - భావగానం - 6   🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. మంత్రం పుష్పం - 11 &12 🌻

సంతాపయతి స్వం దేహ
మాపాద తల మస్తకః

తస్య మధ్యే వహ్ని శిఖా
అణీ యోర్ధ్వా వ్యవస్థితః

నీలతో యద మధ్యస్థా
ద్విద్యుల్లేఖే వ భాస్వరా
నీవార సూక వత్తన్వీ పీతా
భాస్వత్యణూపమా

🌻. భావగానం:

పాదాల నుండి తలవరకోయి
వేడిసెగలు అందించు నోయి
అది మహాగ్ని చక్రము మోయి

మధ్య పుల్లలానిలచిన దోయి
పైకిచేరు అగ్నిశిఖల తోడోయి
ఉన్నత చక్రము కాంతులోయి

బంగారురంగు మెరుపు కాంతులోయి
నీలిమబ్బుల మెరుపు కాంతులోయి
బియ్యపుగింజ చివర ములకంతోయి.

🌻. మంత్ర పుష్పం .13.

తస్యా శ్సిఖాయ మధ్యే
పరమాత్మా వ్యవస్థితః
స బ్రహ్మ సశివ స్సహరి స్సేన్ద్ర
స్సో౭క్షరః పరమస్స్వరాట్

🌻. భావగానం:

ఆ అగ్ని పైభాగ మధ్యనోయి
అదే పరమాత్మ నివాసమోయి
అతడే బ్రహ్మ అతడే శివుడు
అతడే హరి అతడే ఇంద్రుడు
అతడే నశించని పరమాత్మడు
అతడే నడిపించు పాలకుడు
ఓం ఇది శ్రీ కృష్ణ యజుర్వేదము లోని
తైత్తరీయ అరణ్యక మందు
పదవ పాఠకమున
నారాయణ ఉపనిషత్ లో
13వ అనువాకము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మంత్రపుష్పం

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


25 Sep 2020

No comments:

Post a Comment