రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
51. అధ్యాయము - 6
🌻. సంధ్య తపస్సును చేయుట - 1 🌻
బ్రహ్మోవాచ |
సుతవర్య మహాప్రాజ్ఞ శృణు సంధ్యా తపో మహత్ | యఛ్ఛ్రుత్వా నశ్యతే పాపసమూహస్తత్ క్షణాద్ధ్రువమ్ || 1
ఉపదిశ్య తపోభావం వసిష్ఠే స్వగృహం గతే | సంధ్యా పి తపసోభావం జ్ఞా త్వా మోదమవాప హ || 2
తతస్సానందమనసో వేషం కృత్వా తు యాదృశమ్ | తపశ్చర్తుం సమారేభే బృహల్లోహిత తీరగా || 3
యథోక్తం తు వసిష్ఠేన మంత్రం తపసి సాధనమ్ | మంత్రేణ తేన సద్భక్త్యా పూజయామాస శంకరమ్ || 4
బ్రహ్మ ఇట్లు పలికెను -
మహాప్రాజ్ఞ! నీవు నా కుమారులలో శ్రేష్ఠుడవు. సంధ్య యొక్క గొప్ప తపస్సును గురించి వినుము. ఇది విన్నవాని పాపసమూహము వెను వెంటనే నిశ్చితముగా నశించును (1).
తపస్సు యొక్క స్వరూపమును ఉపదేశించి వసిష్ఠుడు తన ఇంటికి వెళ్లెను. సంధ్య తపస్సు స్వరూపము నెరింగి ఆనందించెను (2).
అపుడామె బృహల్లోహిత సరస్సు యొక్క తీరమునందు కూర్చుండి, ఆనందముతో నిండిన మనస్సు గలదై, తపస్సునకు యోగ్యమగు వస్త్రధారణను చేసి తపస్సను చేయుట ఆరంభించెను (3).
తపస్సునందు సాధనముగా వసిష్ఠునిచే ఉపదేశింపబడిన మంత్రముతో ఆమె సద్భక్తి గలదై శంకరుని పూజించెను (4)
ఏకాంతమనసప్తస్యాః కుర్వంత్యా స్సుమహత్త పః | శంభౌ విన్యస్త చిత్తయా గతమేకం చతుర్యుగమ్ || 5
ప్రసన్నోsభూత్తగా శంభుస్తపసా తేన తోషితః |అంతర్బ హిస్తథాకాశే దర్షయిత్వా నిజం వపుః || 6
యాద్రూపం చింత యంతీ సా తేన ప్రత్యక్షతాం గతః | అథ సా పురతో దృష్ట్వా మనసా చింతితం ప్రభుమ్ || 7
ప్రసన్న వదనం శాంతం ముమోదాతీవ శంకరమ్ | ససాధ్వసమహం వక్ష్యే కిం కథం స్తౌమి శంకరమ్ || 8
ఇతి చింతాపరా భూత్వా న్యమీల యత చక్షుషీ |
ఆమె శంభుని యందు చిత్తమును దృఢముగా నిలిపి, ఇతర వ్యాపారములు లేనిదై మిక్కిలి గొప్ప తపస్సను చేయుచుండగా, ఒక మహాయుగ కాలము గడిచి పోయెను (5).
అపుడు శంభుడు ఆ తపస్సు చే సంతసించి, ప్రసన్నుడై, లోపల బయట, మరియు ఆకాశమునందు తన రూపమును ప్రకటించెను (6).
ఆమె ఏ రూపమును ధ్యానించుచుండెనో , అదే రూపముతో ఆయన ప్రత్యక్షమయ్యెను. తాను మనస్సులో ధ్యానించిన ప్రభువును ఆమె తన ఎదుట చూచెను (7).
ప్రసన్నమైన ముఖము గలవాడు, శాంతుడు అగు శంకరుని చూచి ఆమె మిక్కిలి ఆనందించెను. నాకు చాల భయమగు చున్నది. నేనేమి మాటలాడగలను ? శంకరుని ఎట్లు స్తుతించవలెను?(8)
అని ఆమె చింతిల్లి కళ్లను మూసుకొనెను.
నిమీలితాక్ష్యాస్తస్యాస్తు ప్రవిశ్య హృదయం హరః || 9
దివ్యం జ్ఞానం దదౌ తస్యై వాచం దివ్యే చ చక్షుషీ | ప్రత్యక్షం వీక్ష్య దుర్గేశం తుష్టావ జగతాం పతిమ్ || 10
హరుడు కళ్లను మూసుకున్న ఆమె హృదయములో ప్రవేశించి (9)
ఆమెకు దివ్యజ్ఞానమును, దివ్యవాక్కును, దివ్యనేత్రములను ఇచ్చెను. ఆమె జగత్ర్పభువగు పార్వతీపతిని ప్రత్యక్షముగా చూచి ఇట్లు స్తుతించెను (10).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
25 Sep 2020
No comments:
Post a Comment