🌹. శివగీత - 73 / The Siva-Gita - 73 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
నవమాధ్యాయము
🌻. శరీర నిరూపణము - 7 🌻
అగ్నేస్తు రోచకం రూపం - దీప్తిం పాకం ప్రకాశతామ్
అమరశ తీక్ష సూక్ష్మాణా - మోజస్తే జశ్చ శూరతా మ్ 36
మేదావితాం తథాదత్తే - జలాత్తు రసనం రసమ్,
శైత్యం స్నేహం ద్రవం స్వేదం - గాత్రాది మ్రుదుతామపి 37
భూమేర్ఘ్రాణెంద్రి యం గంధం - స్థైర్యం ధైర్యం చ గౌరవమ్,
త్వగా స్యజ్మాం సమేదోస్థి - మజ్జాశుక్రాణి ధాతవః 38
అన్నం ఉంసాశితం త్రేధా - జాయతే జటరాగ్ని నా
మలం స్థ విష్టో భాగస్స్యా - న్మధ్యమో మాం సతాం వ్రజేత్ 39
మనః కనిష్టో భాగాస్స్యా - త్తస్మా దన్న మయం మనః
అపాం స్థ విష్టో మూత్రం సా య - న్మధ్య మో రుధిరం భవేత్ 40
(తేజస్సు వలన కలిగే ప్రయోజనములను వివరించుచున్నాడు) కాంతివంతమగు రూపము. దీప్తి - జీర్ణశక్తి - శాంతి - కోపము - తైక్షము, సూక్ష్మత్వము, శక్తి, తేజస్సు, కార్యము, ఈ గుణములన్నియు అగ్ని వలన గ్రమించుచున్నాడు మరియు తేజస్సు నుండి మేధాశక్తి లభించును.
ఇక జలగుణములను వాడుకొనుచున్నాడు. రసనేంద్రియము (నాలుక) రసము, స్నేహము, శ్రుతలత్వము, ద్రవము, చెమట, శరీర మృదుత్వము మొదలగునవి జలలభ్యములు.
ఇకపోతే భూమి వలన గ్రహిందగు గుణములను పేర్కొనుచున్నాడు. గంధము, స్థిరత్వము, ధైర్యము, గురుత్వము, (బరువు) త్వక్కు, మాంసము, రక్తములు, మెదడు, ఎముక, క్రొవ్వు, శుక్రము, నాడులు, భూమినుండి లభించును.
ప్రాణులచేత దినబడిన యన్నము, మూడు భాగములుగా జటరాగ్నివలన నిర్మింపబడును. అందులో స్థూలభాగము మలము, మధ్యభాగము మాంసము, తేలికభాగము మసస్సు. కావుననే మసస్సు అన్నమయము.
ఉదకమున స్థూలభాగము మూత్రము. మధ్యభాగము రక్తము. తేలికభాగము ప్రాణముగాను మారుచుండును. కనుకనే జలమయము ప్రాణమందురు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 The Siva-Gita - 73 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj
Chapter 09 :
🌻 Deha Svarupa Nirnayam - 7 🌻
Splendour, Aura, power of digestion, serenity, anger, strength, valor, work all these are inherited qualities from Fire element. Moreover, from the splendour (Tejas), Medhashakti (intellect), is obtained.
Now, from the Water element rasam, tongue, friendship, coolness (composure), fluids, sweat, softness etc are obtained. From the earth element, smell, persistence, patience, gravitation (weight), skin, flesh, blood, brain, bones, fats, semen, and nerves are obtained. Food eaten by the creatures, is divided into three parts by the jatharagni (fire of belly).
Among them, the gross portion becomes the excreta. middle portion becomes the flesh, subtle portion becomes the manas (mind). That's the reason Manas is called as Annamayam (form of food).
Similarly, from water's gross portion urine is formed, middle portion becomes the constituent of blood, subtle portion becomes the Prana (life force). That's the reason Prana (life forces) are called Jalamayam (form of water).
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
25 Sep 2020
No comments:
Post a Comment