శ్రీ విష్ణు సహస్ర నామములు - 21 / Sri Vishnu Sahasra Namavali - 21


🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 21 / Sri Vishnu Sahasra Namavali - 21 🌹
నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

మిధునరాశి- ఆరుద్ర నక్షత్రం 1వ పాద శ్లోకం

21. మరీచి ర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః|
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః

మరీచిః -
ఊహింపశక్యని దివ్యతేజోమూర్తి.

దమనః -
తన దివ్యతేజస్సుచే సమస్తజీవుల తాపములను హరించువాడు.

హంసః -
హంస వలే పాలను గ్రహించి నీటిని విడచిపెట్టి "సోహం" (అతడే నేను) అని తెలిపే దివ్యాత్మ, అన్ని శరీరములందు వసించే అంతర్యామి.

సుపర్ణః -
జ్ఞానం, కర్మ అను రెండు రెక్కలతో (ఉపకరణములతో) జీవులను తరింపజేయువాడు.

భుజగోత్తమః -
సర్పములలో (వ్యాపనము, చలనము కలిగినవాటిలో) ఉత్తముడు.

హిరణ్యనాభః -
తన నాభినుండీ ఉత్పన్నమైన చతుర్ముఖ బ్రహ్మకు తండ్రి.

సుతపాః -
నరనారాయణనిగా గొప్ప జ్ఞానతపస్సును ఆచరించినవాడు.

పద్మనాభః -
బొడ్డులో తామరపూవు గలవాడు (సృష్టికి, జ్ఞానానికి సంకేతం).

ప్రజాపతిః -
సకలజీవులకు ప్రభువు, సృష్టికి మూలకారకుడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹   Vishnu Sahasra Namavali - 21   🌹
Name - Meaning

📚 Prasad Bharadwaj

🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻

Sloka for Midhuna Rasi, Arudra 1st Padam

21. marīcirdamanō haṁsaḥ suparṇō bhujagōttamaḥ |
hiraṇyanābhaḥ sutapāḥ padmanābhaḥ prajāpati: || 21 ||

Marīciḥ:
The supreme power and impressiveness seen in persons endowed with such qualities.

Damanaḥ:
One who in the form of Yama inflicts punishments on those who tread the path of unrighteousness.

Haṁsaḥ:
One who removes the fear of Samsara from those who practise the sense of identity with Him.

Suparṇaḥ:
One who has two wings in the shape of Dharma and Adharma.

Bhujagottamaḥ:
One who is the greatest among those who move on Bhujas or arms, that is, serpents. The great serpents like Ananta and Vasuki are the powers of Vishnu, so he has come to have this name.

Hiraṇyanābhaḥ:
From whose golden navel arose the lord of creation Brahmā.

Sutapāḥ:
One who performs rigorous austerities at Badarikashrama as Nara and Narayana.

Padmanābhaḥ:
One whose navel is beautifully shaped like lotus.

Prajāpatiḥ:
The father of all beings, who are His children.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama

25 Sep 2020

No comments:

Post a Comment