భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 123



🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 123 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. నరనారాయణ మహర్షులు - 4 🌻

20. భగవంతుణ్ణి ఏ కోరికకై ఏ రూపంలో ఆరాధించాలో సంప్రదాయం, శాస్త్రం చెబుతూనే ఉన్నాయి. ఔషదాలు ఆయా రోగాలకు ప్రత్యేకంగా ఎలా ఉన్నాయో, కోరికలు తీరటానికికూడా ప్రత్యేకంగా ఆయా దేవతల మంత్రాలు అలాగే ఉన్నాయి.

21. ఉదాహరణకు, వివాహం కావలసిన కన్యకు హనుమంతుడి మంత్రం ఉపదేశిస్తారు ఒకరు! నైష్ఠిక బ్రహ్మచారి అయిన హనుమంతుడు బ్రహ్మజ్ఞాని, రామభక్తుడు. పెళ్ళికావలసిన పిల్లలకు ఆ మంత్రం ఉపదేశంచేస్తే సరిపోదు.

22. కాని, వివాహితులైనవారికి దాంపత్యంలో దోషం, వియోగం సరిదిద్దగలడాయన. అన్ని ఔషదాలూ గొప్పవే! అలాగని చెప్పి, ‘మందులన్నిటిలోకీ గొప్పది ఏదయినా నా ఇచ్చే’యమని అడిగి, దానిని తింటామా? మనకున్న జబ్బుకు ఆ మందు అన్వయిస్తేనే అది పనిచేస్తుంది.

23. సంతానం కోసం రామతారక మంత్రోపదేశం పొందినవాళ్ళు చాలామంది ఉన్నారు! రామతారకం సంతానాన్నిస్తుందా! దానికి వచ్చే ఫలంవేరు. అయితే అన్నీ మహత్తు కలిగిన మంత్రాలే, సందేహంలేదు.

24. ఒకసారి శౌనకముని నారాయణమహర్షితో, ‘మహాత్మా! నేణు సర్వవేదశాస్త్రాలూ చదివాను, కాని పరమార్థం అంటే ఏమిటో ఇంతవరకు తెలియటంలేదు. ఈ సంశయాన్ని నివారించగలరు” అని అడిగారు.

25. దానికి నారాయణమహర్షి, ‘హరిభక్తితప్ప నీకు ఇంకోమార్గం, తరుణోపాయంలేదు. దానివలనే పరమార్థం తెలుస్తుంది. వేదశాస్త్రములలో ఎంత నిగూఢమైన రహస్యములు తెలుసుకున్నప్పటికీ అందులో పరమార్థంలేదు. నీవు తెలుసుకోలేవు. అది మార్గమే కాదు. అందువలన హరిభక్తిని అవలంబించు” అని చెప్పాడు.

26. “వేదవిద్యాధికారము ఉన్నా, లేకపోయినా అందరూ తరించాలంటే మార్గం ఏమిటి?” అని శౌనకుడు నారాయణమహర్షిని అడిగాడు. అప్పుడు నారాయణమహర్షి, “వాళ్ళకు సప్తసంతానాలున్నాయి. దానధర్మములు, సత్యవ్రతములు, వాపీ కూప తటాక ప్రతిష్ఠ, వనదేవతాలయ బ్రహ్మప్రతిష్ఠ, తనయుడు, కృతి అనే సంతానాలున్నాయి” అని చెప్పాడు.

27. ‘వనదేవతాలయ బ్రహ్మప్రతిష్ఠ’ అంటే – ఆపదలో ఉన్నబ్రాహ్మణుడిని; తన భుజబలంతోకాని, ధనబలంతోకాని రక్షించటము; దుఃఖంతో కష్టపడుతున్న బ్రాహ్మణుడెవరైనా ఉంటే అతడికి గృహదానం చెయ్యటమూ, వీటిని బ్రహ్మప్రతిష్ఠలంటారు” అనికూడా అన్నాడు.

28. ఉత్తముడైనటువంటి మహాకవి ఎవరైనా గొప్పగుణములు కలిగిఉండి శ్లాఘ్యమైన వస్తువులతో నిర్మాణము చేసిన కృతి ఏదయినా ఉంటే; దానిని కృతికర్తగా స్వీకరించటంకూడా సంతానంతో సమానమైనదే! దానివలన పుణ్యలోకాలు వస్తాయి. విష్ణుస్మరణమే అత్త్యుత్తమము. కాబట్టి అదే కైవల్య ప్రదాయకమైనట్టి, మహా మంత్రము, మార్గము అని చెప్పాడు శౌనికుడితో.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


30 Sep 2020

No comments:

Post a Comment