నామము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻
మిధునరాశి- పునర్వసు నక్షత్ర 1వ పాద శ్లోకం
25. ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః |
అహః సంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః ‖ 25 ‖
🍀. ఆవర్తనః ---
సంసార చక్రమును పరిభ్రమింపజేయువాడు.
🍀. నివృత్తాత్మా ---
అన్నింటికంటె మహోన్నతమగు పరమపద తత్వమూర్తి; సంసార చక్రమును త్రిప్పువాడైనను కోర్కెలకు అతీతుడైనవాడు, మాయాతీతుడు; నివృత్తి ధర్మమును పాటించువారికి ఆత్మస్వరూపుడు; సంసార బంధములకు అతీతుడు; నిత్యవిభూతి యనెడు స్వరూపము గలవాడు.
🍀. సంవృతః ---
కప్పబడియుండువాడు (తెలియజాలనివాడు) ; తమోగుణముచే మూఢులగువారికి కన్పించనివాడు; అజ్ఞానులైన మానవుల దృష్టికి మృగ్యుడై యున్నవాడు.
🍀. సంప్రమర్దనః ---
చీకటిని, అజ్ఞానమును, మాయను పారద్రోలువాడు; (రుద్రుడు, యముడు వంటి రూపములలో) దండించువాడు; దుష్టులను మర్దించువాడు (హింసించు వాడు).
🍀. అహఃసంవర్తకః ---
సూర్యుని రూపముననుండి దినములను (కాల చక్రమును) చక్కగా ప్రవర్తింపజేయువాడు.
🍀. వహ్నిః ---
సమస్తమును వహించువాడు (భరించువాడు) ; దేవతలకు హవిస్సునందించు అగ్నిహోత్రుడు.
🍀. అనిలః ---
వాయువు; ప్రాణమునకు ఆధారమైన ఊపిరి; ప్రేరణ లేకుండానే (వేరెవరు చెప్పకుండానే) భక్తుల కోర్కెలు తీర్చువాడు; ఆది లేనివాడు (తానే స్వయముగా ఆది.) ; సంగమము (బంధము) లేకుండా, మంచి చెడులకు అతీతమైనవాడు; కరిగిపోనివాడు; సర్వజ్ఞుడు; భక్తులకు సులభముగా అందువాడు; స్థిరమైన నివాసము (నిలయము) లేనివాడు; ఇల (భూమి) ఆధారము అవుసరము లేనివాడు; అన్నిచోట్ల ఉండువాడు (ఎక్కడో దాగని వాడు) ; సదా జాగరూకుడైనవాడు.
🍀. ధరణీధరః ---
భూమిని ధరించువాడు (భరించువాడు, పోషించువాడు).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Vishnu Sahasra Namavali - 25 🌹
Name - Meaning
📚 Prasad Bharadwaj
🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻
Sloka for Midhuna Rasi, Punarvasu 1st Padam
25. āvartanō nivṛttātmā saṁvṛtaḥ saṁpramardanaḥ |
ahaḥ saṁvartakō vahniranilō dharaṇīdharaḥ || 25 ||
🍀. Āvrtanaḥ:
One who whirls round and round the Samsara-chakra, the wheel of Samsara or worldy existence.
🍀. Nivṛttātmā:
One whose being is free or untouched by the bondage of Samsara.
🍀. Saṁvṛtaḥ:
One who is covered by all-covering Avidya or ignorance.
🍀. Sampramardanaḥ:
One who delivers destructive blows on all beings through His Vibhutis (power manifestation like Rudra, Yama etc.).
🍀. Ahaḥ-saṁvartakaḥ:
The Lord who, as the sun, regulates the succession of day and night.
🍀. Vahniḥ:
One who as fire carries the offerings made to the Devas in sacrifices.
🍀. Anilaḥ:
One who has no fixed residence.
🍀. Dharaṇī-dharaḥ:
One who supports the worlds, Adisesha, elephants of the quarters, etc.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
30 Sep 2020
No comments:
Post a Comment