🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
దశమాధ్యాయము
🌻. జీవ స్వరూప నిరూపణము - 4 🌻
వాయనః పంచ మిళితాః యాంతి లింగ శరీరతామ్
తత్రా విద్యా సమాయుక్తం - చైతన్యం ప్రతిబింబితమ్ 16
వ్యావహారిక జీవస్తు - క్షత్రజ్ఞః పురుషో పి చ
స ఏవ జగతాం భోక్తా - నాద్యయో: పుణ్య పాపయో: 17
ఇహా ముత్ర గతిస్త స్య - జాగ్రత్స్వ ప్నాది కభోక్త్ర తా ,
యథా దర్పన మాలిన్యా - ద్ద్రుశ్యతే మలినం ముఖమ్ 18
తద్వ దాన్తః కరణ గై - ర్దో షై రాత్మా పిదృశ్యతే
పరస్పరాధ్యా సశా - త్స్యా దన్తః కరనాత్మనో 19
ఏకీ భావాభి మానేన - పరాత్మా దుఃఖ భాగిన
మరుభూమౌ జలత్వేన - మధ్యాహ్నర్క మరీచికాః 20
ఆ లింగ దేహమునందు అజ్ఞాన సంపర్కమున్నవాడై భగవంతుని యాత్మ ప్రతిబింబమైన జైతన్యమును బొంది, క్షత్రజ్ఞుడనియు, పురుషుడనిగాని వ్యవహారిక జీవుడగు పరమాత్ముండుండును.
అతడే అనాది యగు పుణ్య - పాపముల పలభోక్త యగును. ఇహపరముల గతియు జాగ్రదాద్యవస్థల భోక్త్రత్వము నాయనకే చెందును. అంతఃకరణ దోషములతో నాత్మ దోషిగా కనపడును. అద్దము మలినముగా నుండిన యెడల మన ముఖాలు కూడా మలినముగా అగుపడుచున్నవి కదా!
ఆత్మాంతకరణము యొక్క అన్యోన్యతముగా తదాత్మ్యా ధ్యా సవశమున నైక్యాభిమానముతో పరమాత్ముడు కూడా దుఃఖమునే యనుభవించుచున్న వాడి వైపు యుండును కాని యది నిజమైనది కాదు. ఎడారిలో ఎండ మావులు భూమియందు నీరువలె భాసించును. అజ్ఞానియైన వాడది నీరుకాదని తెల్సికొని, అట్టి ఎండమావులెన్నటికిని చల్లటివికావు, మరింతగా తాపమునే కల్గించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 The Siva-Gita - 78 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj
Chapter 10
🌻 Jeeva Swaroopa Niroopanam - 4 🌻
In that Linga deham (subtle body), under the blanket of ignorance (karana deham), the supreme Purusha (Shiva) himself resides and is called as Kshetrajna, Purusha. He is the one who enjoys the fruits of good and bad deeds eternally as Jiva.
He only plays in the Jagrut, Swapna etc states of consciousness as well and enjoys the corresponding acts and results also. If there is a sin in antahkaranam the Atma appears to be the sinner (but not in reality) as like as if the mirror is dirty, the face of the person looks dirty when seen in that mirror.
Hence residing under the ignorance, as Jiva the Paramatman also appears as enjoying the fruits of good and bad deeds. But Atma is untouched in reality. That's like a mirage in the desert.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
30 Sep 2020
No comments:
Post a Comment