🌹. మంత్ర పుష్పం - భావగానం - 10 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. మంత్రం పుష్పం - 24 to 26 🌻
🌻. మంత్ర పుష్పం 24.
వాతాద్విష్ణోర్బల మాహుః
అక్షరాదీప్తిః రుచ్యతే
త్రిపధా ద్దారయః ద్దేవః
యద్విష్ణో రేక ముత్తమమ్
🍀. భావగానం:
వాయువు వలన బలమోయి
శాశ్వతమునుండి తేజమోయి
త్రిపాద విభూతుల నుండోయి
ఇహ పరములు రెండూనోయి
పొందిన దైవము విష్ణువోయి
అందరి కన్న ఉత్తముడోయి
🌻. మంత్ర పుష్పం 25.
రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే
నమోవై యం వై శ్రవణాయ కుర్మహే
సమే కామాన్ కామకామాయ
మహ్యం కామేశ్వరో వై శ్రావణౌ
దధాతు
కుబేరాయవై శ్రవణాయ
మహారాజాయ నమః
🍀. భావగానం:
రాజులకు రాజైన దేవుడోయి
పరులకు లాభాలీయునోయి
వైశ్రవణునకు వందనమోయి
సకల కోరికల యజమానోయి
మా కోరికలన్ని తీర్చునోయి
అతడే కుబేరుడు వైశ్రవణుడోయి
ఆ మహారాజుకు వందనమోయి
🌻. మంత్ర పుష్పం 26.
ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు,
ఓం తదాత్మా
ఓం తత్సత్యమ్
ఓం తత్సర్వం , ఓం తత్పురోమ్ నమః
🍀. భావగానం:
అతడే బ్రహ్మ మతడే వాయువు
అతడే సత్య మతడే ఆత్మ
అతడే సర్వ మతడే ఆదిదైవం
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మంత్రపుస్పం
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
30 Sep 2020
No comments:
Post a Comment