శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 13 / Sri Lalitha Chaitanya Vijnanam - 13

🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 8 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 13 / Sri Lalitha Chaitanya Vijnanam - 13 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

4. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత

🌻 13. 'చంపకాశోకపున్నాగ సౌగంధిక లసత్కచా' 🌻

శ్రీదేవి కేశ పాశములు సహజ గంధము గలవి. కావున అవి తమ వాసనను చంపకాది పుష్పముల కొసంగినవనియు, ఆ పుష్పములనామె ధరించుటచే వానికి శోభ కలిగెననియు భావము.

అగ్నికుండము నుండి దేవి ఉద్భవించుటచే శిరస్సు మొదట కనిపించును. సాధారణముగ దైవ వర్ణనము పాదమునుండి శిఖాంతము వరకు చేయుట పరిపాటి. కాని ఆమె పుట్టుకలో శిరస్సు ముందు కనిపించుటచే శిరస్సు వర్ణన ఆరంభమాయెను. పురుష సూక్తమున పురుషుని కూడ "సహస్రశీర్షా పురుషః” అని స్తుతించు సంప్రదాయము కన్పట్టును.

అవతరణము చెందు దివ్యత్వము శిరస్సు నుండి పాదముల వరకు వర్ణించుట వేద సంప్రదాయమని ఎరుగవలెను. చంపక, అశోక, పున్నాగములు సుగంధము పరిమళించు పుష్పములు. అమ్మ రూపముయొక్క వర్ణనము పుష్ప వర్ణనముతో ప్రారంభింపబడినది. "సర్వము పుష్పార్థము" అని అగ్నిపురాణము తెలుపుచున్నది.

పై తెలిపిన పుష్ప వాసనలతో ప్రకాశించుచున్న కేశములు కలది అని శీరోదయ సమయమున ధ్యానింపవలెను. పుష్పములకు పరిమళము అందించునది శ్రీమాతయే.

అనగా పుష్పము యొక్క సుందర రూపము, సౌకుమార్యము అమ్మ రూపముకాగ అందలి సుగంధము అమ్మ సాన్నిధ్యమే అని తెలియవలెను. మానవులు పుష్పములను ధరించి శరీరమునకు సుగంధము నందింతురు. పుష్పములకే సుగంధము లందించినవి అమ్మ శిరస్సు నందలి కేశపాశములు.

వికసించునది పుష్పము కనుక సృష్టి పుష్పములందుగల సర్వసుగంధము అమ్మ అందించుచున్న సాన్నిధ్యమని తెలియపవలెను. దీని నారాధించుట కారణముగ భక్తుని యందుకూడ అమ్మ సాన్నిధ్య మేర్పడి అతని నుండి సుగంధ వాసనలు వ్యాప్తి చెందుచున్నవి.

మహాత్ము లున్నచోట ఇట్టి సుగంధవ్యాప్తి విదితమే. ఆరాధనమున పుష్పమునకు, సుగంధములకు ఇట్టి ప్రత్యేక స్థానము కలదని తెలియవలెను.

దేవి ఆశపాశముల సుగంధము ననుభూతి పొందినవాడు అదృష్టవంతుడు. ఆ కేశ సమూహమందలి సువాసనతో ఏ పుష్ప సుగంధము సాటిరాదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹   Sri Lalitha Chaitanya Vijnanam - 13   🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻. Campakāśoka- punnāga- saugandhika-lasat-kacā चम्पकाशोक-पुन्नाग-सौगन्धिक-लसत्-कचा (13) 🌻

Campaka, aśoka, punnāga, saugandhika are the four types of fragrant flowers that adorn Her hair. But Her hair does not get fragrance because of these flowers, whereas these flowers get their fragrance from Her hair. Her hair is always sweet smelling.

Saundarya Laharī (verse 43), says.”Your dense, greasy and soft braid of hair, resembling a group of blue lotuses in bloom, dispel our ignorance. I think the flowers of the trees in the garden of the foe of Vala abide therein to attain their innate fragrance.” Wetness indicates Her compassion and softness indicates Her motherhood.

Durvāsa ṛṣi (Sage Durvās) in his ‘Śaktī Mahimna’ meditates on Her sweet smelling hair in his heart cakra.

The idea behind these description is when Her hair can drive away ignorance (knowledge is considered as supreme in realising the Brahman), what Her total form can do for Her devotees. These four sweet smelling flowers mean the four deceptive components of antaḥkaraṇa viz. mind, intellect, consciousness and ego.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi


30 Sep 2020

No comments:

Post a Comment