🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 26 and 27 / Vishnu Sahasranama Contemplation - 26 and 27 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻26. శర్వః, शर्वः, Śarvaḥ 🌻
ఓం శర్వాయ నమః | ॐ शर्वाय नमः | OM Śarvāya namaḥ
శృణాతి ఇతి శర్వః సంహార సమయమున రుద్ర రూపమున సకల ప్రాణులను సంహరించును; రుద్రునిచే సంహరింపజేయును. శృణాతి, హినస్తి పాపమితి శర్వః పాపములను హింసించువాడు (పోగొట్టువాడు). శృణాతి హినస్తి సర్వమంతకాలే ఇతీశ్వరః ప్రళయకాలమున అందరినీ హింసించువాడు.
కురుక్షేత్రమునందు భగవంతుని విశ్వరూప సందర్శనభాగ్యము కలిగినపుడు, అర్జునుడికి ఆ పరమాత్ము తెలిపినది ఆ సంధర్భమున అక్కడకు చేరుకొన్న యోద్ధలనుద్దేశ్యించి తెలిపినప్పటికీ, ఆ శ్లోకములో 'శర్వః' అన్న ఈ దివ్య నామము యొక్క వివరణ చూడవచ్చును.
:: భగవద్గీత విశ్వరూపసందర్శన యోగము ::
కాలోఽస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో
లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ।
ఋతేఽపి త్వా న భవిష్యన్తి సర్వేః
యేఽవస్థితాః ప్రత్యనికేషు యోధాః ॥ 32 ॥
నేను లోకసంహారకుడనై విజృంభించిన కాలుడను అయియున్నాను. ప్రాణులను సంహరింపు నిమిత్త మీ ప్రపంచమున ప్రవర్తించుచున్నాను. ప్రతిపక్షసైన్యములందుగల వీరులు నీవు లేకపోయినను (యుద్ధము చేయకున్నను) జీవించియుండరు (మృతినొందకా తప్పరు).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Vishnu Sahasranama Contemplation - 26 🌹
📚. Prasad Bharadwaj
🌻 26.Śarvaḥ 🌻
OM Śarvāya namaḥ
He destroys the whole universe at the time of Pralaya or cosmic dissolution.
After revealing His cosmic form, in response to Arjunā's inquiry, the Lord responded as below. In the context, the response is about the assembled warriors. Nevertheless, we can also look for the meaning of the divine name 'Śarvaḥ' in the same.
Bhagavad Gīta - Chapter 11
Kālo’smi lokakṣayakr̥tpravr̥ddho
Lokān samāhartumiha pravr̥ttaḥ,
R̥te’pi tvā na bhaviṣyanti sarveḥ
Ye’vasthitāḥ pratyanikeṣu yodhāḥ. (32)
Time I am, the great destroyer of the worlds, and I have come here to destroy all people. With the exception of you (the Pānḍavās), all the soldiers here on both sides will be slain.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सर्वश्शर्वश्शिवस्थाणुर्भूतादिर्निधिरव्ययः ।सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः ॥ 4 ॥
సర్వశ్శర్వశ్శివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః ।సమ్భవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ॥ 4 ॥
Sarvaśśarvaśśivasthāṇurbhūtādirnidhiravyayaḥ ।Sambhavo bhāvano bhartā prabhavaḥ prabhurīśvaraḥ ॥ 4 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 27 / Vishnu Sahasranama Contemplation - 27 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻27. శివః, शिवः, Śivaḥ🌻
ఓం శివాయ నమః | ॐ शिवाय नमः | OM Śivāya namaḥ
ఉపాధిరహితుడైనవాడు. అందువలన అతనికి మాలిన్యము లేదు. శుద్ధుడు. గుణత్రయములో దేనినుండియు ముక్తుడే కావున శుద్ధుడగుటవలన ఈతండు 'శివః'.
'సబ్రహ్మ - సశివః' (కైవల్యోపనిషద్ 1.8) 'అతడే బ్రహ్మయును, అతడే శివుడును' అను శ్రుతి ప్రమాణముచే విష్ణునకు బ్రహ్మరుద్రులతో అభేదము అని తెలుస్తున్నది. శ్రుతిచే ఉచ్చరింపబడుటచే 'శివ' మొదలగు నామముచే హరియే స్తుతించబడును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 27 🌹
📚. Prasad Bharadwaj
🌻27.Śivaḥ🌻
OM Śivāya namaḥ
Pure one. For He is not affected by the three Guṇās of Prakr̥ti - Sattva, Rajas and Tamas.
The Kaivalya Upanishad says "Sa Brahmā Saśivaḥ" (1.8) He is both Brahmā and Śiva. In the light of this statement of non-difference between Śiva and Viṣṇu, it is Viṣṇu himself that is exalted by praise and worship of Śiva.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सर्वश्शर्वश्शिवस्थाणुर्भूतादिर्निधिरव्ययः ।सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः ॥ 4 ॥
సర్వశ్శర్వశ్శివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః ।సమ్భవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ॥ 4 ॥
।Sambhavo bhāvano bhartā prabhavaḥ prabhurīśvaraḥ ॥ 4 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
30 Sep 2020
No comments:
Post a Comment