శివగీత - 101 / The Siva-Gita - 101



🌹. శివగీత - 101 / The Siva-Gita - 101 🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ
ద్వాదశాధ్యాయము


🌻. మోక్ష యోగము - 2
🌻


ఆత్మ స్వరూపా వస్తానం - ముక్తి రిత్యభి దీయతే,

సత్యం జ్ఞాన మనంతంయ- దానందం బ్రహ్మ కేవలమ్. 9


సర్వ ధర్మ విమీనంచ - మనో వాచామాగో చరమ్,

సజాతీయ విజాతీయ - పదార్థానా - మాసంభవాత్. 10


అతస్తద్వ్య తిరిక్తానా - మద్వైతమితిసంజ్ఞిత మ్,

మత్వా రూప మిదం రామ! - శుద్ధం యదభిదీయతే. 11


మయ్యేవ దృశ్యతే సర్వం - జగత్ స్తావర జంగమమ్,

వ్యోమ్ని గంధర్వ నగరం - యథా దృష్టంన దృశ్యతే. 12


సత్య జ్ఞానంద మై నిర్వి కార మై సర్వధర్మ విహీన మై మనోవాగ గోచర మై సజాతీయ స్వగత భేదారహితమై యద్వైత మగు నీ రూపుని శుద్ధ మైనది గా తలంపుము.

నా యందే జగం మస్తావ రాత్మక మగు ఈ జగత్తు చూడ బడుచున్నది. మరియు నాకాశమున గంధర్వ నగరము ( మాయా పట్టణము ) చూడ బడి మాయమైనట్లు అనాది యగు నజ్ఞానము చేత సమస్త జగత్తు నాతోనే కల్సింపబడు చున్నది.


అనాధ విద్యయా విశ్వం - సర్వం మయ్యేవ కల్స్యతే,

మమ స్వరూప జ్ఞానేన - యదా విద్యా ప్రణశ్యతి. 13


తదైక ఏవ వార్తేహం - మనోవాచా మగోచరః,

సదైవ పరమానంద - స్స్వప్రకాషశ్చిదాత్మనా. 14


న కాలః పంచ భూతాని - నదేశ విది శశ్చన,

మదన్యం నాస్తి యత్కించి - త్తదా వార్తైహమేకల: 15


న సందృశే తిష్టతిమే స్వరూపం

న చక్షుపా పశ్యతి మాంతుకశ్చిత్,

హృదామనీషా మనసా భిక్షప్తం

ఏమాం విదుస్తే హ్యుమ్రుతా భవన్తి. 16


నా యొక్క నిరి సాధిక స్వరూపమును తెలిసికొనుట చేత నెప్పుడును ద్వైత జ్ఞానము నశించునో అప్పుడు నేను మాత్రము మనో వాక్కులకగోచరుడ నై యేకాకి నై యుండెను. జ్ఞానాత్మ చేత స్వప్రకాశుండ నై ఎల్లప్పుడు పరమానందము కలవడి నై యుందును.

నన్ను విడచి దేశకాలాది గ్భూతములు లేవు. నాకంటెను భిన్నమైనది కొంచము కూడా లేకుండా నేనొక్కడినే జరింతును. నా స్వరూపమును చూచుటకు శక్యము కాదు, నన్నెడైనను చర్మ చక్షువు తో చూడ లేడు. హృదయములో నిష్ఠ మగు మనస్సుతో నియమితుడనగు నన్ను చూచినవారు ముక్తిని పొందగలరు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 The Siva-Gita - 101 🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj


Chapter 13
🌻 Moksha Yoga - 2
🌻

Becoming the truth, knowledge, bliss, attributeless, beyond all Dharmas, beyond the mind & speech, beyond differences, this self should be considered as the pure form.

This entire mobile & immobile creation is being seen in me. As like as abode of gandharvas remains in sky and becomes invisible, due to the power of Maya this world is being created and withdrawn by me.

When my formless state is realized by the Yogi, his duality ceases, then he perceives with mind, and speech me as the one nondual alone lord. With the knowledge of self, being self illuminating, always I remain in bliss.

There is no space, time, directions, creatures different from me. Nothing exists other than me and I alone remain. It is not possible to see my form. None can see me with the eyes of flesh.

However with a steady mind, inside his own heart being inward focussed one can see me within him, such a one gains final bestitude called liberation.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


28 Oct 2020

No comments:

Post a Comment