శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 91 / Sri Gajanan Maharaj Life History - 91

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 91 / Sri Gajanan Maharaj Life History - 91 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 18వ అధ్యాయము - 5 🌻


మిగిలిన వాళ్ళు బాపూనాకు లభించిన ఈదర్శనం సంగతివిని, శ్రీమహారాజును తమకు కూడా విఠోబా దర్శనభాగ్యం కలిగించి దీవించమని వేడుకున్నారు. ముందు మీరు మీమనసును బాపూనాలా అభివృద్ధి చేసుకోండి, తరువాత విఠోబాను చూపిస్తాను. ఈదర్శనం అనేది బజారులో దొరికే మామూలు వస్తువు కాదు.

బాపూనాకు లభించిన దర్శనంలాంటిది పొందడానికి పవిత్రమయిన మనసు కావాలి అని శ్రీమహారాజు సమాధానం ఇచ్చారు. శ్రీమహారాజు పండరపూరులో బాపూనాకు విఠోబాను నిజంగా ఎలాచూపించారో చూడండి. ఇది ఆయన నిజమైన యోగికనుకనే. భగవంతునికి, యోగికి మధ్య బేధంలేదు. ఇది చక్కెర మరియు తియ్యదనం లాగా ఒకదానినుండి ఒకటి వేరు చెయ్యలేనివి. ప్రసాదంతీసుకున్న తరువాత అందరూ షేగాం తిరిగి వచ్చారు.

విఠోబా ఆశీర్వచనాలతో బాపూనాకు కొడుకు పుట్టి చాలా తెలివయిన వాడిగా పెరిగాడు. యోగులకు చేసిన సేవ ఎప్పటికీ వృధాకాదు. విఠోబా ఆశీర్వచనాలవలన బాపూనాకు పిల్లవాడు కలిగాడు కావున అతనికి నామదేవ్ అని పేరు పెట్టారు. కవారే బహుడె విదర్భనుండి వచ్చిన భక్తుడు కావడంవల్ల కుకాజీ వాడలో బసచేసాడు.

ద్వాదశినాడు పండరపూరు కలరా వ్యాధికి చిక్కుకుంది. అనేక డజనుల మంది ప్రజలు మరణిస్తున్నారు. పోలీసులు వైద్యులసలహా మీదట ప్రజలను బలవంతంగా వెళ్ళగొడుతున్నారు. ఈ కవారే బహుడే భక్తుడికి కలరా వ్యాధి సోకింది. వాంతులు, విరేచనాలు అవుతున్నాయి. అతని శక్తి అంతా కోల్పోయి చాలా నీరసించిపోయాడు. ఎవరూ అతనికి సేవచేసి మందులివ్వడానికి రాలేదు. పోలీసుల భయంతో వైద్యులకు కూడా తెలియపరచలేదు. అతనిని మృత్యువు గుప్పిటిలో వదలి అందరూ వెళ్ళిపోయారు.

మీరు అభివృద్ధిలో ఉన్నప్పుడే ప్రజలు మీస్నేహితులుగా ఉంటారు, విపరీత పరిస్థితులలో వాళ్ళు మిమ్మల్ని విడిచిపెడతారు. అటువంటి పరిస్థితులలో ఒక్క భగవంతుడే లేదా యోగులు మాత్రమే మీసహాయానికి వస్తారు. భక్తుడు కవారే బహుడే వరండాలో పడిఉండడం చూసి, శ్రీమహారాజు మిగిలిన భక్తులతో అతనిని తమతో తీసుకు వెళ్ళవలసిందిగా అన్నారు. ఇతను చావుకు దగ్గరలో ఉన్నాడు, మనం అతనికి సహాయం చెయ్యబోతే మనం కూడా ప్రమాదంలో పడతాము. మనదగ్గర 50 మంది ఉన్నారు, మరియు కలరా దావానలంలా పండరపూరులో వ్యాపిస్తోంది కావున ఇటువంటి పరిస్థితులలో ఒక్కక్షణం కూడా ఇక్కడ ఉండడం ఉచితం కాదు వెంటనే ఇక్కడ నుండి బయటపడదాం అని వాళ్ళు అన్నారు. వాళ్ళ ప్రదేశానికే చెందిన వాళ్ళ సోదరుడిని ఆ పరిస్థితులలో వదిలివేయడం మూర్ఖత్వమని శ్రీమహారాజు అన్నారు.

అప్పుడు శ్రీమహారాజు వెళ్ళి ఆ భక్తుని చెయ్యపట్టుకుని, లేచి కూర్చోడానికి సహాయంచేసి, రా లేచి నిలబడు, విదర్భ వెళదాం పద అన్నారు. నేను విదర్భ ఎలా వెళ్ళగలను ? నేను చావుకు దగ్గరవుతున్నాను, మరియు నా బంధువులు ఎవరూ తోడులేరు అని ఆభక్తుడు అన్నాడు. ఈవిధంగా భయపడకు, నీజీవితానికి ప్రమాదం తప్పింది అని శ్రీమహారాజు అన్నారు. ఇలా అంటూ శ్రీమహారాజు తన చేతిని ఆ భక్తుని తలమీద పెట్టారు. ఆ స్పర్శతోటే అతని వాంతులు, విరేచనాలు వెంటనే ఆగిపోయి అతనికి నిలబడడానికి శక్తి ఉన్నట్టు అనిపించింది.

యోగుల చేతిలో ఉన్న మనిషిని మృత్యువు ఎలా తీసుకుపోగలదు ? ఒక గంటలో అతను పూర్తిగా కోలుకుని మిగిలిన వాళ్ళతో కలసి ఇంటికి తిరిగి వచ్చాడు. చావు పిడికిలినుండి రక్షించబడినందుకు అతను చాలా సంతోషించి శ్రీమహారాజు ముందు పదేపదే నమస్కారాలోచేసి, స్వామీజీ మీరునన్ను మృత్యువు నోటినుండి వెనక్కు తెచ్చారు అని అన్నాడు.

ఈ అద్భుతాన్ని చూసిన భక్తులు శ్రీమహారాజుకు జైజైధ్వానాలు చేసారు. ఆవిధంగా శ్రీమహారాజుతో పండరపూరు వెళ్ళిన వాళ్ళంతా క్షేమంగా షేగాం తిరిగి వచ్చారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 91 🌹

✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj


🌻 Chapter 18 - part 5 🌻


Without childhood, how can one attain adulthood? Such were the taunts and criticism directed at Bapuna. Nobody protected him in this attack. He was just sitting quietely without taking any food. Shri Gajanan Maharaj was looking at him and at everything that was happening there.

God only comes to the rescue of the poor and the helpless people. Fortunate are those who get the association of saints. Shri Gajanan Maharaj said, - Bapuna, don't worry come on I will show you Rukmin Ramana just now. Saying so, Shri Gajanan Maharaj stood up, positioned his feet like Vithoba and put out his hands on his waist.

Bapuna saw him as Vithoba with garlands of tulsi and flowers around the neck. He prostrated at Vithoba’s feet and looked up again, but now he saw Shri Gajanan Maharaj in the place of Vithoba. Bapuna was immensely happy for this darshan of Vithoba.

When subsequently he went to temple he saw exactly the same idol as Shri Gajanan Maharaj had showed him at Kukaji's Wada. Other people learnt about this darshan to Bapuna and they requested Shri Gajanan Maharaj to bless them also with the Darshan of Shri Vithoba.

Shri Gajanan Maharaj replied - First develop your mind like - Bapuna and then I will show you Vithoba. This Darshan is not a commodity available in the market. It requires a pious mind to get such Darshan as Bapuna got.

Look, how Shri Gajanan Maharaj showed 'Vithoba' in reality to Bapuna at Pandharpur. It was because he was a real saint. There is no difference between God and a saint. It is just like sugar and its sweetness which cannot be separated from each other.

After taking prasad all of them returned to Shegaon. With the blessings of Vithoba, Bapuna got a son who grew up to be a very intelligent boy. Service to saints never goes waste. Since Bapuna got the son due to the blessings of Vithoba, he was named him Namdeo.

A devotee of Kavathe Bahadur, being from Vidarbha, lodged at Kukaji's Wada. On Dwadashi day Pandharpur was gripped with Cholera. Scores of people were dying, and the police, on the adive of doctors, was asking the people to quit Pandahpur immediately.

They were even driving the people away forcibly. This devotee from Kavate Bahadur got the Cholera infection, and was having vomitings and loose motions. All his strength was lost and, consequently, he had become very weak. Nobody came to nurse him or give him any medication, nor did anyone inform the doctors out of the fear of the police.

All went away, leaving him the grip of death. People are your friends only in your prosperity, but in adversity they desert you. In such a situation, only God and saints come to your help.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


28 Oct 2020


No comments:

Post a Comment