శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 18 / Sri Devi Mahatyam - Durga Saptasati - 18



🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 18 / Sri Devi Mahatyam - Durga Saptasati - 18 🌹

✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ


అధ్యాయము 5

🌻. దేవీ దూతసంవాదం - 3
🌻

53–55. సర్వభూతాలలో కాంతి (అందం) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.

56–58. సర్వభూతాలలో లక్ష్మీ (భాగ్యం) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.

59–61. సర్వభూతాలలో వృత్తి (కార్యపరత) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.

62–64. సర్వభూతాలలో స్మృతి (జ్ఞప్తి) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.

65-67. సర్వభూతాలలో దయాస్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.

68–70. సర్వభూతాలలో తుష్టి (తృప్తి) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.

71–73. సర్వభూతాలలో మాతృ (తల్లి) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.

74-76. సర్వభూతాలలో భ్రాంతి (పొరపాటు) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.

77. సర్వభూతాల ఇంద్రియాలను లోబరుచుకుని, సర్వభూతాలపై ఎల్లప్పుడూ ఏలుబడి కలది, సర్వవ్యాపకురాలు అయిన దేవికి నమస్కారాలు.

78–80. ఈ అఖిలజగత్తులో వ్యాపించి చిత్ (జ్ఞాన) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.

81. పూర్వకాలంలో దేవతలతో తమ అభీష్టసిద్ధికై సుపించబడినది, సురపతి చేత ప్రతిదినం సేవింపబడేది, సర్వశుభాలకు మూలమైనది, అయిన ఈశ్వరి (పార్వతీదేవి) మాకు సర్వశుభాలను ఇచ్చి మా ఆపదలను అంతమొందించు గాక !

82. ఇప్పుడు మళ్ళీ గర్వోన్మత్త దైత్యులచే పీడించబడుతోన్న దేవతలమైన మా చేత భక్తి వినమ్రశరీరాలతో, నమస్కార పూర్వకంగా, స్మరించ బడుతోన్న ఆ దేవి మా ఆపదలనంన్నిటినీ తత్ క్షణమే అంతమొందించుగాక.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 18 🌹

✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj


CHAPTER 5:
🌻 Devi's conversation with the messenger - 3
🌻

53-55. 'Salutations again and again to the Devi who abides in all beings in the form of loveliness;

56-58. 'Salutations again and again to the Devi who abides in all beings in the form of good fortune;

59-61. 'Salutations again and again to the Devi who abides in all beings in the form of activity;

62-64. 'Salutations again and again to the Devi who abides in all beings in the form of memory;

65-67. 'Salutations again and again to the Devi who abides in all beings in the form of compassion;

68-70. 'Salutations again and again to the Devi who abides in all beings in the form of contentment;

71-73. 'Salutations again and again to the Devi who abides in all beings in the form of mother;

74-76. 'Salutations again and again to the Devi who abides in all beings in the form of error;

77. 'Salutations again and again to the all-pervading Devi who constantly presides over the senses of all beings and (governs) all the elements;

78-80. 'Salutations again and again to her who, pervading the entire world, abides in the form of consciousness.

81. 'Invoked of yore by the devas for the sake of their desired object, and adored by the lord of the devas every day, may she, the Isvari, the source of all good, accomplish for us all auspicious things and put an end to our calamities!

82. 'And who is now again, reverenced by us, devas, tormented by arrogant asuras and who, called to mind by us obeisant with devotion, destroys this very moment all our calamities.'

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


28 Oct 2020

No comments:

Post a Comment