🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 85 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని 7వ పాత్ర - సాధు పురుషులు, మహాపురుషులు, సత్పురుషులు, ముముక్షువులు - 07 🌻
363. ఆత్మ యొక్క చైతన్యము, సూక్ష్మసంస్కారములందు చిక్కుపడి సూక్ష్మశరీరముద్వారా సూక్ష్మసంస్కారానుభవమును పొందుచున్నది.
364. సక్రియాత్మక ఐక్యము:-
ఆధ్యాత్మిక మార్గములో ప్రవేశించిన బ్రహ్మసక్తులైన సాధకులకు సంబంధించినది సక్రియాత్మకఐక్యము ఇచ్చట భగవంతునితో గల ఐక్యమును దివ్యులైన దేవతల ద్వారా వ్యక్తమగుచుండును. ఇచ్చట అంతరంగమున కలుగు ఆధ్యాత్మికవిశ్వాసము మంచి చెడులన్నింటికి వెనుక నున్నది. ఇదే భగవంతుని సంచలితశక్తి.
365. ఆధ్యాత్మిక మార్గములో సూక్ష్మభూమికలో ప్రయాణించు సాధకుడు, అక్కడక్కడ యుండు ఆకర్షణలకు దృశ్యములకు సమ్మోహితుడై పరవశుడై తన పారవశ్యతయే గమ్యస్థానమని భావించును.అట్టి స్థితిలోనున్నవారిని, సద్గురువులు గాని, ఉన్నత భూమికలలో నున్నవారుగాని వచ్చి, పై స్థాయికి చేయూత నిచ్చుటలో సహాయ పడెదరు.
366. ఆధాత్మిక జ్ఞానము:---(తరీకత్)
అంతర క్రమశిక్షితులైన సంఘవర్జితులకు సంబంధించిన జ్ఞానము. ఈ జ్ఞానములో ఇంకను అహమున్నది. మంచి-చెడుగుల యొక్క చైతన్యము ఆత్మతో లగ్నమై యుండును. వేదాంతుల జ్ఞానమును, చింతకుల జ్ఞానమును ధర్మశాస్త్రజ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానముల సరిహద్దులో నుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
28 Oct 2020
No comments:
Post a Comment