🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 33 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 58, 59 / Sri Lalitha Chaitanya Vijnanam - 58 , 59 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
22. సుమేరు మధ్య శ్రుంగస్థ శ్రిమన్నగర నాయిక
చింతామణి గృహాన్తస్త పంచబ్రహ్మాసనస్తిత
🌻 58. 'పంచబ్రహ్మాసనస్థితా' 🌻
పంచ బ్రహ్మములే ఆసనముగా గలది. వారిని అధిష్ఠించి ఉన్నది అని అర్థము. సదాశివుడు, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ వీరిని పంచబ్రహ్మ లందురు. సదాశివుడనగ సృష్టి సమస్తమునందు వసించియున్న తత్త్వము. ఈశ్వరుడనగ ఒక్కొక్క జీవిని అధిష్ఠించియున్న తత్త్వము. త్రిగుణములను అధిష్ఠించినవారే త్రిమూర్తులు. వీరందరిని అధిష్ఠించి యుండునదే శ్రీదేవి తత్త్వము.
ఈ ఐదుగురును శ్రీచక్రమున కోణపంచకముగ గోచరింతురు. ఈ ఐదుగురు బ్రహ్మలును సృష్టి నధిష్ఠించి యుండువారు. పంచ కర్మేంద్రియములకు, పంచ జ్ఞానేంద్రియములకు, పంచ తన్మాత్రలకు, పంచభూతములకు వీరు అధిదేవతలు. వీరి నధిష్ఠించి యున్నది. శ్రీదేవి యగుటచే, ఆమెను పంచబ్రహ్మాసనస్థితా' అని స్తోత్రము చేయుదురు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 58 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 58. Pañca- brahmāsana- sthitā पञ्च-ब्रह्मासन-स्थिता (58)
She is seated on a throne made up of five Brahmans. The five Brahmans are Brahma, Viṣṇu, Rudra, Īśāna and Sadāśiva (Some used to say Brahma, Viṣṇu, Śiva, Mahādeva and Sadāśiva). Śiva, Mahādeva, Sadāśiva, Kāmeśvara are the different forms of Śiva.
Each form represents different acts. Saundarya Laharī (verse 92) says that “Brahma, Viṣṇu, Rudra, Īśvara form the support of Your throne and Sadāśiva is the seat of Your throne”. This nāma affirms Her highest authority of the universe. But, Surely Vāc Devi-s could not have meant to name Brahma, Viṣṇu etc as support of Her throne and Sadāśiva as Her seat.
There is another interpretation for this Pañca-Brahman. This could possibly mean the basic elements. We have five cakra-s in our body (mūlādhāra to viśuddhi) and each of these cakra-s represent one element.
Mūlādhāra – earth element, svādhiṣṭhāna – water element, maṇipūraka – fire element (some are of the opinion that svādhiṣṭhāna is fire element and maṇipūraka is water), anāhata – air element and viśuddhi – ākāś or ether element.
Lalitai is sitting on these five elements, each element forming four legs of Her throne and one forming the seat. This seems to be appropriate as She is the creator and creation is made out of the five basic elements only.
After crossing these cakra-s, one has to proceed to ājñā cakra where mind is controlled and then proceed to the crown cakra where the union of Śiva and Śaktī takes place. This explanation suits the interpretations of certain other nāma-s in this Sahasranāma. Nāma-s 249 and 947 also speak about this concept.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 59 / Sri Lalitha Chaitanya Vijnanam - 59 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
23. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని
సుదాసాగర మధ్యస్థ కామాక్షీ కామదాయినీ
🌻 59. 'మహాపద్మాటవీ సంస్థా' 🌻
అనేకానేక మహత్తరమైన పద్మములు గల అడవిలో నుండునది
అని అర్థము.
శరీరమే మహా పద్మముల అడవి. అందలి షట్చక్రములు మహత్తరమైన పద్మములు. అవిగాక అనేక సహస్ర సంఖ్యాకములగు నాడులు కూడ మహా పద్మములే. షట్చక్ర పద్మములను, నాడీ పద్మములను అధిష్ఠించి సహస్రార పద్మమున్నది.
మొత్తము పద్మముల అడవికి సహస్రదళ పద్మమే అధిష్టాన పద్మము. దానికి పైన వేయి దళములు గల కులపద్మము అధోముఖమై విలసిల్లి యున్నది. దానిపై దేవి యుండును. కులపద్మము బ్రహ్మాండ పద్మము. సహస్రార పద్మము పిండాండ పద్మము. పిండాండమును, బ్రహ్మాండమును అధిష్టించియున్న ప్రజ్ఞ శ్రీదేవి.
ఈ రెండు అండముల యందు అసంఖ్యాకములగు పద్మములు కలవు. పద్మములనగ ప్రజ్ఞా కేంద్రములని తెలియవలెను. అసంఖ్యాకమగు పద్మములతో కూడిన పిండాండ బ్రహ్మాండములే మహా పద్మాటవి. దాని నధిష్ఠించి అమ్మ యున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 59 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 59. Mahāpadmāṭavī- saṃsthā महापद्माटवी-संस्था (59) 🌻
She dwells in a great forest full of lotus flowers. Lotus flower grows only in water.
Nature’s bounty has been mentioned here. Big mountains with high peaks were referred earlier. Now indirectly the water bodies are mentioned. Mahāpadma also refers to a type of elephant.
This nāma talks about the crown cakra or sahasrāra, situated above the six cakra-s of our body.
A minute aperture in the centre of sahasrāra is called brahmarandhra or padmāṭavī. The divine energy enters human body through this aperture only. Human contact with higher planes is established through this aperture.
This aperture is connected to all the six cakra-s. Lalitai conjoins Her consort Śiva in sahasrāra. This nāma talks about Her domicile in the middle of a thousand petal lotus or sahasrāra.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
28 Oct 2020
No comments:
Post a Comment