భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 176


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 176 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 14 🌻


అవతార పురుషుడు లేని కాలము

670. అవతారయుగము కానికాలమందు ఈ పంచ సద్గురువులు లోక వ్యవహారములు (విశ్వపరిస్థితులను) సమిష్టిగా చూచుచుందురు. వారిలో ఒకరు మాత్రము సమస్త పరిస్థితులను అదుపునందుంచుట యందును, పాలించుట యందును బాధ్యుడై యుండును. వీనిని కుతుబ్-ఏ - ఇర్షాద్ అందురు.

671. దివ్యశాసనము ప్రకారము ఎల్లకాలమందును ఆ యుగాంత్యమందు భగవంతుడు మానవరూపములో పురుషునిగా ఈ భూమిపై అవతరించుటకు ఐదుగురు సద్గురువులు కారణ భూతులగుదురు.

అవతారము :-

672. పరమాత్మా (B) స్థితిలోనున్న అనంతచైతన్యమే, సరాసరి మాయాసృస్టిలో, మానవరూపములో అభివ్యక్తమగును. ఇతడే సర్వోన్నతుడైన పురాణ పురుషుడు, అవతారపురుషుడు (సర్వాతశాయి), స్వాతంత్య్రసత్యము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


19 Feb 2021

No comments:

Post a Comment