సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము
మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ |
మహామాయా, మహాసత్త్వా, మహాశక్తి ర్మహారతిః ‖ 54 ‖
🌻 214. 'మహాపాతకనాశినీ'🌻
మహా పాతకములను కూడ నాశనము చేయునది శ్రీమాత అని అర్థము.
పాపములు తెలియక చేయుట యుండును. తెలిసి చేయుట కూడ నుండును. తెలియక చేయుట అజ్ఞానము వలన. తెలిసి చేయుట బలహీనత వలన. అట్టి భక్తులను రక్షించుటయే తన పనిగ పెట్టు కొన్నది శ్రీదేవి.
సమస్త పాపములకు ప్రాయశ్చిత్తము పరాశక్తి పాద ధ్యానమే యని బ్రహ్మాండ పురాణము బోధించుచున్నది. భక్తితో ఆరాధించు బలహీనులను, అజ్ఞానులను శ్రీమాతయే ఉద్ధరించు కొనును. సామ దాన భేద దండోపాయములతో అసురులను సైతము
ఉద్ధరించునది శ్రీమాత. ఆమె స్మరణము సర్వపాప హరణము.
లలితా స్వరూపుడైన శ్రీకృష్ణ దేవుడు కూడ భగవద్గీతయందిట్లు పలికినాడు. “ఎంత దురాచరుడైనప్పటికి నా భక్తుడు నశింపడు.” కలియుగ వాసులకు ఈ వాక్యమే పట్టుకొమ్మ. కొండంత పాపమును నశింపజేయు దైవమే జీవులకు ఆధారము. దైవము యొక్క కరుణయే
దీనికి కారణము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 214 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻Mahāpātaka-naśinī महापातक-नशिनी (214) 🌻
She destroys great sins. There are certain rules for expiations of sins. Sins are committed knowingly and unknowingly. There is no remedy for committing a sin knowingly. The worst sin is brahmahatyā, which means murdering the one who is an exponent of Veda-s. It is said that there is no remedy for this sin.
For such sins, karmic account swells and accordingly one has to undergo sufferings either in this birth itself or in subsequent births. (A study of birth chart will reveal whether a person has such karmic afflictions, based on 5th and 9th houses. Though various remedies are prescribed to eradicate such afflictions, the best remedy is to feed the deserving poor and starving animals.
For brahmahatyā doṣa, it is said that there is no remedy at all.) One has to surely undergo sufferings for such sins either committed in this birth or in previous births and such sufferings cannot be mitigated by performing remedies. This nāma says that She can absolve even the worst sins of Her devotees.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
19 Feb 2021
No comments:
Post a Comment