11) 🌹. శివ మహా పురాణము - 352🌹
12) 🌹 Light On The Path - 105🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 237🌹
14) 🌹 Seeds Of Consciousness - 301🌹
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 176 🌹
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 32 / Lalitha Sahasra Namavali - 32🌹
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 32 / Sri Vishnu Sahasranama - 32 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -154 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 5
*🍀 5 - 2. ఆత్మోద్ధరణ - దేవుడు, జీవుడు, బుద్ధి, చిత్తము ఈ నాలుగు ప్రజ్ఞలుగ నున్నవాడు మానవుడు. సామన్య మానవుని చిత్తము బాహ్య ప్రపంచముతో ముడిపడి యుండును. బాహ్యమును దర్శించుటకు, అనుభూతి చెందుటకు పాంచభౌతిక శరీరమున్నది. స్వభావము బాహ్య ప్రపంచమందలి అనుభవముల ఆధారముగ గట్టిపడు చుండును. ఇష్టము, అయిష్టము, అభిప్రాయములు ఏర్పడి అవి సత్య మనిపించు చుండును. తాను, తన స్వభావము కాదని తెలియుటకు వలసిన బుద్ధి కూడ తన యందే యున్నది. బుద్ధిని వినియోగించినచో స్వభావము నుండి తాను విడిపడ వచ్చును. విచక్షణ బుద్ధి లక్షణమే. ఇట్లు అంతయు వ్యాపించిన ఒకే తత్త్వము గుణముల ద్వారా ప్రత్యేకమై, బుద్ధిని, స్వభావమును కలిగి యుండును. ఇట్లు ప్రజ్ఞ నాలుగు స్థితులలో మానవుని యందున్నది. అవి వరుసగా తనయందలి దైవము, తాను, తన బుద్ధి, తన స్వభావము. ఈ నాలుగు స్థితులలో నున్న ప్రజ్ఞనే వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అని కూడ తెలుపుదురు. 🍀*
ఉద్ద రేదాత్మనం 2 త్మానాం నాత్మాన మవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవ రిపు రాత్మనః || 5
ఈ స్వభావము బాహ్య ప్రపంచమందలి అనుభవముల ఆధారముగ గట్టిపడు చుండును. ఇష్టము, అయిష్టము, అభిప్రాయములు ఏర్పడి అవి సత్య మనిపించు చుండును. తానేర్పరచుకున్న స్వభావములు కొన్ని సన్నివేశముల కారణముగ మారుచుండును. కొన్ని నమ్మకములు, కొన్ని సిద్ధాంతములు, కొంత మంచి చెడు అవగాహన కొంత అనుభవము అంతయును కలిపి తనదైన తెలివి యొకటి స్వభావము రూపమున ఏర్పడుచుండును.
తాను, తన స్వభావము కాదని తెలియుటకు వలసిన బుద్ధి కూడ తనయందే యున్నది. బుద్ధిని వినియోగించినచో స్వభావము నుండి తాను విడిపడ వచ్చును. విచక్షణ బుద్ధి లక్షణమే. ఇట్లు అంతయు వ్యాపించిన ఒకే తత్త్వము గుణముల ద్వారా ప్రత్యేకమై, బుద్ధిని, స్వభావమును కలిగి యుండును. ఇట్లు ప్రజ్ఞ నాలుగు స్థితులలో మానవుని యందున్నది. అవి వరుసగా తనయందలి దైవము, తాను, తన బుద్ధి, తన స్వభావము. ఈ నాలుగు స్థితులలో నున్న ప్రజ్ఞనే వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అని కూడ తెలుపుదురు.
ఈ నాలుగు స్థితులు చెందిన ప్రజ్ఞలో స్వభావమునందు యిమిడియున్న ప్రజ్ఞ బంధముల నేర్పరచుకొనును. పై తెలిపిన నాలుగు ప్రజ్ఞలు ఒకే ప్రజ్ఞ యొక్క స్థితి భేదములని తెలియవలెను. ఈ నాలుగు ప్రజ్ఞలనే రామాయణమున రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అని కూడ వివరింతురు.
ఈ నాలుగు ప్రజ్ఞలనే సనక సనందనాది నలుగురు కుమారులుగ తెలుపుదురు. ఈ నాలుగు ప్రజ్ఞల ప్రభావమే నాలుగు యుగములలో పనిచేయు చుండును. వీనిని బట్టి జ్ఞానము నాలుగు రకములని, వర్ణాశ్రమములు నాలుగు రకములని, వేదములు నాలుగని కూడ తెలియజేయు చుందురు. ఈ నాలుగే సృష్టికి పునాది.
ఈ నాలుగును నాలుగు భుజములుగ కూడ కీర్తించినారు. నాలుగు భుజములుగల దేవత లందరును, ప్రజ్ఞయొక్క నాలుగు స్థితులు తెలిసినవారని అర్థము. మన దేవత లందరికిని నాలుగు భుజములు చిత్రీకరింతురు. మానవులకు రెండు భుజములే యున్నవి. అనగా అహంకారము, చిత్త ప్రవృత్తి మాత్రమే వారికి తెలియును. మానవులు మహాత్ములైనపుడు వారును చతుర్భుజులే. మానవుడు మహాత్ముడగుటకే యోగవిద్య. యోగవిద్యా వాజ్మయమునకు శ్రీ మద్భగవద్గీతయే మకుటము.
దేవుడు, జీవుడు, బుద్ధి, చిత్తము ఈ నాలుగు ప్రజ్ఞలుగ నున్నవాడు మానవుడు. సామన్య మానవుని చిత్తము బాహ్య ప్రపంచముతో ముడిపడి యుండును. బాహ్యమును దర్శించుటకు, అనుభూతి చెందుటకు పాంచభౌతిక శరీరమున్నది. అందు పంచ భూతములు (పృథివి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము), పంచ కర్మేంద్రియములు (చేతులు, కాళ్ళు, వాక్కు, గుదము, జననేంద్రియము), పంచ జ్ఞానేంద్రియములు (చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు), పంచతన్మాత్రలు (వినుట, స్పర్శ తెలియుట, చూచుట, రుచి తెలియుట, వాసన తెలియుట), పంచ ప్రాణములు (ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, సమానము).
ప్రజ్ఞ పరముగ మానవుడు నాలుగు స్థితులుగ ఉన్నాడు. అతని దేహము ఐదు స్థితులలో నున్నది. దేహమునకు, జీవునకు సంబంధము, ప్రజ్ఞ నాలుగవ స్థితిలో నేర్పడును (చిత్తము). చిత్తము నాలుగవది. అదియే ప్రవృత్తిలోనికి అనగా బాహ్య ప్రపంచము లోనికి జీవుడు ప్రవేశించుటకు వీలు కలిగించును. అంతరంగమున నున్న దైవప్రజ్ఞ జీవప్రజ్ఞ, బుద్ధి, చిత్తముల ద్వారా వ్యక్తమగు చుండును. ఈ నాలుగింటిని అంతఃకరణము లందురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 353 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
91. అధ్యాయము - 03
*🌻. దేవీస్తుతి - 1 🌻*
నారదడిట్లు పలికెను-
ఓ బ్రహ్మా ! నీవు ప్రాజ్ఞుడువు, మహాధీమంతుడవు. వక్తలలో శ్రేష్ఠుడవు. విష్ణువు సద్గురువుగా గలవాడవు. తరువాత జరిగిన వృత్తాంతమును నాకు చెప్పుము(1) శుభకరము, అద్భుతము అగు ఈ మేనకా పూర్వచరిత్రను చెప్పి యుంటిని ఆమె వివామమును గురించి కూడ వింటిని. తరువాత చరితమును చెప్పుము(2) ఆ హిమవంతుడు మేనను వివాహమాడిన పిదప ఏమి చేసెను? ఆమె యందు జగన్మాత యగు పార్వతి జన్మించి వృత్తాంతమెట్టిది?(3) తరువాత ఆమె దుష్కరమగు తపస్సును చేసి శివుని పొందిన తీరు ఎట్టిది? శివుని యశస్సును వర్ణించే ఈ వృత్తాంము నంతనూ విస్తరముగా చెప్పుము(4)
బ్రహ్మ ఇట్లు పలికెను
ఓ మహర్షీ! శంకరుని శుభకరమగు పుణ్యకీర్తిని మిక్కిలి ప్రీతితో వినుము. ఈ కీర్తిని విన్నచో బ్రహ్మ హత్య చేసివాడైననూ పవిత్రుడై సమస్త కామనలను పొందును(5) ఓ నారదా! మేన హిమవంతుని వివాహమాడి ఆయన గృహమునకు వెళ్ళినప్పుడు ముల్లోకములలో గొప్ప ఉత్సవము జరిగెను(6). హిమవంతుడు కూడ మిక్కిలి ఆనందించి గొప్పవేడుకలను జరిపించి, బ్రాహ్మణులను బంధువులను మరియు ఇతరులను మంచి మనస్సుతో పూజించెను(7) బ్రాహ్మణులు, బంధువులు మరియు ఇతరులు అందదరు సంతసించి మహదాశీర్వచనములను ఆ హిమవంతునకు ఇచ్చి తమ తమ స్థానములకు మరలి వెళ్ళిరి(8)
హిమవంతుడు కూడ మిక్కిలి ఆనందించినవాడై మేనతో గూడి సకల సుఖములు గల గృహమునందు మాత్రమే గాక, నందనవనము ఇత్యాది సుందర ప్రదేశముల యందు గూడ రమించెను(9) ఆ సమయములో విష్ణువు మొదలగు గల సర్వదేవతలు, మరియు మహాత్ములగు మునులు హిమవంతుని వద్దకు వెళ్ళిరి(10). వచ్చినవారి నందరిని చూచి మహాత్ముడగుహిమవంతుడు తన భాగ్యమును కొనియాడి ఆనందముతో వారకి ప్రణమిల్లి భక్తితో వారిని సన్మానించెను(11). అతడు భక్తితో దోసిలి యొగ్గి శిరసు వంచి స్తుతించెను ఆ పర్వతునకు ఆనందముచే గొప్ప గగుర్పాటు కలుగటయే గాక, ఆనందబాష్పములు రాలెను(12) అపుడు ప్రసన్నమగు మనస్సు గల హిమవంతుడు గొప్ప ఆనందముతో ప్రణమిల్లెను. ఓ మహర్షీ! అతడు అపుడు ప్రణమిల్లిన పిదప, విష్ణువు మొదలుగా గల దేవతలనుద్దేశించి ఇట్లు పలికెను(13)
హిమవంతుడిట్లు పలికెను-
ఈనాడు నా పుట్టుక సఫలమైనది నేను చేసిన గొప్ప తపస్సు ఫలించినది. ఈనాడు నా జ్ఞానము సార్థకమైనది. ఈనాడు నేను చేసిన పుణ్యకర్మలు ఫలమునిచ్చినవి(14) నేనీనాడు ధన్యుడనైతిని. నా భూభాగమంతయూ ధన్యమైనది మరియు కులము, భార్య మరియు సర్వము ధన్యమైనదనుటలో సందియుము లేదు(15) కారణమేమనగా, మీ సేవకునిగా తలంచి ప్రీతితో ఉచితమగు తీరున నన్ను కార్యమునందు నియోగించుడు(16)
బ్రహ్మ ఇట్లు పలికెను-
హిమవంతుని ఈ మాటను విని విష్ణువు మొదలగు ఆ దేవతలు అపుడు తమ కార్యము సిద్దించినదని తలంచి సంతసించినవారై, ఇట్లు పలికిరి(17)
దేవతలిట్లు పలికిరి-
ఓయీ హిమవంతా| మహాప్రాజ్ఞా| మేము చెప్పే హితకరమగు వచనమును వినుము మేమందరము ఏ పని కొరకు వచ్చితిమో, దానిని ప్రీతితో చెప్పెదము(18) ఓ పర్వతరాజా| జగన్మాతయగు ఉమ పూర్వము దక్షుని కుమార్తె యై జన్మించి, రుద్రనకు భార్యయై చిరకాలము భూమండలమునందు క్రీడించెను(19) ఆ సతీదేవి తండ్రిచే అవమానింపబడి తన ప్రతిజ్ఞను గుర్తునకు తెచ్చుకొనెను. అపుడా జగన్మాత ఆ దేహమును త్యజించి తన ధామమునకు వెళ్ళెను(20) ఓ హిమగిరీ! ఆ కథ లోకములో ప్రసిద్ధి గాంచినది. నీకు కూడా ఆ గాథ తెలియును. ఇట్లు అయినచో, దేవతలకందరికి గొప్ప లాభము ఒనగూరును(21) మరియు నీకు కూడ గొప్ప ప్రయోజనము చేకూరును దేవతలందరు నీకు వశవర్తులై ఉండగలరు(22)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 105 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 7 - THE 18, 19 RULE
*🌻 18. Seek the way by retreating within. 19. Seek the way by advancing boldly without. - 1 🌻*
404. C.W.L. – To seek the way by retreating within means in the beginning to seek out and follow the guidance of the Higher Self. As has been explained before, the first stage on the wa3’ is the unification of the personality with the ego.
Later the ego becomes a perfect expression of the Monad, and the man is then ready for the Asekha Initiation. Beyond that the Adept is striving to raise the consciousness of his Monad into the consciousness of the Logos. It is always himself at higher and higher levels that he seeks.
405. Whenever a man at any stage tries to pour devotion up into a higher level, such a flood of the divine power descends upon him that it quite overwhelms his effort, and the effect is not so much that he has reached up, as that power has been poured down on him.
The same thing happens between the pupil and the Master. The pupil sends out his love towards the Master, but it is surpassed by the response of the Master’s love, so that to him it seems that he has received a vast flood of love, though in the first place it was his action that made the downpouring possible.
406. Such, at a higher level, is the pouring down upon the Adept of the Holy Ghost, the power of the Third Aspect of the Logos, symbolized in the “cloven tongues, like as of fire” of Pentecost.
Thus in due course the Adept becomes one with the Third Aspect of the Logos manifesting on the nirvanic plane. His next step is to become one with that Aspect which is represented by the Christ in the bosom of the Father. Later on, though I know nothing about it, I am quite sure that he will draw ever nearer and nearer to the Deity of our Solar system. We shall ever approach the Light, but we shall never touch the Flame.
Not that we shall not rise one day to the height where He stands, but He does not stand still to receive us. He also is evolving, and therefore we shall not touch the Flame, though we shall ever draw nearer and nearer to it. The wonderful bliss of that experience cannot be described down here, because it is all of a nature which has no counterpart in the lower world.
407. In every man there is much to be found by seeking within. The personality, which most people think of as themselves, is only a very small fraction of the man. We are much larger people than we show ourselves to be. The ego can only put down one small part or facet of himself in a particular incarnation and even if that part is manifesting perfectly it is only a small part.
A great man is a fine and beautiful thing to see, even down here, but we may be sure that the whole is very much greater than the part which we can see. No one personality could express all the multiplicity of possibilities which lie within the ego, which has within it the essence of the experience of all the lives it has led.
The highest and very best of us down here might be taken as a fair average sample of the qualities we should discover in the ego if we were able to see it.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 237 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. యాజ్ఞవల్క్యమహర్షి - 1 🌻*
1. ఒకచోట పురాణం మనకు ఏమి చెప్పిందంటే, మనమంతా బ్రహ్మదేవుడి సంతానం కాదు, బ్రహ్మలమే అని చెపుతున్నది. బ్రహ్మ అపరిమితమైన కర్మ అనేక పూర్వకల్పములలో చేసివున్నాడు. అన్ని జీవులూ అతడే కబట్టి, కర్మలోకాలను సృష్టించినవాడు అతడే కబట్టి, ఇన్ని కోట్ల జీవరాశులలో అతడే పుడుతున్నాడని అర్థం.
2. యాజ్ఞవల్క్యుడుని తన తండ్రి వైశంపాయనుడి దగ్గరికి తీసుకెళ్ళి అప్పగించాడు. వైశంపాయనుడు ఆ పిల్లవాణ్ణి, అతడి లక్షణాలను చూచి తన శిష్యుల్లో అత్యుత్తముడు అతడే కాబోతున్నాడు అని గ్రహించి అతడి శిష్యరికాన్ని అంగీకరించాడు.
3. అప్పటి నుంచీ వైశంపాయనుడు దగ్గర యజుర్వేదమును సహాధ్యాయులైన మునిపుత్రులల్తో కలిసి నేర్చుకున్నాడు. యాజ్ఞవల్క్యుడు సత్వగుణ సంపన్నుడయ్యాడు. అతడిలో సాత్వికాహంకారము ఒకటి వచ్చిది.
4. సాత్వికగర్వము తను పరమ సాత్వికుడనని, ప్రథమజ్ఞానినని, తనకు ఆగ్రహమేలేదని ఇలాంటివి అనుకునేవాడు. అదో గర్వం. తరువాత వైశంపాయనుడి ఆగ్రహనికిగురై నేర్చుకున్నవిద్యలన్నీ విసర్జించి వెళ్ళిపోమన్నాడు. యాజ్ఞవల్క్యుడు నేర్చుకున్న విద్యనంతా శరీరంలోని రక్తం రూపంలో విసర్జించాడు.
5. ఆయన వమనం చేసిన రక్తం రూపంలో ఉన్న వేద విద్యనంతా తిత్తిరి పక్షులు తిన్నాయి. అది మళ్ళీ వాటిచేత చెప్పబడటం చేత దానిని ‘తైత్తిరీయం’ అని అన్నారు. ఆ పక్షులు వాటిని మళ్ళీ విసర్జించాయి పక్షి పలుకుల రూపంలో! అదే ‘తైత్తిరీయ ఉపనిషత్తుగా’గా ప్రసిద్ధిచెందింది.
6. అలా తైత్తిరీయోపనిషత్తు ఏర్పడింది, తైత్తిరీయశాఖ ఏర్పడింది. తాత్తిరీయ బ్రాహ్మణకూడా అలాగే వచ్చింది. తరువాత యాజ్ఞవల్క్యుడు తపస్సుచేసి సూర్యుణ్ణి ఆరాధించాడు. ఆయన అనుగ్రంతో శుక్లయజుర్వేదాన్ని పొందాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 301 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 150. Once you become the 'I am' it will reveal all the knowledge and you need not go to anybody for guidance.🌻*
The whole approach of the Guru towards anybody who comes to him is: firstly, to make him understand what the 'I am' is and secondly, to tell him to abide in the 'I am' till he becomes the 'I am'. That is all that he does.
The Guru's job is done, the rest is up to the seeker, his success totally depending on how correctly he has understood the 'I am' and whether he is doing any 'Sadhana' (practice) or not. The Guru will, of course, leave no stone unturned in imparting the teaching, provided he finds an honest and sincere seeker before him.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 176 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 14 🌻*
అవతార పురుషుడు లేని కాలము
670. అవతారయుగము కానికాలమందు ఈ పంచ సద్గురువులు లోక వ్యవహారములు (విశ్వపరిస్థితులను) సమిష్టిగా చూచుచుందురు. వారిలో ఒకరు మాత్రము సమస్త పరిస్థితులను అదుపునందుంచుట యందును, పాలించుట యందును బాధ్యుడై యుండును. వీనిని కుతుబ్-ఏ - ఇర్షాద్ అందురు.
671. దివ్యశాసనము ప్రకారము ఎల్లకాలమందును ఆ యుగాంత్యమందు భగవంతుడు మానవరూపములో పురుషునిగా ఈ భూమిపై అవతరించుటకు ఐదుగురు సద్గురువులు కారణ భూతులగుదురు.
అవతారము :-
672. పరమాత్మా (B) స్థితిలోనున్న అనంతచైతన్యమే, సరాసరి మాయాసృస్టిలో, మానవరూపములో అభివ్యక్తమగును. ఇతడే సర్వోన్నతుడైన పురాణ పురుషుడు, అవతారపురుషుడు (సర్వాతశాయి), స్వాతంత్య్రసత్యము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 32 / Sri Lalita Sahasranamavali - Meaning -32 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 32. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః |*
*మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా ‖ 32 ‖ 🍀*
80. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః -
చేతివ్రేళ్ళ గోళ్ళ నుండి పుట్టిన విష్ణుమూర్తి యొక్క దశావతారములు గలది.
81. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా -
మహాపాశుపతము అను అస్త్రము యొక్క అగ్నిచేత - నిశ్శేషంగా దహింపబడిన రాక్షస సైన్యము గలది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 32 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 32. karāṅguli-nakhotpanna-nārāyaṇa-daśākṛtiḥ |*
*mahā-pāśupatāstrāgni-nirdagdhāsura-sainikā || 32 || 🌻*
80 ) Karanguli nakhothpanna narayana dasakrithi -
She who created the ten avatharas of Narayana from the tip of her nails (when Bandasura send the Sarvasura asthra (arrow), she destroyed it by creating the ten avatharas of Vishnu)
81 ) Maha pasupathasthragni nirdagdhasura sainika -
She who destroyed the army of asuras by the Maha pasupatha arrow.
Continues.....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 32 / Sri Vishnu Sahasra Namavali - 32 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*
*కర్కాటక రాశి - పుష్యమి నక్షత్ర 4 పాద శ్లోకం*
*🌷 32. భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః |*
*కామహా కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః ‖ 32 ‖ 🌷*
🍀 290. భూతభవ్య భవన్నాథః -
గడచిన, జరుగుతున్న, రాబోవు కాలములకు అధిపతి.
🍀 291. పవనః -
వాయువు, ప్రాణము, సర్వవ్యాపకుడు.
🍀 292. పావనః -
పవిత్రమైనవాడు, అన్నింటినీ పావనము చేయువాడు.
🍀 293. అనలః -
అగ్ని, పాపములను దహించువాడు.
🍀 294. కామహా -
కామములను (తగని కోరికలను) దహింపచేయువాడు.
🍀 295. కామకృత్ -
అభీష్టములను నెరవేర్చువాడు, తగిన కోరికలను ప్రసాదించువాడు.
🍀 296. కాంతః -
మనస్సును దోచువాడు, మనోహర రూపుడు, సమ్మోహ పరచువాడు.
🍀 297. కామః -
ప్రేమ స్వరూపుడు, కోరదగినవాడు, మన్మధుడు.
🍀 298. కామప్రదః -
కోరికలు తీర్చువాడు, వరములు ప్రసాదించువాడు.
🍀 299. ప్రభుః -
అందరికంటె అధికుడు, అందరిని పాలించువాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 32 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*
*Sloka for Karkataka Rasi, Pushyami 4th Padam*
*🌷 32. bhūta bhavya bhavan nāthaḥ pavanaḥ pāvanōnalaḥ |*
*kāmahā kāmakṛt kāmtaḥ kānaḥ kāmapradaḥ prabhuḥ || 32 || 🌷*
🌻 290. Bhūta-bhavya-bhavan-nāthaḥ:
One who is the master for all the beings of the past, future and present.
🌻 291. Pavanaḥ:
One who is the purifier.
🌻 292. Pāvanaḥ:
One who causes movement.
🌻 293. Analaḥ:
The Jivatma is called Anala because it recognizes Ana or Prana as Himself.
🌻 294. Kāmahā:
One who destroys the desire-nature in seekers after liberation.
🌻 295. Kāmakṛt:
One who fulfils the wants of pure minded devotees.
🌻 296. Kantaḥ: One who is extremely beautiful.
🌻 297. Kāmaḥ:
One who is sought after by those who desire to attain the four supreme values of life.
🌻 298. Kāmapradaḥ:
One who liberally fulfils the desires of devotees.
🌻 299. Prabhuḥ:
One who surpasses all.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment