వివేక చూడామణి - 27 / Viveka Chudamani - 27


🌹. వివేక చూడామణి - 27 / Viveka Chudamani - 27 🌹

✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ


🍀. అంతఃకరణాలు - 4 🍀


104. అహం అనునది శరీరమే తాను అను భావముతో, తానే అన్ని చేస్తూ అనుభవిస్తున్నానని, సత్వ, రజో, తమో గుణాలకు అనుగుణంగా వ్యవహారము నడుపుచున్నది.

105. జ్ఞానేంద్రియాలకు అనుకూలముగా పనులు జరిగినప్పుడు సంతోషమును, వ్యతిరేకముగా ఉన్న దుఃఖాలను అహం అనుభవిస్తూ ఉంటుంది. ఈ దూషణ, భూషణాలు అనునవి అహం యొక్క లక్షణాలు. సదా ఆనందములో ఉండే ఆత్మకు సంబంధము లేదు.

106. జ్ఞానేంద్రియాలు కేవలము ఆనందానుభూతులను ఆత్మ యొక్క ప్రభావముచే అనుభవించుచున్నవి. అవి స్వతంత్రముగా వ్యవహరించలేవు. ఎందువలనంటే ఆత్మ స్వభావము అన్నింటిని ప్రేమించుటయే. అందుకే ఆత్మ ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటుంది. దుఃఖాలకు లోనుకాదు.

107. గాఢ నిద్రలో మనము ఆత్మానందాన్ని జ్ఞానేంద్రియాలకు సంబంధము లేకుండానే అనుభవించుచున్నాము. ఈ విషయము సృతులలో వివరముగా చెప్పబడినది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 VIVEKA CHUDAMANI - 27 🌹

✍️ Swami Madhavananda
📚. Prasad Bharadwaj

🌻 Anthah:karanalu - Intuitions - 4 🌻


104. Know that it is egoism which, identifying itself with the body, becomes the doer or experiencer, and in conjunction with the Gunas such as the Sattva, assumes the three different states.

105. When sense-objects are favourable it becomes happy, and it becomes miserable when the case is contrary. So happiness and misery are characteristics of egoism, and not of the ever-blissful Atman.

106. Sense-objects are pleasurable only as dependent on the Atman manifesting through them, and not independently, because the Atman is by Its very nature the most beloved of all. Therefore the Atman is ever blissful, and never suffers misery.

107. That in profound sleep we experience the bliss of the Atman independent of sense objects, is clearly attested by the Shruti, direct perception, tradition and inference.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹


19 Feb 2021

No comments:

Post a Comment