19-FEB-2021 MORNING

🌹. రధ సప్తమి శుభాకాంక్షలు 🌹

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 644 / Bhagavad-Gita - 644🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 298, 299 / Vishnu Sahasranama Contemplation - 298, 299🌹
3) 🌹 Daily Wisdom - 63 🌹
4) 🌹. వివేక చూడామణి - 27🌹
5) 🌹Viveka Chudamani - 27 🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 37 🌹
7)  🌹. కోరికే భయానికి హేతువు .. 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 214 / Sri Lalita Chaitanya Vijnanam - 214🌹 
9) 🌹 శ్రీమద్భగవద్గీత - 555 / Bhagavad-Gita - 555🌹 
 
 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹.రధ సప్తమి శుభాకాంక్షలు 🌹*

*సప్తాశ్వరథమారూఢమ్ప్రచండమ్కశ్యపాత్మజమ్*
*శ్వేతపద్మధరమ్దేవమ్తమ్సూర్యమ్ప్రణమామ్యమ్*

*యద్వజ్జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు తస్య రోగంచ శోకంచ సమస్తం హంతు సప్తమి*

*ఉదయం బ్రహ్మ స్వరూపః*
*మధ్యాహ్నంతు మహేశ్వరః*
*సాయంకాలే స్వయం విష్ణుః*
*త్రిమూర్తిస్తూ దివాకరః*

*1-సప్త సప్తి ప్రియే దేవి –సప్త లోకైక పూజితే –సప్త జన్మార్జితం పాపం –హర సప్తమి సత్వరం*
*2-లోల కిరాణా సప్తమ్యాం-స్నాత్వా గంగాది సంగమం –సప్త జన్మ క్రుతైః పాపైః—ముక్తిర్భవతి తక్షణాత్.*
*3-మాఘే మాసే సితే పక్షే –సప్తమీ కోటి భాస్కరా –కుర్వాత్ స్నారార్ఘ్యం దానాభ్యాం –ఆయురారోగ్య సంపదః*
*4-నమస్తే రుద్ర రూపాయ --రసానాం పతయేనమః –అరుణాయాచ నమస్తేస్తు-హరివాస నమోస్తుతే .*

ప్రసాద్ భరద్వాజ 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ సూర్యాష్టోత్తర శతనామవళిః 🌹*

ఈరోజు రధసప్తమి రోజున ఎర్రని పూలతో సూర్యభగవానుడిని పూజించండి.
శివాలయంలో నవగ్రహాలమధ్యలో సూర్యుడు ఉంటాడు. సూర్యుని పటంలేకపోతే విష్ణుమూర్తిని ఆరాధించండి.

1. ఓంసూర్యాయనమః    
2. ఓంఆర్యమ్ణేనమః    
3. ఓంభగాయనమః    
4. ఓంవివస్వతేనమః    
5. ఓందీప్తాంశవేనమః    
6. ఓంశుచయేనమః    
7. ఓంత్వష్ట్రేనమః    
8. ఓంపూష్ణేనమ్మః    
9. ఓంఅర్కాయనమః    
10. ఓంసవిత్రేనమః    
11. ఓంరవయేనమః    
12. ఓంగభస్తిమతేనమః    
13. ఓంఅజాయనమః    
14. ఓంకాలాయనమః    
15. ఓంమృత్యవేనమః    
16. ఓంధాత్రేనమః    
17. ఓంప్రభాకరాయనమః    
18. ఓంపృథివ్యైనమః    
19. ఓంఅద్భ్యోనమః    
20. ఓంతేజసేనమః    
21. ఓంవాయవేనమః    
22. ఓంఖగాయనమః    
23. ఓంపరాయణాయనమః    
24. ఓంసోమాయనమః    
25. ఓంబృహస్పతయేనమః    
26. ఓంశుక్రాయనమః    
27. ఓంబుధాయనమః    
28. ఓంఅంగారకాయనమః    
29. ఓంఇంద్రాయనమః    
30. ఓంకాష్ఠాయనమః    
31. ఓంముహుర్తాయనమః    
32. ఓంపక్షాయనమః    
33. ఓంమాసాయనమః    
34. ఓంౠతవేనమః    
35. ఓంసవంత్సరాయనమః    
36. ఓంఅశ్వత్థాయనమః    
37. ఓంశౌరయేనమః    
38. ఓంశనైశ్చరాయనమః    
39. ఓంబ్రహ్మణేనమః    
40. ఓంవిష్ణవేనమః    
41. ఓంరుద్రాయనమః    
42. ఓంస్కందాయనమః    
43. ఓంవైశ్రవణాయనమః    
44. ఓంయమాయనమః    
45. ఓంనైద్యుతాయనమః    
46. ఓంజఠరాయనమః    
47. ఓంఅగ్నయేనమః    
48. ఓంఐంధనాయనమః    
49. ఓంతేజసామృతయేనమః    
50. ఓంధర్మధ్వజాయనమః    
51. ఓంవేదకర్త్రేనమః    
52. ఓంవేదాంగాయనమః    
53. ఓంవేదవాహనాయనమః    
54. ఓంకృతాయనమః    
55. ఓంత్రేతాయనమః
56. ఓంద్వాపరాయనమః
57. ఓంకలయేనమః
58. ఓంసర్వామరాశ్రమాయనమః
59. ఓంకలాయనమః
60. ఓంకామదాయనమః
61. ఓంసర్వతోముఖాయనమః
62. ఓంజయాయనమః
63. ఓంవిశాలాయనమః
64. ఓంవరదాయనమః
65. ఓంశీఘ్రాయనమః
66. ఓంప్రాణధారణాయనమః
67. ఓంకాలచక్రాయనమః
68. ఓంవిభావసవేనమః
69. ఓంపురుషాయనమః
70. ఓంశాశ్వతాయనమః
71. ఓంయోగినేనమః
72. ఓంవ్యక్తావ్యక్తాయనమ
73. ఓంసనాతనాయనమః
74. ఓంలోకాధ్యక్షాయనమః
75. ఓంసురాధ్యక్షాయనమః
76. ఓంవిశ్వకర్మణేనమః
77. ఓంతమోనుదాయనమః
78. ఓంవరుణాయనమః
79. ఓంసాగరాయనమః
80. ఓంజీముతాయనమః
81. ఓంఅరిఘ్నేనమః
82. ఓంభూతాశ్రయాయనమః
83. ఓంభూతపతయేనమః
84.ఓంసర్వభూతనిషేవితాయనమః
85. ఓంమణయేనమః
86. ఓంసువర్ణాయనమః
87. ఓంభూతాదయేనమః
88. ఓంధన్వంతరయేనమః
89. ఓంధూమకేతవేనమః
90. ఓంఆదిదేవాయనమః
91. ఓంఆదితేస్సుతాయనమః
92. ఓంద్వాదశాత్మనేనమః
93. ఓంఅరవిందాక్షాయనమః
94. ఓంపిత్రేనమః
95. ఓంప్రపితామహాయనమః
96. ఓంస్వర్గద్వారాయనమః
97. ఓంప్రజాద్వారాయనమః
98. ఓంమోక్షద్వారాయనమః
99. ఓంత్రివిష్టపాయనమః
100. ఓంజీవకర్త్రేనమః
101. ఓంప్రశాంతాత్మనేనమః
102. ఓంవిశ్వాత్మనేనమః
103. ఓంవిశ్వతోముఖాయనమః
104. ఓంచరాచరాత్మనేనమః
105. ఓంసూక్ష్మాత్మనేనమః
106. ఓంమైత్రేయాయనమః
107. ఓంకరుణార్చితాయనమః
108.ఓంశ్రీసూర్యణారాయణాయనమః
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 644 / Bhagavad-Gita - 644 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 61 🌴*

61. ఈశ్వర: సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి |
భ్రామయన్ సర్వభూతాని యన్త్రారూఢాని మాయయా ||

🌷. తాత్పర్యం : 
ఓ అర్జునా! పరమపురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై యుండి, భౌతికశక్తి యంత్రముపై ఆసీనులైనట్లుగా నున్న సర్వజీవుల గతులను నిర్దేశించుచున్నాడు.

🌷. భాష్యము :
అర్జునుడు దివ్యజ్ఞాత కాడు. యుద్ధము చేయుట లేదా యుద్ధము చేయకుండుట యనెడి అతని నిర్ణయము కేవలము అతని పరిమితజ్ఞానము పైననే ఆధారపడియున్నది. 

కనుకనే శ్రీకృష్ణభగవానుడు జీవులు సర్వజ్ఞులు కారని ఉపదేశించుచున్నాడు. ఆ దేవదేవుడే (స్వయముగా శ్రీకృష్ణుడు) పరమాత్మరూపమున జీవుల హృదయములందు నిలిచి వారిని నిర్దేశించుచుండును. దేహమును మార్చిన పిమ్మట జీవుడు తన పూర్వకర్మలను మరచినను భూత, భవిష్యత్, వర్తమానముల జ్ఞాతగా పరమాత్ముడు జీవుని కర్మలకు సాక్షిగా నిలిచియుండును. 

అనగా జీవుల కర్మలన్నియు ఈ పరమాత్మునిచే నిర్దేశింపబడుచున్నవి. కనుకనే జీవుడు తనకు అర్హమైన వానిని పొందుచు భౌతికదేహమున కొనసాగుచుండును. అట్టి భౌతికదేహము పరమాత్మ నిర్దేశమున భౌతికశక్తిచే సృజించబడుచుండును. జీవుడు ఆ విధముగా ఒక దేహమునందు ప్రవేశపెట్టబడినంతనే ఆ దేహమునకు అనుగణమైన రీతిలో వర్తించ వలసివచ్చును. 

అధికవేగముగా ప్రయాణించగలిగిన కారులో కూర్చుని యున్నటువంటి వ్యక్తి అల్పవేగముతో ప్రయాణించగలిగిన కారులో నున్న వ్యక్తికన్నను అధిక వేగముగా ప్రయాణించును. ఆ రెండు వాహనముల యందలి మనుష్యులు (జీవులు) ఏకమేయైనను వారి ప్రయాణవేగములు వేరుగా నుండును. 

అదేవిధముగా పరమాత్ముని ఆజ్ఞానుసారము భౌతికప్రకృతియే జీవుడు పూర్వ ఇచ్చానుసారము వర్తించుటకు అనుగుణమైన దేహమును తయారుచేయుచుండును. ఈ విషయమున జీవుడు అస్వతంత్రుడు. కనుక ఎవ్వడును తాను భగవానునిపై ఆధారపడలేదని భావించరాదు. అతడు సదా భగవానుని అదుపులోనే యుండును. కనుకనే శరణాగతి యనునది ప్రతియోక్కరి ధర్మము. తదుపరి శ్లోకము యొక్క భోద అదియే.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 644 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 61 🌴*

61. īśvaraḥ sarva-bhūtānāṁ
hṛd-deśe ’rjuna tiṣṭhati
bhrāmayan sarva-bhūtāni
yantrārūḍhāni māyayā

🌷 Translation : 
The Supreme Lord is situated in everyone’s heart, O Arjuna, and is directing the wanderings of all living entities, who are seated as on a machine, made of the material energy.

🌹 Purport :
Arjuna was not the supreme knower, and his decision to fight or not to fight was confined to his limited discretion. Lord Kṛṣṇa instructed that the individual is not all in all. 

The Supreme Personality of Godhead, or He Himself, Kṛṣṇa, as the localized Supersoul, sits in the heart directing the living being. After changing bodies, the living entity forgets his past deeds, but the Supersoul, as the knower of the past, present and future, remains the witness of all his activities. 

Therefore all the activities of living entities are directed by this Supersoul. The living entity gets what he deserves and is carried by the material body, which is created in the material energy under the direction of the Supersoul. As soon as a living entity is placed in a particular type of body, he has to work under the spell of that bodily situation. 

A person seated in a high-speed motorcar goes faster than one seated in a slower car, though the living entities, the drivers, may be the same. Similarly, by the order of the Supreme Soul, material nature fashions a particular type of body to a particular type of living entity so that he may work according to his past desires. 

The living entity is not independent. One should not think himself independent of the Supreme Personality of Godhead. The individual is always under the Lord’s control. Therefore one’s duty is to surrender, and that is the injunction of the next verse.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 298, 299 / Vishnu Sahasranama Contemplation - 298, 299 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 298. కామప్రదః, कामप्रदः, Kāmapradaḥ 🌻*

ఓం కామప్రదాయ నమః | ॐ कामप्रदाय नमः | OM Kāmapradāya namaḥ

కామప్రదః, कामप्रदः, Kāmapradaḥ

విష్ణుః కామాన్ స్వభక్తేభ్యః ప్రకర్షేణ దదాతి యః ।
స ఏవ కామప్రద ఇత్యుచ్యతే విబుధోత్తమైః ॥

తన భక్తుల కొరకు కామిత ఫలములను మిక్కిలిగా ఇచ్చునుగావున విష్ణువు కామప్రదుడు.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వభాగము ::
ఆ. చరణసేవకులకు సంసారభయమును, బాపి శ్రీకరంబు పట్టు గలిగి
     కామప్రదాయి యైన కరసరోజంబు మా, మస్తకముల నునిచి మనుపు మీశ! (1041)

నీ పాదాలను కొలిచేవారికి సంసారంవల్ల కలిగే భయాన్ని తొలగించేదీ, లక్ష్మీదేవి హస్తాన్ని గ్రహించేదీ, అభీష్టములు అందించేది అయిన నీ కరకమలాన్ని మా శిరములపై ఉంచి మమ్ము బ్రదికించు స్వామీ!

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 298🌹*
📚. Prasad Bharadwaj 

🌻298. Kāmapradaḥ🌻

OM Kāmapradāya namaḥ

Viṣṇuḥ kāmān svabhaktebhyaḥ prakarṣeṇa dadāti yaḥ,
Sa eva kāmaprada ityucyate vibudhottamaiḥ.

विष्णुः कामान् स्वभक्तेभ्यः प्रकर्षेण ददाति यः ।
स एव कामप्रद इत्युच्यते विबुधोत्तमैः ॥

Since Lord Viṣṇu bestows in plentiful what His devotees desire, He is called Kāmapradaḥ.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
भूतभव्यभवन्नाथः पवनः पावनोऽनलः ।
कामहा कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः ॥ ३२ ॥

భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః ।
కామహా కామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ॥ ౩౨ ॥

Bhūtabhavyabhavannāthaḥ pavanaḥ pāvano’nalaḥ ।
Kāmahā kāmakr̥tkāntaḥ kāmaḥ kāmapradaḥ prabhuḥ ॥ 32 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 299 / Vishnu Sahasranama Contemplation - 299🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 299. ప్రభుః, प्रभुः, Prabhuḥ 🌻*

ఓం ప్రభవే నమః | ॐ प्रभवे नमः | OM Prabhave namaḥ

ప్రభుః, प्रभुः, Prabhuḥ

జనార్ధనః ప్రకర్షేణ భవనాత్ప్రభురుచ్యతే మిగులు గొప్పగా ఉండువాడు కావున జనార్ధనుడు ప్రభువు.

:: భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
యేఽప్యన్యదేవతాభక్తా యజన్తే శ్రద్ధయాన్వితాః ।
తేఽపి మామేవ కౌన్తేయ యజన్త్యవిధి పూర్వకమ్ ॥ 23 ॥
అహం హి సర్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ ।
న తు మామమ్భిజానన్తి తత్త్వేనాతశ్చ్యవన్తి తే ॥ 24 ॥

ఓ అర్జునా! ఎవరు ఇతర దేవతలయెడల భక్తిగలవారై శ్రద్ధతోగూడి వారి నారాధించుచున్నారో, వారున్ను నన్నే అవిధిపూర్వకముగ ఆరాధించుచున్న వారగుదురు. ఏలయనగా, సమస్తయజ్ఞములకు భోక్తను, ప్రభువు (యజమానుడు)ను నేనే అయియున్నాను. అట్టి నన్ను - వారు యథార్థముగ తెలిసికొనుటలేదు. ఇందువలన జారిపోవుచున్నారు.

35. ప్రభుః, प्रभुः, Prabhuḥ

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 299🌹*
📚. Prasad Bharadwaj 

🌻299. Prabhuḥ🌻

OM Prabhave namaḥ

Janārdhanaḥ prakarṣeṇa bhavanātprabhurucyate / जनार्धनः प्रकर्षेण भवनात्प्रभुरुच्यते Since Lord Janārdhana flourishes magnificently, He is Prabhuḥ.

Bhagavad Gīta - Chapter 9
Ye’pyanyadevatābhaktā yajante śraddhayānvitāḥ,
Te’pi māmeva kaunteya yajantyavidhi pūrvakam. (23)
Ahaṃ hi sarva yajñānāṃ bhoktā ca prabhureva ca,
Na tu māmambhijānanti tattvenātaścyavanti te. (24)

Even those who, being devoted to other deities and endowed with faith, worship (them), they also, O son of Kuntī, worship Me alone (though) following the wrong method. I indeed am the enjoyer as also the Lord of all sacrifices; but they do not know Me in reality. Therefore they fall.

35. ప్రభుః, प्रभुः, Prabhuḥ

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
भूतभव्यभवन्नाथः पवनः पावनोऽनलः ।
कामहा कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः ॥ ३२ ॥

భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః ।
కామహా కామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ॥ ౩౨ ॥

Bhūtabhavyabhavannāthaḥ pavanaḥ pāvano’nalaḥ ।
Kāmahā kāmakr̥tkāntaḥ kāmaḥ kāmapradaḥ prabhuḥ ॥ 32 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 63 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 3. Atma-Vidya or Adhyatma-Vidya 🌻*

The knowledge proclaimed in the Upanishad is a science which deals with the removal of sorrow. Thus, it is a knowledge which is different in kind from the learning that we usually acquire or the knowledge that we gain in respect of the things of the world. It is not a science in the ordinary sense of the term. 

While there are sciences and arts of various kinds, all of which are important enough, and wonderful in their own way, they cannot remove sorrow from the human heart, root and branch. They contribute to the satisfaction of a particular individual, placed in a particular constitution, in a particular type of incarnation, but they do not go to the soul of the person concerned. 

In the sense of the science of the soul, the Upanishad is also called Atma Vidya or Adhyatma Vidya. When the perceiver is known, everything connected with the perceiver also is known. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #DailyWisdom #SwamiKrishnananda
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 27 / Viveka Chudamani - 27 🌹*
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

*🍀. అంతఃకరణాలు - 4 🍀*

104. అహం అనునది శరీరమే తాను అను భావముతో, తానే అన్ని చేస్తూ అనుభవిస్తున్నానని, సత్వ, రజో, తమో గుణాలకు అనుగుణంగా వ్యవహారము నడుపుచున్నది.

105. జ్ఞానేంద్రియాలకు అనుకూలముగా పనులు జరిగినప్పుడు సంతోషమును, వ్యతిరేకముగా ఉన్న దుఃఖాలను అహం అనుభవిస్తూ ఉంటుంది. ఈ దూషణ, భూషణాలు అనునవి అహం యొక్క లక్షణాలు. సదా ఆనందములో ఉండే ఆత్మకు సంబంధము లేదు.

106. జ్ఞానేంద్రియాలు కేవలము ఆనందానుభూతులను ఆత్మ యొక్క ప్రభావముచే అనుభవించుచున్నవి. అవి స్వతంత్రముగా వ్యవహరించలేవు. ఎందువలనంటే ఆత్మ స్వభావము అన్నింటిని ప్రేమించుటయే. అందుకే ఆత్మ ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటుంది. దుఃఖాలకు లోనుకాదు.

107. గాఢ నిద్రలో మనము ఆత్మానందాన్ని జ్ఞానేంద్రియాలకు సంబంధము లేకుండానే అనుభవించుచున్నాము. ఈ విషయము సృతులలో వివరముగా చెప్పబడినది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam 


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 27 🌹* 
✍️ Swami Madhavananda
📚. Prasad Bharadwaj 

*🌻 Anthah:karanalu - Intuitions - 4 🌻*

104. Know that it is egoism which, identifying itself with the body, becomes the doer or experiencer, and in conjunction with the Gunas such as the Sattva, assumes the three different states.

105. When sense-objects are favourable it becomes happy, and it becomes miserable when the case is contrary. So happiness and misery are characteristics of egoism, and not of the ever-blissful Atman.

106. Sense-objects are pleasurable only as dependent on the Atman manifesting through them, and not independently, because the Atman is by Its very nature the most beloved of all. Therefore the Atman is ever blissful, and never suffers misery.

107. That in profound sleep we experience the bliss of the Atman independent of senseobjects, is clearly attested by the Shruti, direct perception, tradition and inference.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 37 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 27. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 1 🌻*

అది 1895 వ సంవత్సరం జూన్ 30 తేదీ, నా జీవితమున అది మరపురాని రోజు. జన్మజన్మలకూ గుర్తుండేడి రోజు. నా కపుడు 15 సంవత్సరాలు. యవ్వనము తికమక పెట్టు సమయమది. ఎందరో పిల్లలు జీవితమున ఉత్సాహముతో పరుగులెత్తు చుండగా, పగలూ రాత్రి తేడా తెలియని చిలిపితనముతో, పిల్లచేష్టలతో జీవించు వయస్సు. కానీ, నా కప్పటికీ జీవితముపై విరక్తి పూర్తిగా ఉండెడిది. 

నా జీవితము వృధా యను భావన అనునిత్యమూ వేధిస్తూ వుండేది. ఆ వయస్సునకే నాకు తలమునకలు వేయు సమస్యలు, ఎటు చూచిననూ దుఃఖము ఆవరించి యుండేది. నేనీ ప్రపంచములోనికి రావాలని ఎప్పుడూ కోరుకొనలేదని, అయిననూ కొనిరాబడితినని భావించేదానను. నన్నెవరూ ప్రేమించేవారు కారు. నేను కూడా అంతే. 

అందరి యందూ తెలియని కోపము, ద్వేషము, చిరాకు వుండేవి. నాకుగా నేను చిక్కులు వేసుకొనుటలో ఉత్తమశ్రేణి నిపుణత కలిగినదానను నేను. భావి జీవితమును భావించినపుడల్లా భయమావరించెడిది. పెళ్ళి, పిల్లలూ, సంఘమున పరపతి, గౌరవము, వాని కొరకై జీవించుట నాకు యాంత్రికముగా తోచెడివి. 

క్రైస్తవమతము కూడా సంకుచితమైన బోధలు కలిగి నా హృదయావేదనకు పరిష్కారము చూపలేక పోయినది. నరకమును తెలిపి బెదిరించుటయే ప్రధానముగా వారి బోధన సాగుచుండెడిది. క్రతువులు- మతబోధనలు చెవులలో గింగిరు లెత్తుచుండెడివి.

నాకు జీవితమంతయూ అయోమయముగ నుండెడిది. నా చుట్టునూ దట్టమైన పొగమంచు ఏర్పడి, ఏమీ కనపడని, ఏమీ వినపడని ఒంటరినై జీవించుచుండెడి దానను. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కోరికే భయానికి హేతువు 🌹*
*🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀*
✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ

దానివల్ల మీరు కోల్పోయేదేముండదు. మహా అయితే మీ సంకెళ్ళు. మీ చిరాకు, మీ విసుగు, ఎప్పుడూ మీలో ఉండే ఏదో కోల్పోయిన భావనలు పోతాయి. కోల్పోయేందుకు మీ దగ్గర అంతకన్నా ఏముంది? ఆ చెత్త నుంచి బయటపడి బుద్ధుడు, కృష్ణుడు, జీసస్, మహావీరులను వ్యతిరేకిస్తూ, మిమ్మల్ని మీరు అంగీకరించడం ప్రారంభించండి. మీరు మీ పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి కానీ, బుద్ధుడు, కృష్ణుడు, నానక్, జీసస్, మహావీరుల పట్ల బాధ్యతాయుతంగా ఉండ వలసిన పనిలేదు.

ఇంతవరకు మిమ్మల్ని మీరు ఏ మాత్రం పట్టించుకోకుండా కర్తవ్యం పేరు చెప్పి ఇతరులకు కావలసినవన్నీ చేసిపెడుతూ మీ పట్ల మీరు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ జీవించారు. అందుకే మీతో విసిగిపోయిన మీరు నిస్సారమని తెలుసుకున్నారు. అలా తెలుసుకోవడం మంచిదే. 

జైలు నుంచి బయటపడేందుకు అంతకన్నా ఏమి కావాలి? అందులోంచి బయటకు దూకి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకెళ్ళండి. ‘‘బాగా ఆలోచించి దూకు’’ అని అందరూ అంటుంటారు. అదే నేనైతే ‘‘ముందు దూకి, తరువాత బాగా ఆలోచించండి’’ అంటాను.

మనల్ని పైనుంచి గమనిస్తున్న వ్యక్తిగత దేవుడు కేవలం కల్పనే అయినప్పటికీ, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయినప్పటికీ, వాడిని వదలాలంటే నాకు చాలా భయంగానే ఉంది.
దేవుణ్ణి వదిలేందుకు నువ్వెందుకంత భయపడుతున్నావు? 

ఎందుకంటే, కచ్చితంగా నీలో ఎక్కడో ఆ దేవుడు నిన్ను కాపాడుతున్నాడనే భావన దాగి వుంది. అందుకే వాడిని వదిలేందుకు నువ్వు అంతగా భయపడుతున్నావు. కాబట్టి, ‘దేవుడు’ అనే భావన నీ మనసుకు ఒకరకమైన రక్షణ కవచం లాంటిది.

తల్లి గర్భంలో వున్నపుడు ఏ మాత్రం భయపడని పసివాడు పుట్టిన వెంటనే భయపడతాడు. తల్లి గర్భంలో వున్న శిశువు ఏ చర్చికో, మసీదుకో, దేవాలయానికో వెళ్లి బైబిల్, ఖురాన్, భగవద్గీతలు చదవాలనుకున్నట్లు, ‘‘దేవుడున్నాడా, లేడా? దయ్యాలున్నాయా, లేవా? నరకమంటే ఏమిటి? స్వర్గమంటే ఏమిటి?’’ అని ఆలోచించినట్లు నేనెప్పుడూ వినలేదు. వాడు అలా దేని కోసం ఆలోచించాలి? 

వాడు ఇప్పుడే తల్లిగర్భమనే స్వర్గంలో ఉన్నాడు. ‘‘నాకిది కావాలి, అది కావాలి’’ అని అడగవలసిన అవసరం వాడికి అక్కడ ఏ మాత్రముండదు. ఎందుకంటే, అక్కడ వాడికి కావలసినవన్నీ నిరంతరం సమకూరుతూనే ఉంటాయి. అంతకన్నా గొప్ప స్వర్గమేముంటుంది. 

నిజానికి పసివాడు తల్లి గర్భంలో వున్న తొమ్మిది నెలల కాలంలో ఎదిగినంతగా తొంభై ఏళ్ళొచ్చినా ఎదగడు. ఆ తొమ్మిది నెలల కాలంలో వాడు అణువు నుంచి అనంతందాకా కొన్ని లక్షల సంవత్సరాలలో చోటుచేసుకున్న పరిణామక్రమంలోని అన్ని దశల గుండా ప్రయాణిస్తాడు. 

అక్కడ వాడి జీవితానికి పూర్తి రక్షణ ఉంటుంది. ఉద్యోగానే్వషణలు, ఆకలిదప్పుల బాధల్లాంటివి అక్కడ ఉండవు. వాడికి కావలసినవన్నీ తల్లి శరీరమే సమకూరుస్తుంది. మీరు తల్లి గర్భంలో జీవించిన ఆ తొమ్మిది నెలలలో మీకు లభించిన రక్షణే ప్రస్తుతం చెలామణిలో వున్న అన్ని మతాలకు పురుడు పోసింది. అందుకే తల్లి గర్భం నుంచి బయటపడిన శిశువు వెంటనే భయపడతాడు. అది కచ్చితం. 

ఎందుకంటే, పూర్తి రక్షణ, అన్ని సౌకర్యాలతో వున్న గృహం నుంచి ఏమీ తెలియని ఈ వింత ప్రపంచంలోకి ఆ శిశువు గెంటివేయబడ్డాడు. ఇక్కడ వాడు స్వయంగా ఊపిరి పీల్చడం ప్రారంభించాలి కానీ, వాడి తల్లి ఊపిరి పీల్చితే సరిపోదు. ఈ సత్యం తెలిసేందుకు ఆ పసికందుకు కొన్ని క్షణాలు పడుతుంది.

- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 214 / Sri Lalitha Chaitanya Vijnanam - 214 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ |*
*మహామాయా, మహాసత్త్వా, మహాశక్తి ర్మహారతిః ‖ 54 ‖*

*🌻 214. 'మహాపాతకనాశినీ'🌻*

మహా పాతకములను కూడ నాశనము చేయునది శ్రీమాత అని అర్థము.
పాపములు తెలియక చేయుట యుండును. తెలిసి చేయుట కూడ నుండును. తెలియక చేయుట అజ్ఞానము వలన. తెలిసి చేయుట బలహీనత వలన. అట్టి భక్తులను రక్షించుటయే తన పనిగ పెట్టు కొన్నది శ్రీదేవి. 

సమస్త పాపములకు ప్రాయశ్చిత్తము పరాశక్తి పాద ధ్యానమే యని బ్రహ్మాండ పురాణము బోధించుచున్నది. భక్తితో ఆరాధించు బలహీనులను, అజ్ఞానులను శ్రీమాతయే ఉద్ధరించు కొనును. సామ దాన భేద దండోపాయములతో అసురులను సైతము
ఉద్ధరించునది శ్రీమాత. ఆమె స్మరణము సర్వపాప హరణము. 

లలితా స్వరూపుడైన శ్రీకృష్ణ దేవుడు కూడ భగవద్గీతయందిట్లు పలికినాడు. “ఎంత దురాచరుడైనప్పటికి నా భక్తుడు నశింపడు.” కలియుగ వాసులకు ఈ వాక్యమే పట్టుకొమ్మ. కొండంత పాపమును నశింపజేయు దైవమే జీవులకు ఆధారము. దైవము యొక్క కరుణయే
దీనికి కారణము. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 214 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻Mahāpātaka-naśinī महापातक-नशिनी (214) 🌻*

She destroys great sins. There are certain rules for expiations of sins. Sins are committed knowingly and unknowingly. There is no remedy for committing a sin knowingly. The worst sin is brahmahatyā, which means murdering the one who is an exponent of Veda-s. It is said that there is no remedy for this sin.   

For such sins, karmic account swells and accordingly one has to undergo sufferings either in this birth itself or in subsequent births. (A study of birth chart will reveal whether a person has such karmic afflictions, based on 5th and 9th houses. Though various remedies are prescribed to eradicate such afflictions, the best remedy is to feed the deserving poor and starving animals. 

For brahmahatyā doṣa, it is said that there is no remedy at all.) One has to surely undergo sufferings for such sins either committed in this birth or in previous births and such sufferings cannot be mitigated by performing remedies. This nāma says that She can absolve even the worst sins of Her devotees.  

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 555 / Bhagavad-Gita - 555 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 18 🌴*

18. అహంకార బలం దర్పం 
కామం క్రోధం చ సంశ్రితా: |
మామాత్మపరదేహేషు 
ప్రద్విషన్తోభ్యసూయకా: ||


🌷. తాత్పర్యం : 
మిథ్యాహంకారము, బలము, గర్వము, కామము, క్రోధములచే భ్రాంతులైన అసురస్వభావులు తమ దేహమునందు మరియు ఇతరుల దేహములందు నిలిచియున్న దేవదేవుడైన నా యెడ అసూయగలవారై నిజమైన ధర్మమును దూషింతురు.

🌷. భాష్యము :
భగవానుని దేవదేవత్వమును ఎల్లప్పుడు వ్యతిరేకించుటచే ఆసురస్వభావుడు శాస్త్రములను నమ్మ ఇచ్ఛగింపడు. శాస్త్రము నెడ మరియు దేవదేవుడైన శ్రీకృష్ణుని యెడ అతడు అసూయను కలిగియుండును. అట్టి భ్రాంతికి అతని నామమాట గౌరవము, ధనము, బలములే కారణము. వర్తమాన జన్మము భవిష్యజ్జన్మకు మూలమని తెలియనందునే ఆసురస్వభావుడు తన యెడ, ఇతరుల యెడ అసూయను కలిగియుండును. 

తత్కారణముగా అతడు ఇతరులయెడ మరియు తనయెడ హింస నొనరించును. జ్ఞానరహితుడైనందున అట్టివాడు దేవదేవుడైన శ్రీకృష్ణుని పరమ నియామకత్వమును లెక్కచేయడు. శాస్త్రము మరియు భగవానుని యెడ అసూయగలవాడైనందున భగవానుని అస్తిత్వమునకు విరుద్ధముగా అతడు మిథ్యావాదము చేయుచు శాస్త్రప్రమాణమును త్రోసిపుచ్చును. ప్రతికార్యమునందు తనను స్వతంత్రునిగా మరియు శక్తిగలవానిగా అతడు భావించును. 

బలము, శక్తి లేదా ధనమునందు తనతో సమానులు ఎవ్వరును లేనందున తాను తోచిన రీతిలో వర్తింపవచ్చుననియు, తననెవ్వరును అడ్డగింపలేరనియు అతడు తలచును. అట్టి అసురస్వభావుడు తన భోగకర్మలను అడ్డగించు శత్రువున్నాడని తెలిసినచో అతనిని తన శక్తినుపయోగించి నశింపజేయుటకు ప్రణాళికలు రూపొందించును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 555 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 18 🌴*

18. ahaṅkāraṁ balaṁ darpaṁ
kāmaṁ krodhaṁ ca saṁśritāḥ
mām ātma-para-deheṣu
pradviṣanto ’bhyasūyakāḥ

🌷 Translation : 
Bewildered by false ego, strength, pride, lust and anger, the demons become envious of the Supreme Personality of Godhead, who is situated in their own bodies and in the bodies of others, and blaspheme against the real religion.

🌹 Purport :
A demoniac person, being always against God’s supremacy, does not like to believe in the scriptures. He is envious of both the scriptures and the existence of the Supreme Personality of Godhead. This is caused by his so-called prestige and his accumulation of wealth and strength. He does not know that the present life is a preparation for the next life. Not knowing this, he is actually envious of his own self, as well as of others. He commits violence on other bodies and on his own. 

He does not care for the supreme control of the Personality of Godhead, because he has no knowledge. Being envious of the scriptures and the Supreme Personality of Godhead, he puts forward false arguments against the existence of God and denies the scriptural authority. He thinks himself independent and powerful in every action. 

He thinks that since no one can equal him in strength, power or wealth, he can act in any way and no one can stop him. If he has an enemy who might check the advancement of his sensual activities, he makes plans to cut him down by his own power.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment