కార్తీక మాసం 30 రోజులు - దైవం, మంత్రం, దానం, నైవేద్యం 30 days of Karthika month - Deity, Mantra, Donation, Offering


🌹 కార్తీక మాసం 30 రోజులు - పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


🌹 30 days of Karthika month - God to worship - Mantra to recite - Donation - Offering 🌹

Prasad Bharadhwaja



1వ రోజు:

నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు.

దానములు:- నెయ్యి, బంగారం

పూజించాల్సిన దైవము:-స్వథా అగ్ని

జపించాల్సిన మంత్రము:- ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా




2వ రోజు:

నిషిద్ధములు:-తరగబడిన వస్తువులు

దానములు:-కలువపూలు, నూనె, ఉప్పు

పూజించాల్సిన దైవము:-బ్రహ్మ

జపించాల్సిన మంత్రము:-

ఓం గీష్పతయే - విరించియే స్వాహా




3వ రోజు:

నిషిద్ధములు:-

ఉప్పు కలిసినవి, ఉసిరి

దానములు:- ఉప్పు

పూజించాల్సిన దైవము:- పార్వతి

జపించాల్సిన మంత్రము:- ఓం పార్వత్యై - పరమేశ్వర్యై స్వాహా




4వ రోజు:

నిషిద్ధములు:- వంకాయ, ఉసిరి

దానములు:- నూనె, పెసరపప్పు

పూజించాల్సిన దైవము:- విఘ్నేశ్వరుడు

జపించాల్సిన మంత్రము:- ఓం గం గణపతయే స్వాహా




5వ రోజు:

నిషిద్ధములు:- పులుపుతో కూడినవి

దానములు:- స్వయంపాకం, విసనకర్ర

పూజించాల్సిన దైవము:- ఆదిశేషుడు

జపించాల్సిన మంత్రము:- (మంత్రం అలభ్యం, ప్రాణాయామం చేయాలి)




6వ రోజు:

నిషిద్ధములు:- ఇష్టమైనవి , ఉసిరి

దానములు:- చిమ్మిలి

పూజించాల్సిన దైవము:- సుబ్రహ్మణ్యేశ్వరుడు

జపించాల్సిన మంత్రము:- ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా




7వ రోజు:

నిషిద్ధములు:- పంటితో తినే వస్తువులు, ఉసిరి

దానములు:- పట్టుబట్టలు, గోధుమలు, బంగారం

పూజించాల్సిన దైవము:- సూర్యుడు

జపించాల్సిన మంత్రము:- ఓం. భాం. భానవే స్వాహా




8 వ రోజు:

నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం

దానములు:- తోచినవి - యథాశక్తి

పూజించాల్సిన దైవము:- దుర్గ

జపించాల్సిన మంత్రము:-

ఓం - చాముండాయై విచ్చే - స్వాహా




9వ రోజు:

నిషిద్ధములు:- నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి

దానములు:- మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు

పూజించాల్సిన దైవము:- అష్టవసువులు -

పితృ దేవతలు

జపించాల్సిన మంత్రము:- ఓం అమృతాయ స్వాహా - పితృదేవతాభ్యో నమః




10వ రోజు:

నిషిద్ధములు:- గుమ్మడికాయ, నూనె, ఉసిరి

దానములు:- గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె

పూజించాల్సిన దైవము:- దిగ్గజాలు

జపించాల్సిన మంత్రము:-

ఓం మహామదేభాయ స్వాహా




11వ రోజు:

నిషిద్ధములు:- పులుపు, ఉసిరి

దానములు:- వీభూదిపండ్లు, దక్షిణ

పూజించాల్సిన దైవము:- శివుడు

జపించాల్సిన మంత్రము:-

ఓం రుద్రాయస్వాహా, ఓం నమశ్శివాయ




12వ రోజు:

నిషిద్ధములు:- ఉప్పు, పులుపు, కారం, ఉసిరి

దానములు:- పరిమళద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ

పూజించాల్సిన దైవము:- భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు

జపించాల్సిన మంత్రము:-

ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా




13వ రోజు:

నిషిద్ధములు:- రాత్రి భోజనం, ఉసిరి

దానములు:- మల్లె, జాజి వగైరా పూవులు, వనభోజనం

పూజించాల్సిన దైవము:- మన్మధుడు

జపించాల్సిన మంత్రము:-

ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా




14వ రోజు:

నిషిద్ధములు:- ఇష్టమైన వస్తువులు, ఉసిరి

దానములు:- నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె

పూజించాల్సిన దైవము:- యముడు

జపించాల్సిన మంత్రము:-

ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా




15వ రోజు:

నిషిద్ధములు:- తరగబడిన వస్తువులు

దానములు:- కలువపూలు, నూనె, ఉప్పు

జపించవలసిన మంత్రం:-

'ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః'




16వ రోజు:

నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది,ఎంగిలి, చల్ల

దానములు:- నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం

పూజించాల్సిన దైవము:- స్వాహా అగ్ని

జపించాల్సిన మంత్రము:- ఓం స్వాహాపతయే జాతవేదసే నమః




17వ రోజు:

నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు

దానములు:- ఔషధాలు, ధనం

పూజించాల్సిన దైవము:- అశ్వినీ దేవతలు

జపించాల్సిన మంత్రము:- ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా




18వ రోజు:

నిషిద్ధములు:- ఉసిరి

దానములు:- పులిహార, అట్లు, బెల్లం

పూజించాల్సిన దైవము:- గౌరి

జపించాల్సిన మంత్రము:- ఓం గగగగ గౌర్త్యె స్వాహా




19వ రోజు:

నిషిద్ధములు:- నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైధునం, ఉసిరి

దానములు:- నువ్వులు, కుడుములు

పూజించాల్సిన దైవము:- వినాయకుడు

జపించాల్సిన మంత్రము:- ఓం గం గణపతయే స్వాహా




20వ రోజు:

నిషిద్ధములు:- పాలు తప్ప - తక్కినవి

దానములు:- గో, భూ, సువర్ణ దానాలు

పూజించాల్సిన దైవము:- నాగేంద్రుడు

జపించాల్సిన మంత్రము:- ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం




21వ రోజు:

నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం

దానములు:- యథాశక్తి సమస్త దానాలూ

పూజించాల్సిన దైవము:- కుమారస్వామి

జపించాల్సిన మంత్రము:- ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా




22వ రోజు:

నిషిద్ధములు:- పంటికి పనిచెప్పే పదార్ధాలు, ఉసిరి

దానములు:- బంగారం, గోధుమలు, పట్టుబట్టలు




పూజించాల్సిన దైవము:- సూర్యుడు

జపించాల్సిన

మంత్రము:- ఓం సూం - సౌరయే స్వాహా, ఓం భాం - భాస్కరాయ స్వాహా




23వ రోజు:

నిషిద్ధములు:- ఉసిరి, తులసి

దానములు:- మంగళ ద్రవ్యాలు

పూజించాల్సిన దైవము:- అష్టమాతృకలు

జపించాల్సిన మంత్రము:-

ఓం శ్రీమాత్రే నమః, అష్టమాతృ కాయ స్వాహా




24వ రోజు:

నిషిద్ధములు:- మద్యమాంస మైధునాలు, ఉసిరి

దానములు:- ఎర్రచీర, ఎర్ర రవికెల గుడ్డ, ఎర్రగాజులు, ఎర్రపువ్వులు

పూజించాల్సిన దైవము:- శ్రీ దుర్గ

జపించాల్సిన మంత్రము:-

ఓం అరిషడ్వర్గవినాశిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహా




25వ రోజు:

నిషిద్ధములు:- పులుపు, చారు - వగయిరా ద్రవపదార్ధాలు

దానములు:- యథాశక్తి

పూజించాల్సిన దైవము:- దిక్వాలకులు

జపించాల్సిన మంత్రము:-

ఓం ఈశావాస్యాయ స్వాహా




26వ రోజు:

నిషిద్ధములు:- సమస్త పదార్ధాలు

దానములు:- నిలవవుండే సరుకులు

పూజించాల్సిన దైవము:- కుబేరుడు

జపించాల్సిన మంత్రము:- ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా




27వ రోజు:

నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, వంకాయ

దానములు:- ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు

పూజించాల్సిన దైవము:- కార్తీక దామోదరుడు

జపించాల్సిన మంత్రము:- ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా




28వ రోజు:

నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి, వంకాయ

దానములు:- నువ్వులు, ఉసిరి

పూజించాల్సిన దైవము:- ధర్ముడు

జపించాల్సిన

మంత్రము:- ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా




29వ రోజు:

నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరి

దానములు:- శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారం

పూజించాల్సిన దైవము:- శివుడు (మృత్యుంజయుడు)

జపించాల్సిన మంత్రము:- ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం,

ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్




30వ రోజు:

నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరి

దానములు:- నువ్వులు, తర్పణలు, ఉసిరి

పూజించాల్సిన దైవము:- సర్వదేవతలు, పితృ దేవతలు

జపించాల్సిన మంత్రము:- ఓం అమృతాయ స్వాహా మమసమస్త పితృదేవతాభ్యో నమః




🙏🙏🙏🙏🏽🙏🏽🙏🏽🙏🙏




బ్రహ్మ విష్ణు శివ రూపాయ నమో దత్తాత్రేయ Namo Dattatreya (a YT Short)


https://youtube.com/shorts/LO5nmI69sgs


🌹బ్రహ్మ విష్ణు శివ రూపాయ నమో దత్తాత్రేయ 🌹

🌹Brahma Vishnu Shiva Rupaya Namo Dattatreya 🌹

(a YT Short)







కార్తీక మాసం రెండవ రోజు - కార్తీక విదియ The second day of the month of Kartika - Kartika Vidya



కార్తీక మాసం రెండవ రోజు - కార్తీక విదియ


The second day of the month of Kartika - Kartika Vidya


12 రాశుల పూర్వ జన్మ రహస్యాలు The secrets of the 12 zodiac signs' past lives



12 రాశుల పూర్వ జన్మ రహస్యాలు


The secrets of the 12 zodiac signs' past lives



003 - కార్తీక పురాణం 2వ అధ్యాయం - సోమవార వ్రత మహిమ Kartika Purana Chapter 2 - The Glory of Monday Fasting


🌹. కార్తీక పురాణం 2వ అధ్యాయం 🌹

🌻. సోమవార వ్రత మహిమ 🌻

📚. ప్రసాద్ భరద్వాజ



🌹. Kartika Purana Chapter 2 🌹

🌻. The Glory of Monday Fasting 🌻

📚. Prasad Bharadwaja



వశిష్టుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు ”జనకా! ఇంతవరకు నీకు కార్తీక మాసములో చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే… కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని, దాని మహత్యాన్ని గురించి చెబతాను. సావధానంగా విను” అని ఇలా చెప్పసాగాడు.

”కార్తిక మాసములో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని, పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతా ఉపవాసముండాలి.

నదీస్నానం చేసి, తమ శక్తికొద్దీ దానధర్మాలు చేయాలి. శివుడికి బిల్వపత్రాభిషేకం చేసి, సాయంత్రం నక్షత్రదర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్టతో ఉంటూ… ఆ రాత్రంతా జాగరణ చేసి, పురాణ పఠనం చేయాలి. ఉదయం నదీస్నానమాచరించాలి. నువ్వులను దానం చేయాలి (తిలాదానం). తమ శక్తికొద్దీ పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేనివారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత, తాము భుజించాలి. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి, సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి. పెద్దగా పూజాదికాలు నిర్వహించలేనివారు సైతం కనీసం ఉపవాసం ఉంటే… కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందగలరు.

ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసముంది. దాన్ని మీకు తెలియజేస్తాను. సావధానంగా విను” అని ఇలా చెప్పసాగాడు.


🌻. కుక్క కైలాసానికి వెళ్లుట…

”పూర్వ కాలమున కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృతిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి లేకలేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వాతంత్ర నిష్టురి అని పేరు పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్హణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు, శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచారపరుడై ఉండేవాడు. భూతదయ కలిగి ఉండేవాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేసేవాడు ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని ‘అపర బ్రహ్మ’ అని పిలిచేవారు. ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో, కన్నుమిన్నుగానక పెద్దలను దూషించేది. అత్తమామలను, భర్తను తిట్టడం, కొట్టడం, రక్కడం చేసేది. పురుషసాంగత్యంతో వ్యభిచారిణియై… తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు, బట్టలు, పువ్వులు, ధరించి దుష్టురాలై తిరుగసాగింది. ఆమె తమ వంశాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని అత్తమామలు ఆమెను ఇంటినుంచి వెళ్లగొట్టారు. అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఏవగించుకోకుండా… ఆమెతో కలిసే ఉండేవాడు. చుట్టుపక్కలవారంతా ఆమెను గయ్యాళి అని ఏవగించుకుంటూ… కర్కశ అని పేరుపెట్టి ఎగతాళి చేసేవారు.

ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉండగా… ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది. ఆ మృతదేహాన్ని అతిరహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకెళ్లింది. అక్కడున్న బావిలో మృతదేహాన్ని పారేసి, పైన చెత్తచెదారంతో నింపింది. తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకిక ఎదురులేదని, అడ్డూఅదుపు ఉండదనే అహంకారం పెరిగి… ఇష్టారాజ్యంగా తిరగసాగింది. తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుంది. వారి వ్రతాలను పాడుచేసి, నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణసంకరురాలైంది.

అంతటితో ఆగకుండా… కన్యలు, పెళ్లైన మహిళలకు దుర్బుద్దులు నేర్పి, పాడుచేసి, విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది. ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది. వయసు పైపడసాగింది. చేసిన పాపాలకు గురుతుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. వాటి నుంచి చీము, రక్తం కారుతూ, క్రమంగా కుష్టువ్యాధిబారిన పడింది. రోజురోజుకూ ఆమె శరీర పటుత్వం కృశించి కురూపిగా మారింది. యవ్వనంలో ఆమెకోసం వంతులవారీగా ఎగబడే విటుల్లో ఒక్కరూ ఇప్పుడామెవైపు కన్నెత్తికూడా చూడడం లేదు. అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూచి, పురుగులు పడి చనిపోయింది.

బతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చేయని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరవు పెట్టారు. పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని, విటులతో సుఖించినందుకు ఇనుపస్తంభాన్ని కౌగిలించుకోవాలని ఆదేశించారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనపగదలతో ఆమెను మోదాలని ఆదేశించారు.

పతివ్రతలను వ్యభిచారిణిలుగా మార్చినందుకు సలసలా కాగే నూనెలో వేచారు. తల్లిదండ్రులు, అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో, చెవిలో పోశారు. ఇనపకడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కంఉబీపాకంలో వేశారు. ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒకత్తే కాకుండా, ఇటు ఏడు తరాలు, అటు ఏడు తరాలు నరక బాధలు అనుభవించసాగారు. ఆ తర్వాత ఆమె నీచజన్మలు ఎత్తుతూ, క్రిమికీటకాలుగా పుట్టి.. చివరకు పదిహేనో జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మనెత్తింది.

కుక్కజన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికీ తిరిగింది. కర్రతో కొట్టేవారు ఆమెను కొడుతుంటే.. తిట్టేవాడు తిడుతున్నారు. పిల్లలు తరుముతున్నారు. అయితే… ఒక బ్రాహ్మడు కార్తీక సోమవార వ్రతమాచరించి, ఉపవాసముండి, సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి, ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి, కాళ్లూచేతులు కడుక్కునేందుకు వెళ్లాడు.* *అయితే… ఆ కుక్క గబగబా వెళ్లి ఆ ఆహారాన్ని భుజించింది.

వ్రత నిష్ఠ గరిష్ఠుడైన ఆ బ్రాహ్మడి పూజ విధానముతో జరిపెంచిన బలియన్నం కావడం… కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసముండడం, శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది.

వెంటనే ఆ కుక్క ‘విప్రోత్తమా… నన్ను కాపాడుము’ అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మనుష్యులెవరూ కనిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకున్న ఆ విప్రుడికి మళ్లీ మాటలు వినిపించాయి. ‘రక్షించు… రక్షించు…’ అనే కేకలు వినిపించాయి. ఆ మాటలు కుక్క నుంచి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మడు ‘ఎవరు నీవు? నీ వృత్తాతమేమిటి?’ అని ప్రశ్నించాడు. అంత ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. పదిహేను జన్మల క్రింద సద్భ్రాహ్మణుడి భార్యయైన తాను వ్యభిచారం చేసిన తీరు, భర్తను చంపడం, వృద్ధాప్యంలో కుష్టువ్యాధితో దినదినగండంగా బతికి, చనిపోయిన తీరును, నరకంలో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది. ‘ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి, ఇక్కడ పెట్టిన బలిఅన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమా…! నాకు మహోపకరాంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొక్కటి ఇచ్చి, నాకు మోక్షం కలిగించు’ అని ప్రార్థించింది.

దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒక రోజు నాటి ఫలాన్ని ఆమెకు ధారబోశాడు. అలాచేసిన వెంటనే… ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంది. కుక్క తన జన్మను చాలింది, సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది. అటు నుంచి శివసాన్నిథ్యాన్ని చేరుకుంది.”

ఇతి శ్రీ సాంద పురాణే తర్గత, వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యే ద్వితీయ అధ్యాయం సమాప్తం.

🌹 🌹 🌹 🌹 🌹




భగినిహస్త భోజనం - యమ ద్వితీయ పండుగ కధ Bhaginihasta Bhojanam - The Story of Yama Dwitthi Festival (a YT Short)


https://youtube.com/shorts/phWlmSU9wQg


🌹భగినిహస్త భోజనం - యమ ద్వితీయ పండుగ కధ 🌹

👫భగినిహస్త భోజనం ఎలా ఉనికిలోకి వచ్చిందో తెలుసుకోండి 👫


🌹Bhaginihasta Bhojanam - The Story of Yama Dwitthi Festival 🌹

👫Learn how Bhaginihasta Bhojanam came into existence 👫



(a YT Short)

భగినిహస్త భోజనం - యమ ద్వితీయ శుభాకాంక్షలు Greetings on Bhaginihastha Bhojan - Yama Dwitiya (Bhai Dooj)



🌹 భగినిహస్త భోజనం - యమ ద్వితీయ శుభాకాంక్షలు సోదర సోదరీమణులు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 Bhaginihastha Bhojan - Happy Yama Dwitiya to all my brothers and sisters 🌹

Prasad Bharadwaja



002 - కార్తీక పురాణం ప్రారంభం కార్తీకపురాణం 1 అధ్యాయం Beginning of Kartika Purana - Kartika Purana Chapter 1


🌹. కార్తీక పురాణం ప్రారంభం🌹

🌴. కార్తీకపురాణం 1 అధ్యాయం 🌴

🌻. కార్తీక మాసం విశేషం🌻

📚. ప్రసాద్ భరద్వాజ



🌹.  Beginning of Kartika Purana🌹

🌴. Kartika Purana Chapter 1 🌴

🌻. Special features of Kartika month🌻

📚. Prasad Bharadwaja


ఒకరోజు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో ఇలా కోరారు… ”ఓ మహాత్మా… మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను, వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత, కార్తీకపురాణ ఫలితాలను కూడా వివరించండి..” అని కోరారు.

శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు… ”ఓ పునిపుంగవులారా… ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోకసంచారి అయిన నారదమహాముని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో, పరలోకంలో సకలైశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి” అని చెప్పసాగాడు.

పూర్వం ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఆకాశమార్గంలో విహరిస్తుండగా… పార్వతి దేవి పరమశివుడితో ”ప్రాణేశ్వరా… సకల ఐశ్వర్యాలను కలుగజేసి, మానవులంతా కులమత తారతమ్యం లేకుండా, వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతమేదైనా ఉంటే వివరించండి” అని కోరింది.

అంతట పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు ”దేవీ! నీవు అడిగే వ్రతమొక్కటి ఉంది. అది స్కంధపురాణంలో ఉప పురాణంగా విరాజిల్లుతోంది. దానిని వశిష్ట మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలానగరం వైపు చూడు….” అని ఆ దిశగా చూపించాడు.

మిథిలానగరంలో వశిష్టుడి రాకకు జనకమహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్లు కడిగి, ఆ నీటిని తన తలపై జల్లుకుని ఇలా అడుగుతున్నాడు ”ఓ మహామునివర్యా… మీ రాకవల్ల నేను, నా శరీరం, నా దేశం, ప్రజలు పవిత్రులమయ్యాము. మీ పాద ధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడకు రావడానికి కారణమేమిటి?” అని కోరగా…. వశిష్ట మహాముని ఇలా చెబుతున్నాడు ”జనక మహారాజ! నేనొక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను. అందుకు కావాల్సిన ధన, సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను” అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు.

దీనికి జనకుడు ”మునిపుంగవా… అలాగే ఇస్తాను. స్వీకరించండి. కానీ, ఎంతో కాలంగా నాకొక సందేహమున్నది. మీలాంటి దైవజ్ఞులైనవారిని అడిగి సంశంయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్ది ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది? ఈ నెల గొప్పదనమేమిటి? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా?” అని ప్రార్థించారు.

వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి ”రాజ! తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకలమానవాళి ఆచరించదగినది. సకల పాపాలను హరించేది. ఈ కార్తీకమాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇదీ… అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు.. ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ, పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు….” అని చెప్పసాగాడు.


🌻. కార్తీక వ్రతవిధానం 🌻

”ఓ జనక మహారాజా! ఎవరైనా, ఏ వయసువారైనా పేద-ధనిక, తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా…. వేకువ జామున లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమాచరించి, దానధర్మాలు, దేవతాపూజలు చేసినట్లయితే… దానివల్ల అనన్యమైన పుణ్యఫలితాన్ని పొందగలరు. కార్తీకమాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ… విష్ణుసహస్రనామార్చన, శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి. ‘ఓ దామోదర నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానీయక నన్ను కాపాడు’ అని ధ్యానించి ప్రారంభించాలి” అని వివరించార
వ్రతవిధానం గురించి చెబుతూ… ”ఓ రాజా! ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, నదికిపోయి, స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారయణ, పరమేశ్వరులకు, బైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో మునిగి, సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి, పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై మూడు దోసిళ్ల నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరీ, తుంగభద్ర, యుమన తదితర నదుల్లో ఏ ఒక్కనదిలోనైనా స్నానం చేసినట్లయితే… గొప్ప ఫలితం లభిస్తుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని, శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి, నిత్యధూప, దీప, నైవేద్యాలతో భగవంతుని పూజచేయాలి.



🌹 🌹 కార్తీక పురాణం - 1

గంధము తీసి, భగవంతునికి సమర్పించి, తానూ బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి, వారికి ప్రసాదం పెట్టి, తన ఇంటివద్దగానీ, దేవాలయంలోగానీ, రావిచెట్టు మొదటగానీ కూర్చొని కార్తీకపురాణం చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి, విశాలయంలోగానీ, విష్ణు ఆలయంలోగానీ, తులసికోట వద్దగానీ, దీపారాధన చేసి, శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి, స్వామికి నివేదించాలి. అందరికీ పంచి, తానూ భుజించాలి. తర్వాతిరోజు మృష్టాన్నంతో భూతతృప్తిచేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు, మగవారు గతంలో, గతజన్మలో చేసిన పాపాలు, ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు, వీలు పడనివారు వ్రతాన్ని చూసినా, వ్రతం చేసినవారికి నమస్కరించినా… వారికి కూడా సమాన ఫలితం వస్తుంది.

ఇది స్కాంద పురాణంలోని వశిష్టమహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం. మొదటిరోజు పారాయణం సమాప్తం.

🌹 🌹 🌹 🌹 🌹


001 - కార్తీక పురాణ అధ్యాయములు (సంక్షిప్తముగా అవగాహన కొరకు) Chapters of Kartika Purana (Briefly for understanding)

🌹. కార్తీక పురాణ అధ్యాయములు 🌹

(సంక్షిప్తముగా అవగాహన కొరకు)

🌻. ప్రసాద్ భరద్వాజ



🌹. Chapters of Kartika Purana 🌹

(Briefly for understanding)

🌻. Prasad Bharadwaja



1 వ అధ్యాయము : కార్తీకమాహత్మ్యము గురించి జనకుడు ప్రశ్నించుట, వశిష్టుడు కార్తీక వ్రతవిదానమును తెలుపుట, కార్తీకస్నాన విదానము.

2 వ అధ్యాయము : సోమవార వ్రత మహిమ, సోమవార వ్రతమహిమచే కుక్క కైలాసమేగుట.

3 వ అధ్యాయము : కార్తీకస్నాన మహిమ, బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట.

4 వ అధ్యాయము : దీపారాధన మహిమ, శతృజిత్ కథ.

5 వ అధ్యాయము : వనభోజన మహిమ, కిరాత మూషికములు మోక్షము నొందుట.

6 వ అధ్యాయము : దీపదానవిధి - మహత్యం, లుబ్దవితంతువు స్వర్గమున కేగుట.

7 వ అధ్యాయము : శివకేశవార్చనా విధులు.

8 వ అధ్యాయము : శ్రీహరి నామస్మరణ ధన్యోపాయం, అజామీళుని కథ.

9 వ అధ్యాయము : విష్ణు పార్షద, యమదూతల వివాదము.

10 వ అధ్యాయము : అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము.

11 వ అధ్యాయము : మంథరుడు - పురాణమహిమ.

12 వ అధ్యాయము : ద్వాదశీ ప్రశంస, సాలగ్రామ దాన మహిమ.

13 వ అధ్యాయము : కన్యాదానఫలము, సువీరచరిత్రము.

14 వ అధ్యాయము : ఆబోతునకు అచ్చుబోసి వదులుట (వృషోసర్గము), కార్తీకమసములో విసర్జింపవలసినవి, కార్తీక మాస శివపూజాకల్పము.

15 వ అధ్యాయము : దీపప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతిలో నరరూపమొందుట.

16 వ అధ్యాయము : స్తంభదీప ప్రశంస, దీపస్తంభము విప్రుడగుట.

17 వ అధ్యాయము : అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము.

18 వ అధ్యాయము : సత్కర్మానుష్ఠానఫల ప్రభావము.

19 వ అధ్యాయము : చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణము.

20 వ అధ్యాయము : పురంజయుడు దురాచారుడగుట.

21 వ అధ్యాయము : పురంజయుడు కార్తీక ప్రభావము నెరంగుట.

22 వ అధ్యాయము : పురంజయుడు కార్తీకపౌర్ణమీ వ్రతము చేయుట.

23 వ అధ్యాయము : శ్రీరంగక్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట.

24 వ అధ్యాయము : అంబరీషుని ద్వాదశీ వ్రతము.

25 వ అధ్యాయము : దూర్వాసుడు అంబరీషుని శపించుట.

26 వ అధ్యాయము : దూర్వాసుడు అంబరీషుని శరణు వేడుట.

27 వ అధ్యాయము : దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట.

28 వ అధ్యాయము : విష్ణు (సుదర్శన) చక్ర మహిమ.

29 వ అధ్యాయము : అంబరీషుడు దూర్వాసుని పుజించుట - ద్వాదశీ పారాయణము.

30 వ అధ్యాయము : కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి.

🌹 🌹 🌹 🌹 🌹


అయ్యప్ప స్వామి పంచామృత అభిషేకం - హారతి Abhishekam of Lord Ayyappa - Aarti (a YT Short)



https://youtube.com/shorts/hOA1z_o2cEE

🌹అయ్యప్ప స్వామి పంచామృత అభిషేకం - హారతి 🌹

‎🌹Abhishekam of Lord Ayyappa - Aarti 🌹

(a YT Short)

గణపతి స్వామికి పంచామృత స్నానం - హారతి Panchamrit bath for Lord Ganapati - Aarti (a YT Short)


https://youtube.com/shorts/VSVEUNU5fUw


🌹 గణపతి స్వామికి పంచామృత స్నానం - హారతి 🌹

🌹 Panchamrit bath for Lord Ganapati - Aarti 🌹


(a YT Short)


వివిధ మంత్ర సాధనలు - Various Mantra Sadhanas


వివిధ మంత్ర సాధనలు - Various Mantra Sadhanas


🌹 🪔 వివిధ మంత్ర సాధనలు - మంత్రసాధనకు ముందు మీకు నాలుగు దిక్కులా నెయ్యి దీపాలను వెలిగించుకోవాలి , మీకు అవసరమయిన మంత్రాన్ని 11మాలలు అంటే 11×108 సార్లు పఠించాలి. 🪔🌹


● శనిదోష నివారణకు

మంత్రం :- ఓం హ్రీం శ్రీం గ్రహ చక్రవర్తినే శనైశ్చరాయ క్లీం హైమ్ సహ స్వాహ అనే మంత్రాన్ని పాటించాలి


● మహాలక్ష్మి అనుగ్రహం కొరకు

ఓం హ్రీం శ్రియం దేహి మహాలక్ష్మి ఆగచ్ఛ స్వాహా



● కుబేర అనుగ్రహం కొరకు

ఓం హ్రీం శ్రీమ్ నమో భగవతే ధనం దేహి దేహి ఓం



● ఆకస్మిక ధనప్రాప్తికి

ఓం హ్రీం శ్రీమ్ హ్రీం నమః


● నూతన గృహప్రాప్తికి లేక స్థలము ప్రాప్తికి

ఓం హ్రీం వసుధాలక్ష్మియే నమః



● శత్రునివారణకు

ఓం క్లీం శని దేవాయ శతృశమనం కురు కురు ఫట్



● విద్యాభివృద్ధికి

ఓం ఐం క్రీమ్ ఐం ఓం



● అన్నపూర్ణ అనుగ్రహం కొరకు

ఓం హ్రీం శ్రీమ్ క్లీం అన్నపూర్ణే స్వాహా



● దీర్ఘాయుష్ష్ మరియు అనారోగ్య నివారణ

ఓం ఐం దీర్ఘాయుష్యం సిద్ధయే ఓం నమః



● సత్సంతానప్రాప్తి కొరకు

ఓం నమో భగవతే పుత్ర సుఖం సాధయ కురు కురు నమః



● ప్రమాదాలు జరుగకుండా ఉండుటకు

ఓం క్రీమ్ కాళికే హ్రూం ఫట్ స్వాహా



● ఉద్యోగప్రాప్తి కొరకు

ఓం హ్రీం కార్యసిద్ధిం ఓం నమః



● ధనప్రాప్తి కొరకు

ఓం శ్రీమ్ శ్రీమ్ మహాధనం దేహి ఓం నమః



● కీర్తి ప్రతిష్టలు

ఓం ఐం కీర్తి వృద్ధిం దేహి దేహి ఓం



● కోపం తగ్గుటకు

ఓం క్రీమ్ క్రోధం సంహారయ వస్య ఓం ఫట్



● వ్యాపార ఆకర్షణకు

ఓం శ్రీమ్ ఇం శ్రీయం సాధయ ఫట్



● భార్యాభర్తల అనురాగముకు

ఓం హ్రీం మొహితే ఆకర్షయ నమః స్వాహా



● కోర్టు కేసులలో విజయం కొరకు

ఓం హ్రూం శత్రూన్ వశ్య విజయ సిద్ధిం ఓం ఫట్



● జీవితములో కష్టములు తొలగుటకు

ఓం క్లీం శ్రీమ్ శ్రీయహ్ స్వాహా



● శ్రీఘ్ర వివాహం కొరకు

ఓం క్లీం వివాహ సిద్ధిం ఓం ఐ0 ఫట్



● నిత్య సుమంగళి గా ఉండుటకు

ఓం శ్రీమ్ సౌభాగ్యం సుమంగళాయ ఫట్



శ్రీ గణపతి స్తోత్రం - Sri Ganapati Stotram (a YT Short)



https://youtube.com/shorts/YBXgUzZ8itM?feature=share


🌹 శ్రీ గణపతి స్తోత్రం - Sri Ganapati stotram 🌹


(a YT Short)

శ్రీ రుద్రాష్టకమ్ - తాత్పర్యం - స్తోత్రం SRI RUDRASHTAKAM - MEANING



https://www.youtube.com/watch?v=DIxvtixbZbw


🌹 శ్రీ రుద్రాష్టకమ్ - తాత్పర్యం - స్తోత్రం SRI RUDRASHTAKAM - MEANING 🌹

గానం, స్వరకర్త, ప్రచురణ : ప్రసాద్‌ భరధ్వాజ

🕉 సర్వ పాపాలను నశింప చేసి కార్యసిద్ధిని, మోక్షార్షతను కలిగించే శ్రీ తులసీదాస్ అద్భుత భక్తి స్తోత్రము. 🕉

పంచముఖ ఆంజనేయ కుంభ హారతి Panchamukha Anjaneya Kumbh Aarti (a YT Short)


https://youtube.com/shorts/gwvgRicNHDA


🌹 పంచముఖ ఆంజనేయ కుంభ హారతి 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 Panchamukha Anjaneya Kumbh Aarti 🌹

Prasad Bharadwaja


(a YT Short)

శ్రీ ఆంజనేయుని అభిషేక ధూప హారతులు Abhishekam and incense offerings of Sri Anjaneya (a YT Short)



https://youtube.com/shorts/j7McQRyK3v8?si=PzZHQUaDIvbX4hef


🌹శ్రీ ఆంజనేయుని అభిషేక ధూప హారతులు 🌹

🌹Abhishekam and incense offerings of Sri Anjaneya 🌹


(a YT Short)

🧨 దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరికి Happy Diwali 🧨



🌹🧨 ఈ దీపావళి మీ జీవితం లో వెలుగులు నింపి మీ జీవితాన్ని సుఖమయం చేయాలని కోరుకుంటూ దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరికి 🧨🌹

ప్రసాద్ భరద్వాజ



🌹🧨 Wishing you all a very happy Diwali, may this Diwali fill your life with light and happiness 🧨🌹

Prasad Bharadwaj


దీపావళి పండుగ శుభాకాంక్షలు Happy Diwali



https://youtube.com/shorts/yoIE4_Rfhzk



🌹🔥 చీకటి తరిమేస్తే దీపావళి హైందవ వెలుగు దీపావళి 🔥🌹

🧨 దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరికి 🧨

ప్రసాద్ భరద్వాజ



🌹🔥 Diwali drives away darkness, Diwali is the light of Hinduism 🔥🌹

🧨 Happy Diwali to everyone 🧨

Prasad Bharadwaj



సర్వ రోగాలను పోగొట్టే సూర్య స్తోత్రము Stotra of the Sun that cures all diseases



https://youtube.com/shorts/Mptt_uPEd6Q


🌹సర్వ రోగాలను పోగొట్టే సూర్య స్తోత్రము - శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణామామ్యహమ్ 🌹

🌹Stotra of the Sun that cures all diseases - I bow to the white lotus, the sun, I bow to it 🌹




నరకుడికి మోక్షపురి.. నరకాసురుడి వధ జరిగింది ఇక్కడే..! The demon Narakasura was killed right here..!


🌹నరకుడికి మోక్షపురి.. నరకాసురుడి వధ జరిగింది ఇక్కడే..!🌹

🌹 the demon Narakasura was killed right here..!🌹



చల్లపల్లి(కృష్ణా జిల్లా): పవిత్ర కృష్ణానదీ తీరంలోని చారిత్రక పుణ్యక్షేత్రాల్లో చల్లపల్లి మండలం నడకుదురు గ్రామం ఒకటి. నరకాసుర సంహార క్షేత్రంగా, మోక్షపురిగా చరిత్ర ప్రసిద్ధి గాంచి కాలక్రమేణా నరకొత్తూరు, నరకదూరుగా మారి నడకుదురుగా స్థిరపడింది. గ్రామంలో కృష్ణానది గర్భంలో ఉన్న శ్రీ ఫృద్వీశ్వరస్వామి ఆలయం, చెంతనే ఉన్న పాటలీవనం సందర్శనీయ స్థలాలు. నడకుదురు నరకునికి మోక్షం ప్రసాదించిన క్షేత్రంగా, మోక్షపురిగా గుర్తింపు ఉంది.


నరకాసురుడు పూజించిన స్థలం..

నారద మహాముని నరకాసురుడితో నీవు భూదేవి పుత్రుడవని తెలియజేసి, ద్విముఖుడనే రాక్షసుడిని సంహరించిన పాపాన్ని ప్రక్షాళన చేసుకునేందుకు పుష్కరకాలం స్వయంభువైన శ్రీ ఫృద్వీశ్వరుని పూజించమని సూచిస్తాడు. నరకాసురుడు ఫృద్వీశ్వరాలయానికి చేరుకుని కృష్ణానదిలో నిత్య స్నానమాచరిస్తూ 4,320 రోజుల పాటు స్వామిని పూజిస్తాడు. అదే నడకుదురు గ్రామంలోని ఫృద్వీశ్వరాలయం.


వధ జరిగింది ఇక్కడే..

నరకాసురుడి ఆగడాలతో అల్లాడిపోతున్న ముల్లోకాల వాసులను కాపాడేందుకు నరకాసురుని సంహరించ దలచిన శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై ఈ ప్రాంతంలో ఉన్న నరకాసురుడితో యుద్ధానికి దిగుతాడు. యుద్ధంలో శ్రీకృష్ణుడు మూర్చబోగా, సత్యభామ ఫృద్వీశ్వర క్షేత్రం సమీపంలో నరకాసురుని సంహరించినట్లు చారిత్రక కథనం. భూదేవికి ప్రతిరూపం, నరకాసురుని తల్లిలాంటి సత్యభామ నరకాసురునికి ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించి, నదీతీరాన పిండ తర్పణాలు వదిలినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.



కృష్ణ–భామల విహార స్థలం..

నరకాసుర సంహారం అనంతరం ఆలయం చెంతనున్న పాటలీవనంలో విశ్రాంతి తీసుకున్న శ్రీకృష్ణుడు, సత్యభామలు లక్ష్మీనారాయణుని విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు పూజలు చేసినట్లు కథనం. నడకుదురు ఆలయం వద్ద పాటలీవృక్షంకింద లక్ష్మీనారాయణుని విగ్ర హం నేటికీ భక్తుల పూజలందుకుంటోంది.


మహిమాన్వితం పాటలీవృక్షం ..

గ్రామ చారిత్రక, ఆథ్యాత్మిక వైభవానికి నిదర్శనం నడకుదురు ఫృద్వీశ్వరాలయం చెంతనున్న దేవతావనం. దేవలోక వనమాత పాటలీ వృక్షాలు దేశంలో కేవలం కాశీ తర్వాత నడకుదురులో మాత్రమే ఉన్నాయి. కరకట్ట దిగువనే నదిలో కొబ్బరిచెట్లు, పాటలీవృక్షాలు, ఉసిరిచెట్ల మధ్య ఆలయం ఉంటుంది. చుట్టూ పసుపుతోటలు, వాణిజ్య పంటలతో చల్లని వాతావరణం భక్తులకు ఆలయం స్వాగతం పలుకుతుంది. దీపావళి ప్రత్యేకత సంతరించుకుంటుంది.


నరక చతుర్దశి పురాణం కధ Naraka Chaturdashi Purana story (a YT Short)


https://youtube.com/shorts/9c7fkmBvz7Q


నరక చతుర్దశి పురాణం కధ

Naraka Chaturdashi Purana story

(a YT Short)

ధన్వంతరి జయంతి Dhanvantari Jayanti


"ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వభయవినాశాయ సర్వరోగనివారణాయ త్రైలోక్యపతయే త్రైలోక్యనిధయే శ్రీమహావిష్ణుస్వరూప శ్రీ ధన్వంతరీస్వరూప శ్రీ శ్రీ శ్రీ ఔషధచక్ర నారాయణాయ స్వాహా"🙏🪷

ఈ ధన్వంతరి జయంతి రోజున మీరు సుఖ, శ్రేయస్సు, ఆరోగ్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

On this Dhanvantari Jayanti, I sincerely wish you happiness, prosperity, and good health.

Prasad Bharadwaj


🏹 నరకాసుర వధ నరక చతుర్దశి కధ 🏹 Narakasura's killing story 🏹 (a YT Short)



https://youtube.com/shorts/ZGVaQ2h0kWU


🌹 🏹 నరకాసుర వధ నరక చతుర్దశి కధ 🏹🌹

🌹 🏹 Narakasura's killing story 🏹🌹


(a YT Short)


శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంచే ధన్వంతరి మహా మంత్రము - Dhanvantari Maha Mantra that increases physical and mental health



https://youtube.com/shorts/6qGGafH0aBA?si=HgYTsumUx_gQovy3

‎
🌹శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంచే ధన్వంతరి మహా మంత్రము 🌹
🌹Dhanvantari Maha Mantra that increases physical and mental health 🌹


(a YT Short)


మీకు మీ కుటుంబ సభ్యులకు నరకచతుర్దశి శుభాకాంక్షలు 🏹 Happy Naraka Chaturdashi to you and your family members 🏹


🌹🏹 మీకు మీ కుటుంబ సభ్యులకు నరకచతుర్దశి శుభాకాంక్షలు 🏹🌹

ప్రసాద్ భరద్వాజ


🌹🏹 Happy Naraka Chaturdashi to you and your family members 🏹🌹

Prasad Bharadwaj