శయన శ్రీ మహావిష్ణు అభిషేకం హారతి Sri Maha Vishnu Abhishek (a YT Short)



https://youtube.com/shorts/5zIjTGkLiek


🌹 శయన శ్రీ మహావిష్ణు అభిషేకం హారతి    Sri Maha Vishnu Abhishek 🌹

ప్రసాద్ భరద్వాజ


(a YT Short)



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹 🌹 🌹 🌹


కార్తీక మాసం 11వ రోజు చేయవలసినవి Things to do on the 11th day of Kartik month (a YT Short)



https://youtube.com/shorts/oZDGxrcLTHI


🌹 కార్తీక మాసం 11వ రోజు చేయవలసినవి. 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Things to do on the 11th day of Kartik month. 🌹
Prasad Bharadwaja

(a YT Short)



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


కార్తీక పురాణం - 11 : 11 వ అధ్యాయము : మంధరుడు - పురాణ మహిమ Kartika Purana - 11 : Chapter 11: Mandhara - The Glory of the Legend

🌹. కార్తీక పురాణం - 11 🌹
🌻 11 వ అధ్యాయము : మంధరుడు - పురాణ మహిమ 🌻
📚. ప్రసాద్ భరద్వాజ


🌹. Kartika Purana - 11 🌹
🌻 Chapter 11: Mandhara - The Glory of the Legend 🌻
📚. Prasad Bharadwaja


రాజోత్తమా! తిరిగి చెప్పెదను వినుము. కార్తీకమాసమందు అవిసె పువ్వుతో హరిని పూజించిన వాని పాపములు నశించును. చాంద్రాయణవ్రత ఫలము పొందును.

కార్తీకమాసమందు గరికతోను, కుశలతోను హరిని పూజించువాడు పాపవిముక్తుడై వైకుంఠమును జేరును. కార్తీకమాసమందు చిత్రరంగులతో గూడిన వస్త్రములను హరికి సమర్పించినవాడు మోక్షమునొందును. కార్తీకమాసమందు స్నానమాచరించి హరిసన్నిధిలో దీపమాలలనుంచువాడును, పురాణమును జెప్పువాడును, పురాణమును వినువాడును పాపములన్నియును నశింపజేసుకొని పరమపదమును బొందుదురు.

ఈ విషయమై యొక పూర్వకథగలదు. అది విన్న మాత్రముననే పాపములు పోవును. ఆయురారోగ్యములనిచ్చును. బహు ఆశ్చర్యకరముగా నుండును. దానిని చెప్పెద వినుము.

కళింగదేశమందు మంధరుడను నొక బ్రాహ్మణుడు గలడు. అతడు స్నాన సంధ్యావందనాదులను విడిచి పెట్టినవాడై ఇతరులకు కూలి చేయుచుండెడివాడు.

అతనికి మంచిగుణములు గలిగి సుశీలయను పేరుగల భార్యయుండెను. ఆమె పతివ్రతయు, సమస్త సాముద్రిక లక్షణములతో గూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలైయుండెను.

ఓరాజా! ఆసుశీల భర్త దుర్గుణ పూర్ణుడైనను అతనియందు ద్వేషమునుంచక సేవించుచుండెను. తరువాత వాడు వేరైన జీవనోపాయము తెలియక కూలిజీవనము కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకొని యుండి దారి నడుచువారిని కొట్టి వారి ధనములనపహరించుచు కొంతకాలమును గడిపెను. అట్లు చౌర్యమువలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆధనముతో కుటుంబమును పోషించుచుండెను. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యముకొరకు మార్గమును కనిపెట్టియుండి మార్గానవచ్చునొక బ్రాహ్మణుని పట్టుకొని మర్రిచెట్టుకు కట్టి అతని సొమ్మంతయును హరించెను. ఇంతలోనే క్రూరుడైన కిరాతుడొకడు వచ్చి ఆ యిద్దరు బ్రాహ్మణులను చంపి ఆధనమంతయు తాను హరించెను. తరువాత గుహలోనున్న పెద్దపులి కిరాత మనుష్యగంథమును ఆఘ్రాణించి వచ్చి వానిని కొట్టెను. కిరాతుడును కత్తితో పులిని కొట్టెను. ఇట్లు ఇద్దరును పరస్పర ప్రహారములచేత ఒక్కమారే చనిపోయిరి. ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతుడు నలుగురు ఒక చోట మృతినొంది యమలోకమునకు బోయి కాలసూత్ర నరకమందు యాతన బడిరి. యమభటులు వారినందరిని పురుగులతోను, అమేధ్యముతోను కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసలకాగుచున్న రక్తమందు బడవైచిరి. జనకమహారాజా! ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను ఆచారవంతురాలై హరిభక్తియుతయై సజ్జన సహవాసమును జేయుచు నిరంతరము భర్తను ధ్యానించు చుండెను.

ఓ రాజా! ఇట్లుండగా దైవవశము చేత ఒక యతీశ్వరుడు హరినామముచేయుచు నాట్యముచేయుచు పులకాంకితశరీరుడై హరినామామృతమును పానముచేయుచు సమస్త వస్తువులందు హరిని దర్శించుచు ఆనంద భాష్పయుతుడై ఆమె యింటికి వచ్చెను. ఆమెయు ఆయతిని జూచి భిక్షమిడి అయ్యా యతిపుంగవా! మీరు మాయింటికి వచ్చుటచేత నేను తరించితిని. మీవంటివారి దర్శనము దుర్లభము. మాయింటివద్ద నా భర్తలేడు. నేనొక్కదాననే పతిధ్యానమును చేయుచున్నదానను. ఆమె యిట్లుచెప్పగా విని యతీశ్వరుడు ప్రియభాషిణియు శ్యామయునయిన ఆమెతో ఇట్లనియెను. అమ్మాయీ! ఈరోజు కార్తీక పూర్ణిమ మహాపర్వము. ఈదిన సాయంకాలము హరిసన్నిధిలో మీయింటిలో పురాణ పఠనము జరుపవలెను, ఆపురాణమునకు దీపముకావలెను. నూనె తెచ్చెదను. గనుక వత్తి నీవు చేసిఇమ్ము. శ్యామయనగా యౌవనవతియని అర్థము. యతీశ్వరుడిట్లు చెప్పగా ఆచిన్నది విని సంతోషముతో గోమయముతెచ్చి ఆయిల్లు చక్కగా అలికినదై అందు అయిదురంగులతో ముగ్గులను బెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసినదై ఆదూదిచే రెండు వత్తులను జేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించెను. ఆచిన్నది దీపపాత్రను, వత్తిని తాను యిచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించెను. యతియు ఆదీపమునందు హరిని బూజించి మనశ్శుద్ధి కొరకై పురాణ పఠన మారంభించెను.

ఆమెయు ప్రతి యింటికి బోయి పురాణ శ్రవణమునకు రండని చాలామందిని పిలుచుకుని వచ్చి వారితో సహా ఏకాగ్రమనస్సుతో పురాణమును వినెను. తరువాత యతీశ్వరుడు యధేచ్ఛగా పోయెను. కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతినొందెను. అంతలో శంఖచక్రాంకితులును, చతుర్బాహులును, పద్మాక్షులును, పీతాంబరధారులునునైన విష్ణుదూతలు దేవతల తోటలోనున్న పుష్పములతోను, ముత్యాలతోను, పగడములతోను, రచించిన మాలికలతోను, వస్త్రములతోను, ఆభరణములతోను అలంకరించబడిన విమానమును దీసికొని క్వచ్చి సూర్యుడువలె ప్రకాశించెడి ఆవిమానమందు ఆమెను ఎక్కించి జయజయధ్వనులతో కరతాళములు చేయుచు చాలామంది వెంటరాగా వైకుంఠలోకమునకు చేరెను. ఆమె వైకుంఠమునకుబోవుచు మధ్యమార్గమందు నరకమును జూచి అచ్చట తనపి నరకమునందు ఉండుటకు ఆశ్చర్యమొంది విష్ణుదూతలతోనిట్లు పలికెను.


🌹 🌹. కార్తిక పురాణం - 11

ఓ విష్ణుదూతలారా! నిమిషమాత్రము ఉండండి. ఈనరకకూపమునందు నా భర్త ముగ్గురితో పడియుండుటకు కారణమేమి? ఈవిషయమును నాకు జెప్పుడు. వీడు నీభర్త, వీడు కూలిచేసియు, దొంగతనమును జేసియు పరధనాపహరణము జేసినాడు. వేదోక్తమయిన ఆచారమును వదలి దుర్మార్గమందు చేరినాడు. అందువల్ల వీడు నరక మందున్నాడు.

ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మహాపాతకుడు, ఇతడు బాల్యము నుండి మిత్రుడైయున్న వాి నొకనిని చంపి వానిధనము అపహరించి ఇతరదేశమునకు బోవుచున్నంతలో నీభర్తచేత హతుడాయెను. అట్టి పాపాత్ముడు గనుక ఇతడు నరకమందు బడియున్నాడు. ఈమూడవవాడు కిరాతుడు. వీడు నీభర్తను యీబ్రాహ్మణుని యిద్దరిని చంపినాడు. అందుచేత వీడు నరకమందుండెను. ఈనాల్గవవాడు, పులి, కిరాతులు పరస్పర ఘాతములచేత మృతినొందిరి. ఈపులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు. ఇతడు ద్వాదశినాడు భక్ష్యాభక్ష్య విచారణ చేయక నూనెతో చేసిన వంటకములను భుజించినాడు. అందుచేత వీడు నరకమందున్నాడు. ఇట్లు నలుగురు నరకమందు యాతనలనొందుచున్నారు. ద్వాదశినాడు నేయి వాడవలెను. నూనె వాడకూడదు. విష్ణుదూతలిట్లు చెప్పగా విని ఆమె అయ్యలారా, ఏపుణ్యము చేత వీరు నరకమునుండి ముక్తులగుదురని యడిగెను. ఆమాటవిని దూతలిట్లనిరి. అమ్మా! కార్తీకమాసమందు నీచేత చేయబడిన పుణ్యమందు పురాణశ్రవణఫలమును నీభర్తకిమ్ము. దానితో వాడు విముక్తుడగును. ఆపురాణశ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వర్తి పుణ్యమును ఈ కిరాతవ్యాఘ్రములకు సమానముగానిమ్ము. దానివలన వారు ముక్తులగుదురు.

పురాణశ్రవణార్థమై నీవు ప్రతిగృహమునకు బోయి ప్రజలను బిలిచిన పుణ్యమును ఈకృతఘ్నునకిమ్ము. దానితో వాడు ముక్తుడగును. ఇట్లు ఆయా పుణ్యదానములచేత వారు వారు ముక్తులగుదురు. విష్ణుదాతలమాటలు విని ఆశ్చర్యమొంది బ్రాహ్మణస్త్రీ ఆయా పుణ్యములను వారివారికిచ్చెను. దానిచేత వారు నరకము నుండి విడుదలయై దివ్యమానములనెక్కి ఆస్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందెడి ముక్తిపదమును గూర్చి వెళ్ళిరి. కాబట్టి కార్తీకమాసమందు పురాణశ్రవణమును జేయువాడు హరిలోకమందుండును.

ఈ చరిత్రను వినువారు మనోవాక్కాయములచేత సంపాదించబడిన పాపమును నశింపజేసుకొని మోక్షమును బొందుదురు.

ఇతి శ్రీస్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ఏకాదశోధ్యాస్సమాప్తః

🌹 🌹 🌹 🌹 🌹

కార్తీక మాసం 11వ రోజు పూజించ వలసిన దైవం God to be worshipped on the 11th day of Karthika month


🌹కార్తీక మాసం 11వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


నిషిద్ధములు:- పులుపు, ఉసిరి

దానములు:- వీభూదిపండ్లు, దక్షిణ

పూజించాల్సిన దైవము:- శివుడు

జపించాల్సిన మంత్రము:-

ఓం రుద్రాయస్వాహా, ఓం నమశ్శివాయ

🌹 🌹 🌹 🌹 🌹




🌹God to be worshipped on the 11th day of Karthika month - Mantra to be recited - Donation - Offering 🌹

Prasad Bharadhwaja



Prohibited things:- Sourdough, Uradhika

Donations:- Veebhudi fruits, Dakshina

God to be worshipped:- Shiva

Mantra to be chanted:-

Om Rudrayaswaha, Om Namashshivaya

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ కనకదుర్గాదేవి నవవిధ మహా హారతి NavavVidha Harathi - Navavidha Maha Aarti of Sri Kanaka Durga Devi (a YT Short)



https://youtube.com/shorts/xAbrDY9ZqlI


🌹 శ్రీ కనకదుర్గాదేవి నవవిధ మహా హారతి NavavVidha Harathi 🌹

🌹 Navavidha Maha Aarti of Sri Kanaka Durga Devi 🌹

(a YT Short)



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹 🌹 🌹 🌹


కార్తీక మాసం 10వ రోజు చేయవలసినవి. Things to do on the 10th day of Karthika month. (a YT Short)



https://youtube.com/shorts/4FModcSwc4E


కార్తీక మాసం 10వ రోజు చేయవలసినవి.

Things to do on the 10th day of Karthika month.


(a YT Short)



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹



చాలా అరుదైన శ్రీ లక్ష్మి కుబేర అమ్మవారి నిజ అభిషేకం హారతి Abhishekam Aarti of Goddess Lakshmi Kubera (A YT Short)



https://youtube.com/shorts/-qCTuPW9OvI


🌹 చాలా అరుదైన శ్రీ లక్ష్మి కుబేర అమ్మవారి నిజ అభిషేకం హారతి 🌹

🌹 Abhishekam Aarti of Goddess Lakshmi Kubera 🌹


  (A YT Short)



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹

అష్టలక్ష్మి స్తోత్రం - తాత్పర్యం - Ashta Lakshmi Stotram - FV 6 (A YT Video)



https://youtu.be/_6WhgnTqEyw


🌹 అష్టలక్ష్మి స్తోత్రం - తాత్పర్యం - ASHTA LAKSHMI STOTRAM - FV 6 - Prasad Bharadwaj 🌹

ప్రసాద్‌ భరధ్వాజ




Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹

కార్తీక పురాణం - 10 : 10 వ అధ్యాయము : అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము. Kartika Purana - 10 : Chapter 10: The story of Ajamila's previous birth


🌹. కార్తీక పురాణం - 10 🌹

🌻 10 వ అధ్యాయము : అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము. 🌻

📚. ప్రసాద్ భరద్వాజ


🌹. Kartika Purana - 10 🌹

🌻 Chapter 10: The story of Ajamila's previous birth. 🌻

📚. Prasad Bharadwaja



జనక ఉవాచ: 'వశిష్ఠా! ఈ అజామిళుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన యిలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూత లెందుకూరుకున్నారు? వాళ్లు యమునికి యేమని విన్నవించారు. అన్నీ సవిస్తరంగా చెప్పు.'

విశిష్ట ఉవాచ : నీవడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమములో సమాధానాలు చెబుతాను విను. విష్ణుపారిషదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి యిలా చెప్పసాగారు.

🌻. యమదూతల ఆరోపణము - యముని ఉపదేశము 🌻

'అయ్యా పాపాత్ముడునూ, దురాచారుడునూ, నిందిత కర్మాచరణపరుడూ అయిన అజామిళుని యందలి జీవుని తెచ్చే సమయంలో - విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి, అతనిని మానుంచి విడిపించి, తమతో వైకుంఠానికి తీసికొని వెళ్లారు. వాళ్లను యెదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము' అని కింకరులు చెప్పినది విని, రవంత క్రోధోద్రిక్తుడైన సమవర్తి జ్ఞానదృష్టితో సమస్తాన్నీ అవలోకించినవాడై - కింకరులారా! కించిదపి పుణ్యవిహీనోపి - ఆ ఆజామిళుడనే పాపి, అంత్యకాలాన హరి నామస్మరణమును చేయడము వలన సమస్త పాపాలనూ నశింపచేసుకుని, విష్ణుప్రియుడై, విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు. తెలిసి తాకినా - తెలియక తాకినా దహించవలెనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులనూ అగ్నిదహించునో అదే విధముగా - దుష్టాత్ములై, మహిమను తెలుసుకోలేక పోయినా - ఆ శ్రీహరి యొక్క నామస్మరణమును చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడి పోతాయి. ఇక, భక్తిభావముతో స్మరించినవారు కేవలము కైవల్య పథగాములే అవుతారు' అంటూ సేవకులను ఎంతవరకూ చెప్పాలో అంతవరకూ మాత్రమే చెప్పి - యముడు మరింత పూర్వాలోచనా పరుడయ్యాడు.

🌻. అజామిళుని పూర్వజన్మ 🌻

అజామిళుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్రదేశములో శివార్చకుడుగా వుండేవాడు. ఆ జన్మలో కూడా స్నానసంధ్యాచరనాది రహితుడూ, దైవేతరచిత్తుడూ, దైవద్రవ్యాపహరి అయి వుండేవాడు. బ్రహ్మణుడయివుండి కూడా ఆయుధపాణియై, దుష్టులతో స్నేహమును చేస్తూ తిరిగేవాడు. అర్చకుడయివుండీ కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్చావిహారాలు చేసేవాడు. బహుభాషియై యవ్వనములో వుండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రహ్మణుడుండేవాడు, అతడు దరిద్రపీడితుడై- అన్నము కొరకై పట్టణములు, పల్లెలు తిరుగుతూ - యాయవార వృత్తిని అవలంబించి వున్నాడు. ఒకానొకసారి అతగాడు తనకు లభించిన యాయవార వస్తుజాలాన్నంతటినీ మోసుకునివచ్చి భార్యను పిలిచి - 'చాలా ఆకలిగా వుంది. సత్వరమే వంటచేయి. ముందు కాసిని మంచినీళ్లియ్యి. అవి త్రాగి రవంత ఉపశాంతిని పొందుతాను' అన్నాడు. కాని, యౌవనమదాశ్రితయై వున్న ఆ యిల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ వుండిపోయింది. అందుకు కోపించిన భర్త, చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు.

తన కామపు ఆలోచనలకు అంతరాయమును కలిగించాడనే కోపంతో తన ముష్టితో ఘాతించింది. అడలీ-బడలీవున్న ఆ బాపడు అందుకై పరితాపంతో ఆమెనూ, గృహాన్నీ వదిలిపెట్టి గ్రామాంతరము వెళ్లి, భిక్షాటనతో బతకసాగాడు. మగడు యిల్లువదలి వెళ్లిపోవడంతో మరింత తెగించిన ఆ జారిణి - మగడు తెచ్చినవన్నీ సుష్ఠుగా మేసి, మగడిచ్చినవన్నీ అలంకరించుకుని, మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకుని, తాంబూల చర్వణము చేస్తూ - ఒకానొక రజకుని యింటికి వెళ్లి - ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరినది. కాని, నీతిమంతుడైన ఆ రజకుడు. ఆమె కోరిన తప్పుడుపనికి అంగీకరించకపోవడంతో - వారిద్దరికి వాగ్వివాదం జరిగింది. అంతటితో వాంచితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణజారిణి వీధినపడి రసికులను వెతుక్కుంటూ - పోతూ ఇతఃపూర్వం చెప్పబడిన ఈశ్వరాలయార్చకుని చూసి - సురత క్రీడలకాహ్వానించింది. బ్రహ్మణుడైన వీడు - ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా - అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారిణి సద్వంశ సంజాత అయిన కారణంగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై - భర్తను వెతుక్కుంటూ వెళ్లి బ్రతిమాలి తెచ్చుకుని అది మొదలుగా అతని మాటలకు 'తు-చ' తప్పకుండా బ్రతుకసాగింది.


🌹. కార్తీక పురాణం - 10

ఇటువంటి పాపాలవలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాల ననుభవించి, అనుభవించి - సత్యనిష్ఠుడి కొడుకైన అజామిళుడుగా జన్మించి - కార్తీక పౌర్ణమినాటి శివసందర్శనం - అంత్యకాల హరిస్మరణల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు.

ఆనాటి శివార్చకుని జన్మలో - ఇతనితో జారత్వం నెరపిన బ్రాహ్మణ జారిణి కూడా కొంతకాలానికి మరణించి, నరకానుభవమును పొంది - కన్యాకుబ్దములోని ఛండాల గృహములో బాలికగా జన్మించింది. కాని ఆ - పిల్ల - తండ్రి గండాన పుట్టడం వలన - వాళ్లా పిల్లను అడవిలో వదలివేశారు. ఆ వనాంతర్గామియైన ఒకా బ్రహ్మణుడా బాలిక అరణ్యరోదన విని, జాలిపడి, తనతో తీసికొని వెళ్లి, తన యింటి దాసీకి పెంపకానికిచ్చాడు. ఆ దాసీదాని దగ్గర పెరిగిన ఈ పిల్లనే అనంతర కాలంలో అజామిళుడు దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా! నువ్వడిగిన అజామిళుడి పూర్వగాథ ఇది. సమస్తమైన పాపములకూ హరినామా స్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు. అది సాధ్యము కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి వుంటుంది.

జనక నరపాలా! ఎవరిజిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరి చరణాల నాశ్రయించదో, ఎవరి చెవులు, శ్రీహరి సంకీర్తనల నాలకించవో వాళ్ల పాపాలు ఏ విధముగానూ కూడా నశించే అవకాశము లేదు. ఎవరైతే ఇతర చింతలన్నిటినీ విడిచి పెట్టి విష్ణువునే ధ్యానిస్తూ వుంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహము లేదు! మోక్షాసక్తులను మురహరి స్మరణ మేవిధంగా సూక్ష్మమార్గమో - అదే విధముగా కార్తీక ధర్మాచరణమనే సూక్ష్మమార్గము కూడా మహొత్కృష్ట పుణ్యప్రదాయినియై - పాతకాలను పారద్రోలుతుంది. పాపాలను నశింపజేసేశక్తి ఈ కార్తీక వ్రతాచరణకకు మాత్రమే వుండడము వలన, ఎవరైతే ఈ దివ్వవ్రతాన్ని ఆచరించరో, వాళ్లు నరక ప్రాప్తులవుతారని తెల్సుకో. పాపనాశనియైన ఈ కార్తీక మహత్మ్యన్ని శ్రద్దా భక్తులతో వినినప్పటికీ కూడా - వారు మోక్షార్హులే అవుతున్నారు. ఆసక్తులైనవారికి - పావన హృదయంతో యీ మహత్మ్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు.

ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే దశమోధ్యాయ స్సమాప్త:

🌹 🌹 🌹 🌹 🌹


కార్తీక మాసం 10వ రోజు పూజించ వలసిన దైవం Gods to be worshipped on the 10th day of Kartik month


🌹కార్తీక మాసం 10వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ



నిషిద్ధములు:- గుమ్మడికాయ, నూనె, ఉసిరి

దానములు:- గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె

పూజించాల్సిన దైవము:- దిగ్గజాలు

జపించాల్సిన మంత్రము:-

ఓం మహామదేభాయ స్వాహా

🌹🌹🌹🌹🌹





🌹Deity to be worshipped on the 10th day of Karthika month - Mantra to be recited - Donation - Offering 🌹

Prasad Bharadhwaja


Prohibited things:- Pumpkin, oil, amla

Donations:- Pumpkin, self-cooked food, oil

Deity to be worshipped:- Giants

Mantra to be chanted:-

Om Mahamadebhaya Swaha

🌹🌹🌹🌹🌹


లక్ష్మీ వల్లభ నారాయణుని దశావతారాలు The ten incarnations of Lakshmi Vallabha Narayana (a YT Short)



https://youtube.com/shorts/cqIZvmZru3A



🌹 లక్ష్మీ వల్లభ నారాయణుని దశావతారాలు 🌹

🌹 The ten incarnations of Lakshmi Vallabha Narayana 🌹

(a YT Short)


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹




కార్తీకంలో విష్ణుప్రీతికి ఈ 21 అవతారాలను ఒక్కసారి స్మరిస్తే చాలు In Kartika, just remembering these 21 avatars for Vishnu's devotion is enough (a YT Short)



https://youtube.com/shorts/1MBdyWFHEa0



🌹 కార్తీకంలో విష్ణుప్రీతికి ఈ 21 అవతారాలను ఒక్కసారి స్మరిస్తే చాలు. 🌹

🌹 In Kartika, just remembering these 21 avatars for Vishnu's devotion is enough. 🌹



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


ముకుందమాల స్తోత్రం - తాత్పర్యము Mukunda Mala Stotram



https://youtu.be/TIkDVyPMoC8


🌹 ముకుందమాల స్తోత్రం - తాత్పర్యము MUKUNDA MALA STOTRAM by Prasad Bharadwaj 🌹

శ్రీ కులశేఖర్ ఆళ్వార్ విరచితం

🎻. ప్రసాద్‌ భరధ్యాజ


Like, Subscribe and Share


https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹



కార్తీక పురాణం - 9 : 9 వ అధ్యాయము : విష్ణు పార్షద, యమదూతల వివాదము Kartika Purana - 9 : Chapter 9: Vishnu Parshada, Yamadootala dispute


🌹. కార్తీక పురాణం - 9 🌹

🌻 9 వ అధ్యాయము : విష్ణు పార్షద, యమదూతల వివాదము. 🌻

📚. ప్రసాద్ భరద్వాజ


🌹. Kartika Purana - 9 🌹

🌻 Chapter 9: Vishnu Parshada, Yamadootala dispute. 🌻

📚. Prasad Bharadwaja


యమదూతల ప్రశ్నలకు చిరునగవుమోము కలవారైన విష్ణుదూతలు యిలా భాషించసాగారు, 'ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు? పుణ్యాత్ములెవరు? యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి?'

విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలిలా సమాధానమీయసాగారు. "సూర్యచంద్రాగ్ని వాయురాకాశ గోసంధ్యలూ దశదిశా కాలాలూ, వీనిని మానవుల యొక్క పాప పుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము.

ఓ విష్ణుదేవతలారా! శ్రద్ధగా వినండి - వేదమార్గాన్ని విడిచిన స్వేచ్చాచారులూ, సాధుజన బహిష్కృతులూ యమదండనార్హులు. బ్రహ్మణునీ, గురువునీ, రోగినీ పాదాలతో తాడించేవాడు - తల్లిదండ్రులతో కలహించేవాడూ, అసత్యవాదీ, జంతుహింసకుడూ, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడూ, డాంబికుడూ, దయారహితుడూ, పరభార్యాసంగాముడూ, సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబించేవాళ్లనీ, చేసినదానాన్ని బైటపెట్టుకునే వానినీ, మిత్రద్రోహినీ, కృతఘ్నులనీ, ఇతరుల పురుష సంతతిని చూసి యేడ్చేవానినీ, కన్యాశుల్కాలతో జీవించేవానినీ, వాపీకూప తటాకాది నిర్మాణాటంకపరులనీ, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను విడచినవానినీ, కేవలం భోజనం గురించే ఆలోచించేవానినీ, బ్రహ్మణాశ్వ గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మాచేత దండించబడుతూంటారు. ఇక ఈ అజామిళుడంటారా? వీడు చేయని పాపమంటూ లేదు. బ్రహ్మణ జన్మమెత్తి, దాసీ సంగమ లోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికెలా అర్హుడు!"


యమదూతల సమాదానాన్ని విని - విష్ణుపార్షదులిలా చెప్పసాగారు.

"ఓ యమదూతలారా! ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణము వలన గాని దుస్సంగమాన్ని వదలి సత్సంగమములో కలిసేవాడు, నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్యా జపహోమ తత్సరుడూ మీ యమలోక గమనానికి అర్హులు కారు.

ఓ యమదూతలారా! అసూయారహితులై, జపాగ్నిహోత్ర నిర్వాహకులై, సర్వ కర్మలనూ సగుణ బ్రహ్మార్పణము చేసేవారు - జలాన్నగోదాతలు. వృషోత్సర్జనా కర్తలూ యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాత (గురువులు), పరోపకార శీలురు, హరిపూజాప్రియులు, హరినామ జాపకులూ, వివాహ - ఉపనయనాలను చేయించే వారూ - అనాథ ప్రేత సంస్కారకర్తా - వీళ్లెవరూ మీ యమదండనల కర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి, తత్తీర్థాన్ని పానము చేసే వాడూ - తులసీకాష్ఠ మాలికలను ధరించేవాడూ, వివేవాడూ - సూర్యుడు మేష - తులా - మకర సంక్రాంతులందుండగా ప్రాతఃస్నానమును ఆచరించేవాళ్లూ - వీళ్లెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసిగాని - తెలియకగాని హరినామ సంకీర్తనమును చేసే వాళ్లు - పాపవిముక్తులవుతారు. ఓ యమదూతలారా! ఇన్నిమాటలెందుకు? ఎవడైతే అవసానకాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు.

ఈ విధముగా సాగుతున్న యమ, విష్ణుదూతల సంవాదాన్నంతటినీ వినిన అజామిళుడిలోని జీవుడు - తన శారీరక కృతదాసీ సాంగత్యాది పాపాలను తలంచుకుని దుఃఖిస్తూన్న జీవుడు - స్పృహామయుడై అచ్చెరువందాడు. "ఇదేమి ఆశ్చర్యం? ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతులు ఏమై పోయారు? నేనీ వైకుంఠములో యెలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వపై హరినామమెలా వచ్చింది? నాకీ వైకుంఠము ఎలా ప్రాప్తించింది?" అని తనలో తనే అనుకుంటూ హరిస్మరణమును చేయసాగాడు. కాబట్టి రాజా! కేవల హరినామస్మరణమే అంతటి ముక్తిప్రదమైనది. కాగా- హరి ప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే యెంత పుణ్యం కలుగుతుందో వూహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు.

ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే నవమోధ్యాయ స్సమాప్త:

🌹 🌹 🌹 🌹 🌹

కార్తీక మాసం 9వ రోజు పూజించ వలసిన దైవం Gods to be worshipped on the 9th day of Kartik month

🌹కార్తీక మాసం 9వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹
ప్రసాద్‌ భరధ్వాజ


నిషిద్ధములు:- నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి
దానములు:- మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు
పూజించాల్సిన దైవము:- అష్టవసువులు -
పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము:- ఓం అమృతాయ స్వాహా - పితృదేవతాభ్యో నమః



🌹Gods to be worshipped on the 9th day of Kartik month - Mantra to be recited - Donation - Naivedyam 🌹
Prasad Bharadhwaja



Prohibited things:- Oily items, Udhu
Donations:- Your favorite Pitru Tarpanas
God to be worshipped:- Ashtavasu -
Pitru Devas
Mantra to be chanted:- Om Amrutaya Swaha - Pitru Devatabhyo Namah

షష్ఠి కవచము - సుబ్రహ్మణ్య స్వామి పంచామృత స్నానం హారతి Shashti Kavacham - Subrahmanya Swami Panchamruta Snana Aarti (a YT Short)



https://youtube.com/shorts/-JLTdwqzYwo


🌹షష్ఠి కవచము - సుబ్రహ్మణ్య స్వామి పంచామృత స్నానం హారతి 🌹

🌹Shashti Kavacham - Subrahmanya Swami Panchamruta Snana Aarti 🌹


(a YT Short)


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹



శుక్లాాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం Shuklambharadharam Vishnum Shashivarnam Chaturbhujam (a YT Short)



https://www.youtube.com/shorts/gWSBrLoQktE


🌹 శుక్లాాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 🌹

🌹 Shuklambharadharam Vishnum Shashivarnam Chaturbhujam 🌹


(a YT Short)




Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹



ఇరుముడి కట్టు శబరిమలైకి నీ అభిషేకం అయ్యప్పకి Irumudi Kattu, offering to Lord Ayyappa at Sabarimala


https://youtube.com/shorts/ARBdKHmzUoA


🌹 ఇరుముడి కట్టు శబరిమలైకి నీ అభిషేకం అయ్యప్పకి 🌹

Irumudi Kattu, offering to Lord Ayyappa at Sabarimala



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹

కార్తీక మాసం 8వ రోజు పూజించ వలసిన దైవం God to be worshipped on the 8th day of Karthika month


🌹కార్తీక మాసం 8వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం

దానములు:- తోచినవి - యథాశక్తి

పూజించాల్సిన దైవము:- దుర్గ

జపించాల్సిన మంత్రము:-

ఓం - చాముండాయై విచ్చే - స్వాహా

🌹 🍀 🌹 🍀 🌹 🍀




🌹God to be worshipped on the 8th day of Karthika month - Mantra to be recited - Donation - Naivedyam 🌹

Prasad Bharadhwaja



Prohibited things:- Onion, Uva, Alcohol, Meat

Donations:- Tochinavi - Yathashakti

God to be worshipped:- Durga

Mantra to be chanted:-

Om - Chamundaai Vichche - Swaha

🌹 🍀 🌹 🍀 🌹 🍀




కార్తీక పురాణం - 8 : 8 వ అధ్యాయము : శ్రీహరి నామస్మరణ ధన్యోపాయం, అజామీళుని కథ. Kartika Purana - 8 : Chapter 8: Chanting the Name of Srihari and the Story of Ajamila

🌹. కార్తీక పురాణం - 8 🌹

🌻 8 వ అధ్యాయము : శ్రీహరి నామస్మరణ ధన్యోపాయం, అజామీళుని కథ. 🌻

📚. ప్రసాద్ భరద్వాజ



🌹. Kartika Purana - 8 🌹

🌻 Chapter 8: Chanting the Name of Srihari and the Story of Ajamila. 🌻

📚. Prasad Bharadwaja



వశిష్టుడు చెప్పినదంతా విని జనకుడు అడుగుతున్నాడు: 'మహర్షీ! మీరు చెప్పినవన్నీ వినిన తరువాత నాకొక సందేహము కలుగుతోంది. వర్ణసాంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జనులు వేదత్రయోక్తాలయిన ప్రాయశ్చిత్తాలను చేసుకొననిదే పరిశుద్ధులు కారు' అని సమస్త ధర్మ శాస్త్రాలలోను ఘోషిస్తుండగా, కేవలం కార్తీక వ్రతాచరణా ధర్మలేశము చేతనే సమస్త పాపాలూ హరించుకుని పోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలోని మర్మమేమిటి? ఇది యెలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్య మాత్రము చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి? గండ్రగొడ్డళ్లతో కూడా కూలనేయ సాధ్యముగాని మహాపర్వతాన్ని కేవలము కొనవ్రేలి గోటితో కూల్చడము సాధ్యమవుతుందా? అగ్ని దగ్ధమవుతూన్న యింటిలో ఉన్నవాడు ఆ మంట మీద పురిషెడు నీళ్లు జల్లినంత మాత్రాన, అగ్ని ప్రమాదము తొలగిపోతుందా? ఏ మహానదీ ప్రవాహములోనో కొట్టుకుని పోయే వారిని ఓ పాటి గడ్డిపరక గట్టుకు చేర్చగలుగుతుందా ? తనకు తానై కొండచరియలలోని ఏ లతాసూత్రాన్నే పట్టుకున్నంత మాత్రము చేతనే నదీపాతవేగాన్నుంచి సంరక్షించబడతాడా? వశిష్ఠా! ఈ విధమైన దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్లు సహితము అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణము వలన పాపరహితులూ, పుణ్యాత్ములూ ఎలా అవుతారు ? వీటికి సమాధానమేమిటి ?

జనకుడి ప్రశ్నకు జ్ఞానహసమును చేస్తూ - ఇలా చెప్పసాగాడు వశిష్ఠుడు.


🌻. జనకుని ప్రశ్నలకు వశిష్ఠుని జవాబు

వశిష్ఠ ఉవాచ:

మంచి విమర్శే చేశావు మహారాజా! చెబుతాను విను. ధర్మాన్ని సూక్ష్మముగా చింతించాలేగాని, స్ధూలరూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. అదిగాక, వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మసూక్ష్మాలను మనకందిస్తున్నాయి. ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను - స్వల్ప పుణ్యాలు గొప్పవిగానూ పరిణమిస్తూంటాయి. ధర్మాలన్నీ గుణత్రయముతో కూడుకుని స్వల్ప నల్పతలను సిద్ధింపచేసుకుంటాయి. మూల ప్రకృతియైన 'మహామాయ' కారణంగా సత్వర జస్తమస్సులనే మూడు గుణాలు కూడా ఏర్పడ్డాయి. వీటిలో సత్వగుణ ప్రధానమైనవి ధర్మసూక్ష్మాలు. కర్మకాండ, తపస్సు, ప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణం వలన ఏర్పడ్డాయి.

తర్కము- దైవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు, ఆచరించే దానధర్మాలు, ఇవన్నీ కూడా ధర్మము యొక్క స్ధూలస్వరూపాలు. ఇవి తమోగుణము వలన యేర్పడతాయి. వీటిల్లో - సత్వగుణ ప్రధానముగా ఆచరించే ధర్మాలు స్వల్పముగా తోచినప్పటికీ దేశకాలయోగ్యతాదుల వలన విశేష ఫలాలను ఇస్తాయి. 'దేశము' అంటే పుణ్యక్షేత్రం, కాలము అంటే పుణ్యకాలము. యోగ్యత అంటే - పాత్రత. బ్రహ్మజ్ఞత కలవాళ్లు ఈ మూడింటినీ చింతించకుండా చేసే సర్వధర్మాలూ తమాసాలు - వీటివలన పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు. వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలని వేరే చెప్పనక్కరలేదు కదా! జనకరాజా! అన్నిటికి కర్మమే మూలము. ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలుంటాయి. అయినప్పటికి మనిషికి జ్ఞానము అనేది ఉన్నందువలన ఆచరంచే ధర్మాలను పై మూడింటితో పోల్చుకుని ప్రయత్న పూర్వకముగానైనా ఆచరించాలి. ఈ విధంగా మూడు కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము అక్షయ ఫలితాన్నిస్తుంది. రాజా! పర్వతమంత యెత్తు కట్టెలను పేర్చి, వాటి మధ్య గురివింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే -ఆ అగ్నికణము ఆ కట్టెలనెలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపము ఆ ఇంటి చీకట్లనెలా తొలగిస్తుందో, గుండిగెడు మురికినీళ్లను ఒక్క ఇండుపగింజ ఎలా శుభ్రపరుస్తుందో - అదే విధంగా తెలిసిగాని, తెలియకగాని పుణ్యకాలములో, పుణ్యక్షేత్రములో పుణ్యమూర్తుల వలన ఆచిరంచే ధర్మము అనంత పాపాలనూ దగ్ధం చేసి, మోక్షానికి మార్గాన్ని వేస్తుంది. ఇందుకుదాహరణగా ఒక కథ చెబుతాను విను.

🌻. అజామిళో పాఖ్యానము 🌻

బహుకాలం పూర్వం కన్యాకుబ్జక్షేత్రవాసీ, సార్ధక నామధేయుడూనైన సత్యనిష్ఠుడనే బ్రాహ్మణునికి అజామీళుడనే కుమారుడుండేవాడు. వాడు పరమ దురాచారుడు. దాసీ సాంగత్యపరుడు, హింసా ప్రియుడుగా వుండేవాడు. సాటి బ్రాహ్మణ గృహములోని ఒకానొక దాడితో సాంగత్యమును పెట్టుకొని, తల్లిదండ్రులను మీరి ఆ దాసీ దానితోనే భోజన శయానాదులన్నిటినీ నిర్వర్తిస్తూ, కామాంధుడై వైదిక కర్మలన్నింటినీ విడచిపెట్టి, కేవల కామాసక్తుడై ప్రవర్తించసాగాడు. తద్వారా బంధువులంతా అతనిని వదలివేశారు. కులము వాళ్లు వెలివేశారు. అందువలన యిల్లు వదలిపెట్టి పోవలసి వచ్చిన అజామిళుడు ఛండాలపువాడలోని ఒకానొక దాసీ దానితో కాపురము పెట్టి, కుక్కలనూ, మృగాలనూ ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బతికకే జనాలలో లీనమై, మధుమాంస సేవనా లోలుడై కాలమును గడపసాగాడు.


కార్తీక పురాణం - 8

ఇలా వుండగా, ఒకనాడతని ప్రియురాలైన దాసీది, కల్లు తాగడం కోసం తాడిచెట్టునెక్కి, కమ్మ విరగడం వలన క్రిందపడి మరణించింది. అజామిళుడు అమితంగా దుఃఖించాడు.

అప్పటికే ఆ దాసీ దానికి యవ్వనవతియైన కూతురు వుంది. మహాపాపాత్ముడూ, మహా కామాంధుడూ అయిన అజామిళుడు, తనకి కూతురు వరుసని కూడా తలచకుండా - ఆ పిల్లనే వరించి, ఆమెతోనే కామోపభాగాలనుభవించసాగాడు. కాముకుడైన అజామిళుడు, తన కూతురి యందే అనేక మంది బిడ్డలను పొందాడు. కాని వాళ్లందరూ కూడా పసికందులుగా కడతేరిపోగా, కడగాపుట్టి మిగిలిన బిడ్డకు 'నారాయణ' అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు. తాను తింటున్నా, నిదురిస్తున్నా ఏం చేస్తున్నాసరే - సతతం అతనినే స్మరించుకుంటూ 'నారాయణా - నారాయణా' అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ వుండేవాడు. కాలము గడచి అజామిళుడు కాలము చేసే సమయము ఆసన్నమైంది. అతడిలోని జీవుని తీసుకొని పోయేందుకుగాను - ఎర్రని గడ్డములు - మీసములు కలిగి, చేత దండపాశాలను ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు.

వారిని చూస్తూనే గడగడలాడి పోయిన అజామిళుడు, ఆ ప్రాణావసాన వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక, ఎక్కడో దూరముగా స్నేహితులతో ఆటలలో మునిగి వున్న కుమారునికోసమై 'నారాయణా, ఓ నారాయణా! తండ్రి నారాయణా'! అని పలుమారులు పిలవసాగాడు.

ఆ పిలుపు అతడి కొడుకుకు వినబడలేదు. అతను రానూ లేదు. కాని చేరువకు వచ్చిన యమదూతలు ఆ 'నారాయణ' నామస్మరణను విని వెనుకకు జంకారు. అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు - 'ఓ యమదూతలారా! అడ్డు తొలగండి. ఇతడు మాచే తీసుకొని పోబడదగినవాడేగాని, మీరు తీసుకొని వెళ్లదగిన వాడు కాదు' అని హెచ్చరించారు. వికసిత పద్మాలవలే విశాలమైన నేత్రాలు కలవాళ్లూ, పద్మమాలాంబర వసనులూ అయిన ఆ పవిత్ర విష్ణుపారిషదులను చూసి, విభ్రాంతులైన యమదూతలు 'అయ్యా! మీరెవరు? యక్ష గంధర్వ సిద్ద చారణ కిన్నెర విద్యాధరులలో ఏ తెగకు చెందిన వారు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మము రీత్యా తీసికొని వెళ్ళనున్న ఈ జీపుని మీరెందుకు తీసికొని వెడుతున్నారు?' అని అడగడంతో, విష్ణుదూతలులిలా చెప్పసాగారు.


ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే

అష్టమ అధ్యాయౌ స్సమాప్తః

🌹 🌹 🌹 🌹 🌹



శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం Sri Panchamukha Hanuman Stotram


https://youtu.be/yTxNXAqLr10


🌹 శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం 🌹

శత్రు బాధలు, పిశాచ బాధలు, ఆరోగ్య సమస్యలు వున్నవారు ప్రతినిత్యము అత్యంత శ్రద్ధతో శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం మూడుసార్లు పఠించిన, వారికి తప్పక శుభములు చేకూరగలవు. - గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ

తప్పక వీక్షించండి. హనుమంతుని దివ్య ఆశీస్సులు పొందండి.





🌹 Sri Panchamukha Hanuman Stotram 🌹

Those who are troubled by enemies, spirits, or health problems, if they sincerely recite the Sri Panchamukha Hanuman Stotram three times daily, they will undoubtedly receive blessings. - Sung and composed by: Prasad BharadwajBe sure to watch. Receive the divine blessings of Hanuman.




Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


ప్రసిద్ధ "శైవక్షేత్రాలైన పంచారామాల" The famous "Pancharamas, the Shaivite sites"


🌹🔱 కార్తీక మాసంలో "ప్రసిద్ధ "శైవక్షేత్రాలైన పంచారామాల విశేషాలు" తెలుసుకుందాం 🔱🌹
ప్రసాద్‌ భరధ్వాజ


🌹🔱 Let's learn about the famous 'Shaiva temples of Pancharama' during the Kartika month 🔱🌹
Prasad Bharadwaj


🌺🔱ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధమైన "శైవక్షేత్రాలను", "పంచారామాలు' అని పిలుస్తారు. 'పంచారామాలు' ఏర్పడుటకు కారణం స్కందపురాణంలో ఇలా వివరించబడి యున్నది.

🌺🔱 The famous 'Shaiva temples' in Andhra Pradesh are called 'Pancharama'. The reason for the formation of 'Pancharama' is explained in the Skanda Purana.




🌺🔱పూర్వం.. తారకాసురుడు అను రాక్షసుడు, 'శివుని' గురించి ఘోర తపస్సు చేసి 'శివుని' ఆత్మలింగము సంపాదిస్తాడు. దీనితో వీర గర్వముతో, దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా, ఇందుకు దేవతలు, విష్ణుమూర్తిని ప్రార్ధించగా, 'శివపార్వతుల' వల్ల కలిగిన కుమారుడు "కుమారస్వామి" వల్లనే తారకాసురుని వధించుట సాధ్యపడుతుందని తెలిపి "కుమారస్వామిని" యుద్ధానికి పంపుతారు. యుద్ధము నందు "కుమారస్వామి", తారకాసురుని కంఠంలో గల 'ఆత్మలింగమును' చేధిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ 'లింగమును' చేధిస్తాడు. దీనితో తారకాసురుడు మరణిస్తాడు.

🌺🔱 చేధిoచే సమయంల్లో, ఆ.. 'ఆత్మలింగము' వేరై, ఐదు ప్రదేశములలో పడుతాయి. తరువాత వాటిని ఆ పడిన ప్రదేశాలలోనే దేవతలు లింగ ప్రతిష్ఠ కావించారు.. కనుక ఈ అయిదు 'క్షేత్రాలను', 'పంచారామాలు' అని పిలుస్తారు..

🕉 1. దాక్షారామము 🕉

పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని "భీమేశ్వరుడు" అని పిలుస్తారు. స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పై అంతస్తు నుండి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు మరిఇయు సగభాగం నలుపుతో ఉంటుంది.

ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు. ఈ ఆలయం చాళుక్యరాజయిన, భీముడు నిర్మించాడని పురాణాలలో చెప్పబడి యున్నది. అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. పూర్వకాలంలో ఎంతో మంది దేవతలు, రాజులు స్వామి వారిని దర్శించుకొని, తరించారని తన 'భీమేశ్వర పురాణంలో' చెప్పబడి యున్నది. ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ "మహాశివరాత్రి" పర్వదినం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.


🕉 2. అమరారామము 🕉

పంచారామల్లో రెండవదైన 'అమరారామము', గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానదీతీరమునందు వెలసినది. ఇక్కడ స్వామిని "అమరేశ్వరుడు" అని పిలుస్తారు. గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో, తెల్లగా మెరుస్తూ ఉంటుంది.

ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది. అమరేశ్వరుడైన 'ఇంద్రుడు' చేత ప్రతిష్టించి ఈ ఆలయానికి తన నగరమైన అమరావతి పేరునే పెట్టారు అని పురాణాలలో చెప్పబడి యున్నది.


🕉 3. క్షీరారామము 🕉

క్షీరారామము, పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు. ఇక్కడ 'శివుని' మూర్తిని "శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి" అని పిలుస్తారు. ఇక్కడ స్వామివారిని త్రేతాయుగ కాలంలో 'సీతారాములు' కలిసి ప్రతిష్ఠించారట. ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కధ ఉంది.

'శివుడు' తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమి నుండి పాలధార వచ్చిందట. క్షీరం అనగా పాలు, దీనిమూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది. క్రమంగా 'క్షీరపురి' కాస్తా 'పాలకొల్లుగా' మార్పు చెందింది. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. ఆలయం 125 అడుగుల ఎత్తులో '9' గోపురాలుతో కట్టబడింది.

🕉 4. సోమారామము 🕉

పంచరామాల్లో నాల్గవదైన "సోమారామము". పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో గల గునిపూడిలో కలదు. ఇక్కడ స్వామి వారిని "సోమేశ్వరుడు" అని పిలుస్తారు. ఇచ్చట 'శివలింగానికి' ఒక ప్రత్యేకత ఉంది. మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే 'శివలింగం', అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది.

ఇక్కడ స్వామిని 'చంద్రుడు' ప్రతిష్టించాడు. చంద్రునిచే ప్రతిష్ఠించ బడినది కావున దీనికి 'సోమారామము' అని పేరు వచ్చింది.

🕉 5. కుమారభీమారామము 🕉

పంచారామాల్లో చివరిది, 5వది అయిన 'కుమారభీమారామము', తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు. ఇక్కడ స్వామిని "కాల బైరవుడు" అని పిలుస్తారు.

ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన, చాళుక్య రాజయిన భీముడు ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇక్కడి 'శివలింగం' సున్నపురాయితో చేసినదిలాగా ఉంటుంది. ఈ ఆలయంలో "మహశివరాత్రి" ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

🌹🌹🌹🌹🌹

జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర Hail Hanuman, the ocean of wisdom and virtues (a YT Short)



https://youtube.com/shorts/YBh3LbRlLOM



🌹 జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర 🌹

🌹 Hail Hanuman, the ocean of wisdom and virtues 🌹



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹



కార్తీక మాసం 7వ రోజు పూజించ వలసిన దైవం The god to be worshipped on the 7th day of Kartika month


🌹కార్తీక మాసం 7వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ



నిషిద్ధములు:- పంటితో తినే వస్తువులు, ఉసిరి

దానములు:- పట్టుబట్టలు, గోధుమలు, బంగారం

పూజించాల్సిన దైవము:- సూర్యుడు

జపించాల్సిన మంత్రము:- ఓం. భాం. భానవే స్వాహా

🌹 🍀 🌹 🍀 🌹 🍀



🌹Gods to be worshipped on the 7th day of Karthika month - Mantra to be recited - Donation - Offering 🌹

Prasad Bharadhwaja



Prohibited things:- Things eaten with teeth, amla

Donations:- Silk, wheat, gold

God to be worshipped:- Sun

Mantra to be chanted:- Om. Bham. Bhanve Swaha

🌹 🍀 🌹 🍀 🌹 🍀


కార్తీక పురాణం - 7: అధ్యాయము 7: 7. శివకేశవార్చనా విధులు Kartika Purana - 7: Chapter 7: 7. Methods of Worshiping Shiva-Keshava


🌹. కార్తీక పురాణం - 7 🌹

అధ్యాయము 7

🌻 7. శివకేశవార్చనా విధులు. 🌻

📚. ప్రసాద్ భరద్వాజ


🌹. Kartika Purana - 7 🌹

Chapter 7

🌻 7. Methods of Worshiping Shiva-Keshava 🌻

📚. Prasad Bharadwaj



'ఓ జనక రాజేంద్రా! కల్మషఘ్నమైన కార్తీక మహాత్మ్యంలో పుష్పార్చనా- దీప విధానాలను చెబుతాను విను.


🌻. పుష్పార్చనా ఫలదాన దీపవిధి - విశేషములు:


ఈ కార్తీక మాసములో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించటం వలన కమలాసనియైన లక్ష్మిదేవి ఆ భక్తుల యిండ్ల స్ధిరావాస మేర్పరచుకుంటుంది. తులసీ దళాలతోగాని, జాజిపువ్వులతోగాని, మారేడు దళాలతో గాని పూజించేవారు తిరిగి యీ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకములో భక్తియుతులైన పండ్లను దానము చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్లవలె చెదరిపోతాయి. ఉసిరిచెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరిజూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీకములో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీదళాలతో పూజిస్తారో, వారికి మించిన ధన్యులెవరూ ఉండరనడం అతిశయోక్తి కాదు.

బ్రాహ్మణ సమేతులై, ఉసిరిచెట్టు వున్న తోటలో - వనభోజనమును చేసేవారి మహాపాతకాలు సైతము మట్టిగలసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరిచెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువువలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసములో విష్ణ్వాలయములో మామిడాకుల తోరణం కడతారో, వాళ్లు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతోగాని, అరటి స్తంభాలతో గాని మండపము కట్టినవాళ్లు వైకుంఠములో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండప్రణామమును చేసిన వాళ్లు అశ్వమేథ పుణ్యవంతులవుతారు. విష్ణువున కెదురుగా జప, హొమ దేవతార్చనలు చేసే వాళ్లు పితరులతో సహా వైకుంఠానికి వెళ్లి సుఖిస్తారు. స్నానము చేసి తడిబట్టలతోనున్న వానికి పొడిబట్టని దానము చేసిన వాడు పదివేల అశ్వమేథాల ఫలాన్ని పొందుతాడు. ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి - పుష్పము పరాగమువలె యెగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసెపూలతో హరిపూజను చేసిన వారికి పదివేల యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది.

కార్తీకమాసమందు యే స్త్రీ అయితే బృందావనాన గోమయంతో అలికి, పంచరంగులతోనూ, శంఖ- పద్మ- స్వస్తికాదిరంగ వల్లులను తీరుస్తుందో ఆమె విష్ణువుకు ప్రియురాలవుతుంది. విష్ణు సన్నిధిలో నందా దీపాన్ని ఆర్పించడం వలన కలిగే పుణ్యాన్ని వేయినోళ్ల అదిశేషుడైనా పొగడలేడు. ఈ కార్తీకమాసములో శివుని జిల్లేడుపూలతో పూజించినవాడు దీర్ఘయువై, అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. విష్ణ్వాలయములో మండపాన్ని అలంకరించినవారు హరి మందిరములో చిరస్దాయిగా వుంటారు. హరిని మల్లెపువ్వులతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమై పోతాయి. తులసీ గంధముతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వసంచిత పాపాలన్నీ నాశనమై పోతాయి. భక్తియుక్తులై అన్నదానమును చేసే వారి పాపాలు గాలికి మంచుతునకలలా యెగిరిపోతాయి. ప్రత్యేకించి కార్తీక మాసములో నువ్వుల దానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము ఈ నాలుగూ ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ వుంది. స్నాన దానాదులను నాచరింపనివారూ, లోభియై యధాశక్తిగా చేయని వారు నూరు జన్మలు కుక్కగా పుట్టి, తదుపరి నూరుపుట్టుకలూ శునకయోనిని జన్మిస్తారు.

కార్తీకమాసములో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలాన్ని భేదించుకుని స్వర్గానికి వెడతారు. పద్మాలతో పూజించినవారు చిరకాలము సూర్యమండలములోనే నివసిస్తారు. ఓ జనక మహారాజా! కార్తీక మాసములో యెవరైతే అవిసె పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గధిపతులవుతారు. మాల్యములు - తులసీదళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక్క సూక్ష్మాన్ని చెబుతాను విను, అశక్తులయిన వాళ్లు.


శ్లో || కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచరేత్ !

మాసస్నానేన యత్సుణ్యం తత్పుణ్యం లభతేనృప !!

శ్లో|| ఆద్యేంతియే తిథౌ మధ్యమే చ దినే యః స్నానమాచరేత్ !

మాస స్నాన ఫలం తేన లభ్యతే నాత్ర సంశయః !!


కార్తీకమాసంలో ఆదివారం నాడు లేదా శుక్ల పాడ్యమి నాడు గాని, పూర్ణమనాడు గాని, అమావ్యానాడు గాని సంకల్పరహితముగా ప్రాతఃస్నాన మాచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానము చేసిన పుణ్యం లభిస్తుంది. 'ఆ పాటి శక్తి కూడా లేని వాళ్లు కార్తీకమాసము నెల రోజులూ ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా, వినినా కూడా స్నానఫలాన్ని పొందుతారు. ఇది కేవలం ఆశక్తులకే సుమా! మహీశా! కార్తీకమాసములో యితరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవారి పాపాలు నశించిపోతాయి.


🌹 🌹. కార్తిక పురాణం - 7

కార్తీకమాసము విష్ణుపూజార్ధమై యితరులకు సహకరించేవారు స్వర్గాన్ని పొందుతారు. తాము స్వయంగా సంకల్ప పూర్వకముగా విష్ణువును పూజించేవాళ్ళు అవ్యయ పదాన్ని పొందుతారు. కార్తీకమాసము సాయంకాలాలలో దేవాలయాలలో శివ - విష్ణుస్తోత్రాలను పఠించేవారు - కొంతకాలము స్వర్గలోకములో వుండి - అనంతరము ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతీ! కార్తీక మాసములో యెవరైతే హరిహరులను స్మరించకుండా వుంటారో వాళ్లు ఏడుజన్మలపాటు నక్కలుగా పుడతారనడంలో ఏమీ సందేహము లేదు.


ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే సప్తమోధ్యాయ స్సమాప్త:

🌹 🌹 🌹 🌹 🌹