శుభకార్యాలకు ముందు కొబ్బరికాయ 🥥 కొట్టడం ఎందుకు? Why is a coconut broken before auspicious occasions?


🌹🥥 శుభకార్యాలకు ముందు కొబ్బరికాయ కొట్టడం ఎందుకు? – ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సంప్రదాయ కారణాలు 🥥🌹

✍️ ప్రసాద్ భరద్వాజ


హిందూ ధర్మాచరణలో ప్రతి ఆచారానికి ఒక లోతైన భావం, అంతర్గత అర్థం ఉంటుంది. శుభకార్యాలకు ముందు కొబ్బరికాయ కొట్టడం కూడా అలాంటి ఒక మహత్తర సంప్రదాయం. పూజ, గృహప్రవేశం, కొత్త వాహన ప్రారంభం, వ్యాపార ఆరంభం, వ్రతాలు, యాత్రలు వంటి ఏ కార్యమైనా “శుభారంభం” కావాలంటే ముందుగా కొబ్బరికాయను కొట్టడం ఆనవాయితీగా మారింది. ఇది కేవలం అలవాటు కాదు — ఆధ్యాత్మికం, పురాణం, మానసిక శాస్త్రం అన్నీ కలిసిన ఒక సారవంతమైన ఆచారం.


🥥 కొబ్బరికాయ – ప్రతీకాత్మక అర్థం 🥥

🍀 అహంకార త్యాగం 🍀

కొబ్బరికాయపై ఉండే గట్టి చిప్ప మనిషిలోని అహంకారం, మమకారం, కఠినత్వాన్ని సూచిస్తుంది. లోపల ఉన్న తెల్లటి గుజ్జు శుద్ధమైన మనస్సు, నిర్మలమైన భక్తి, సత్త్వగుణాన్ని ప్రతిబింబిస్తుంది. కాయను పగలగొట్టడం అంటే — “నా అహంకారాన్ని విడిచిపెట్టి, నన్ను నీకు అర్పిస్తున్నాను” అన్న భావాన్ని దైవానికి అర్పించడం.


🔱 త్రిమూర్తుల సంకేతం (శ్రీఫలం) 🔱

కొబ్బరికాయపై కనిపించే మూడు కళ్లు బ్రహ్మ–విష్ణు–మహేశ్వరులను సూచిస్తాయి. అందుకే దీన్ని శ్రీఫలం అంటారు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసాదించే ఫలంగా భావించి, శుభకార్యాల్లో తప్పనిసరిగా ఉపయోగిస్తారు.

🕉 పురాణ మరియు ధార్మిక నేపథ్యం - బలి సంప్రదాయానికి ప్రత్యామ్నాయం:

ప్రాచీన కాలంలో దేవతలకు బలులు ఇచ్చే ఆచారం ఉండేది. కాలక్రమేణా అహింసా భావన బలపడటంతో, జంతు బలికి ప్రత్యామ్నాయంగా కొబ్బరికాయను ప్రవేశపెట్టారు. ఇది రక్తరహిత బలి — పాపభయాన్ని తొలగించి, సాత్విక శక్తిని ఆహ్వానించే మార్గం.


🕉 గణపతికి ప్రీతికరం 🕉

శుభారంభానికి అధిపతి గణపతి. కొబ్బరికాయ గణపతికి అత్యంత ప్రీతికరమని విశ్వాసం. అందుకే కార్యారంభంలో ముందుగా కొబ్బరికాయను కొట్టి, విఘ్నాలు తొలగిపోవాలని ప్రార్థిస్తారు.


🌿 శాస్త్రీయ, మానసిక కోణం 🌿

కొబ్బరికాయను కొట్టే సమయంలో మనస్సు ఒక క్షణం ప్రశాంతం అవుతుంది. “ఇప్పుడే నేను కొత్త కార్యాన్ని ప్రారంభిస్తున్నాను” అనే స్పష్టమైన మానసిక సంకల్పం ఏర్పడుతుంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచి, కార్యసిద్ధికి అనుకూలమైన మనస్థితిని కలిగిస్తుంది.


👩‍🦰 కొన్ని చోట్ల మహిళలు కొబ్బరికాయ కొట్టరనే నమ్మకం ఎందుకు వచ్చింది? 👩‍🦰

కొన్ని సంప్రదాయాల్లో మహిళలు కొబ్బరికాయను పగలగొట్టరు. కొబ్బరికాయను విత్తనంగా, సృష్టి శక్తికి ప్రతీకగా భావిస్తారు. మహిళలు సహజంగా గర్భం దాల్చి జీవాన్ని ఇవ్వడం అనే సృష్టి సామర్థ్యం కలిగి ఉంటారు . అందువల్ల మహిళలు సృష్టి శక్తికి నిలయమని భావించి, విత్తనాన్ని పగలగొట్టడం సృష్టి నాశనంతో సమానమని ఒక నమ్మకం. అయితే ఇది ప్రాంతీయ సంప్రదాయం మాత్రమే. అంతేకాక కొబ్మరికాయ పెంకు కఠినంగా వుంటుంది, సున్నితంగా వుండే స్త్రీలకు పగలగొట్టడం కష్టంగా వుంటుంది కనుక వద్దంటారు అని కొంతమంది ఆధినికుల మాట. అయితే ఈ ఆధునిక కాలంలో చాలా చోట్ల మహిళలు కూడా కొబ్బరికాయ కొడుతున్నారు — దీనిని అశుభంగా పరిగణించరు.


🔔 ఇతర ఆధ్యాత్మిక ప్రయోజనాలు & నమ్మకాలు 🔔

💸 ఆర్థిక శ్రేయస్సుకు: ఎర్రటి గుడ్డలో కొబ్బరికాయను చుట్టి లక్ష్మీదేవి వద్ద ఉంచితే ధనప్రవాహం పెరుగుతుందని విశ్వాసం.

👁 దృష్టి దోష నివారణ: కొబ్బరికాయను తల చుట్టూ తిప్పి కొట్టడం వల్ల చెడు దృష్టి తొలగిపోతుందని నమ్మకం.

శని, రాహు–కేతు దోషాలకు: శనివారం ఎండు కొబ్బరికాయను దానం చేయడం లేదా నియమాలతో నదిలో వదలడం దోషశాంతికి ఉపకరిస్తుందని చెబుతారు.

వాస్తు శుద్ధికి: కొత్త ఇల్లు లేదా కార్యాలయంలో ప్రవేశించే ముందు కొబ్బరికాయ కొట్టడం వల్ల ప్రతికూల శక్తులు తొలగుతాయని భావిస్తారు.

కొబ్బరికాయ కొట్టడం అనేది కేవలం సంప్రదాయం కాదు — అది మన అంతర్మనస్సును శుద్ధి చేసే ఒక సంకేత క్రియ. అహంకార త్యాగం, భక్తి సమర్పణ, శుభశక్తుల ఆహ్వానం — ఈ మూడింటి సంగమమే ఈ ఆచారం. ప్రతి శుభారంభం వెనుక ఉన్న ఈ సూక్ష్మ తత్త్వాన్ని తెలుసుకుని ఆచరిస్తే, ఆ కార్యానికి ఆధ్యాత్మిక బలం తప్పక చేకూరుతుంది.

🥥 ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేటప్పుడు – కేవలం చేతితో కాదు, మనస్సుతో కూడా సమర్పించండి. 🥥

🌹🌹🌹🌹🌹


18వ పాశురం Part 1- తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 18 Pasuram - Part 1 - Tiruppavai Pasuras Bhavartha Gita



https://youtube.com/shorts/mzqE3T2_HpQ


🌹 18వ పాశురం Part 1- తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 18 Pasuram - Part 1 - Tiruppavai Pasuras Bhavartha Gita 🌹

🍀 18వ పాశురము - నీళాదేవి మేల్కొలుపు – అనుగ్రహ ఆశా గీతం. 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 18వ పాశురంలో నంద గోపులు మొదలుగా బలరాముని వరకు మేల్కొలిపి తలుపులు తీయమని ప్రార్ధించినను వారు తెరువక పోవుట చేత, నందుని కోడలూ, కృష్ణప్రియ అయిన నీళాదేవిని గోపికలంతా నిద్ర లేపుతున్నారు. కృష్ణుడు ఆమె ప్రేమకు కట్టుబడినవాడు కదా! నీళాదేవితో వెళితే స్వామి త్వరగా అనుగ్రహిస్తాడని వారి ఆశ. 🍀

Like, Subscribe and Share

తప్పకుండా వీక్షించండి

🌹🌹🌹🌹🌹


'భజరే నంద గోపాల హరే మురళీ గానలోలా దిగిరా కృష్ణా' / 'Bhajare nanda goplala hare' (a devotional YT Short)



https://youtube.com/shorts/KalEYREhR_Y


🌹 భజరే నంద గోపాల హరే మురళీ గానలోలా దిగిరా కృష్ణా Bhajare nanda goplala hare 🌹


ప్రసాద్‌ భరధ్వాజ

తప్పకుండా వీక్షించండి

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


17వ పాశురం - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 17th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita



https://youtube.com/shorts/PMsl0zxHv3c


🌹17వ పాశురం - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 17th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita 🌹

🍀 17వ పాశురం – గోకుల గృహ మేల్కొలుపు – అవతార గీతం. 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 ఈ 17వ పాశురంలో, ద్వారాపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించగా, భవనంలోకి ప్రవేశించిన గోపికలు మొదట ఆ నారాయణునకే జననీ జనకులైన, యశోదా నందులను, బలశాలి బలరాముని, యదుకుల భూషణమైన కన్నయ్యను నిద్ర లేపుతూ వారి కృపను వేడుచున్నారు. 🍀

తప్పకుండా వీక్షించండి

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹



ఆలయ దర్శనం తర్వాత వెంటనే చేతులు–కాళ్లు కడగాలా? Should one wash their hands & feet immediately after visiting the temple?



🌹 ఆలయ దర్శనం తర్వాత వెంటనే చేతులు–కాళ్లు కడగాలా? సంప్రదాయం ఏమి చెబుతోంది 🌹
✍️ ప్రసాద్ భరధ్వాజ


🌹 Should one wash their hands & feet immediately after visiting the temple? What does tradition say? 🌹
✍️ Prasad Bharadwaj




భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఆలయ దర్శనానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గుడికి వెళ్లడం అంటే కేవలం పూజ చేసి రావడం మాత్రమే కాదు; మనసును శుద్ధి చేసుకుని, లోపల ఉన్న అశాంతిని తగ్గించుకునే ఒక ప్రక్రియగా పెద్దలు భావించారు. ఈ క్రమంలో, గుడి దర్శనం పూర్తయ్యాక వెంటనే చేతులు, కాళ్లు కడగకూడదని కొందరు పండితులు సూచిస్తుంటారు. ఆలయంలో గడిపిన సమయంలో మన శరీరం, మనస్సు ఒక సానుకూల స్థితిలోకి వెళ్తాయని, అక్కడి దైవసన్నిధి వల్ల ఏర్పడిన పవిత్రతను వెంటనే నీటితో తొలగించకూడదనే భావన దీనికి ఆధారం. అందుకే ఈ విషయంపై చాలామందిలో సందేహాలు ఏర్పడుతుంటాయి.

పండితుల వివరణ ప్రకారం, గుడిలో చేసే ప్రదక్షిణలు, పూజా విధానాలు కేవలం శారీరక చర్యలు కావు. ఆలయ ప్రాంగణంలో నడిచే సమయంలో, పాదాలు అక్కడి పవిత్ర నేలను తాకడం ద్వారా ఒక రకమైన ప్రశాంతత మన శరీరంలోకి చేరుతుందని నమ్మకం. అలాగే దీపాల వెలుగు, ధూప వాసన, మంత్రోచ్చారణల ధ్వని కలిసి మనస్సును ఒక ధ్యాన స్థితికి తీసుకెళ్తాయని చెబుతారు. ఈ సమయంలో గ్రహించిన ఆ భావాన్ని దర్శనం పూర్తైన వెంటనే కడుక్కోవడం ద్వారా తగ్గించుకుంటే, ఆధ్యాత్మిక అనుభూతి త్వరగా మసకబారుతుందని సంప్రదాయ విశ్వాసం.

అందుకే గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతసేపు ఆ ప్రశాంతతలోనే ఉండాలని పెద్దలు సూచిస్తారు. సాధారణంగా 15 నుంచి 20 నిమిషాల వరకు చేతులు, కాళ్లు కడగకుండా ఉండటం వల్ల మనసు నెమ్మదిగా స్థిరపడుతుందని వారు భావిస్తారు. ఆలయ వాతావరణం నుంచి బయటకు వచ్చినప్పటికీ, ఆ భావోద్వేగ అనుభూతి మనతో పాటు కొనసాగాలన్న ఉద్దేశమే ఈ ఆచారం వెనుక ఉంది. ఆధునిక దృష్టితో చూస్తే, ఇది ఒక మానసిక విరామం లాంటిది. గుడి దర్శనం తర్వాత వెంటనే పనులు, ఒత్తిళ్లలో పడిపోకుండా కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండటం మనస్సుకు మేలు చేస్తుందనే భావన ఇందులో దాగి ఉంది.

అయితే దీనిని కఠిన నియమంగా తీసుకోవాల్సిన అవసరం లేదని పండితులే స్పష్టంగా చెబుతారు. పరిశుభ్రత కూడా మన సంస్కృతిలో అంతే ముఖ్యమైన అంశం. ప్రయాణం వల్ల గాని, రద్దీ ప్రాంతాల్లో తిరగడం వల్ల గాని చేతులు మురికి అయితే తప్పకుండా కడుక్కోవాలి. తినే ముందు శుభ్రంగా ఉండటం ఆరోగ్యానికి అవసరం. ఆధ్యాత్మికత పేరుతో శుభ్రతను విస్మరించడం సరైనది కాదని వారు హెచ్చరిస్తున్నారు.

మొత్తానికి, గుడి దర్శనం తర్వాత వెంటనే చేతులు–కాళ్లు కడగకూడదన్నది ఒక ఆధ్యాత్మిక సూచనగా మాత్రమే చూడాలి. ఇది ప్రతి వ్యక్తి విశ్వాసం, భక్తి లోతుపై ఆధారపడి ఉంటుంది. ఎవరి నమ్మకాలను వారు గౌరవించుకోవడం అవసరం. భక్తి మరియు పరిశుభ్రత – ఈ రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇవ్వడమే మన సంప్రదాయం యొక్క అసలైన ఆత్మ. దర్శనం తర్వాత కొంతసేపు మనసులో ఆధ్యాత్మిక ప్రశాంతతను నిలుపుకోవడం మంచిదే, అదే సమయంలో ఆరోగ్యం, శుభ్రత అవసరమైన చోట తగిన నిర్ణయం తీసుకోవడమే సమతుల్యమైన మార్గం. భక్తి అంటే అంధంగా నియమాలను పాటించడం కాదు; వాటి భావాన్ని అర్థం చేసుకుని జీవితంలో అన్వయించుకోవడమే నిజమైన భక్తి.

🌹🌹🌹🌹🌹


తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 9 - పాశురాలు 17 & 18 / Tiruppavai Pasuras Bhavartha Gita Series 9 - Pasuras 17 & 18



https://youtu.be/pv2gU4sBYds


🌹 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 9 - పాశురాలు 17 & 18 Tiruppavai Pasuras Bhavartha Gita Series 9 - Pasuras 17 & 18 🌹

🍀 17వ పాశురం – గోకుల గృహ మేల్కొలుపు – అవతార గీతం, 18వ పాశురము - నీళాదేవి మేల్కొలుపు – అనుగ్రహ ఆశా గీతం. 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ

🍀 ఈ 17వ పాశురంలో, ద్వారాపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించగా, భవనంలోకి ప్రవేశించిన గోపికలు మొదట ఆ నారాయణునకే జననీ జనకులైన, యశోదా నందులను, బలశాలి బలరాముని, యదుకుల భూషణమైన కన్నయ్యను నిద్ర లేపుతూ వారి కృపను వేడుచున్నారు. 18వ పాశురంలో నంద గోపులు మొదలుగా బలరాముని వరకు మేల్కొలిపి తలుపులు తీయమని ప్రార్ధించినను వారు తెరువక పోవుట చేత, నందుని కోడలూ, కృష్ణప్రియ అయిన నీళాదేవిని గోపికలంతా నిద్ర లేపుతున్నారు. కృష్ణుడు ఆమె ప్రేమకు కట్టుబడినవాడు కదా! నీళాదేవితో వెళితే స్వామి త్వరగా అనుగ్రహిస్తాడని వారి ఆశ. 🍀

తప్పకుండా వీక్షించండి

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


శుక్లాాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శుభ బుధవారం 'Suklam Bharadharam Vishnum Sasi Varnam' (a devotional YT Short)


https://youtube.com/shorts/BnLenONV3MY


🌹 శుక్లాాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శుభ బుధవారం Suklam Bharadharam Vishnum Sasi Varnam Prayer 🌹


ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


16వ పాశురము - తిరుప్పావై భావార్థ గీత మాలిక / 16th Pasuram - Tiruppavai Bhavartha Gita



https://youtube.com/shorts/EZEL08sHKaU


🌹 16వ పాశురము - తిరుప్పావై భావార్థ గీత మాలిక - 16th Pasuram - Tiruppavai Bhavartha Gita 🌹

🍀 16వ పాశురము - ద్వార పాలకుని ఆహ్వానం – దర్శన దీక్ష గీతం. 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 16వ పాశురంలో ఆనందముతో శ్రీ కృష్ణుని పొందే యోగ్యత కల గోపికలందరను మేలుకొని, కలిసి నంద గోప భవనమునకు వచ్చిరి. నందగోపుని భవన ద్వారమునకు వచ్చి ద్వార పాలకుని అర్ధించి లోనికి ప్రవేశించ దారి నివ్వమని ప్రార్ధిస్తున్నారు. 🍀

Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹


పుష్యమాసంలో శ్రీమహావిష్ణువుని, శనైశ్వరుణ్ణి ఆరాధిస్తే కష్టాలు తొలుగుతాయి Worshipping Lord Maha Vishnu and Lord Shani in the month of Pushya


🌹 పుష్యమాసంలో శ్రీమహావిష్ణువుని, శనైశ్వరుణ్ణి ఆరాధిస్తే కష్టాలు తొలుగుతాయి. 🌹
ప్రసాద్‌ భరధ్వాజ

🌹 Worshipping Lord Maha Vishnu and Lord Shani in the month of Pushya alleviates difficulties. 🌹
Prasad Bharadwaj

పుష్యమాసం ప్రారంభమైంది. ఈ మాసంలో నెల పడతారు. కావున కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెబుతారు. ఈ మాసంలో శనిదేవుడిని ఆరాధిస్తే విశేష ఫలితాలు వస్తాయని అంటారు.

శ్రావణ మాసం మహాలక్ష్మీ, కార్తీక మాసం శివుడు, మార్గశిర మాసం విష్ణువు ఎలాగో ఈ పుష్య మాసంలో శనిదేవుడిని పూజించాలని పురాణాలు చెబుతున్నాయి. మరి ముఖ్యంగా ఏలిననాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి. శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తే ఆ ప్రభావం తగ్గుతుంది. అలాగే ఈ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం చేసి.. నువ్వులు దానంగా ఇస్తే మంచిది. శనిదేవుడికి నువ్వులతోపాటు బెల్లం ప్రీతిపాత్రమని చెబుతారు.

శని భగవానుడు ధర్మం, న్యాయం, సత్యంలను పరిరక్షిస్తుంటాడని పురాణాలు చెబుతున్నాయి. కోర్టు వివాదాల్లో బాధపడే వారు ఈ పుష్య మాసంలో శని దేవుడిని ఆరాధిస్తే శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయని అంటారు. ఈ నెల రోజులు శనిదేవునికి నువ్వులు, బెల్లం నైవేద్యంగా సమర్పించి.. వాటిని స్వీకరిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఇక ఈ మాసంలో శని భగవానుడితో పాటు పుష్యమాసం తొలి అర్థభాగం శ్రీమహా విష్ణువును పూజిస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసీదళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ మాసంలో సోమవారం శివుడిని మారేడు దళాలతో.. ఆదివారం సూర్యుడిని జిల్లేడు పూలతో ఆర్చిస్తారు. పుష్య మాసంలో శుక్ల పక్ష షష్ఠి రోజు శ్రీవల్లీదేవ సేన సమేత శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తారు.

ఈ మాసంలో సూర్యోదయ కాంతి యోగ చైతన్యాన్ని ప్రసరిస్తుంది. మకరరాశిలో సూర్యుడు ప్రవేశించే సమయం నుంచి ఉత్తరాయణ పుణ్య కాలం ఏర్పడుతుంది. ఈ పుణ్యకాలంలో దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశగా సూర్యుడి ప్రయాణం కొనసాగుతుంది. ఈ సమయంలో సూర్య కిరణాలు ప్రత్యేకమైన తేజస్సు కలిగి ఉంటాయి. ఈ సూర్య కాంతి వల్ల ప్రజలకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

🌹🌹🌹🌹🌹

వేకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఉత్థాన ఏకాదశి Vaikunta Ekadashi Uthana Ekadasi Mukkoti Ekadasi



https://youtube.com/shorts/ErcC8ZqlZIg


🌹 వేకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఉత్థాన ఏకాదశి VAIKUNTA EKADASHI UTHANA EKADASI MUKKOTI EKADASI 🌹


తప్పక వీక్షించండి.

గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹




శ్రీ విష్ణు అష్టకము Short 1 / Sri Vishnu Ashtakam -1 (a YT Short)


https://youtube.com/shorts/aZ0d1Fez-qI

🌹 శ్రీ విష్ణు అష్టకము Short 1 - భావార్ధ సహితం - Sri Vishnu Ashtakam -1 వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో 🌹

తప్పక వీక్షించండి.

గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ

🍀🙏 విష్ణుం విశాలారుణ పద్మనేత్రం విభాంతు మీశాంబుజయోనిపూజితం|

సనాతనం సన్మతిశోధితం పరం పుమాంసమాద్యం సతతం ప్రపద్యే


విశాలమైన, ఎర్రని తామరల వంటి కన్నులు కలిగినవాడు, ప్రకాశించేవాడు, బ్రహ్మదేవునిచే పూజించబడినవాడు, సనాతనుడు, సన్మతులచేత పరిశోధించబడిన పరమాత్మ, ఆదిపురుషుడు అయిన ఆ విష్ణువును నేను నిత్యం శరణు పొందుతున్నాను. 🙏🍀

Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹


15వ పాశురము - తిరుప్పావై భావార్థ గీత మాలిక / 15th Pasuram - Tiruppavai Bhavartha Gita



https://youtube.com/shorts/ETxpHmDiYCw


🌹 15వ పాశురము - తిరుప్పావై భావార్థ గీత మాలిక - 15th Pasuram - Tiruppavai Bhavartha Gita 🌹

🍀 15వ పాశురము - స్నేహ సంభాషణ – భజన పిలుపు గీతం. 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 15వ పాశురంలో పదవ గోపికను మేల్కొల్పు తున్నారు. దీనితో భగవద్ ఆలయమునకు చేరుకొనుటకు అర్హత కలుగుతుంది. ఇంతవరకు భగవద్భక్తుల విషయమున ప్రవర్తింప వలసిన విధానములు చెప్పి, భగవత్ప్రాప్తికి చేయవలసిన సాధన క్రమము వివరించారు గోదామాత. 🍀

Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹


వైకుంఠ ఏకాదశి హృదయపూర్వక శుభాకాంక్షలు Heartfelt wishes on Vaikuntha Ekadashi


🌹 మీ అందరికి వైకుంఠ ఏకాదశి హృదయపూర్వక శుభాకాంక్షలు 🌹
ప్రసాద్‌ భరధ్వాజ


🌹 Heartfelt wishes to all of you on Vaikuntha Ekadashi 🌹
Prasad Bharadwaj



https://www.facebook.com/reel/873725698394751


వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు Happy Vaikuntha Ekadashi


🕉 ఈ పండుగ మీ అందరికి సమస్త సుఖ సంతోషాలను ఆయురారోగ్యాలను కల్పించాలని కోరుతూ.. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికి 🕉

ప్రసాద్‌ భరధ్వాజ



🕉 Wishing that this festival brings you all immense happiness, prosperity, and good health... Happy Vaikuntha Ekadashi to everyone. 🕉

Prasad Bharadwaj

Vaikuntha Ekadashi వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు 2025



🌹 సర్వవ్యాపి అయిన వాసుదేవుడికి నమస్కరిస్తూ.. మీకు ముక్తిని, శాంతిని, జ్ఞానాన్ని, దైవిక రక్షణను ప్రసాదించాలని కోరుకుంటూ.. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹 Offering salutations to the all-pervading Vasudeva... wishing that He bestows upon you liberation, peace, knowledge, and divine protection... Happy Vaikuntha Ekadashi to all 🌹

Prasad Bharadwaj


🍀 ముక్కోటి ఏకాదశి - ఉత్తర ద్వారాన వైకుంఠనాథుడు. వైకుంఠ ఏకాదశి విశిష్టత. 🍀

🍀 Mukkoti Ekadashi - Lord Vaikunthanatha at the Northern Gate. The significance of Vaikuntha Ekadashi. 🍀

🌻 వైకుంఠం అంటే కుంఠములు లేని ప్రదేశం అని అర్థం. అంటే ఆందోళనలు, ఆత్రుతలు, ఆరాటాలు లేని ప్రదేశం అన్నమాట. అదే విష్ణుధామం. పరంధామం. 🌻

🙏 విష్ణు ప్రార్ధన 🙏


సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితంచ సత్యే సత్యస్య సత్యమ్ ఋత సత్య నేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రసన్నా

ధ్వాయేత్ సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితమ్

లోకనాధం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిమ్

పాతాంబరం నీలవర్ణం శ్రీ వత్సపద భూషితమ్

గోవిందం గోకులానందం బ్రహ్మేద్వైరభి పూజితమ్

ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్లిన శ్రీమహా విష్ణువు, కార్తీకశుద్ధ ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి మేల్కొని, శ్రీదేవి - భూదేవి సమేతంగా ఈ ఏకాదశి రోజున వైకుంఠానికి తిరిగి వచ్చాడట.

అప్పుడు ముక్కోటి దేవతలు ఉత్తరద్వారం చెంత నిలిచి స్వామి దర్శనం చేసుకున్నారని, ఈ కారణంగానే దీనిని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తుంటారని పెద్దలు చెబుతారు. ఈ రోజున స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించు కోవడం వలన మోక్షం లభిస్తుందని విశ్వాసం..

ఉత్తరాయన ప్రారంభదినం కావడం మూలాన ఇది అత్యంత విశిష్ఠమైనది. ముక్కోటి అంటే ముప్పది మూడు కోట్ల దేవతలని ఉద్దేశించింది. అప్పటి నుంచి మూసి ఉన్న స్వర్గ ద్వారాలు ఈ ధనుర్మాసారంభం నుంచి తెరుచుకుంటాయని పురాణ వచనం. ఈ ఏకాదశినాడు విష్ణుమూర్తి గరుడ వాహనారూఢుడై ఉత్తరద్వారాన దర్శనమిస్తాడట. ఆ దివ్యసుందర రూపుని దర్శించుకోవడం కోసం దేవతలందరూ ఈ రోజున దివినుంచి భువికి దిగి వస్తారట. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు.

మన ఆరునెలలు దేవతలకు పగలు, మరో ఆరునెలలు రాత్రి. దీని ప్రకారం దేవతలందరూ వైకుంఠ ఏకాదశినాడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి అంటే చీకటి రాత్రి నుంచి వెలుగులు చిమ్మే పగటిలోకి వచ్చారన్నమాట. స్వర్గద్వారాలను తెరవగానే ముందుగా ఈ కాంతి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తుంది. అందుకే విష్ణ్వాలయాలలో ఇవాళ ఉత్తరం వైపున ఉన్న ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ద్వారం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదం.

భౌతిక జగత్తుకు అతీతంగా ఉండే వైకుంఠ ధామం నుంచి శ్రీమహావిష్ణువు లోకంలోకి దిగి వస్తే, ఆ రూపాన్ని అవతారం అంటారు. ధర్మ సంస్థాపనార్థం, భక్తజన రక్షణార్థం ఆ దేవదేవుడు దిగి వస్తాడు..

🌿 అంతరార్థం 🌿

వైకుంఠ ఏకాదశి రోజున మనం గుడిలో 'ఉత్తర ద్వారం' నుండి వెళ్తాము. దీనికి ఒక అంతరార్థం ఉంది - ఉత్తరం అంటే ఏమిటి?: 'ఉత్' అంటే ఎత్తు, 'తర' అంటే మరీ ఎత్తు. మన శరీరంలో అన్నిటికంటే ఎత్తైన భాగం తల (శిరస్సు). ద్వారం అంటే ఏమిటి?: మన తల లోపల (బ్రహ్మరంధ్రం వద్ద) ఒక అదృశ్య ద్వారం ఉంది. సాధారణంగా గుడి తలుపులకు రెండు రెక్కలు ఉన్నట్టే, అక్కడ కూడా ఒక ద్వారం ఉంటుందని యోగశాస్త్రం చెబుతుంది.

గుడిలో ఉత్తర ద్వారం గుండా వెళ్లి దేవుడిని ఎలా చూస్తామో, అలాగే యోగసాధన ద్వారా మన శరీరంలోని 'ఉత్తర ద్వారం' (బ్రహ్మరంధ్రం) తెరుచుకున్నప్పుడు, మన లోపలే ఉన్న పరమాత్మను దర్శించుకోవచ్చు. ఈ గొప్ప విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడమే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి యొక్క అసలు ఉద్దేశం.

🙏 వైకుంఠ ఏకాదశినాడు శ్రీమహావిష్ణువును వివిధ శ్లోకాలతో పూజిస్తే ఎంతో శుభప్రదం ! 🙏

దక్షిణాగ్రకరే శంఖం పద్మం తస్యాన్యతః కరే

చక్రమూర్ధ్వకరే వామం గదా తస్యాన్యతః కరే

దధానం సర్వలోకేశం సర్వాభరణ భూషితం

క్షీరాబ్ధిశయనం ధ్యాయేత్ నారాయణం ప్రభుమ్


ఓం శ్రీ తులసీ ధాత్రీ సమేత లక్ష్మీ నారాయణాయ కార్తీక దామోదరాయ నమః ధ్యాయామి

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

మీకు మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹

తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 8 - పాశురాలు 15 & 16 / Tiruppavai Pasuras Bhavartha Gita Series 8 - Pasuras 15 & 16



https://youtu.be/wQDTV2QbUEw


🌹 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 8 - పాశురాలు 15 & 16 Tiruppavai Pasuras Bhavartha Gita Series 8 - Pasuras 15 & 16 🌹

🍀 15వ పాశురము - స్నేహ సంభాషణ – భజన పిలుపు గీతం, 16వ పాశురము - ద్వార పాలకుని ఆహ్వానం – దర్శన దీక్ష గీతం. 🍀

తప్పకుండా వీక్షించండి

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 15వ పాశురంలో పదవ గోపికను మేల్కొల్పు తున్నారు. దీనితో భగవద్ ఆలయమునకు చేరుకొనుటకు అర్హత కలుగుతుంది. ఇంతవరకు భగవద్భక్తుల విషయమున ప్రవర్తింప వలసిన విధానములు చెప్పి, భగవత్ప్రాప్తికి చేయవలసిన సాధన క్రమము వివరించారు గోదామాత. 16వ పాశురంలో ఆనందముతో శ్రీ కృష్ణుని పొందే యోగ్యత కల గోపికలందరను మేలుకొని, కలిసి నంద గోప భవనమునకు వచ్చిరి. నందగోపుని భవన ద్వారమునకు వచ్చి ద్వార పాలకుని అర్ధించి లోనికి ప్రవేశించ చూస్తున్నారు. 🍀

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


14వ పాశురము Part 2- తిరుప్పావై భావార్థ గీత మాలిక / 14th Pasuram Part 2 - Tiruppavai Bhavartha Gita



https://youtube.com/shorts/vb6TeJsyBo8


🌹 14వ పాశురము Part 2- తిరుప్పావై భావార్థ గీత మాలిక - 14th Pasuram Part 2 - Tiruppavai Bhavartha Gita 🌹

🍀 మాటల జ్ఞాపకం – కార్యోన్ముఖ గీతం 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ

🍀 14వ పాశురం ద్వారా మాట నిలబెట్టుకోవడం, సత్యం పాటించడం ఎంత ముఖ్యమో ఆండాళ్ వివరిస్తుంది. భక్తికి మాట, చేత ఒకటేనని ఈ పాశురం ద్వారా తెలియజేస్తుంది. 🍀


Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹




14వ పాశురము Part 1- తిరుప్పావై భావార్థ గీత మాలిక / 14th Pasuram Part 1 - Tiruppavai Bhavartha Gita Malika



https://youtube.com/shorts/nV70cOgDX-M?fe

🌹 14వ పాశురము Part 1- తిరుప్పావై భావార్థ గీత మాలిక - 14th Pasuram Part 1 - Tiruppavai Bhavartha Gita Malika 🌹

🍀 మాటల జ్ఞాపకం – కార్యోన్ముఖ గీతం 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ

🍀 14వ పాశురం ద్వారా మాట నిలబెట్టుకోవడం, సత్యం పాటించడం ఎంత ముఖ్యమో ఆండాళ్ వివరిస్తుంది. భక్తికి మాట, చేత ఒకటేనని ఈ పాశురం ద్వారా తెలియజేస్తుంది. 🍀


Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹

శ్రీ పంచవక్త్ర మహాకైలాస మూర్తి ధ్యానం — ఐశ్వర్యం, సుఖశాంతుల కోసం / Meditation on Sri Panchavaktra Mahakailasa Murti




🌹 🔱 శ్రీ పంచవక్త్ర మహాకైలాస మూర్తి ధ్యానం సంపూర్ణ శివానుగ్రహం — ఐశ్వర్యం, సుఖశాంతుల కోసం 🔱 🌹

శుభ సోమవారం అందరికి

ప్రసాద్‌ భరధ్వాజ


🌹 🔱 Meditation on Sri Panchavaktra Mahakailasa Murti for complete divine grace of Lord Shiva — for prosperity, happiness and peace 🔱 🌹

Happy Monday to all

Prasad Bharadwaj




ధ్యాన శ్లోకము

ధ్యాయేన్నిత్యం మహేశం రజతగిరి నిభం చారుచంద్రావతంసం
రత్నాకల్పోజ్జ్వలాంగం పరశుమృగ వరాభీతి హస్తం ప్రసన్నం।

పద్మాసీనం సమంతాత్ స్తుత మమరగణైః వ్యాఘ్రచర్మాంబరం
విశ్వాద్యం విశ్వబీజం నిఖిల భయహరం పంచవక్త్రం త్రినేత్రం॥


స్ఫటికమువంటి నిర్మలమైన వర్ణం కలిగినవాడు, ఐదు ముఖాలతో — ప్రతి ముఖంలో మూడు నేత్రాలతో (మొత్తం 15 కళ్లతో), పది చేతులతో, చంద్రకళతో అలంకరించ బడిన కిరీటం ధరించి, రత్నభూషణాలతో మెరిసుతూ, అభయ వరద ముద్రలతో భక్తులను కాపాడుతూ, త్రిశూలం, పరశువు, ఖడ్గం, వజ్రం, అగ్ని, సర్పం, గంట, అంకుశం వంటి ఆయుధాలను ధరించి, సింహాసనంపై ప్రశాంతంగా ఆసీనుడై, దేవతలచే స్తుతింపబడే ఆ మహాసదాశివుని నేను సదా ధ్యానిస్తున్నాను.


🍀 పంచవక్త్ర మహాకైలాస మూర్తి — ఐదు ముఖాల అర్థం 🍀

దిక్కు - ముఖం - కృత్యం - అర్థం

ఊర్ధ్వం - ఈశానము - అనుగ్రహం మోక్షం, - కరుణ

తూర్పు - తత్పురుషం - తిరోధానం -మాయ, దాచుట

దక్షిణం - అఘోరం -సంహారం -లయం

పడమర - సద్యోజాతము - సృష్టి - సృష్టి శక్తి

ఉత్తరం - వామదేవుడు - స్థితి - రక్షణ, పోషణ




🌻 పంచవక్త్ర మహాకైలాస మూర్తి లక్షణాలు 🌻

పంచవక్త్రం — శివుని ఐదు కృత్యాలను ప్రతిబింబిస్తాయి.

త్రినేత్రములు — జ్ఞానం, కాల నియంత్రణ

దశభుజాలు — పది దిక్కులు, పది శక్తులు

స్ఫటిక వర్ణం — శుద్ధ జ్ఞాన స్వరూపం

సింహాసనం — స్థిరత్వం, అధికారం

చంద్రావతంసం — మనస్సుపై సంపూర్ణ నియంత్రణ, శాంత స్వభావం

వ్యాఘ్రచర్మాంబరం — వాసనలపై విజయం, వైరాగ్య బలం

పద్మాసనం — సమత్వం, ధ్యాన నిశ్చలత్వం

అభయ ముద్ర — భయ విమోచనం, ఆశ్రయ ప్రదానం

వరద ముద్ర — భక్తులకు కృపా ప్రసాదం

దేవగణ స్తుతి — పరమతత్త్వానికి లోకారాధన

విశ్వబీజం — సృష్టి, స్థితి, లయలకు మూలకారణం

పంచవక్త్ర మహాకైలాస మూర్తి అనేది రూపానికి పరిమితం కాని పరబ్రహ్మ తత్త్వం — భయం తొలగించే కరుణ, అజ్ఞానాన్ని దహించే జ్ఞానం, మోక్షానికి మార్గదర్శకుడు.


🙌 ధ్యాన ఫలితం 🙌


ఈ మహాకైలాస మూర్తిని నిత్యం ధ్యానం చేస్తే— సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుంది. ఐశ్వర్యం, సుఖం మరియు శాంతి పెరుగుతాయి. పాపాలు నశిస్తాయి. మనస్సు ప్రశాంతం అవుతుంది. అంతరంగ శక్తి అభివృద్ధి చెందుతుంది.

🌹🌹🌹🌹🌹


13వ పాశురము Part 2- తిరుప్పావై భావార్థ గీత మాలిక / 13th Pasuram Part 2 - Tiruppavai Bhavartha Gita



https://youtube.com/shorts/NGKzE5tRS8I


🌹 13వ పాశురము Part 2- తిరుప్పావై భావార్థ గీత మాలిక - 13th Pasuram Part 2 - Tiruppavai Bhavartha Gita 🌹

🍀 అవతార మహిమ – ప్రదోష శుద్ధి గీతం 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 13వ పాశురంలో అందమైన కళ్ళతో ఉండే గోపికను, నిద్రలో భగవంతునితో తన ఐక్యతను తలచుకుంటూ మోసపోకుండా, అవతార మహిమను గర్తించి, ప్రదోష శుద్ధి కొరకు మేల్కొని అందరితో కలిసి నోము చేయమని కోరడం ముఖ్య అంశం. 🍀

Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹

13వ పాశురము Part 1- తిరుప్పావై భావార్థ గీత మాలిక / 13th Pasuram Part 1 - Tiruppavai Bhavartha Gita



https://youtube.com/shorts/RENUP-Roc14

🌹 13వ పాశురము Part 1- తిరుప్పావై భావార్థ గీత మాలిక - 13th Pasuram Part 1 - Tiruppavai Bhavartha Gita 🌹

🍀 అవతార మహిమ – ప్రదోష శుద్ధి గీతం 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 13వ పాశురంలో అందమైన కళ్ళతో ఉండే గోపికను, నిద్రలో భగవంతునితో తన ఐక్యతను తలచుకుంటూ మోసపోకుండా, అవతార మహిమను గర్తించి, ప్రదోష శుద్ధి కొరకు మేల్కొని అందరితో కలిసి నోము చేయమని కోరడం ముఖ్య అంశం. 🍀

Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹

సర్ప దోషం నివారణకు తప్పక దర్శించాల్సిన 5 అద్భుత ఆలయాలు Temples to alleviate Sarpa Dosha (serpent affliction)


🌹🐍 సర్ప దోషం నివారణకు తప్పక దర్శించాల్సిన 5 అద్భుత ఆలయాలు 🐍🌹
ప్రసాద్‌ భరధ్వాజ

🌹🐍 5 amazing temples that must be visited to alleviate Sarpa Dosha (serpent affliction) 🐍🌹
Prasad Bharadwaj


1. శ్రీ కాళహస్తీశ్వర టెంపుల్ ఆలయం, ఆంధ్రప్రదేశ్: ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. సర్ప దోషంలో కీలకమైన రాహు, కేతువుల సంబంధానికి ప్రసిద్ధి చెందింది. కాల సర్ప దోషం యొక్క ప్రభావాలను తగ్గించడానికి ఇక్కడ రాహు-కేతు సర్ప దోష నివారణ పూజ నిర్వహిస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాళహస్తిలో ఉంది.

2. కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం, కర్ణాటక: ఈ ఆలయం కార్తికేయ అవతారమైన సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడింది. అతను పాములతో దగ్గరి సంబంధం కలిగి ఉంటాడు. సర్ప సంస్కార ఆచారంతో సహా సర్ప దోష నివారణలకు ఇది ఒక ప్రసిద్ధ గమ్యస్థానం. సర్ప దోష దుష్ప్రభావాల నుండి రక్షణ పొందడానికి భక్తులు పూజలు, ఆచారాలు నిర్వహిస్తారు. ఇది కర్ణాటకలోని సుబ్రమణ్య అనే గ్రామంలో ఉంది.

3. మహాకాళేశ్వర ఆలయం, ఉజ్జయిని: ఇది మరొక జ్యోతిర్లింగ ఆలయం. కాల సర్ప దోషలను దోషాలను తగ్గించడానికి పూజలు నిర్వహించడానికి ఇది ఒక శక్తివంతమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని ఉంది.

4. ఓంకారేశ్వర్ ఆలయం, మధ్యప్రదేశ్: నర్మదా నదిలోని ఒక ద్వీపంలో ఉన్న ఈ ఆలయం శివుడితో కూడా ముడిపడి ఉంది. కాల సర్ప దోష నివారణ పూజలు నిర్వహించడానికి ఇది ఒక ప్రసిద్ధ ఎంపిక. ఇది మధ్యప్రదేశ్‎లోని మాంధాత గ్రామంలో ఉంది.

5. త్రయంబకేశ్వర్ ఆలయం, మహారాష్ట్ర: కాల సర్ప దోష నివారణలకు ఇది అత్యంత ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి. ఇది శివుడికి అంకితం చేయబడిన పురాతన ఆలయం. సర్ప దోష పూజను జ్ఞానవంతులైన గురువుల సహాయంతో ఇక్కడ నిర్వహిస్తారు. ఇది మహారాష్ట్రలో నాసిక్‎లో ఉంది.

🌹🌹🌹🌹🌹

తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 7 - పాశురాలు 13 & 14 / Tiruppavai Pasuras Bhavartha Gita Series 7 - Pasuras 13 & 14


https://youtu.be/J304yKSXVyE

🌹 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 7 - పాశురాలు 13 & 14 Tiruppavai Pasuras Bhavartha Gita Series 7 - Pasuras 13 & 14 🌹

🍀 13వ పాశురము - అవతార మహిమ – ప్రదోష శుద్ధి గీతం, 14వ పాశురము - మాటల జ్ఞాపకం – కార్యోన్ముఖ గీతం 🍀

తప్పకుండా వీక్షించండి

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 13వ పాశురంలో అందమైన కళ్ళతో ఉండే గోపికను, నిద్రలో భగవంతునితో తన ఐక్యతను తలచుకుంటూ మోసపోకుండా, అవతార మహిమను గర్తించి, ప్రదోష శుద్ధి కొరకు మేల్కొని అందరితో కలిసి నోము చేయమని కోరడం ముఖ్య అంశం. 14వ పాశురం ద్వారా మాట నిలబెట్టుకోవడం, సత్యం పాటించడం ఎంత ముఖ్యమో ఆండాళ్ వివరిస్తుంది. భక్తికి మాట, చేత ఒకటేనని ఈ పాశురం ద్వారా తెలియజేస్తుంది. 🍀

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

12వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 12th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita



https://youtube.com/shorts/ZpJnQiHFveE


🌹 12వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 12th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita 🌹

🍀 గోసంపద సేవా మహిమ – వ్రత పిలుపు గీతం 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 ఈ 12వ పాశురం ద్వారా గోదాదేవి గోసేవా మహిమను, భగవంతుని సేవ యొక్క ప్రాముఖ్యతను, లోక బాధ్యతల కంటే భగవద్భక్తి ముఖ్యం అని, అజ్ఞానాన్ని వదిలి భగవంతునిపై భక్తితో మేల్కొని, అతనిని కీర్తించమని, నిత్యమైన ఆనందాన్ని పొందమని ప్రోత్సహిస్తుంది. 🍀

Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹


వెంకటేశ్వర స్వామి చుట్టూ ప్రదక్షిణలు Circumambulations around Lord Venkateswara


🌹 ఇక్కడ చందన స్వరూపుడైన వెంకటేశ్వర స్వామికి, 7 వారాలు ఏడేసి సార్లు చొప్పున ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 Devotees believe that performing circumambulations around Lord Venkateswara, who is in the form of sandalwood paste here, seven times a day for seven weeks will fulfill their wishes. 🌹

Prasad Bharadwaj


అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి.. ఆత్రేయపురం మండలంలో అదో కుగ్రామం. జనాభా కూడా 4000 మాత్రమే. అయితే ఆ ఊరి పేరు నేడు ఖండాంతరాలు దాటిపోతు వెలిగిపోతుంది.

ఎందుకంటే అక్కడ చందన స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి వారు వెలిచి భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ఉన్నారు. భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని చూపిస్తూ ప్రతిరోజు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించు కునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గోదావరి తీరప్రాంత నడుమ వాడపల్లి వెంకన్న భక్తులకు కటాక్షంగా మారాడు.. కోరిన కోరికలు తీర్చే చందన స్వరూపుడు వెంకన్నకు భక్తుల తాకిడి అమాంతం పెరుగుతోంది.

ఎక్కడా లేని విధంగా వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఎర్రచందనపు చెక్కతో చేతిలో గదను ధరించి ప్రత్యేకంగా ఉంటారు. రెండు దశాబ్దాల క్రితం ఏడాదికి ఒక్కసారే వాడపల్లి తీర్థం పేరున చుట్టుపక్కల గ్రామాల భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తుండేవారు. నేడు స్వామి వారి మహిమాన్వితుడుగా.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఉండటంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఒక్క శనివారమే 50 వేల నుంచి 70 వేల వరకు భక్తులు వస్తుండగా మిగతా రోజుల్లో 20వేలకు తగ్గకుండా స్వామివారి దర్శనం కోసం భక్తులు తరలి వస్తున్నారు… ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతున్నాయని భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.

🌹🌹🌹🌹🌹