నిర్మల ధ్యానాలు - ఓషో - 200
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 200 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. వ్యక్తి తెచ్చుకున్న జ్ఞానంతో అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకుంటాడు. అద్భుతానికి సంబంధించిన లక్షణాన్ని కోల్పోతారు. దైవానికి సంబంధించిన ముఖ్యమైన లక్షణం వ్యక్తి పసివాడుగా, అమాయకంగా, ఆశ్చర్యంతో నిండి వుండాలి. 🍀
వ్యక్తి పసివాడుగా అమాయకంగా వుండాలి. అప్పుడే తలుపులు తెరుచుకుంటాయి. జ్ఞానాన్ని పోడుచేసుకున్న వాళ్ళ స్వర్గద్వారాలు తెరుచుకోవు. పండితులు, మేధావులు, మత పెద్దలు వీళ్ళకు తలుపులు పూర్తిగా మూసుకుంటాయి. వాళ్ళకా సంగతి తెలుసు. వాళ్ళకు, అంతకు మించి ఏమీ అక్కర్లేదు. తెచ్చుకున్న జ్ఞానంతో వాళ్ళ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకుంటారు. అద్భుతానికి సంబంధించిన లక్షణాన్ని కోల్పోతారు. అది దైవానికి సంబంధించిన ముఖ్యమైన లక్షణం.
పసిబిడ్డ అపూర్వమయిన ఆశ్చర్యంతో నిండి వుంటాడు. అతని హృదయం నిరంతరం రహస్యానుభూతుల్తో నిండి వుంటుంది. అతని కళ్ళు ఆశ్చర్యంతో నిండి వుంటాయి. సముద్ర తీరంలో నీటిబుడగల్ని చూసి నివ్వెరపోతాడు. గవ్వలేరుకుంటాడు. వాటిల్లో వజ్రాల్ని చూస్తాడు. సీతాకోకచిలుకని, మామూలు పువ్వుని చూసి మైమరచిపోతాడు. నువ్వు దేవుణ్ణి సమీపించడానికి వుండాల్సిన లక్షణాలు. సత్యాన్ని, సంతోషాన్ని సమీపించే లక్షణాలు. రహస్యం నింపుకున్న అస్తిత్వానికి చేరే లక్షణాలు. పసిపిల్లల్లాగా వుండాలి.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
25 Jun 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment