19-July-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 432 / Bhagavad-Gita - 432🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 220 / Sripada Srivallabha Charithamrutham - 220 🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 100🌹 
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 123 🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 36 / Sri Lalita Sahasranamavali - Meaning - 36 🌹
6) 🌹 VEDA UPANISHAD SUKTHAM - 63 🌹
7) 🌹. నారద భక్తి సూత్రాలు - 40 🌹 
8) 🌹. శివగీత - 5 / The Shiva-Gita - 5🌹 
9)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 10 🌹 
10) 🌹. సౌందర్య లహరి - 47 / Soundarya Lahari - 47🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 346 / Bhagavad-Gita - 346 🌹

12) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 174🌹 
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 51 🌹
14) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 47🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 62 🌹 
16) 🌹 Seeds Of Consciousness - 126 🌹
17) 🌹. మనోశక్తి - Mind Power - 65 🌹
18) 🌹 Guru Geeta - Datta Vaakya - 8 🌹
19) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 5 🌹
20) 🌹. సృష్టి దివ్య సృజనాత్మకత - మానవజన్మ - సూక్ష్మ సృష్టి - కారణసృష్టి 🌹
21) 🌹. సాయి తత్వం - మానవత్వం - 54 / Sai Philosophy is Humanity - 54🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 432 / Bhagavad-Gita - 432 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 41 , 42 🌴*

41. సఖేతి మత్వా ప్రసభం యదుక్తమ్
హే కృష్ణ హే యాదవ హే సఖేతి |
అజానతా మహిమానం తవేదం
మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి ||

42. యచ్చాపహాసార్థమసత్కృతో(సి
విహారశయ్యాసనభోజనేషు |
ఏకో(థవాప్యచ్యుత తత్సమక్షం
తత్ క్షామయే త్వామహమప్రమేయమ్ ||

🌷. తాత్పర్యం : 
నీ మహిమము తెలియక నిన్ను మిత్రునిగా భావించి “ఓ కృష్ణా”, “ఓ యాదవా”, “ ఓ మిత్రమా” అని తొందరపాటుగా సంబోధించితిని. ప్రేమతోగాని లేదా మూర్ఖత్వముతోగాని నేనొరించిన దానినంతటిని కరుణతో క్షమింపుము. మనము విశ్రాంతి గొనునప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు, కూర్చుండినప్పుడు, కలిసి భుజించినప్పుడు ఒంటరిగా కొన్నిమార్లు మరియు పలుమిత్రుల సమక్షమున మరికొన్నిమార్లు నిన్ను నేను వేళాకోళముగా అగౌరపరచితిని. ఓ అచ్యుతా! ఆ అపరాధములన్నింటికిని నన్ను క్షమింపుము.

🌷. భాష్యము : 
శ్రీకృష్ణుడు విశ్వరూపముతో తన యెదుట వ్యక్తమైనప్పటికిని అతనితో గల స్నేహసంబంధమును అర్జునుడు స్మృతి యందుంచుకొనెను. 

తత్కారణముగా అతడు క్షమార్పణ వేడుచు, స్నేహభావము వలన ఉత్పన్నమైనట్టి పలు సామాన్య వ్యవహారములకు తనను మన్నింపుమని శ్రీకృష్ణుని అర్థించుచున్నాడు. 

ప్రియమిత్రునిగా భావించి శ్రీకృష్ణుడు తనకు తెలియపరచినను, శ్రీకృష్ణుడు ఆ విధమైన విశ్వరూపధారణము చేయగలడని తాను పూర్వము తెలియనట్లుగా అర్జునుడు అంగీకరించుచున్నాడు. 

ఆ భగవానుని విభూతులను గుర్తెరుగాక “ ఓ మిత్రమా”, “ఓ కృష్ణా”, “ఓ యాదవా” అనెడి సంబోధనములచే తానెన్నిమార్లు అతనిని అగౌరవపరచెనో అర్జునుడు ఎరుగడు. అయినను కరుణాంతరంగుడైన శ్రీకృష్ణుడు అట్టి దివ్యవిభూతి సంపన్నుడైనను అర్జునునితో మిత్రుని రూపమున వ్యవహరించెను. 

భక్తుడు మరియు భగవానుని నడుమగల దివ్యప్రేమయుత సంబంధమిదియే. శ్రీకృష్ణుడు మరియు జీవుల నడుమగల సంబంధము నిత్యమైనది, మరుపునకు రానిదని అర్జునుని ప్రవృత్తి ద్వారా మనము గాంచవచ్చును. 

విశ్వరూప వైభవమును గాంచినప్పటికిని అర్జునుడు తనకు శ్రీకృష్ణునితో గల సన్నిహిత స్నేహసంభందమును మరువజాలడు. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 432 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 41, 42 🌴*

41. sakheti matvā prasabhaṁ yad uktaṁ
he kṛṣṇa he yādava he sakheti
ajānatā mahimānaṁ tavedaṁ
mayā pramādāt praṇayena vāpi

42. yac cāvahāsārtham asat-kṛto ’si
vihāra-śayyāsana-bhojaneṣu
eko ’tha vāpy acyuta tat-samakṣaṁ
tat kṣāmaye tvām aham aprameyam

🌷 Translation : 
Thinking of You as my friend, I have rashly addressed You “O Kṛṣṇa,” “O Yādava,” “O my friend,” not knowing Your glories. Please forgive whatever I may have done in madness or in love. I have dishonored You many times, jesting as we relaxed, lay on the same bed, or sat or ate together, sometimes alone and sometimes in front of many friends. O infallible one, please excuse me for all those offenses.

🌹 Purport :
Although Kṛṣṇa is manifested before Arjuna in His universal form, Arjuna remembers his friendly relationship with Kṛṣṇa and is therefore asking pardon and requesting Kṛṣṇa to excuse him for the many informal gestures which arise out of friendship. 

He is admitting that formerly he did not know that Kṛṣṇa could assume such a universal form, although Kṛṣṇa explained it as his intimate friend. 

Arjuna did not know how many times he may have dishonored Kṛṣṇa by addressing Him “O my friend,” “O Kṛṣṇa,” “O Yādava,” etc., without acknowledging His opulence. 

But Kṛṣṇa is so kind and merciful that in spite of such opulence He played with Arjuna as a friend. Such is the transcendental loving reciprocation between the devotee and the Lord. 

The relationship between the living entity and Kṛṣṇa is fixed eternally; it cannot be forgotten, as we can see from the behavior of Arjuna.

 Although Arjuna has seen the opulence in the universal form, he cannot forget his friendly relationship with Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 220 / Sripada Srivallabha Charithamrutham - 220 🌹*
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 41
*🌴. దత్తదీక్షా ప్రహసనం (శ్రీపాదులకు 16ఏళ్ళు) - 2 🌴*

*🌻. దత్త దీక్ష 🌻*

అటు తరువాత ఏ పరిస్థితులలో శ్రీపాదులు పీఠికాపురం వదిలి వెళ్ళారో కూడా చెప్పసాగారు, "ఒకసారి ఒక దత్త భక్తు డైన సన్యాసి కుక్కుటేశ్వరాలయానికి వచ్చారు. 

తాను దత్త దీక్షను ఇస్తానని, ఒక మండలం(40)రోజులు దత్తదీక్షను పాటించినట్లయితే అనుకున్న పనులు జరిగి తీరుతాయని ప్రకటించారు. 

పీఠికాపుర బ్రాహ్మణులందరు దత్త దీక్షను స్వీకరించి వారికి పెద్ద మొత్తంలో దక్షిణ ఇవ్వసాగారు. అందులో కొంతభాగం ఆయన తిరిగి వారికే ఇవ్వసాగారు. ఈ బ్రాహ్మణులు మిగిలిన కులస్థులనుకూడా దత్తదీక్ష తీసుకొని ఆ సన్యాసికి భారీయెత్తున దక్షిణలనిచ్చి జన్మ చరితార్ధం చేసుకోమని బోధించసాగారు. 

ఈ విషయమై బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య పరిషత్తులు బాపనార్యులు గారి అధ్యక్షతన సమావేశమయ్యాయి. అందులో బాపనార్యులు గారు దత్తుడు అందరివాడని, అందువల్ల అన్ని కులాల వారు దీక్ష తీసుకోవచ్చని ప్రకటించారు. 

కాని బ్రాహ్మణులు అందుకు అంగీకరించక, శూద్రులు అనాచారవంతులు కాబట్టి వారికి దీక్ష ఇవ్వకుండా, కేవలం దక్షిణ మాత్రం తీసుకొని వాళ్ళని తమ శక్తితో ఉద్ధరిస్తామని వాదించారు. 

దానికి బాపనార్యులు అనాచారవంతులు అన్ని కులాల్లోను కొద్దోగొప్పో ఉంటారని, ఆ రకంగా దీక్ష లేకుండా ఉద్ధరించ గలిగే పక్షంలో ఏ కులం వారికి ప్రత్యేక దీక్షలు అక్కరలేదని, అయినా భూరి దక్షిణ అని చెప్పి వ్యక్తులను బలవంతపెట్ట కూడదని, అన్ని కులాల్లోను బీదవారు ఉంటారని, యథా శక్తితో సంతోషంగా ఇచ్చే దక్షిణతోనే దత్తుడు ప్రసన్నుల వుతారని తమ అభిప్రాయం వెలిబుచ్చారు.

 దక్షిణలలో, సంభావనలలో భాగం పంచుకుంటున్న బ్రాహ్మణులు వాళ్ళ వితండవాదం విడవకుండా, "పరమహంస పరివ్రాజక మహా శయులవంటివారు మన ఊరు వస్తే మేళతాళాలతో, వేద మంత్రాలతో, పూర్ణ కుంభాలతో ఎదురు వెళ్ళి స్వాగతం ఇవ్వకపోగా దక్షిణ విషయంలో వెనకాడడం భావ్యం కాదని," చెప్పి బాపనార్యులను, అప్పలరాజశర్మగార్లను దీక్ష తీసుకొని దక్షిణ యిస్తారా? లేదా? అని నిష్కర్షగా ప్రశ్నించారు. 

వారు నిజంగా పరమహంస పరివ్రాజకులంత వారే అయితే ఊరికి రావడానికి ముందే వర్తమానం పంపడం లాంటి కొన్ని పద్ధతులు అనుసరించి ఉండాల్సిందని, బ్రాహ్మణ పరిషత్తు అనేది సామూహిక సమస్యలు, ప్రయోజ నాల గురించి ఆలోచించాలే కాని వ్యక్తిగత శ్రేయస్సు గురించి పట్టించుకోకూడదని, తాము వ్యక్తిగత శ్రేయస్సు కోసం దత్తదీక్ష తీసుకోవడం తమ అభిమతం కాదని, అయితే తక్కినవాళ్ళు వారి అభీష్టం ప్రకారం దత్తదీక్ష తీసుకోవచ్చని బాపనార్యులు తేల్చి చెప్పారు.

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sripada Srivallabha Charithamrutham - 220 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj 

CHAPTER 22
*🌻 The Story of Gurudatta Bhatt Only Sripada will give the fruit written in Horoscope - 5 🌻*

Sripada was a good magician. While Mahalaya Pakshas were going on, Shresti who got the promise as well as Bapanarya who gave the promise, forgot this.  

On the afternoon of Mahalaya amavasya (on the last day) Shresti had come to Bapanarya’s house. Sripada smiled and said, ‘Promise should not be given.  

Once given, the promise should be fulfilled. If the promise was forgotten, atleast the person who got the promise should remind him. I am asking explanation in this context from both of you.’ Thus both realized their mistake.  

This incident tells us that Sripada is not only capable of reminding but also capable of making them forget things. Both of them were upset for their fault. Consoling them, Sripada said, I am responsible for your forgetfulness.  

Every man has the ‘I’ inside him in the form of ‘chaitanyam’. Jeeva is getting not only the body from the parents but also the chaitanyam called ‘I’.  

There is a responsible ‘karma’ to be done by this ‘chaitanyam’ in this universal plan. It will be the bond of karma that is transferred to the son and then to his son and so on for generations.  

After taking sanyas ashram only, one is liberated from this bond of karma. This promise need not be fulfilled with this limited name and form. This was transferred to the chaitanyam of the universal ‘I’.  

So a person in the descendents of Bapanarya can take food and take dakshina from a person in the descendants of Shresti at any time and in any place. You should not ask me how, when and in what manner it happens.  

The form of karma is very difficult to comprehend and is very subtle. Some karmas have the ‘physical time’ and ‘yoga time’ separately.  

According to the ‘physical time’, this should have been done in this ‘Mahalaya Paksha’ only. But the ‘yoga time’ has not come. So it was pushed to distant future.”  

Thus Sripada advised both of them. I asked Sri Bhatt to tell me in detail about ‘physical time’ (kaalam) and ‘yoga time’ which Sripada told them. Sri Bhatt mahasay said, “Apart from ‘physical kaalam’ and ‘physical desam’, there are ‘manasik kaalam’ and ‘manasik desam.”  

In addition, there are ‘yoga kaalam’ and ‘yoga desam’. Suppose one person is having sixty years of age, he may be in continuous study as a 20 year old boy. Then his ‘physical age’ indicates his sixty years.  

That is related to his body. But his mental (manasik) age is counted as 20 years. Similarly if a 20 year old young man has the responsibility as that of a 60 year old man, his physical age is 20, but that is related to the body.  

His mental age is 60 years. Thus, the physical age and mental (manasik) age need not be the same. They can be different.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 100 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. భాగవత రహస్యము - 2 🌻*

ఎందరు వ్యక్తులున్నారో అన్ని విధములైన ఆదర్శములు వర్తించుచున్న ఈ మహాసముద్రమున ఎవని ఆదర్శము స్వతంత్ర సంచలనము పుట్టింపగలదు? వ్యక్తులలో ఆదర్శములున్నను వ్యక్తులు స్వభావ మహాసముద్రమున మునకలు వేయుచున్నారు. 

ఈ రహస్యమునే నారదుడు వ్యాసునకు భాగవత రహస్యముగా బోధించెను. "కొండచిలువచే మ్రింగబడుచున్న ఇద్దరిలో ఒకరినొకరు వెలుపలకు లాగి రక్షింపలేరు" అని నారదుడు హెచ్చరిక చేసెను. 

వ్యాసాదులు ఆరాధించినది సృష్టి మహాసముద్రము. అదియే జీవులలోన అంతర్యామియైన నారాయణుడు. అందు అందరును వర్తించుచున్నారు. వానికి అందరును వశులే. 

ఈ అంతర్యామితత్త్వము మానవుని బహిరంతర్లోకములలో వ్యాపించియున్నది. దానిని ఆరాధించుచు వ్యాసాదులు రచనలు సాగించిరే గాని, పండితులు, విమర్శకుల, సంఘ సంస్కర్తల మొగములు చూచికాదు. 

అట్టి రచనలకు పరిణత స్వరూపమై పరమావధియైన చరమావధిగా రూపుకట్టుకున్నది శ్రీమద్భాగవతము. అది ఈ సృష్టి రూపమున ఉన్న అంతర్యామికి సమర్పితము. 

శాశ్వత కాలమునందు వచ్చుచు పోవుచున్న మానవుల మొత్తము స్వభావమైన మానవుడు భాగవతమునకు కథానాయకుడు. అతడు సృష్టి ఆది నుండి నేటి వరకును ఏయే లోకముల దారులలో దిగివచ్చెనో ఆ మొత్తము వైఖరిని అద్దము పట్టిచూపునది భాగవతము. 

నారాయణుడు, చతుర్ముఖుడు, స్వాయంభువ మనవు, ఆది వరాహమూర్తి, కపిలాచార్యుడు, విష్ణువు, శివుడు, అంబిక, ధ్రువుడు, పృథు చక్రవర్తి, ప్రహ్లాదుడు, అంబరీషుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అను పాత్రలలో ఇందలి కథానాయకుడు సకల మానవధర్మ సంస్థాపనామూర్తియై రూపుకట్టెను. ఇన్నిటిని శ్రద్ధగా చదువుకున్నచో సృష్టి మొదలు నేటివరకును గల పురుషుడెవ్వడో, అతని శాశ్వత ధర్మస్వరూపమెట్టిదో విశదపడును. 

ఈ కథలన్నియు ఒకే నారాయణుని వివిధ ధర్మ గుణముల వివరణములే గాని, వేర్వేరు కథలు కావు. ఇందలి పురుషార్థములను భక్తితో అధ్యయనము చేసినచో మానవునకు తెలియవలసినవి అన్నియు తెలియును.
.....✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 122 🌹*
*🌴 The Art of Breathing - 6 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

🌻 The Practice of Breathing Exercises - 2 🌻

While inhaling and exhaling, we should travel through all centers, from the bridge of the nose to the base center. It is a traveling observation, but not a permanent concentration. 

The idea behind this is that we become conscious of the existence of the subtle tissues of the body. This way, we can experience them, which enables their power to work through us.

When breathing, we should observe how the inhalation changes into exhalation at a certain point and vice versa. We should try to be focused at each point, but not to cling on to either one.

As soon as we can exercise this with ease, we forget the process itself and enter into the inner worlds. 

When we listen to inhalation carefully, we can hear the sound SO; with exhalation, we hear HAM. SO-HAM means SAHA-AHAM, “This, I am.” It is the double-sound of the pulsation. 

To listen to this double-sound of the pulsating principle is called the meditation of the soul. 

This is the basic work. If we do it regularly for several years, Prana becomes regulated and we enter into our center.

🌻 🌻 🌻 🌻 🌻 🌻 
Sources used: Master K.P. Kumar: On Healing / Hercules / notes from seminars.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 36 / Sri Lalita Sahasranamavali - Meaning - 36 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శ్లోకం 68*

289. శ్రుతిసీమంత సిందూరీకృత పాదాబ్జధూళికా - 
వేదములనెడు స్త్రీలయొక్క పాపిటలను, సిందూరము ధరించునట్లు చేసిఅన్ పాదపద్మము యొక్క ధూళిని కలిగినది.

290. సకలాగమ సందోహశుక్తి సంపుటమౌక్తికా - 
అన్ని ఆగమ శాస్త్రములనెడు ముత్యపు చిప్పలచే చక్కగా ఉంచబడిన లేదా నిక్షిప్తము చేయబడిన ముత్యము.

*🌻. శ్లోకం 69*

291. పురుషార్థప్రదా - 
పురుషునకు కావలసిన ప్రయోజనములను చక్కగా ఇచ్చునది.

292. పూర్ణా - పూర్ణురాలు.

293. భోగినీ - 
భోగములను అనుభవించునది లేదా భోగములను ఇచ్చునది.

294. భువనేశ్వరీ - 
చతుర్దశ భువనములకు అధినాథురాలు.

295. అంబికా - తల్లి.

296. అనాదినిధనా - 
ఆది, అంతము లేనిది.

297. హరిబ్రహ్మేంద్ర సేవితా - 
విష్ణువు చేత, బ్రహ్మ చేత, ఇంద్రుని చేత సేవింపబడునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 36 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 36 🌻*


289 ) Sruthi seemantha kula sindhoori kritha padabjha dhooliga -   
She whose dust from her lotus feet is the sindhoora fills up in the parting of the hair of the Vedic mother

290 ) Sakalagama sandoha shukthi samputa maukthika -  
 She who is like the pearl in the pearl holding shell of Vedas

291 ) Purashartha pradha -   
She who gives us the purusharthas of Charity, assets, joy and moksha

292 ) Poorna -   
She who is complete

293 ) Bhogini -   
She who enjoys pleasures

294 ) Bhuvaneshwari -   
She who is the Goddess presiding over the universe

295 ) Ambika -   
She who is the mother of the world

296 ) Anadhi nidhana -   
She who does not have either end or beginning

297 ) Hari brahmendra sevitha -   
She who is served by Gods like Vishnu,Indra and Brahma

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 39 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 25

*🌻. 25. సాతు కర్మ జ్ఞాన యోగేభ్యో ఽప్యధికతరా - 2 🌻*

అన్ని మార్గాలలో భక్తి మార్గం సులభం. ఇది ఎక్కువ మందికి సాధ్యంగా కనిపిస్తుంది. గమ్యమైన మోక్షం అన్ని యోగాలలో ఒక్కటే అయినా సాధన మార్గాలు భిన్నం. 

ఒక్కొక్క మార్గం ఒక్కొక్కరికి కష్టమైతే, మరొక్కరికి సులభం అనిపిస్తుంది. భక్తిమార్గం మాత్రం సాధనలోకి వెంటనే ప్రవేశించడం వరకు అందరకూ తేలికే. 

సాధన విషయానికి వస్తే అన్ని మార్గాలలోనూ అహంకార, మమకారాలను విడచిపెట్టి సంసార బంధం నుంచి విముక్తి పొందడం తప్పనిసరి. మోక్షం అనేది సాధనకు ఫలం కాదు. సాధనకు ఫలం బంధ విముక్తి.

            బంధ విముక్తికై వారి వారి జన్మాంతర సంస్కారాలను బట్టి కొందరు జ్ఞానమార్గంలోను, మరికొందరు భక్తి మార్గంలోను, ఇంకా కొందరు యోగ మార్గం లోను సాధన చేస్తూ ఉంటారు. 

ఎవరికి ఇష్టమైనది వారికి సులభం. ఇష్టం కానిది కష్టం. వీటిలో ఏది గొప్ప మార్గమో నిర్ణయించడం కష్టం.

            పాతంజలి యోగమార్గం చిత్త వృత్తి నిరోధమే ప్రధానమంటుంది. ఇక్కడ బ్రహ్మానందానికి బదులు శూన్యత ఏర్పడుతుంది. దీనిని తమః ప్రధాన సమాధి అని కొందరు అంటారు. 

కపిలుని సాంఖ్యం నిత్యమైన ఆత్మయే తానని, అనిత్యమైన దేహేంద్రియాలు తాను కాదని నిర్ణయిస్తుంది. తద్వారా పరోక్ష జ్ఞానం, పాండిత్యం కలుగుతాయి గాని, అపరోక్షానుభూతి కష్టతరమవుతుంది.           

            భక్తి మార్గమైతే అందరికీ అందుబాటులో ఉండి అవగాహన అవుతుంది. హృదయమంతా భగవంతునితో నింపుకోగలిగితే, పారవశ్యంలో దేహాదులను మరిస్తే, భక్తుడు గమ్యం చేరవచ్చు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. VEDA UPANISHAD SUKTHAM - 63 🌹*
*🌻 1. Annapurna Upanishad - 24 🌻*
--- From Atharva Veda
✍️ Dr. A. G. Krishna Warrier
📚. Prasad Bharadwaj

V-41. Due to the activity and inactivity of the vital breaths does empirical life start and subside. Through drill and application, reduce it to inactivity. 

V-42. Due to the active and passive phases of ignorance do activities get started and cease. Dissolve it (ignorance) forcefully by winning a teacher and the instructions of the Shastras. 

V-43. By a mere quiver of the non-objective knowledge or by the suppression of vital breaths is mind reduced to mindlessness; that is the supreme status. 

V-44. Through the perception of Brahman, infallibly directed to it (bliss), behold that real bliss occasioned by the visioning of the knowable (as Brahman). 

V-45. That indeed is the non-factitious bliss which the mind does not reach; it is free from decline and growth; it neither rises nor sets. 

V-46. The mind of the knower is not called mind; mind indeed is the Truth of Spirit. Therefore, in the Fourth state, it transcends that state. 

V-47. Having renounced all mental constructions, equable, and with a quiescent mind, be a sage, wedded to the Yoga of renunciation, possessing both knowledge and freedom. 

V-48. The supreme Brahman is that which conforms to no act of mentation. (It is what remains) when mental activities completely die down and all masses of latent impulses have been liquidated. 

V-49. By securing right knowledge, and by unremitting concentration, those who become enlightened in the wisdom of the Upanishads are the Sankhyas and the others are the Yogins. 

V-50. Those are the Yogins, versed in Yoga, who, after the quiescence of the breaths through ascetic practices, achieve the status above sufferings, beginningless and endless.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 5 / The Siva-Gita - 5 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రధమాధ్యాయము
*🌻. భక్తి నిరూపణ యోగము - 4 🌻*

13. తతో న జాయతే భక్తి - శ్శివే కస్యాపి దేహినః,
తస్మాద విదుషో నైవ - జాయతే శూల పాణినః 

14. యధా కధం చిజ్ఞాతాపి మధ్యే విచ్చిధ్యతే నృణామ్,
జాతం వాసి శివ జ్ఞానం - విశ్వాసం నభ జత్యలమ్

అందుచేత నెవడి కైనను, పరమ శివుని పై భక్తి యంకురింపదు. ఆ కతంబున, పరమ శివుని పై భక్తి కలుగ కుండును. ఇది నిస్సందేహము అట్లు కాకుండ యే ప్రకారము గానో ఎంతో ప్రయత్నము తోడనో పరమ శివుని పై భక్తి కలిగినా, అది మధ్యనే కొంత సమయమునకు అనేక అడ్డంకు లేర్పడి నిష్పలమగును. అటుల కానిచో భక్తి చేత ప్రేమ అంకురించుట క్వాచిత్కము.

15. యద్యేవ్యం దేవతా విఘ్నమా చ రన్తి తనూబృతామ్,
పౌరుషం తత్ర కస్యాస్తి - యేన ముక్తిర్భ విష్యతి? 
సత్యం సూతాత్మజ! బ్రూహి - తత్రో పాయోస్తి వానవా ? 

అది విని, శౌనకాదులు సూతుని గురించి యిట్లు పలికిరి ! ఓయీ సూతకుమారా! ఈ విధముగా నమరులు తమ యధికారము మేరకు తృప్తి నొందని మానవు లాచరించు జ్ఞాన పద్దతికి పలు అడ్డంకులు కలిగించిన ముక్తి పదంబును పొందుటెట్లు.?  
పౌరుషము కలవాడు (పట్టుదల కలవారు ) వారొడ్డిన ఆటంకములను తొలగించే మార్గమేదైన కలదా ? అట్లుండినచో నా విధము మాకు తెలుపుమని అడుగగా సూతుండిట్లు పలికెను :

16. కోటి జన్మార్జి తై: పుణ్యై - శ్శివే భక్తి: ప్రజాయతే
ఇష్టా పూర్తా కర్మాణి - తేనా చరతి మానవః 

కోటి జన్మల నుండి సంగ్రహించిన పుణ్య ఫలము (సుకృతము వలన ) మహేశ్వరుని పై భక్తి కుదురుతుంది. 

అందుచేత (ఆ కారణమున ) మానవుడు తన ఇష్టానుసారముగా అనుష్టానము నాచరించుట, తటాకములను ద్రవ్వించుట, వృక్షములను నాటించుట చలి వేంద్రములను పెట్టించుట, క్షుదార్తులకు అన్న సత్రములను పెట్టించుట మొదలగు పుణ్య కార్యములను చేయ బూనెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 5 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 01: 
*🌻 Bhakti Niroopana Yoga - 4 🌻*

13. 14. That's why Devotion for Parama Shiva doesn't take birth in anyone, due to the Gods devotion for Shiva
doesn't remain constant. In case with a lot of efforts if someone manages to gain devotion for Lord Shiva,
due to the disruption from the demigods, the devotion gets interrupted. But when that doesn't happen, Love
for Lord Shiva emerges out of the devotion.

15. Hearing all these from Suta, Saunakadi Munis questioned Suta in this manner: Hey Sutakumara! If in this manner Gods of heaven keep obstructing humans from walking on the path of Gyana, how would humans
attain salvation? For tenacious people is there any way to nullify the obstructions caused by Gods? If such
an alternative exists to escape the disturbances from gods, kindly preach that tos us.To their questions,
Suta answered this way:

16. One gets devotion towards Maheshwara only if he has accumulated Virtues over the past crores of births.
Due to that devotion he performs many tasks for the sake of the humanity.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 10 🌹*
 📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. గోవుల కోసం రేఖ 🌻*

అయితే తాను కాలజ్ఞాన గ్రంధం రాయడంలో నిమగ్నమయ్యే సమయంలో గోవులు అచ్చమ్మగారి పొలం దాటి వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళిపోతూ ఉండేవి. ఇలా జరగకుండా వుండేందుకు ఒక పుల్లతో ఆ గోవుల చుట్టూ పెద్ద వలయం గీశాడు. ”ఈ వలయం దాటి మీరు ఎక్కడికీ వెళ్ళవద్దు” అని గోవులను ఆదేశించాడు. తర్వాత ప్రశాంతంగా తన కాలజ్ఞానాన్ని కొనసాగించారు.

పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. రకరకాల సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు.ఆ తర్వాత దానిపైన చింతచెట్టు మొలిచింది.

ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు? ఇలా ఎందుకు చేశారు? అనే దానికి మాత్రం ఇప్పటివరకు జవాబు దొరకలేదు. ఒకరోజు మామూలుగా తన విధి నెరవేర్చేందుకు పశువులను తోలుకుని కొండకు బయల్దేరారు వీరబ్రహ్మేంద్రస్వామి.

యధాప్రకారం గోవుల చుట్టూ ఒక వలయం గీసి, కాలజ్ఞానం రాసుకునేందుకు తాటియాకులు, చెట్ల ముళ్ళు కోసుకుని కొండ గుహలోకి వెళ్ళిపోయారు వీరబ్రహ్మేంద్రస్వామి. ఆయనను అనుసరిస్తూ వచ్చిన అచ్చమ్మ ఇదంతా చూసి ఒక అద్భుతాన్ని చూసిన విధంగా ఆశ్చర్యంలో మునిగిపోయింది.

తన దగ్గర గోవులకాపరిగా పనిచేస్తున్న వీరబ్రహ్మేంద్రస్వామి ఒక జ్ఞాని అని అప్పుడు తెలుసుకోగలిగింది అచ్చమ్మ.

కానీ, గుహలోకి వెళ్ళి ఆయనతో మాట్లాడటానికి భయపడింది. తపస్సు చేస్తున్న మాదిరిగా కాలజ్ఞానాన్ని రాస్తున్న బ్రహ్మంగారి ఏకాగ్రతను భగ్నం చేసేందుకు ఆవిడ భయపడింది. అప్పటికి ఆయనతో ఏమీ మాట్లాడకుండా ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది.

వీరబ్రహ్మేంద్రస్వామి గోవులను తోలుకుని తిరిగి రాగానే ఆయన పాదాలకు నమస్కరించి, తెలీక తాను చేసిన తప్పులన్నిటినీ మన్నించమని కోరింది.

”నాకు దూషణ అయినా, భూషణ అయినా ఒక్కటే. నీవయినా, తల్లి అయినా ఒక్కటే. ఈ ప్రపంచంలోని జీవులన్నీ నాకు సమానమే” అని చెప్పిన బ్రహ్మంగారిని తనకు జ్ఞానోపదేశం కలిగించమని కోరింది అచ్చమ్మ.

ఆ పని ప్రస్తుతం చేసేందుకు వీలు లేదని, సమయం వచ్చినప్పుడు యాగంటి అనే పుణ్యక్షేత్రంలో జ్ఞానోపదేశం చేయగలనని, చెప్పారు వీరబ్రహ్మేంద్రస్వామి. ఆరోజు కోసం ఎదురుచూడసాగింది అచ్చమ్మ.

వీరబ్రహ్మేంద్రస్వామి మాత్రం యధాప్రకారం కాలజ్ఞానాన్ని రాసి, అచ్చంమగారి ఇంటిలో ఒకచోట పాతిపెడుతూ ఉండేవారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. సౌందర్య లహరి - 47 / Soundarya Lahari - 47 🌹
📚. సంకలనము : ప్రసాద్ భరద్వాజ 

47 వ శ్లోకము

🌴. ఇష్ట దేవత సాక్షాత్కారం, సకల ప్రయత్నాల యందు సఫలత 🌴

శ్లో:47. బ్రువౌ భుగ్నే కించి ద్భువన భయ భంగ వ్యసనిని 
త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచి భ్యాం ధృతగుణమ్l 
ధనుర్మన్యే సవ్యేతరకరగృహీతం రతిపతేః
ప్రకోష్టే ముష్టౌచ స్థగయతి నిగూఢాంతరముమేll 
 
🌻. తాత్పర్యము : 
అమ్మా ! భువనమును భయముల నుండి పోగొట్టు ఓ పార్వతీ దేవీ, కొంచెముగా వంగిన నీ కనుబొమ్మలు తుమ్మెదల గుంపు అల్లెత్రాడు వలె వరుసకట్టి కుడిచేతితో పట్టుకుని ముంజేయి కప్పినట్టి రతీదేవి భర్త అయిన మన్మధుని విల్లుని తలపిస్తున్నాయి. విల్లు వలె భాసిస్తున్నాయి. కదా ! 
  
🌻. జప విధానం - నైవేద్యం :--

ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 25 రోజులు జపం చేస్తూ, కొబ్బరికాయ, పండ్లు, తేనె నివేదించినచో ఇష్ట దేవత సాక్షాత్కారం, సకల ప్రయత్నాల యందు సఫలత లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 SOUNDARYA LAHARI - 47 🌹
📚. Prasad Bharadwaj 

SLOKA - 47 

🌴 Obtaining grace of God and Victory in all efforts 🌴

47. Bhruvau bhugne kinchit bhuvana-bhaya-bhanga-vyasanini Tvadhiye nethrabhyam madhukara-ruchibhyam dhrita-gunam; Dhanur manye savye'tara-kara-grhitam rathipateh Prakoshte mushtau ca sthagayati nigudha'ntharam ume 
 
🌻 Translation :
Oh goddess Uma, she who removes fear from the world, the slightly bent eye brows of yours, tied by a hoard of honey bees forming the string feel resembles the bow of the god of love held by his left hand .and having hidden middle part, hid by the wrist, and folded fingers.

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) : 

If one chants this verse 1000 times a day for 25 days, offering honey, fruits and coconut as prasadam, it is believed that they will be achieve success in all efforts and can have darshan of deity.

🌻 BENEFICIAL RESULTS: 
Obtaining grace of God and all round success.
 
🌻 Literal Results: 
Deep insight, intellect and control over situations and people.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 346 / Bhagavad-Gita - 346 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 27 🌴*

27. యత్కరోషి యదశ్నాషి యజ్జుహోషి దదాసి యత్ |
యత్తపస్యసి కొన్తేయ తత్కురుష్వ మదర్పణమ్ ||

🌷. తాత్పర్యం :
ఓ కౌన్తేయ! నీవు ఏది ఒనరించినను, ఏది భుజించినను, ఏది హోమము చేసినను, ఏది దానమొసగినను,ఏ తపస్సు నాచరించినను వాటన్నింటిని నాకు అర్పణముగా ఒనరింపుము.

🌷. భాష్యము : 
ఎట్టి పరిస్థితి యందును శ్రీకృష్ణభగవానుని మరవకుండునట్లుగా జీవితమును మలచుకొనుట ప్రతియొక్కరి ధర్మము. దేహపోషణ కొరకు ప్రతియొక్కరు కర్మ చేయవలసియే ఉన్నందున తనకొరకు కర్మ చేయుమని శ్రీకృష్ణుడు ఇచ్చట ఉపదేశించుచున్నాడు. 

జీవనముకై ఆహారమును భుజించుట అవసరము గనుక కృష్ణునకు అర్పింపబడిన ఆహారమునే ప్రసాదరూపమున మనుజుడు గ్రహింపవలెను. అదే విధముగా నాగరికుడైన మనుజుడు ధర్మకార్యములను ఒనరింపవలసియున్నందున వానిని తన కొరకే చేయుమని శ్రీకృష్ణుడు పలుకుచున్నాడు. అదియే అర్చనము. 

ప్రతియొక్కరు ఏదియో ఒకదానిని దానమిచ్చు స్వభావమును కలిగియుందురు కావున దానిని తనకే ఒసగుమని శ్రీకృష్ణుడు ఉపదేశించుచున్నాడు. అనగా అధికముగా ప్రోగుపడిన ధనమును మనుజుడు కృష్ణచైతన్యోద్యమపు ప్రచారము కొరకై వినియోగించవలెను. 

ధ్యానము ఈ యోగమునకు ఆచరణయోగ్యము కానిదైనను మనుజులు దానియందే నేడు ఎక్కువ మక్కువను కలిగియున్నారు. కనుక ఎవరైనను మనుజులు దానియందే నేడు ఎక్కువ మక్కువను కలిగియున్నారు. 

కనుక ఎవరైనను హరేకృష్ణ మాహా మంత్రమును జపమాలపై జపించుచు శ్రీకృష్ణుని ఇరువదినాలుగుగంటలు ధ్యానింపగలిగినచో భగవద్గీత యందలి షష్టాధ్యాయమున వివరింపబడినట్లు గొప్ప ధ్యానతత్పరుడు మరియు గొప్పయోగి కాగలడు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 346 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 27 🌴*

27. yat karoṣi yad aśnāsi
yaj juhoṣi dadāsi yat
yat tapasyasi kaunteya
tat kuruṣva mad-arpaṇam

🌷 Translation : 
Whatever you do, whatever you eat, whatever you offer or give away, and whatever austerities you perform – do that, O son of Kuntī, as an offering to Me.

🌹 Purport :
Thus, it is the duty of everyone to mold his life in such a way that he will not forget Kṛṣṇa in any circumstance. 

Everyone has to work for maintenance of his body and soul together, and Kṛṣṇa recommends herein that one should work for Him. 

Everyone has to eat something to live; therefore he should accept the remnants of foodstuffs offered to Kṛṣṇa. 

Any civilized man has to perform some religious ritualistic ceremonies; therefore Kṛṣṇa recommends, “Do it for Me,” and this is called arcana. 

Everyone has a tendency to give something in charity; Kṛṣṇa says, “Give it to Me,” and this means that all surplus money accumulated should be utilized in furthering the Kṛṣṇa consciousness movement. 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 174 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴* 
39. అధ్యాయము - 14

*🌻. శివపూజ - 7 🌻*

సంతతి ర్వర్థతే తస్య యది లక్షావధిః కృతా | ద్రోణార్థేన భవేల్లక్షం విధానం విధిపూర్వకమ్‌ || 50

ముద్గానాం పూజనే దేవశ్శివో యచ్ఛతి సుఖమ్‌ | ప్రస్థానాం సప్తకేనైవ ప్రస్థార్ధేనాథ వా పునః || 51

పల ద్వయముతే నైవ లక్షముక్తం పురాతనైః | బ్రాహ్మణాశ్చ తథా భోజ్యా రుద్ర సంఖ్యా ప్రమాణతః || 52

ప్రియంగు పూజ నాదేవ ధర్మాధ్యక్షే పరాత్మని | ధర్మార్థ కామా వర్థంతే పూజా సర్వ సుఖావహా || 53

ప్రస్థైకేన చ తస్యోక్తం లక్షమేకం పురాతనైః | బ్రహ్మ భోజం తథా ప్రోక్తమర్క సంఖ్యా ప్రమాణతః || 54

లక్ష పరిమాణము గల బియ్యమును అర్పించు భక్తునికి సంతానము వర్ధిల్లును. ద్రోణము అనే పరిమాణములో సగము లక్ష అగును. ఇది శాస్త్రీయ విధానము (50). 

పెసలతో పూజించినచో శివుడు సుఖము నిచ్చును. ఏడున్నర ప్రస్థములకు (51) 

రెండు పలములను కలిపినచో లక్ష అగునని పూర్వర్షులు చెప్పిరి. మరియు, పదకొండు మంది బ్రాహ్మణులకు భోజనము నిడవలెను (52). 

ధర్మాధ్యక్షుడు, పరమాత్మయగు శివునకు ప్రియంగు ధాన్యము (కొర్ర ధాన్యము) ను సమర్పించినచో, ధర్మార్థకామములు వర్దిల్లి, సర్వసుఖములు కలుగును (53). 

ఈ ధాన్యమును ఒక ప్రస్థముతో కూడ ఒక లక్ష ప్రమాణములో అర్పించవలెనని పూర్వర్షులు చెప్పిరి. మరియు పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనము నిడవలెనని చెప్పబడినది (54).

రాజి కాపూజనం శంభోశ్శత్రోర్మృత్యుకరం స్మృతమ్‌ | సార్షపానాం తథా లక్షం పలైర్వింశతి సంఖ్యయా || 55

తేషాం చ పూజనాదేవ శత్రోర్మృత్యురుదాహృతః |ఆఢీకానాం దలైశ్చైవ శోభయిత్వార్చయేచ్ఛివమ్‌ || 56

వృతా గౌశ్చ ప్రదాతవ్యా బలీవర్దస్తథైవ చ | మహిచసంభవా పూజా శత్రోర్నాశకరీ స్మృతా || 57

నానా సుఖకరీ హ్యేషా పూజా సర్వఫలప్రదా | ధాన్యానామితి ప్రోక్తం మయా తే మునిసత్తమ || 58

శంభుని నల్ల ఆవాలతో పూజించినచో శత్రువు మృత్యువును పొందును. ఇరువది పలముల తెల్ల ఆవాలు ఒక లక్ష మానమగును. (55).

లక్ష ఆవాలతో శివుని పూజించుట తోడనే శత్రువు నశించును. కందిపువ్వుల దళములతో శివుని అలంకరించి పూజిచవలెను (56). 

దూడతో కూడిన ఆవును, ఎద్దును దానము చేయవలెను. మిరియాలతో పూజించినచో శత్రువు నశించునని చెప్పబడినది (57). 

ఈ పూజ సర్వసుఖములను, సర్వఫలములను ఇచ్చును. ఓ మునిశ్రేష్ఠా! నేను నీకింతవరకు ధాన్యములతో పూజచేయు విధమును తెలిపితిని (58).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 51 🌹*
Chapter 13
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

*🌻 The Winding and Unwinding of Sanskaras - 3 🌻*

The path to God is straight like a rod. One has to travel straight from one end of the rod to reach the other end.  

If one has natural sanskaras, he follows the force which prope him on his journey, and so he reaches t unnatural sanskaras, he cannot help but zig he other end soon.  

But if one has zag his way and he inevitably remains stuck in the same place. These unnatural sanskaras are like a rope that wraps itself tighter and tighter around the same spot, and one canno t continue his progress along the length of the rod.  

The natural sanskaras are also like a rope, but they wrap progressively around and around the rod, reaching further and further toward the end. In the gross world, physical actions are necessary. In the subtle and mental worlds, subtle and mental actions are necessary.  

Physical actions produce gross impressions, and if the physical actions are not natural, but are unnatural, then one gets very firmly bound in the gross world. 

 One is stuck in the gross wo rld, and it becomes virtually impossible for that person to progress toward the subtle and mental worlds. When the Avatar comes as a man it is in order to wipe out these unnatural impressions, and he wipes out these impressions by severing them.  

Since these unnatural impressions have been produced by physical actions, the Avatar also has to perform physical actions to annihilate them.  

Annihilation of unnatural sanskaras is his physical work in the gross world, and it is only when these unnatural knots of human consciousness are severed that we see he has come with a sword!  

For his work in the subtle and mental planes, the Avatar does not have to exert. It is only for the gross world that he must exert, and when he exerts, he suffers in order to cut through the unnaturalness in human consciousness.  

When his sword severs, it severs through to the root. The Avatar cuts through all the unnaturalness in the world, and gradually makes a path that becomes clear and natural for mankind to follow.  

These unnatural sanskaras are called the "sins of the world," natural sanskaras are called the because they are obstructions to the path of Truth.  

The "seeds of destiny," because they are what is necessary and essential for making the journey toward God. These unnatural sanskaras are obstructions in human consciousness in approaching the path of Truth, and because of them little progress in consciousness is ever made until the sword of Truth has severed their knots. 

The unnatural sanskaras are always the obstruction s on the road toward Truth. The poor man who is afflicted with unnatural sanskaras walks on a road of thorns. When one gets thorns stuck in his foot, one cannot move on in his journey until the thorns are removed.  

At this time the man calls out for help to remove them. The Avatar comes and uses a thorn to remove the thorns. Until the thorns are removed, further progress along the road is not possible.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 47 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 23
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆదిమూర్త్యాది పూజావిధి - 1 🌻*
*సర్వకార్య జయమునకు*

అథ త్రయోవింశో೭ధ్యాయః
అథాదిమూర్త్యాదిపూజావిధికథనమ్‌

నారద ఉవాచ:

వక్ష్యే పూజావిధిం విప్రా యం కృత్వా సర్వమాప్నుయాత్‌ | ప్రక్షాలితాం ఘ్రిరాచమ్య వాగ్యతః కృతరక్షణః 1

ప్రాజ్ముఖః స్వస్తికం బద్ద్వా పద్మాద్యపరమేవ వా | 2

యం భీజం నాభిమధ్యస్థం ధూమ్రం చణ్డానిలాత్మకమ్‌.
విశోషయేదశేషం తు ధ్యాయన్కాయత్తు కల్మషమ్‌ |

నారదుడు పలికెను.

విప్రులారా! ఏ పూజావిధిచే సర్వకార్యకామములును లభించునో దానిని చెప్పెదను. పాదప్రక్షాళనము చేసికొని, ఆచమనము చేసి, మౌన మవలంబించి, రక్ష చేసికొని, తూర్పుగా తిరిగి, స్వస్తికాసనమునందు కాని, పద్మాననము నందు గాని, మరొక ఆసనమునందు కాని కూర్చుండి, నాభి మధ్యలో నున్నదియు, ధూమ్రవర్ణము కలదియు, తీవ్ర వాయురూప మైనదియు అగు "యం" బీజమును ధ్యానించుచు శరీరమునుండి సకలకల్మషములను శోషింపచేయవలెను 

క్షౌం హృత్పంజ్వజమధ్యస్థం బీజం తేజోనిధిం స్మరన్‌ 3

అథోర్ధ్వతిర్యగ్గాభీస్తు జ్వాలాభిః కల్మషం దహేత్‌ |

హృదయపద్మ మధ్యమునందున్న తేజోనిధి యగు "క్షౌం" అను బీజమును స్మరించుచు, క్రిందికిని, పైకిని, అడ్డముగను ప్రసరించే జ్వాలలచే కల్మషమును దహించవలెను. 

శశజ్కాకృతివద్ధ్యాయేదమ్భరస్థం సుధామ్భుభిః 4

హృత్పద్మవ్యాపిభిర్దేహం స్వకమాప్లాపయేత్సుధీః | సుఘమ్నాయోనిమర్గేణ సర్వనాడీవిసర్పిభి. 5

ఆకాశమునందు చంద్రుని ఆకారము వంటి ఆకారమును ధ్యానము చేయవలెను. 

దాని నుండి స్రవించుచున్నదియు, సుఘమ్నా నాడిద్వారా సమస్త నాడులందును వ్యాపించుచున్నదియు, హృదయ పద్మమును వ్యాపించుచున్నవియు ఆగు అమృతధారలచేత తన దేహమును ని పవలెను 4, 5

శోధయిత్వా న్య సేత్తత్త్వం కరశుద్ధిరథాస్త్రకమ్‌ | వ్యాపకం హస్తయోరాదో దక్షిణాఙ్గుష్ఠతోఙ్గకమ్‌ 6

మూలం దేహే ద్వాదశాఙ్గం న్యసేన్మన్త్రైర్ధ్విషట్కకైః | హృదయం చ శిరశ్చైవ శిఖావర్మాస్త్రలోచనే 7

ఉదరం చ తథా పృష్ఠం బాహూరూ జానుపాదకమ్‌ |
ముద్రాం దత్త్వా స్మర్వేద్వివ్ణుం జప్త్వాష్టశతమర్చయేత్‌. 8

శోధనము చేసి తత్త్వనానము చేయవలెను. పిమ్మట కరశుద్ధి కొరకు అస్త్రవ్యాపకముద్రలను, చేయవలెను. కుడిచేతి ఆంగుష్ఠమునుండి కరతలము వరకు న్యాసము చేయవలెను. 

దేహమునందు పన్నెండు అక్షరముల మూల మంత్రముతో హృదయము, శిరస్సు, శిఖ వర్మ, అస్త్రము, నేత్రములు, ఉదరము, శరీరము వెనుక భాగము, బాహువులు, ఊరువులు, మోకాళ్లు, పాదములు అను ద్వాదశాంగములపై న్యాసము చేయవలెను ముద్రనిచ్చి విష్ణువును స్మరించి, ఆష్టోత్తరశతజపము చేసి పూజింపవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 62 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. అంగిరసమహర్షి - శ్రద్ధ - 7 🌻*

13. పతితో సహగమనం చేసిన సతి స్వర్గసుఖాన్ని అనుభవిస్తుంది. కానీ బ్రాహ్మణస్త్రీ సహగమనం చేయకూడాదు. తపస్సు, యోగమును అనుసరించి తాను విరాగినిగా ఉండవలసిందే! బ్రాహ్మణస్తీకి సహగమన నిషేధం ఎందుకంటే, స్వర్గసుఖంకోరి భర్తతో వెళ్ళకూడదని. తను వేరుగా తన జీవుడియొక్క మార్గాన్ని అనుసరించి వెళ్ళవలసిందే! 

అసలు విషయం ఏమిటంటే, మనుధర్మశాస్త్రానికి పూర్వం ఉండేటటువంటి ధర్మశాస్త్రములు అత్యుత్తమమైనవని, మనుధర్మశాస్త్రం అత్యుత్తమంకాదు అని అంగిరసుడు చెప్పాడని తరువాతివారు ఉదహరించారు.

14. అంగిరసుడిని ఇంద్రాగ్నితుల్యుడని చెప్పింది ఋగ్వేదం. అగ్ని అంగిరసుడేనని మరొకచోట చెప్పింది. అంగిరసుడె మొదట అగ్నిని ఆవాహనముచేసి మథించి గౌరవించినట్లు సుస్పష్టంగా తెలుస్తున్నది. 

అగ్నిదేవుడికి అంగిరసుడంటే చాలా గౌరవము. అందుచేతనె యజ్ఞ యాగాదులలో అంగిరసులచే ప్రోక్తమైన పద్ధతిలో ఆవాహనముచేస్తేనే అగ్ని తృప్తిచెందుతాడని సంప్రదాయంగా అనుకుంటారు. అంటే అంగిరసుడు చెప్పిన విధంగా అగ్నిని ఆవాహనచేస్తేనే అగ్ని ప్రసన్నుడవుతాడు. 

అధర్వణవేదంలో వాళ్ళను దేవతలుగాను, పితృదేవతలుగాను స్తోత్రంచేసారు. వాళ్ళను మహర్షులుగాను పేర్కొన్నారు. అంటే అంగిరసులు దేవతలు, పిత్రుదేవతలు, మహర్షులు అని మూడువిధాలుగా పేర్కొనబడ్డారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 126 🌹*
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

*🌻 All you need is to be aware of Being 🌻*

After all, you are what you are every moment of your life, but you are never conscious of it, except, maybe, at the point of awakening from sleep. 

All you need is to be aware of being, not as a verbal statement, but as an ever-present fact. 

The awareness that you are will open your eyes to what you are. It is all very simple. First of all, establish a constant contact with your self, be with yourself all the time. 

Into self-awareness all blessings flow. Begin as a center of observation, deliberate cognizance, and grow into a center of love in action. 

‘I am’ is a tiny seed which will grow into a mighty tree—quite naturally, without a trace of effort.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మనోశక్తి - Mind Power - 65 🌹*
 *Know Your Infinite Mind*
*🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴*
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻 Q 60:--మానవ దేహం యొక్క చరిత్ర - 1 🌻*

Ans :--
1) అంతర్ ప్రపంచాన్ని,జీవక్రియలను,
ప్రాణశక్తిని, విశ్వశక్తిని సంపూర్ణంగా వినియోగించుకోవడానికి అనుగుణంగా మన దేహంలోని జీవకణాల genetic నిర్మాణం ఉంది. మన దేహమంతా చైతన్య పదార్ధంతో నిండి ఉంది.

2) మానవ దేహం కొన్ని కోట్ల పరమాణువులు వల్ల ఏర్పడింది. పరమాణువులో electrons, protons, neutrons వుంటాయని మనందరికీ తెలుసు.

భూమికి,సూర్యునికి మధ్య చైతన్యశక్తి ఉండటం వల్ల వాటి మధ్య ఆకర్షణ కలిగింది. అలానే దేహంలోని ప్రతి పరమాణువు లోనూ కేంద్రకానికి ఎలక్ట్రాన్ కి మధ్య ఖాళీ ప్రదేశంలో కూడా చైతన్య శక్తి ఉంది. ఈ శక్తి వల్లే ఆకర్షణ కలిగి మన దేహం నిలిచి ఉంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందో పరమాణువు లోని electron కూడా తన చుట్టూ తాను తిరుగుతూ కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటుంది.

3) భూమికి సూర్యునికి మధ్య ఎంత దూరం ఉందో, పరమాణువు లోని కేంద్రకానికి electron కి మధ్య అంతే దూరం ఉంది.

4) భూమి మీదకు మానవులు ఎలాగైతే వివిధ దేహాకృతులతో వచ్చారో అలానే జంతువులు కూడా వివిధ దేహాకృతులతో భూమి మీదకు వచ్చాయి. ఈ రెండిటిలోనూ ఉన్నది ఆత్మే. ఈ రెండు జాతులు ఒకే పదార్ధంతో నిర్మింపబడ్డాయి..

5) భూమి మీద ఒక దేహాకృతిని తీసుకున్న జీవజాతి కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుంది. ఫలానా దేహాకృతి ద్వారా చైతన్య పరిణామం జరుగట్లేదన్నప్పుడు ఆ జీవజాతి భూమి మీద నుండి నిష్క్రమించి ఇంకో లోకానికి పయనం అవుతాయి. అక్కడ ఆ లోకానికి అనుగుణంగా దేహాన్ని ఏర్పరుచుకుని చైతన్య పరిణామం చెందుతాయి.

ఇప్పుడు మనం కలిగివున్న మానవదేహం కూడా ఆత్మ చైతన్య పరిణామం (అనగా ప్రేమ, కరుణ లో ఉన్నతి సాధించడం ఒక కృష్ణుడి లాగా) చెందడం కోసమే భూమి మీద సృష్టింపబడింది.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 5 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

  నచికేతుడు ఏం చేశాడు? మొదటి వరం అడిగాడు. ఓ వైవస్వతా! నా తండ్రి నన్ను మీ ఇంటికి పంపిన తరువాత నన్ను గురించి చింతించు చుండును. 

కావున నా తండ్రి ఎటువంటి చింతన లేక, ప్రసన్న చిత్తంతో ఉండునటుల అనుగ్రహింపుము. మరియు మీరు నన్ను తిరిగి ఇంటికి పంపినప్పుడు, నా తండ్రి నన్ను బాగుగా గుర్తించి, ప్రేమతో మాట్లాడునట్లు అనుగ్రహింపుము... 

ఎవరైనా మనల్ని వరం కోరుకోమంటే మనం ఏం అడుగుతాం? ముందు నా సంగతి ఏంటో చూడండి బాబూ అంటాం. అంతేనా కాదా? సర్వజీవులు అన్నీ కూడా స్వసుఖం అనేటువంటి దానిచేత ప్రేరేపితమై మాట్లాడుతూ వుంటాయి. 

ఇక్కడ ఓ జ్ఞానీ! అని ఈ నచికేతుడిని ఎందుకు సంబోధించారో ఇప్పుడు ఈ మొదటి వరం అడగడంలోనే మనం తెలుసుకోవాలి. తను నిజానికి తండ్రి చేత బాధించబడి పంపబడ్డాడు. కానీ తండ్రి యొక్క క్షేమాన్ని కాంక్షించాడు మొట్టమొదట. 

తనకు ఆయన గురువుగారు. తండ్రి మాత్రమే కాకుండా తపస్వి, గురువుగారు. ఆయన యొక్క అనుమతి వల్లనే ఆ యమాలయమునకు రాగలిగాడు. 

ఈ సత్యాన్ని గ్రహించినటువంటి నచికేతుడు మొట్టమొదట వరాన్ని ఏ దిశగా కోరాడు? అంటే, తన గురువుగారు సంతోషంగా వుండాలి. అంతే కాకుండా తన యెడల వ్యగ్రత భావాన్ని లేకుండా తనను చూడాలి. 

ఆ వరం కోరే విధానం కూడా ఎలా అడిగాడో చూడండి. ఆయన అభ్యర్థించాడు వరములు కోరుకోమని, ఈయన కోరికలు కూడా ఎంతో వినయశీలియై అభ్యర్థించాడు. ఇది చాలా ముఖ్యం.

            మనం పిల్లల్ని ఏమైనా నీకేమి కావాలో కోరుకోరా అని అడిగేప్పడు కూడా మనలో అహం వ్యక్తమౌతుంది. ఇచ్చేచేయి నాదనేటటువంటి అహం పనిచేస్తుంది. 

అడిగేవాడు కూడా అధికారంతోటి అడుగుతున్నాను. హక్కుగా అడుగుతున్నాను అనుకుంటాడు. కానీ, ఇచ్చేవారిలోనూ వినయశీలత, పుచ్చుకునే వారిలోనూ వినయశీలత ఎప్పుడైతే వుంటుందో ఇద్దరిలోనూ దివ్యత్వం రాణిస్తుంది.

      మీరందరూ ఇంట్లో గృహస్థుగా మీరు సాధారణంగా రోజూ చేసే పని ఏమిటీ అనంటే, అన్నం వండుతారు, మీ భార్య పిల్లలు మీ భర్త గారు అందరూ కలిసి భోజనం చేసే ప్రయత్నం చేస్తారు. 

సాధారణంగా గృహిణి స్థానంలో వున్నటువంటి భార్యగారు అందరికీ ఆహర సేవలను అందిస్తూ, వారికి అన్నీ వడ్డిస్తారన్నమాట! వడ్డించేటప్పడు ఎలా వడ్డించాలి? తినేటప్పుడు ఎలా వుండాలి? ఒక సేవను అందించేటప్పుడు ఎలా అందించాలి? అనేది చాలా ముఖ్యం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ‘ఇచ్చే చేయి నాది’ అనే అహం ఉండకూడదు. ‘చేసేవాడను నేను, నేనే చేస్తున్నాను’ అనే అహంతో చేయకూడదు. 

అలా గనుక చేశావనుకో అప్పుడు ఈశ్వరానుగ్రహానికి దూరం అవుతావు. పొందేవారు కూడా, సేవలను పొందేవారు కూడా ఈశ్వర ప్రసాదంగా ఆ సేవలను పొందాలి. 

కానీ భౌతికమైన, ఐహికమైన, సుఖభోగ ఇంద్రియ లాలసతో ఆ ఇంద్రియ విషయార్థములుగా వాటిని స్వీకరించకూడదు. ఈ రకంగా ఒకరి యెడల మరొకరు మానవ సంబంధాలలో దివ్యత్వాన్ని అనుగమించేటటువంటి ప్రతిక్షేపణ చేసుకోవాలి. 

       ఆ దివ్యత్వాన్ని ఎప్పుడైతే మనం అనుభూతం ఒనర్చుకునేటటువంటి పద్ధతిగా ఈ మానవసంబంధాలని కలిగివుంటావో అప్పుడు ప్రతి చోట మానవుడు దైవీ స్వరూపుడిగా మారిపోతాడు. నువ్వు దైవీభావనలోకి మారిపోతావు. ప్రతి చోట ‘నేను’ అన్న స్థానంలో ఆ ‘ఈశ్వరుడు’ వచ్చి కూర్చొంటాడు. 

ప్రతీ చోట ‘నేను’ అన్న స్థానంలో ‘నేను’ను తొలగించి, ఆ ఈశ్వరుడిని ప్రత్యక్షంగా అందులో ప్రతిపాదించాలన్నమాట. అంతేకాకుండా, ప్రతిక్షేపించాలి. ‘నేను’ అన్న ప్రతీ చోట ‘ఈశ్వరుడు’ని పెట్టడం అభ్యాసం చేయాలి.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 8 🌹*
✍️ Sri GS Swami ji 
📚. Prasad Bharadwaj

*🌻 Why do we need Guru? One should first and foremost have the yearning to find the light that is not touched by a shadow 🌻*

Because of that faith, he studied attentively and became proficient in Mathematics. This we understand. 

Because the teacher recited the tables with great confidence, the student became convinced of the competence of the teacher, and was inspired. 

The student, when he becomes proficient in Mathematics, realizes that his teacher not only is knowledgeable in the 100th multiplication table, but has a good grasp on the entire subject of Mathematics. 

The childhood impression that he had, that the 100th multiplication table is great knowledge, he now realizes was very immature. Similarly, it is impossible in the field of spirituality, for us to gauge on our own, the greatness of Guru.

Like that youngster, generally, seeing some evidence in Guru, and following the example of spiritual seekers who are more advanced, some people choose their own Guru. Even here, there are some problems. 

By seeing certain miracles, the grandeur, the skillful oratory, and the extensive propaganda, many people get fooled. Oh, so many followers, of so much of publicity, and such riches!

People become falsely impressed by these. Then what is the exact proof? First of all, why do we need Guru? 

One should first and foremost have the yearning to find the light that is not touched by a shadow, to satisfy the three fundamental desires that we have mentioned before. 

Only when such a thirst is present within you, and the search for guru begins, and association with some good souls occurs, then at some particular point, you will experience an extraordinary peace inside your heart.

It is only when you are filled with an eagerness for finding a spiritual Guru who is enlightened, that the possibility occurs that a competent Guru who is none other than the Supreme Soul, will enter your life. 

We are on a search for Guru. We are exerting a serious effort with devotion and sincerity to find someone who has experienced the highest knowledge and we are eager to savor it ourselves. 

Then Guru will certainly come into your life. When that happens, in His presence you forget all the turmoil that is in your life.

When you see that individual, when you experience the tremendous energy that permeates his presence, an inexplicable peace, and an indescribable joy is experienced. 

The undisclosed fear within the heart concerning our problems is replaced by the confidence that our problems will be overcome. Let us look at an example.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సృష్టి దివ్య సృజనాత్మకత - మానవజన్మ - సూక్ష్మ సృష్టి - కారణసృష్టి 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

త్రిగుణాత్మకమైన అవిద్య బ్రహ్మచైతన్యంతో సృజనాత్మకశక్తిని పొందినది. కనుక బ్రహ్మముతో చైతన్యవంతమైన అవిద్యనుండి వరుస క్రమములో ఆకాశం (శబ్దం), ఆకాశం నుండి వాయువు (స్పర్శ), వాయువు నుండి అగ్ని (రూపం), అగ్ని నుండి జలం (రసము), జలం నుండి భూమి (గంధం) పుట్టినవి.

ఈ పంచభూతములు స్వయంప్రకాశం లేనివి. అందువలన బ్రహ్మచైతన్యం క్రమశః ముందుగా ఆకాశం, తరువాత వాయువు, అగ్ని, జలం, భూమిలోనికి వ్యాపించుటవలన అయస్కాంతక్షేత్రములోని ఇనుప మేకులు ఐస్కాంతీకరణ చెందినట్లుగా ఈ పంచ భూతములు చైతన్యవంతమైనవి. అవిద్యనుండి ఉద్భవించిన ఈ సూక్ష్మభూతములు చైతన్యవంతమైనవి. 

అవిద్యనుండి ఉద్భవించిన ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను తన్మాత్రలు అందురు. అవిద్య లేక మూలప్రకృతి నుండి పుట్టిన మొదటి శబ్దమునే ఓంకారము అందురు. ఈ సృష్టి అంతయు ఆ ఓంకారము నుండే పుట్టినది. 

ఈ సూక్ష్మ పంచమహాభూతములు సత్వ, రజో, తమో గుణములు మూడునూ కలిగియుండును. ఈ త్రిగుణాత్మకమైన మూల అజ్ఞానమును లేదా అవిద్యను కారణసృష్టి అందురు. సూక్ష్మ పంచమహా భూతములు ఇందులోని భాగమే.

*🌹. స్థూలసృష్టి – సూక్ష్మ సృష్టి 🌹*

పంచీకరణము అనగా పంచతన్మాత్రలు లేక సూక్ష్మ పంచమహా భూతములు వివిధ పాళ్ళలో కలియుట ద్వారా స్థూలసృష్టికి దారితీయుట. 

 అపంచీకరణము అనగా వేటితోను కలవని, కలపని, సూక్ష్మ పంచమహాభూతములు. దీనినే సూక్ష్మసృష్టి అందురు. 
🌹🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సాయి తత్వం - మానవత్వం - 54 / Sai Philosophy is Humanity - 54 🌹*
🌴. అధ్యాయము - 7 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. బాబా పండరి ప్రయాణము - 1 🌻*

1. సాయిబాబా తన భక్తులనెట్లు ప్రేమించుచుండెనో వారి కోరికలను అవసరముల నెట్లు గ్రహించుచుండెనో యను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను.

2. నానాసాహెబు చాందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేషులోని నందూరుబారులో మామల్తదారుగా నుండెను.

3. అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యెను. సాయిబాబాయందు అతనికిగల భక్తి యను ఫలమానాటికి పండెను.

4. పండరీపురమును భూలోకవైకుంఠ మనెదరు. అట్టి స్థలమునకు బదిలీ యగుటచే నాతడు గొప్ప ధన్యుడు.

5. నానాసాహెబు వెంటనే పండరి పోయి ఉద్యోగములో ప్రవేసించవలసి యుండెను. శిరిడీలో యెవ్వరికీ ఉత్తరము వ్రాయక, హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యెను.

6. ముందుగా శిరిడీకిపోయి తన విఠోబాయగు బాబాను దర్శించి, ఆ తరువాత పండరికి పోవలెనను కొనెను.

7. నానాసాహెబు శిరిడీకి వచ్చు సంగతి యెవరికి తెలియదు. కాని బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. Sai Philosophy is Humanity - 54 🌹*
Chapter 7
✍️. Sri NV. Gunaji
📚. Prasad Bharadwaj

*🌻 Going to Pandharpur and Staying There - 1 🌻*

I shall now close this Chapter after relating a story illustrating how Sai Baba loved His devotees and anticipated their wishes and movements. 

Mr. Nanasaheb Chandorkar, who was a great devotee of Baba, was Mamlatdar at Nandurbar in Khandesh. He got an order of transfer to Pandharpur. 

His devotion to Sai Baba bore fruit, as he got an order to go and stay at Pandharpur which is regarded as the ‘BHUVAIKUNTHA’ - Heaven on earth. 

Nanasaheb had to take immediate charge, so he left, immediately, for the place, without even writing or informing anybody at Shirdi. 

He wanted to give a surprise visit to Shirdi - his Pandharpur, see and salute his Vithoba (Baba), and then proceed. 

Nobody dreamt of Nanasaheb’s departure for Shirdi, but Sai Baba knew all about this, as His eyes were everywhere (omniscient). 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శివగీత - 5 / The Siva-Gita - 5 🌹


*🌹. శివగీత - 5 / The Siva-Gita - 5 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రధమాధ్యాయము
*🌻. భక్తి నిరూపణ యోగము - 4 🌻*

13. తతో న జాయతే భక్తి - శ్శివే కస్యాపి దేహినః,
తస్మాద విదుషో నైవ - జాయతే శూల పాణినః 

14. యధా కధం చిజ్ఞాతాపి మధ్యే విచ్చిధ్యతే నృణామ్,
జాతం వాసి శివ జ్ఞానం - విశ్వాసం నభ జత్యలమ్

అందుచేత నెవడి కైనను, పరమ శివుని పై భక్తి యంకురింపదు. ఆ కతంబున, పరమ శివుని పై భక్తి కలుగ కుండును. ఇది నిస్సందేహము అట్లు కాకుండ యే ప్రకారము గానో ఎంతో ప్రయత్నము తోడనో పరమ శివుని పై భక్తి కలిగినా, అది మధ్యనే కొంత సమయమునకు అనేక అడ్డంకు లేర్పడి నిష్పలమగును. అటుల కానిచో భక్తి చేత ప్రేమ అంకురించుట క్వాచిత్కము.

15. యద్యేవ్యం దేవతా విఘ్నమా చ రన్తి తనూబృతామ్,
పౌరుషం తత్ర కస్యాస్తి - యేన ముక్తిర్భ విష్యతి? 
సత్యం సూతాత్మజ! బ్రూహి - తత్రో పాయోస్తి వానవా ? 

అది విని, శౌనకాదులు సూతుని గురించి యిట్లు పలికిరి ! ఓయీ సూతకుమారా! ఈ విధముగా నమరులు తమ యధికారము మేరకు తృప్తి నొందని మానవు లాచరించు జ్ఞాన పద్దతికి పలు అడ్డంకులు కలిగించిన ముక్తి పదంబును పొందుటెట్లు.?  
పౌరుషము కలవాడు (పట్టుదల కలవారు ) వారొడ్డిన ఆటంకములను తొలగించే మార్గమేదైన కలదా ? అట్లుండినచో నా విధము మాకు తెలుపుమని అడుగగా సూతుండిట్లు పలికెను :

16. కోటి జన్మార్జి తై: పుణ్యై - శ్శివే భక్తి: ప్రజాయతే
ఇష్టా పూర్తా కర్మాణి - తేనా చరతి మానవః 

కోటి జన్మల నుండి సంగ్రహించిన పుణ్య ఫలము (సుకృతము వలన ) మహేశ్వరుని పై భక్తి కుదురుతుంది. 

అందుచేత (ఆ కారణమున ) మానవుడు తన ఇష్టానుసారముగా అనుష్టానము నాచరించుట, తటాకములను ద్రవ్వించుట, వృక్షములను నాటించుట చలి వేంద్రములను పెట్టించుట, క్షుదార్తులకు అన్న సత్రములను పెట్టించుట మొదలగు పుణ్య కార్యములను చేయ బూనెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 5 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 01: 
*🌻 Bhakti Niroopana Yoga - 4 🌻*

13. 14. That's why Devotion for Parama Shiva doesn't take birth in anyone, due to the Gods devotion for Shiva
doesn't remain constant. In case with a lot of efforts if someone manages to gain devotion for Lord Shiva,
due to the disruption from the demigods, the devotion gets interrupted. But when that doesn't happen, Love
for Lord Shiva emerges out of the devotion.

15. Hearing all these from Suta, Saunakadi Munis questioned Suta in this manner: Hey Sutakumara! If in this manner Gods of heaven keep obstructing humans from walking on the path of Gyana, how would humans
attain salvation? For tenacious people is there any way to nullify the obstructions caused by Gods? If such
an alternative exists to escape the disturbances from gods, kindly preach that tos us.To their questions,
Suta answered this way:

16. One gets devotion towards Maheshwara only if he has accumulated Virtues over the past crores of births.
Due to that devotion he performs many tasks for the sake of the humanity.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 4

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 4 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

గురువుగారి అనుమతి తీసుకుని శిష్యుడు వెళ్ళాలి. తండ్రి యొక్క అనుమతి తీసుకుని పిల్లవాడు వెళ్ళాలి. 

ఈ “అనుమతి” - అనేది చాలా ముఖ్యమైనది. ఇవాళ్టి రోజున అనుమతితో పనిలేకుండా మనం అందరం జీవిస్తున్నాము, ఒకరి అనుమతితో మరొకరికి పనిలేదు. 

ఏ మానవ సంబంధాలలో అయితే ఈ అనుమతి అన్నటువంటి దానికి లోబడి జీవించడం అనేటటువంటి విధానం వుంటుందో అక్కడ అతి గొప్పదైనటువంటి నియమం ‘శరణాగతి’ అమలపరచ బడుతుంది. నీలో ఉన్నటువంటి దివ్యత్వానికి నేను దాసోహం. 

నీలో ఉన్నటువంటి చైతన్యానికి నేను దాసోహం. నీలో ఉన్నటువంటి వివేకానికి నేను దాసోహం. నీలో ఉన్నటువంటి విజ్ఞానానికి నేను దాసోహం. దాసోహం అంటే అర్థం ఇది. 

ఈ రకంగా ఎదుటి వ్యక్తిలో వున్నటువంటి వివేక, విజ్ఞానాలకు, దివ్యత్వానికి నువ్వు ఎప్పుడైతే శరణాగతుడవు అవుతావో, అప్పుడు ఆ ‘అనుమతి’ అనేటటువంటి విధానం నీలో ఏర్పడుతుంది. అట్లా ఎవరిలో అయితే వీటిని గుర్తించగలిగేటటువంటి లక్షణం వస్తుందో, వారిలో భక్తి, ప్రపత్తులు పెరుగుతాయి.    

ఎవరైతే వివేకానికి, విజ్ఞానానికి, విచారణకి, వస్తునిశ్చయ జ్ఞానానికి ప్రాధాన్యతను ఇచ్చి, దివ్యత్వ ప్రధానంగా జీవిస్తున్నటువంటి వాళ్ళ యొక్క అనుమతి కొరకు వేచియుంటారో, వారు ఆ అనుమతి ఇవ్వడం చేతనే వారి బలమంతా కూడా వీరికి సంక్రమిస్తుంది.

           అష్ట దిక్పాలకులలో ఒకడైనటువంటి యమధర్మరాజు బాలుడైనటువంటి నచికేతుడిని ‘అపరాధ క్షమాపణ’ అడుగుతున్నాడు. 

మనం జీవితంలో ఎప్పుడైనా క్షమించమని ఎవరినైనా అడిగామా? అడగాలంటే మన కిరీటం పోయినట్లు, మన సింహాసనం పోయినట్లు, లేకపోతే మన రాజ్యం అంతా విడిచి వెళ్ళిపోయినట్లు బాధపడిపోతూ వుంటాము, కదా! 

ఎవరినైనా క్షమించమని అడగాలంటే, మనకు చాలా బాధ కలుగుతుంది. చాలామంది క్షమాపణ అడుగుతారు, ఎట్లా అడుగుతారంటే? డిమాండ్‌ గా అడుగుతారు.  

పశ్చాత్తాప భావన లేదనుకోండి అదే పొరపాటుని మరల మరల మరల మరల పునః పునః చేస్తూ వుంటాం అన్నమాట. ఒక్కసారి పశ్చాత్‌ తాప పడినట్లయితే, మరలా ఆ పనిని తిరిగి చేయకుండా వుంటాం అన్నమాట. 

కాబట్టి, యమధర్మరాజు ఈ రీతిగా మనకి ధర్మాన్ని ఉపదేశిస్తున్నాడు. తన అపరాధమునకు, తెలియక జరిగినటువంటి అపరాధమునకు క్షమాపణ వేడుతున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శివగీత - 4 / The Siva-Gita - 4 🌹


*🌹. శివగీత - 4 / The Siva-Gita - 4 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రధమాధ్యాయము
*🌻. భక్తి నిరూపణ యోగము - 3 🌻*

09. నిత్యాగ్ని హోత్రి ణో విప్రు స్సన్తి ఏ గృహ మేధిన :
త ఏవ సర్వ ఫల దాస్సు - రాణాం కామదేనవ :

10. భక్ష్యం భోజ్యం చ పేయం చ - యద్యదిష్టం సుపర్వణామ్,
అగ్నౌ హుతేన హవిషా - తత్సర్వం లభ్యతే దివి 

11. నాన్య దస్తి సురేశానా - మిష్ట సిద్ది ప్రదం దివి,
దోగ్ద్రి దేనుర్య ధా నీతా - దుఃఖ దా గృహ మేదినామ్ 

12. తధైవ జ్ఞాన వాన్ విప్రో - దేవానాం దుఃఖ దో భవేత్,
త్రిద శాస్తేన విఘ్నన్తి - ప్రవిష్టా విషయం నృణామ్ 

ప్రపంచములో నెల్లప్పుడు ద్విజ శ్రేష్టుడు గృహస్తాశ్రమం లో నుండి జ్యోతిష్టో మము మొదలగు యజ్ఞములు చేయుచు, అమరవరుల కేయే వస్తువులు ఇష్టములో నాయా భక్ష్య భోజ్య , చోష్య పానాదులు బర్హిర్ముఖ శ్రేష్టులకు అగ్ని ద్వారా హవ్య దానం బొనర్చుచున్నాడో అతడే బృందా రకుల పాలిటికి గల్ప వృక్షము వంటి వాడు, ఆ దేవతల అంతులేని ఆనంద భరితులై నిర్మల మనస్కులై యగ్ని ద్వారా సమర్పించు వాటిని ప్రేమతో గైకుందురు.

కావున మానవుండైనను అమరుల కధిక ఆనంద దాయకము లైన యద్వరంబులను గావించి, వారి వారికి వహ్ని ద్వారా బలిని సమర్పించు చుండవలెను. అట్లు చేయకుండ యోగాద లొనర్చి, అమరులను విస్మరించి, కర్మలను త్యజించి వర్ణనా తీతమైన ఆనందాను భవ తృప్తీ నొంది న వాడైన ఎడల క్రతు భుక్తులు తమ కోరికలు దీరకుండుట వలన అసంతృప్తి చేత కుపితులై శాపింప బడుదురు 

మరియు, పాల నొసగు గోవును మరొకడు వేరు మార్గమున గొనిపోవ న గృహస్థుడు ఎంతటి వ్యధ గలవాడై చింతించి వెదకి మరల తన మార్గమునకు మరల్చు కొనునో, అదే రీతిగా దేవతలు మిగుల విచారము గలవారై తమ మార్గమును బరిత్య జించి మోక్ష గామి యగు వానిని యనేక విధముల ఆటంకము లనే గల్పించి ముందుకు బోనివ్వ కుండా అన్య మార్గమునకు బ్రవేశింప చేతురు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 4 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 01: 
*🌻 Bhakti Niroopana Yoga - 3 🌻*

09. In this world, the Brahmin who is a householder (gruhastha), doing Homams and Yagyams by dedicating food and beverages to Gods through fire; such Brahmins are like Kamadhenu to the Demigods because from their Yagyas and Havans the Gods get their food. 

10. The Gods accept these offerings with pleasant heart and happiness. (In turn Gods maintain timely rains and help the earth produce grains properly). 

11. So, it's a duty of Brahmins to regularly do the homams and yagyams and keep the Gods happy (to get food on 
earth in return). 

If Brahmins leave doing these fundamental duties to Gods and immerse themselves in Yoga and in learning about the absolute Brahman (Supreme Lord) and attain pleasure in serving him through the path of knowledge/bhakti, it makes Gods unhappy since they wouldn't get their share of food through sacrifices.

12. For that reason they may become unhappy and may curse. If someone else steals the milk giving cow and takes in a different direction the way its actual owner would feel uncomfortable and would want to get it back, same way these demigods also feel uncomfortable when some Brahmin deviates away from his path of normal duties towards the path of Salvation, and in order to get him back for their happiness they try to create disturbances in all possible ways on the devotee's path towards salvation.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

18-July-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 431 / Bhagavad-Gita - 430🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 219 / Sripada Srivallabha Charithamrutham - 219 🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 99🌹 
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 122 🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 35 / Sri Lalita Sahasranamavali - Meaning - 35 🌹
6) 🌹 VEDA UPANISHAD SUKTHAM - 62 🌹
7) 🌹. నారద భక్తి సూత్రాలు - 39 🌹 
8) 🌹. శివగీత - 4 / The Shiva-Gita - 4🌹 
9)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 9 🌹 
10) 🌹. సౌందర్య లహరి - 46 / Soundarya Lahari - 46🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 345 / Bhagavad-Gita - 345 🌹

12) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 173🌹 
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 50 🌹
14) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 46🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 61 🌹 
16) 🌹 Seeds Of Consciousness - 125 🌹
17) 🌹. మనోశక్తి - Mind Power - 64 🌹
18) 🌹 Guru Geeta - Datta Vaakya - 7 🌹
19) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 4 🌹
20) 
21) 🌹. సాయి తత్వం - మానవత్వం - 53 / Sai Philosophy is Humanity - 53🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 431 / Bhagavad-Gita - 431 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 40 🌴*

40. నమ: పురస్తాదథ పృష్టతస్తే
నమో(స్తు తే సర్వత ఏవ సర్వ |
అనన్తవీర్యామితవిక్రమస్త్వం
సర్వం సమాప్నోషి తతో(సి సర్వ: ||

🌷. తాత్పర్యం : 
నీకు ముందు నుండి, వెనుక నుండి, సర్వదిక్కుల నుండి నమస్కారముల నర్పించుచున్నాను. ఓ అనంతవీర్యా! నీవు అమితవిక్రమ సంపన్నుడవు మరియు సర్వవ్యాపివి. కనుకనే సర్వమును నీవే అయి యున్నావు.

🌷. భాష్యము : 
అర్జునుడు తన స్నేహితుడైన శ్రీకృష్ణుని యెడ ప్రేమపారవశ్యముచే అన్నివైపుల నుండి నమస్సుల నర్పించుచున్నాను. శ్రీకృష్ణుడు సకల పరాక్రమములకు, శక్తులకు ప్రభువనియు, యుద్దరంగమునందు కూడియున్న మహాయోధులందరికన్నను అత్యంత ఘనుడనియు అర్జునుడు ఆంగీకరించుచున్నాడు. ఈ విషయమునకు సంబంధించినదే విష్ణుపురాణమున (1.9.69) ఇట్లు చెప్పబడినది.
యో(యం తవాగతో దేవ సమీపం దేవతాగణ: |
స త్వమేవ జగత్స్రష్టా యత: సర్వగతో భవాన్ ||
“ఓ దేవదేవా! నిన్ను సమీపించు ఎవ్వరైనను (దేవతలైనను సరియే) నీ చేత సృష్టింపబడినవారే.”
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 431 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 40 🌴*

40. namaḥ purastād atha pṛṣṭhatas te
namo ’stu te sarvata eva sarva
ananta-vīryāmita-vikramas tvaṁ
sarvaṁ samāpnoṣi tato ’si sarvaḥ

🌷 Translation : 
Obeisances to You from the front, from behind and from all sides! O unbounded power, You are the master of limitless might! You are all-pervading, and thus You are everything!

🌹 Purport :
Out of loving ecstasy for Kṛṣṇa, his friend, Arjuna is offering his respects from all sides. He is accepting that He is the master of all potencies and all prowess and far superior to all the great warriors assembled on the battlefield. It is said in the Viṣṇu Purāṇa (1.9.69):

yo ’yaṁ tavāgato deva
samīpaṁ devatā-gaṇaḥ
sa tvam eva jagat-sraṣṭā
yataḥ sarva-gato bhavān

“Whoever comes before You, even if he be a demigod, is created by You, O Supreme Personality of Godhead.”
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 219 / Sripada Srivallabha Charithamrutham - 219 🌹*
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 41
*🌴. దత్తదీక్షా ప్రహసనం (శ్రీపాదులకు 16ఏళ్ళు) - 1 🌴*
*🌻. వాక్కుల భేదాలు 🌻*

పరా, పశ్యంతీ ఆదిగాకల వాక్కులని వివరించమని నేను భాస్కరశాస్త్రిని కోరాను. 

బయటకు వినబడే వాక్కు స్థూలవాక్కు, బయటకు ఏ మాత్రమూ వినిపించకుండా లోలోపలనే ఉంటూ పెదిమల కదలికలోనే కనిపించే వాక్కు మధ్యమావాక్కు, దీనికంటె సూక్ష్మంగా ఉండేది వైఖరీ వాక్కు, వాక్కు కంఠగతమై అంటే గొంతులోనే ఉండిపోయి బయటకు రాకుండా మనసులో మెదలుతుంటే అది పశ్యంతీవాక్కు. 

దీనికంటె సూక్ష్మంగా నాభిలోనే సంకల్పమాత్రంగా ఉండే వాక్కు పరావాక్కు అంటారని విశదీకరించారు. 

🌻. త్రిపురభైరవి 🌻

 అలాగే అంబికను త్రిపురభైరవిగా ఆరాధించుతారని చెప్పుతూ గుణత్రయములు, జగత్రయములు, అవస్థా త్రయములు మూర్తి త్రయములు మొదలైన అన్ని త్రయా లకు ఆమె అధీశ్వరి అని పరిపూర్ణమైన శ్రద్ధతో, ఆత్మ సమర్పణ చేసుకొని సంపూర్ణ శరణాగతి చెందితే ఈ లోకంనుండి కాని, మనకంటికి కనిపించని లోకాలనుండి కాని ఎటువంటి శతృత్వం ఎదురయినా పరోక్షంగా ఉంటూ మనకు ఏ కీడు జరగకుండా కాపాడుతుందని, వ్యక్తి ఆధ్యాత్మికంగా చక్కటి పురోగతి సాధించినట్లయితే భౌతిక ప్రపంచంలో ఏ రకంగా జీవిస్తున్నాడో అదేవిధంగా అదృశ్య లోకాల లో కూడా జీవించగల్గుతాడని చెప్పారు. 

అభివృద్ధి సాధించాలంటే ముఖ్యంగా శ్రద్ధ, దానితోపాటు దృఢమైన విశ్వాసం ఉండాలి. ఈ సృష్టికి అధిపతి అయిన పర మాత్మని, వారి తత్వాన్ని, సర్వ ఙ్ఞతని, సర్వవ్యాపకత్వాన్ని పూర్తి నమ్మకంతో అంగీకరించగలగడాన్ని శ్రద్ధ అంటారు. 

అవసరమైన వేళలో తప్పకుండా పరమాత్మయొక్క సహాయం అందుతుంది అనే స్థిరమైన భావననే విశ్వాసం అంటారు. 

ఈ రెండు స్థిరంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక ప్రగతి పథంలో పయనించడం, పరిణతిని పొందడం ముమ్మాటికి నిశ్చయం. 

శ్రద్ధ, విశ్వాసంలాగే ఙ్ఞానం, శక్తి కూడా పరస్పరం ఆధారంగాను, ఆధేయంగాను ఉంటాయి. శక్తిహీనమైన ఙ్ఞానం నిర్లిప్తతను కలిగిస్తే ఙ్ఞానహీనమైన శక్తి విచక్షణా రహితమై వినాశనానికి దారి తీస్తుంది. 

అందువల్ల ఙ్ఞానంతో ప్రకృతి బంధాలనుండి ముక్తుడై, విచక్షణాయుతమైన శక్తితో పరిపూర్ణత సాధించాలి, అని వివరించారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sripada Srivallabha Charithamrutham - 219 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj 

CHAPTER 22
*🌻 The Story of Gurudatta Bhatt Only Sripada will give the fruit written in Horoscope - 4 🌻*

My Dear! Shankar Bhatt! I was spoiled hearing the words of mean people. Sripada saved me from going to the birth of an ‘aghori’ in this way.  

If I was left to my fate, I would have fallen completely. Sadguru will save us from the results of karma of previous births skillfully because of the selfless love they have on ordinary human beings. For this they spend their priceless power and time. 

Sripada’s horoscope should be calculated from Sandra Sindhu Vedam, The Thithi, day and star also will be in accordance with Sandra Sindhu Vedam.  

Sripada, Appala Raju Sharma and Bapanarya would speak in Sanskrit also apart from Telugu. Sometimes they speak in ‘Sandhya’ bhasha, usually in vogue in the sacred land of seven rishis in Himalayas.  

The language spoken in Shambala is different from Sanskrit. The sweetness or the beauty of that language can not be described.  

In Sri Peethikapuram, only Sripada, Bapanarya and Appala Raju Sharma were able to speek this language. Sripada once told Bapanarya, who was famous as ‘Satya Risheeswara’. ‘Thatha! Srikrishna would not talk truth or untruth. He would only teach what was to be done.’  

Then Bapanarya told Sripada, ‘Kanna! Always one should speak the truth. Casually also one should not tell a lie.’ Sripada smiled.  

In the afternoon on the same day, Venkatappaiah Shresti came to Bapanarya’s house. Shresti had a strong desire that Sri Bapanarya should take food in his house and after that he should also take ‘dakshina’ given by him without fail.  

That also should happen in the most sacred days of ‘Mahalaya Pakshas' (15 days in the month of Bhadrapada). His thinking was that his ‘pithru devathas’ (ancestors) would be pleased very much.  

He had a doubt in his mind whether Bapanarya would accept for this proposal or not. Even then, he thought of Sripada in his mind and put this proposal in front of Bapanarya. 

 Bapanarya promised that he would take food in Shresti’ house in ‘Mahalaya Paksha So’ and take dakshina also. Shresti was very much happy.  

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 99 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. భాగవత రహస్యము - 1 🌻*

పండితులు, కవులు, విమర్షకులు సామాన్య ప్రజలను పామరులని, అజ్ఞానులని భావించుట‌ మదమును తెలియజేయును. సామాన్య ప్రజలే అసామాన్య ప్రజలు. వారి స్వభావము సార్వకాలికము. వారి ధర్మములు శాశ్వతములు. 

విజ్ఞానము, నాగరికత మారుచుండవచ్చును. అవి కేలండర్లలోని ‌పేజీల వంటివి. అవసరము తీరినంతనే చింపిపారవేయవలసినవి. ఈ పుటలు చింపబడక తప్పదు. కాని సంవత్సరము వర్తించుచునే ఉండును. ఇట్లు లక్షల సంవత్సరములు జరుగును. 

సామాన్య ప్రజల స్వభావ ధర్మములు, వారు వెలుగు బాటలలో ఆరోహించి తరించునట్టి సోపాన క్రమము శాశ్వతములు. ఆ సోపానములపై ధూళి రేణువుల వలె పండితులు; సంఘ సంస్కర్తలు, విమర్షకులు, కవులును ఎగురుచుందురు. ఇది నరజాతి శాశ్వత కథలో ఒక భాగము. 

ఈ పండిత విమర్షకాదులు, సంఘ సంస్కర్తలు ‌సామాన్య ప్రజలకు ఏమియును చేయలేరనుటకు కారణమైన రహస్యము ఒకటి ఉన్నది. 

లోకవైఖరి ఒక మహాసముద్రము. ఈ వైఖరిలో, ఈ సామూహిక స్వభావములో ఎవనికి వాడు‌ ఈదులాడుచు, ఈ సముద్రమును‌ ఒక మార్గము పట్టింపగలనను‌ భ్రాంతిలో చనిపోవుచుందురు.

వ్యక్తులలో ప్రత్యేకముగా ఆదర్శములు, ఆశయములు ఉన్నను, అవి సంఘమను రథమునకు దీపముల వంటివే గాని, సారథుల వంటివి‌ కావు...
.....✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 121 🌹*
*🌴 The Art of Breathing - 5 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

*🌻 The Practice of Breathing Exercises - 1 🌻*

When doing exercises, we should sit comfortably and focus our attention on breathing. 

The first step is to observe inhaling and exhaling for a while – without holding our breath or pausing. The mind stops to generate too many thoughts, except for the thoughts that relate to breathing. 

This leads us to the neutralization of in/exhalation where we experience the resonance of the pulsation in the cave of the heart, e.g. at the tip of the midriff. 

When this resonance is felt from the hear to the throat center, we can move on to the second step: to stop inhaling without stopping to exhale. 

However, we should not be in a hurry to turn to advanced stages as long as the first step is not experienced distinctively. 

Later, when the resonance progresses upward, we can begin to work with the stopping of exhalation. 

This will push the pulsation even further upward to achieve the touching of the soul.

🌻 🌻 🌻 🌻 🌻 🌻 
Sources used: Master K.P. Kumar: On Healing / Hercules / notes from seminars.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 35 / Sri Lalita Sahasranamavali - Meaning - 35 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శ్లోకం 66*

281. ఉన్మేషనిమిషోత్పన్న విపన్నభువనావళి - 
తెరువబడుటతోను, మూయబడుటతోను పుట్టిన లీనమైన చతుర్దశ భువనములు కలది.

282. సహస్రశీర్షవదనా - 
వెయ్యి లేదా అనంతమైన శిరస్సులతో, ముఖములు కలది.

283. సహస్రాక్షీ - 
వెయ్యి లేదా అనంతమైన కన్నులు కలది.

284. సహస్రపాత్ - అనంతమైన పాదములు కలది.

*🌻. శ్లోకం 67*

285. ఆ బ్రహ్మకీటజననీ - 
బ్రహ్మ నుండి కీటకముల వరకు అందరికీ తల్లి.

286. వర్ణాశ్రమ విధాయినీ -
 వర్ణములను, ఆశ్రమములను ఏర్పాటు చేయునది.

287. నిజాజ్ఞారూపనిగమా - 
తనయొక్క ఆదేశములే రూపుగట్టుకొనిన వేదములు అయినది.

288. పుణ్యాపుణ్యఫలప్రదా -
 మంచిపనులకు, చెడ్డపనులను వాటి వాటికి తగిన ఫలములను చక్కగా ఇచ్చునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 35 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 35 🌻*

281 ) Unmesha nimishotpanna vipanna bhuvanavali -   
She who creates and destroys the universe by opening and closing of her eye lids

282 ) Sahasra seersha vadana -   
She who has thousands of faces and heads

283 ) Saharakshi -   
She who has thousands of eyes

284 ) Sahasra path -   
She who has thousands of feet

285 ) Aabrahma keeda janani -   
She has created all beings from worm to Lord Brahma

286 ) Varnashrama vidhayini -   
She who created the four fold division of society

287 ) Nijangna roopa nigama -   
She who gave orders which are based on Vedas

288 ) Punyapunya phala pradha -   
She who gives compensation for sins and good deeds.

Continues..
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 38 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 25

*🌻. 25. సాతు కర్మ జ్ఞాన యోగేభ్యో ఽప్యధికతరా - 1 🌻*

            ఇప్పటిదాకా పరాభక్తి లక్షణం గురించి వివరించడమైనది. ఇక పరాభక్తి యొక్క గొప్పతనం (మహత్వం) తెలుపుచున్నారు. 

ఈ పరాభక్తి కర్మ, జ్ఞాన యోగాలు మూడింటికంటె గొప్ప ఫలసిద్ధిగా ఉన్నది.

            జ్ఞాన యోగంలో నిత్యానిత్య వస్తు వివేచనా శక్తి, దానితో ఆత్మానాత్మ వివేకం బాగా పనిచేస్తుంది. 

కర్మ యోగంలో లౌకిక పదార్థాల మీద ఇచ్ఛను నిగ్రహించి, కర్మలు చేయడంలో నేను, నాది అనే వాటిని లేకుండా చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. 

భక్తి యోగంలో భగవంతుడిని ఆయన కల్యాణ గుణాలను కీర్తిస్తూ, అవతారుల సచ్ఛరిత్రలను చదువుతూ వారి లీలలను వింటూ మననం చేస్తూ, గానం చేస్తూ పరవశించడం ద్వారా నేను, నాది నుండి దూరమౌతారు.

            యోగమేదైనా అనుభవం ఒక్కటే. సచ్చిదానందానుభవమే మోక్షమని అద్వైతం, పరమప్రేమ రూపమే మోక్షమని రామానుజ మతం, రాధాకృష్ణుల ప్రేమైక్యతయే మోక్షమని చైతన్యమతం చెప్తున్నాయి.

            సాధక జనులను పెద్దలు మూడు తరగతులుగా విభజన చేశారు. 

(1) హృదయ ప్రధానులు అనగా ఆవేశానుభూతిపరులు. వీరికి భక్తి మార్గం చూపబడినది. 

(2) బుద్ధి ప్రధానులు. అనగా కేవలం వివేకి అగు మానవులు. వీరికి వివేచనా పూర్వకమైన జ్ఞాన మార్గం చూపబడినది. 

(3) హృదయ, బుద్ధి ప్రధానులు. అనగా చురుకైనవారు. వీరు హృదయపు విలువలకు, బుద్ధి సూత్రాలకు మధ్య ఊగులాడుతూ ఉంటారు. ఇట్టి సమ్మిళిత ప్రవృత్తి కలవారికి నిష్కామకర్మ యోగ మార్గం చూపబడింది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. VEDA UPANISHAD SUKTHAM - 62 🌹*
*🌻 1. Annapurna Upanishad - 23 🌻*
--- From Atharva Veda
✍️ Dr. A. G. Krishna Warrier
📚. Prasad Bharadwaj

V-31. Resort to that spiritual, impartite Principle when the down-breath has set and, for a moment, the up-breath has not yet arisen. 

V-32. Resort to that spiritual impartite Principle, at the tip of the nose where the breaths revolve, before the down-breath sets while the up-breath has done so. 

V-33. These three worlds are only an appearance, neither existent nor non-existent; (the consequent) renunciation of all concern with another, the wise maintain, is right knowledge. 

V-34. Noble Brahmin! Even this appearance is distorted by the mirror of the mind. Therefore, giving up that, too, be rid of all appearances. 

V-35. Uprooting this fearful demon of the mind, detrimental to the essence of steadiness, remain what you are; be steadfast. 

V-36. The Spirit that is beyond cause and effect and is likened to the (boundless) sky is incapable of confrontation by any (real) object; it remains at the end of all mental processes. 

V-37. The satisfaction (felt) at the moment of desire is caused by that very desire. This satisfaction lasts only till discontent (sets in); therefore, reject desire. 

V-38. Reduce desire to desirelessness; let conceptions cease; let mind grow into mindlessness in the process of your life without attachment. 

V-39. Acting through sense organs, free from (the force) of latent impulses, like the sky, you would not alter though there be a thousand disturbances. 

V-40. Due to the activity and the inactivity of the mind does empirical life start and subside. Through the suppression of latent impulses and the vital breath, reduce the mind to inactivity.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 4 / The Siva-Gita - 4 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రధమాధ్యాయము
*🌻. భక్తి నిరూపణ యోగము - 3 🌻*

09. నిత్యాగ్ని హోత్రి ణో విప్రు స్సన్తి ఏ గృహ మేధిన :
త ఏవ సర్వ ఫల దాస్సు - రాణాం కామదేనవ :

10. భక్ష్యం భోజ్యం చ పేయం చ - యద్యదిష్టం సుపర్వణామ్,
అగ్నౌ హుతేన హవిషా - తత్సర్వం లభ్యతే దివి 

11. నాన్య దస్తి సురేశానా - మిష్ట సిద్ది ప్రదం దివి,
దోగ్ద్రి దేనుర్య ధా నీతా - దుఃఖ దా గృహ మేదినామ్ 

12. తధైవ జ్ఞాన వాన్ విప్రో - దేవానాం దుఃఖ దో భవేత్,
త్రిద శాస్తేన విఘ్నన్తి - ప్రవిష్టా విషయం నృణామ్ 

ప్రపంచములో నెల్లప్పుడు ద్విజ శ్రేష్టుడు గృహస్తాశ్రమం లో నుండి జ్యోతిష్టో మము మొదలగు యజ్ఞములు చేయుచు, అమరవరుల కేయే వస్తువులు ఇష్టములో నాయా భక్ష్య భోజ్య , చోష్య పానాదులు బర్హిర్ముఖ శ్రేష్టులకు అగ్ని ద్వారా హవ్య దానం బొనర్చుచున్నాడో అతడే బృందా రకుల పాలిటికి గల్ప వృక్షము వంటి వాడు, ఆ దేవతల అంతులేని ఆనంద భరితులై నిర్మల మనస్కులై యగ్ని ద్వారా సమర్పించు వాటిని ప్రేమతో గైకుందురు.

కావున మానవుండైనను అమరుల కధిక ఆనంద దాయకము లైన యద్వరంబులను గావించి, వారి వారికి వహ్ని ద్వారా బలిని సమర్పించు చుండవలెను. అట్లు చేయకుండ యోగాద లొనర్చి, అమరులను విస్మరించి, కర్మలను త్యజించి వర్ణనా తీతమైన ఆనందాను భవ తృప్తీ నొంది న వాడైన ఎడల క్రతు భుక్తులు తమ కోరికలు దీరకుండుట వలన అసంతృప్తి చేత కుపితులై శాపింప బడుదురు 

మరియు, పాల నొసగు గోవును మరొకడు వేరు మార్గమున గొనిపోవ న గృహస్థుడు ఎంతటి వ్యధ గలవాడై చింతించి వెదకి మరల తన మార్గమునకు మరల్చు కొనునో, అదే రీతిగా దేవతలు మిగుల విచారము గలవారై తమ మార్గమును బరిత్య జించి మోక్ష గామి యగు వానిని యనేక విధముల ఆటంకము లనే గల్పించి ముందుకు బోనివ్వ కుండా అన్య మార్గమునకు బ్రవేశింప చేతురు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 4 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 01: 
*🌻 Bhakti Niroopana Yoga - 3 🌻*

09. In this world, the Brahmin who is a householder (gruhastha), doing Homams and Yagyams by dedicating food and beverages to Gods through fire; such Brahmins are like Kamadhenu to the Demigods because from their Yagyas and Havans the Gods get their food. 

10. The Gods accept these offerings with pleasant heart and happiness. (In turn Gods maintain timely rains and help the earth produce grains properly). 

11. So, it's a duty of Brahmins to regularly do the homams and yagyams and keep the Gods happy (to get food on 
earth in return). 

If Brahmins leave doing these fundamental duties to Gods and immerse themselves in Yoga and in learning about the absolute Brahman (Supreme Lord) and attain pleasure in serving him through the path of knowledge/bhakti, it makes Gods unhappy since they wouldn't get their share of food through sacrifices.

12. For that reason they may become unhappy and may curse. If someone else steals the milk giving cow and takes in a different direction the way its actual owner would feel uncomfortable and would want to get it back, same way these demigods also feel uncomfortable when some Brahmin deviates away from his path of normal duties towards the path of Salvation, and in order to get him back for their happiness they try to create disturbances in all possible ways on the devotee's path towards salvation.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 9 🌹* 
 📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. కాలజ్ఞాన రచనకు అనువైన ప్రదేశాన్ని ఎన్నుకొనుట 🌻*

బ్రహ్మంగారు చేసే కొన్ని పనులు వినేందుకు చాలా విచిత్రంగా ఉండేవి. ఆయన ఒకవైపు కొండగుహలో కూర్చుని కాలజ్ఞానం రాస్తూ ఉండేవారు. మరోవైపు పశువుల కాపరిగా తన బాధ్యతను నిర్వర్తించేవారు.

తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చుట్టి వచ్చేందుకు బయల్దేరిన వీరబ్రహ్మేంద్రస్వామి బనగానపల్లెకు చేరారు. ఆరోజు పగలంతా ప్రయాణం చేయడంతో బాగా అలసిపోయారు. 

రాత్రికి ఆ ఊరిలోని ఒక ఇంటి వద్దకు చేరారు. నిద్రా సమయం ఆసన్నం కావడంతో అక్కడున్న అచ్చమ్మ అనే స్త్రీ ఇంటిముందు ఉన్న అరుగుపైన నిద్రకు ఉపక్రమించారు.

మరుసటిరోజు పొద్దున్నే అచ్చమ్మగారు, తన ఇంటి అరుగుమీద పడుకున్న వీరబ్రహ్మేంద్రస్వామిని చూశారు. ఈ సన్యాసి ఎవరో అని కుతూహలం కలిగి, ఆయనను వివరాలు అడిగారు. 

తాను బతుకుతెరువు కోసం వచ్చానని, ఏదో ఒక పని చేయదలచానని చెప్పగా, తన దగ్గర ఉన్న గోవులను తోలుకెళ్ళమని చెప్పింది అచ్చమ్మ. 

అలా గోవుల కాపరిగా మారిన వీరబ్రహ్మేంద్రస్వామి ఆవులను తీసుకుని దగ్గరలో ఉన్న రవ్వలకొండ దగ్గరకు వెళ్ళాడు.

ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణం ఆయనను ఎంతో ఆకర్షించింది. ఆ ప్రదేశాన్ని కాలజ్ఞానం రాసి, అందరికీ తెలియజెప్పేందుకు తగిన ప్రదేశంగా నిర్ణయించుకున్నారు. ఒక గుహను తనకు ఆవాసయోగ్యంగా చేసుకున్నారు.

ప్రతిరోజూ గోవులను తీసుకుని వచ్చి, వాటిని పొలంలో వదిలిపెట్టి మనసును కేంద్రీకరించి ధ్యానంలో మునిగిపోయేవారు. ఆ ధ్యానం వల్ల ఆయనకు రకరకాల అనుభవాలు కలిగేవి. వాటన్నిటికీ అక్షరరూపం కల్పించేవారు.

కాలజ్ఞానాన్ని మొదలుపెట్టేందుకు నిర్ణయించుకున్న వీరబ్రహ్మేంద్రస్వామి అక్కడ ఉన్న ఒక తాటిచెట్టు ఆకులను కోసుకుని, కొండ గుహలో రాయడం మొదలుపెట్టాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సౌందర్య లహరి - 46 / Soundarya Lahari - 46 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

46 వ శ్లోకము

*🌴. పురుష సంతానము, దూరమైన భార్య, భర్త తిరిగి రాక, కోరుకున్న కోరికలు తీరుట, వైరాగ్యము 🌴*

శ్లో: 46. లలాటం లావణ్య ద్యుతి విమలమాభాతి తవ యత్ 
ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలమ్l 
విపర్యాసన్యాసాదుభయ మపి సంభూయ చ మిధః 
సుధాలేప స్యూతిః పరిణమతి రాకాహిమకరఃll 
 
🌻. తాత్పర్యము :
అమ్మా ! లావణ్య మయిన వెన్నెల కాంతిచే నిర్మలమయిన నీ లలాటము యొక్క కొసలను రెండవ చంద్ర ఖండముగా నే భావింతును,ప్రధమ ఖండము నీ కిరీటమునందు ఉన్నది. రెండిటినీ కలిపి చూసిన అమృత పూత కలిగిన పౌర్ణమి నాటి చంద్రునిగా పరిగణించు చున్నవి . కదా ! 
  
🌻. జప విధానం - నైవేద్యం :

ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, క్షీరాన్నం, తేనె నివేదించినచో పురుష సంతానము, దూరమైన భార్య, భర్త తిరిగి రాక, కోరుకున్న కోరికలు తీరుట, వైరాగ్యము, ఆజ్ఞా చక్రము జాగృతి జరుగును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Soundarya Lahari - 46 🌹*
📚. Prasad Bharadwaj 

SLOKA - 46 

*🌴 Male progeny, return of husband or wife after long absence, attaining desired objectives. 🌴*

"Lalaatam Laavanya dyuthi vimalamaabhaathi Thava Yath 
Dvitheeyam Thanmanye Makutaghatitham Chandrashakalam! 
Viparyaasanyaasaadubhayamapi Sambhooya Cha Mithaha 
Sudhaalepasyoothihi Parinamathi Raakaahimakaraha!" 
 
 🌻 Translation : 
"Thy forehead, shining with the pure brilliance of its divine beauty, is another crescent moon inverted ( in addition to the crescent moon already there on Thy crown). These two, if inverted and joined together would form the autumnal full moon with nectar dripping from it."

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :

 If one chants this verse 1000 times a day for 45 days, offering Cooked rice, sweet milk-gruel and honey as prasadam, it is believed that Begetting of male progeny, return of husband or wife after long absence, attaining desired objectives is achieved

🌻 BENEFICIAL RESULTS: 
Begetting of male progeny, return of husband or wife after long absence, attaining desired objectives. 
 
🌻 Literal Results: 
Detachment (vairaagyam), activation of agna chakram and upwards.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 345 / Bhagavad-Gita - 345 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 26 🌴*

26. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి |
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మన: ||

🌷. తాత్పర్యం :
పత్రమునైనను, పుష్పమునైనను, ఫలమునైనను లేదా జలమునైనను ప్రేమతోను, భక్తితోను ఎవరేని అర్పించినచో నేను స్వీకరింతును.

🌷. భాష్యము : 
నిత్యానందము కొరకై శాశ్వతమును మరియు ఆనందనిధానమును అగు భగవద్దామమును పొందుటకు బుద్ధిమంతుడైనవాడు కృష్ణభక్తిభావనాయుతుడై శ్రీకృష్ణభగవానుని దివ్యమగు ప్రేమయుత సేవలో నియుక్తుడు కావలెను. అట్టి అద్భుతఫలములను కలుగజేయు పద్ధతి వాస్తవమునకు అత్యంత సులభము. 

ఎటువంటి యోగ్యతలేని అతిదరిద్రునికి సైతము అది ఆచరణసాధ్యము. కేవలము శ్రీకృష్ణభగవానునికి శుద్ధభక్తుడగుటయే ఈ విషయమున వాంఛనీయమగు ఏకైక యోగ్యత. మనుజుని దేశ,కాల పరిస్థితులతో దానికెట్టి సంబంధము లేదు. 

అతిసులభమైన ఈ పద్దతిలో మనుజుడు భక్తితో పత్రమునుగాని, జలమునుగాని, ఫలమునుగాని ఆ భగవానునకు ప్రేమతో అర్పింపవచ్చును. భగవానుడు అట్టి అర్పణమును ప్రియముతో స్వీకరింపగలడు. కృష్ణభక్తిభావన విధానము అత్యంత సులభము మరియు విశ్వజనీనమైనందున ఎవ్వరికినీ దీని యందు నిషేదము లేదు. 

అట్టియెడ ఈ సులభమార్గము ద్వారా కృష్ణభక్తిభావితుడై అత్యున్నతమైన నిత్యానంద జ్ఞానపూర్ణమగు జీవనము పొంద వాంఛింపని అజ్ఞాని ఎవడుండును? శ్రీకృష్ణుడు ప్రేమపూర్వక సేవనే వాచించును గాని అన్యమును కాదు. 

తన శుద్ధభక్తుల నుండి చిన్న పుష్పమునైనను స్వీకరించు అతడు అభక్తుల నుండి ఎత్వంటి దానిని కూడా అంగీకరింపడు. ఆత్మారాముడైన అతడు ఇతరుల నుండి కోరునదేదియును లేదు. అయినను అతడు భక్తులు ప్రేమానురాగభావముతో ఒసగుదానిని ప్రియముతో స్వీకరించును. 

అట్టి భక్తిభావనను వృద్దిపరచుకొనుటయే జీవితపు పూర్ణత్వమై యున్నది. భక్తి యొక్కటే శ్రీకృష్ణుని చేరుటకు ఏకైకమార్గమని కచ్చితముగా తెలుపుట కొరకే ఈ శ్లోకమున భక్తి యను పదము రెండుమార్లు వాడబడినది. 

అనగా బ్రహ్మణుడగుట, పండితుడు, ధనవంతుడగుట లేదా గొప్ప తత్త్వవేత్త యగుట వంటి ఇతర ఏ విధానము చేతను మనుజుడు తానొసగునది శ్రీకృష్ణుడు అంగీకరించునట్లుగా చేయజాలడు. 

మూలనియమమైన భక్తి లేనప్పుడు ఏదియును అతనిని అంగీకరింపజేయలేదు. కనుకనే భక్తి ఎన్నడును సామాన్యమైనది కాదు. ఆ విధానము నిత్యమైనది. అది పరతత్త్వమునకు ఒనర్చబడు ప్రత్యక్ష్యసేవ.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 345 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 26 🌴*

26. patraṁ puṣpaṁ phalaṁ toyaṁ
yo me bhaktyā prayacchati
tad ahaṁ bhakty-upahṛtam
aśnāmi prayatātmanaḥ

🌷 Translation : 
If one offers Me with love and devotion a leaf, a flower, a fruit or water, I will accept it.

🌹 Purport :
For the intelligent person, it is essential to be in Kṛṣṇa consciousness, engaged in the transcendental loving service of the Lord, in order to achieve a permanent, blissful abode for eternal happiness. 

The process of achieving such a marvelous result is very easy and can be attempted even by the poorest of the poor, without any kind of qualification. The only qualification required in this connection is to be a pure devotee of the Lord. It does not matter what one is or where one is situated. 

The process is so easy that even a leaf or a little water or fruit can be offered to the Supreme Lord in genuine love and the Lord will be pleased to accept it. No one, therefore, can be barred from Kṛṣṇa consciousness, because it is so easy and universal. 

Who is such a fool that he does not want to be Kṛṣṇa conscious by this simple method and thus attain the highest perfectional life of eternity, bliss and knowledge? Kṛṣṇa wants only loving service and nothing more. Kṛṣṇa accepts even a little flower from His pure devotee. 

He does not want any kind of offering from a nondevotee. He is not in need of anything from anyone, because He is self-sufficient, and yet He accepts the offering of His devotee in an exchange of love and affection. 

To develop Kṛṣṇa consciousness is the highest perfection of life. Bhakti is mentioned twice in this verse in order to declare more emphatically that bhakti, or devotional service, is the only means to approach Kṛṣṇa. 

No other condition, such as becoming a brāhmaṇa, a learned scholar, a very rich man or a great philosopher, can induce Kṛṣṇa to accept some offering.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 173 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴*
39. అధ్యాయము - 14

*🌻. శివపూజ - 6 🌻*

ఉపరి శ్రీ ఫలం త్వేకం గంధపుష్పాదిభిస్తథా |రోపయిత్వా చ ధూపాది కృత్వా పూజిఫలం లభేత్‌ || 41

ప్రాజాపత్యం ద్వయం రౌప్య మాసంఖ్యా చ దక్షిణా | దేయా తదుపదేష్ట్రై హి శక్త్యా వా దక్షిణా మతా || 42

ఆదిత్య సంఖ్య యా తత్ర బ్రాహ్మణాన్‌ భోజయేత్తతః | లక్షపూజా తథా జాతా సాంగం చ మంత్ర పూర్వకమ్‌ || 43

శతమష్టోత్తరం తత్ర మంత్రే విధిరుదాహృతః | తిలానాం చ పలం లక్షం మహాపాతకనాశనమ్‌ || 44

ఏకాదశపలైరేవ లక్షమానము దాహృతమ్‌ | పూర్వవత్పూ జనం తత్ర కర్తవ్యం హిత కామ్యయా || 45

దానిపైన గంధపుష్పాదులచే అలంకరింపబడిన మారేడు ఫలము నొకదానిని ఉంచి ధూపాది ఉపచారములను చేసినచో పూజా ఫలము సిద్ధించును (41). 

ఆ బియ్యము నంతనూ రెండు రూప్యముల దక్షిణతో సహా ఈ వ్రతమును ఉపదేశించిన వానికి ఈయవలెను. దక్షిణ యథాశక్తి యైననూ కావచ్చును (42). 

తరువాత పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనమిడవలెను. ఇట్లు చేయట వలన మంత్ర పూర్వకముగా సంపూర్ణ లక్షార్చనా ఫలము లభించును (43). 

మంత్రమును నూట యెనిమిది సార్లు జపించవలెనని విధి గలదు. పలము, లేక లక్ష (ఒక మానము) తిలలతో ఇదే విధముగా పూజించినచో, మహాపాపములు తొలగిపోవును (44). 

పదకొండు పలములు ఒక లక్ష యగును. తిలలను శివుని పైనుంచి తరువాత పూర్వము చేసిన విధముగా పూజించు భక్తుడు హితములతను పొందును (45).

భోజ్యా వై బ్రాహ్మణాస్తస్మాదత్ర కార్యా నరేణ హి | మహాపాతకజం దుఃఖం తత్‌ క్షణాన్న శ్యతి ధ్రువమ్‌ || 46

యవపూజా తథా ప్రోక్తా లక్షేణ పరమా శివే | ప్రస్థానా మష్టకం చైవ తథా ప్రస్థార్ధకం పునః || 47

పల ద్వయ యుతం తత్ర మానమేత త్పురాతనమ్‌ | యవపూజా చ ముని భిస్స్వర్గ సౌఖ్య వివర్దినీ || 48

ప్రాజాపత్యం బ్రాహ్మణానాం కర్తవ్యం చ ఫలేప్సుభిః | గోధూమాన్నైస్తథా పూజా ప్రశస్తా శంకరస్య వై || 49

భక్తుడు అటు పిమ్మట బ్రాహ్మణులకు భోజనము నిడవలెను. ఇట్లు చేయుట వలన మహాపాపములనుండి పుట్టే దుఃఖము వెను వెంటనే నిశ్చితముగా నాశనమగును (46). 

లక్ష మానము గల సగ్గు బియ్యమును శివునకు అర్పించుట చాల శ్రేష్ఠము. మరియు ఎనిమిదిన్నర ప్రస్థములు (47), 

రెండు పలముల సగ్గు బియ్యమును అర్పించవలెనని పూర్వర్షులు మానమును నిర్ణయించిరి. ఇట్లు సగ్గు బియ్యమును అర్పించుట వలన స్వర్గసౌఖ్యములు లభించునని మహర్షులు చెప్పిరి (48). 

ఫలమును కోరు భక్తులు ఆ బియ్యమును అంతయూ బ్రాహ్మణులకు దానమీయవలెను. శంకరుని గోధుమలతోను, అన్నముతోను పూజించుట మిక్కిలి శ్రేష్ఠము (49).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 50 🌹*
Chapter 13
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

*🌻 The Winding and Unwinding of Sanskaras - 2 🌻*

For the furtherance of the individual's own evolution or involution, natural sanskaras are essential for one's progress.  

Natural sanskaras are those impressions which are absolutely essential for the consciousness to evolve and involve. For example, one must eat to live, so one must earn a livelihood, but one does not have to cheat, or steal, or murder to live. 

 It is not during the process of evolution that one takes on unnatural sanskaras, it is in human form. Human beings collect those sanskaras not necessary for the progress of their consciousness.  

Such sanskaras are called unnatural, because they have nothing to do with the real purpose of creation. As a further example, suppose one decides to go on a pilgrimage to India.  

The way there is by plane. But if one decides not to take this trip straight through, and decides to sightsee in London or Paris, he will not be able to reach India for some time.  

Because of sightseeing, he gets more involved in these cities than involved in the purpose of his trip. If he gets entangled in the cities, he could forget his intended purpose, which was a pilgrimage to India. 

The sanskaras collected while sightseeing represent unnatural sanskaras, because these sanskaras were not required to reach his goal — India. These sanskaras have nothing to do with India, which represents his destination. 

 In human form, such t hings as this happen again and again, and it is because of these unnatural sanskaras that the journey toward God becomes very, very long.  

And because of the complications that the unnatural sanskaras produce, it becomes always more and more difficult for o ne to reach the divine destination.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 46 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 22
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. స్వాయంభువ వంశ వర్ణనము - 6 🌻*

ఆపస్య పుత్రో వై తణ్డ్యః శ్రమః శాన్తో మునిస్తధా | ధ్రువస్య కాలో లోకాన్తో వర్జాః సోమస్య వై సుతః. 36

ధరస్య పుత్రో ద్రవిణో హుతహవ్యవహ స్తథా | మనోహరాయాః శిశిరః ప్రాణోథ రమణ స్తథా. 37

పురోజవోనిలస్యాసీ ధవిజ్ఞాతోనలస్య చ | అగ్నిపుత్రః కుమారశ్చ శరస్తమ్బే వ్యజాయత. 38

తస్య శాఖో విశాఖశ్చ నైగమేయశ్చ పృష్ఠజః | కృత్తికాతః కార్తికేయో యతిః సనత్కుమారకః. 39

ఆపుని కుమారులు వైతండ్యుడు, శ్రముడు, శాంతుడు, ముని అనువారు. లోకాంతుడైన కాలుడు ధ్రువుని కుమారుడు. వర్చసుడు సోముని కుమారుడు. ద్రవిణుడు, హుతహవ్యవహుడు శిశిరుడు, ప్రాణుడు, రమణుడు అనువారు ధరునికి మనోహరయ దు కుమారులుగా జనించిరి. అనిలుని కుమారుడు పురోజపుడు. అనలుని కుమారుడు అవిజ్ఞాతుడు. కుమారుడు అగ్నిపుత్రుడుగా శరస్తంబమునందు జనించెను. ఆతని తరువాత శాఖుడు, విశాఖుడు, నైగమేయుడును పట్టిరి కృత్తిక నుండి కార్తి కీయుడును, యతియైన సనత్కుమారుడును పుట్టిరి.

ప్రత్యూషాద్దేవలో జజ్ఞే విశ్వకర్మా ప్రభాయుతః | కర్తా శిల్పసహస్రాణాం త్రిదశానాం చ వర్దకిః. 40

మనుష్యాశ్చోపజీవన్తి శిల్పం వై భూషణాదికమ్‌ |

వేలకొలది శిల్పములను చేయువాడును, దేవతల వడ్రంగియు, కాంతిమంతుడును ఆగు విశ్వకర్మయను దేవలుడు ప్రత్యుషునినుండి జనించెను. మనుష్యులు భూషణాది శిల్పములను జీవనాధారముగా చేసి కొనుచుందురు.

సురభీ కశ్యపాద్రుద్రానేకాదశ విజజ్ఞుషీ. 41

మహాదేవప్రసాదేన తపసా భావితా సతీ | అజైకపాదహిర్బుధ్న్య స్త్వష్టా రుద్రశ్చ సత్తమ. 42

త్వష్టుశ్చైవాత్మజః శ్రీమాన్విశ్వరూపో మహాయశాః | హరశ్చ బహురూపశ్చ త్ర్యమ్బకశ్చాపరాజితః 43

వృషాకపిశ్చ శమ్బుశ్చ కపర్దీ రైవత స్తథా | మృగవ్యాధశ్చ సర్పశ్చ కపాలీ దశ చై కకః. 44

రుద్రాణాం చ శతం లక్షం యైర్వ్యాప్తం సచరాచరమ్‌ |

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే స్వాయమ్భువ మనువంశవర్ణనం నామాష్టదశోధ్యాయః

సురభి తపస్సుచే పవిత్రీకృతురాలై, మహాదేవుని ప్రసాదముచే ఏకాదశరుద్రులను కనెను. మేక పాదము వంటి ఒక పాదము గల అహిర్బుధ్న్యుడు, త్వష్టయను రుద్రుడు, బహురూపుడు, హరుడు, పరాజితుడు కాని త్ర్యంబకుడు, వృషాకమియు, కపర్ద (జటా) ధారియగు శంభువు, రైవతుడు, మృగవ్యాధుడు, సర్పుడు, పదకొండవవాడైన కపాలియు, చరాచర జగుత్తును వ్యాపించిన కోట్లకొలది రుద్రులు జనించిరి. శ్రీమంతుడును, మహా యశః శాలియు అగు విశ్వరూపుడు త్వష్ట కుమారుడు.

అగ్ని మహాపురాణములో స్వాయంభువమనువంశకర్ణన మన అష్టాదశాధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 61 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. అంగిరసమహర్షి - శ్రద్ధ - 6 🌻*

11. “పరవిద్య, అపరవిద్య అని విద్య రెండు రకములుగా ఉంటుంది. ఋక్, యజుస్, సామములు వేదములు; శిక్ష, వ్యాకరణము, కల్పము, నిరుక్తము, జ్యోతిషము,ఛందస్సు అనే ఈ వేదాంగలూ అన్నీ అపరవిద్యలు అనుబడుతున్నాయి. 

అక్షరస్వరూపుడయిన పరమాత్మను గురించి ఉన్న జ్ఞానమే పరవిద్య. ఆయన సర్వాంతర్యామి, అతీంద్రియుడు” అని చెప్పాడు. ఈశ్వరుడు క్షరాక్షరాలకు అతీతుడు. ‘క్షర’ అంటే కదులుతూ ఉండేది. ‘అక్షర’ మంటే కదలలేకుండా నిర్మలంగా ఉన్నది. 

“ఆ పరమాత్మయొక్క జ్ఞానాన్ని సంపాదించటానికి బాణంగా అనుసంధానంచేసి, ఉపాసన అనేటటువంటి పదును దానికిపెట్టి, ప్రరమాత్మయందు ఏకాగ్రత కల మనస్సును బ్రహ్మంగా భావించి దానిని వేయాలి. అప్పుడు పరమాత్మ యొక్క ఆపరోక్షజ్ఞానం కలుగుతుంది. అదే మోక్షం” అని చెప్పాడు అంగిరసుడు.

12. బ్రాహ్మణుడు మహాదోషములను చేసినప్పుడు క్షంతవ్యుడు కాడు. అతడిపట్ల క్షమ అనేది వర్తించదు. అసులు క్షంతవ్యుడే కాడు. కానీ తన దోషానికి తనే శిక్ష వేసుకుని కఠోరమైన వజ్రవ్రతము అనేదానిని అనుష్ఠించాలి. 

పశువును కాని, పక్షిని కాని ఏ కారణం చేతనైనా బ్రాహ్మణుడు చంపినా, దానికి అతడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అన్నాడు అంగిరసుడు. అయితే యజ్ఞంలో మాత్రం, పశువు దేహంలోని జీవునికి ఉత్తమగతులు కలుగుతాయి కనుక, యజ్ఞంలో పశువధ అనుమతించబడింది. అయితే, అదికూడా కలిప్రారంభంలో స్మృతులచే నిషేధించబడింది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Seeds Of Consciousness - 125 🌹*
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

🌻 Primary is the infinite expanse of consciousness 🌻

Even the experiencer is secondary. Primary is the infinite expanse of consciousness, the eternal possibility, the immeasurable potential of all that was, is, and will be. 

When you look at anything, it is the ultimate you see, but you imagine that you see a cloud or a tree.

Learn to look without imagination, to listen without distortion: that is all. 

Stop attributing names and shapes to the essentially nameless and formless, realise that every mode of perception is subjective, that what is seen or heard, touched or smelt, felt or thought, expected or imagined, is in the mind and not in reality, and you will experience peace and freedom from fear.

Even the sense of ‘I am’ is composed of the pure light and the sense of being. The ‘I’ is there even without the ‘am’. So is the pure light there whether you say ‘I’ or not. 

Become aware of that pure light and you will never lose it. The beingness in being, the awareness in consciousness, the interest in every experience — that is not describable, yet perfectly accessible, for there is nothing else.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మనోశక్తి - Mind Power - 64 🌹*
 *Know Your Infinite Mind*
*🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴*
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. Q 59:--అంతర్ ప్రపంచం (inner world) 🌻

Ans :--
1) బాహ్యంగా మన కళ్ళతో అనంతమైన విశ్వాన్ని చూస్తాం. అలానే మన అంతర్ ప్రపంచంలో కూడా అంతే విశ్వం ఉంది. మన అంతర్ ప్రపంచంలో కోటానుకోట్ల లోకాలు ఉన్నాయి. వీటన్నింటిని పరిశోధించగల శక్తి సామర్ధ్యాలు మనకు ఉన్నాయి. మనకు ఆత్మశక్తి అంతర్ ప్రపంచం గురించి తెలిసింది నీటి బొట్టంత, తెలుసుకోవాల్సింది మహాసముద్రం అంత.

2) మన అంతర్ ప్రపంచం మన ఆత్మ శక్తిలో అంతర్భాగం.

3) భౌతిక పదార్ధం, భౌతిక ప్రపంచం, భౌతిక సంఘటనలు ఆత్మశక్తి ద్వారా సృష్టింపబడ్డాయి.

4) మన అంతర్ ప్రపంచంలో ఏదైతే కలగన్నామో అదే బాహ్యప్రపంచం లో భౌతిక సంఘటన గా రూపాంతరం చెంది వాస్తవమవుతుంది.

5) బాహ్యంగా మన కంటికి కనిపించేదంతా అంతర్ ప్రపంచం నుండి ఉద్భవించిందే. భూమ్మీద శక్తి పదార్ధంగాను , పదార్ధం శక్తి గాను రూపాంతరం చెందే అంతర్గత ప్రక్రియలను మనం గ్రహించి ఏది కావాలంటే అది ఈ భూమ్మీద సృష్టించుకునే సర్వసమర్ధతలు కలిగి ఉన్నాము.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 7 🌹*
✍️ Sri GS Swami ji 
📚. Prasad Bharadwaj

*🌻 You simply cannot choose Guru. Following Guru is a tough task. 🌻*

Following Guru is a tough task. All the intricacies involved in it have been explained to Mother by the Father of the Universe without skipping any detail. 

When he disclosed this information to Mother, it is as if He has disclosed it to the world. Are we competent to choose Guru? 

We are deceived by the strange colors of clothing, the various bead ornaments, strange markings on the body with ash or vertical lines on the forehead, matted hair or a long beard, and run after such people assuming them to be enlightened. 

We do not know what they have to offer. Generally people in this world do not have matted hair or long beards. But to grow them requires no deliberate effort or investment. They grow on their own. People chase after such people. 

Those people in turn take advantage of such gullible followers and rip them off. We are ill equipped to know who truly is Guru. We do not know whom to choose as Guru. 

Upon the recommendation of many, or fooled by a large following, we go after someone and hold on to their feet. It is our karma. The first requirement is that we should become competent in choosing Guru. 

Choosing Guru is serving Guru, offering personal attention and service, such as attending to the personal needs and giving assistance. 

The fact is that you simply cannot choose Guru. How would you determine whether one is enlightened or not? Can you determine by the outward appearance? Can you determine by the people who follow him? 

A first grader wanted to ascertain whether he had a good mathematics teacher or not. He asked him whether he knows all the multiplication tables from 1-100. 

The teacher confidently said, yes. The child then asked him to recite them. The man did. But the child did not know whether the numbers were correct. So he asked another elderly person standing by whether the teacher was saying them correctly. 

The elder endorsed that the person knew the tables. But the child was not convinced. He did not know the subject to determine for himself. He was suspicious whether the other man was competent in the subject. 

He did not have faith in the words of the stranger. How will the child judge the competence of his teacher? With his limited knowledge, it is impossible for the child to gauge the competence of his teacher. 

Based on the confidence with which the teacher repeated the tables, and based on the love that he showed towards the child, the boy slowly began to place his faith on the teacher. 

You have to understand this concept very carefully and clearly. Only then you will be able to follow what is to come.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 4 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

గురువుగారి అనుమతి తీసుకుని శిష్యుడు వెళ్ళాలి. తండ్రి యొక్క అనుమతి తీసుకుని పిల్లవాడు వెళ్ళాలి. 

ఈ “అనుమతి” - అనేది చాలా ముఖ్యమైనది. ఇవాళ్టి రోజున అనుమతితో పనిలేకుండా మనం అందరం జీవిస్తున్నాము, ఒకరి అనుమతితో మరొకరికి పనిలేదు. 

ఏ మానవ సంబంధాలలో అయితే ఈ అనుమతి అన్నటువంటి దానికి లోబడి జీవించడం అనేటటువంటి విధానం వుంటుందో అక్కడ అతి గొప్పదైనటువంటి నియమం ‘శరణాగతి’ అమలపరచ బడుతుంది. నీలో ఉన్నటువంటి దివ్యత్వానికి నేను దాసోహం. 

నీలో ఉన్నటువంటి చైతన్యానికి నేను దాసోహం. నీలో ఉన్నటువంటి వివేకానికి నేను దాసోహం. నీలో ఉన్నటువంటి విజ్ఞానానికి నేను దాసోహం. దాసోహం అంటే అర్థం ఇది. 

ఈ రకంగా ఎదుటి వ్యక్తిలో వున్నటువంటి వివేక, విజ్ఞానాలకు, దివ్యత్వానికి నువ్వు ఎప్పుడైతే శరణాగతుడవు అవుతావో, అప్పుడు ఆ ‘అనుమతి’ అనేటటువంటి విధానం నీలో ఏర్పడుతుంది. అట్లా ఎవరిలో అయితే వీటిని గుర్తించగలిగేటటువంటి లక్షణం వస్తుందో, వారిలో భక్తి, ప్రపత్తులు పెరుగుతాయి.    

ఎవరైతే వివేకానికి, విజ్ఞానానికి, విచారణకి, వస్తునిశ్చయ జ్ఞానానికి ప్రాధాన్యతను ఇచ్చి, దివ్యత్వ ప్రధానంగా జీవిస్తున్నటువంటి వాళ్ళ యొక్క అనుమతి కొరకు వేచియుంటారో, వారు ఆ అనుమతి ఇవ్వడం చేతనే వారి బలమంతా కూడా వీరికి సంక్రమిస్తుంది.

           అష్ట దిక్పాలకులలో ఒకడైనటువంటి యమధర్మరాజు బాలుడైనటువంటి నచికేతుడిని ‘అపరాధ క్షమాపణ’ అడుగుతున్నాడు. 

మనం జీవితంలో ఎప్పుడైనా క్షమించమని ఎవరినైనా అడిగామా? అడగాలంటే మన కిరీటం పోయినట్లు, మన సింహాసనం పోయినట్లు, లేకపోతే మన రాజ్యం అంతా విడిచి వెళ్ళిపోయినట్లు బాధపడిపోతూ వుంటాము, కదా! 

ఎవరినైనా క్షమించమని అడగాలంటే, మనకు చాలా బాధ కలుగుతుంది. చాలామంది క్షమాపణ అడుగుతారు, ఎట్లా అడుగుతారంటే? డిమాండ్‌ గా అడుగుతారు.  

పశ్చాత్తాప భావన లేదనుకోండి అదే పొరపాటుని మరల మరల మరల మరల పునః పునః చేస్తూ వుంటాం అన్నమాట. ఒక్కసారి పశ్చాత్‌ తాప పడినట్లయితే, మరలా ఆ పనిని తిరిగి చేయకుండా వుంటాం అన్నమాట. 

కాబట్టి, యమధర్మరాజు ఈ రీతిగా మనకి ధర్మాన్ని ఉపదేశిస్తున్నాడు. తన అపరాధమునకు, తెలియక జరిగినటువంటి అపరాధమునకు క్షమాపణ వేడుతున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సాధనలో శీఘ్ర ప్రగతికై అష్టాంగ యోగ పద్ధతి - పతంజలి యోగము 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

అహంకారాదులను వదిలించుకోవడానికి పాతంజలి యోగ పద్ధతులలో అష్టాంగ యోగమని ఒక ఉపాయమున్నది. 

*అవి యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి అని ఎనిమిది అంగాలు.* 

*మొదటి ఐదు విషయాసక్తిని నిగ్రహించడానికి, చివరి మూడు భగవంతునికి దగ్గరవడానికిని పనికి వస్తాయి.*

1. యమం : 
యమమనగా ఈ కనిపించే ప్రపంచాన్ని ఈశ్వరమయంగా చూస్తూ అన్ని వస్తువులు ఆయనవేననే భావం కలిగి ఉండి తనది అంటూ దేనిమీద హక్కు లేకుండడం, అవసరమైన వాటిని భగవంతునివిగా భావించి ఇవన్నీ ఆయనవే అని, ఆయనకు నివేదించి తిరిగి భక్తుడి అవసరానికి ప్రసాదించమని ఆయనను వేడుకొనడం చేయాలి. నైవేద్యం, ప్రసాదం అనే వాటి అర్థం అదే. అంతేగాని మన వస్తువులు భగవంతుని కివ్వడమనే భావన సరికాదు.

ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్‌
తేన త్యక్త్యేన భుంజీథా, మాగృథః కస్యస్విద్ధనమ్‌ ||

దీని అర్థం అంతా ఈశ్వరమయమని భావిస్తూ మనకు అవసరమైన వాటిని, ఆయనను అర్థించి అనుభవించు అని.

ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని మన తలపులలో, మాటలలో, చేతలలో మన వలన ఎవరికీ కీడు కలుగరాదు. ఇదే అహింస. అబద్ధమాడరాదు. ఇతరుల వస్తువులను, శ్రమను దోచుకొనరాదు. అవినీతి, అక్రమ చర్యలు మానాలి. పరస్త్రీని తల్లివలె భావించాలి. సకల జీవరాసుల యెడల దయ కలిగి ఉండాలి. ఎట్టి దాపరికం లేకుండా నిజాయితీగా ఉండాలి. ఎవరెంత రెచ్చగొట్టినా ఓర్పు నశించక, సత్వ గుణంలోనే ఉండాలి. భేద భావన, శత్రు భావన మనలో ప్రవేశించరాదు. అరిషడ్వర్గాన్ని జయించి స్థైర్యం, ధైర్యం, నిగ్రహం సాధించాలి. మితాహారం, హితాహారం భుజించడం. జిహ్వ చాపల్యం పనికిరాదు. భక్తి సాధనలో ఏకాగ్రత కుదురుటకు మన లోపల, బయట శుచిగా ఉండాలి.

2. నియమం : 
నియమమనగా నిరంతరం భగవచ్చింతన చేయడం, ప్రాపంచిక విషయాలను ఇష్టంగా చూడక, తప్పదు కదా అని పట్టించుకోవడం. అయ్యప్ప దీక్ష ఉద్దేశ్యం అదే. మనలోని కల్మషాలను తొలగించాలనే దీక్షను చేపట్టాలి. దాని కొరకు కొన్ని సత్కార్యాలు ఆచరించాలి. భాగవతోత్తములను, ఆచార్యులను చేరి సత్సంగం చేయాలి. వారి ఆజ్ఞలను, సూచనలను పాటించాలి. స్వార్థం, అహంకారం మనలో వ్యక్తం కాకుండా చూచుకోవాలి. అదే తపస్సు. ప్రాప్తించిన దానితో సంతోషపడి తృప్తిగా ఉండాలి. ఎంత కష్టపడినా లభించకపోతే, దుఃఖపడరాదు.

భక్తి కోసం, జ్ఞానం కోసం చేసే సాధనలలో భగవంతుడున్నాడని విశ్వాస ముండాలి. ఆయనతో ఐక్యమవడమే లక్ష్యంగా చేసుకోవాలి. చాలామంది భగవంతుడున్నాడని నమ్ముతారు గాని, దైవేచ్ఛ ప్రకారం నడచుకోరు. అందువలన దైవం గురించి వివరమైన దృఢమైన అవగాహన ఉండాలి.

ధన, శ్రమ, అవయవ దానాల వంటి త్యాగబుద్ధి ఉండాలి. ఇందులో ‘‘నేను చేశాను’’ అనే అహంకారం తలెత్తరాదు. అందరిలోనూ భగవంతుడున్నాడనే భావనతో ‘నారాయణసేవ’గా చేయాలి.

భగవంతుని పూజించడం, జప, తప ధ్యానాలన్నీ నియమబద్దంగా, క్రమ శిక్షణతో దీక్షగా చేయాలి. కర్మకాండయందు అంతరార్థ మెరిగి చిత్తశుద్ద్ధితో చేయాలి.

చేయకూడని పనులు చేయరాదు. అట్టి ఆలోచన వచ్చినంతనే సిగ్గుపడి, పశ్చాత్తాపపడి, నిగ్రహించుకోవాలి. సత్యవ్రతం, అహింసా వ్రతం, బ్రహ్మచర్య వ్రతం, అపరిగ్రహ వ్రతం, మౌనవ్రతం వంటివి, ఉపవాసాలు వీలునుబట్టి, వాటి యొక్క అర్థం తెలిసి చేయాలి. ఇవన్నీ మనలను మనం క్రమశిక్షణలో పెట్టు కోవడానికి అవసరమౌతాయి. అంతేగాని ఈ పనులు నేరుగా భగవంతుని వద్దకు చేర్చవు.

3. ఆసనం : 
పూజాది కార్యక్రమాలకు ఒక స్థిరమైన చోటును ఏర్పరచుకొని భక్తి, ఏకాగ్రత కుదిరేటట్లు కదలకుండా కూర్చునే పద్ధతిని ఆసనమంటారు. పద్మాసనం, అర్థ పద్మాసనం, సుఖాసనం ఏది కుదిరితే అదే ఆసనం.

4. ప్రాణాయామం : 
భాగవతులు, గురువులు ఉపదేశించిన మంత్రాన్ని శ్వాసతో అనుసంధానం చేస్తూ జపిస్తే ఏకాగ్రత లభిస్తుంది. దాని వలన మనలో ఉన్న భగవంతుని వద్దకు చేరగలం.

5. ప్రత్యాహారం : 
భగవద్భావాన్ని మనయందు నింపుకొని, అహంకార మమకారాలకు కారణమైన ఇంద్రియ, మనోబుద్ధులను లోనికి ముడుచుకోవాలి. అనగా తాబేలు తన అవయవాలను ముడుచుకొన్నట్లు చేసి, బయటి విషయాలలోకి పోనీయకుండడం.

6. ధారణ : 
భగవంతుని హృదయం నిండా నింపుకోవడమే ధారణ. ఈ ధారణ మధ్య మధ్యలో మనసు విషయాలమీదికి పోతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మళ్ళీ ధారణ చేస్తూ ఉంటాం.

7. ధ్యానం : 
ధారణ ఖండ ఖండాలుగా జరుగుతూ, చివరకు అఖండ ధారణ జరిగితే అంతవరకు చేసే ప్రయత్నాన్ని ధ్యానం అంటారు.

8. సమాధి : 
ధ్యానం అఖండ ధారణగా మారినప్పుడు కలిగేది సమాధి. సమాధిలో దైవ సాక్షాత్కారమవుతుంది.

ఈ ఎనిమిదింటిలో యమ నియమాలు పునాది వంటివి. ఆసన, ప్రాణాయామాలు ఉపకరాణాలు. ప్రత్యాహార, ధారణ, ధ్యానాలు సాధనా మార్గాలు. పర్యవసానంగా కలిగే సమాధి ఫలరూపమైన పరాభక్తి అనబడుతుంది.

ఈ విధంగా జ్ఞాన, యోగ పద్ధతులలో కూడా భక్తుడు తనను తాను సంస్కరించుకొని సంసిద్ధుడవవచ్చును. అన్ని మార్గాలు ఉపయోగ పడేవే. ఏదో ఒక పద్ధతిలో యోగ్యత సంపాదించి, భగవదనుగ్రహం పొందే ప్రయత్నం భక్తులే చేసుకోవాలి. అంతేగాని, ఆయనను నిందించడం అవివేకం.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సాయి తత్వం - మానవత్వం - 53 / Sai Philosophy is Humanity - 53 🌹*
🌴. అధ్యాయము - 7 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కపర్డే కుమారుని ప్లేగువ్యాధి 🌻

1. బాబా విచిత్రలీలలో నింకొకదానిని వర్ణించెదను. అమరావతి నివాసి యగు దాదాసాహెబు ఖపర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి శిరిడీలో కొన్ని దినములుండెను.

2. ఒకనాడు ఖాపర్డే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరము క్రింద మారెను.

3. తల్లి మిక్కిలి భయపడెను. శిరిడీ విడచి అమరావతి పోవలెననుకొని సాయంకాలము బాబా బూటివాడా వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు నడుగబోయెను.

4. గద్గకంఠముతో తన చిన్నకొడుకు ప్లేగుతో పడియున్నాడని బాబాకు చెప్పెను. బాబా యామెతో దయతో మృదువుగ నిట్లనెను: "ప్రస్తుతము ఆకాశము మబ్బుపట్టియున్నది. 

5. కొద్దిసేపటిలో మబ్బులన్నియు చెదిరిపోయి, ఆకాశము నిర్మలమగును." అట్లనుచు బాబా కఫ్నీని పైకెత్తి, చంకలో కోడిగ్రుడ్లంత పరిమాణముగల నాలగు ప్లేగు పొక్కులను చూపుచూ, "నా భక్తులకొరకు నే నెట్లు బాధపడెదనో చూడుము! వారి కష్టములన్నియు నావే!" ఈ మహాద్భుతలీలలను జూచిన జనులకు, మహాత్ములు తమ భక్తుల బాధలు తామే యెట్లుస్వీకరింతురో యను విషయము స్పష్టమయ్యెను.

6. మహాత్ముల మనస్సు మైనముకన్న మెత్తనిది, వెన్నవలె మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారమేమియు ఆశించక ప్రేమించెదరు.

7. భక్తులనే తమ స్వజనులుగ భావించెదరు.


*🌹. Sai Philosophy is Humanity - 53 🌹*
Chapter 7
✍️. Sri NV. Gunaji
📚. Prasad Bharadwaj

🌻 Master Khaparde’s Plague-Case 🌻 

I shall now relate another instance of Baba’s wonderful Leela. 

Mrs. Khaparde, the wife of Mr. Dadasaheb Khaparde of Amraoti, was staying at Shirdi with her young son for some days. 

One day the son got high fever, which further developed into Bubonic plague. The mother was frightened and felt most uneasy. 

She thought of leaving the place for Amraoti, and went near Baba in the evening, when He was coming near the Wada (now Samadhi Mandir) in His evening rounds, for asking His permission. She informed Him in a trembling tone, that her dear young son was down with plague. 

Baba spoke kindly and softly to her, saying that the sky is beset with clouds; but they will melt and pass off and everything will be smooth and clear. 

So saying, He lifted up His Kafni up to the waist and showed to all present, four fully developed bubos, as big as eggs, and added, "See, how I have to suffer for My devotees; their difficulties are Mine." 

Seeing this unique and extraordinary deed (Leela), the people were convinced as to how the Saints suffer pains for their devotees. The mind of the saints is softer than wax, it is soft, in and out, as butter. 

They love their devotees without any idea of gain, and regard them as their true relatives.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹