🌹 11 OCTOBER 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹

🍀🌹 11 OCTOBER 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹🍀
1) 🌹 అష్టావక్ర గీత - 1. ఆత్మానుభవోపదేశము - 2వ శ్లోకము. - 1 to 5 Shorts 🌹
2) 🌹 AshtaVakra Gita 1 - Teaching of Self-Realization - Verse 2 - 1 to 5 Shorts 🌹
3) 🌹 अष्टावक्र गीता 1 - आत्म-साक्षात्कार का उपदेश - श्लोक 2 - 1 to 5 Shorts 🌹
5) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 995 / Vishnu Sahasranama Contemplation - 995 🌹*
🌻 995. చక్రీ, चक्री, Chakrī 🌻
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 567 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 567 - 7 🌹 
🌻 567. 'భక్తనిధి’ - 1 / 567. 'Bhaktanidhi' - 1 🌻
6) 🌹. మహార్నవమి శుభాకాంక్షలు అందరికి, Maharnavami Good Wishes to All. 🌹*
దుర్గా అవతారాలు ఇంద్రకీలాద్రిపై, శ్రీశైలంలో 11-10-2024 నాడు

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🍀. మహర్నవమి శుభాకాంక్షలు అందరికి, Maha Navami, Good Wishes to All 🍀*
*🌻. ప్రసాద్ భరద్వాజ*

*🍀. మహర్నవమి - మహిషాసుర మర్దిని విశిష్టత 🍀*

*దుర్గా నవరాత్రులలో 9వ రోజు నవమి, మహర్నవమి అంటారు. మహర్నవమి చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే? దేవి ఉపాసకులు ఉపవాసాలుండి, శ్రద్ధతో అమ్మవారిని అర్చించి, ధ్యానించి, ఈ 9వ రోజున అమ్మవారి కృపా కటాక్షాలు కోసం ఎదురుచూసే రోజు. 9 రోజులలో ఏ రోజు చేయకపోయినా, ఈ 3 రోజులు (మూలా నక్షత్రం -- దుర్గాష్టమి -- మహర్నవమి) పూజ చేస్తే అమ్మవారు కరుణిస్తుంది. విజయవాడలో ఈ రోజు "మహిషాసుర మర్దిని" అవతారం. శ్రీశైలంలో "సిద్ధిధాత్రిగా" పూజిస్తారు. ఈమెని పూజించడం వల్ల వాంఛితార్థ సిద్ధి కలుగుతుంది. కుమారి పూజలో 10 సం:ల వయస్సు గల బాలికని పూజిస్తారు. ఈ తల్లి దర్శనం వల్లే కాదు, మనసులో ఒక్కసారి స్మరించుకున్నా శత్రు వినాశనం జరుగుతుంది. వృక్షాలలో దేవగన్నేరు వృక్షాన్ని పూజిస్తారు. నైవేద్యంగా పాయసం నివేదించాలి.*

*🌻. మహిషాసురమర్దిని చరిత్ర 🌻*

*దుర్గాదేవి అష్ట భుజాలతో మహిషాసురుణ్ణి సంహరించి, సింహవాహిని శక్తిగా వికటాట్టహాసం చేసింది. మహిషాసురుడి సేనాధిపతులైన చిక్షిలుడు, చామరుడు, ఉదదృడు, బాష్కలుడు, విడాలుడు అనే సైన్యాధ్యక్షులందరిని సంహరించి, చివరగా మహిషాసురుణ్ణి సంహరించి, మహిషాసురమర్దిని అయింది. సింహవాహనం మీద "ఆలీడా పాదపద్ధతిలో", ఒక చేతిలో త్రిశూలాన్ని ధరించి, మహిషాసురుని సంహరించింది. ఈమె అష్టోత్తర శతనామ స్తోత్రం భక్తులు పారాయణం చేస్తే, శత్రు బాధలు, దత్త గ్రహబాధలనుండి విముక్తి కలగటమే కాక, మనసులో ఉన్న భయాన్ని పోగొట్టి, ధైర్యాన్ని ప్రసాదిస్తుంది.*

*ఇంద్రాది దేవతలు మహిషాసురుడి వల్ల అనేక కష్టాలు అనుభవించారు. అప్పుడే ఇంద్రాది దేవతలు తమ తమ శరీరాల్లోని దివ్యతేజస్సు లన్నింటిని బయటికి తీసుకొచ్చి, ఆ తేజస్సుకి ఒక రూపాన్నిచ్చారు. ఆ మూర్తి యొక్క రూపమే మహిషాసురమర్దిని. ఆ తేజోమూర్తికి తమ ఆయుధాలను సమర్పించారు. తండ్రిగారైన హిమవంతుడు ఒక సింహాన్ని సమర్పించాడు. దుర్గాదేవి శార్దూల వాహినిగా (పులి) దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించింది... మహిషాసురమర్దిని సింహవాహినిగా మహిషాసురుని సంహరించింది.*

*ఈ శరన్నవరాత్రులలో మహిషాసుర మర్దిని అవతారం, సింహవాహనం మీద ఆలీడా పాదపద్ధతిలో, ఒక చేతిలో త్రిశూలాన్ని ధరించి, మహిషాసురుడిని సంహరిస్తున్న రూపంలో దర్శనమిస్తుంది. శ్రీశైలంలో అమ్మవారు సిద్ధిధాత్రిగా దర్శనమిస్తుంది. ఈ తల్లి సర్వ సిద్ధులను ప్రసాదిస్తుంది. పరమేశ్వరుడు సర్వసిద్ధులను దేవికృప వల్లనే పొందాడని దేవీపురాణంలో ఉంటుంది. ఈ తల్లి శివుని పతిగా పొందడమే కాక! తన శరీరంలోని అర్ధభాగాన్ని ఆ పరమేశ్వరుడుకిచ్చి "అర్ధనారీశ్వరిగా" అవతరించింది. ఈ తల్లి చతుర్భుజి, సింహవాహిని. కుడివైపు చేతిలో చక్రం, గద ధరిస్తుంది. ఎడమచేతిలో శంఖాన్ని, కమలాన్ని ధరిస్తుంది. ఈ తల్లి కమలం మీద కూర్చొని ఉంటుంది.*

*ఈమెని ఆరాధించేవారికి సర్వ సిద్ధులు కరతలామలకం. ఈమె కృపచేతనే భక్తుల--, సాధకుల--, లౌకిక, పారమార్థిక, మనోరథాలు తీరతాయి. ఈ తల్లి కృపకు పాత్రుడైన భక్తుడికిగానీ, ఉపాసకుడుకి గాని కోరికలు ఏవి మిగలవు? (కుంతీదేవి కోరికలు లేని స్థితిని, కష్టాలనే ప్రసాదించమని శ్రీకృష్ణుని అర్థించింది.. ఎందుకంటే!! కష్టాల్లోనే భగవంతుడు చెంతనే ఉంటాడు కనుక...) అలాంటివారికి అమ్మవారి సన్నిధే సర్వసోపానం. ఈ అమ్మవారి స్మరణ, ధ్యాన, పూజ వల్ల సంసారం నిస్సారమన బోధపడుతుంది. పరమానంద పరమైన అమృత పదాన్ని (మోక్షాన్ని) పొందుతారు. ఈ తల్లి అణిమాది అష్టసిద్ధులనే కాక మోక్షాన్ని ప్రసాదించేది. లౌకిక, అలౌకిక, సర్వార్థ సిద్ధులకు అధిష్టాన ధాత్రి... "సిద్ధిధాత్రి"..*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 అష్టావక్ర గీత - 1. ఆత్మానుభవోపదేశము - 2వ శ్లోకము. - 1. ముక్తి కాంక్ష 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*🌹 అష్టావక్ర గీత - 1. ఆత్మానుభవోపదేశము - 2వ శ్లోకము. - 2. ఆలోచనా ప్రవాహమే మనస్సు 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*🌹 అష్టావక్ర గీత - 1. ఆత్మానుభవోపదేశము - 2వ శ్లోకము. - 3. మనో నిగ్రహం 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*🌹 అష్టావక్ర గీత - 1. ఆత్మానుభవోపదేశము - 2వ శ్లోకము. - 4. మనస్సు యొక్క శక్తి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*🌹 అష్టావక్ర గీత - 1. ఆత్మానుభవోపదేశము - 2వ శ్లోకము. - 5. వివేకయుక్త బుద్ధి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 AshtaVakra Gita 1 - Teaching of Self-Realization - Verse 2 - 1. Desire for Liberation 🌹*
*Prasad Bharadwaj*

*🌹 AshtaVakra Gita 1 - Teaching of Self-Realization - Verse 2 - 2. The flow of thoughts is the mind 🌹*
*Prasad Bharadwaj*

*🌹 AshtaVakra Gita 1 - Teaching of Self-Realization - Verse 2 - 3. Control of the Mind 🌹*
*Prasad Bharadwaj*

*🌹 AshtaVakra Gita 1 - Teaching of Self-Realization - Verse 2 - 4. The power of the mind 🌹*
*Prasad Bharadwaj*

*🌹 AshtaVakra Gita 1 - Teaching of Self-Realization - Verse 2 - 5. Discerning Intellect 🌹*
*Prasad Bharadwaj*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 अष्टावक्र गीता 1 - आत्म-साक्षात्कार का उपदेश - श्लोक 2 - 1. मुक्ति की इच्छा 🌹*
*प्रसाद भारद्वाज*

*🌹 अष्टावक्र गीता 1 - आत्म-साक्षात्कार का उपदेश - श्लोक 2 - 2. विचारों की धारा ही मन है 🌹*
*प्रसाद भारद्वाज*

*🌹 अष्टावक्र गीता 1 - आत्म-साक्षात्कार का उपदेश - श्लोक 2 - 3. मन का नियंत्रण 🌹
*प्रसाद भारद्वाज*

*🌹 अष्टावक्र गीता 1 - आत्म-साक्षात्कार का उपदेश - श्लोक 2 - 4. मन की शक्ति 🌹*
*प्रसाद भारद्वाज*

*🌹 अष्टावक्र गीता 1 - आत्म-साक्षात्कार का उपदेश - श्लोक 2 - 5. विवेकशील बुद्धि 🌹*
*प्रसाद भारद्वाज*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 995 / Vishnu Sahasranama Contemplation - 995 🌹*

*🌻 995. చక్రీ, चक्री, Chakrī 🌻*

*ఓం చక్రిణే నమః | ॐ चक्रिणे नमः | OM Chakriṇe namaḥ*

*మనస్తత్త్వాత్మకం సుదర్శనాఖ్యం చక్రమస్యాస్తీని ।*
*సంసారచక్రమస్యాజ్ఞయా పరివర్తత ఇతి వా చక్రీ ॥*

*మనస్తత్త్వ రూపమగు సుదర్శన నామక చక్రము ఈతనికి కలదు. తన ఆజ్ఞచే పరివర్తమానము అనగా పునః పునః మొదటివలనే తిరుగుచుండునదిగా సంసార చక్రము ఇతని ఆధీనమున కలదు.*

:: శ్రీ విష్ణుమహాపురాణే ప్రథమాంశే ద్వావింశోఽధ్యాయః ::
చలత్స్వరూపమత్యంతం జవేనాంతరితానిలమ్ ।
చక్రస్వరూపం చ మనో ధత్తే విష్ణుకరే స్థితతమ్ ॥ 71 ॥

*చలించు స్వభావము కలదియు, తన అత్యంతవేగముచే వాయువును కూడ క్రిందుపరచునదియు, చక్రస్వరూపము కలదియు అగు మనసును - విష్ణువు తన కరమునందు ధరించుచున్నాడు.*

908. చక్రీ, चक्री, Cakrī

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 995 🌹*

*🌻 995. Cakrī 🌻*

*OM Cakriṇe namaḥ*

मनस्तत्त्वात्मकं सुदर्शनाख्यं चक्रमस्यास्तीनि ।
संसारचक्रमस्याज्ञया परिवर्तत इति वा चक्री ॥

*Manastattvātmakaṃ sudarśanākhyaṃ cakramasyāstīni,*
*Saṃsāracakramasyājñayā parivartata iti vā cakrī.*

*His is the cakra or discuss (one of the weapons) called Sudarśana of the form of manastattva or psychology. He sets the wheel of saṃsāra or world in motion; so Cakrī. Cakra means circle.*

:: श्री विष्णुमहापुराणे प्रथमांशे द्वाविंशोऽध्यायः ::
चलत्स्वरूपमत्यन्तं जवेनान्तरितानिलम् ।
चक्रस्वरूपं च मनो धत्ते विष्णुकरे स्थिततम् ॥ ७१ ॥

Śrī Viṣṇu Mahāpurāṇa Part 1, Chapter 22
Calatsvarūpamatyaṃtaṃ javenāṃtaritānilam,
Cakrasvarūpaṃ ca mano dhatte viṣṇukare sthitatam. 71.

*In his hand Vishn‌u holds, in the form of His discus, the mind, whose thoughts like the weapon fly swifter than the winds.*

908. చక్రీ, चक्री, Cakrī

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः ।रथांगपाणिरक्षोभ्यस्सर्वप्रहरणायुधः ॥ १०७ ॥
శఙ్ఖభృన్నన్దకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః ।రథాంగపాణిరక్షోభ్యస్సర్వప్రహరణాయుధః ॥ 107 ॥
Śaṅkhabhr‌nnandakī cakrī śārṅgadhanvā gadādharaḥ,Rathāṃgapāṇirakṣobhyassarvapraharaṇāyudhaḥ ॥ 107 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 567 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 567 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।*
*మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥ 🍀*

*🌻 567. 'భక్తనిధి’ - 1 🌻*

*భక్తులకు నిధి వంటిది శ్రీమాత అని అర్థము. భక్తుల అవసరములను తీర్చునది శ్రీమాత. తల్లివలె ప్రేమతో సర్వావసరములను శ్రీమాత తీర్చగలదు. జీవితమున అన్ని రంగముల యందు భక్తులకు లోటు లేకుండ పోషించుచుండును. ఐహికము, ఆముష్మికము అగు కోరికలను కూడ పూరించును. తన భక్తుడు పూర్ణ జ్ఞానియై పరిపూర్ణ వికాసవంతు డగువరకు కూడ సమస్తమగు ఆవశ్యకతలు తీర్చును. కల్పవృక్షము, కామధేనువు వలె భక్తుల కండగ నిలచి యుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 567 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 115. Nityatrupta bhaktanidhi rniyantri nikhileshvari*
*maityradi vasanalabhya mahapralayasakshini  ॥115 ॥ 🌻*

*🌻 567. 'Bhaktanidhi' - 1 🌻*

*The term "Bhaktanidhi" means that the Divine Mother, Śrī Māta, is like a treasure for devotees. She fulfills the needs of her devotees with the love of a mother. Śrī Māta can meet all the needs of her devotees, ensuring that they lack nothing in any aspect of life. Whether it is worldly or spiritual desires, she satisfies them. She continues to provide everything necessary until her devotee becomes a fully enlightened and developed being. Like the wish-fulfilling tree (Kalpavriksha) and the divine cow (Kamadhenu), she remains as a source of abundance for her devotees.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*శ్రీ దేవి శరన్నవరాత్రులు 9వ రోజు 11/10/2024 ఇంద్రకీలాద్రిపై ఉదయం : "శ్రీ మహిషాసురమర్థినీ దేవి" గా దర్శనం*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

శ్లో|| మహిషమస్తక నృత్తవినోదిని, స్ఫుటరణన్మణి నూపుర మేఖలా, జననరక్షణ మోక్షవిధాయినీ, జయతి శుంభనిశుంభ నిషూదినీ

నవ అవతారాల్లో మహిషాసురమర్దిని ని మహోగ్రరూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్నవమి’ గా జరుపు కుంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శన మిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది.

నైవేద్యం:

ఈ రోజున నైవేద్యంగా రవ్వ చక్కర పొంగలి సమర్పిస్తారు.

 శ్రీ మహిషాసురమర్ధనీదేవ్యై నమః 
🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*ఇంద్రకీలాద్రిపై రేపు(11.10.24) మధ్యాహ్నం సకల లోకాలకు ఆరాధ్యదేవత రాజరాజేశ్వరిగా దుర్గమ్మ అలంకరణ*
🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓

నవరాత్రి ఉత్సవాలలో అలంకారాలలో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీ దేవి. సమస్త విశ్వానికీ ఆమె మహారాజ్ఞి. లోకపాలకులైన అష్ట దిక్పాలకులను పాలించేవారు త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులను పాలించే దేవతను రాజ రాజేశ్వరిగా పిలుస్తారు.
 
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు రోజుకో అవతారంలో రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాం. రాజరాజేశ్వరీదేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. ‘అపరాజితాదేవి’ గా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా.. ఇచ్ఛా , జ్ఞాన , క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుందీ తల్లి. యోగమూర్తిగా.. మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత.

పొదుపు చెయ్యడం నేటితరం ఆలోచన.ఈ అవతారంలో అమ్మ ఒక చేతిలో చెరకుగడ , ఇంకో చేతిలో అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనం ఇస్తుంది. చెరకు రసం అత్మజ్ఞానాన్ని సూచిస్తుంది. దుష్టులను , దురహంకారులను , శిక్షించుటకు అంకుశం, పాశం ధరించి ఉంటుంది. ఆమె ప్రశాంతమైన చిరునవ్వు , చల్లని చూపు భక్తులను అనుగ్రహిస్తాయి.
సమున్నతమైన దైవికశక్తికి ఈమె ప్రతీక. చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించే నేర్పు కలిగిఉండటం , ఉన్నతమైన భావనల్ని వ్యాప్తి చేయడం రాజరాజేశ్వరి అవతారం నుంచి అందుకోవాల్సిన స్ఫూర్తి. లలితా సహస్రనామ పారాయణం చేసి అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ , బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా , చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ శ్లోకం పఠించాలి. నైవేద్యంగా సేమ్యా పాయసం , కొబ్బరి పాయసం , కొబ్బరన్నం , పరమాన్నం సమర్పిస్తారు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*శ్రీ దేవి శరన్నవరాత్రులు 9వ రోజు 11/10/2024 "దేవీ సిద్ధిదాయినీ " గా దర్శనం - శ్రీ శైలం*
🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃

 శ్లో𝕝𝕝 ప్రధమం శైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కంధమాతేతి, షష్ఠమం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||

"దేవీ సిద్ధిదాయినీ" ధ్యాన శ్లోకం

శ్లో𝕝𝕝 సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి | సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||

సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లి గనుక సిద్ధిదాత్రి. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృపవలనే పొందెనని దేవీపురాణమున పేర్కొనబడింది. ఈమె పరమశివునిపై దయదలచి, ఆయన శరీరమున అర్ధబాగమై నిలచెను. సిద్ధిధాత్రీదేవి చతుర్భుజ, సింహవాహన. ఈమె కమలముపై ఆసీనురాలై యుండును. ఈమె కుడివైపున ఒకచేతిలో చక్రమును, మఱొకచేతిలో గదను ధరించును. ఎడమవైపున ఒక కరమున శంఖమును, మఱియొక హస్తమున కమలమును దాల్చును. నిష్ఠతో ఈమెను ఆరాధించువారికి సకలసిద్ధులును కరతలామలకము.

ఈమె కృపచే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారమార్ధిక మనోరథము లన్నియును సఫలములగును. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తునకు కోరికలెవ్వియును మిగిలియుండవు. అట్టివానికి భగవతీదేవి చరణ సన్నిధియే సర్వస్వమగును. భగవతీమాత యొక్క స్మరణ ధ్యాన పూజా దికముల ప్రభావము వలన ఈ సంసారము నిస్సారమని బోధ పడును. తన్మహత్వమున నిజమైన, పరమానంద దాయకమైన అమృతపదము ప్రాప్తించును.

 శ్రీ సిద్ధిదాయినీదేవ్యై నమః 
💙💙💙💙💙💙💙💙💙💙💙💙

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj

శ్రీచక్రము - నవ ఆవరణల విశిష్టత - మోక్ష స్థితి (Sri Chakra - Significance of Nine Avaranas - State of Liberation)


🌹 శ్రీచక్రము - నవ ఆవరణల విశిష్టత - మోక్ష స్థితి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

https://youtu.be/92To4VcllMw


ఈ వీడియోలో శ్రీచక్రం యొక్క నవ ఆవరణల యొక్క విశిష్టతను వివరించడమే కాకుండా, శ్రీ విద్య సంప్రదాయంలో ఈ పవిత్ర చిహ్నం యొక్క ప్రాముఖ్యతను తెలియ చేసాను. ఈ ఆవరణాల అర్థాన్ని గ్రహించడం మరియు వాటితో తమని తాము అనుసంధానించుకోవడం ద్వారా, ఆధ్యాత్మిక జాగృతి మరియు విముక్తి పొందడం ఎలాగో తెలుసుకుందాం. ధ్యానం మరియు భక్తి ద్వారా, ఒకరు శివ-శక్తుల ఐక్యతా స్థితిని తెలుసుకొని, ద్వంద్వాన్ని దాటి, నిర్వికల్ప సమాధి స్థితిని, అంటే విముక్తి స్థితిని ఎలా పొందవచ్చు అనేది తెలుసుకుందాం.

శ్రీమాత్రే నమః శ్రీమాత శరణం మమ. జైగురుదేవ్‌.

🌹🌹🌹🌹🌹


Sri Chakra - Significance of Nine Avaranas - State of Liberation


🌹 Sri Chakra - Significance of Nine Avaranas - State of Liberation 🌹

Prasad Bharadwaj

https://youtu.be/34BeNGWOAw4


In this video, Prasad Bharadwaj explains the significance of the nine Avaranas (enclosures) of the Sri Chakra, a sacred symbol in Sri Vidya tradition, and how understanding and aligning with these Avaranas can lead to spiritual awakening and liberation. Through meditation and devotion, one can merge the cosmic energies and realize the oneness of Shiva and Shakti, ultimately attaining the state of Nirvikalpa Samadhi, or the state of liberation beyond duality.

Sri Matre Namah. Sri Mata Sharanam Mama. Jai Gurudev.


🌹🌹🌹🌹🌹


श्री चक्र - नौ आवरणों का महत्व - मुक्ति की अवस्था (Sri Chakra - Significance of Nine Avaranas - State of Liberation)


🌹 श्री चक्र - नौ आवरणों का महत्व - मुक्ति की अवस्था 🌹

प्रसाद भारद्वाज

https://youtu.be/dkHysUXYm2I

इस वीडियो में, प्रसाद भारद्वाज श्रीचक्र के नौ आवरणों (अधिवासों) का महत्व बताते हैं, जो श्री विद्या परंपरा में एक पवित्र प्रतीक है। वे बताते हैं कि कैसे इन आवरणों को समझकर और उनके साथ सामंजस्य बनाकर, आध्यात्मिक जागृति और मुक्ति प्राप्त की जा सकती है। ध्यान और भक्ति के माध्यम से, कोई ब्रह्मांडीय ऊर्जाओं को मिलाकर शिव और शक्ति की एकता का अनुभव कर सकता है, और निर्विकल्प समाधि की स्थिति, अर्थात् अद्वैत से परे मुक्ति की अवस्था को प्राप्त कर सकता है।

🌹🌹🌹🌹🌹

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 994 / Vishnu Sahasranama Contemplation - 994


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 994 / Vishnu Sahasranama Contemplation - 994 🌹

🌻 994. నన్దకీ, नन्दकी, Nandakī 🌻

ఓం నన్దకినే నమః | ॐ नन्दकिने नमः | OM Nandakine namaḥ


విద్యామయో నన్దకాఖ్యః ఖడ్గోఽస్యాఽస్తితి నన్దకీ

ఈతనికి విద్య, తత్త్వజ్ఞాన రూపమగు నందక నామ ఖడ్గము కలదు.


:: శ్రీ విష్ణుమహాపురాణే ప్రథమాంశే ద్వావింశోఽధ్యాయః ::

బిభర్తి యచ్చాసిరన్తమచ్చ్యుతోత్యన్తనిర్మలమ్ ।
విద్యామయ తు తజ్జ్ఞానమవిద్యాకోశసంస్థితమ్ ॥ 74 ॥

అచ్యుతుడు ధరించు అసిరత్నము (చక్రవర్తి ధరించు ఖడ్గము) విద్యామయమును, జ్ఞానరూపయు, అత్యంత నిర్మలమును అయియుండి అవిద్య అనబడు ఖడ్గకోశము నందు నిక్షేపింపబడి యుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 994 🌹

🌻 994. Nandakī 🌻

OM Nandakine namaḥ



विद्यामयो नन्दकाख्यः खड्गोऽस्याऽस्तिति नन्दकी / Vidyāmayo nandakākhyaḥ khaḍgo’syā’stiti Nandakī

His sword is called Nandaka, of the nature of the knowledge.


:: श्री विष्णुमहापुराणे प्रथमांशे द्वाविंशोऽध्यायः ::

बिभर्ति यच्चासिरन्तमच्च्युतोत्यन्तनिर्मलम् ।
विद्यामय तु तज्ज्ञानमविद्याकोशसंस्थितम् ॥ ७४ ॥


Śrī Viṣṇu Mahā Purāṇa - Part I, Chapter 22

Bibharti yaccāsirantamaccyutotyantanirmalam,
Vidyāmaya tu tajjñānamavidyākośasaṃsthitam. 74.


The bright sword of Achyuta is holy wisdom, concealed at some seasons in the scabbard of ignorance.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः ।
रथांगपाणिरक्षोभ्यस्सर्वप्रहरणायुधः ॥ १०७ ॥

శఙ్ఖభృన్నన్దకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః ।
రథాంగపాణిరక్షోభ్యస్సర్వప్రహరణాయుధః ॥ 107 ॥

Śaṅkhabhr‌nnandakī cakrī śārṅgadhanvā gadādharaḥ,
Rathāṃgapāṇirakṣobhyassarvapraharaṇāyudhaḥ ॥ 107 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 566 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 566 - 4


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 566 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 566 - 4 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।
మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥ 🍀

🌻 566. 'నిత్యతృప్తా' - 4 🌻


“సర్వము నందు తానే యున్నాను.” అని తెలిసియున్న శ్రీమాత శాశ్వతమగు తృప్తి యందుండును. తాను సత్యమే అని తెలిసినవాడు తాను శాశ్వతుడని కూడ తెలియును. సర్వమునందు తానై యున్నాడని కూడ తెలియును. ఇట్టి పరమోత్కృష్టమైన స్థితి యందుండువారు నిత్యతృప్తులు. వశిష్ఠాది బ్రహ్మర్షు అట్టివారు. తృప్తిగ నుండుట నుండి నిత్యతృప్తికి సాగుట ఈ నామము తెలుపు సాధన. తృప్తిగ నుండుటకు త్రిగుణములను సమన్వయించుకొని సత్త్వమున నిలువ వలయును. సత్త్వమున నిలచి సత్యశోధనమున నిమగ్నము కావలయును. అపుడు తానుండక సత్వము సిద్ధించును. అపుడు నిత్య తృప్తి యందుండ వచ్చును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 566 - 4 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 115. Nityatrupta bhaktanidhi rniyantri nikhileshvari
maityradi vasanalabhya mahapralayasakshini ॥115 ॥ 🌻

🌻 566. 'Nityatrupta' - 4 🌻


Sri Mata, knowing "I am present in everything," resides in eternal contentment. One who knows "I am the truth" also understands that they are eternal, and that they exist in all things. Such individuals, who reside in this supreme state, are eternally content. Great sages like Vasistha embody this quality. This name signifies the journey from contentment to eternal contentment. To achieve contentment, one must balance the three gunas (sattva, rajas, tamas) and stabilize themselves in sattva. Once established in sattva, they should immerse themselves in the pursuit of truth. When ego dissolves and sattva is perfected, eternal contentment can be attained.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


దుర్గాష్టమి శుభాకాంక్షలు అందరికి, Durga Ashtami Greetings to All.


🌹. దుర్గాష్టమి శుభాకాంక్షలు అందరికి, Durga Ashtami Good Wishes to All. 🌹

🌻. ప్రసాద్ భరద్వాజ

🌷. శ్రీ దుర్గా దేవి స్తోత్రము 🌷

రక్ష రక్ష మహాదేవి దుర్గే దుర్గతినాశిని | మాం భక్తమనురక్తం చ శత్రుగ్రస్తం కృపామయి
విష్ణుమాయే మహాభాగే నారాయణి సనాతని | బ్రహ్మస్వరూపే పరమే నిత్యానందస్వరూపిణీ


ఓం హ్రీం దుం దుర్గాయై నమః

విరాటనగరం రమ్యం – గచ్చమానో యుద్ధిష్టిరః

అస్తువ న్మనసా దేవీం – దుర్గాం త్రిభువనేశ్వరీమ్.

త్వం బ్రహ్మవిద్యావిద్యానాం మహానిద్రా చ దేహినామ్

స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసిని


🪷 శ్రీ దేవి శరన్నవరాత్రుల 8వ రోజు ఇంద్రకీలాద్రిపై " శ్రీ దుర్గాదేవి దేవి"గా దర్శనం. 🪷

దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి.


🌻 నైవేద్యం 🌻

ఈరోజున నైవేద్యంగా శాకాన్నం లేదా కలగూర పులుసు సమర్పిస్తారు.


🍀. దుర్గాష్టమి విశిష్టత 🍀

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దేవీ నవరాత్రులు జరుపుకుంటారు. ఎనిమిదవ రోజు.. అంటే ఆశ్వయుజ అష్టమి దుర్గాష్టమి లేదా మహాష్టమి పర్వదినం. ఈ రోజున వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడిన వారు అస్త్ర పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు.

పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శత్రువులను జయించి విజయుడయ్యాడు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు పవిత్రతను సంతరించుకుంది. కనుకనే ఇప్పటికీ జమ్మిచెట్టుకు విజయదశమి నాడు భక్తిగా పూజలు చేస్తారు.

మహాష్టమి నాడు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను అర్చిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి - అనే ఎనిమిది శక్తి రూపాలను కొలుస్తారు.

తమ పిల్లలను తల్లిదండ్రులు ఇతర రోజుల కంటే దుర్గాష్టమి లేదా విజయదశమి రోజున విద్యాభ్యాసం చేయించడం ఉత్తమంగా భావిస్తారు. ఈ రోజుల్లో గనుక చిన్నారుల చేత ''ఓంకారం'' రాయించి విద్యాభ్యాసం చేయిస్తే చదువు బాగా వస్తుందని విశ్వసిస్తారు.

వ్యాపారులు తమ షాపులు లేదా సంస్థలను పూవులతో అలంకరించుకుని దుర్గాదేవి పూజ చేసుకుంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు దుర్గాష్టమి, విజయదశమి రోజుల్లో ఆరంభించడం శుభసూచకంగా భావిస్తారు. అందుచేత దుర్గాష్టమి రోజున శక్తిపీఠాలను దర్శించుకోవడం లేదా సమీపంలోని అమ్మవారి ఆలయాలను సందర్శించడం చేయాలని పండితులు చెబుతారు.

🌹 🌹 🌹 🌹🌹


శ్రీ దేవి శరన్నవరాత్రులు 8వ రోజు 10/10/2024 "దేవీ మహాగౌరీ " గా దర్శనం 8th Day of Shri Devi Sharannavaratri 10/10/2024 Darshan as "Devi MahaGauri"


శ్రీ దేవి శరన్నవరాత్రులు 8వ రోజు 10/10/2024 "దేవీ మహాగౌరీ " గా దర్శనం

శ్రీశైలం


🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్లో𝕝𝕝 ప్రధమం శైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కంధమాతేతి, షష్ఠమం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||

"దేవీ మహాగౌరీ" ధ్యాన శ్లోకం

శ్లో𝕝𝕝 శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః | మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ||

అష్టవర్షా భవేద్గౌరీ - "మహాగౌరి" అష్టవర్ష ప్రాయము గలది. ఈమె గౌర వర్ణ శోభలు మల్లెపూవులను, శంఖమును, చంద్రుని తలపింపజేయును. ఈమె ధరించు వస్త్రములును, ఆభరణములును ధవళ కాంతులను వెదజల్లుచుండును. ఈమె చతుర్భుజ, వృషభవాహన. తన కుడిచేతులలో ఒకదానియందు అభయముద్రను, మఱియొకదానియందు త్రిశూలమును వహించియుండును. అట్లే ఎడమచేతులలో ఒకదానియందు డమరుకమును, వేఱొకదానియందు వరముద్రను కలిగియుండును. ఈమె దర్శనము ప్రశాంతము.

పార్వతి యవతారమున పరమశివుని పతిగా పొందుటకు కఠోరమైన తపస్సు చేయగా ఈమె శరీరము పూర్తిగా నలుపెక్కెను. ప్రసన్నుడైన శివుడు గంగాజలముతో అభిషేకించగా ఈమె శ్వేత వర్ణశోభితయై విద్యుత్కాంతులను విరజిమ్ముచు "మహాగౌరి" యని వాసిగాంచెను. ఈమె శక్తి అమోఘము. సద్యఃఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషములన్నియును ప్రక్షాళితమగును. వారి పూర్వ సంచిత పాపములును పూర్తిగా నశించును. భవిష్యత్తులో గూడ పాపతాపములుగాని, దైన్య దుఃఖములుగాని వారిని దరిజేరవు. వారు సర్వవిధముల పునీతులై, ఆక్షయముగా పుణ్యఫలములను పొందుదురు. ఈ దేవి పాదారవిందములను సేవించుటవలన కష్టములు మటుమాయమగును. ఈమె యుపాసన ప్రభావమున అసంభవములైన కార్యముల సైతము సంభవములే యగును.

శ్రీ మహాగౌరీదేవ్యై నమః

🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑


బతుకమ్మ పండుగ 9వ రోజు 10/10/2024 : సద్దుల బతుకమ్మ Bathukamma Festival 9th ​​Day 10/10/2024 : Saddula Bathukamma


బతుకమ్మ పండుగ 9వ రోజు 10/10/2024 : సద్దుల బతుకమ్మ

🌔🌔🌔🌔🌔🌔🌔🌔🌔🌔🌔🌔


సద్దుల బతుకమ్మ



ఇదే చివరి పండుగా రోజు. ఈ రోజు ఎన్ని పూలు దొరికే అన్ని పూలతో బతుకమ్మను పెద్దగా పేరుస్తారు. ఈ రోజు ఆడవారు చాలా ఉత్సాహంగా ఆడుతారు, పాడుతారు. అలాగే పెద్ద బతుకమ్మ పక్కన చిన్నగా గౌరమ్మను కూడా తయారు చేసి చాలా జాగ్రత్తగా ఎత్తుకొని బతుకమ్మను వేసిన తరవాత గౌరమ్మను పూజించి ఆడవారు పసుపును వారి చెంపలకు రాసుకుంటారు.

చివరి రోజు కాబట్టి చాలా చీకటి పడే వరకు ఆడుకుంటారు ఆడవారు. పెద్ద బతుకమ్మ రోజు ఎక్కడ ఉన్న వారి సొంత ఊరికి చేరుకొని ఆడపిల్లలు అందరూ కలసి ఆనందంతో బతుకమ్మను ఆడుకొని చెరువులో వదులుతారు.

🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴

🌹 10 OCTOBER 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹

🍀🌹 10 OCTOBER 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹🍀
1) 🌹 శ్రీచక్రము - నవ ఆవరణల విశిష్టత - మోక్ష స్థితి 🌹
2) 🌹 Sri Chakra - Significance of Nine Avaranas - State of Liberation 🌹
3) 🌹 श्री चक्र - नौ आवरणों का महत्व - मुक्ति की अवस्था 🌹
5) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 994 / Vishnu Sahasranama Contemplation - 994 🌹*
🌻 994. నన్దకీ, नन्दकी, Nandakī 🌻
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 566 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 566 - 4 🌹 
🌻 566. 'నిత్యతృప్తా' - / 566. 'Nityatrupta' - 4 🌻
6) 🌹. దుర్గాష్టమి శుభాకాంక్షలు అందరికి, Durga Ashtami Good Wishes to All. 🌹*
🍀. దుర్గాష్టమి విశిష్టత 🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 శ్రీచక్రము - నవ ఆవరణల విశిష్టత - మోక్ష స్థితి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*ఈ వీడియోలో శ్రీచక్రం యొక్క నవ ఆవరణల యొక్క విశిష్టతను వివరించడమే కాకుండా, శ్రీ విద్య సంప్రదాయంలో ఈ పవిత్ర చిహ్నం యొక్క ప్రాముఖ్యతను తెలియ చేసాను. ఈ ఆవరణాల అర్థాన్ని గ్రహించడం మరియు వాటితో తమని తాము అనుసంధానించుకోవడం ద్వారా, ఆధ్యాత్మిక జాగృతి మరియు విముక్తి పొందడం ఎలాగో తెలుసుకుందాం. ధ్యానం మరియు భక్తి ద్వారా, ఒకరు శివ-శక్తుల ఐక్యతా స్థితిని తెలుసుకొని, ద్వంద్వాన్ని దాటి, నిర్వికల్ప సమాధి స్థితిని, అంటే విముక్తి స్థితిని ఎలా పొందవచ్చు అనేది తెలుసుకుందాం.*
*శ్రీమాత్రే నమః శ్రీమాత శరణం మమ. జైగురుదేవ్‌.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Sri Chakra - Significance of Nine Avaranas - State of Liberation 🌹*
*Prasad Bharadwaj*

*In this video, Prasad Bharadwaj explains the significance of the nine Avaranas (enclosures) of the Sri Chakra, a sacred symbol in Sri Vidya tradition, and how understanding and aligning with these Avaranas can lead to spiritual awakening and liberation. Through meditation and devotion, one can merge the cosmic energies and realize the oneness of Shiva and Shakti, ultimately attaining the state of Nirvikalpa Samadhi, or the state of liberation beyond duality.*
*Sri Matre Namah. Sri Mata Sharanam Mama. Jai Gurudev.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 श्री चक्र - नौ आवरणों का महत्व - मुक्ति की अवस्था 🌹*
*प्रसाद भारद्वाज*

*इस वीडियो में, प्रसाद भारद्वाज श्रीचक्र के नौ आवरणों (अधिवासों) का महत्व बताते हैं, जो श्री विद्या परंपरा में एक पवित्र प्रतीक है। वे बताते हैं कि कैसे इन आवरणों को समझकर और उनके साथ सामंजस्य बनाकर, आध्यात्मिक जागृति और मुक्ति प्राप्त की जा सकती है। ध्यान और भक्ति के माध्यम से, कोई ब्रह्मांडीय ऊर्जाओं को मिलाकर शिव और शक्ति की एकता का अनुभव कर सकता है, और निर्विकल्प समाधि की स्थिति, अर्थात् अद्वैत से परे मुक्ति की अवस्था को प्राप्त कर सकता है।*
*श्रीमात्रे नमः श्रीमात शरणं मम। जय गुरुदेव।* 
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 శ్రీచక్రము - నవ ఆవరణల విశిష్టత - మోక్ష స్థితి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*ఈ వీడియోలో శ్రీచక్రం యొక్క నవ ఆవరణల యొక్క విశిష్టతను వివరించడమే కాకుండా, శ్రీ విద్య సంప్రదాయంలో ఈ పవిత్ర చిహ్నం యొక్క ప్రాముఖ్యతను తెలియ చేసాను. ఈ ఆవరణాల అర్థాన్ని గ్రహించడం మరియు వాటితో తమని తాము అనుసంధానించు కోవడం ద్వారా, ఆధ్యాత్మిక జాగృతి మరియు విముక్తి పొందడం ఎలాగో తెలుసుకుందాం. ధ్యానం మరియు భక్తి ద్వారా, ఒకరు శివ-శక్తుల ఐక్యతా స్థితిని తెలుసుకొని, ద్వంద్వాన్ని దాటి, నిర్వికల్ప సమాధి స్థితిని, అంటే విముక్తి స్థితిని ఎలా పొందవచ్చు అనేది తెలుసుకుందాం.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Sri Chakra - Significance of Nine Avaranas - State of Liberation 🌹*
*Prasad Bharadwaj*

*In this video, Prasad Bharadwaj explains the significance of the nine Avaranas (enclosures) of the Sri Chakra, a sacred symbol in Sri Vidya tradition, and how understanding and aligning with these Avaranas can lead to spiritual awakening and liberation. Through meditation and devotion, one can merge the cosmic energies and realize the oneness of Shiva and Shakti, ultimately attaining the state of Nirvikalpa Samadhi, or the state of liberation beyond duality.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 श्री चक्र - नौ आवरणों का महत्व - मुक्ति की अवस्था 🌹*
*प्रसाद भारद्वाज*

*इस वीडियो में, प्रसाद भारद्वाज श्रीचक्र के नौ आवरणों (अधिवासों) का महत्व बताते हैं, जो श्री विद्या परंपरा में एक पवित्र प्रतीक है। वे बताते हैं कि कैसे इन आवरणों को समझकर और उनके साथ सामंजस्य बनाकर, आध्यात्मिक जागृति और मुक्ति प्राप्त की जा सकती है। ध्यान और भक्ति के माध्यम से, कोई ब्रह्मांडीय ऊर्जाओं को मिलाकर शिव और शक्ति की एकता का अनुभव कर सकता है, और निर्विकल्प समाधि की स्थिति, अर्थात् अद्वैत से परे मुक्ति की अवस्था को प्राप्त कर सकता है।*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 994 / Vishnu Sahasranama Contemplation - 994 🌹*

*🌻 994. నన్దకీ, नन्दकी, Nandakī 🌻*

*ఓం నన్దకినే నమః | ॐ नन्दकिने नमः | OM Nandakine namaḥ*

*విద్యామయో నన్దకాఖ్యః ఖడ్గోఽస్యాఽస్తితి నన్దకీ*

*ఈతనికి విద్య, తత్త్వజ్ఞాన రూపమగు నందక నామ ఖడ్గము కలదు.*

:: శ్రీ విష్ణుమహాపురాణే ప్రథమాంశే ద్వావింశోఽధ్యాయః ::
బిభర్తి యచ్చాసిరన్తమచ్చ్యుతోత్యన్తనిర్మలమ్ ।
విద్యామయ తు తజ్జ్ఞానమవిద్యాకోశసంస్థితమ్ ॥ 74 ॥

*అచ్యుతుడు ధరించు అసిరత్నము (చక్రవర్తి ధరించు ఖడ్గము) విద్యామయమును, జ్ఞానరూపయు, అత్యంత నిర్మలమును అయియుండి అవిద్య అనబడు ఖడ్గకోశము నందు నిక్షేపింపబడి యుండును.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 994 🌹*

*🌻 994. Nandakī 🌻*

*OM Nandakine namaḥ*

*विद्यामयो नन्दकाख्यः खड्गोऽस्याऽस्तिति नन्दकी / Vidyāmayo nandakākhyaḥ khaḍgo’syā’stiti Nandakī*

*His sword is called Nandaka, of the nature of the knowledge.*

:: श्री विष्णुमहापुराणे प्रथमांशे द्वाविंशोऽध्यायः ::
बिभर्ति यच्चासिरन्तमच्च्युतोत्यन्तनिर्मलम् ।
विद्यामय तु तज्ज्ञानमविद्याकोशसंस्थितम् ॥ ७४ ॥

Śrī Viṣṇu Mahā Purāṇa - Part I, Chapter 22
Bibharti yaccāsirantamaccyutotyantanirmalam,
Vidyāmaya tu tajjñānamavidyākośasaṃsthitam. 74.

*The bright sword of Achyuta is holy wisdom, concealed at some seasons in the scabbard of ignorance.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः ।रथांगपाणिरक्षोभ्यस्सर्वप्रहरणायुधः ॥ १०७ ॥
శఙ్ఖభృన్నన్దకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః ।రథాంగపాణిరక్షోభ్యస్సర్వప్రహరణాయుధః ॥ 107 ॥
Śaṅkhabhr‌nnandakī cakrī śārṅgadhanvā gadādharaḥ,Rathāṃgapāṇirakṣobhyassarvapraharaṇāyudhaḥ ॥ 107 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 566 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam  - 566 - 4 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।*
*మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥ 🍀*

*🌻 566. 'నిత్యతృప్తా' - 4 🌻*

*“సర్వము నందు తానే యున్నాను.” అని తెలిసియున్న శ్రీమాత శాశ్వతమగు తృప్తి యందుండును. తాను సత్యమే అని తెలిసినవాడు తాను శాశ్వతుడని కూడ తెలియును. సర్వమునందు తానై యున్నాడని కూడ తెలియును. ఇట్టి పరమోత్కృష్టమైన స్థితి యందుండువారు నిత్యతృప్తులు. వశిష్ఠాది బ్రహ్మర్షు అట్టివారు. తృప్తిగ నుండుట నుండి నిత్యతృప్తికి సాగుట ఈ నామము తెలుపు సాధన. తృప్తిగ నుండుటకు త్రిగుణములను సమన్వయించుకొని సత్త్వమున నిలువ వలయును. సత్త్వమున నిలచి సత్యశోధనమున నిమగ్నము కావలయును. అపుడు తానుండక సత్వము సిద్ధించును. అపుడు నిత్య తృప్తి యందుండ వచ్చును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 566 - 4 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 115. Nityatrupta bhaktanidhi rniyantri nikhileshvari*
*maityradi vasanalabhya mahapralayasakshini  ॥115 ॥ 🌻*

*🌻 566. 'Nityatrupta' - 4 🌻*

*Sri Mata, knowing "I am present in everything," resides in eternal contentment. One who knows "I am the truth" also understands that they are eternal, and that they exist in all things. Such individuals, who reside in this supreme state, are eternally content. Great sages like Vasistha embody this quality. This name signifies the journey from contentment to eternal contentment. To achieve contentment, one must balance the three gunas (sattva, rajas, tamas) and stabilize themselves in sattva. Once established in sattva, they should immerse themselves in the pursuit of truth. When ego dissolves and sattva is perfected, eternal contentment can be attained.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. దుర్గాష్టమి శుభాకాంక్షలు అందరికి, Durga Ashtami Good Wishes to All. 🌹*
*🌻. ప్రసాద్ భరద్వాజ*

 *🌷. శ్రీ దుర్గా దేవి స్తోత్రము 🌷*

*రక్ష రక్ష మహాదేవి దుర్గే దుర్గతినాశిని | మాం భక్తమనురక్తం చ శత్రుగ్రస్తం కృపామయి*
*విష్ణుమాయే మహాభాగే నారాయణి సనాతని | బ్రహ్మస్వరూపే పరమే నిత్యానందస్వరూపిణీ*

*ఓం హ్రీం దుం దుర్గాయై నమః*
*విరాటనగరం రమ్యం – గచ్చమానో యుద్ధిష్టిరః*
*అస్తువ న్మనసా దేవీం – దుర్గాం త్రిభువనేశ్వరీమ్.*
*త్వం బ్రహ్మవిద్యావిద్యానాం మహానిద్రా చ దేహినామ్*
*స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసిని*

*🪷 శ్రీ దేవి శరన్నవరాత్రుల 8వ రోజు ఇంద్రకీలాద్రిపై " శ్రీ దుర్గాదేవి దేవి"గా దర్శనం. 🪷*

*దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి.*

*🌻 నైవేద్యం 🌻*

*ఈరోజున నైవేద్యంగా శాకాన్నం లేదా కలగూర పులుసు సమర్పిస్తారు.*

*🍀. దుర్గాష్టమి విశిష్టత 🍀*

*ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దేవీ నవరాత్రులు జరుపుకుంటారు. ఎనిమిదవ రోజు.. అంటే ఆశ్వయుజ అష్టమి దుర్గాష్టమి లేదా మహాష్టమి పర్వదినం. ఈ రోజున వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడిన వారు అస్త్ర పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు.*
 
*పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శత్రువులను జయించి విజయుడయ్యాడు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు పవిత్రతను సంతరించుకుంది. కనుకనే ఇప్పటికీ జమ్మిచెట్టుకు విజయదశమి నాడు భక్తిగా పూజలు చేస్తారు.*
 
*మహాష్టమి నాడు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను అర్చిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి - అనే ఎనిమిది శక్తి రూపాలను కొలుస్తారు.*
 
*తమ పిల్లలను తల్లిదండ్రులు ఇతర రోజుల కంటే దుర్గాష్టమి లేదా విజయదశమి రోజున విద్యాభ్యాసం చేయించడం ఉత్తమంగా భావిస్తారు. ఈ రోజుల్లో గనుక చిన్నారుల చేత ''ఓంకారం'' రాయించి విద్యాభ్యాసం చేయిస్తే చదువు బాగా వస్తుందని విశ్వసిస్తారు.*
 
*వ్యాపారులు తమ షాపులు లేదా సంస్థలను పూవులతో అలంకరించుకుని దుర్గాదేవి పూజ చేసుకుంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు దుర్గాష్టమి, విజయదశమి రోజుల్లో ఆరంభించడం శుభసూచకంగా భావిస్తారు. అందుచేత దుర్గాష్టమి రోజున శక్తిపీఠాలను దర్శించుకోవడం లేదా సమీపంలోని అమ్మవారి ఆలయాలను సందర్శించడం చేయాలని పండితులు చెబుతారు.*
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*శ్రీ దేవి శరన్నవరాత్రులు 8వ రోజు 10/10/2024 "దేవీ మహాగౌరీ " గా దర్శనం - శ్రీశైలం*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్లో𝕝𝕝 ప్రధమం శైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కంధమాతేతి, షష్ఠమం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||

"దేవీ మహాగౌరీ" ధ్యాన శ్లోకం

శ్లో𝕝𝕝 శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః | మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ||

అష్టవర్షా భవేద్గౌరీ - "మహాగౌరి" అష్టవర్ష ప్రాయము గలది. ఈమె గౌర వర్ణ శోభలు మల్లెపూవులను, శంఖమును, చంద్రుని తలపింపజేయును. ఈమె ధరించు వస్త్రములును, ఆభరణములును ధవళ కాంతులను వెదజల్లుచుండును. ఈమె చతుర్భుజ, వృషభవాహన. తన కుడిచేతులలో ఒకదానియందు అభయముద్రను, మఱియొకదానియందు త్రిశూలమును వహించియుండును. అట్లే ఎడమచేతులలో ఒకదానియందు డమరుకమును, వేఱొకదానియందు వరముద్రను కలిగియుండును. ఈమె దర్శనము ప్రశాంతము.

పార్వతి యవతారమున పరమశివుని పతిగా పొందుటకు కఠోరమైన తపస్సు చేయగా ఈమె శరీరము పూర్తిగా నలుపెక్కెను. ప్రసన్నుడైన శివుడు గంగాజలముతో అభిషేకించగా ఈమె శ్వేత వర్ణశోభితయై విద్యుత్కాంతులను విరజిమ్ముచు "మహాగౌరి" యని వాసిగాంచెను. ఈమె శక్తి అమోఘము. సద్యఃఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషములన్నియును ప్రక్షాళితమగును. వారి పూర్వ సంచిత పాపములును పూర్తిగా నశించును. భవిష్యత్తులో గూడ పాపతాపములుగాని, దైన్య దుఃఖములుగాని వారిని దరిజేరవు. వారు సర్వవిధముల పునీతులై, ఆక్షయముగా పుణ్యఫలములను పొందుదురు. ఈ దేవి పాదారవిందములను సేవించుటవలన కష్టములు మటుమాయమగును. ఈమె యుపాసన ప్రభావమున అసంభవములైన కార్యముల సైతము సంభవములే యగును.

శ్రీ మహాగౌరీదేవ్యై నమః 
🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*బతుకమ్మ పండుగ 9వ రోజు 10/10/2024 : సద్దుల బతుకమ్మ*
🌔🌔🌔🌔🌔🌔🌔🌔🌔🌔🌔🌔

*సద్దుల బతుకమ్మ*

ఇదే చివరి పండుగా రోజు. ఈ రోజు ఎన్ని పూలు దొరికే అన్ని పూలతో బతుకమ్మను పెద్దగా పేరుస్తారు. ఈ రోజు ఆడవారు చాలా ఉత్సాహంగా ఆడుతారు, పాడుతారు. అలాగే పెద్ద బతుకమ్మ పక్కన చిన్నగా గౌరమ్మను కూడా తయారు చేసి చాలా జాగ్రత్తగా ఎత్తుకొని బతుకమ్మను వేసిన తరవాత గౌరమ్మను పూజించి ఆడవారు పసుపును వారి చెంపలకు రాసుకుంటారు.

చివరి రోజు కాబట్టి చాలా చీకటి పడే వరకు ఆడుకుంటారు ఆడవారు. పెద్ద బతుకమ్మ రోజు ఎక్కడ ఉన్న వారి సొంత ఊరికి చేరుకొని ఆడపిల్లలు అందరూ కలసి ఆనందంతో బతుకమ్మను ఆడుకొని చెరువులో వదులుతారు.
🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj

Kalratri కాళరాత్రీ Tritara త్రిరాత్ర Saraswati సరస్వతీ



నేటి నుండి మూడు రోజులు దేవి త్రిరాత్ర వ్రతం ప్రారంభం....!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

త్రిరాత్ర వ్రతదీక్ష అంటే ఏమిటి..?


సప్తమి, అష్టమి, నవమి తిథులలో పాటించే దీక్షను ‘త్రిరాత్ర వ్రతదీక్ష’ అని పిలుస్తారు.

ఆ జగన్మాత దయతోనే సర్వ జగత్తూ నడయాడుతోంది...

ఆ అమ్మ కరుణావల్లి, ఆ తల్లి అమృతహృదయ, ఆమె చల్లని చూపులకోసం ముల్లోకాలు ఎదురు చూస్తుంటాయి...

అందుకే ఆరాధించడానికి తిథి, వార, నక్షత్రాలు లేకపోయినా ఈ ఆశ్వీయుజమాసాన వచ్చే శుద్ధ పాడ్యమి మొదలుకుని నవమి వరకు ఆ తల్లిని కొలిచినవారికి కోటిజన్మలలోని పాపరాశి భస్మమవడమే కాదు, తుదిలేని పుణ్యరాశి లభ్యమౌతుందట.

అందుకే సజ్జనులందరూ ఈ జగాలనేలే జగన్మాత వ్రతాన్ని ఆచరించడానికి వెయ్యి కనులతో ఎదురు చూస్తుంటారని అలా చూసి అమ్మ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయని 'దేవీభాగవతం' చెబుతోంది...

ఈ వ్రతరాజాన్నే దుర్గాదేవి వ్రతమని, కుమారీ పూజ అనీ అంటారు. ఈ చల్లని తల్లిని మనలోని తిమిరాంధకారాన్ని పారద్రోలమని రాత్రివేళ అర్చించడం సంప్రదాయం. అందుకే ఈ రాత్రిళ్లను శరన్నవ రాత్రులుగా కూడా అభివర్ణిస్తారు.

ఈ తల్లి శక్తి అనంతం , అనిర్వచనీయం. మహిమోపేతం. శరన్నవరాత్రులలో తల్లిని తొమ్మిది

(9) రకాలుగా అర్చించి పూజిస్తారు.

మూడు కన్నులతో, పదహారు చేతులతో త్రిశూలాన్ని ధరించి ఉంటుంది.

1. పాముల కంకణాలతో , నల్లని కంఠంతో, నల్లని వర్ణంతో కనిపించే తల్లిని షోడశ భుజ దుర్గాదేవిగా,

2. ఎనిమిది చేతులతో మహిషి (ఎద్దు) తలమీద ఎక్కి బంగారు వర్ణంతో కనిపించే అమ్మను వనదుర్గాదేవిగా,

3. రుద్రాంశతో సింహవాహన రూఢిగా శ్యామల వర్ణంతో సర్వభూషణ శోభితంగా దర్శనం ఇచ్చే తల్లి నిరుద్రాంశ దుర్గాదేవిగాను,

4. వివిధ మణిమయ భూషణాలతో సింహ వాహనాన్ని ఎక్కిన త్రిశూలినీ దుర్గాదేవి స్వరూపంగా,

5. అష్టభుజాలతో, చంద్రరేఖను ధరించిన శిరస్సులో మూడు కళ్ళతో ప్రకాశించే అగ్ని దుర్గాదేవి స్వరూపంగా ,

6. సింహ వాహనంతో జయ దుర్గాదేవిగా ,

7. మెరుపు తీగ లాంటి స్వర్ణ వర్ణ మేని ఛాయతో, స్వర్ణ కమలం మీద ఆశీనురాలై, ఇంద్రాది దేవతలందరిచేత స్తుతించబడే వింధ్యావాసిని దుర్గాదేవి స్వరూపంగా,

8. ఎర్రని శరీర వర్ణంతో కూడి చేత తర్జనీముద్రని , ఎడమ చేత త్రిశూలాన్ని ధరించి భయంకర స్వరూపంతో రిపుమారిణి దుర్గాదేవి స్వరూపంగా,

9. తెల్లని శరీర వర్ణంతో , మూడు కళ్ళతో ప్రసన్నమైన ముఖంతో ప్రకాశిస్తుంది. కుడివైపు చేతుల్లో అభయముద్ర చక్రాలను ఎడమవైపు నడుంమీద ఒకచేతిని , మరో చేత శంఖాన్ని ధరించి విష్ణు దుర్గాదేవి స్వరూపంగానూ జగన్మాతను కొలుస్తారు.

ఇలా శరన్నవ రాత్రులలో అమ్మను కొలిచిన వారికి సర్వాభీష్టాలు కలుగుతాయి. ఇలా తొమ్మిదిరోజుల వ్రతం పాటించలేనివారు సప్తమి, అష్టమి, నవమి తిథులలో దీక్ష పాటిస్తారు. దీనిని ‘త్రిరాత్ర వ్రతదీక్ష’ అని పిలుస్తారు.

ఇంకొందరు అమ్మ వ్రతంలో భాగంగా బొమ్మల కొలువును తీర్చిదిద్ది చిన్ని పిల్లలకు పప్పు బెల్లాలు, శనగగుగ్గిళ్ళు , ముతైదువులకు పసుపుకుంకుమలతో పండ్లు, తాంబూలాలు పంచుకొంటారు...

నిత్య పూజలు ఆచరిస్తూ, నిత్య నైవేద్యాలు చేస్తూ సుమంగళీ వ్రతాలు, కుంకుమార్చనలు, పుష్పాలంకరణలు, మొదలైనవన్నీ ఈ నవరాత్రి వేడుకల్లో భాగాలై కనులపండువను , భక్తులను ఆనందపరవశులను చేస్తాయి.

అష్టమిని.. అంటే, దుర్గాష్టమిని మహాష్టమి అని కూడా అంటారు.

ఆ రోజంతా అష్టమి తిథి ఉంటే దుర్గాష్టమి, అలా కాకుండా అష్టమి వెళ్లి ఆనాడే నవమి తిథివస్తే దానిని మహాష్టమి అంటారు.

ఈ దుర్గాష్టమి రోజున అమ్మవారిని సహస్ర నామాలతో , కుంకుమార్చనలతోనూ అర్చిస్తే , సత్సంతాన భాగ్యం కలుగుతుంది.

ఈ దుర్గాష్టమి రోజు లలితా సహస్ర నామం పఠించేవారికి ఎలాంటి భయాలు దరిచేరవని చెపుతారు

నవరాత్రి దీక్షలో మహానవమి మఖ్యమైనవి. మంత్రసిద్ధి జరిగే ఈ రోజుని ‘సిద్దిదా’ అని పిలుస్తారు.

నవమి రోజున మహార్నవమి అంటూ పూజ చేస్తారు, పూర్వకాలంలో జైత్రయాత్రలకు వెళ్ళే రాజులు , చక్రవర్తులు నవమి రోజున ఆయుధ పూజలు చేసేవారు.

అలా చేయడంవల్ల వారికి విజయం సంప్రాప్తించేది, కాలక్రమంలో అదే ఆచారం నేటికీ కొనసాగుతోంది. ఆ రోజు వాహనాలు, యంత్రాలున్నవారు సహస్రనామ పూజగానీ, అష్టోత్తర శతనామ పూజ కానీ చేయడం శ్రేయస్కరం.

దశమి రోజున శమీ పూజ చేస్తారు, దీనిని అపరాజిత పూజ అని కూడా పిల్వడం జరుగుతోంది. ‘శమి’ అంటే జమ్మి చెట్టు, ఈ రోజున జమ్మి చెట్టును పూజిస్తారు.

పాండవులు అజ్ఞాత వాసానికి వెళుతూ తమ ఆయుధాలను జమ్మి చెట్టు తొర్రలో దాచారట. ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు తన గాండీవాన్ని జమ్మి చెట్టుమీద నుంచే తెచ్చుకున్నాడట.

తమ కోర్కెలు నెరవేరాలని కోరుకునేవారు తమ గోత్ర నామాలతో శమీపూజ చేయించుకోవడం శ్రేయస్కరం. శమీ పాపాలను నశింపజేస్తుంది. శత్రువులను సంహరిస్తుంది. అంటే శత్రుపీడన లేకుండా చేస్తుంది..స్వస్తి...

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸








09/10/2024 7వ రోజు శ్రీ శైలంలో "దేవీ కాళరాత్రీ" గా దర్శనం

🍅🍅🍅🍅🍅🍅🍅


శ్లో𝕝𝕝 ప్రధమం శైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కంధమాతేతి, షష్ఠమం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||


"దేవీ కాళరాత్రీ" ధ్యాన శ్లోకం

శ్లో𝕝𝕝 ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ| వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా | వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ||

"కాళరాత్రి" శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదురై యుండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ము చుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. ఈమె నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్దభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయ ముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధము, మఱొక ఎడమచేతిలో ఖడ్గము ధరించియుండును.

కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము - కాని ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను "శుభంకరి" అనియు అంటారు. కావున భక్తులు ఈమెను చూచి ఏ మాత్రము భయమును గాని, ఆందోళనను గాని పొందనవసరమే లేదు.

కాళరాత్రి మాతను స్మరించి నంతమాత్రముననే దానవులు, దైత్యులు, రాక్షసులు, భూత, ప్రేత, పిశాచములు భయముతో పారిపోవుట తథ్యము. ఈమె యనుగ్రహమున గ్రహబాధలును తొలగిపోవును. ఈమెను ఉపాసించువారికి అగ్ని, జలము, జంతువులు మొదలగువాటి భయముగాని, శత్రువుల భయముగాని, రాత్రి భయముగాని ఏ మాత్రము ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వధా భయవిముక్తులగుదురు.


శ్రీ కాళరాత్రీదేవ్యై నమః

🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒






09.10.24 7వ రోజు - ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవి అలంకరణ

🥦🥦🥦🥦🥦🥦🥦🥦


సరస్వతీ దేవి చరిత్ర

చదువుల తల్లి

దేవనాగరి: సరస్వతీ

తెలుగు: సరస్వతీ దేవి

వాహనం: హంస , నెమలి


ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింప బడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు , పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాధలు సరస్వతీ దేవి సరస్వతీ నది చరిత్రలను అనుసంధా నిస్తాయి.

నవరాత్రి , వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది. స్వరూపం ఋగ్వేదంలోనూ , దేవీ భాగవతంలోనూ , బ్రహ్మ

వైవర్త పురాణంలోనూ (2.6.13-95) , పద్మ పురాణంలోనూ సరస్వతి దేవి గురించి వివిధ గాధలున్నాయి.

సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని , సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాధ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాధ.

వాక్ ,బుద్ధి , వివేకం విద్య , కళలు, విజ్ఞానం – వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా , వీణాపాణిగా , పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనలలోతెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. “శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల

కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు” నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు.

సరస్వతి ధరించే వీణ పేరు”కచ్ఛపి”.పరాశక్తి , జ్ఞాన ప్రదాతసరస్వతి – రాజస్థాన్ లోని పాలరాతి విగ్రహం – 9 వ శతాబ్దానికి చెందినది. పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకరు. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదోఅధ్యాయం వివరిస్తోంది. మహామాయ , భాషా జ్యోతిర్మయి , కళారస హృదయగా సరస్వతీ పూజలందుకొంటోంది.

జ్ఞాన ప్రదాతగా సరస్వతి – కొన్ని గాధలు

పూర్వం ఓసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ

పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్థాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు.

అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్థాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాలను గురించి వాల్మీకిని అడిగాడు.

వాల్మీకి జగదాంబను స్మరించాడు. అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణసూత్ర జ్ఞానాన్ని

పొందాడు. వ్యాసుడు కూడా నూరేళ్ళపాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రు డయ్యాడు. ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని , పురాణ రచనను చేశాడు. ఓసారిఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడినిఅడిగాడు. శివుడు పాటు దివ్వవాణిని తలచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వేయి దివ్వ సంవత్సరాలపాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు.

పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు యాజ్ఞవల్క్య మహర్షి. అప్పుడాయన శోకార్తుడై పుణ్యప్రదమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదవేదాంగాలను చదివించాడు.

అయితేయాజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేక పోవటానికి గమనించిన సూర్య భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు. యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతీ స్తుతి విడవకుండా చేశాడు. ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు , జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు. తన మీద దయచూపి జ్ఞాన , జ్ఞాపక శక్తులను ప్రసాదించమని , విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని , గ్రంధ రచనా శక్తి , ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించ మన్నాడు.

సత్సభలలో మంచి విచారణ శక్తిని ,సత్య స్వరూపిణి , వ్యాఖ్యాన రూపిణి , వ్యాక్యాధిష్టాతృ రూపిణి అయిన సరస్వతిని పదేపదే స్తుతించటంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా , సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది. ఈ సరస్వతి స్తుతి అంతా దేవీ భాగవతంలో ఉంది.







09/10/2024 బతుకమ్మ పండుగలో వెన్నముద్దల బతుకమ్మ

🍓🍓🍓🍓🍓🍓🍓


ఇప్పటికే ఏడు రోజుల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. వాటిలో ఎంగిలిపువ్వు బతుకమ్మ , అటుకల బతుకమ్మ , ముద్దపప్పు బతుకమ్మ , నానబియ్యం బతుకమ్మ , అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ , వేపకాయల బతుకమ్మ వేడకలు ముగిశాయి.

ఇక బతుకమ్మ పండుగలో 8వ రోజును 'వెన్నముద్దల బతుకమ్మ'గా బతుకమ్మను ఆరాధిస్తారు. ఈరోజు తంగేడు , గునుగు , చామంతి , గులాబీ , గడ్డి పువ్వు , మొదలైన పువ్వులతో ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆట , పాటలతో బతుకమ్మ ఆడి చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఈరోజు వాయనంగా నువ్వులు , బెల్లం కలిపి ప్రసాదంగా పెడుతారు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹



అష్టావక్ర గీత 1. ఆత్మానుభవోపదేశము - 1వ శ్లోకము - Youtube Shorts (AshtaVakra Gita 1 - Teaching of Self-Realization - Verse 1)



🌹 అష్టావక్ర గీత 1. ఆత్మానుభవోపదేశము - 1వ శ్లోకము - 1. జ్ఞానాన్ని పొందడం 🌹

ప్రసాద్ భరద్వాజ

https://youtube.com/shorts/KWAqEULyNcQ




🌹అష్టావక్ర గీత 1. ఆత్మానుభవోపదేశము - 1వ శ్లోకము - 2. విముక్తి 🌹

ప్రసాద్ భరద్వాజ

https://youtube.com/shorts/6gub_Rbgw_o




🌹 అష్టావక్ర గీత 1. ఆత్మానుభవోపదేశము - 1వ శ్లోకము - 3. వైరాగ్యం 🌹

ప్రసాద్ భరద్వాజ

https://youtube.com/shorts/H1KM83DOkBE




🌹 అష్టావక్ర గీత 1. ఆత్మానుభవోపదేశము - 1వ శ్లోకము - 4. మానవ శాంతి అన్వేషణ 🌹

ప్రసాద్ భరద్వాజ

https://youtube.com/shorts/tTr5gr4jnK0




🌹 అష్టావక్ర గీత 1. ఆత్మానుభవోపదేశము - 1వ శ్లోకము - 5. ఆత్మానుభవం 🌹

ప్రసాద్ భరద్వాజ

https://youtube.com/shorts/Drp1K4MhS5I




AshtaVakra Gita 1 - Teaching of Self-Realization - Verse 1



🌹 AshtaVakra Gita 1 - Teaching of Self-Realization - Verse 1 - 1. Acquisition of knowledge 🌹

Prasad Bharadwaj

https://youtube.com/shorts/EZkF6kQoXXY




🌹 AshtaVakra Gita 1 - Teaching of Self-Realization - Verse 1 - 2. Liberation 🌹

Prasad Bharadwaj

https://youtube.com/shorts/-GW0oqV1LOs




🌹 AshtaVakra Gita 1 - Teaching of Self-Realization - Verse 1 - 3. Detachment from Pleasures 🌹

Prasad Bharadwaj

https://youtube.com/shorts/sntBQJuDwBk




🌹 AshtaVakra Gita 1 - Teaching of Self-Realization - Verse 1 - 4. human quest for Peace 🌹

Prasad Bharadwaj

https://youtube.com/shorts/X0nNWjeBB88




🌹 AshtaVakra Gita 1 - Teaching of Self-Realization - Verse 1 - 5. Self-Realization 🌹

Prasad Bharadwaj

https://youtube.com/shorts/ICuiF_b8Pg8



अष्टावक्र गीता 1 - आत्म-साक्षात्कार का उपदेश - श्लोक 1 - Youtube Shorts (AshtaVakra Gita 1 - Teaching of Self-Realization - Verse 1)



🌹 अष्टावक्र गीता 1 - आत्म-साक्षात्कार का उपदेश - श्लोक 1 - 1. ज्ञान की प्राप्ति 🌹

प्रसाद भारद्वाज

https://youtube.com/shorts/zBhDDVUOsBk




🌹 अष्टावक्र गीता 1 - आत्म-साक्षात्कार का उपदेश - श्लोक 1 - 2. मुक्ति 🌹

प्रसाद भारद्वाज

https://youtube.com/shorts/1rIWNVFoI2Y




🌹 अष्टावक्र गीता 1 - आत्म-साक्षात्कार का उपदेश - श्लोक 1 - 3. वैराग्य 🌹

प्रसाद भारद्वाज

https://youtube.com/shorts/Xe8pAWEiOTA




🌹 अष्टावक्र गीता 1 - आत्म-साक्षात्कार का उपदेश - श्लोक 1 - 4. मानवता की शांति की खोज 🌹

प्रसाद भारद्वाज

https://youtube.com/shorts/rKYdKHlzLu0




🌹 अष्टावक्र गीता 1 - आत्म-साक्षात्कार का उपदेश - श्लोक 1 - 5. आत्म-साक्षात्कार 🌹

प्रसाद भारद्वाज

https://youtube.com/shorts/Nspo33-EjYo


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 993 / Vishnu Sahasranama Contemplation - 993


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 993 / Vishnu Sahasranama Contemplation - 993 🌹

🌻 993. శఙ్ఖభృత్, शङ्खभृत्, Śaṅkhabhr‌t 🌻

ఓం శఙ్ఖభృతే నమః | ॐ शङ्खभृते नमः | OM Śaṅkhabhr‌te namaḥ

స బిభ్రత్ పాఞ్చజన్యాఖ్యం శఙ్ఖం శ్రీహరిరచ్యుతః ।
భూతాద్యహఙ్కారరూపం శఙ్ఖభృత్ ప్రోచ్యతేబుధైః ॥

పంచభూతాత్మకమును, అహంకార రూపమును అగు పాంచజన్య నామక శంఖమును ధరించు శ్రీహరి శంఖభృత్.



సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 993 🌹

🌻 993. Śaṅkhabhr‌t 🌻

OM Śaṅkhabhr‌te namaḥ



स बिभ्रत् पाञ्चजन्याख्यं शङ्खं श्रीहरिरच्युतः ।
भूताद्यहङ्काररूपं शङ्खभृत् प्रोच्यतेबुधैः ॥


Sa bibhrat pāñcajanyākhyaṃ śaṅkhaṃ śrīhariracyutaḥ,
Bhūtādyahaṅkārarūpaṃ śaṅkhabhr‌t procyatebudhaiḥ.


The bearer of the conch named Pāñcajanya of the form of the five elements and the ahaṅkāra or ego.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka

आत्मयोनिस्स्वयंजातो वैखानस्सामगायनः ।
देवकीनन्दनस्स्रष्टा क्षितीशः पापनाशनः ॥ १०६ ॥

ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయనః ।
దేవకీనన్దనస్స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥

Ātmayonissvayaṃjāto vaikhānassāmagāyanaḥ,
Devakīnandanassraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ ॥ 106 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹



శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 566 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 566 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 566 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 566 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।
మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥ 🍀

🌻 566. 'నిత్యతృప్తా' - 3 🌻


నిత్య సత్త్వమును రజస్తమస్సులు అంతరాయము కలిగింప లేవు. శ్రీకృష్ణుడు, శ్రీలలిత నిత్య సత్వమునకు పరిపూర్ణమగు ఉదాహరణలు. వారెప్పుడునూ తృప్తిగనే యుందురు. రజస్తమస్సులతో కూడిన ఆసురీ శక్తులు వారి నేమియు చేయజాలవు. అందువలననే యుద్ధమందు కూడ వారి చిరునవ్వు చెరగదు. భయంకరమగు యుద్ధమును కూడ మందస్మితముతోనే నిర్వర్తించుట వారి ప్రత్యేకత. సత్త్వము అను పదము నందు సత్ యున్నది. సత్ తో కూడిన వారికే సత్వముండును. తమ ఉనికి రహస్యము నెఱిగినవారే సత్వమున నుండగలరు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 566 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 115. Nityatrupta bhaktanidhi rniyantri nikhileshvari
maityradi vasanalabhya mahapralayasakshini ॥115 ॥ 🌻

🌻 566. 'Nityatrupta' - 3 🌻


Eternal sattva, however, remains unaffected by rajas and tamas. Lord Krishna and Sri Lalita Devi are perfect examples of beings in eternal sattva. They are always content. Asuric (demonic) forces, driven by rajas and tamas, cannot harm them. Even in battle, their serene smile never fades. Their ability to approach even the most terrifying wars with calmness and grace is their unique trait. The word "sattva" contains "sat," meaning truth. Only those aligned with the truth can embody sattva. Only those who understand the secret of their own existence can truly dwell in sattva.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


కాత్యాయని Katyayani

08.10.24 శ్రీశైలంలో కాత్యాయని దేవి అలంకరణ

🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇


కాళరాత్రీ దుర్గాదేవి

నవదుర్గల్లో ఏడవ అవతారం. కాళీ, మహాకాళీ, భధ్రకాళీ, భైరవి, మృత్యు, రుద్రాణి, చాముండా, చండీ, దుర్గా వంటి అమ్మవారి అవతారాలలో ఈ కాళరాత్రీదేవి కూడా ఒకరు. నవరాత్రుల

ఏడవ రోజు అయిన ఆశ్వీయుజ శుద్ధ సప్తమినాడు ఈ అమ్మవారిని పూజిస్తారు.


కాళరాత్రి స్వరూపం

ॐॐॐॐॐॐॐॐॐॐॐ

ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరాస్థితా లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ వామపాదోల్లసల్లో లతాకంటక భూషణా వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రి ర్భయంకరీ!!

దుర్గామాత ఏడవ శక్తి కాళరాత్రి అను పేర ఖ్యాతివహించినది. ఈమె శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదరై యుండును.

మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును. ఈమెకు గల త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. వాటినుండి విద్యుత్కాంతులు ప్రసరించుచుండును.

నవరాత్రి తొమ్మిది రోజులలో దుర్గా దేవి యొక్క తొమ్మిది రూపాలను పూజిస్తారు. క్రమంగా ఆదిశక్తి ఆమె భక్తుల జీవితాల నుండి అన్ని సమస్యలను తొలగిస్తుంది. ఈ తొమ్మిది రూపాలలో , ఒక వ్యక్తి యొక్క జీవితంలో వివాహానికి సంబంధించిన అన్ని సమస్యలను తొలగించే దేవత కూడా ఉంది. మంగళ దోషాలను సైతం ఆమె తొలగిస్తుందని చెప్పబడింది.

ఆమే కాత్యాయయుని కుమార్తె , కాత్యాయనీ. కాత్యాయనీ దేవి నాలుగు చేతులతో చిత్రీకరించబడి ఉంటుంది. ఇందులో ఆమె తన ఎడమ వైపు పై చేతిలో కమలాన్ని , మరో చేతిలో కత్తిని కలిగి ఉంటుంది. అదేవిధంగా , కుడి చేతులు అభయ మరియు వరద ముద్రలతో కూడుకుని ఉంటాయి. పసుపు రంగు చీర ధరించిన ఆమె సింహం మీద అధిరోహించి దర్శనమిస్తుంది.

కాత్యాయనీ దేవిని పూజించబడే ఇంట్లో శాంతి మరియు శ్రేయస్సు కలుగుతుందని చెప్పబడింది. వివాహానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా కాత్యాయనీ దేవిని పూజించడం ద్వారా ఫలితాలను పొందగలరని సలహా ఇవ్వబడింది. వివాహ విషయాలలో ఆలస్యం , భార్యా భర్తల మధ్య తరచుగా విభేదాలు , సరైన భాగస్వామిని కనుగొనలేక పోవడం , వంటి సమస్యలు నవరాత్రి వేళల్లో ఆమెకై ఉపవాసం పాటించడం ద్వారా తొలగించబడుతుందని చెప్పబడింది. ఆమె వర్ణనలు కాళిక పురాణాలలో కూడా కనిపిస్తాయి. కాత్యాయనీ దేవి కూడా ఆదిశక్తి అంశగా పరిగణించబడుతుంది. కావున భయాన్ని త్యజించడం కోసం కూడా కాత్యాయనీ దేవిని పూజించడం జరుగుతుంది.

పన్నెండవ గృహంతో సంబంధం ఉన్న దేవతగా కాత్యాయనీ దేవిని కొలవడం జరుగుతుంది.

జ్యోతిష శాస్త్రం ప్రకారం , కాత్యాయనీ దేవి జన్మ కుండలి చార్ట్లో బృహస్పతి గ్రహంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఆమెను 'బ్రహ్మ మండల ఆదిశక్తి దేవి' అని కూడా పిలుస్తారు. గోకులంలోని గోపికలు , కృష్ణుని ప్రేమను పొందుటకై ఈ దేవతకు ప్రార్ధనలు చేశారని చెప్పబడింది. భగవత్ పురాణంలో వారు యమునా నదిలో స్నానం చేసి , ధూప దీపాలతో , పువ్వులు మరియు నైవేద్యాలను సమర్పించి ఉపవాసం చేసేవారని చెప్పబడింది. ఈ ఉపవాసాలు చేయడం ద్వారా , క్రమంగా దోషాలు తొలగిపోయి వివాహ మార్గాన్ని సుగమం చేస్తుందని చెప్పబడింది. దేవీ నవ రాత్రులలో కాత్యాయని దేవీని పూజ చేయడం వివాహాది సమస్యలతో భాదపడేవారికి అత్యంత ముఖ్యమైన రోజుగా చెప్పబడు తుంది.వివాహానికి సంబంధించిన సమస్యల నివారణ కొరకు సూచించబడిన కాత్యాయని దేవీ మంత్రాలను కొన్ని క్రింద

ఇవ్వబడ్డాయి :


1.ముందస్తు వివాహానికి సూచించబడిన

కాత్యాయనీ మంత్రం :


ఓం కాత్యాయనీ మహామయే, మహాయోగిన్యాధీశ్వరీ !

నాంద్ గోప్సూతత్ దేవి పాటిమ్ మే కురు తే నమః !!



2.వివాహ ఆలస్యానికి సూచించదగిన

కాత్యాయని మంత్రం :

హే గౌరీ శంకర్ అర్ధాంగి యధా త్వాం శంకర్ ప్రియా !

తథా మమ్ కురు కల్యాణి కంటకం సుదుర్లభం !!



3.వివాహ సమస్యల నుండి బయట పడేందుకు :

హే గౌరీ శంకర్ అర్ధంగిని యథా త్వం శంకర ప్రియ !

తథా కమ్ కురు కల్యాణి కంత్ కాంత్ సుదుర్లభమ్ !!




4.ఆలస్యమైన వివాహాలకు కాత్యాయనీ సూర్య మంత్రం :

ఓం దేవేంద్రని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భీమిని !

వివాహం భగ్యం ఆరోగ్యశ్రీ షిఘ్రా లాభమ్ చ దేహి మే !!



5.కోరుకున్న భాగస్వామి కోసం సూచించదగిన కాత్యాయనీ మంత్రం :

ఓం దేవేంద్రని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భీమిని !

వివాహం భగ్యం ఆరోగ్యశ్రీ షిఘ్రా లాభమ్ చ దేహి మే !!



6.మంచి వివాహ జీవితానికి ఉద్దేశించిన కాత్యాయనీ మంత్రం :


ఓం షంగ్ శంకరాయ సకల్ జన్మర్జీత్ పాప్ విధ్వామ్స్ నాయ్ !

పురుషార్ద్ చౌతుస్టాయ్ లాభయ్ చ పాటిమ్ మే దేహి కురు కురు స్వాహ !!

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺








08.10.24 ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణ

💐💐💐💐💐💐💐💐💐💐💐💐



ఈ రోజు శ్రీ మహా లక్ష్మిదేవి అలంకరణ (శనేశ్వరుడు , కుజుడు , రాహువు , కేతువు , పూర్ణ చంద్రుడు)


చిలుక పచ్చ చీర (బుధుడు)


బెల్లం నైవేద్యం (శనేశ్వరుడు + బృహస్పతి)


పాయసం (శుక్రుడు , చంద్రుడు)


పటించవలసిన మంత్రము

‘ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదా సర్వజనమ్యే వశమానయస్వాహా’


అనే మంత్రాన్ని 1108 సార్లు పటించాలి


మహాలక్ష్మ్యష్టకం



ఇంద్ర ఉవాచ –

నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |

శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౧ ||


నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరి |

సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౨ ||


సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి |

సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౩ ||


సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని |

మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౪ ||


ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి |

యోగజే యోగసంభూతే మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౫ ||


స్థూలసూక్ష్మమహారౌద్రే మహాశక్తి మహోదరే |

మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౬ ||


పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి |

పరమేశీ జగన్మాతర్మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౭ ||


శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే |

జగత్స్థితే జగన్మాతర్మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౮ ||


మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్నరః |

సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా || ౯ ||


ఏకకాలం పఠేన్నిత్యం మహాపాపవినాశనం |

ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః || ౧౦ ||


త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం |

మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా || ౧౧ ||


(పదకొండు సార్లు పటించవలెను)

ఈ రోజు అమ్మవారికి మహా లక్ష్మిదేవి అమ్మవారి అలంకరణ చేసి చిలుక పచ్చ రంగు చీరను అలంకరించి బెల్లమును , పాయసమును నైవేద్యముగా సమర్పించి పై మంత్రాలను జపించవలెను.

ఈ అమ్మవారిని ఈ రోజు పూజించే సమయములో ఇంటిలో కిన్చెత్తు కూడా బూజు కానీ చెత్త బుట్టలలో చెత్త కాని ఉండకూడదు. అలాగే నీటిని ఉంచుకునే పాత్రలలో నీరు సమృద్ధిగా (నిండుగా) ఉండేలా చూసుకోవాలి. అలాగే ఎట్టిపరిస్థితుల్లోను ఈ రోజు వివాదాలలో పాల్గొనడం కాని అనవసర ఆవేశానికి గురి కావడం కాని చెయ్యకూడదు. ఈ విధంగా ఇంట్లో పరిసరాలు అపరిశుబ్రంగా ఉండటంవలన శనేశ్వరుడి యొక్క ప్రభావం పెరిగి చేస్తున్న పనులలో ఆలస్యం అవ్వడము లేదా వృత్తి విషయములో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనే అవకాశం ఉంది. అలాగే ప్రత్యేకించి ఈ పూజ చేసే సమయములో ఇంట్లో నీరు సమృద్ధిగా లేకపోవడం వలన చంద్రుడి యొక్క దుష్పరిణామాలు ఎదురవడం వలన అనవసర ప్రయాణాలు ఏర్పడి ధన వ్యయం జరగడం , లేదా మోసపోవడం జరిగే అవకాశం ఉంటుంది.

ఈ రోజు అనవసర వివాదాలలో పాల్గొనడం వల్ల కుజుడి యొక్క ప్రభావం పెరిగి రుణ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

విద్యా పరమైన విషయాలలో ఆటంకం ఎదుర్కునేవారు ఈ రోజు మేనమామల యొక్క ఆశీర్వాదము తీసుకోవడము లేదా విఘ్నేశ్వరుడి గుడిలో ఈ రోజు గరిక తో అర్చన చేయించుకోవడం ద్వార శుభం జరుగుతుంది.

ఉద్యోగ సమస్యలతో బాధ పడేవారు ఈ రోజు నువ్వులు బెల్లము కలిపి ఉండలు తాయారు చేసి గోమాతకు తినిపించడం ద్వారా ఆయా విషయాలలో మేలు జరుగుతుంది.

ఆర్ధిక పరమైన సమస్యలతో బాధ పడేవారు ఈ రోజు సన్యాసులకు లేదా వృద్దాశ్రమంలో ఉన్నటువంటివారికి ఉల్లిపాయ ముక్కలు కలిపినటువంటి దద్దోజనాన్ని సమర్పించడం ద్వారా ధన వ్యయం తగ్గుతుంది.

అలాగే అవకాశం ఉన్నవారు ప్రత్యేకించి వివాహం అయ్యిన స్త్రీలు ఈ రోజు పుట్టింటి వారి ఊరు కనుక దగ్గేరలో ఉంటె అక్కడకు వెళ్లి ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకు మసాలా తో కుడినటువంటి ఆహారమును కాని లేదా ఉల్లిపాయ ముక్కలు కలిపినటు వంటి పెరుగన్నము కాని వారి స్వహస్తాలతో తాయారు చేసి వడ్డించి తినిపించడం ద్వారా జాతకములోని శని , చంద్ర దోషము పోయి అనవసర ధన వ్యయము తగ్గి ధన యోగం (అవసరమైన మేర) కలుగుతుంది అని మన పురాతనమైన జ్యోతిష్య నాడి , తాంత్రిక సిద్ధాంతములు చెబుతున్నాయి.

గమనిక: ఈ రోజు పూజలో పాల్గొన్నవారు ఎట్టి పరిస్థితులలో కూడా స్త్రీల యొక్క మనసు నొప్పించారాడు అలాగే స్త్రీలు ఎంత క్లిష్టమైన పరిస్థితి ఏర్పడినా కూడా గట్టిగ అరవడం కాని ఆవేశంగా మాట్లాడటం కాని ఖచ్చితంగా చెయ్యకూడదు.

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷








08.10.24 బతుకమ్మ పండుగలో వేపకాయల బతుకమ్మ

🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑


రేపు ఏడో రోజు సందర్భంగా... వేపకాయల బతుకమ్మగా పిలుస్తారు. బియ్యం పిండితో వేపకాయల ఆకృతిలో పిండివంటలు చేసి... అమ్మవారికి నివేదిస్తారు. వేపకాయల బతుకమ్మ..తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఒక్కో రోజుది ఒక్కో ప్రత్యేకత. రోజుకో విధంగా బతుకమ్మను పేరుస్తూ... ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఎంతో ఉత్సాహంగా కొనసాగే బతుకమ్మ ఆటలో ఏడో రోజున అమ్మవారిని 'వేపకాయల బతుకమ్మ'గా అభివర్ణిస్తుంటారు. ఈ రోజున సకినాల పిండిని వేపకాయల్లా తయారు చేసి నూనెలో వేయించి అమ్మకు నివేదన చేస్తారు. తంగేడు , గునుగు , బంతి , చామంతి , పట్టుకుచ్చు వంటి తీరొక్క పూలతో ఏడంతరాల బతుకమ్మను పేరుస్తారు.

రోజుకో తీరుగా..

తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ... రెండో రోజు అటుకుల బతుకమ్మ.. మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ.. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదోనాడు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అర్రెం అనగా బతుకమ్మను ఆడరు. ఏడో రోజు వేపకాయల బతుకమ్మను పేరుస్తారు. ఇలా ఒక్కో రోజు ఒక్కో పేరుతో కొలుస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేకమైన ప్రసాదాలను నివేదిస్తారు.

గంగమ్మ చెంతకు బతుకమ్మ

సాయంత్రం వేళ విశాలమైన ప్రదేశంలో తొలుత వెంపలి చెట్టును నాటి... దానిపై పసుపు కుంకుమను చల్లుతారు. అనంతరం బతుకమ్మలను ఆ చెట్టు చుట్టూ ఉంచుతారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఒకరి చేయి ఒకరు పట్టుకొని కోలాటాలు చేస్తారు. మరికొందరు చేతిలో రెండు కర్రలను పట్టుకొని కోలాటం చేస్తారు.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో...., ఒక్కేసి పువ్వేసి చందమామ... ఒక్కజాములాయే చందమామ..., పసుపుల పుట్టింది గౌరమ్మా... పసుపుల పెరిగింది గౌరమ్మా... అంటూ చప్పట్లతో కష్టసుఖాలను తెలియజేసే జానపద పాటలు పాడుతారు. బంధాలు , బంధుత్వాలపైనా పాటలు పాడుతారు. చివరగా ఆ బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చుతారు.

బతుకు తల్లికి పూజ !

అచ్చమైన పల్లెసంస్కృతికి అద్దం పట్టే మట్టిమనుషుల పండుగ బతుకమ్మ. ఆడబిడ్డలతో తెలంగాణ లోగిళ్లు కళకళలాడుతున్నాయి. పల్లెలు , పట్టణాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఓ పక్కన పెద్దలు బతుకమ్మ ఆడుకుంటుంటే.. మరోపక్కన పిల్లలు కేరింతలు కొడుతుంటారు. తొమ్మిది రోజుల పాటు పిల్లాపెద్దా తేడాలేకుండా ఆనందోత్సాహాల నడుమ బతుకమ్మ సంబురాలను జరుపుకుంటున్నారు. ప్రాణధారణకు ఆధారమైన నేలలో , నీటిలో ప్రభవించే బతుకు పువ్వే బతుకమ్మ. మానవ జీవనంలోని సుఖదుఃఖాలకు , స్నేహానురాగాలకు , ఆప్యాయతాదరణలకు ప్రతీకలైన రంగురంగుల పూలతోనే బతుకు తల్లికి పూజ !

🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎