కార్తీక మాసం 23వ రోజు చేయవలసినవి / Things to do on 23nd Day of Kartika Month



https://youtube.com/shorts/s0ywWDd4xTE


🌹 కార్తీక మాసం 23వ రోజు చేయవలసినవి
Things to do on 23nd Day of Kartika Month 🌹

ప్రసాద్ భరద్వాజ



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


కార్తీక పురాణం 23వ అధ్యాయము / KARTHIKA PURANAM 23rd CHAPTER PARAYAN



https://www.youtube.com/watch?v=_ACANjj3vDA


🌹 కార్తీక పురాణం 23వ అధ్యాయము - శ్రీ రంగక్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట
KARTHIKA PURANAM 23rd CHAPTER PARAYAN 🌹


ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹


కార్తీక పురాణం - 23 : 23వ అధ్యాయము - శ్రీ రంగక్షేత్రమున పురంజయుడు ముక్తినొందుట / Kartika Puranam - 23 : Chapter 23 - Puranjaya's liberation in Sri Rangakshetra


🌹. కార్తీక పురాణం - 23 🌹
🌻. 23వ అధ్యాయము - శ్రీ రంగక్షేత్రమున పురంజయుడు ముక్తినొందుట 🌻
📚. ప్రసాద్ భరద్వాజ


🌹. Kartika Puranam - 23 🌹
🌻. Chapter 23 - Puranjaya's liberation in Sri Rangakshetra 🌻
📚. Prasad Bharadwaja



అగస్త్యుడు మరల అత్రిమహర్షిని గాంచి "ఓ మునిపుంగవా! విజయమందిన పురంజయుడు యేమిచేసెనో వివరింపు"మని యడుగగా అత్రిమహాముని యిట్లు చెప్పిరి - కు౦భసంభవా! పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము, శత్రుశేషము వుండకూడదని తెలిసి, తన శత్రురాజుల నందరినీ ఓడించి నిరాటకంముగా తన రాజ్యమును యేలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావమువలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షాతత్పరుడు, నిత్యాన్నదాత, భక్తప్రియవాది, తేజోవంతుడు, వేదవేదా౦గవేత్తయై యుండను. మరియు అనేక శత్రువులను జయించి దశదిశలా తన యఖండ కీర్తిని ప్రసరింపచేసెను.

శత్రువులకు సింహస్వప్నమై, విష్ణు సేవాధురంధరుడై, కార్తీకవ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కుడా జయించినవాడై యుండెను. ఇన్ని యేల? అతడిప్పుడు విష్ణుభక్తాగ్రేసరుడు, సదాచార సత్పురుషులలో వుత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తిలేదు. ఏ దేశమున, యే కాలమున, యే క్షేత్రమున యే విధముగా శ్రీ హరిని పూజించిన కృతార్దుడనగుదునా? యని విచారించుచుండగా ఒకానొకనాడు అశరీరవాణి "పురంజయా! కావేరీతీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు. నీవచటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవీ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు" అని పలికెను.

అంతట పురంజయుడు ఆ యశిరీరవాణి వాక్యములు విని, రాజ్యభారమును మంత్రులకు అప్పగించి, సపరివారముగా బయలుదేరి మార్గమధ్యముననున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్యనదులలో స్నానము చేయుచు, శ్రీరంగమును జేరుకొనెను. అక్కడ కావేరీనది రెండుపాయలై ప్రవహించుచుండగా మధ్యనున్నశ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవళించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశమొంది, చేతులు జోడించి,

"దామోదరా! గోవిందా! గోపాలా! హరే! కృష్ణా! వాసుదేవా! అనంతా! అచ్యుతా! ముకుందా! పురాణపురుషా! హృషికేశా! ద్రౌపదీమాన సంరక్షకా! దీనజన భక్తపోషా! ప్రహ్లాదవరదా! గరుడధ్వజా ! కరివరదా! పాహిమాం! పాహమాం! రక్షమాం రక్షమాం! దాసోహం పరమాత్మ దాసోహం"

యని విష్ణు సోత్త్రమును పఠించి, కార్తీక మాసమంతయు శ్రీ రంగమునందే గడిపి తదుపరి సపరి వారముగా అయోధ్యకు బయలుదేరును. పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల, మహిమవలన అతని రాజ్యమందలి జనులందరూ సిరిసంపదలతో, పాడిపంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యములతో నుండిరి.

అయోధ్యానగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహాగోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్యా నగరమందలి వీరులు యుద్దనేర్పరులై, రాజనీతి గలవారై, వైరిగర్భ నిర్బేదకులై, నిరంతరము విజయశశీలురై, అప్రమత్తులై యుండిరి. ఆ నగర మందలి అంగనామణులు హంసగజగామినులూ, పద్మ పత్రాయత లోచనులూనై విపుల శోణీత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మద్యత్వము; సింహకుచపీనత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతికలిగి యుండిరి.

ఆ నగర మందలి వెలయాండ్రు నృత్యగీత సంగీతాది కళావిశారదలై, ప్రౌఢలై, వయోగుణ రూప లావణ్య సంపన్నలై, సదా మోహన హాసాలంకృత ముఖిశోభితలై యుండిరి. ఆ పట్టణకులాంగనలు పతిశుశ్రూషా పారాయణలై సద్గుణాలంకార భూషితలై చిద్విలాస హసోల్లాస పులకాంకిత శరీరలై యుండిరి.

పురంజయుడు శ్రీరంగక్షేత్రమున కార్తీకమాస వ్రతమాచరించి సతీసమేతుడై యింటికి సుఖముగా జేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్యతూర్య ధ్వనులతో యెదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంత:పురమును ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయుణుడై రాజ్యపాలన మొనర్చుచు, కొంతకాలము గడిపి వృద్దాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వాదులుకొని, తన కుమారునికి రాజ్యభారమువప్పిగించి పట్టాభిషిక్తుని చేసి తాను వాన ప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకేగెను. అతడా వానప్రస్థాశ్రమమందు కూడా యేటేటా విధివిధానముగ కార్తీక వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునుకు పోయెను. కావున, ఓ యగస్త్యా! కార్తీకవ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్మ్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి, చదివినపుడు వినువారికి కూడా వైకుంఠప్రాప్తి కలుగును.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీకమహత్మ్య మందలి త్రయోవింశోధ్యాయము - ఇరవైమూడో రోజు పారాయణము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹కార్తీక మాసం 23వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹
ప్రసాద్‌ భరధ్వాజ


నిషిద్ధములు:- ఉసిరి, తులసి
దానములు:- మంగళ ద్రవ్యాలు
పూజించాల్సిన దైవము:- అష్టమాతృకలు
జపించాల్సిన మంత్రము:-
ఓం శ్రీమాత్రే నమః, అష్టమాతృ కాయ స్వాహా

🌹 🌹 🌹 🌹 🌹

కాలభైరవ అష్టమి జయంతి / బుధాష్టమి శుభాకాంక్షలు Greetings on Kala Bhairava Ashtami Jayanti / Bhudhashtami



🌹 కాలభైరవ అష్టమి జయంతి / బుధాష్టమి శుభాకాంక్షలు అందరికి
Kala Bhairava Ashtami Jayanti / Bhudhashtami Greetings to All 🌹


🍀 కాలభైరవ జయంతి విశిష్టత 🍀
ప్రసాద్ భరద్వాజ

🍀 Special features of Kalabhairava Jayanti 🍀
Prasad Bharadwaja


కాలభైరవుని జయంతిని కార్తీక మాసంలో కృష్ణ పక్షం ఎనిమిదవ రోజున జరుపుకుంటారు. భైరవ భక్తులకు ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున శివుడు కాల భైరవుడి రూపంలో అవతరించి అధర్మం, అహంకారాన్ని నాశనం చేశాడు. దీనిని భైరవ అష్టమి, కాలాష్టమి లేదా కాలభైరవ జయంతి అని కూడా పిలుస్తారు. కాలభైరవ దేవాలయాల్లో పూజలు చేస్తారు.

కాలభైరవుని జయంతిని కార్తీక మాసంలో కృష్ణ పక్షం ఎనిమిదవ రోజున జరుపుకుంటారు. భైరవ భక్తులకు ఈ రోజు చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ రోజున శివుడు కాల భైరవుడి రూపంలో అవతరించి అధర్మం, అహంకారాన్ని నాశనం చేశాడు. దీనిని భైరవ అష్టమి, కాలాష్టమి లేదా కాలభైరవ జయంతి అని కూడా పిలుస్తారు. ఈ రోజున, కాలభైరవ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. భైరవ చాలీసా, రాత్రి మేల్కొలుపు నిర్వహిస్తారు.

కాలభైరవుణ్ణి ఆరాధించడం వల్ల భయం, వ్యాధి, అకాల మరణం, వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి. కాల భైరవుడిని ఆరాధిస్తే ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు జీవితంలో విజయాన్ని పొందుతాడు. కాలభైరవుడుని ఆరాధిస్తే రాహువు, కేతువు, శని గ్రహాల లోపాలను శాంతింపజేస్తుంది. ఈ రోజున భక్తులు ఆవ నూనెతో దీపం వెలిగించి, నల్ల ధాన్యాలు మరియు నల్ల నువ్వులను సమర్పిస్తారు.


కాలభైరవ జయంతి పూజా విధానం:

ఆలయం లేదా ఇంటి పూజ గదిలో కాలభైరవుడి విగ్రహం లేదా చిత్రాన్ని ఏర్పాటు చేయాలి. ఆవ నూనెతో దీపారాధన చేయాలి.

భైరవ చాలీసా లేదా "ఓం భైరవాయ నమః" మంత్రాన్ని 108 సార్లు జపించండి. భైరవుడుకి నల్ల నువ్వులు, మినపప్పు, నూనె, కొబ్బరికాయని సమర్పించండి. రాత్రిపూట మేల్కొని భైరవ మంత్రాలను పఠించవచ్చు.

ఓం భైరవాయ నమః అనే మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో భయం, ప్రతికూలత, అడ్డంకులను తొలగిస్తుంది.


బుధుని అధిష్టాన దైవం "శ్రీ మహా విష్ణువు".


బుధుని అనుగ్రహం కొరకు స్మరించవలసిన మంత్రాలు.

1. ఓం బుధాయ నమః ||

2. ఓం విష్ణవే నమః ||


బుధుని అనుగ్రహం కొరకు బుధవారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను సందర్శించండి. శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం పఠించండి.

బుధ గ్రహ బలం కొరకు, బుధవారం ఆకు పచ్చ రంగు దుస్తులు ధరించండి. బుధవారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే, అన్ని రకాల విశేషమైన ప్రయోజనాలు కలుగుతుంది.

🌹🌹🌹🌹🌹


కార్తిక పురాణం - 22 :- 22 వ అధ్యాయము - పురంజయుడు కార్తిక పౌర్ణమీ వ్రతము చేయుట Kartika Purana - 22 :- Chapter 22 - Puranjaya performs the Kartika Purnima Vratam


🌹. కార్తిక పురాణం - 22 🌹
🌻. 22 వ అధ్యాయము - పురంజయుడు కార్తిక పౌర్ణమీ వ్రతము చేయుట 🌻
ప్రసాద్ భరద్వాజ


🌹. Kartika Purana - 22 🌹
🌻. Chapter 22 - Puranjaya performs the Kartika Purnima Vratam 🌻
Prasad Bharadwaja


మరల అత్రి మహాముని అగస్త్యునకిట్లు చెప్పదొడగెను.

పురంజయుడు వశిష్టుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియై దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి, శ్రీహరిని గానముచేసి, సాష్టాంగ నమస్కారము చేసి, సూర్యోదయముకాగానే నదికిపోయి, స్నానమాచరించి తన గృహమున కరిగెను. అట్టి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ద బ్రాహ్మణుడు - మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమిపించి "రాజా! విచారింపకుము నీవు వెంటనే చెల్లాచెదురైయున్న నీ సైన్యమును కూడాదీసుకొని, యుద్ద సన్నద్ధుడై శత్రురాజులతో పోరు సల్పుము, నీ రాజ్యము నీకు దక్కును", అని దీవించి అదృశ్యుడయ్యెను.

"ఈతడెవరో మహాను భావునివలె నున్నాదు, అని, ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధసన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోథముతో నున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి. అదియును గాక, శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా!

ఆ యుద్దములో కాంభోజాది భూపాలురు ఓడిపోయి "పురంజయా రక్షింపుము రక్షింపు"మని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులయిన వారికి శత్రుభయము కలుగుతుందా! విషం త్రాగినాను అమృతమే యగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని యివ్వగా 'శ్రీ హరి' అని ప్రార్ధించి త్రాగగా అమృతమైనది గదా! శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు వున్నంత వరకును ధృవుడు చిరంజీవియే గదా!

హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై కరచును. కార్తీకమాసమంతయు నదీ స్నానమొనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారధన చేసినచో సర్వవిపత్తులును పటాపంచలగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి యే జాతి వారికైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును. వేదాధ్యయన మొనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠానతత్పరుడైన వైష్ణవోత్తముని హృదయపద్మమున భగవంతుడుండును. సంసారసాగర ముత్తరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహాఋషులు - మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తినొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడుచుండును. ఎవరికైనను శక్తి లేని యెడల వారు తమ ద్రవ్యమును వెచ్చించియైనను మరి యొకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు, భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదాసంపదల నొసంగి కాపాడు చుండెను.

శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, వెయ్యి సూర్యభగవానుల తేజస్సు గలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, పద్నాలుగు లోకములను తన కుక్షియందిడుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీమహావిష్ణువునకు అతిప్రియమైన కార్తీక మాసవ్రతమును భక్తి శ్రద్దలతో ఎవరు చేయుదురో వారి యింట శ్రీమహావిష్ణువు లక్ష్మి సమేతుడై వెలయగలడు. ఆ యిల్లు సిరిసంపదలతో కలకలలాడును. కార్తీకమాసములో శుచియై పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీకమహాత్మ్య మందలి ద్వావి౦శోధ్యాయము - ఇరవై రెండవో రోజు పారాయణము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹






🌹కార్తీక మాసం 22వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹
ప్రసాద్‌ భరధ్వాజ


నిషిద్ధములు:- పంటికి పనిచెప్పే పదార్ధాలు, ఉసిరి

దానములు:- బంగారం, గోధుమలు, పట్టుబట్టలు

పూజించాల్సిన దైవము:- సూర్యుడు

జపించాల్సిన మంత్రము:-

ఓం సూం సౌరయే స్వాహా, ఓం భాం భాస్కరాయ స్వాహా

🌹 🌹 🌹 🌹 🌹

కార్తీక పురాణం 22వ అధ్యాయము - పురంజయుడు కార్తిక పౌర్ణమీ వ్రతము చేయుట KARTHIKA PURANAM 22nd CHAPTER PARAYAN



https://youtu.be/NCqmByfp8Rw


🌹  కార్తీక పురాణం 22వ అధ్యాయము - పురంజయుడు కార్తిక పౌర్ణమీ వ్రతము చేయుట
 KARTHIKA PURANAM 22nd CHAPTER PARAYAN 🌹

ప్రసాద్ భరద్వాజ



Like, Subscribe and Share
https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


కార్తీక మాసం 22వ రోజు చేయవలసినవి Things to do on 22nd Day of Kartika Month



https://youtube.com/shorts/9rymxdertvg


🌹 కార్తీక మాసం 22వ రోజు చేయవలసినవి Things to do on 22nd Day of Kartika Month 🌹
ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share
https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹

శ్రీ కాలభైరవ అష్టకం - శ్లోక తాత్పర్యములు Sri Kalabhairava Ashtakam - Meanings of the verses



https://youtu.be/_VLqYNh-7bY


🌹 శ్రీ కాలభైరవ అష్టకం - శ్లోక తాత్పర్యములు 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Sri Kalabhairava Ashtakam - Meanings of the verses 🌹
Prasad Bharadwaja


మనోహరమైనది, జ్ఞ్యానమును, ముక్తిని కలిగించునది, అనేక పుణ్యములను పెంపొందించునది, శోకము, మోహము, దీనత్వము, కోపము, పాపములను నశింప చేయునది అగు కాలభైరవ అష్టకం ఈ వీడియోలో వీక్షించండి. కాలభైరవ పాద సన్నిధిని చేరుటకు దీనిని నిత్యము పఠించండి

కాలభైరవం భజే!! కాలభైరవం భజే!!


🍀 కాలభైరవాష్టకం పఠించడం వల్ల లాభాలు 🍀

ప్రత్యేక రక్షణ - ఈ స్తోత్రం ప్రతికూల శక్తుల నుంచి మరియు చెడు ప్రభావాలనుంచి రక్షణ కవచం లాగా పనిచేస్తుంది.

భావనాత్మక స్వస్థత - భయం, ఆందోళన, మరియు ఒత్తిడిని తగ్గించి మనసుకు ప్రశాంతత మరియు భద్రతను కలిగిస్తుంది.

ఆధ్యాత్మిక ప్రగతి - నిత్య పఠనం ద్వారా ఆధ్యాత్మిక ప్రయాణం మెరుగవుతుంది మరియు దైవంతో ఉన్న అనుబంధాన్ని మరింతగా గాఢం చేస్తుంది.

ఆత్మవిశ్వాసం - కాలభైరవాష్టకం పఠించడం ద్వారా ధైర్యం మరియు బలంతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం సులభమవుతుంది.

🌹🌹🌹🌹🌹

 

కాలభైరవాష్టకం దేవరాజ సేవ్యమాన కాలభైరవం భజే!! Kalabhairavaashtakam Devaraja, may the eternal Kalabhairavam be praised!!



https://youtube.com/shorts/VsyBEf7X-NU



🌹 కాలభైరవాష్టకం దేవరాజ సేవ్యమాన కాలభైరవం భజే!! 🌹
ప్రసాద్ భరద్వాజa

🌹 Kalabhairavaashtakam Devaraja, may the eternal Kalabhairavam be praised!! 🌹
Prasad Bharadwaja



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹



శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం Sri Anjaneyam Prasannanjaneam Prabha Divyakayam Prakirti Pradhya



https://youtube.com/shorts/CNFsk-pcjoU



🌹 శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం 🌹
ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


కార్తీక మాసం 21వ రోజు చేయవలసినవి Things to do on 21st day of Kartika month



https://youtube.com/shorts/JdGRTo-hezM


🌹 కార్తీక మాసం 21వ రోజు చేయవలసినవి Things to do on 21st day of Kartika month 🌹

ప్రసాద్ భరద్వాజ



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹


కార్తీక పురాణం 21వ అధ్యాయ పారాయణము - పురంజయుడు కార్తీక ప్రభావం - KARTHIKA PURANAM 21st CHAPTER PARAYAN



https://youtu.be/05Vt_YdfsaM



🌹 కార్తీక పురాణం 21వ అధ్యాయ పారాయణము - పురంజయుడు కార్తీక ప్రభావం -
KARTHIKA PURANAM 21st CHAPTER PARAYAN 🌹

ప్రసాద్ భరద్వాజ



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹



కార్తిక పురాణం - 21 :- 21వ అధ్యాయము - పురంజయుడు కార్తీక ప్రభావం Kartika Purana - 21 :- Chapter 21 - The influence of Puranjaya on Kartika


🌹. కార్తిక పురాణం - 21 🌹
🌻. 21వ అధ్యాయము - పురంజయుడు కార్తీక ప్రభావం 🌻
ప్రసాద్ భరద్వాజ

🌹. Kartika Purana - 21 🌹
🌻. Chapter 21 - The influence of Puranjaya on Kartika 🌻
Prasad Bharadwaja



అలా యుద్ధానికి సిద్ధమైన పురంజయుడికి, కాంభోజాది భూపాలురకు భీకరయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రథికులు రథికుడితో, అశ్వసైనికుడు అశ్వసైనికుడితో, గజ సైనికుడు గజ సైనికుడితో, పదాతులు పదాతి దళాలతో, మల్లులు మల్లయుద్ధనిపుణులతో, ఖడ్గ, గద, బాణ, పరశు మొదలు ఆయుధాలు ధరించినవారు అవే ఆయుధాలు ధరించినవారితో ధర్మబద్ధమైన యుద్ధం చేస్తున్నారు. ఒకరినొకరు ఢీకొంటూ.. హూంకరించుకుంటూ.. దిక్కులు దద్దరిల్లేలా సింహనాదాలు చేశారు. శూరత్వం, వీరత్వం ప్రదర్శించేందుకు భేరీ దుందుబులను వాయిస్తూ, శంఖాలను పూరిస్తూ, విజయకాంక్షతో పోరాడారు.

ఆ రణ భూమి అంతా ఎక్కడ చూసినా… విరిగిన రథాల గుట్టలు, తెగిపడిన మొండాలు, ఏనుగుల తొండాలు, సైనికుల తలలు, చేతులతో నిండిపోయింది. యుద్ధభూమిలో హాహాకారాలు, ఆక్రందనలు మిన్నంటాయి. పర్వాతాల్లా పడి ఉన్న ఏనుగులు, గుర్రాల కళేబరాల దృశ్యాలతో అతి గంభీరంగా, భయంకరంగా రణస్థలి కనిపించింది. యుద్ధవీరుల్ని వీరస్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పకవిమానంపై వచ్చిన దేవదూతలు అక్కడకు చేరుకున్నారు. సూర్యాస్తమయం వరకు యుద్ధం కొనసాగింది. కాంబోజాది భూపాలురకు చెందిన సైన్యం భారీగా నష్టపోయింది. అయినా.. మూడు అక్షౌహిణులున్న పురంజయుడి సైన్యాన్ని అతి నేర్పుతో ఓడించారు. పెద్ద సైన్యమున్నా… పురంజయుడికి అపజయం కలిగింది. దాంతో పురంజయుడు రహస్య మార్గంలో శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాడు. బలోపేలైన శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో, సిగ్గుతో దు:ఖించుచుండెను.

ఆ సమయంలో వశిష్ట మహర్షి వచ్చి, పురంజయుడిని ఊరడించారు. ”రాజా! ఇంతకు ముందు ఒకసారి నీవద్దకు వచ్చాను. నువ్వు ధర్మాన్ని తప్పావు. నీ దురాచారాలకు అంతులేదు. నిన్ను సన్మార్గంలో వెళ్లమని హెచ్చరించాను. అప్పుడు నా మాటల్ని వినలేదు. నీవు భగవంతుడిని సేవింపక అధర్మప్రవర్తుడవైనందునే… ఈ యుద్ధంలో ఓడిపోయి, రాజ్యాన్ని శత్రువులకు అప్పగించావు. ఇప్పటికైనా నా మాటలు విను. జయాపజయాలు దైవాదీనాలు. నీవు చింతతో కృంగిపోవడం మాని, శత్రురాజులను యుద్ధంలో జయించి, నీ రాజ్యం నీవు తిరిగి పొందాలని సంకల్పించు. ఇది కార్తీకమాసం. రేపు కృత్తికా నక్షత్ర యుక్తంగా పౌర్ణమి ఉంది. కాబట్టి స్నాన, జపాది నిత్యకర్మలు ఆచరించి, గుడికి వెళ్లి, దేవుడి సన్నిధిలో దీపారాధన చేయి. భగవన్నామ స్మరణంతో నాట్యం చేయి. ఇంట్లో అర్చించినట్లయితే నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు… శ్రీమన్నారాయణుడిని సేవించడం వల్ల విష్ణుమూర్తి ప్రసన్నుడై… నీ శత్రువులను దునిమాడేందుకు చక్రాయుధాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి… రేపు అలా చేసినట్లయితే… పోయిన నీ రాజ్యం తిరిగి పొందగలుగుతావు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసాలు చేయడం వల్లే ఈ అపజయం కలిగింది. శ్రీహరిని మదిలో తలచి, నేను చెప్పినట్లు చేయి…” అని ఉపదేశించాడు.

ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యే, ఏకవింశోద్యాయ సమాప్తం. ఇరవయొక్కటో రోజు పారాయణం సమాప్తం.

🌹🌹🌹🌹🌹




🌹కార్తీక మాసం 21వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం

దానములు:- యథాశక్తి సమస్త దానాలూ

పూజించాల్సిన దైవము:- కుమారస్వామి

జపించాల్సిన మంత్రము:- ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా

🌹 🌹 🌹 🌹 🌹

కార్తీక మాసం 20వ రోజు చేయవలసినవి Things to do on 20th day of Kartika month (a YT Short)



https://youtube.com/shorts/DuZ0NcIO6Hg


🌹 కార్తీక మాసం 20వ రోజు చేయవలసినవి Things to do on 20th day of Kartika month 🌹

ప్రసాద్ భరద్వాజ


(a YT Short)


Like, Subscribe and Share


https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


కార్తీక పురాణం 20వ అధ్యాయ పారాయణము PURANAM 20Th CHAPTER PARAYAN (a YT Short)



https://youtu.be/eU4twlTOskQ


🌹 కార్తీక పురాణం 20వ అధ్యాయ పారాయణము 
KARTHIKA PURANAM 20Th CHAPTER PARAYAN 🌹

ప్రసాద్ భరద్వాజ

(a YT Short)


Like, Subscribe and Share


https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹

కార్తీక పురాణం - 20 :- 20వ అధ్యాయము - పురంజయుడు దురాచారుడగుట Kartika Purana - 20:- Chapter 20 - Puranjaya becomes a bad person


🌹. కార్తీక పురాణం - 20 🌹
🌻. 20వ అధ్యాయము - పురంజయుడు దురాచారుడగుట 🌻
📚. ప్రసాద్ భరద్వాజ


🌹. Kartika Purana - 20 🌹
🌻. Chapter 20 - Puranjaya becomes a bad person 🌻
📚. Prasad Bharadwaja

జనక మహారాజు, చతుర్మాస్య వ్రతప్రభావము వినిన పిమ్మట వశిష్టునితో "గురువర్యా! కార్తీకమాస మహాత్మ్యమును యింకను వినవలయుననెడి కోరిక కల్గుచున్నది. ఈ వ్రత మహాత్మ్యమునందింకను విశేషములు గలవా! యను సంశయము గూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని వుదాహరణములు వినిపించి నన్ను కృతార్దునిగాజేయు"డనెను. అ మాటలకు వశిష్టుల వారు మందహాసముతో "ఓ రాజా! కార్తీకమాస మహాత్మ్యము గురించి అగస్త్య మహామునికి, అత్రిమునికి జరిగిన ప్రసంగ మొకటి కలదు. దానిని వివరించెదరు ఆలకించు"మని అ కథా విధానమును యిట్లు వివరించిరి.

పూర్వ మొకప్పుడు అగస్త్య మహర్షి అత్రిమహర్షిని గాంచి, "ఓ అత్రిమహామునీ! నీవు విష్ణువు అంశయందు బుట్టినావు. కార్తీకమాస మహాత్మ్యమును నీకు ఆములాగ్రమున తెలియును, కాన దానిని నాకు వివరింపుము" అని కోరెను. అంత అత్రిమహముని "కుంభసంభవా! నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రితికరముగుటచే నుత్తమమయినది. కార్తీక మాసముతో సమానమగు మాసము. వేదముతో సమానమగు శాస్త్రము. ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటె వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము. ఇందుకొక యితిహాసము వినుము.

త్రేతాయుగమున పురంజయుడను సూర్య వంశపురాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగ రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి యాపదలు రాకుండ పాలించుచుండెను. అట్లుండ కొంత కాలమునకు పురంజయుడు అమిత ధనాశచేతును, రాజ్యాధికార గర్వముచేతను జ్ఞానహీనుడై దుష్టబుద్దిగలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహణ మాన్యములు లాగుకొని, పరమలోభియై, చొరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసికోనుచు ప్రజలను భీతావహులను చేయుచుండెను. ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈవార్త కాంభోజ, కొంకణ, కళింగాది రాజుల చెవులబడినది. వారు తమలో తామాలోచించుకొని కాంభోజరాజును నాయకునిగా చేసుకోని రధ, గజ, తురగ, పదాతి సైన్య బలాన్వితులై రహస్యమార్గము వెంట వచ్చి అయోధ్యానగరమును ముట్టడించి, నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్భ౦ధముచేసి యుద్దమునకు సిద్దపడిరి.

అయోధ్యా నగరమును ముట్టడి౦చిన సంగతిని చారులవలన తెలిసికోనిన పురంజయుడు తాను కూడా సర్వసన్నద్దుడై యుండెను. అయినను యెదుటి పక్షము వారధిక బలాన్వితులుగా నుండుటయి తాను బలహినుడుగా నుండుటయు విచారించి యే మాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి, చతురంగబల సమేతమైన సైన్యముతో యుద్దసన్నద్దుడై - నవారిని యెదుర్కొన భేరి మ్రోగించి, సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హు౦కరించి శత్రుసైన్యములుపై బడెను.

ఇట్లు స్కాంద పురాణాతర్గత వశిష్ట ప్రోక్త కార్తీకమహత్మ్యమందలి వింశాద్యాయము - ఇరవయ్యోరోజు పారాయణము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹కార్తీక మాసం 20వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹
ప్రసాద్‌ భరధ్వాజ


నిషిద్ధములు:- పాలు తప్ప - తక్కినవి

దానములు:- గో, భూ, సువర్ణ దానాలు

పూజించాల్సిన దైవము:- నాగేంద్రుడు

జపించాల్సిన మంత్రము:- ఓం సర్పాయ మహాసర్పాయ దివ్య సర్వాయ పాతుమాం.

🌹 🌹 🌹 🌹 🌹


కార్తీక మాసం 19వ రోజు చేయవలసినవి Things to do on 19th day of Kartika month (a YT Short)



https://youtube.com/shorts/aQx-3azHErA


🌹 కార్తీక మాసం 19వ రోజు చేయవలసినవి
Things to do on 19th day of Kartika month 🌹

ప్రసాద్ భరద్వాజ



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


కార్తీక పురాణం - 19 :- 19వ అధ్యాయము - చతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ Kartika Purana - 19 :- Chapter 19 - Demonstration of the effectiveness of Chaturmasya Vrata


🌹. కార్తీక పురాణం - 19 🌹
🌻. 19వ అధ్యాయము - చతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ 🌻
ప్రసాద్ భరద్వాజ

🌹. Kartika Purana - 19 🌹
🌻. Chapter 19 - Demonstration of the effectiveness of Chaturmasya Vrata 🌻
Prasad Bharadwaja


ఈ విధముగా నైమిశారణ్యమందున్న మహా మునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్దుడను ఒక మహాయోగి "ఓ దీనబాంధవా! వేద వేద్యుడవని, వేద వ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా గల వాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడు వాడవని, నిత్యుడవని, నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవా! నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధార భూతుడవగు ఓ నందనందనా! మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యమువలన మేము మాఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి.

ఓ దయామయా! మేమీ సంసార బంధము నుండి బైట పడలేకుంటిమి, మమ్ముద్దరింపుము. మానవుడెన్ని పురాణములు చదివినా, యెన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గో చరుడవగుడువు. ఓ గజేంద్రరక్షకా! ఉపేంద్రా! శ్రీధరా! హృషీకేశా! నన్ను కాపాడుము" అని మైమరచి స్తోత్రము చేయగా, శ్రీ హరి చిరునవ్వు నవ్వి "జ్ఞానసిద్దా! నీ సోత్రవచనమునకు నేనెంతయు సంతసించితిని. నీ కిష్ట మొచ్చిన వరమును కోరుకొనుము" అని పలికెను.

అంత జ్ఞానసిద్దుడు "ప్రద్యుమ్నా! నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన యీగవలె కొట్టుకోనుచున్నాను. కనుక, నీ పాద పద్మముల పైనా ధ్యానముండుటనటుల అనుగ్రహింపుము. మరేదియు నాకక్కరలేదు" అని వేడుకొనెను.

అంత శ్రీమన్నారాయణుడు "ఓ జ్ఞానసిద్దుడా! నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చితిని. అదియునుగాక, మరొక వరము కూడా కోరుకొనుము యిచ్చెదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్దిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. అ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము.

నేను ఆషాడ శుద్ద దశమిరోజున లక్ష్మిదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసమున శుద్దద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈకాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము.

ఈ వ్రతముచేయు వారలకు సకల పాపములు నశించి, నా సన్నీధికి వత్తురు. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయనివారు నరకకూపమున బడుదురు. ఇతరులచేత కూడా ఆచరింప చేయవలయును. దీని మహాత్మ్యమును తెలిసియుండియు, వ్రతము చేయనివారికి బ్రహ్మహత్యాది పాతకములు గలుగును.

వ్రతము చేసినవారికి జన్మ, జరా, వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాడశుద్ద దశమి మొదలు శాకములును, శ్రవణశుద్ద దశమి మొదలు పప్పుదినుసులను విసర్జించవలయును. నా యందు భక్తి గలవారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును. ఇప్పుడు నీ వోసంగిన స్తోత్రమును త్రిసంధ్యల యందు భక్తిశ్రద్దలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగ వత్తురు." అని శ్రీమన్నారాయణుడు మునులకు బోదించి శ్రీమహాలక్ష్మితో గూడి పాలసముద్రమును కేగి శేషపానుపు మీద పవ్వళించెను.

వశిష్టుడు జనకమహారాజుతో "రాజా! ఈ విధముగా విష్ణుమూర్తి, జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్మ్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధనలోభునకు తెలియచేసెను. నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతులవారును చేయవచ్చును. శ్రీ మన్నారయణుని ఉపదేశము ప్రకారము ముని పుంగవులందరు యీ చాతుర్మాస్య వ్రత మాచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకోనవింశోధ్యాయము - పందోమ్మిదోరోజు పారాయణము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹కార్తీక మాసం 19వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ



నిషిద్ధములు:- నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైధునం, ఉసిరి

దానములు:- నువ్వులు, కుడుములు

పూజించాల్సిన దైవము:- వినాయకుడు, గణపతి

జపించాల్సిన మంత్రము:- ఓం గం గణపతయే స్వాహా

🌹 🌹 🌹 🌹 🌹

కార్తీక మాసం 18వ రోజు చేయవలసినవి Things to do on 18th day of Kartika month



https://youtube.com/shorts/8hWRfVdTqhY


🌹 కార్తీక మాసం 18వ రోజు చేయవలసినవి Things to do on 18th day of Kartika month. 🌹

ప్రసాద్ భరద్వాజ



Like, Subscribe and Share


https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹

కార్తిక పురాణం - 18 :- 18వ అధ్యాయము - సత్కర్మానుష్టాన ఫల ప్రభావము - చాతుర్మాస్య వ్రతము విశిష్టత Kartika Purana - 18 :- Chapter 18 - The effect of good deeds


🌹. కార్తిక పురాణం - 18 🌹
🌻. 18వ అధ్యాయము - సత్కర్మానుష్టాన ఫల ప్రభావము - చాతుర్మాస్య వ్రతము విశిష్టత 🌻
ప్రసాద్ భరద్వాజ


🌹. Kartika Purana - 18 🌹
🌻. Chapter 18 - The effect of good deeds - The special nature of the Chaturmasya fast 🌻
Prasad Bharadwaja



"ఓ మునిచంద్రా! మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి - గురువు - అన్న - దైవము సమస్తము మీరే, నా పూర్వ పుణ్య ఫలితమువలనే కదా మీబోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహా పాపినయి మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టునైయుండగా, తమ కృపవలననే నాకు మోక్షము కలిగినది కదా! మీ దర్శన భాగ్యము లేని యెడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున వుండవలసినదే కదా! అట్టి! నేనెక్కడ! మీ దర్శన భాగ్యమెక్కడ! నాకు సద్గతి యెక్కడ? పూణ్యఫలప్రదాయియగు యీ కార్తీకమాసమెక్కడ! పాపాత్ముడనగు నేనెక్కడ? ఈ విష్ణ్యాలయమందు ప్రవేశించుటెక్కడ? యివి యన్నియును దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన, నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలయునో, దాని ఫలమెట్టిదో విశదీకరింపు"డని ప్రార్ధించెను.

"ఓ ధనలోభా! నీ వడిగిన ప్రశ్నలన్నియు మంచివే. అవి అందరికి వుపయోగార్ధమైనట్టివి కాన, వివరించెదను. శ్రద్దగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని, సకల శస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మ నాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మొనరించిన జ్ఞానము కలుగును. మానవుడే, జాతివాడో, యెటువంటి కర్మలు ఆచరించావలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక, సత్కర్మల నచారించినను వ్యర్ధమగును. అటులనే కార్తీకమాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖమాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగాను అనగా నీ మూడు మాసముల యందయిననూ తప్పక నదిలో ప్రాతః కాల స్నానము చేయవలెను. అటుల స్నానము లాచరించి దేవర్చన చేసిన యెడల తప్పక వైకుంట ప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందు, స్నానము చేయవచ్చును. ప్రాతఃకాలమున స్నానము చేసిన మనుజుడు సంద్యావందనం సూర్యనమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించరించిన వారికీ చతుర్విధ పురుషార్ధములు సిద్దించును. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగ గోదావరి నదులకు సమాన తీర్ధములు, బ్రాహ్మణులకు సమానమైన జాతీయు, భార్యతో సరితూగు సుఖమునూ, ధర్మముతో సమానమైన మిత్రుడనూ, శ్రీ హరితో సమానమైన దేవుడునూ లేడని తెలుసుకోనుడు. కార్తీక మాసమందు విధ్యుక్తధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు". అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడిటుల ప్రశ్నించెను.

"ఓ మునిశ్రేష్టా! చాతుర్మాస్యవ్రతమని చెప్పితిరే! ఏ కారణం చేత దానిని నాచరించవలెను? ఇదివరకెవ్వరయిన నీ వ్రతమును ఆచరించియున్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి? విధానమెట్టిది? సవిస్తర౦గా విశదికరింపు"డని కోరెను. అందులకు ఆంగీరసుడిటుల చెప్పెను.


🌹🌹. కార్తిక పురాణం - 18

"ఓయీ! వినుము. చతుర్మాస్యవ్రతమనగా శ్రీమహావిష్ణువు మహాలక్షితో ఆషాడ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీకశుద్ధ ఏకాదశినాడు నిద్రనుండి లేచును. ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాడ శుద్ధ ఏకాదశి 'శయన ఏకాదశి' అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' అనియు, ఈ వ్రతమునకు, చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ నాలుగు మాసములలో శ్రీ హరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగును. ఈ సంగతి శ్రీమహావిష్ణువు వలన తెలిసికొంటిని కాన, ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను".

తొల్లి కృతయుగంబున వైకుంఠ మందు గరుడ గంధర్వాది దేవతలచేత, వేదములచేత సేవింపబడుచున్న శ్రీ మన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి యుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రు౦డును, చతుర్బాహు౦డును, కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీ మన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడియుండెను. అంత శ్రీ హరి నారదుని గాంచి ఏమియు తెలియనివానివలె మందహాసముతో నిట్లనెను. "నారదా! నీవు క్షేమమే గదా! త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్టానములు యెట్టి విఘ్నములు లేక సాగుచున్నావా? మానవులందరు ధించవారికి విధించబడిన ధర్మముల నాచరించుచున్నారా? ప్రపంచమున నే అరిష్టములు లేక యున్నవి కదా?" అని కుశలప్రశ్నలడిగెను. అంత నారదుడు శ్రీహరికీ ఆదిలక్ష్మికీ నమస్కరించి "ఓ దేవా! ఈ జగంబున నీ వెరుగని విషయమున లేవియునూ లేవు అయినను నన్ను వచింపుమనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు - మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తులగుదురో యెరుగ లేకున్నాను. కొందరు భుజించ కూడదనిన పదార్దములు భుజించుచున్నారు. కొందరు పుణ్య వ్రతములు చేయుచు, అవి పూర్తిగాక మునుపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరి కొందరు అహంకార సహితులుగా, పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ముల నొనర్చి రక్షింపు"మని ప్రార్ధించెను. జగన్నాటక సూత్రధారుడయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడగంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి, ముసలి బ్రాహ్మణరూపంతో ఒంటరిగా తిరుగుచుండెను.

ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలి వాడని యెగతాళి చేయుచుండిరి. కొందరు "యీ ముసలి వానితో మనకేమి పని"యని ఊరకు౦డిరి. కొందరు గర్విష్టులైరి మరి కొందరు కామార్తులై శ్రీహరిని కన్నేతియైనను చూడకుండిరి. వీరందిరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి "వీరినెట్లు తరింపజేతునా?"యని అలోచించుచు, ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ, చక్ర, గదా, పద్మ, కౌస్తుభ, వనమాలాద్యలంకారయుతుడై నిజరూపమును ధరించి, లక్ష్మి దేవితోడను, భక్తులతోడను ముని జన ప్రీతికరమగు నైమిశారణ్యమునకు వెడలెను.

ఆ వనమందు తపస్సు చేసుకోనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదెంచిన సచ్చిదానంద స్వరుపుడగు శ్రీమన్నారయణుని దర్శించి భక్తి శ్రద్దలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు నా లక్ష్మినారాయణులనిట్లు స్తోత్రము గావించిరి.



శ్లో|| శాంతకారం! భజగాశయనం! పద్మనాభం! సురేశం!

విశ్వాకారం! గగనసదృశం! మేఘవర్ణం శుభాంగం! |

లక్ష్మికాంతం! కమలనయనం! యోగిహృద్ద్యానగమ్యం!

వందేవిష్ణుం!భవభయహారం! సర్వలోకైకనాథం ||



శ్లో|| లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీ రంగదామేశ్వరీం

దాసి భూత సమస్త దేవా వనితాం లోకైక దీపంకురాం |

శ్రీ మన్మంద కటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం||

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి అష్టాదశాధ్యాయము - పద్దెనిమిదో రోజు పారాయణము సమాప్తం.

🌹 🌹 🌹 🌹 🌹



🌹కార్తీక మాసం 18వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹
ప్రసాద్‌ భరధ్వాజ


నిషిద్ధములు:- ఉసిరి

దానములు:- పులిహార, అట్లు, బెల్లం

పూజించాల్సిన దైవము:- గౌరి దేవి

జపించాల్సిన మంత్రము:- ఓం గగగగ గౌర్త్యె నమః స్వాహా

🌹 🌹 🌹 🌹 🌹



అశ్వినీ దేవతల స్తోత్రం - చరిత్ర, విశిష్టత - Hymn to the Ashwini Devas



https://youtu.be/Gtc7-wLrfrk


🌹 అశ్వినీ దేవతల స్తోత్రం - చరిత్ర, విశిష్టత - Hymn to the Ashwini Devas - History, Specialties 🌹

🍀🎥 పరిపూర్ణ ఆరోగ్యం, శరీర పటిష్టత, మానసిక శాంతి కొరకు తప్పక వీక్షించండి. 🎥 🍀
🍀🎥 Must watch for perfect health, physical strength, and mental peace. 🎥 🍀


గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ
Sung, Composer: Prasad Bharadwaja



🌹🌹🌹🌹🌹



అశ్వినీ దేవతా స్తోత్రం Ashwini Devata Stotram


🌹 అశ్వినీ దేవతా స్తోత్రం 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹 Ashwini Devata Stotram 🌹
Prasad Bharadwaja


అశ్విని దేవతలు శ్రీ సూర్యభగవానుని పుత్రులు. వీరినే తథాస్తు దేవతలు అంటారు.

The Ashwini Devatas are the sons of Lord Surya. They are called the Tathastu Devatas.



1) ప్రపూర్వగౌ పూర్వజౌ చిత్రభానూ గిరా వాం శంసామి తపసా హ్యనంతౌ !

దివ్యౌ సుపర్ణౌ విరజౌ విమానావధిక్షిపంతౌ భువనాని విశ్వా !!



2) హిరణ్మయౌ శకునీ సాంపరాయౌ నాసత్యదస్రౌ సునసౌ వైజయంతీ !

శుక్లం వయంతౌ తరసా సువేమావధి వ్యయంతావసితం వివస్వతః !!



3) గ్రస్తాం సుపర్ణస్య బలేన వర్తికామ ముంచతావశ్వినౌ సౌభగాయ !

తావత్సువృత్తా వనమంతమాయయావసత్తమా గా అరుణా ఉదావహత్ !!



4) షష్టిశ్చ గావస్త్రిశతాశ్చ ధేనవ ఏకం వత్సం సువతే తం దుహంతి !

నానాగోష్ఠా విహితా ఏకదోహనాస్తావశ్వినో దుహతో ధర్మముక్థ్యం !!



5) ఏకాం నాభి సప్తశతా అరాః శ్రితాః ప్రధిష్వన్యా వింశతిరర్పితా అరాః !

అనేమిచక్రం పరివర్తతేఽజరం మాయాశ్వినౌ సమనక్తి చర్షణీ !!



6) ఏకం చక్రం వర్తతే ద్వాదశారం షణ్ణాభిమేకాక్షమమృతస్య ధారణం !

యస్మిందేవా అధివిశ్వే విషక్తాస్తావశ్వినౌ ముంచతో మా విషీదతం !!



7) ఆశ్వినావిందు మమృతం వృత్తభూయౌ తిరోధత్తామశ్వినౌ దాసపత్నీ !

హిత్వా గిరిమశ్వినౌ గాముదాచరంతౌ తద్వృష్టిమహ్నాత్ప్రథితౌ బలస్య !!



8) యువాం దిశో జనయథో దశాగ్రే సమానం మూర్ధ్ని రథయానం వియంతి !

తాసాం యాతమృషయోఽనుప్రయాంతి దేవా మనుష్యాః క్షితిమాచరంతి !!



9) యువాం వణాన్వికురుథో విశ్వరూపాంస్తేఽధిక్షియంతే భువనాని విశ్వా !

తే భానవోఽప్యనుసృతాశ్చరంతి దేవా మనుష్యాః క్షితిమాచరంతి !!



10)తౌ నాసత్యావశ్వినౌ వాం మహేఽహం స్రజం చ యాం బిభృథః పుష్కరస్య !

తౌ నాసత్యావమృతావృతావృధావృతే దేవాస్తత్ప్రమదే న సూతే !!



11) ముఖేన గర్భం లభతాం యువానౌ గతాసురేతత్ప్రపదేన సూతే !

సద్యో జాతో మాతరమత్తి గర్భస్తావశ్వినౌ ముంచథో జీవసే గాం !!



12) స్తోతుం న శక్నోమి గుణైభర్వంతౌ చక్షుర్విహీనః పథి సంప్రమోహః !

దుర్గేఽహమస్మిన్పతితోఽస్మి కూపే యువాం శరణ్యౌ శరణం ప్రపద్యే !!



ఇతి శ్రీమన్మహాభారత ఆదిపర్వణ్యశ్వినీకుమారస్తోత్రం సంపూర్ణం.

🌹 🌹 🌹 🌹 🌹

మహిషాసురమర్దిని అవతారం వారణాసి Mahishasura Mardhini Avataar in Varanasi (a YT Short)



https://youtube.com/shorts/aLYuzRCt8zo


🌹🔱 మహిషాసురమర్దిని అవతారం వారణాసి

Mahishasura Mardhini Avataar in Varanasi 🔱🌹


ప్రసాద్ భరద్వాజ


(a YT Short)



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam





అశ్వినీ దేవతలు - తధాస్తు దేవతలు Ashwini Deities - Tadastu Deities


🌹 అశ్వినీ దేవతలు - తధాస్తు దేవతలు 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


అశ్వినీ దేవతలు సూర్యపుత్రులు. వీరిని ఆది వైద్యులుగా పురాణాలు వర్ణించాయి. వీరినే తధాస్తు దేవతలు అని కూడా అంటారు. వేదాలలో వీరి గురించి దాదాపు నూరు సూక్తాల వరకు ఉంది. వీరిని ఆది వైద్యులుగా పురాణాలు వర్ణించాయి. వీరు దయార్ద్ర హృదయులు, ధర్మపరులు, సత్యసంధులు. వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి. వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు కుడిచేతిలో అభయముద్ర, ఎడమచేతిలో ఆయుర్వేద గ్రంథం కుడిపక్కన మృతసంజీవిని, విశల్యకరణి లాంటి ఔషధీ లతలు ఉంటాయని పురాణ వర్ణితం.

వీరు విరాట్పురుషుని నాసికాభాగంలో ఉంటారు. వీరి సోదరి ఉష. వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం. అది హిరణ్యయానమనే దోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది. ఆ రథం చాలా బృహత్తరమైనది. అది హిరణ్యం అంటే బంగారంతో నిర్మితమైనది. ఆ రథాన్ని అధ్వరాశ్వాలనే మూడు గుర్రాలు నడుపుతుంటాయి. అవి తెల్లగా నున్నగా ఎల్లప్పుడూ యవ్వనంతో అత్యంత ఉత్సాహంతో ఉంటాయి. ఈ రథానికి చక్రాలూ మూడే. సారథి కూర్చోవడానికి త్రిఫలకాలు, త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి.

ఆ రథంలో ఒకవైపు ధనం మరొకవైపు తేనె, సోమరసం మరొకవైపు ఆయుధాలు ఉంటాయి. రథం పైభాగంలో వేయిపతాకాలు సుందరం గా రెపరెపలాడుతూ ఉంటాయి. అశ్వినీ దేవతల కంఠధ్వని... శంఖనాదంలా మధురంగా ఉంటుంది. ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు. వీరి చేతిలో తేనె, సోమరసం, మంచుతో అద్దిన బెత్తంతో యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో సుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తుంటారు.


🌻 అశ్విని దేవతా మంత్రాలు 🌻

ఓం అశ్విని కుమారాభ్యాం నమః

ఓం అశ్విన్యౌవైద్యౌ తే నమః

ఓం అశ్విని దేవతాయై నమః



వేదాలలో ‘అనుమతి’ అనే ఒక దేవతా వర్గం ఉన్నారు. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించే లాగ సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు. ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తథాస్తు దేవతలు అంటున్నారు. సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం. అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు. వీరు సూర్యుని కుమారులు. అశ్వ రూపంలో నున్న సూర్యుడు, ఛాయాదేవిలకు వీరు జన్మించారు.

మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులు గా జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. వీరి సోదరి ఉష. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమటకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన.

ఏం మాట్లాడినా తథాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తుంటారు ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు. పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుందట. 'తథాస్తు' అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించ కూడని మాటలను పదే పదే అంటే దేవతలు వెంటనే తథాస్తు అనేస్తారు. వీరినే తథాస్తు దేవతలు అంటారు.

ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తథాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి. మరికొన్ని దుష్పలితాలు చోటు చేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతాయి.

కాబట్టి ఎప్పుడూ మంచి ఆలోచనలుతో మంచి కోరుకుంటే, భగవత్‌ చింతనలో ఉంటే అంతా మంచే జరుగుతుంది...

🌹🌹🌹🌹🌹

కార్తిక పురాణం - 17 :- 17వ అధ్యాయము - అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము Kartika Purana - 17 :- Chapter 17 - Angirasa's philosophical advice to the greedy man

🌹. కార్తిక పురాణం - 17 🌹
🌻. 17వ అధ్యాయము - అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము 🌻
📚. ప్రసాద్ భరద్వాజ



ఓ మునిశ్రేష్ఠులారా! ఓ ధనలోభీ! నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను. వినుము.

కర్మవలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున, శరీరోత్పతికి కర్మ కారణముగుచున్నది. శరీరధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక, కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సుక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మసంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించు చున్నాను. 'ఆత్మ'యనగా యీ శరీరమును నహంకారముగా ఆవరించి వ్యవహరించు చున్నది - అని అంగీరసుడు చెప్పగా

"ఓ మునీఒద్రా! నేనింత వరకు యీ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కనుక, యింకను వివరముగా చెప్పబడిన వాక్యార్ధజ్ఞానమునకు పాదార్దజ్ఞానము కారణమగుచుండును. కాన, 'అహంబ్రహ్మ' యను వ్యక్యార్ధమును గురించి నాకు తెలియజెయండి"యని ధనలోభుడు కోరెను.

అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియె - ఈ దేహము అంత:కరణవృత్తికి సాక్షియే, 'నేను - నాది' అని చెప్పబడు జీవత్మాయే 'అహం' అను శబ్దము. సర్వాంతర్యామియై సచ్చిదానంద రూపమైన పరమాత్మా 'న:' అను శబ్దము. ఆత్మకు షుటాదులవలె శరిరమునకు లేదు. ఆ యాత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ది సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగువాని వ్యాపారమునుందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా వున్నదై యెల్లప్పుడు నొకేరీతిని ప్రకాశించుచు నుండునదే "ఆత్మ" యనబడను. "నేను" అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి నశించునవియే గాక, యిట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి యందునూ "నేను", "నాది" అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించు కొనుము.

ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునటుల శరీర, ఇంద్రియాలు దేని నాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే, అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరే౦ద్రియాల సంబంధము లేక గాఢనిద్రపోయి, మేల్కొన్న తర్వాత 'నేను సుఖనిద్ర పోతిని, సుఖింగా వుంది' అనుకోను నదియే ఆత్మ.

దీపము గాజుబుడ్డిలో వుండి ఆ గాజును, ప్రకాశింప జేయు నటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింప చేయుచున్నది. ఆత్మ పతమాత్మ స్వరూపమగుట వలన, దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే 'పరమాత్మ' యని గ్రహింపుము. 'తత్వమసి' మొదలైన వాక్యములందలి 'త్వం' అను పదమునుకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం 'తట్ అనుపదమునకు సర్వజ్ఞ దిగుణత్వా విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్ధము "తత్త్వమసి" అనేది జీవాత్మ పరమాత్మల యేకత్వమును భోదించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలి వేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అదియే "ఆత్మ దేహలక్షణములుండుట - జన్మించుట - పెరుగుట - క్షీణి౦చుట - చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరుపించ బడి యున్నదో అదియే "ఆత్మ". ఒక కుండను జూచి అది మట్టితో చేసినదే యని యే విధముగా గ్రహింతుమో, అటులనే ఒక దేహాంతర్యామి యగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము.

జీవులచే కర్మ ఫలమను అభవింప జేసేవాడు పరమేశ్వరుడనియు, జీవులా కర్మ ఫలమును అనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురుశుశ్రూష నొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయును. మంచిపనులు తలచిన చిత్తశుద్దియు, దానివలన భక్తిజ్ఞాన వైరాగ్యములు గలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు - అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి యిట్లనెను.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి సప్తదశాధ్యాయము - పదిహేడవ రోజు పారాయణ సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹కార్తీక మాసం 17వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ



నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు

దానములు:- ఔషధాలు, ధనం

పూజించాల్సిన దైవము:- అశ్వినీ దేవతలు

జపించాల్సిన మంత్రము:- ఓం అశ్విన్యౌవైద్యౌ తే నమః స్వాహా

🌹 🌹 🌹 🌹 🌹