త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం ఏకబిల్వం శివార్పణం Tridalam, Trigunakaram, Trinetrancha, Triayaudham, Ekabilvam, Shivarpanam (a devotional YouTube Short)



https://www.youtube.com/shorts/7jp8gaPAhdM


🌹 త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం ఏకబిల్వం శివార్పణం 🌹
🌹 Tridalam, Trigunakaram, Trinetrancha, Triayaudham, Ekabilvam, Shivarpanam 🌹



🍀 శ్రీ బిల్వస్తోత్రం సోమవారం వినడం, చదవడం అత్యంత శుభప్రదమని చెబుతారు. శ్రీ బిల్వస్తోత్రం అనేది శివార్పణంలో భాగంగా బిల్వపత్రం యొక్క ప్రాముఖ్యతను తెలిపే ఒక ప్రసిద్ధ శ్లోకం. దీని అర్థం, మూడు ఆకులు గల బిల్వపత్రం మూడు గుణాలకు (సాత్విక, రాజసిక, తామసిక) నిలయమని, శివుని మూడు కళ్ళకు, మూడు ఆయుధాలకు ప్రతిరూపమని, మూడు జన్మల పాపాలను హరిస్తుందని, అందువల్ల ఒక బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం చాలా పుణ్యమని చెబుతారు. 🍀

ప్రసాద్ భరద్వాజ



Like, Subscribe and Share
https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹

త్రిదళం బిల్వం శివార్పణం Tridalam Bilvam Shivarpanam (a YT Short)



https://youtube.com/shorts/5ydqj3va6ts


🌹 త్రిదళం బిల్వం శివార్పణం Tridalam Bilvam Shivarpanam 🌹

ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share


https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


తిరుమల గిపిపై వెలసిన వెంకన్నా శుభ శనివారం Happy Saturday, Venkanna, who appeared on the Tirumala Hill (a YT Short)



https://www.youtube.com/shorts/Gcho90Fj-_M


🌹 తిరుమల గిపిపై వెలసిన వెంకన్నా శుభ శనివారం 🌹
🌹 Happy Saturday, Venkanna, who appeared on the Tirumala Hill 🌹


Prasad Bharadwaja
ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share


https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹



మార్గశిర మాసం - ముక్తికి మార్గం Margashira Masam - The path to liberation


🌹 నేటి నుంచి మార్గశిర మాసం ప్రారంభం - "మార్గశిర మాసం" - ముక్తికి మార్గం 🌹
🌻 మార్గశిర మాసం విశిష్టత 🌻
ప్రసాద్ భరద్వాజ


🌹 Margashira month begins from today - "Margashira month" - the path to liberation 🌹
🌻 Margashira month's special features 🌻
Prasad Bharadwaja


చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంతో కలసిన పౌర్ణమినాడు చంద్రుడు ఉదయించే నెలను మార్గశిర మాసం అంటారు.

ఈ నెల విష్ణుదేవుని రూపం. ఈ మాసం ప్రకృతి కాంతకు సీమంతం లాంటిది. తుషార బిందువుల హేమంతం. శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం.

భగవద్గీతలోని విభూతియోగంలో - "మాసానాం మార్గశీర్షం"

మాసాల్లో తాను మార్గశిరమాసాన్నని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ.

ఈ నెలలో సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదు. బ్రాహ్మీముహూర్తంలో నీటిలో అగ్ని , సూర్యుడు కలసి ఉంటారని శాస్త్రం సూచిస్తుంది. అందువలన బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో ఆరోగ్యప్రదం , సంధ్యావందన జపధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి , అగ్నితేజము కూడా మన మనస్సును , బుద్ధిని వికసింపజేస్తాయి .

అందుకే.... మార్గశిర మాసంలో - ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారుఝాముననే నిద్రలేచి స్నానం చేయడం ఆచారంగా వస్తుంది. ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి , శ్రీలక్ష్మిసమేత శ్రీమహవిష్ణువుని స్మరించుకొని నదులలో దీపాన్ని విడిచిపెట్టిన వారికి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయి.

ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళముతో పూజించడం పుణ్యప్రదం. ద్వాదశినాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి. శ్రీ విష్ణువుతో పాటు సూర్యున్ని కూడా పూజించి శుభాలను పొందాలని కోరుతూ మనం ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో.


.. 🍀 "ఓం నమో నారాయణాయ'" 🍀

అనే మంత్రాన్ని స్మరించాలి .

ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని తులసి ఆకులను తీసికొని , 'ఓం నమో నారాయణాయ' అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించాలి. ఈ మార్గశిరమాసం ఎన్నో పుణ్యదినములకు నెలవు.

మార్గశిర శుద్ధ షష్ఠి - 'స్కంద షష్ఠి'.

శివకుమారుడైన కుమారస్వామి ఈరోజున తారకాసురున్ని సంహరించాడని ఈ తిథి అతనికి ప్రియమైనదని శాస్త్రాలు తెలుపుతున్నాయి.

తెలుగువారు దీన్ని ""'సుబ్రహ్మణ్య షష్ఠి'"" అని అంటారు

మార్గశిర శుద్ధ ఏకాదశి - 'వైకుంఠ ఏకాదశి'.

దీనినే 'మోక్ష్తెకాదశి' అని అంటారు .

ఆ రోజున విష్ణువు ఆలయాలలో ఉత్తరద్వారం నుంచి వెళ్లి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల విశ్వాసం. తిరుపతి , శ్రీరంగం వంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆరోజు గొప్ప ఉత్సవం. వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశచిహ్నంగా భావిస్తారు.

మోక్షదా ఏకాదశి ... "గీతాజయంతి".

సమస్తమానవాళికి ధర్మ నిధి , భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానం అయిన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు. మార్గశిర బహుళ ఏకాదశిని విమలైకాదశి , సఫలైకాదశి అనికూడా పిలుస్తారు.

త్రిమూర్తులైన బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల సమైక్యస్థితి దత్తాత్రేయుడు.

ఈ "దత్తాత్రేయ జయంతి" ని మార్గశిరంలోనే శుక్లపూర్ణిమ నాడు జరుపుకుంటారు.

మార్గశిర శుక్ల త్రయోదశినాడు

"హనుమద్‌వ్రతం", "మత్స్యద్వాదశి", "ప్రదోష వ్రతం" ఆచరించడం పరిపాటి .


ఈ మాసంలోనే....

" అనంత తృతీయ , నాగపంచమి , సుబ్రమణ్యషష్టి , పరశురామ జయంతి , సంకటహర చతుర్ధి , ఫలసప్తమి , కాలభైరవాష్టమి , రూపనవమి , సఫలా ఏకాదశి , కృష్ణ (మల్ల) ద్వాదశి , యమదర్శన త్రయోదశి , ప్రదోష వ్రతం , శ్రీమహావిష్ణువు సూర్యుని రూపంలో ధనస్సు రాశిలో ప్రవేశించే పుణ్యవేళ ఈ మాసంలోనే ఈ ధనుస్సంక్రాంతినే "ధనుర్మాసం" అనిఅంటాము. తిరుప్పావై పారాయణము ప్రారంభమయ్యే పుణ్యవేళ ఇలాంటి ఎన్నో విశిష్టతలతో కూడిన మాసం

కావున శ్రీమన్నారాయణ్ణున్ని తరించి జన్మసార్ధకం చేసుకునేందుకు, భక్తి భావనను పెంపోదించుకొనుటకు దాన ధర్మాలను ఆచరింస్తూ పుణ్యఫలంను దక్కించుకొనేందుకు ఈ మార్గశిరం సమస్త మానవాళికి ఎంతగానో ఉపయోగకారిగా నిలుస్తుంది.

ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

🌹 🌹 🌹 🌹 🌹

పోలిస్వర్గం పోలి పాడ్యమి శుభాకాంక్షలు భక్తులందరికి Polisvargam Poli Padyami Greetings to all the devotees



🌹 పోలిస్వర్గం పోలి పాడ్యమి శుభాకాంక్షలు భక్తులందరికి - పూజా విధానం, పురాణ గాధ 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 Polisvargam Poli Padyami Greetings to all the devotees - Puja method, Purana Gadha 🌹

Prasad Bharadwaja



కార్తీకమాసం కార్తీక నవంబరు 20 అమావాస్యతో ముగుస్తుంది. ఆ మరుసటి రోజు నుంచి మార్గశిరమాసం ప్రారంభమవుతుంది.


అయితే మొదటి రోజు వచ్చే పాడ్యమిని పోలి పాడ్యమి అంటారు. ఈ రోజునే పోలి స్వర్గం అని ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తీకమాసంలో నియమాలు పాటించి నిత్యం స్నానం, దీపం నియమాలు పాటించిన వారు... పోలిస్వర్గం రోజు వేకువజామునే దీపాలు నీటిలో వదలడంతో వ్రతం పూర్తైందని భావిస్తారు.

నెల రోజులు కార్తీక మాస నియమాలు అనుసరించిన వారికి పోలిస్వర్గం ముగింపు రోజు అయితే... నెలరోజులూ నియమాలు పాటించనివారు ఆ కార్తీక వ్రత ఫలితాన్ని పొందేందుకు పోలిస్వర్గం రోజు దీపాలు నదిలో విడిచిపెడతారు.

ఈ ఏడాది పోలిస్వర్గం ఎప్పుడు?

సాధారణంగా కార్తీకమాసం అమావాస్య తర్వాత మార్గశిర పాడ్యమి రోజుని పోలి పాడ్యమి అంటారు. ఈ రోజే దీపాలు విడిచిపెట్టి కార్తీకవ్రతాన్ని ముగిస్తారు. అయితే పోలిస్వర్గం ఈ ఏడాది శుక్రవారం వచ్చింది. శుక్రవారం రోజు అమ్మవారిని ఇంటినుంచి పంపించకూడదని అందుకే ఈ ఏడాది కార్తీక వ్రతం ముగింపు శుక్రవారం కాకుండా శనివారం అనుసరించాలంటున్నారు.

సాధారణంగా పోలి పాడ్యమి శుక్రవారం వచ్చినప్పుడు ఆ రోజు పోలమ్మను స్వర్గానికి పంపించరు. బదులుగా శనివారం చేస్తారు. శుక్రవారం లక్ష్మీదేవి రోజు.. పోలమ్మను లక్ష్మీదేవిగా భావిస్తారు... అందుకే పోలమ్మను స్వర్గానికి శనివారం పంపించాలని చెబుతారు కొందరు పండితులు. ఈ విషయంపై స్థానికంగా మీరు విశ్వసించే పండితులు చెప్పిన విధానం, ఇంటిపెద్దల సలహాలు అనుసరించడం మంచిది..


🍀 ఇంతకీ పోలిస్వర్గం అని ఎందుకంటారు? దీని వెనుకున్న పురాణ కథేంటి? ఈ రోజు ఏం చేయాలి? 🍀

🍁 పోలి పాడ్యమి కథ 🍁


పూర్వకాలంలో ఓ గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్లుండేవారు. వారిలో చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు దైవభక్తి చాలా ఎక్కువ. కానీ ఆ భర్తే ఆమెకు శాపంగా మారింది. ఆ భక్తి చూసి అత్త ఓర్వలేకపోయింది..అందుకే నలుగురు కోడళ్లను ప్రేమగా చూసేది కానీ పోలిని బాధలు పెట్టేది. పూజలు చేయనిచ్చేది కాదు. కార్తీకమాసం రావడంతో నలుగురు కోడళ్లను తీసుకుని నిత్యం నదీ స్నానానికి వెళ్లి అక్కడ దీపాలు వెలిగించేది. చిన్న కోడలు నదికి రాకుండా ఇంట్లో పనులన్నీ చేయించేది. నిరాశచెందని పోలి..అత్త, నలుగురు తోడికోడళ్లు వెళ్లిపోయిన వెంటనే స్నానమాచరించి ఇంటి దగ్గరే తులసి మొక్క దగ్గర దీపం వెలిగించేది. ఇంటి పెరట్లో ఉన్న పత్తిని తీసి ఒత్తి చేసి..వెన్న రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికంటా పడకుండా బుట్ట బోర్లించేది. నెలరోజులూ క్రమం తప్పకుండా దీపం వెలిగించింది పోలి. ఆఖరి రోజైన మార్గశిర పాడ్యమి రోజు కూడా అంతా నదికి వెళ్లారు. వారు తిరిగి వచ్చేసరికి ఇంటి దగ్గర కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఆ రోజు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దీపం వెలిగించి కార్తీక దామోదరుడిని ప్రార్థించింది పోలి. వెంటనే స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవతలు పోలిని ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇది చూసి ఆశ్చర్యపోయిన అత్త, నలుగురు తోడికోడళ్లు ఇదేంటి, నెల రోజులు తాము భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే పోలిని తీసుకెళుతున్నారని. అందుకు పోలి చేసిన పూజల గురించి చెప్పారు దేవదూతలు. తాము కూడా పోలితో పాటూ స్వర్గానికి వెళ్లాలంటూ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పూజలు చేయడం కాదు. కల్మషం లేని భక్తితో పూజలు చేసినప్పుడే ఆ పూజలు ఫలిస్తాయని చెప్పారు దేవదూతలు.

కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే పోలి పాడ్యమి రోజు దేవుడి దగ్గర, తులసి మొక్క దగ్గర దీపం వెలిగించుకుని ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గ ప్రాప్తి లభిస్తుందని కార్తీక పురాణంలో ఉంది. నెల రోజులు నియమాలు పాటించని వారు ఈ రోజు 30 వత్తులు వెలిగిస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని నమ్మకం. ఈ రోజు దీపదానం ఆచరిస్తే మంచి జరుగుతుంది.

పోలిస్వర్గం కథ పూర్తిగా..తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకునే కథ... కార్తీకమాసంలో నిత్యం దీపారాధన, పూజలు చేయడం కాదు..కల్మషం లేకుండా భగవంతుడిని ఆరాధించినప్పుడే మీకు జరగాల్సిన మంచి జరుగుతుందన్నది ఈ కథలో ఆంతర్యం.

🌹🌹🌹🌹🌹

పోలి స్వర్గం పాడ్యమి విశిష్టత The uniqueness of the heavenly world (a YT Short)



https://youtube.com/shorts/au7kbOVLM1g


🌹 పోలి స్వర్గం పాడ్యమి విశిష్టత 🌹
🌹 The uniqueness of the heavenly world 🌹


Prasad Bharadwaja
ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹



మార్గశిర మాసం విశిష్టత - మార్గశిర మాసం - ముక్తికి మార్గం Margasira Masa Significance - Way To Moksha (A YT video)




https://youtu.be/BU8EqysDC5U


🌹 మార్గశిర మాసం విశిష్టత - మార్గశిర మాసం - ముక్తికి మార్గం MARGASIRA MASA SIGNIFICANCE - WAY TO MOKSHA 🌹

మార్గశిర మాసంలో వచ్చే అన్ని విశిష్ట పండుగల విశేషాలు, చేయవలసిన విధులు ఈ వీడియోలో తెలుసుకోండి. మృగశిర నక్షత్రం కలసి పౌర్ణమినాడు చంద్రుడు ఉదయించే నెల మార్గశీర్ష మాసం. “మాసానాం మార్గశీర్షోహం” అని కృష్ణుడు స్వయంగా చెప్పాడు. కనుక మార్గశిర మాసం విష్ణుదేవుని రూపం. భాద్రపదంలో గణపతిని, ఆశ్వయుజంలో అమ్మవారిని, కార్తీకంలో శివుని, మార్గాశిరంలో విష్ణువును, పుష్యమాసంలో సూర్య భగవానుని ఇలా అయిదు మాసాలలో అయిదు దేవతా స్వరూపాలను అర్చిస్తూ పంచాయతన పూజా విధానాన్ని మన మహర్షులు సష్ట పరచారు.

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹



పోలి స్వర్గం శుక్రవారమా? శనివారమా? - పోలి స్వర్గం పూజా విధానం, పురాణ గాధ Poli Swargam Pooja - Story (a YT Short)



https://youtu.be/5lQAYJrrCvE


🌹🪔 పోలి స్వర్గం శుక్రవారమా? శనివారమా? - పోలి స్వర్గం పూజా విధానం, పురాణ గాధ POLI SWARGAM POOJA - STORY 🪔🌹


🪔🪔🪔 కార్తీక మాసంలో నియమాలు పాటించి నిత్యం స్నానం, దీపం నియమాలు పాటించిన వారు... పోలిస్వర్గం రోజు వేకువజామునే దీపాలు నీటిలో వదలడంతో వ్రతం పూర్తైందని భావిస్తారు. నెల రోజులు కార్తీక మాస నియమాలు అనుసరించిన వారికి పోలిస్వర్గం ముగింపు రోజు అయితే... నెలరోజులూ నియమాలు పాటించనివారు ఆ కార్తీక వ్రత ఫలితాన్ని పొందేందుకు పోలిస్వర్గం రోజు దీపాలు నదిలో విడిచిపెడతారు. 🪔🪔🪔

ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹



శివుని శక్తి - కృష్ణుని మాయ - ఇచ్చినా తీసుకున్నా పరీక్షే Shiva's Power - Krishna Maya All is Examination (a YT Short)




https://youtube.com/shorts/jCS-yCrf0js


🌹 శివుని శక్తి - కృష్ణుని మాయ - ఇచ్చినా తీసుకున్నా పరీక్షే Shiva's Power - Krishna Maya All is Examination 🌹

ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


కార్తీక మాసం 30వ రోజు చేయ వలసినవి Things to do on 30th Day of Kartika Month (a YT Short)



https://youtube.com/shorts/J2ijxLPR_Kc


🌹 కార్తీక మాసం 30వ రోజు చేయ వలసినవి Things to do on 30th Day of Kartika Month 🌹

ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹




కార్తీక పురాణం 30వ అధ్యాయము -కార్తీక వ్రత మహిమ్నా ఫలశ్రుతి / Karthika Puranam 30th Chapter Parayan (a YT Short)



https://youtu.be/uNon2HkwBRU


🌹 కార్తీక పురాణం 30వ అధ్యాయము -కార్తీక వ్రత మహిమ్నా ఫలశ్రుతి KARTHIKA PURANAM 30th CHAPTER PARAYAN 🌹

ప్రసాద్ భరద్వాజ




Like, Subscribe and Share


https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹



కార్తీక అమావాస్య Kartik Amavasya



🌹 కార్తీక అమావాస్య - శుభ ముహూర్తం, పూజా విధానం, పితృ అనుగ్రహం పొందేందుకు జపించాల్సిన శక్తివంతమైన మంత్రం ఇదే! 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Kartik Amavasya - Auspicious time, method of worship, and this is the powerful mantra to chant to get ancestral blessings! 🌹
Prasad Bharadwaj


మన పూర్వీకులను స్మరించుకోవడానికి, వారిని పూజించడానికి కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి, పితృదోషంతో బాధపడుతున్న వారు ఈ రోజున వివిధ ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలి.

శుభ ముహూర్తం

దృక్ పంచాంగం ప్రకారం.. మార్గశిర మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తిథి ఈ ఉదయం 9:43 నిమిషాలకు ప్రారంభమౌతుంది. గురువారం మధ్యాహ్నం 12:16 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, కార్తీక అమావాస్యను గురువారం నాడు ఆచరిస్తారు. కొందరు మాత్రం అమావాస్య తిథి ప్రకారం నేడే దీన్ని జరుపుకొంటారు. కార్తీక అమావాస్య నాటి బ్రహ్మ ముహూర్తాన్ని అత్యంత శక్తిమంతమైనదిగా పరిగణిస్తారు. తెల్లవారు జామున 5:01 నుండి 5:54 నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో పవిత్ర నదీ స్నానాలు చేయడం, దానధర్మాలు చేయడం శ్రేష్ఠమని పండితులు సూచిస్తున్నారు.


కార్తీక అమావాస్య శుభ ముహూర్తం - 2025

అమావాస్య తిథి ప్రారంభం: గురువారం ఉదయం 9:43 AM

తిథి ముగింపు: మధ్యాహ్నం 12:16 PM

బ్రహ్మముహూర్తం: తెల్లవారుజామున 4:00 AM - 5:54 AM


అమావాస్య రోజున బ్రహ్మముహూర్తంలో చేసిన పూజ, దానాలు, నది స్నానాలు అనేక రెట్లు పుణ్యఫలితాలను ఇస్తాయంటారు.


🍀 కార్తీక అమావాస్య పూజా విధానం - ఇలా చేసుకుంటే శుభ ఫలితాలు 🍀

1. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి.

2. వీలైతే నది స్నానం చేయడం ఉత్తమం.

3.రాగి పాత్రలో నీళ్లు, కొద్దిగా పాలు, సింధూరం, ఎర్ర పూలు వేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి.

4.శివ-కేశవులను స్మరిస్తూ పుష్పాలు, పసుపు, కుంకుమ, చందనం, అక్షింతలు సమర్పించాలి.

5.నైవేద్యం పెట్టి దీపారాధన చేయాలి.


కార్తీక అమావాస్య నాడు తప్పక జపించాల్సిన శక్తివంతమైన మంత్రం

పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి, పితృదోషాలను తగ్గించుకోవడానికి ఈ మంత్రం అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు-


"ఓం పితృదేవతాయ నమః"

ఈ మంత్రాన్ని పవిత్రతతో, భక్తితో జపిస్తే పూర్వికుల ఆశీస్సులు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.


🍁 తర్పణాలు 🍁

పూజ తర్వాత, అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణం వదలాలి. గంగాజలాన్ని వినియోగించడం అత్యంత శ్రేష్టం. అది సాధ్యం కాని వాళ్లు నీరు, నల్ల నువ్వులు, పచ్చి పాలను రాగి లేదా ఇత్తడి పాత్రలో కలిపి శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. దక్షిణం వైపు ముఖం చేసి కూర్చుని, చేతిలో నీరు తీసుకుని, సంకల్పం చెప్పుకుని, మీ పూర్వీకులను స్మరిస్తూ నీటిని సమర్పించాలి. "ఓం పితృ దేవతాయై నమః" అనే మంత్రాన్ని జపించాలి. చివరగా, అవసరమైన వారికి ఆహారం లేదా ఆహార పదార్థాలను దానం చేయాలి.

అలాగే, సాయంత్రం తులసికోట దగ్గర పిండి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో శాంతి, సంతోషం నెలకొంటాయని, పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు.

🌹🌹🌹🌹🌹

కార్తీక పురాణం - 30 :- 30వ అధ్యాయము - కార్తీక వ్రత మహిమ్నా ఫలశ్రుతి / Kartika Purana - 30 :- Chapter 30 - Kartika Vrata Mahimna Phalashruti


🌹. కార్తీక పురాణం - 30 🌹
🌻 30వ అధ్యాయము - కార్తీక వ్రత మహిమ్నా ఫలశ్రుతి 🌻
ప్రసాద్ భరద్వాజ


🌹. Kartika Purana - 30 🌹
🌻 Chapter 30 - Kartika Vrata Mahimna Phalashruti 🌻
Prasad Bharadwaja


నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాదిమహామునుల కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను, విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయినోళ్లకొనియాడిరి. శౌనకాది మునులకు యింకను సంశయములు తీరనందున, సూతునిగాంచి,

"ఓ ముని తిలకమా! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై, అత్యాచారపరులై జీవించుచు సంసారసాగరము తరింపలేకున్నారు. అటువంటివారు సులభముగా ఆచరించు తరణోపాయమేదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్షసాధనకుపకరించు వుత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు వుత్తమదైవమెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల వుపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో నున్నాము. కాన దీనిని వివరించి తెలియజేయు"మని కోరిరి.

అంత సూతుడా ప్రశ్న నాలకించి "ఓ మునులారా! మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్షసాధనము కాగలవు. కార్తీకవ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటె ఘనమైనదని శ్రీహరి వరించియున్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతియేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యముకాదు. అయినను సూక్షముగా వివరించెదను.

కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్ధతులను జెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీకమాసమున సూర్యభగవానుదు తులారాశి యందున్నప్పుడు శ్రీహరి ప్రీతికొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగ నదీస్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచమైనా దీపదానం చేయవలయును. ఈ నెలరోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమున గాని, శివాలయమునగాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతి దినము సాయంకాలము పురాణపఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశియందున్న నెలరోజులు యీ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తివుండికూడా ఆచరించక గాని, లేక, ఆచరించువారలను యెగతాళి చేసినగాని, వారికి ధనసహాయము చేయువారికి అడ్డుపడిన వారును మందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతర మందు నరకములో యమకింకరుల చేత నానా హింసలపాలుకాగలరు. అంతియేగాక అట్తివారు నూరుజన్మలవరకు ఛండాలాది హీన జన్మలెత్తుదురు.

కార్తీక మాసములో కావేరి నదిలోగాని, గంగా నదిలోగాని, అఖండ గౌతమినదిలోగాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించిననూ యిహమందు సర్వసుఖములను అనుభవించుటయే గాక, జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు.

సంవత్సరములోవచ్చు అన్ని మాసములకన్నా కార్తీకమాసము వుత్తమోత్తమమైనది అధిక ఫలదాయకమైనది. హరి హరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీకమాస వ్రతము వలన జన్మజన్మలనుండి వారలకున్న సకలపాపములు హరించి, మరుజన్మలేక, వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే యీ వ్రతమాచరించవలెననెది కోరిక పుట్టి దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీకమాసమన్న కార్తీక వ్రతమన్నా అసహ్యము కలుగును.

కాన, ప్రతిమానవుదు ఈ పరమ సత్యమును గ్రహించి యిటువంటి పుణ్యమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారు కార్తీకశుద్ద పౌర్ణమినాడు అయినను తమశక్తి కొలదీ వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెలరోజులు చేసిన ఫలముతో సమానఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో యెప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈనె, అరోజులు ధనవంతుడైనను, బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరినామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న యెడల వారికి పుణ్యలోక మబ్బును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు యిచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్థప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి త్రింశోధ్యాయము- ముప్పదవ(ఆఖరి రోజు) పారాయణము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹కార్తీక మాసం 30వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹
ప్రసాద్‌ భరధ్వాజ


నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరి

దానములు:- నువ్వులు, తర్పణలు, ఉసిరి

పూజించాల్సిన దైవము:- సర్వదేవతలు, పితృ దేవతలు

జపించాల్సిన మంత్రము:- ఓం అమృతాయ స్వాహా మమ సమస్త పితృదేవతాభ్యో నమః

🌹 🌹 🌹 🌹 🌹

కార్తీక పురాణం - 29 :- 29వ అధ్యాయము - అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశి ప్రాణము Kartika Purana - 29 :- Chapter 29 - Ambarisha worships Durvasa


🌹. కార్తీక పురాణం - 29 🌹
🌻. 29వ అధ్యాయము - అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశి ప్రాణము 🌻
ప్రసాద్ భరద్వాజ

🌹. Kartika Purana - 29 🌹
🌻. Chapter 29 - Ambarisha worships Durvasa - Dwadashi Prana 🌻
Prasad Bharadwaja


అత్రి మహాముని అగస్త్యులవారితో యీ విధముగా - సుదర్శన చక్రము అంబరీషునక భయమిచ్చి వుభయులను రక్షించి, భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడువ నారంభించెను.

ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదముల ఫైబడి దండ ప్రణామములాచరించి, పాదములను కడిగి, ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని, "ఓ మునిశ్రేష్టా! నేను సంసార మార్గమందున్న యొక సామాన్య గృహస్తుడను. నా శక్తి కొలది నేను శ్రీ మన్నారాయణుని సేవింతును, ద్వాదశశీ వ్రతము జేసుకోనుచు ప్రజలకు యెట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు. మీ యెడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యమివ్వవలయునని ఆహ్వానించితిని. కాన, నా అతిధ్యమును స్వీకరించి నన్నును, నా వంశమును పావనము జేసి కృతార్దుని చేయుడు, మీరు దయార్ద్ర హృదయులు, ప్రధమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీరాక వలన శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ వుపకారమును మరువలేకున్నాను.

మహానుభావా! నా మనస్సంతోషముచే మిమ్మెట్లు స్తుతింపవలయునో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంటవచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు యెంత సేవచేసినను యింకను ఋణపడియుందును. కాన, ఓ పుణ్యపురుషా! నాకు మరల నర జన్మ రాకుండా వుండేటట్లును, సదా, మీ బోటి మునిశ్రేష్ఠుల యందును - ఆ శ్రీ మన్నారాయుణుని యందును మనస్సు గలవాడనై యుండునట్లును నన్నాశీర్వదించు"డని ప్రార్ధించి, సహాపంక్తి భోజనమునకు దయ చేయుమని ఆహ్వానించెను.

ఈ విధముగా తన పాదముల పైబడి ప్రార్ధించుచున్న అంబరీషుని ఆశీర్వదించి "రాజా! ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు యిష్టుడవు. తండ్రితో సమానుడవైనావు.

నేను నీకు నమస్కరించినచో నా కంటె చిన్న వాడగుట వలన నీకు అయుక్షిణము కలుగును.అందుచేత నీకు నమస్కరించుట లేదు. నీవు కోరిక యీ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర యేకాదశి వ్రతనిష్టుడవగు నీకు మనస్థాపమును కలుగ జేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని, నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నివే దిక్కయితివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము గాక, మరొకటి యగునా?" అని దుర్వాస మహాముని పలికి, అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్య పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి, అతని భక్తిని కడుంగడు ప్రశంసించి, అంబరీషుని దీవించి, సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను.

ఈ వృత్తాంతమంతయు కార్తిక శుద్ధ ద్వాదశీ దినంబున జరిగినది. కాన ఓ అగస్త్య మహామునీ! ద్వాదశీ వ్రత ప్రభావమెంతటి మహాత్మ్యము గలదో గ్రహించితివిగదా! ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై వుండును. కనుకనే, ఆరోజుకంతటి శ్రేష్టతయు, మహిమ గలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము యితర దినములలో పంచ దానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ యేకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్ల హరి నామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ, లేక, వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశినాడు తన శక్తి కొలది శ్రీమన్నారయణునకు ప్రీతీ కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టి వాని సర్వ పాపములు యీ వ్రత ప్రభావము వలన పటాపంఛలై పోవును. ద్వాదశీ దినము శ్రీమన్నానరయుణుకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశ ఘడియలు తక్కువగా యున్నను. ఆ ఘడియలు దాటకుండగానే భుజింపవలెను.

ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసమేర్పరచుకొని వుండాలని కోరిక వుండునో, అట్టి వారు ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ యొక్కటియు విడువకూడదు. శ్రీహరికి అత్యంత ప్రీతీకరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి యెంత మాత్రము సంశయింప కూడదు. మఱ్ఱి చెట్టు విత్తనము చాల చిన్నది. అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగ జేసిన యే కొంచము పుణ్యమైనను, అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును.

అందులకే యీ కార్తీకమాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి.

ఈ కథను యెవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్దించి సంతాన ప్రాప్తి కూడా కలుగును - అని అత్రిమహాముని అగస్త్యనకు బోధించిరి.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకోనత్రింశోధ్యాయము - ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹కార్తీక మాసం 29వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹
ప్రసాద్‌ భరధ్వాజ


నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరి

దానములు:- శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారం

పూజించాల్సిన దైవము:- శివుడు (మృత్యుంజయుడు)

జపించాల్సిన మంత్రము:- ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్.

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ శైల పంచ నందీశ్వర ఆలయ రహస్యం / Pancha Nandiswara Alayam Srisailam (a YT Short)



https://youtube.com/shorts/j1YT6wZAOhc


🌹 శ్రీ శైల పంచ నందీశ్వర ఆలయ రహస్యం Pancha Nandiswara Alayam Srisailam 🌹

ప్రసాద్ భరద్వాజ




Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹


చిదంబర రహస్యం అంటే ఏమిటో మీకు తెలుసా Chidambara Rahasyam (a YT Short)




https://youtube.com/shorts/GJAstZzT_oI


🌹 చిదంబర రహస్యం అంటే ఏమిటో మీకు తెలుసా Chidambara Rahasyam 🌹
ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share

కార్తీక మాసం 28వ రోజు చేయవలసినవి / Things to do on 28th Day of Kartika Month (a YT Short)



https://youtube.com/shorts/5Y2KcagG7JM


🌹 కార్తీక మాసం 28వ రోజు చేయవలసినవి
Things to do on 28th Day of Kartika Month 🌹

ప్రసాద్ భరద్వాజ



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


కార్తీక పురాణం 28వ అధ్యాయము / Karthika Puranam 28th Chapter Parayan (a YT Short)



https://www.youtube.com/watch?v=yL1O3En-Ze8


🌹 కార్తీక పురాణం 28వ అధ్యాయము - విష్ణు సుదర్శన చక్ర మహిమ KARTHIKA PURANAM 28th CHAPTER PARAYAN 🌹

ప్రసాద్ భరద్వాజ



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


కార్తిక పురాణం - 28:- 28వ అధ్యాయము - విష్ణు సుదర్శన చక్ర మహిమ / Kartika Purana - 28:- Chapter 28 - The Glory of Vishnu's Sudarshana Chakra



🌹. కార్తిక పురాణం - 28 🌹
🌻. 28వ అధ్యాయము - విష్ణు సుదర్శన చక్ర మహిమ 🌻
ప్రసాద్‌ భరధ్వాజ

🌹. Kartika Purana - 28 🌹
🌻. Chapter 28 - The Glory of Vishnu's Sudarshana Chakra 🌻
Prasad Bharadhwaja



జనక మహారాజా! వింటివా దుర్వాసుని అవస్ధలు! తాను యెంతటి కోపవంతుడైనను, వెనుక ముందు లాలోచింపక ఒక మహాభక్తుని శుద్దిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున, ఎంతటి గొప్ప వారైనాను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోనవలెను.

అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణుని కడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి "అంబరీషా, ధర్మపాలకా! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము, నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్నాహ్వనించితివి, కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేయతల పెట్టితిని. గాని నా దుర్బద్ది నన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్దమైనది. నేను విష్ణువు కడకేగి యా విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్ధి౦చితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీవద్ద కేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను యెంతటి తపశ్శాలినైనను, యెంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందవియేమియు పనిచేయలేదు. నన్నీ విపత్తునుండి కాపాడు"మని అనేక విధాల ప్రార్ధఒచగా, అంబరీషుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి,

"ఓ సుదర్శన చక్రమా! నీకివే నా మన:పూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో, తెలియకయో తొందరపాటుగా యీ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను యీతడు బ్రాహ్మణుడు గాన, ఈతనిని చంపవలదు, ఒక వేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని, ముందు నన్నుచంపి, తర్వాత ఈ దుర్వాసుని జంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు యిలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్దములలో , అనేక మంది లోకకంటకులను చంపితివిగాని శరణుగోరువారిని యింత వరకు చంపలేదు. అందువలననే యీ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు. దేవా! సురాసురాది భూతకోటులన్నియు ఒక్కటిగా యేకమైననూ నిన్నేమియు చేయజాలవు, నీ శక్తికి యే విధమైన అడ్డునూలేదు. ఈ విషయము లోకమంతటికి తెలియును. అయినను మునిపుంగవునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్థించుచున్నాను.

నీ యుందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి యిమిడియున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును, శరణు వేడిన యీ దుర్వాసుని రక్షింపుము" అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి

"ఓ భక్తాగ్రేశ్వరా ! అంబరీషా! నీ భక్తిని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటభులను - దేవతలందరు యెకమైకూడ - చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా! ఈ లోకములో దుష్టశిక్షణ, శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్దాపించుచుండును. ఇది యెల్లరకు తెలిసిన విషయమే, ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీవ్రతమును నశింపజేసి, నానా యిక్కట్లు పెట్టవలెనని కన్ను లెఱ్ఱజేసి నీ మీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి, యీ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను.

ఈతడు కూడా సామాన్యుడు గాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మతేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భులోకవాసుల నందరను చంపగలదుగాని, శక్తిలో నా కంటె యెక్కువేమియుగాదు. సృషి కర్తయగు బ్రాహ్మతేజస్సు కంటెను, కైలాసవతియగు మహేశ్వరుని తేజశ్శక్తి కంటెను యెక్కువయైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని , క్షత్రియ తేజస్సుగల నీవు గాని తులతూగరు. నన్నెదుర్కొనజాలరు. తనకన్న యెదుటి వాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట యుత్తమము. ఈ నీతిని ఆచరించువారలు యెటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోనగలరు.

ఇంత వరకు జరిగినదంతయు విస్మరించి, శరణార్థియై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు" మని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి, " నేను దేవ గో, బ్రాహ్మణాదుల యుందును, స్త్రీలయందును, గౌరవము గలవాడను.

నా రాజ్యములో సర్వజనులూ సుఖిముగా నుండవలెననియే నా యభిలాష. కాన, శరణుగోరిన ఈ దుర్వాసుని, నన్నూ కరుణించి రక్షింపుము. వేలకొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్య మండలములు యేక మైననూ నీ శక్తీకి, తేజస్సుకూ సాటి రావు. నీవు అట్టి తేజోరాశివి మహా విష్ణువు లోకనిందితులపై, లోకకంటకులపై, దేవ - గో - బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి, వారిని శిక్షించి, తనకుక్షియుందున్న పధ్నాలుగు లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన, నీకివే నా మన:పూర్వక నమస్కృతులు" అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను.

అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాడాలింగన మొనర్చి "అంబరీషా! నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు నెవరు పఠింతురో, యెవరు దానదర్మములతో పుణ్యఫలమును వృద్ది చేసుకొందురో, యెవరో పరులను హింసించక - పరధనములను ఆశపడక - పరస్త్రీలను చెరబెట్టిక - గోహత్య - బ్రాహ్మణహత్య - శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి, యిహమందును పరమందును సర్వసౌఖ్యములతోడ తులతూగుదురు. కాన, నిన్నూ దుర్వాసుని రక్షించుచున్నాను, నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాల గొప్పది. నీ పుణ్యఫలము ముందు యీ మునిపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు." అని చెప్పి అతని నాశీర్వదించి, అదృశ్యమయ్యెను.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి అష్టావింశోధ్యాయము - ఇరవయ్యెనిమిదో రోజు పారాయణము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹కార్తీక మాసం 28వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹
ప్రసాద్‌ భరధ్వాజ

నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి, వంకాయ

దానములు:- నువ్వులు, ఉసిరి

పూజించాల్సిన దైవము:- ధర్ముడు

జపించాల్సిన

మంత్రము:- ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా

🌹 🌹 🌹 🌹 🌹


కార్తీక మాసం సోమవారం విశిష్టత పరిహారాలు // Significance of Karthika Masam Somavaram - Remedies



https://www.youtube.com/watch?v=1-jjrSAApKU


🌹 కార్తీక మాసం సోమవారం విశిష్టత పరిహారాలు
Significance of Karthika Masam Somavaram - Remedies 🌹


తప్పక వీక్షించండి


ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share


https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹



ఓం నమః శివాయ, కార్తీక సోమవారం శుభాకాంక్షలు // Om Namah Shivaya, Happy Karthika Monday



https://youtube.com/shorts/PkIGPBYV608


🌹 ఓం నమః శివాయ కార్తీక సోమవారం శుభాకాంక్షలు 🌹
ప్రసాద్ భరద్వాజ

Om Namah Shivaya Happy Karthika Monday
Prasad Bharadwaj 


Like, Subscribe and Share

కార్తీకమాసం చివరి సోమవారం ( నవంబర్ 17).. // Last Monday of Kartik month (November 17)..



🌹 కార్తీకమాసం చివరి సోమవారం ( నవంబర్ 17).. చేయాల్సిన పరిహారాలు ఇవే..!సిరి సంపదలకు లోటే ఉండదు..! 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 Last Monday of Kartik month (November 17).. Here are the remedies to be done..! There will be no shortage of wealth..! 🌹

Prasad Bharadwaja




ఈ ఏడాది ( 2025) నవంబర్​ 17 కార్తీకమాసం చివరి సోమవారం. ఈ 30 రోజులకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్నా.. కార్తీక సోమవారం చివరి సోమవారానికి చాలా ప్రాధాన్యత ఉంది.

ఈ రోజున శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే దరిద్రాలన్నీ తొలగిపోవడం ఖాయమని పండితులు చెబుతున్నారు.

పురాణాల ప్రకారం కార్తీక మాసంలో దేవతలంతా కలిసి దివికి దిగి వచ్చి దేవతల దీపావళి జరుపుకుంటారని నమ్మిక. ముఖ్యంగా కార్తీకమాసంలో వచ్చే సోమవారాల్లో శివుడిని ఆరాధిస్తే ఆయన అనుగ్రహం పొంది సకల పాపాలు తొలగిపోయి అదృష్టం కలిసివస్తుంది.

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది (2025) కార్తీక మాసం చివరి సోమవారం నవంబరు 17 అవుతుంది. కార్తీకమాసంలో చివరి సోమవారం కనుక ఈ రోజుకు ప్రత్యేకత ఎక్కువ.ఈ రోజు కొన్ని రకాల పనులు చేయడం వల్ల భక్తులకు సిరి సంపదలు, విద్య, ఆరోగ్యం, సంతోషం కలుగుతాయని నమ్ముతారు.


🌻 కార్తీక మాసం చివరి సోమవారం చేయాల్సిన పరిహారాలు. 🌻

కార్తీకమాసం అంతా గుడికి వెళ్లకపోయినా ఈ మాసంలో వచ్చే చివరి సోమవారం తప్పకుండా శివుడి గుడికి వెళ్లాలి.

ఉదయాన్నే ఇంటినీ, ఒంటినీ శుభ్రం చేసుకుని శివుడి దగ్గర నెయ్యితో దీపం వెలిగించాలి.

శివక్షేత్రానికి వెళ్లి ఆయనకు ఇష్టమైన బిల్వ పత్రాలను సమర్పించాలి.

నీటితో లేదా పాలు, పెరుగు, తేనె, పంచామృతం వంటి వాటితో పరమేశ్వరుడికి అభిషేకం చేయించాలి.

గంగాజలం, చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మరిన్ని మంచి ఫలితాలు దక్కుతాయి.

కార్తీకమాసం చివరిసోమవారం రోజున మీ స్తోమతను బట్టి అన్నదానం, వస్త్రదానం వంటి పుణ్యకార్యాలు చేయాలి.

ప్రతి రోజూ దీపారాధన చేసే అలవాటు, వీలు లేని వారు కార్తీకమాసంలో పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించని వారు ...చివరి సోమవారం రోజున 365 వత్తులు, లక్ష వత్తులతో దీపాలు వెలిగించాలి.

కార్తీక సోమవారం రోజున శివుడి వాహనం నంది కనుక ఆవుకు ఆహారం తినిపించాలి.

ఆలయంలో ఉండే ద్వజ స్తంభానికి పూజలు చేసి దీపం వెలిగించాలి.

కార్తీకమాసంలో చివరి సోమవారం కనుక నవంబర్​ 17న ఉపవాస దీక్ష చేపట్టి రోజంతా శివనామస్మరణ చేయాలి.



🍀 🪔 కార్తీక మాసం ఆఖరి సోమవారం.. ఇలా పూజిస్తే ఎన్నో ప్రయోజనాలు! 🪔🍀

కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైన మాసం. ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివారాధనకు అంకితం చేయబడినప్పటికీ, ఆఖరి కార్తీక సోమవారం అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది.

ఈ ఒక్క రోజు నిష్ఠగా వ్రతం ఆచరిస్తే, ఏడాది పొడవునా చేసిన వ్రత ఫలం, కోటి సోమవారాలు చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలంటు స్నానం చేయాలి. కార్తీక మాసంలో నదీ స్నానానికి విశేష ప్రాధాన్యత ఉంది. నదికి వెళ్లలేనివారు ఇంటి వద్దే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం లేదా ఏదైనా పవిత్ర నదీ జలం కలుపుకోవచ్చు. శుభ్రమైన, కొత్త వస్త్రాలు ధరించాలి. సాధ్యమైతే, రోజు మొత్తం నిష్ఠగా ఉపవాసం ఉండటం ఉత్తమం. అలా ఉండలేనివారు పాలు, పండ్లు లేదా అల్పాహారం తీసుకోవచ్చు.

సూర్యాస్తమయం తర్వాత నక్షత్ర దర్శనం అయ్యే వరకు ఆహారం తీసుకోకుండా ఉండటాన్ని 'నక్తం' అంటారు. రాత్రి పూజ పూర్తయ్యాక ఉపవాసాన్ని విరమించాలి. ఇంట్లోని పూజామందిరాన్ని శుభ్రం చేసి, తులసికోట దగ్గర మరియు శివుడి పటాల ముందు దీపారాధన చేయాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి.

365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగించడం ఈ రోజున ప్రత్యేక ఫలాన్ని ఇస్తుంది. ఇది ఏడాది పొడవునా దీపాలు వెలిగించినంత ఫలితం ఇస్తుందని విశ్వాసం. శివలింగానికి పూజ చేయడం ఈ రోజు ప్రధానం. పంచామృతాలతో (పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర) అభిషేకం చేయాలి. గంధపు నీటితో కూడా అభిషేకం చేయవచ్చు. మారేడు దళాలు (బిల్వ పత్రాలు), తెల్లటి పువ్వులు, జిల్లేడు పువ్వులు, అక్షతలతో శివుడిని భక్తితో పూజించాలి. పాయసం లేదా పులిహోర వంటి నైవేద్యాలను సమర్పించాలి. భక్తి శ్రద్ధలతో 'ఓం నమః శివాయ' అనే పంచాక్షరీ మంత్రాన్ని, లేదా శివ అష్టోత్తరం, శివ సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం వల్ల శివానుగ్రహం లభిస్తుంది.

సూర్యాస్తమయం తరువాత వచ్చే ప్రదోష కాలం శివారాధనకు అత్యంత ముఖ్యమైన సమయం. ఈ సమయంలో మరోసారి దీపారాధన చేసి, వీలైతే శివాలయాన్ని సందర్శించి, అక్కడ కూడా దీపాలు వెలిగించాలి. ఆఖరి సోమవారం నాడు 365 మందికి దానధర్మాలు చేయడం వల్ల కూడా ఏడాది పొడవునా చేసిన వ్రత ఫలితం దక్కుతుందని చెబుతారు.

🌹🌹🌹🌹🌹

కార్తీక మాసం 27వ రోజు చేయవలసినవి // Things to do on 27th Day of Kartika Month



https://youtube.com/shorts/wjhtB4t4uxE


🌹 కార్తీక మాసం 27వ రోజు చేయవలసినవి Things to do on 27th Day of Kartika Month 🌹
ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹

కార్తీక పురాణం 27వ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట / Karthika Puranam 27th Chapter Parayan



https://www.youtube.com/watch?v=2u-fMplYtHg


🌹 కార్తీక పురాణం 27వ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట KARTHIKA PURANAM 27th CHAPTER PARAYAN 🌹

ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹




కార్తీక పురాణం - 27 :- 27వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట / Kartika Purana - 27 :- Chapter 27 - Durvasu takes refuge in Ambarish


🌹. కార్తీక పురాణం - 27 🌹
🌻. 27వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌹. Kartika Purana - 27 🌹
🌻. Chapter 27 - Durvasu takes refuge in Ambarish 🌻
📚. Prasad Bharadwaja


మరల అత్రి మహాముని అగస్త్యున కిట్లు వచించెను- కుంభ సంభవా! ఆ శ్రీ హరి దూర్వాసుని యెంతో ప్రేమతో జేరదీసి యింకను ఇట్లు చెప్పెను.

"ఓ దూర్వాస మునీ! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము లెత్తుట కష్టము గాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ యివ్వవలెను. గాన, అందులకు నేనంగగీకరించితిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని యింట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృతుడై ప్రాయోపవేశమొనర్పనెంచినాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని, ప్రజాపీడనము గాదు.

ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించ వలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్దమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని యెప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును, బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టిలాగిన వాడును, కాలితో తన్నినవాడును, విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును, విప్ర పరిత్యాగ మొనరించినవాడును బ్రహ్మహ౦తుకులే అగుదురు.

కాన, ఓ దూర్వాస మహర్షి! అంబరీషుడు నీ గురించి - తపశ్శాలియు, విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణసంకటం పొందుచున్నాడు. అయ్యో! నేను బ్రాహ్మణ హంతకుడనయితినే యని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి, నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీవుభయులకు శాంతి లభించును" అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు బంపెను.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి సప్తవి౦శోధ్యాయము - ఇరవయ్యేడవ రోజు పారాయణము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹కార్తీక మాసం 27వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹
ప్రసాద్‌ భరధ్వాజ


నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, వంకాయ

దానములు:- ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు

పూజించాల్సిన దైవము:- కార్తీక దామోదరుడు

జపించాల్సిన మంత్రము:- ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా

🌹 🌹 🌹 🌹 🌹