తిరుప్పావై పాశురముల తెలుగు భావ గాన మాలిక 1 to 3 / Thiruppavai Pasurams Telugu Bhava Gana Malika 1 to 3



https://youtu.be/9hy3143nNeo


🌹 తిరుప్పావై పాశురముల తెలుగు భావ గాన మాలిక 1 to 3 Thiruppavai Pasurams Telugu Bhava Gana Malika 1 to 3 🌹

తప్పకుండా వీక్షించండి

గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


శ్రీ గోదాదేవీ అష్టోత్తర శతనామావళి Sri Goda devi Ashtottara Shatanamavali




🌹 శ్రీ గోదాదేవీ అష్టోత్తర శతనామావళి Sri Goda devi Ashtottara Shatanamavali 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


ఓం గోదాయై నమః

ఓం రంగానాయక్యై నమః

ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః

ఓం సత్యై నమః

ఓం గోపీవేషధారయై నమః

ఓం దేవ్యై నమః

ఓం భూసుతాయై నమః

ఓం భోగదాయిన్యై నమః

ఓం తులసీవాసజ్ఞాయై నమః

ఓం శ్రీ తన్వీపురవాసిన్యై నమః

ఓం భట్ట నాధప్రియకర్యై నమః

ఓం శ్రీ కృష్ణాయుధ భోగిన్యై నమః

ఓం అముక్త మాల్యదాయై నమః

ఓం బాలాయై నమః

ఓం రంగనాథ ప్రియాయై నమః

ఓం వారాయై నమః

ఓం విశ్వంభరాయై నమః

ఓం యతిరాజ సహోదర్యై నమః

ఓం కలాలాపాయై నమః

ఓం కృష్ణా సురక్తాయై నమః

ఓం సుభగాయై నమః

ఓం దుర్లభశ్రీ సులక్షణాయై నమః

ఓం లక్ష్మీప్రియసఖ్యై నమః

ఓం శ్యామాయై నమః

ఓం ఫల్గుణ్యావిర్భవాయై నమః

ఓం రమ్యాయై నమః

ఓం ధనుర్మాసకృతవృతాయై నమః

ఓం చంపకాశోకపున్నాగ్యై నమః

ఓం మాలా విరాసత్ కచాయై నమః

ఓం అకారత్రయ సంపన్నాయై నమః

ఓం నారాయణ పదాంఘ్రితాయై నమః

ఓం రాజస్తిత మనోరధాయై నమః

ఓం మోక్ష ప్రధాన నిపుణాయై నమః

ఓం మను రక్తాదిదేవతాయై నమః

ఓం బ్రాహ్మన్యే నమః

ఓం లోకజనన్యై నమః

ఓం లీలా మానుషరూపిన్యై నమః

ఓం బ్రహ్మజ్ఞాణ ప్రదాయై నమః

ఓం మాయయై నమః

ఓం సచ్చిదానందవిగ్రహాయై నమః

ఓం మహాపతివ్రతాయై నమః

ఓం విష్ణుగుణకీర్తనలోలుపాయై నమః

ఓం ప్రసన్నార్తిహరాయై నమః

ఓం నిత్యాయై నమః

ఓం వేదసౌధవిహారిన్యై నమః

ఓం రంగనాధమాణిక్య మంజర్యై నమః

ఓం మంజుభూషిన్యై నమః

ఓం పద్మా ప్రియాయై నమః

ఓం పద్మా హస్తాయై నమః

ఓం వేదాంత ద్వయ భోదిన్యై నమః

ఓం సుప్రసన్నాయై నమః

ఓం భగవత్యై నమః

ఓం జనార్ధన దీపికాయై నమః

ఓం సుగందావయవాయై నమః

ఓం చారుమంగళదీపికాయై నమః

ఓం ధ్వజ వజ్రాంకుశాభ్జాంగయ నమః

ఓం మృదుపాదకలామ్జితాయై నమః

ఓం తారకాకారకరాయై నమః

ఓం కూర్మోపమేయపాదోర్ద్వబాగాయై నమః

ఓం శోభన పార్షీకాయై నమః

ఓం వేదార్ధ భావ తత్వ జ్ఞాయై నమః

ఓం లోకారాధ్యాం ఘ్రీపంకజాయై నమః

ఓం పరమాసంకాయై నమః

ఓం కుబ్జాసుధ్వయాడ్యాయై నమః

ఓం విశాలజఘనాయై నమః

ఓం పీనసుశ్రోన్యై నమః

ఓం మణిమేఖలాయై నమః

ఓం ఆనందసాగరా వర్యై నమః

ఓం గంభీరా భూజనాభికాయై నమః

ఓం భాస్వతవల్లిత్రికాయై నమః

ఓం నవవల్లీరోమరాజ్యై నమః

ఓం సుధాకుంభాయితస్థనాయై నమః

ఓం కల్పశాఖానిధభుజాయై నమః

ఓం కర్ణకుండలకాంచితాయై నమః

ఓం ప్రవాళాంగులివిన్య స్తమయై నమః

ఓం హారత్నాంగులియకాయై నమః

ఓం కంభుకంట్యై నమః

ఓం సుచుం బకాయై నమః

ఓం బింబోష్ట్యై నమః

ఓం కుందదంతయుతే

ఓం కమనీయ ప్రభాస్వచ్చయై నమః

ఓం చంపేయనిభనాసికాయై నమః

ఓం యాంచికాయై నమః

ఓం ఆనందార్క ప్రకాశోత్పద్మణి నమః

ఓం తాటంకశోభితాయై నమః

ఓం కోటిసుర్యాగ్నిసంకాశై నమః

ఓం నానాభూషణభూషితాయై నమః

ఓం సుగంధవదనాయై నమః

ఓం సుభ్రవే నమః

ఓం అర్ధచంద్ర లలాటకాయై నమః

ఓం పూర్ణచంద్రాసనాయై నమః

ఓం నీలకుటిలాళకశోబితాయై నమః

ఓం సౌందర్యసీమావిలసత్యై నమః

ఓం కస్తూరితిలకోజ్వలాయై నమః

ఓం దగద్దకాయమనోధ్యత్ మణినే నమః

ఓం భూషణ రాజితాయై నమః

ఓం జుజ్వల్యమానసత్రరత్నదేవ్యకుటావతం సకాయై నమః

ఓం ఆత్యర్కానల తేజస్విమణీంకంజుకదారిన్యై నమః

ఓం నానామణిగణాకీర్ణకాంచనాంగదభూషితాయై నమః

ఓం కుకుంమాగరుకస్తూరీదివ్య చందన చర్చితాయై నమః

ఓం సోచితోజ్వల విధ్తోతవిచిత్రై నమః

ఓం శుభహారిణ్యై నమః

ఓం సర్వావయ వభూషణాయై నమః

ఓం శ్రీ రంగనిలయాయై నమః

ఓం పూజ్యాయై నమః

ఓం దివ్య దేవిసుసేవితాయై నమః

ఓం శ్రీ మత్యైకోతాయై నమః

ఓం శ్రీ గోదాదేవ్యై నమః



ఇతి శ్రీ గోదాదేవి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

🌹🌹🌹🌹🌹

శ్రీ రంగనాథ అష్టోత్తరశతనామావళి Ranganatha Ashtottara Shatanamavali



🌹 శ్రీ రంగనాథ అష్టోత్తరశతనామావళి Ranganatha Ashtottara Shatanamavali 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


ఓం శ్రీరంగశాయినే నమః |

ఓం శ్రీకాన్తాయ నమః |

ఓం శ్రీప్రదాయ నమః |

ఓం శ్రితవత్సలాయ నమః |

ఓం అనన్తాయ నమః |

ఓం మాధవాయ నమః |

ఓం జేత్రే నమః |

ఓం జగన్నాథాయ నమః |

ఓం జగద్గురవే నమః | ౯

ఓం సురవర్యాయ నమః |

ఓం సురారాధ్యాయ నమః |

ఓం సురరాజానుజాయ నమః |

ఓం ప్రభవే నమః |

ఓం హరయే నమః |

ఓం హతారయే నమః |

ఓం విశ్వేశాయ నమః |

ఓం శాశ్వతాయ నమః |

ఓం శంభవే నమః | ౧౮

ఓం అవ్యయాయ నమః |

ఓం భక్తార్తిభంజనాయ నమః |

ఓం వాగ్మినే నమః |

ఓం వీరాయ నమః |

ఓం విఖ్యాతకీర్తిమతే నమః |

ఓం భాస్కరాయ నమః |

ఓం శాస్త్రతత్త్వజ్ఞాయ నమః |

ఓం దైత్యశాస్త్రే నమః |

ఓం అమరేశ్వరాయ నమః | ౨౭

ఓం నారాయణాయ నమః |

ఓం నరహరయే నమః |

ఓం నీరజాక్షాయ నమః |

ఓం నరప్రియాయ నమః |

ఓం బ్రహ్మణ్యాయ నమః |

ఓం బ్రహ్మకృతే నమః |

ఓం బ్రహ్మణే నమః |

ఓం బ్రహ్మాంగాయ నమః |

ఓం బ్రహ్మపూజితాయ నమః | ౩౬

ఓం కృష్ణాయ నమః |

ఓం కృతజ్ఞాయ నమః |

ఓం గోవిందాయ నమః |

ఓం హృషీకేశాయ నమః |

ఓం అఘనాశనాయ నమః |

ఓం విష్ణవే నమః |

ఓం జిష్ణవే నమః |

ఓం జితారాతయే నమః |

ఓం సజ్జనప్రియాయ నమః | ౪౫

ఓం ఈశ్వరాయ నమః |

ఓం త్రివిక్రమాయ నమః |

ఓం త్రిలోకేశాయ నమః |

ఓం త్రయ్యర్థాయ నమః |

ఓం త్రిగుణాత్మకాయ నమః |

ఓం కాకుత్స్థాయ నమః |

ఓం కమలాకాన్తాయ నమః |

ఓం కాళీయోరగమర్దనాయ నమః |

ఓం కాలామ్బుదశ్యామలాంగాయ నమః | ౫౪

ఓం కేశవాయ నమః |

ఓం క్లేశనాశనాయ నమః |

ఓం కేశిప్రభంజనాయ నమః |

ఓం కాన్తాయ నమః |

ఓం నన్దసూనవే నమః |

ఓం అరిన్దమాయ నమః |

ఓం రుక్మిణీవల్లభాయ నమః |

ఓం శౌరయే నమః |

ఓం బలభద్రాయ నమః | ౬౩

ఓం బలానుజాయ నమః |

ఓం దామోదరాయ నమః |

ఓం హృషీకేశాయ నమః |

ఓం వామనాయ నమః |

ఓం మధుసూదనాయ నమః |

ఓం పూతాయ నమః |

ఓం పుణ్యజనధ్వంసినే నమః |

ఓం పుణ్యశ్లోకశిఖామణయే నమః |

ఓం ఆదిమూర్తయే నమః | ౭౨

ఓం దయామూర్తయే నమః |

ఓం శాంతమూర్తయే నమః |

ఓం అమూర్తిమతే నమః |

ఓం పరస్మై బ్రహ్మణే నమః |

ఓం పరస్మై ధామ్నే నమః |

ఓం పావనాయ నమః |

ఓం పవనాయ నమః |

ఓం విభవే నమః |

ఓం చంద్రాయ నమః | ౮౧

ఓం ఛన్దోమయాయ నమః |

ఓం రామాయ నమః |

ఓం సంసారామ్బుధితారకాయ నమః |

ఓం ఆదితేయాయ నమః |

ఓం అచ్యుతాయ నమః |

ఓం భానవే నమః |

ఓం శంకరాయ నమః |

ఓం శివాయ నమః |

ఓం ఊర్జితాయ నమః | ౯౦

ఓం మహేశ్వరాయ నమః |

ఓం మహాయోగినే నమః |

ఓం మహాశక్తయే నమః |

ఓం మహత్ప్రియాయ నమః |

ఓం దుర్జనధ్వంసకాయ నమః |

ఓం అశేషసజ్జనోపాస్తసత్ఫలాయ నమః |

ఓం పక్షీన్ద్రవాహనాయ నమః |

ఓం అక్షోభ్యాయ నమః |

ఓం క్షీరాబ్ధిశయనాయ నమః | ౯౯

ఓం విధవే నమః |

ఓం జనార్దనాయ నమః |

ఓం జగద్ధేతవే నమః |

ఓం జితమన్మథవిగ్రహాయ నమః |

ఓం చక్రపాణయే నమః |

ఓం శంఖధారిణే నమః |

ఓం శార్ఙ్గిణే నమః |

ఓం ఖడ్గినే నమః |

ఓం గదాధరాయ నమః | ౧౦౮


ఇతి శ్రీ రంగనాథ అష్టోత్తరశతనామావళిః సంపూర్ణం ||

🌹🌹🌹🌹🌹


Dhanurmasam Special - Sri Vishnu Das Avatar



https://youtube.com/shorts/MzkkF-UHiyo


🌹 DHANURMASAM special శ్రీ విష్ణవు దశావతారాలు యధాయధాహి ధర్మస్య సంభవామి యుగేయుగే Sri Vishnu Das avatar 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

Dhanurmasam - గోదాదేవి వ్రతం, మార్గళి వ్రతం, శ్రీవ్రతం, కాత్యాయని వ్రతం - గోదాదేవి కళ్యాణం - వైకుంఠ ఏకాదశి పర్వదినాల మాసం ధనుర్మాసం, ధను సంక్రాంతి శుభాకాంక్షలు


🌹 గోదాదేవి వ్రతం, మార్గళి వ్రతం, శ్రీవ్రతం, కాత్యాయని వ్రతం - గోదాదేవి కళ్యాణం - వైకుంఠ ఏకాదశి పర్వదినాల మాసం ధనుర్మాసం, ధను సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ



ఓం శ్రీ రంగనాథాయ నమః

ఓం గోదాయై నమః


🌿 విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు వైష్ణవ ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో రంగనాథుడిని పరమభక్తితో సేవించడం ద్వారా గోదాదేవి ఆయనను వరించి, తన భక్తిని చాటుకుంది. సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ఈనెలలోనే ప్రవేశిస్తాడు. నిత్యం తిరుప్పావై పారాయణం చేస్తూ విష్ణుమూర్తిని, శ్రీ కృష్ణుని తులసి ఆకులతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ప్రత్యేక పూజలు చేయడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరతాయని అలాగే సంపద, ఆరోగ్యం, మోక్షం లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతం ముఖ్యమైనదని పురోహితులు చెబుతున్నారు. ఈ వ్రతం సందర్భంగా నెలరోజుల పాటు రోజుకో పాశురం చొప్పున విన్నపం చేస్తారు. విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి గోదాదేవి రోజుకో రీతిలో తిరుప్పావై పాశురాలను ఆలపించింది. ఒకటి నుంచి ఐదు రోజులు నియమ నిబంధనలకు సంబంధించిన పాశురాలు, 6వ రోజు నుంచి 15వ రోజు వరకు పాశురాలలో తన తోటి చెలికత్తెలను నిద్రలేపి సందగోపుని గృహానికి వెళ్లడం. 16, 17, 18వ రోజుల్లో పాశురాలలో నందగోపుడు, యశోద, బలరాములను మేల్కొలపడం, 23వ రోజు పాశురంలో మంగళాశాసనం, 25, 26వ రోజుల్లో స్వామికి అలంకారాలైన ఆయుధాలను 'పర' అనే వాయిద్యాన్ని తమ శరణాగతిని అనుగ్రహించి, తమ సంకల్పాన్ని నేరవేర్చమని ప్రార్థిస్తారు. చివరి రోజు గోదారంగనాథుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ధనుర్మాసం మొత్తం నిత్యం ప్రతి ఇంటి ముందు కళ్లాపు చల్లి అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి గోదాదేవి, లక్ష్మీదేవి, గౌరీమాతగా భావిస్తారు. గోవుపేడతో పేడతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గుల మధ్యలో ఉంచుతారు. 🌿


🍀 1.పాశురము 🍀

మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్

నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్

శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్

కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్

ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్

కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్

నారాయణనే నమక్కే పఱై దరువాన్

పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !

భావము - సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా~ మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరిమును, చంద్రునివలె ఆహ్లాదకరుడును, సూర్యునివలె తేజోమయుడును యైన నారాయణునే తప్పు, యితరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ యీ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగ దాని కంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల వారందరును ఆలసింపక శ్రీఘ్రముగ రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను ఆహ్వానించు చున్నది.


🍁 ధనుర్మాసంలో విశిష్టమైన రోజులు 🍁

2025, డిసెంబరు 24వ తేదీన వేశేష ధూప్‌ సేవ(తూమని మాడత్తు)

డిసెంబరు 30వ తేదీన వైకుంఠ ఏకాదశి (ఉత్తరద్వార దర్శనం)


2026, జనవరి 3వ తేదీన విశేష దీపాలంకరణ సేవ(కుత్తు విళక్కెరియ)

జనవరి 8వ తేదీన పొన్నాకుల హారతి (అన్జు ఇవ్వులగం)


జనవరి 11వ తేదీన విశేష ప్రసాద సేవ (కూడారై వెల్లుం)

జనవరి 14వ తేదీన భోగి రోజున పూలంగి సేవ, శ్రీగోదారంగనాథుల కల్యాణం

🌹 🌹 🌹 🌹 🌹

ధనుర్మాసం విశిష్టత - Significance of Dhanurmasam



https://youtu.be/_er39Yddgo4


🌹 ధనుర్మాసం విశిష్టత - DHANURMASAM SIGNIFICANCE - గోదాదేవి వ్రతం, మార్గళి వ్రతం, శ్రీవ్రతం, కాత్యాయని వ్రతం - గోదాదేవి కళ్యాణం - వైకుంఠ ఏకాదశి పర్వదినాల మాసం 🌹

ప్రసాద్ భరద్వాజ


🍀 సూర్యుడు ధనస్సు రాశిలో సంచరిస్తాడు కాబట్టి ఈ నెలను ధనుర్మాసం అంటారు. దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణం ప్రారంభానికి మధ్య ఉండే నెలరోజులని ధనుర్మాసము అంటారు. ఈ నెల రోజులు తెల్లవారుజామున కాలం అత్యంత పవిత్రమైనది. ధను అంటే ఏదో ఒకదాని కోసం ప్రార్థించడం. ఈ నెల రోజులూ ఆండాళమ్మ పూజ, తిరుప్పావై , గోదాకళ్యాణం, వైకుంఠద్వార దర్శనం, గబ్బెమ్మలను పెట్టడం, విష్ణు, లక్ష్మీ పూజలు చేస్తారు. ఈ నెలరోజులు విష్ణు ఆలయాల్లో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. 🍀

ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


ధను సంక్రాంతి ప్రాముఖ్యత. Significance of Dhanu Sankranti



https://youtu.be/lQES5Sj9jzE


🌹 ధను సంక్రాంతి ప్రాముఖ్యత. DHANU SANKRANTHI SIGNIFICANCE ప్రతికూల శక్తులు తొలగి, సుఖశాంతులు, సంపద వృద్ధి కొరకు చేయవలసిన విధులు. 🌹

🍀 ధను సంక్రాంతి అనేది కొత్త ఆధ్యాత్మిక మాసం ప్రారంభాన్ని సూచిస్తుంది. సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించడాన్ని ధను సంక్రాంతి అంటారు. ఈ రోజు నుంచే పవిత్రమైన ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అగ్నితత్వ రాశి అయిన ధనుస్సులోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఈ రోజు సూర్య ఆరాధనతో ఆరోగ్యం, మానసిక బలం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగుపడతాయి. సూర్య దోషాలతో బాధపడేవారికి లేదా ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నవారికి ఇది అత్యంత శుభప్రదమైన దినం. 🍀

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


నమస్తేస్తు మహామాయే భగవన్ విశ్వేశ్వరాయ - మహా శక్తివంతమైన పరమ శివ మంత్రం. Bhagawan Visweswaraya (Consort Of Bhagawan Visweswara)



🌹 నమస్తేస్తు మహామాయే భగవన్ విశ్వేశ్వరాయ - మహా శక్తివంతమైన పరమ శివ మంత్రం. BHAGAVAN VISWESWARAYA 🌹

https://youtube.com/shorts/wsweeADn4Qg


ప్రసాద్‌ భరధ్వాజ


Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

శ్రీ రుద్రాష్టకమ్ - తాత్పర్యం - స్తోత్రం Sri Rudrashtakam - Meaning



🌹 శ్రీ రుద్రాష్టకమ్ - తాత్పర్యం - స్తోత్రం SRI RUDRASHTAKAM - MEANING 🌹

గానం, స్వరకర్త, ప్రచురణ : ప్రసాద్‌ భరధ్వాజ

https://youtu.be/DIxvtixbZbw


🔱 సర్వ పాపాలను నశింప చేసి కార్యసిద్ధిని, మోక్షార్షతను కలిగించే శ్రీ తులసీదాస్ అద్భుత భక్తి స్తోత్రము. పరమ శివుని ప్రీతి కొరకు బ్రాహ్మణుడైన తులసీదాసు చెప్పిన ఈ రుద్రాష్టకం భక్తితో పఠించిన జనులకు ఆ పరమ శివుని అనుగ్రహం కలుగును. 🔱

🌹🌹🌹🌹🌹



సఫల ఏకాదశి విశిష్టత. డిసెంబర్‌,15, 2025 Saphala Ekadashi Speciality. December, 15, 2025


🌹 సఫల ఏకాదశి విశిష్టత. డిసెంబర్‌ 15, తిథి ప్రారంభం, ముగింపు.. చదవాల్సిన మంత్రాలు 🌹
ప్రసాద్ భరద్వాజ


మార్గశిర మాసం కృష్ణపక్షంలో వచ్చే సఫల ఏకాదశి తిథిని, ఆ రోజున ఆచరించే వ్రతాన్ని చాలా ఫలవంతమైనదిగా పరిగణిస్తారు.


ముఖ్యంగా ఏదైనా రంగంలో విజయం సాధించాలనుకునే వాళ్లు ఈ సఫల ఏకాదశి తిథి రోజున చేసే పరిహారాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయని చెబుతారు. ఈ సఫల ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిని ఆరాధించడం శుభప్రదం. ప్రతి ఏడాది మార్గశిర మాసంలో కృష్ణ పక్షంలో ఏకాదశి రోజున ఈ సఫల ఏకాదశిని జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో సఫల ఏకాదశి 2025 తేదీ తిథి ప్రారంభం, పాటించాల్సిన పరిహారాలు వంటి విషయాలను తెలుసుకుందాం..

సఫల ఏకాదశి 2025 తిథి

ఈ ఏడాది పవిత్రమైన సఫల ఏకాదశి తిథి డిసెంబర్ 14వ తేదీ రాత్రి 8.46 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 15వ తేదీ రాత్రి 10.09 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం డిసెంబర్ 15వ తేదీన సఫల ఏకాదశి ఉపవాసం ఆచరిస్తారు. మరుసటి రోజు అంటే డిసెంబర్ 16వ తేదీన ఉపవాసం విరమించాలి. ఎందుకంటే ఈరోజు ద్వాదశితో కూడిన ఏకాదశి. ఏకాదశి లేదా ద్వాదశి తిథి ఉండే రోజున ఏకాదశి ఉపవాసం చేయవచ్చు. అలా కాకుండా ఏకాదశి, ద్వాదశితో పాటు త్రయోదశి కలయిక కూడా ఉంటే అత్యంత శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. కానీ దశమి తిథితో కూడిన ఏకాదశి రోజున ఏకాదశి ఉపవాసం పాటించరు.


🍀 సఫల ఏకాదశి విశిష్టత 🍀

సఫల ఏకాదశి వ్రతం గురించి పద్మ పురాణంలో వివరంగా వర్ణించబడి ఉంటుంది. శివుడు స్వయంగా పార్వతీదేవికి ఈ సఫల ఏకాదశి విశిష్టతను తెలిపినట్లు పద్మ పురాణం చెబుతుంది. అలాగే శ్రీకృష్ణుడు పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యాన్ని వివరించినట్లుగా మహాభారతంలో ప్రస్తావించబడి ఉంది. మార్గశిర మాసం అత్యంత పవిత్రమైన మాసం. ఈ మార్గశిర మాసంలో భగవంతుడికి చేసే పూజలు, ఆచరించే ఉపవాసాలు, దానధర్మాలు విశిష్టమైన ఫలితాలను ప్రసాదిస్తాయని శాస్త్రవచనం.

సఫల ఏకాదశి రోజు నియమ నిష్ఠలతో ఉపవాసం ఉండి జాగరణ చేసి శ్రీమహావిష్ణువును పూజించడం ద్వారా సకల పాపాలు నశిస్తాయని విశ్వాసం. అంతే కాకుండా ఆత్మ శుద్ధి కూడా కలుగుతుందట. పవిత్రమైన సఫల ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువును ఉసిరి కాయలతో, దానిమ్మ పండ్లతో పూజిస్తే సకల సంపదలు, సౌభాగ్యం, ఐశ్వర్యం చేకూరుతుందని చెబుతారు. అంతే కాకుండా ఈ సఫల ఏకాదశి రోజున ఆలయాల్లో దీపాలు వెలిగించి జాగరణ చేస్తే ఎన్నో ఏళ్ల పాటు తపస్సు చేసిన ఫలితం దక్కుతుందట. దీనికి సమానమైన యజ్ఞం లేదా తీర్థం లేవని శాస్త్రాలు చెబుతున్నాయి.

సఫల ఏకాదశి రోజు చదవాల్సిన మంత్రాలు


ఓం నమో నారాయణాయ

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్

ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః

🌹🌹🌹🌹🌹

మీలోని శక్తి శుద్ధికి రోజుకు కేవలం 2 నిమిషాలు కేటాయించి ఇంట్లోని Dedicate just 2 minutes a day to purify your inner energy at home.


🌹 మీలోని శక్తి శుద్ధికి రోజుకు కేవలం 2 నిమిషాలు కేటాయించి ఇంట్లోని ఈ 3 అదృశ్య శక్తులను బలోపేతం చేయండి. 🌹

ప్రసాద్ భరద్వాజ


ప్రతి ఇంట్లో మూడు అదృశ్య శక్తులు ఉంటాయి, ఇవి మన సుఖం, శ్రేయస్సు మరియు శాంతికి మూలం. కులదేవత, పితృ దేవతలు మరియు ఇష్ట దేవత ఈ ముగ్గురిని ప్రసన్నం చేసుకుంటే, జీవితంలో సుఖమే సుఖం ఉంటుంది అని శాస్త్రాలలో చెప్పబడింది.

ప్రజలు తమ సమస్యల నుండి విముక్తి కోసం జ్యోతిష్యం, వాస్తు లేదా గురువులు మరియు తాంత్రికుల సహాయం తీసుకుంటారు, కానీ అసలు విషయంపై దృష్టి పెట్టరు. మీరు రోజంతా కేవలం 2 నిమిషాలు కులదేవత, పితృ దేవతలు మరియు ఇష్ట దేవత నామం తీసుకుంటే, మీరు అనేక రకాల సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. శాస్త్రీయ దృక్కోణం నుండి కులదేవత, పితృ దేవతలు మరియు ఇష్ట దేవత ఈ ముగ్గురూ జీవితానికి మూడు వేర్వేరు ఆధార స్తంభాలుగా పరిగణించబడ్డారు, వీరి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇంట్లో ఉన్న మూడు అదృశ్య శక్తి స్తంభాల గురించి తెలుసుకుందాం…


1. కులదేవత లేదా వంశ దేవత

కులదేవత మీ వంశాన్ని రక్షించే శక్తి. మనం ఎంత ఆధునికులమైనప్పటికీ, మన ఆత్మ మన వంశం యొక్క శక్తితో ముడిపడి ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీ వంశ స్థానం లేదా వంశ దేవత ఆలయానికి వెళ్లి శ్రద్ధతో నమస్కరించకపోతే, మీ శక్తి మూలం తెగిపోయిందని భావించండి. వంశదేవత సంతోషంగా ఉంటే ఇంట్లో భద్రత, స్థిరత్వం మరియు సమతుల్యత ఉంటాయి. కులదేవత కోపంగా ఉంటే ఇంట్లో గొడవలు, అనారోగ్యాలు మరియు వైఫల్యాలు పెరుగుతాయి. కులదేవతను వంశానికి మూలంగా పరిగణిస్తారు, మూలం బలంగా ఉంటే వృక్షం (జీవితం) స్థిరంగా ఉంటుంది.


2. పితృ దేవతలు

పితృ దేవతలు మనకు ఉనికిని ఇచ్చినవారు. మన శరీరం, సంస్కారం మరియు ప్రతి శ్వాస వారి ఆశీర్వాదంతో ముడిపడి ఉన్నాయి. నేటి కాలంలో చాలా మంది పితృ తర్పణాన్ని తరచుగా నిర్లక్ష్యం చేస్తారు, దీని కారణంగా ఇంట్లో అశాಂತಿ, ఆర్థిక అడ్డంకులు మరియు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. శాస్త్రాలలో చెప్పబడింది, పితృ దోషం ఉంటే ఏ పూజ కూడా ఫలించదు. కాబట్టి రోజూ ఉదయం మనం మన పితృ దేవతలకు కృతజ్ఞతలు తెలియజేయాలి. దేవతలు సంతోషంగా ఉన్నా లేకపోయినా, పితృ దేవతలు అసంతృప్తిగా ఉంటే జీవితం కష్టమయంగా ఉంటుంది అనేది శాస్త్రీయ నమ్మకం.


3. ఇష్ట దేవత లేదా ఆరాధ్య దేవత

ఇష్ట దేవత లేదా ఆరాధ్య దైవం మన ఆత్మకు రక్షకులు. ప్రతి ఒక్కరికీ ఇష్ట దైవం వేరే ఉంటుంది. కొందరు రాముడిని, కొందరు మహాదేవుడిని, మరికొందరు దుర్గా మాతను తమ ఇష్ట దైవంగా భావిస్తారు. మనం రోజూ వారికి నమస్కరించి నప్పుడు, మనస్సు స్థిరంగా ఉంటుంది, నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి మరియు సంబంధాలలో కరుణ ఉంటుంది. శాస్త్రీయ దృక్కోణం ప్రకారం, ఇష్ట దేవతను ఆరాధించడం వల్ల గ్రహ దోషాలు వాటంతట అవే శాంతిస్తాయి, మనస్సు స్థిరంగా ఉంటుంది మరియు నిర్ణయ శక్తి పెరుగుతుంది. ఇష్ట దేవత ఆత్మకు స్నేహితులు, వారితో మీ ఆత్మకు సహజమైన, స్వాభావిక సంబంధం ఉంటుంది.

ప్రతిరోజూ వారితో ఈ మాట చెప్పండి. అందుకోసం ఉదయం, సాయంత్రం కేవలం 2 నిమిషాలు కేటాయించి మనసులో ఇలా చెప్పుకోవాలి.

"హే నా వంశదేవతా, నా వంశాన్ని, కులాన్ని రక్షించు. హే పితృ దేవా, నా కర్మ మార్గాన్ని ప్రకాశింపజేయి. హే నా ఇష్ట ఆరాధ్య దేవా, నా మనస్సును శాంతపరచు."

ఇదే మీలోని శక్తి శుద్ధికి అత్యంత శక్తివంతమైన మార్గం. ఈ మూడు అదృశ్య శక్తులే మీ జీవితానికి అసలైన మూల శక్తి స్తంభాలు.

శుభమస్తు.

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹


త్రిగుణముల తత్త్వ రహస్య గీతం The Mystery of Three Gunaas



https://youtu.be/qFxQNnT4VGM


🌹 🎵 3. త్రిగుణముల తత్త్వ రహస్య గీతం The Mystery of Three Gunaas 🌹

🍀 ఓ పరమేశ్వరా! నీ తత్త్వమే సత్య భోధన .. 🍀


రచన, స్వరకర్త, ప్రచురణ : ప్రసాద్ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀




అదిగో ఆదిత్యడు సప్తాశ్వ శోభితుడు - ఆదిత్య రూప నారాయణ సూర్యనారాయణా Aditya Rupa Surya Narayana



https://youtube.com/shorts/ZunDKDI0eMA


🌹 అదిగో ఆదిత్యడు సప్తాశ్వ శోభితుడు ఆదిత్య రూప నారాయణ సూర్యనారాయణా Aditya Rupa Surya Narayana 🌹


ప్రసాద్‌ భరధ్వాజ


Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

నమో భగవతే దత్తాత్రేయ స్మరణ మాత్రమున సంతుష్టాయ 'Namo Bhagavathe Dattatreya' (a devotional YouTube Short)




https://youtube.com/shorts/Kg4iMWfcUyw


🌹 నమో భగవతే దత్తాత్రేయ స్మరణ మాత్రమున సంతుష్టాయ Namo Bhagavathe Dattatreya దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు 🌹

ప్రసాద్‌ భరధ్వాజ



Like, Subscribe and Share


https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹


శ్రీ దత్తాత్రేయ స్తోత్రం - సర్వ కష్టాల నివారణకు - Sri Dattatreya Stotram For Removal of All Obstacles



https://youtube.com/shorts/LsjW9iImWhc


🌹 శ్రీ దత్తాత్రేయ స్తోత్రం - సర్వ కష్టాల నివారణకు - SRI DATTATREYA STOTRAM FOR ALL OBSTACLES REMOVAL 🌹

తప్పక వీక్షించండి

🍀 మార్గశీర్ష పూర్ణిమ దత్తాత్రేయ జయంతి, కోరల పూర్ణిమ. ఈ పౌర్ణమి నాడు దత్తుని పాలతో అభిషేకించి దత్త స్తోత్రం చదువుకుని, మనస్సులోని కోరికలను ఆయనకు తెలియజేస్తే విజయమును చేకూర్చుతాడు. శ్రీ దత్తడుని తలచి ఆయురారోగ్యములను, స్మరించి భోగభాగ్యములను పొందగలము. 🍀

ప్రసాద్‌ భరధ్వాజ



Like, Subscribe and Share


https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹



శ్రీ దత్తాత్రేయ స్వామి విశిష్టత - దత్త జయంతి - కోరల పౌర్ణమి విశిష్టత - విధానము Dattatreya Jayanthi - Korala Purnima Significance



https://youtu.be/dS-eUPJGPM8


🌹 శ్రీ దత్తాత్రేయ స్వామి విశిష్టత - దత్త జయంతి - దత్తాత్రేయ అష్టచక్రబీజ స్తోత్రం - కోరల పౌర్ణమి విశిష్టత - విధానము DATTATREYA JAYANTHI - KORALA PURNIMA SIGNIFICANCE 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

తప్పక వీక్షించండి



🍀 మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడు అత్రి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరప్రభావం వల్ల దత్తుడు జన్మించాడు కనుక ఈ పౌర్ణమిని దత్త జయంతిగా జరుపుకుంటాము. నేడు దత్తుని విశిష్టత తెలుసుకోవడం, ఆయనను స్మరించడం సాధకులకు ఎంతో విశేషమైన ఫలితాలను ఇస్తుంది. శ్రీ మహావిష్ణువు ఇరవై ఒక్క అవతారాల్లో దత్తావతారం ఆరోదని భాగవత పురాణం చెబుతోంది. దత్తరూపం అసామాన్యమైంది. త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్త్వాలు మూర్తీభవించి, ఆవిర్భవించినదే దత్తావతారం. శ్రీ దత్తాత్రేయుడు జ్ఞానయోగనిధి, విశ్వగురువు, సిద్ధసేవితుడు. ‘శ్రీదత్తా’ అని స్మరించినంతనే మన మనస్సులోని కోర్కెలు తీర్చునని శ్రుతి తెలుపుచున్నది. సర్వజీవులకు జ్ఞానబోధ గావించుట, జ్ఞానమయము, ప్రేమ సత్యానందమయము, ధర్మమయమూ తరింప జేయుటయే దత్తమూర్తి అవతార కార్యక్రమము. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః 🍀

ప్రసాద్‌ భరధ్వాజ



Like, Subscribe and Share
https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹

శ్రీ దత్తాత్రేయ జయంతి, శ్రీ అన్నపూర్ణ జయంతి, కోరల పౌర్ణమి శుభాకాంక్షలు, Greetings on Sri Dattatreya Jayanti, Sri Annapurna Jayanti Korala Pournami



🌹. శ్రీ దత్తాత్రేయ జయంతి, శ్రీ అన్నపూర్ణ జయంతి, కోరల పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి, Sri Dattatreya Jayanti, Sri Annapurna Jayanti Korala Pournami Greetings to All 🌹

4 December 2025

ప్రసాద్‌ భరధ్వాజ


🍀 దత్తాత్రేయ జయంతి విశిష్టత 🍀


దత్తాత్రేయని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు. ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది. అత్రి మహాముని, మహా పతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు. ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి. అందునా దత్తాత్రేయుడు విష్ణువు అంశతో, చంద్రుడు బ్రహ్మ అంశతో, దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం.

దత్త జయంతి రోజున తెల్లవారు జామునే భక్తులు నదీస్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జప ధ్యానాలకు ఈ రోజు ప్రాముఖ్యం ఇస్తారు. దత్తాత్రేయుని యోగమార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. దత్త చరిత్ర, గురు చరిత్ర, అవధూత గీత, జీవన్ముక్త గీత, శ్రీపాదవల్లభ చరిత్ర, నృసింహ సరస్వతి చరిత్ర, శ్రీదత్త దర్శనం వంటివి పారాయణ చేస్తారు. దత్తుని విశిష్టతను స్మరించుకుంటారు. ఈ రోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే. సాయం వేళలో భజనలు చేస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కురుపురం, తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం శ్రీపాద వల్లభ అవతారానికి సంబంధించిన ప్రదేశాలు. అవధూత దత్త పీఠం వారి ఆధ్వర్యంలో కూడా కొన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్నాయి వాటిలో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి.


🍀 కోరల పౌర్ణమి విశిష్టత 🍀

హిందూ పురాణాల ప్రకారం, కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడట! దీని అర్థం- ఈ సమయంలో యముడు భూలోకంలోని భక్తులపై కరుణ చూపుతాడని, వారి కర్మ ఫలాలను పక్కకు నెట్టి, సకల వ్యాధులు, అనారోగ్య సమస్యలను తన కోరల శక్తితో తొలగిస్తాడని ప్రగాఢ నమ్మకం. ఈ అపమృత్యు భయాన్ని తొలగించినందుకు కృతజ్ఞతగా మార్గశిర పౌర్ణమి రోజున యమధర్మరాజును ప్రత్యేకంగా పూజిస్తారు.

కోరల పౌర్ణమి రోజున ఆచరించాల్సిన అత్యంత విశేషమైన ఆచారం ఒకటుంది. ఆ రోజున మినప రొట్టెలు (కుడుములు) తయారుచేసి, ఆ నైవేద్యాన్ని తల్లి కోరలమ్మకు సమర్పిస్తారు. ఆ తర్వాత, ఆ రొట్టెలో నుంచి ఒక చిన్న ముక్కను కొరికి, శునకాలకు వేస్తారు.శునకం సాక్షాత్తు కాలభైరవుడి వాహనం. యమధర్మరాజుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే, శునకానికి నైవేద్యం పెట్టడం ద్వారా కాలభైరవుడి అనుగ్రహం లభించి, సమస్త దరిద్రాలు, దోషాలు నివారించ బడతాయి అని అంటారు.

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ గౌరీశా విఘ్నేశా గజాననా Sri Gourisha Vignesha (a YT Short)



https://youtube.com/shorts/39t5eIANxUc


🌹 శ్రీ గౌరీశా విఘ్నేశా గజాననా  Sri Gourisha Vignesha 🌹

ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share


https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


శ్రీ హనుమద్ వ్రతం - పూజా విధానం - వ్రత కధ | Hanuman Vratam / Pooja Vidhanam / Vrata Katha - Wed., December 3, 2025, Margasira Shukla Paksha, Trayodashi



https://youtu.be/WxhJRlB3jWc


🌹శ్రీ హనుమద్ వ్రతం - పూజా విధానం - వ్రత కధ | Hanuman Vratam / Pooja Vidhanam / Vrata Katha డిసెంబర్ 3 బుధవారం 2025, మార్గశిర శుక్లపక్షం, త్రయోదశి 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹Shri Hanumad Vratam - Pooja Method - Vrata Katha | Hanuman Vratam / Pooja Vidhanam / Vrata Katha Wednesday, December 3, 2025, Margasira Shukla Paksha, Trayodashi 🌹
Prasad Bharadwaja


🍀 శ్రీ రాముడు, పాండవులు చేసిన సకల కార్య సిద్ధిని విజయాలను ప్రసాదించే మహోత్రుష్టమైన వ్రతం - హనుమంతుని అనుగ్రహం, శత్రుజయం, కార్యజయం తథ్యం 🍀
🍀 A great auspicious fast that bestows the success and fulfillment of all the deeds done by Lord Rama and the Pandavas - Hanuman's grace, victory over enemies, victory over work 🍀


🔥 హనుమద్ వ్రతం హనుమద్ వ్రతం ఎందుకు చేస్తారు - విశిష్టత 🔥
🔥 Hanumad Vratam Why is Hanumad Vratam performed - Special features 🔥


🌻 పరాశర సంహిత దీని గురించి చెప్పింది. పదమూడు క్షేత్రములున్నాయి. వాటిని హనుమత్ పీఠములు అని పిలుస్తారు. వాటిలో పంపాతీరం ఒక పీఠం. వ్యాస మహర్షి ఒకసారి ద్వైతవనంలో వున్న పాండవుల దగ్గరకు వచ్చాడు. ధర్మరాజు, భార్య ద్రౌపదితో, సోదరులు సహా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు యిచ్చి భక్తిశ్రద్ధలతో సేవించాడు. వ్యాసుడు సంతోషించి ద్రౌపది పాతివ్రత్యాన్ని మెచ్చాడు. అందరు భక్తీ శ్రద్ధలతో చేయవలసిన వ్రతం వుందని దాన్ని వివరించాడు. అది కార్య సిద్ధిని కలిగిస్తుందనీ , వెంటనే ఫలితం లభిస్తుందని చెప్పాడు. అదే శ్రీ హనుమద్ వ్రతం. దుష్ట గ్రహాల్ని, వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలు, శ్రేయస్సు ఇస్తుందని దాన్ని ఆచరించి మళ్ళీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు. పూర్వం ఈ వ్రతాన్ని శ్రీ కృష్ణుడు ద్రౌపదికి బోధించి , దగ్గర వుండి వ్రతం చేయించాడని దాని ప్రభావం వల్లనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్పాడు. కనుక ఇప్పటికీ మార్గశీర్ష మాసంలో శుద్ధ త్రయోదశి తిథి నాడు హనుమద్ వ్రతమును చేస్తారు. 🌻

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹


శ్రీ హనుమద్ వ్రతం - Hanuman Vratam - Wednesday, December 3, 2025, Margasira Shukla Paksha, Trayodashi

🌹శ్రీ హనుమద్ వ్రతం - Hanuman Vratam డిసెంబర్ 3 బుధవారం 2025, మార్గశిర శుక్లపక్షం, త్రయోదశి 🌹

🔥 హనుమద్ వ్రతం ఎందుకు చేస్తారు - విశిష్టత 🔥

ప్రసాద్ భరద్వాజ



పరాశర సంహిత దీని గురించి చెప్పింది. పదమూడు క్షేత్రములున్నాయి. వాటిని హనుమత్ పీఠములు అని పిలుస్తారు. వాటిలో పంపాతీరం ఒక పీఠం. చంద్రవంశంలో సోమదత్తుడు అనే ఒక రాజు జన్మించాడు. ఆయనకి రాజ్య భ్రష్టత్వము వచ్చింది. ఆ కాలంలో అప్పటికప్పుడు విజయం కలగాలంటే ఏ వ్రతము చేయాలి? అన్నారు. పంపానదీతీరంలో కూర్చొని మార్గశిర త్రయోదశినాడు చేసే వ్రతం అనుకోకుండా తిథి వచ్చింది. ఇప్పటికిప్పుడు విజయాన్ని ఇవ్వగలిగిన వ్రతం అది అని రాజుతో ఆ వ్రతం చేయించారు. రాజుగారు పరమ భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని చేశారు. హనుమద్ వ్రతం చేసిన ఉత్తర క్షణంలో హనుమయొక్క అనుగ్రహం కలిగి అపారమైన సైన్యం అక్కడికక్కడ దొరికింది. అరణ్యంలో ఉన్న వీరులందరూ తోడు వచ్చారు. తన రాజ్యాన్ని తాను పొందాడు. ఇలా వ్రతం చేశాడు, సాయంత్రానికి మూర్ధాభిషిక్తుడై పోయాడు. ఆనాటి నుంచి చంద్రవంశ ప్రభువైన సోమదత్తుడు చేసి ఫలితమును పొందిన మహోత్రుష్టమైన వ్రతము కనుక ఇప్పటికీ మార్గశీర్ష మాసంలో శుద్ధ త్రయోదశి తిథి నాడు హనుమద్ వ్రతమును చేస్తారు.

🌹🌹🌹🌹🌹


జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం - Pollution Control Day (a YT Short)


https://youtube.com/shorts/hyHtyMrUz-M

🌹 జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం - పర్యావరణ పరిరక్షణ మన భాధ్యత Pollution Control Day 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


Like, Subscribe and Share


https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹

'శాంతాకారం భుజగశయనం సురేశం పద్మనాభం' (ఈ రోజు మత్స్య ద్వాదశి) / 'Shantakaram Bhujagasayanam Suresham Padmanabham' (Today is Matsya Dwadashi)



https://youtube.com/shorts/bSNNoKfErfI


🌹 శాంతాకారం భుజగశయనం సురేశం పద్మనాభం 🌹
🌹 Shantakaram Bhujagasayanam Suresham Padmanabham 🌹

ప్రసాద్‌ భరధ్వాజ
Prasad Bharadhwaja


🐋 ఈ రోజు మత్స్య ద్వాదశి. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో మత్స్యావతారం మొదటి అవతారం. పరమ పవిత్రమైన వేదాలను రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు మార్గశిర శుద్ధ ద్వాదశి రోజునే మత్స్యావతారం స్వీకరించాడని వ్యాస మహర్షి రచించిన మత్స్యపురాణం ద్వారా తెలుస్తోంది. మత్స్య ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని శాస్త్రవచనం.🐋

🐋 Today is Matsya Dwadashi. Matsya Avatar is the first incarnation of Lord Vishnu among the ten incarnations. It is known from the Matsya Puranam written by Vyasa Maharshi that Lord Vishnu took the form of Matsya Avatar on the day of Margashir Shuddha Dwadashi to protect the sacred Vedas. It is said in the scriptures that if Lord Vishnu is worshipped on the day of Matsya Dwadashi, all difficulties will be removed.🐋


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹

శ్రీ మత్స్య ద్వాదశి శుభాకాంక్షలు Happy Matsya Dwadashi

🌹🐬 శ్రీ మత్స్య ద్వాదశి శుభాకాంక్షలు అందరికి  🐬🌹
🍀🐋 మత్స్య ద్వాదశి విశిష్టత, పూజా విధానం, అఖండ ద్వాదశాదిత్య వ్రతం 🐋🌹
ప్రసాద్ భరద్వాజ


🌹🐬 Happy Matsya Dwadashi to everyone  🐬🌹
🍀🐋 Special features of Matsya Dwadashi, worship method, Akhanda Dwadashaditya Vratam 🐋🌹
Prasad Bharadwaja


మత్స్య ద్వాదశి శ్రీ విష్ణువు మత్స్య అవతారానికి అంకితం చేయబడింది . కొన్ని వర్గాల వారు కార్తీక మాసంలో చంద్రుడు క్షీణిస్తున్న 12వ రోజున మరియు మార్గశీర్ష మాసంలో చంద్రుడు వృద్ధి చెందుతున్న 12వ రోజున దీనిని పాటిస్తారు. కార్తీక మాసంలో మత్స్య ద్వాదశి 2025 తేదీ నవంబర్ 2. మార్గశీర్ష మాసంలో దీనిని పాటించే వారికి ఇది డిసెంబర్ 2, 2025 మంగళవారం న వస్తుంది.

నారాయణుడు మత్స్యావతారం దాల్చి వేదాలను ఉద్ధరించిన ఈ రోజు విష్ణ్వారాధన విద్యాప్రాప్తిని కలుగజేస్తుంది. అంతేకాక మత్స్యము ఐశ్వర్యకారకం. ఈ ద్వాదశి నాడు నారాయణుని వాసుదేవ నామంతో అర్చించడం వలన రక్షణ లభిస్తుంది. సూర్యారాధన ప్రధానమైన ఈ నెలలో ద్వాదశి తిథినాడు ‘ద్వాదశాదిత్య వ్రతం’ ఆచరిస్తే సూర్యానుగ్రహం లభిస్తుంది.


🌻 🐋 మత్స్య ద్వాదశి రోజున విష్ణువును ఇలా పూజిస్తే చాలు- సకల శుభాలు కలగడం ఖాయం! 🐋🌻

మార్గశిర మాసంలో ప్రతిరోజూ పండుగే! ప్రతి తిథి విశేషమైనదే! పరమ పవిత్రమైన మోక్షదా ఏకాదశి పండుగ మరుసటి రోజు జరుపుకునే మత్స్య ద్వాదశి ఈ ఏడాది 2 డిసెంబర్ 2025 నాడు వచ్చింది.


🐬 శ్రీహరి తొలి అవతారం మత్స్యావతారం 🐬

శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో మత్స్యావతారం మొదటి అవతారం. పరమ పవిత్రమైన వేదాలను రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు మార్గశిర శుద్ధ ద్వాదశి రోజునే మత్స్యావతారం స్వీకరించాడని వ్యాస మహర్షి రచించిన మత్స్యపురాణం ద్వారా తెలుస్తోంది. మత్స్య ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని శాస్త్రవచనం.


🍀 మత్స్య ద్వాదశి విశిష్టత 🍀

మత్స్య ద్వాదశి రోజున శ్రీహరి మత్స్యావతారము ధరించి హయగ్రీవ అనే రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించాడని నమ్ముతారు. మత్స్య ద్వాదశి నాడు శ్రీమహావిష్ణువు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు.


🐬 మత్స్య ద్వాదశి పూజా విధానం 🐬

మానవ శరీరానికి పూయగల మంచి బంకమట్టి లేదా బురదను ఇంటికి తీసుకువస్తారు. తరువాత దీనిని హిందూ సూర్య దేవుడు సూర్యుడికి అర్పిస్తారు. తరువాత దీనిని శరీరానికి పూస్తారు. తరువాత భక్తుడు ఆదిత్య (సూర్యుడు) కు ప్రార్థనలు చేసి స్నానం చేస్తాడు. తదుపరి పూజ విష్ణువు యొక్క నారాయణ రూపానికి చేస్తారు.

నాలుగు పాత్రలను నీటితో నింపుతారు. వాటిలో తెలుపు లేదా పసుపు రంగు పువ్వులు వేస్తారు. పాత్రలను మూసివేసి వాటి పైన ఉంచుతారు. అవి ఇప్పుడు నాలుగు సముద్రాలను సూచిస్తాయి మరియు దానిని పూజిస్తారు. ఆ నీటిలో కొంచెం పసుపు పొడి వేసి ప్రార్థనలు చేయండి. ఆ నీటిని ఒక చెట్టు కింద పోయాలి. ఇది పాప విముక్తికి మరియు దుఃఖం తొలగిపోవడానికి సహాయపడుతుంది. సంపద మరియు ఆరోగ్య రక్షణ కోసం, తొమ్మిది రకాల ధాన్యాలను తీసుకొని, నీటిలో వేసి, చెట్టు కింద పోయాలి.

తదుపరి పూజ విష్ణువు మత్స్య అవతారానికి జరుగుతుంది. పసుపు రంగు లోహ మత్స్య మూర్తిని పూజిస్తారు. ఈ రోజున పసుపు రంగు ఆహారం, బట్టలు మరియు పాత్రలను దానం చేస్తారు.

హిందూ మతం ప్రకారం, జీవం నీటిలోనే ప్రారంభమైంది మరియు జీవం నీటి వల్లే ఉంది. రాక్షసుడిని నాశనం చేయడానికి మరియు రాక్షసుడు దొంగిలించిన వేదాలను తిరిగి పొందడానికి మత్స్య అవతారం అవతరించింది.

ఆ రోజున విష్ణువుకు చేసే ప్రార్థనలు మరియు పూజలు అన్ని రకాల దుఃఖాలను తగ్గించడంలో సహాయపడతాయని నమ్మకం. ఇది పాప విముక్తికి సహాయపడుతుంది. ఆ రోజు పూజలు కోరికలు నెరవేరడానికి మరియు కుటుంబ సభ్యుల మరియు సంపదను రక్షించడానికి సహాయపడతాయి.

ఆ రోజు దీపం వెలిగించాలంటే నెయ్యి, పసుపు కలిపిన దీపం వాడాలి.

ఆ రోజు సువాసన మల్లె పువ్వుల సువాసనగా ఉండాలి. కేసర మరియు బంతి పువ్వులు సమర్పించాలి.

బేసాన్ ఉపయోగించి తయారుచేసిన తీపి లేదా ఆహారాన్ని అందించాలి.

పూజ తర్వాత స్వీట్ పంచాలి.

మత్స్యావతారానికి అంకితమైన మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మంత్రం ఓం మత్స్యరూపాయ నమః॥

చేపలకు ఆహారం

కోరికలు నెరవేరడానికి, శాంతి, శ్రేయస్సు కోసం మత్స్య ద్వాదశి నాడు చేపలకు తినిపించండి. మత్స్య ద్వాదశి రోజున చెరువులలో, నదులలోని చేపలకు పిండి ముద్దలు ఆహారంగా సమర్పించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వలన జాతక దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అనంతరం మత్స్య ద్వాదశి కథను చదువుకోవాలి.

🌹 🌹 🌹 🌹 🌹


గీతా మహాత్మ్యము Gita Mahathmyamu - వరాహ పురాణాంతర్గతం - గీతా జయంతి శుభాకాంక్షలు Greetings on Gita Jayanthi



https://youtu.be/7IS3DU3CsYM


🌹 గీతా మహాత్మ్యము Gita Mahathmyamu - వరాహ పురాణాంతర్గతం - గీతా జయంతి శుభాకాంక్షలు అందరికి  to all🌹

ప్రసాద్ భరద్వాజ



🍀 భగవద్గీత ఆవిర్భవించిన మార్గశిర శుక్ల ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటారు. గీతా జయంతి అంటే భగవద్గీతను పూజించడం కాదు.. గీతను పఠించడం, మనిషిగా ఎలా జీవించాలో నేర్చుకోవడం.. అర్జునుడి ద్వారా సర్వజగత్తుకూ ఉపదేశించిన బ్రహ్మవిద్యాశాస్త్రమే భగవద్గీత. సచ్చిదానంద స్వరూపుడగు శ్రీ కృష్ణ పరమాత్మచే స్వయముగా అర్జుననుకు ఉపదేశింప బడినది. ఇది మూడు వేదముల సారము, పరమానంద మయినది, తన్నాశ్రయించిన వారికి శీఘ్రముగా తత్వజ్ఞానాన్ని కలుగ చేయును. గీతని పఠించి పిదప మహత్యమును ఎవరు పఠించకుందురో అట్టి వారి గీతా పఠనము వ్యర్ధమే (నిష్ఫలమే). అట్టివారి గీతాపఠనము శ్రమ మాత్రమేనని చెప్పబడినది. 🍀


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹

యధాయధాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతః గీతా జయంతి శుభాకాంక్షలు Gita Jayanthi Greetings



https://youtube.com/shorts/YEOTOVhIwXc


🌹 యధాయధాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతః గీతా జయంతి శుభాకాంక్షలు Gita Jayanthi Greetings 🌹
ప్రసాద్‌ భరధ్వాజ


🍀 పురాణాల ప్రకారం, మోక్షద ఏకాదశి రోజునే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడికి భగవద్గీత ఉపదేశించాడు. అందుకే భగవద్గీత పుట్టిన రోజుగా ఈ రోజు గీతా జయంతిని జరుపుకుంటారు.🍀


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹