శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 585 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 585 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀

🌻 585. 'శ్రీవిద్యా’ - 3 🌻


బంధమునకు, మోక్షమునకు కారణము ధర్మా ధర్మములే. సృష్టి ఆకర్షలకులోనై ధర్మము మరచినపుడు సృష్టి వైభవము నీయక బంధము కలిగించును. ధర్మానుసారము సృష్టియందు కామపూరణము గావించుకొను వారికి సంతృప్తి కలుగును. తుష్టి పుష్టి కలిగి యుండును. అర్ధకామములు ధర్మము ననుసరించి యుండవలెను అనునది సనాతన ధర్మము. ధర్మము ననుసరించుచూ క్రమముగా శ్రీమాత మూడు శ్రేణుల రూపమును దర్శించ వచ్చును. అపుడు సృష్టి అంతయూ శ్రీమాతగానే గోచరించి అమితానందము నిచ్చును. ఆమె ప్రజ్ఞారూపము, శక్తిరూపము, సూక్ష్మ రూపము అనుభూతి చెందుటకే శ్రీ విద్య.




సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻

🌻 585. 'Shree Vidya' - 3 🌻


The cause of both bondage and liberation lies in adherence to Dharma (righteousness) or its neglect. When creation is entangled in attractions and forgets Dharma, the grandeur of creation diminishes, leading to bondage. However, those who fulfill their desires in alignment with Dharma experience satisfaction and are blessed with contentment and well-being. The eternal principle emphasizes that Artha (wealth) and Kama (desires) must always be pursued in accordance with Dharma. By adhering to Dharma, one can gradually behold the threefold form of Sri Mata, representing wisdom, power, and subtle essence. At that point, the entire creation is perceived as an expression of Sri Mata, filling one with boundless bliss. The realization and experience of her forms as Pragya Swaroopa (form of wisdom), Shakti Swaroopa (form of power), and Sukshma Swaroopa (subtle form) is the essence of Sri Vidya.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment