భీష్మాష్టమి - భీష్మ అష్టమి వ్రత కథ. Bhishma Ashtami - Vratam Katha.


🌹 భీష్మాష్టమి..విష్ణు నామం స్మరిస్తే పుణ్యఫలాలు మీ సొంతం - భీష్మ అష్టమి వ్రత కథ.. 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Bhishma Ashtami.. If you remember Lord Vishnu's name, the sacred benefits are yours - Bhishma Ashtami Vrat Katha.. 🌹
Prasad Bharadwaj


ప్రతి సంవత్సరం రథ సప్తమి అనంతరం 'భీష్టాష్టమి' జరుపుంటారు. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మాఘ మాసం అత్యంత పవిత్రమైనది. ఈ రోజునే కురుక్షేత్రంలో భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉండి ఉత్తరాయన పుణ్యకాలం వరకు వేచి చూసి మాఘ మాసం శుద్ధ అష్టమి నాడు తన శరీరాన్ని విడిచి పెట్టాడు.

అందుకే భీష్మ పితామహుని నిర్యాణం పొందిన ఈ దినం భీష్మాష్టమిగా దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజున దానధర్మాలతో పాటు తర్పణాలు విడిచి పెడతారు.

తర్పణం ఎవరు చేయాలి?

ఈ మాసంలో వచ్చే శుక్ల పక్ష అష్టమిని 'భీష్మాష్టమి'గా జరుపుకుంటారు. . సాధారణంగా పితృ తర్పణాలు తండ్రి లేని వారు మాత్రమే ఇస్తుంటారు, కానీ భీష్మాష్టమి రోజున తండ్రి బతికున్న వారు కూడా తర్పణాలు వదలొచ్చు. ప్రతి ఒక్కరు మూడు దోసిళ్ళ అర్ఘ్యం భీష్మ ప్రీతికి ఇవ్వవలసి వుంటుంది. భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా జీవించి కడపట మహావిష్ణు సన్నిధిలో అతనిని కన్నుల పండువుగా కాంక్షించుచు ముక్తిని పొందిన గొప్ప జీవి. ఈ ప్రక్రియను అందరు భీష్మ తర్పణం అని అంటారు. మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మ పితామహుడు అంపశయ్యపై నుంచి దేహత్యాగం చేసిన రోజుగా దీనిని భావిస్తారు.

ఈ పవిత్ర దినాన భీష్మునికి తర్పణాలు వదలడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. మాఘ శుద్ధ అష్టమి(భీష్మాష్టమి) రోజునే భీష్ముడు మోక్షం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర దినాన ఆయనకి తర్పణం సమర్పిస్తే ఉత్తమ సంతాన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. 'తండ్రి బతికున్న వారు కూడా ఈ తర్పణం సమర్పించవచ్చు. తెలుపు దుస్తులతో విష్ణుమూర్తిని ఆరాధిస్తే పుణ్యఫలాలు లభిస్తాయి' అని సూచిస్తున్నారు.


🍀 భీష్మ అష్టమి వ్రత కథ.. 🍀

పురాణాల ప్రకారం.. భీష్మ పితామహుడు హస్తినాపూర్ మహారాజు శంతనుడు, గంగా మాత దంపతుల ఎనిమిదవ కుమారుడు. అతని పేరు అసలు పేరు దేవవ్రతుడు. దేవవ్రతుడు గంగా మాత ద్వారా పెరిగాడు. తరువాత అతను మహర్షి పరశురాముడి నుంచి శాస్త్రాలను, గురు బృహస్పతి నుంచి రాజనీతి శాస్త్రాన్ని నేర్చుకున్నాడు. విద్య పూర్తి చేసిన తర్వాత, గంగా మాత దేవవ్రతను అతని తండ్రి మహారాజు శంతనుడికి అప్పగించింది. ఆ తర్వాత అతన్ని హస్తినాపుర యువరాజుగా ప్రకటించారు.

ఈ సమయంలో, శంతనుడు రాజు సత్యవతి అనే స్త్రీ ప్రేమలో పడ్డాడు. కానీ, సత్యవతి తండ్రి తన కుమార్తె కొడుకు మాత్రమే హస్తినాపుర సింహాసనాన్ని వారసత్వంగా పొందుతాడని షరతు పెట్టాడు. పరిస్థితిని గమనించిన దేవవ్రతుడు తన తండ్రి కోసం తన రాజ్యాన్ని వదులుకున్నాడు. తన తండ్రి ఆనందం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. ఈ కఠినమైన ప్రతిజ్ఞ అతనికి భీష్ముడు అనే పేరును సంపాదించి పెట్టింది.

దేవవ్రతుడు చేసిన ప్రతిజ్ఞ భీష్మ ప్రతిజ్ఞగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీనిని చూసిన శంతనుడు రాజు భీష్ముని పట్ల చాలా సంతోషించి, అతనికి ఇష్టానుసారంగా మరణం అనే వరం ఇచ్చాడు. దీని అర్థం భీష్ముడు కోరుకోకపోతే మరణం రాదని. మహాభారత యుద్ధంలో కౌరవులకు ఆయన మొదటి సైన్యాధిపతి. ఆయన నాయకత్వంలో కౌరవ సైన్యం 10 రోజులు పోరాడింది.

అర్జునుడు శిఖండి రూపాన్ని కవచంగా చేసుకుని.. భీష్ము పితామహుడిపై బాణాల వర్షం కురిపించాడు. శిఖండిగా అర్జునుడిని చూసిన భీష్ముడు ఆమె స్త్రీ అని తెలుసుకుని తన ఆయుధాలను అతని ముందు ఉంచాడు. తరువాత, భీష్ముడు అర్జునుడి బాణాలకు గాయపడి మంచం మీద పడిపోయాడు. అయితే, ఆ సమయంలో సూర్యుడు దక్షిణ దిశలో ఉన్నాడు. కాబట్టి భీష్ముడు తన ప్రాణాలను వదులుకోలేదు.

ఉత్తరాయణంలో సూర్యభగవానుడి రాక కోసం ఎదురుచూస్తూ భీష్ముడు 58 రోజులు బాణాల మంచంపై పడుకున్నాడు. మాఘ మాసంలోని ప్రకాశవంతమైన పక్షం ఎనిమిదవ రోజున ఆయన తుది శ్వాస విడిచాడు. దీంతో ఉత్తరాయణ పుణ్యాకాలంలో ప్రాణాలు వదిలి తన కోరికను తీర్చుకున్నాడు.

🌹🌹🌹🌹🌹

"రఘునందన రఘువర రఘుపతి ఛాయన సేవన హరిభాజన" Rama Anjaneya song (a devotional YT Short)


https://youtube.com/shorts/uDveob5NzmA


🌹 శ్రీ ఆంజనేయం - రఘునందన రఘువర రఘుపతి ఛాయన సేవన హరిభాజన
Rama Anjaneya song 🌹


ప్రసాద్‌ భరధ్వాజ.

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


"జై జై మహాకాయ జైజై అమితశౌర్య జైజై ఆంజనేయ" Jai Anjaneya swamy (a devotional YT Short)


https://youtube.com/shorts/PcZ3MmymSbg


🌹 జై జై మహాకాయ జైజై అమితశౌర్య జైజై ఆంజనేయ Jai Anjaneya swamy 🌹

ప్రసాద్‌ భరధ్వాజ.

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹



వన దేవతల ఊరేగింపు - మేడారం.. Procession of the forest goddesses - Medaram..


🌹వన దేవతల ఊరేగింపు రహస్యాలు - మేడారం.. 🌹
ప్రసాద్‌ భరధ్వాజ

🌹The secrets of the procession of the forest goddesses - Medaram.. 🌹
Prasad Bharadwaj


మేడారం జాతరలో అత్యంత ఉత్కంఠభరితమైన భక్తి పారవశ్యం కలిగించే ఘట్టం వన దేవతల ఊరేగింపు. ఈ సమయంలో గిరిజన పూజారులు (వడ్డెలు) పాటించే ఆచారాలు అత్యంత రహస్యంగా, నిగూఢంగా ఉంటాయి.

వీటిని కేవలం గిరిజన పూజారుల వంశీయులు మాత్రమే నిర్వహిస్తారు.


🦜 చిలుకలగుట్టపై రహస్య పూజలు 🦜

సమ్మక్క తల్లిని తీసుకువచ్చే రెండో రోజున, పూజారులు మేడారం సమీపంలోని చిలుకలగుట్టకు వెళ్తారు. సమ్మక్క తల్లి రూపంగా భావించే 'కుంకుమ భరిణె'ను వెదకడం ఒక రహస్య ప్రక్రియ. ఆ గుట్టపై ఒక నిర్ణీత ప్రదేశంలో దేవత ఆనవాళ్లు కనిపిస్తాయని పూజారుల నమ్మకం. పూజారులు గుట్టపైకి వెళ్ళినప్పుడు సామాన్య భక్తులకు అటువైపు వెళ్లే అనుమతి ఉండదు. అక్కడ పూజారులు ప్రకృతి దేవతలకు బలులు సమర్పించి, ప్రత్యేకమైన 'కోయ' మంత్రాలతో తల్లిని ఆహ్వానిస్తారు.


🎋 'వెదురు' రూపంలో దేవత 🎋

జాతరలో మనం చూసేది విగ్రహాలను కాదు. సమ్మక్క, సారలమ్మలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా అడవి నుంచి తెచ్చిన వెదురు కర్రలకు పసుపు, కుంకుమలు అద్ది, కొత్త వస్త్రాలతో అలంకరిస్తారు. దేవతల ప్రతిరూపాలకు జంపన్న వాగులో పుణ్యస్నానం చేయించేటప్పుడు కూడా పూజారులు చుట్టూ ముసుగులాంటి వస్త్రాన్ని పట్టుకుంటారు. ఇది దేవతల గోప్యతను కాపాడటానికే అని చెబుతారు.


🌻 ప్రభుత్వం ఇచ్చే గౌరవం 🌻

సమ్మక్క తల్లి గద్దెపైకి వచ్చే సమయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వయంగా వచ్చి పూజారులకు ఎదురేగుతారు. సమ్మక్క తల్లిని తీసుకువస్తున్నప్పుడు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి అధికారికంగా వందనం సమర్పిస్తారు. భారతదేశంలో ఏ జాతరలోనూ లేని విధంగా ఒక గిరిజన దేవతకు 'స్టేట్ గార్డ్ ఆఫ్ హానర్' లభించడం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది.


🌴 వనప్రవేశం - మౌన వీడ్కోలు 🌴

జాతర చివరి రోజున దేవతలు తిరిగి అడవికి వెళ్లేటప్పుడు ఎలాంటి హంగామా ఉండదు. భక్తులందరూ వెళ్ళిపోయాక లేదా సాయంత్రం వేళ నిశ్శబ్దంగా దేవతలను తిరిగి వనంలోకి పంపిస్తారు. ఎక్కడ దేవతలను ఉంచుతారు అనేది ఇప్పటికీ ఆ పూజారి కుటుంబాలకు మాత్రమే తెలిసిన రహస్యం.


🍀 శివసత్తుల పూనకాలు 🍀

ఈ ఊరేగింపు సమయంలో వేలాది మంది మహిళలు (శివసత్తులు) పూనకంతో ఊగిపోతూ, పసుపు నీళ్లు చల్లుతూ దేవతలకు స్వాగతం పలుకుతారు. వీరు దేవతలకు 'రక్షకులు'గా వ్యవహరిస్తారని గిరిజన ఆచారం చెబుతోంది. సమ్మక్క తల్లిని గద్దెపైకి తెచ్చే సమయంలో పూజారికి కళ్లు కనిపిస్తాయా? లేదా? అనేది ఒక మిస్టరీ. ఆయన అత్యంత వేగంగా అడవి నుంచి గద్దె వైపు పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ సమయంలో ఆయనను ఆపడం ఎవరి తరమూ కాదు.

🌹🌹🌹🌹🌹


77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు Happy 77th Indian Republic Day


https://youtube.com/shorts/5OpZB9eHvUM

🌞 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికి
Happy 77th Republic day to all 🌞


ప్రసాద్ భరద్వాజ

ఏకాదశ రుద్రులు (Ekadasa Rudrulu) The Eleven Rudras (Forms of Shiva)


🌹ఏకాదశ రుద్రులు ( Ekadasa rudrulu ) 🌹
🔱 వివిధ పురాణాల ప్రకారం ఏకాదశ రద్ులు ఎవరు? 🔱
ప్రసాద్‌ భరధ్వాజ

🌹 The Eleven Rudras (Ekadasa Rudrulu) 🌹
🔱 Who are the Eleven Rudras according to various Puranas? 🔱
Prasad Bharadwaj


ఏకాదశ రుద్రులు అంటే శివుని పదకొండు రూపాలు లేదా అవతారాలు, వీరు హిందూ పురాణాల ప్రకారం వివిధ పేర్లతో ప్రస్తావించబడతారు. వీరికి శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో ప్రసిద్ధి చెందిన 11 శైవ క్షేత్రాలను కూడా ఏకాదశ రుద్రులుగా కొలుస్తారు. ఇవి శివునిలోని శక్తిని, ఉగ్ర రూపాన్ని సూచిస్తాయి.

మత్స్య పురాణం ప్రకారం: కపాల, పింగళ, భీమ, విరూపాక్ష, విలోహిత, అజపాద, అహిర్బుధన్య, శాస్త, శంభూ, చండ, భవ.

విష్ణు పురాణం ప్రకారం : మన్యు, మను, మహమస, మహాన్, శివ, ఋతుధ్వజ, ఉగ్రరేత, భవ, కామ, వామదేవ, ధృతవ్రత.

మహాభారతం ప్రకారం: మృగవ్యాధ, సర్ప, నిరృతి, అజైకపాద్, అభివర్ధన, పినాకి, దహన, ఈశ్వర, కపాలి, స్థాను, భర్గ.

వాల్మీకి రామాయణం ప్రకారం: అజ, ఏకపాద, అభీర్బుధ్యా, హర, శంభూ, త్రయంబక, అపరాజిత, ఈశాన, త్రిభువన, త్వష్ట, రుద్ర.

🌹🌹🌹🌹🌹

సూర్యస్తోత్రము Short Surya Stotram (a devotional YT Short)


https://youtube.com/shorts/tD_qiIOVc_Y

🌹 సూర్యస్తోత్రము Short SURYA STOTRAM 🌹

స్వరకర్త, గానం : ప్రసాద్‌ భరధ్వాజ.

🍀 ఆయురారోగ్యాన్ని, పాపక్షయాన్ని, జ్ఞానోదయాన్ని, భయ నివారణను ప్రసాదించే మహాశక్తివంతమైన స్తోత్రము. 🍀

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹



సూర్యస్తోత్రము తాత్పర్యం Surya Stotram Meaning


https://www.youtube.com/watch?v=sfj0YbkePWI

🌹 సూర్యస్తోత్రము తాత్పర్యం SURYA STOTRAM Meaning🌹

స్వరకర్త, గానం : ప్రసాద్‌ భరధ్వాజ.


🍀 ఈ సూర్య స్తోత్రం ఆయురారోగ్యాన్ని, పాపక్షయాన్ని, జ్ఞానోదయాన్ని, భయ నివారణను ప్రసాదించే మహాశక్తివంతమైన స్తోత్రము. 🍀

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


అందరికీ రథ సప్తమి, భాను సప్తమి, మరియు సూర్య జయంతి శుభాకాంక్షలు Wishing everyone a very happy Ratha Saptami, Bhanu Saptami, and Surya Jayanti (Sun God)


🌹🌞 ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణుడి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ రధసప్తమి, భాను సప్తమి, సూర్యజయంతి శుభాకాంక్షలు అందరికి. 🌞🌹

ప్రసాద్ భరద్వాజ




🌹🌞 Wishing everyone a very happy Ratha Saptami, Bhanu Saptami, and Surya Jayanti, and praying that the blessings of Lord Surya Narayana, the visible deity, may always be with you and your family. 🌞🌹

Prasad Bharadwaj


రథ సప్తమి సూర్య జయంతి శుభాకాంక్షలు Radhasaptami Surya Janthi


https://youtube.com/shorts/Q7LLy449F5M

🌹 రథ సప్తమి సూర్య జయంతి శుభాకాంక్షలు RADHASAPTAMI SURYA JANTHI 🌹

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹


రథ సప్తమి పూజా విధానం Ratha Saptami Puja Procedure


🌹 రథ సప్తమి పూజా విధానం - సూర్యనారాయణ స్వామి షోడశోపచార పూజా విధానం 🌹

ప్రసాద్ భరద్వాజ


వేకువజామునే నిద్రలేచి స్నానం ఆచరించాలి..ఏడు లేదా 11 జిల్లేడు ఆకులు, రేగుపండ్లు తలపై పెట్టుకుని సూర్యోదయం సమయానికి ముందుగానే స్నానం పూర్తి చేయాలి.

పూజ కోసం అవసరం అయిన సామగ్రి మొత్తం సిద్ధం చేసుకుని తూర్పు ముఖంగా కూర్చుని పూజ ప్రారంభించాలి, తూర్పు దిశగా కూర్చునే అవకాశం లేకపోతే ఉత్తర ముఖంగా కూర్చుని పూజ చేయవచ్చు.

"ఓం మమోపాత్త సకల దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుద్ధ సప్తమ్యాం రథసప్తమి వ్రతం కరిష్యే" అని పూజ ప్రారంభించాలి.

ముందుగా పసుపు వినాయకుడిని చేసి షోడసోపచార పూజ చేయాలి - దీపం, ధూపం, నైవేద్యం, ఉద్యాపన తర్వాత సూర్య భగవానుడి పూజ ప్రారంభించాలి.

సూర్యుడి ఫొటోను లేదా ప్రతిమను గంధం, కుంకుమ, పూలతో అలంకరించాలి ( ఎర్రటి పూలతో పూజ చేస్తే మంచిది)

ధ్యాన మంత్రం: "ఓం భాస్కరాయ దివాకరాయ ఆదిత్యాయ మార్తాండాయ సహస్రకిరణాయ సూర్యాయ నమః"

సూర్యభగవానుడికి కూడా షోడసోపచార పూజ... పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షతలు, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, దక్షిణ, ప్రదక్షిణ, హారతి సమర్పించాలి.

గోధుమపిండితో ప్రమిదలు చేసి దీపం వెలిగించండి

పూజలో భాగంగా రథం తయారు చేసి సూర్యుడి ముందుంచాలి

ఆవుపాలతో పారమన్నానం చేసి నివేదించాలి

హారతి ఇచ్చి, ప్రదక్షిణ చేసి నమస్కరించాలి.

గొడుగు, చెప్పులు, గోధుమలు దానం చేయడం శ్రేష్ఠం

రథసప్తమి ఆదివారం రావడం మరింత విశేషం..ఈ రోజు పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచిరిస్తే విశేష ఫలితం ఉంటుంది.

పూజలో భాగంగా... ఆదిత్య హృదయం, సూర్య అష్టోత్తరం, సూర్యాష్టకం పఠించాలి.

సూర్యాస్తమయం సమయంలోనూ దీపం వెలిగించి సూర్యుడిని ఆరాధించి ఉపవాసం విరమించాలి.

రథ సప్తమి పూజ ఇంట్లోనే ఇలా సులువుగా ఆచరించవచ్చు. భక్తి శ్రద్ధలతో సూర్యుడిని పూజిస్తే అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం కోసం ఆదిత్యుడిని పూజిస్తారు.

మీరు షోడసోపచార పూజ ఆచరించలేం అనుకుంటే..

దీపం వెలిగించి ముందుగా గణపతి ప్రార్థన చేసి దూపం, నైవేద్యం సమర్పించి.. అనంతరం సూర్య అష్టోత్తరం, ఆదిత్య హృదయం, సూర్యాష్ఠకం చదువుకోవచ్చు లేదంటూ వింటూ పూలు - అక్షతలతో సూర్యుడికి పూజ చేయవచ్చు. పరమాన్నం నైవేద్యంగా సమర్పించండి.

ఆదిత్యుడి అథాంగపూజ చేసుకోండి

ఓం ఆదిత్యాయ నమః – పాదౌ పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – జంఘే పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – జానునీ పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – ఊరుం పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – గుహ్యం పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – కటిం పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – నాభిం పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – ఉదరం పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – హృదయం పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – హస్తౌ పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – భుజౌ పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – కంఠం పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – ముఖం పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – నేత్రాణి పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – లలాటం పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – శిరః పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – మౌళీం పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి.

ఓం ఆదిత్యాయ నమః – అథాంగ పూజయామి.


చివరిగా

ఓ భాస్కరా ! దివాకరా ! ఆదిత్యా ! మార్తాండా ! గ్రహాధిపాఅపారనిధే ! జగద్రక్షకా ! భూతభవనా ! భూతేశా ! భాస్కరా ! ఆర్తత్రాణ పరాయణా హరా ! అంచిత్యా విశ్వసంచారా ! హేవిష్ణో ! ఆదిభూతేశా ! ఆదిమధ్యాస్త భాస్కరా ! ఓ జగత్ప్రతే ! నేను ఆచరించే పూజలో లోపం ఉన్నా... నా భక్తిలో ఎలాంటి లోపం లేదు...నేను చేసిన పూజకు నీ సంపూర్ణ కటాక్షాన్ని అందించు తండ్రీ అని పూలు సమర్పించి నమస్కరించండి.

పూజ చేసే విధానం కన్నా భక్తి ప్రధానం...

🌹 🌹 🌹 🌹 🌹

రథ సప్తమి .. సూర్య జయంతి శుభాకాంక్షలు Greetings on Ratha Saptami... Surya Jayanti


🌹రథ సప్తమి .. సూర్య జయంతి శుభాకాంక్షలు అందరికి 🌹
🌻 విశిష్టత - శుభముహూర్తం - పూజా విధానం ...🌻
ప్రసాద్ భరద్వాజ

🌹 Happy Ratha Saptami and Surya Jayanti wishes to everyone 🌹
🌻 Significance - Auspicious time - Puja procedure... 🌻
Prasad Bharadwaj



బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వర శ్చ సదా శివః |
పంచ బ్రహ్మ మయాకారా యేన జాతా స్త్వమీశ్వరమ్||

కాలాత్మ సర్వ భూతాత్మా వేదాత్మా విశ్వతో ముఖః |
జన్మమృత్యు జరావ్యాధి సంసార భయనాశనః||

బ్రహ్మ స్వరూప ఉదయే మధ్యాహ్నేతు మహేశ్వరః |
అస్తమానే స్వయం విష్ణు స్త్రయీ మూర్తి ర్దివాకరః ||

హిందువులు పండుగలకు .. పర్వదినాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. మాఘమాసం కొనసాగుతుంది. లోకానికి వెలుగును ప్రసాదించే సూర్య భగవానుడి పుట్టిన రోజు మాఘమాసం శుక్ల పక్షం సప్తమి తిథి రోజున సూర్యభగవానుడు జన్మించాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి.

సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ... నిర్దేశాన్ని మార్చుకునే రోజు రథసప్తమి . అలాంటి సమయంలో చెయ్యాల్సిన కొన్ని పనులు చెయ్యటం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందటమే కాదు దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. హిందూ సంప్రదాయం ప్రకారం, బ్రహ్మ ముహూర్తపు శుభ సమయంలో స్నానం చేయడం, సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల పాపాలు విముక్తమవుతాయని, తీవ్రమైన అనారోగ్యాలు తొలగిపోతాయని నమ్ముతారు.

రథ సప్తమి అంటే అది మన జీవిత రథాన్ని సరైన మార్గంలో నడిపించుకోవడానికి చేసే సంకల్పం. సూర్యుడు ఆరోగ్యానికి, ఆత్మవిశ్వాసానికి కారకుడు. సప్తాశ్వాలను పూర్చిన రథం మీద నిలబడి, రెండు చేతులతో తామర పూలను పట్టుకొని... ప్రచండమైన వెలుగులతో దర్శనమిస్తాడు.

వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, పురాణాలు, అన్ని శాస్త్రాల్లో సూర్య భగవానుడి స్తుతులు కనిపిస్తాయి. 'సప్తాశ్వ రథమారూఢం'... ఏడు గుర్రాలను పూన్చిన రథం మీద సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు. ఈ ఏడు గుర్రాలు ఏడు వర్ణాలలో ఉంటాయి. మనకు ఆకాశంలో కనిపించే ఇంద్రధనుస్సులోని సప్తవర్ణాలు ఆ ఏడు గుర్రాల నుంచే వచ్చాయంటారు. ఒకే చక్రంతో ఉండే ఆ రథానికి 'చైత్రరథం' అనే పేరు కూడా ఉంది. అందుకే సూర్యుణ్ణి 'చిత్రరథ స్వామి' అంటారు.

రథ సప్తమి శుభ ముహూర్తం

హిందూ పంచాగం ప్రకారం ఈ సంవత్సరం ( 2026) మాఘ శుక్ల సప్తమి తిథి జనవరి 25వ తేదీన తెల్లవారు జామున 12:39 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక అదే రోజు జనవరి 25వ తేదీన రాత్రి 11:10 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఉదయ తిథి ప్రకారం రథ సప్తమి 2026 పండుగను జనవరి 25వ తేదీ ఆదివారం రోజు జరుపుకుంటారు. రథసప్తమి రోజు పవిత్ర స్నానం చేయడానికి ఉదయం 5:26 గంటల నుంచి 7:13 వరకు శుభ సమయం ఉంటుంది.

రథసప్తమి రోజున సూర్యభగవానుడిని స్మరించుకుంటారు. దీనిని సూర్య జయంతి అని కూడా అంటారు. సూర్య భగవానుడు ప్రత్యక్షమై తన బంగారు రథాన్ని అధిరోహించాడని నమ్ముతారు. రథ సప్తమి కథలోకి వస్తే...సూర్య దేవుడు, కశ్యప మహర్షి, అతని భార్య అదితికి జన్మించాడు. సూర్యుడు అన్ని జీవులకు ప్రాణ ప్రదాత. సూర్యుడు ఒక సంవత్సరంలో ప్రతి 12 రాశుల గుండ పూర్తి ప్రయాణాన్ని పూర్తి చేస్తాడు.


🌻 రథ సప్తమి పూజా విధానం 🌻

రథ సప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి, తర్వాత రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడు ఆకులు మగవారు... ఏడు చిక్కుడు ఆకులు ఆడవారు పెట్టుకుని తలస్నానం చేయాలి. రథ సప్తమి నాడు ఆవునెయ్యితో దీపారాధన చేయాలి. తూర్పు దిక్కున తులసి కోట పక్కన ఆవుపేడతో అలికి పద్మం వేసి, పొయ్యి పెట్టి ఆవుపాలు పొంగించాలి. పాలల్లో కొత్త బియ్యం, నెయ్యి, బెల్లం వేయాలి. ఇలా పరమాన్నాన్ని తయారు చేయాలి.

తులసి కోట ఎదురుగా ఏడు చిక్కుడు ఆకులతో రథం చేయాలి. ఆ తర్వాత ఆ చిక్కుడు ఆకులపై పరమాన్నం పెట్టి నైవేద్యం సమర్పించాలి. ఇలా వీలుకాకపోతే గ్యాస్ స్టవ్ పైన అయినా నైవేద్యం వండి సమర్పించవచ్చు. ఇలా చిత్తశుద్ధితో సూర్యుని ఆరాధిస్తే విశేష ఫలితాలను పొందడానికి వీలవుతుందని పండితులు చెబుతున్నారు.

రథ సప్తమి నాడు సూర్య స్నానాలు చేయాలి. సమీపంలోని నది లేదా సముద్రంలో స్నానం చేసి సూర్య భగవానుడిని పూజించాలి. భక్తితో సూర్యుడిని పూజించడం వల్ల జీవితంలోని సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. సూర్యుని భక్తితో ఒక నియమం ప్రకారం పూజించాలి. అప్పుడే చేసిన పూజకి ఫలితం ఉంటుంది.

రథసప్తమి రోజున బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా నది లేదా సముద్ర స్నానం చేయాలి. లేదంటే ఇంట్లోనే స్నానం ఆచరించాలి. పసుపు రంగు దుస్తులు ధరించి సూర్య దేవుడిని పూజించాలి. ముందుగా రాగిపాత్రతో అర్ఘ్యం ( నీళ్లను) సమర్పించాలి. ఆ తర్వాత సూర్య దేవుని ఆరాధించి.. సూర్య మంత్రం, సూర్య చాలీసా పఠించాలి. ఆ తర్వాత సూర్యదేవునికి హారతి ఇవ్వాలి. దీంతో పాటు నీరు, వివిధ రకాలు అన్ని కూడా సూర్యునికి సమర్పిస్తారు. ఇలా పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. సంతోషం, శ్రేయస్సు, మంచి ఆరోగ్యం లభిస్తాయని భక్తులు నమ్ముతారు. రథసప్తమి రోజున సూర్యదేవుడిని పూజించడం వల్ల సకల సౌఖ్యాలు కలుగుతాయి. అలాగే శారీరక, మానసిక బాధల నుంచి కూడా ఉపశమనం పొందుతారు.

🌹🌹🌹🌹🌹

నారాయణ తే నమో నమో భవ నారాయణ సన్నుత నారాయణ Lord Vishnu prayer



https://youtube.com/shorts/YwyLYjAWUE0


🌹 నారాయణ తే నమో నమో భవ నారాయణ సన్నుత నారాయణ
Lord Vishnu prayer 🌹

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹

వ్యాసంత పంచమి శుభాకాంక్షలు; వసంత పంచమి ప్రార్థన Happy Basantha Panchami; Basant Panchami Prayer

 

🌹 సరస్వతీ దేవి ఆశీస్సులతో మీ జీవితంలో జ్ఞానం వెలుగులు ఎల్లప్పుడూ ప్రకాశించాలని కోరుకుంటూ వసంత పంచమి శుభాకాంక్షలు అందరికి Happy Basantha Panchami to you and All 🌹

ప్రసాద్ భరద్వాజ



🌹 Wishing that the light of knowledge always shines in your life with the blessings of Goddess Saraswati. Happy Basant Panchami to you and all 🌹

Prasad Bharadwaj




🌹 వసంత పంచమి Basant Panchami ప్రార్థన. 🌹
ప్రసాద్ భరద్వాజ

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తదితర దేవతలచే నిత్యం స్తుతింపబడుతూ సకల విద్యలకు దేవతవైన ఓ తల్లీ సరస్వతీ! మాలోని అజ్ఞానాన్ని తొలగించి మమ్మల్ని రక్షించుగాక. సరస్వతీ వందనం అంటే జ్ఞానం, సంగీతం, కళల దేవత అయిన సరస్వతీ దేవిని స్తుతించే ప్రార్థన. అంతేకాకుండా అజ్ఞానాన్ని తొలగించి, విజ్ఞానం, సృజనాత్మకత, స్పష్టమైన ఆలోచనలు ప్రసాదించమని అమ్మవారిని వేడుకుంటూ వసంత పంచమి Basant Panchami రోజు చేసే ప్రార్థన.

🌹 Basant Panchami Prayer 🌹
Prasad Bharadwaj

O Mother Saraswati, who is constantly praised by Brahma, Vishnu, Maheshwara, and other deities, and who is the goddess of all knowledge! May you remove the ignorance within us and protect us. The Saraswati Vandanam is a prayer praising Goddess Saraswati, the goddess of knowledge, music, and arts. It is also a prayer offered on Basant Panchami day, beseeching the Goddess to remove ignorance and bestow knowledge, creativity, and clear thinking.



యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రావ్రుతా

యా వీణా వరదండ మండితకరా.. యా శ్వేత పద్మాసనా

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా

సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా


దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభై రక్షమాలాందధానా

హస్తేనైకేన పద్మం సితమపిచ శుకం పుస్తకం చాపరేణ |

భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానాసమానా

సామే వాగ్దేవతేయం నివసతువదనే సర్వదా సుప్రసన్నా ||


సురాసురైస్సేవితపాదపంకజా కరే విరాజత్కమనీయపుస్తకా |

విరించి పత్నీ కమలాసనస్థితా సరస్వతీ నృత్యతు వాచిమే సదా ||


సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా |

ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ ||


సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||


సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః |

శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః ||


నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః |

విద్యాధరే విశాలాక్షి శుద్ధజ్ఞానే నమో నమః ||


శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః |

శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః ||


ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమో నమః |

మూలమంత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః ||


మనోన్మని మహాభోగే వాగీశ్వరి నమో నమః |

వాగ్మ్యై వరదహస్తాయై వరదాయై నమో నమః ||


వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః |

గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః ||


సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః |

సంపన్నాయై కుమార్యైచ సర్వజ్ఞేతే నమో నమః ||


యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమో నమః |

దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః ||


అర్ధచంద్ర జటాధారి చంద్రబింబే నమో నమః |

చంద్రాదిత్య జటాధారి చంద్రబింబే నమో నమః ||


అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః |

అణిమాద్యష్టసిద్ధాయై ఆనందాయై నమో నమః ||


జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞానమూర్తే నమో నమః |

నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః ||


పద్మజా పద్మవంశా చ పద్మరూపే నమో నమః |

పరమేష్ఠ్యై పరామూర్త్యై నమస్తే పాపనాశినీ ||


మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః |

బ్రహ్మ విష్ణు శివాయై చ బ్రహ్మనార్యై నమో నమః ||


కమలాకరపుష్పా చ కామరూపే నమో నమః |

కపాలి కర్మదీప్తాయై కర్మదాయై నమో నమః ||


సాయం ప్రాతః పఠేన్నిత్యం షణ్మాసాత్సిద్ధిరుచ్యతే |

చోరవ్యాఘ్రభయం నాస్తి పఠతాం శృణ్వతామపి ||


ఇత్థం సరస్వతీ స్తోత్రమగస్త్యముని వాచకమ్ |

సర్వసిద్ధికరం నౄణాం సర్వపాపప్రణాశనమ్ ||

🌹🌹🌹🌹🌹


"సరసవాణి సరస్వతీ మా అజ్ఞానం తొలగించమ్మా" - వసంత పంచమి Happy Vasantha Panchami


https://youtube.com/shorts/vWq-XfLkNpg


🌹 సరసవాణి సరస్వతీ మా అజ్ఞానం తొలగించమ్మా నిత్యాదాయిని సరస్వతి - వసంత పంచమి

Happy Vasantha Panchami 🌹



ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹


వసంత పంచమి శుభాకాంక్షలు - విశిష్టత శుభ శుక్రవారం Happy Vasantha Panchami


https://youtube.com/shorts/cs46-VCykU4

🌹 వసంత పంచమి శుభాకాంక్షలు - విశిష్టత శుభ శుక్రవారం
Happy Vasantha Panchami & Significance 🌹

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share


🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ పంచమి శుభాకాంక్షలు - వసంతపంచమి విశిష్టత ( జనవరి 23) / Happy Sri Panchami (Vasant Panchami) - The significance of Vasant Panchami (January 23)


🌹 సకలవిద్యా స్వరూపిణి, పరాశక్తి జ్ఞానప్రదాయిని, శ్రీ సరస్వతీ దేవి అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఉండాలని కోరుకుంటూ వసంత, శ్రీ పంచమి శుభాకాంక్షలు అందరికి 🌹

📚 వసంతపంచమి విశిష్టత ( జనవరి 23) 📚

✍️ ప్రసాద్ భరద్వాజ


🌹 Wishing that the compassionate blessings of Goddess Sri Saraswati Devi, the embodiment of all knowledge and the bestower of wisdom, be upon you all. Happy Vasant Panchami! 🌹

📚 Significance of Vasant Panchami (January 23) 📚

✍️ Prasad Bharadwaj



సరస్వతీం శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహరామ్‌

కోటిచంద్ర ప్రభా ముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహమ్‌

వహ్ని శుధ్ధాంశుకాధానం వీణా పుస్తక ధారిణీమ్‌

రత్న సారేంద్ర నిర్మాణ నవ భూషణ భూషితామ్‌



యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా

యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిభిర్దేవై సదావందితా

సా మాంపాతు సరస్వతీ భగవతీ నిశేష జాడ్యాపహా


చదువుకునే పిల్లలకు, నిత్య జ్ఞాన సముపార్జన చేసే వారికి వసంత పంచమి చాలా ప్రత్యేకమైన రోజు. విశేషించి ఈ సారి 20 సంవత్సరాల తరువాత కలిసి వస్తున్న పంచగ్రహ కూటమి, శుక్రవారం మరింత ప్రత్యకతను తీసుకువచ్చాయి. ఆ రోజు చదవుల తల్లి.. సరస్వతి దేవిని పూజించడం వలన విద్యలో విద్యార్థులు, జ్ఞానంలో జ్ఞానాభిలాషులు ఉన్నత శిఖరాలను చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఙ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా.. నూతన ఆవిష్కరణా ఆలోచనలు రావడం.. పాఠశాలలో... పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు.

వసంతపంచమి రోజున విద్యార్థులు సరస్వతి దేవిని పూజించాలి. అవకాశం ఉన్నవారు.. ఉండగలిగిన వారు ఉపవాస దీక్షను పాటిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. ముందుగా బ్రహ్మ ముహూర్తంలో లేచి కాలకృత్యాలు తీర్చుకొని.. పూజా మందిరంలో సరస్వతి దేవి విగ్రహాన్ని కాని.. చిత్ర పటాన్ని కాని ఉంచాలి. ఆ తరువాత షోడశోపచారాల పూజలు చేసి.. సరస్వతి అష్టోత్తరం తో అమ్మవారిని పూజించి ధూపం.. దీపం.. దీపం .. నైవేద్యం సమర్పించాలరు. ఇలా చేస్తే పిల్లలకు విద్యా పరంగా ఎంతో శుభప్రదమని చెబుతున్నారు. అలా చేస్తే.. వారి జ్ఞానాభివృద్ధి సులభం అవుతుంది. పాఠశాలల్లో.. కాంపిటేటివ్​ ఎగ్జామ్స్​ లో మంచి ఫలితాలు పొంది.. జీవితంలో విజయం సాధించడం ఖాయమని పండితులు చెబుతున్నారు.

సరస్వతి దేవత జ్ఞానం, కళ, సంగీతం, విద్య.. విజ్ఞానానికి అదిష్ఠాన దేవత. ఆమె పుట్టిన రోజున అనగా వసంత పంచమి రోజున ఈ దేవతను ప్రత్యేకతంగా పూజలు చేస్తారు. అలా చేయడం వలన విద్యార్థులకు చదువులో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

విద్యార్థులకు మంచిగా చదివేందుకు ప్రేరణ ఇవ్వడానికి సరస్వతి దేవతను పూజించడం ద్వారా వారు నూతన ఆశలు, శక్తిని పొందుతారు.ఈ రోజున సరస్వతి దేవిని పూజించి ...ఉపవాసం ఉండడం వల్ల విద్యార్థుల జీవితాల్లో ఆనందం, విజయం, ఆధ్యాత్మిక శ్రేయస్సు ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

🌹🌹🌹🌹🌹

రామ మందిర 2వ వార్షిక స్థాపన దినోత్సవ శుభాకాంక్షలు Greetings on 2nd Anniversary of the Ram Mandir establishment


🌹 రామ మందిర 2వ వార్షిక స్థాపన దినోత్సవ శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ



🌹 Happy 2nd Anniversary of the Ram Mandir establishment to everyone 🌹

Prasad Bharadwaj


మాఘ వినాయక చతుర్థి, తిల చతుర్ధి, కుంద చతుర్ధి శుభాకాంక్షలు Greetings on Magha Vinayaka Chaturthi, Tila Chaturthi, and Kunda Chaturthi


🌹 మాఘ వినాయక చతుర్థి, తిల చతుర్ధి, కుంద చతుర్ధి శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ



🌹 Happy Magha Vinayaka Chaturthi, Tila Chaturthi, and Kunda Chaturthi to everyone 🌹

Prasad Bharadwaj



మాఘ వినాయక చతుర్థి పూజా విధానం Magha Vinayaka Chaturthi & Pooja Procedure


🌹 మాఘ వినాయక చతుర్థి, తిల చతుర్ధి, కుంద చతుర్ధి నాడు ఇలా చేస్తే సకల శుభాలు కలుగుతాయి..! పూజా విధానం. జనవరి 22.. 🌹

🍀 వినాయక చవితి రోజు వినాయకుడి పూజ చేసుకోలేని వాళ్లు.. అంతే ఫలితం రావాలంటే మాఘ వినాయక చతుర్ధి రోజున వినాయకుడిని పూజించాలి. ఇది కూడా వినాయక చవితి. 🍀

ప్రసాద్ భరద్వాజ


🌹 Performing these rituals on Magha Vinayaka Chaturthi, Tila Chaturthi, or Kunda Chaturthi will bring all auspicious blessings! Pooja procedure. January 22nd.. 🌹

🍀 Those who are unable to perform Ganesh Pooja on Ganesh Chaturthi can worship Lord Ganesha on Magha Vinayaka Chaturthi to receive the same benefits. This is also a Ganesh Chaturthi. 🍀

Prasad Bharadwaj



మాఘ మాసం విష్ణుమూర్తికి, సూర్యనారాయణ మూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. మాఘ మాసంలో శుక్ల పక్షంలో చవితిని లేదా చతుర్ధిని.. మాఘ వినాయక చతుర్ధి అంటారు. తిల చతుర్ధి, కుంద చతుర్థి పేర్లతో కూడా పిలుస్తారు. ఇది చాలా శక్తిమంతమైన రోజు అని పండితులు చెబుతున్నారు. జనవరి 22.. గురువారం.. మాఘ శుక్ల చతుర్థి తిథి వచ్చింది.

ఈ మాఘ శుక్ల చతుర్ధిని తిల చతుర్ధి అని పిలుస్తారు. ఆరోజు తిలలు అంటే నువ్వులు దానం ఇస్తే కోటి సార్లు తిలలు దానం చేసిన ఫలితం కలుగుతుంది. మామూలు సమయంలో నువ్వులు దానం ఇచ్చిన ఫలితం కంటే కోటి రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. అది తిల చతుర్ధికి ఉన్న ప్రాధాన్యత. దేవాలయంలో నువ్వులు దానం ఇవ్వడం వల్ల మామూలు సమయంలో ఇచ్చిన నువ్వుల దానం కంటే కోటి రెట్లు ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు.

మాఘ శుక్ల చవితి తిధిని కుంద చవితి లేదా కుంద చతుర్థి అనే పేర్లతో పిలుస్తారు. కుంద పుష్పములు అంటే మల్లె పువ్వులు. మల్లె పూలతో ఈశ్వరుడిని పూజించేటటువంటి చవితి కనుక దీన్ని కుంద చతుర్ధి అంటారు. ఆరోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం ఈశ్వరుడి శివ లింగ స్వరూపానికి కానీ ఈశ్వరుడి ఫోటోకి కానీ మల్లె పూలతో పూజ చేయండి. శివుడికి చిమ్మిలి నైవేద్యం పెట్టండి. దాని వల్ల జీవితంలో దంపతుల మధ్య గొడవలు ఉండవని, మంచి జీవిత భాగస్వామి లభిస్తుందని పండితులు తెలిపారు. కుటుంబ జీవితం బాగుండాలంటే జనవరి 22న మల్లెపూలతో శివుడిని పూజించాలన్నారు.

మాఘ శుక్ల చవితి తిథికి మరో గొప్ప ప్రత్యేకత కూడా ఉంది. దీన్ని మాఘ వినాయక చతుర్ధి అనే పేరుతో పిలుస్తారు. మాఘ వినాయక చతుర్ధి సంద్భంగా ఎలాంటి విధివిధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల పనులన్నీ సులభంగా పూర్తవుతాయో, ఆటంకాలన్నీ తొలగిపోతాయో, విఘ్నాలు ఉండవో, మాఘ వినాయక చతుర్ధి రోజున ఎలా పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చవితి లేదా చతుర్ధిని మాఘ వినాయక చతుర్థి అంటారు. సహజంగా వినాయకుడు భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చవితి రోజున పుట్టాడని, ఆ రోజు మనం అంతా వినాయక చవితి చేసుకుంటాం. అయితే, భాద్రపద మాసంలో మహిళలు రజస్వల దోషాల వల్ల, ఏటి సూతకాల దోషాల వల్ల, మైల వల్ల కానీ ఏ ఇతర ఆరోగ్య, వృత్తిపరమైన కారణాల వల్ల కానీ.. వినాయక చవితి రోజు వినాయకుడి పూజ చేసుకోలేని వాళ్లు.. వరసిద్ధి వినాయక వ్రతకల్పం చేసుకోలేని వాళ్లు.. ఆ రోజున వినాయకుడిని పూజిస్తే ఎంతటి అద్భుతమైన ఫలితం కలుగుతుందో.. అంతే ఫలితం రావాలంటే మాఘ వినాయక చతుర్ధి రోజున వినాయకుడిని పూజించాలి. అందుకే, మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చవితి లేదా చతుర్ధిని మాఘ వినాయక చతుర్ధి అనే పేరుతో పిలుస్తారు. ఇది కూడా వినాయక చవితే.


🌻 పూజా విధానం.. 🌻

ఇంట్లో గణపతి విగ్రహం లేదా ఫోటో ఉంటే గంధం, కంకుమ బొట్లతో అలంకరణ చేయాలి. ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. గణపతికి కొబ్బరి నూనె దీపం, 5 వత్తుల దీపం ఇష్టం. అలాగే గణపతికి ఎర్రటి పూలు, ఎర్రటి వస్త్రాలు అంటే ఇష్టం. ఎర్రటి వస్త్రాలు ధరించి ఎర్ర మందార పూలతో ఎర్ర గులాబీలతో గణపతిని పూజించాలి. గణపతి 108 నామాలు చదువుకోవాలి. అది చదువుకోలేని వాళ్లు గం గణపతయే నమ: అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. గణపతికి ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించండి.

ఇలా పూజిస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. పూజ సమయంలో రెండు మంత్రాలను కచ్చితంగా చదువుకోవాలి. గం క్షిప్రసాదాయ నమ:, వక్రతుండాయ హుం.. ఒక్కో మంత్రాన్ని 21సార్లు చదువుకోవాలి. మీ పనుల్లో ఏడాది పాటు ఆటంకాలు ఉండవు. కోరికలు తొందరగా నెరవేరతాయి. సంకటనాసిక గణేశ స్తోత్రం చదవటం లేదా వినటం చేయాలని పండితులు తెలిపారు.

🌹🌹🌹🌹🌹

"నారాయణ నారాయణ జయ గోవింద హరే జయ గోపాల హరే" Narayana Narayana (a devotional YT Short)



https://youtube.com/shorts/Dxe2JdiWAvo


🌹 నారాయణ నారాయణ జయ గోవింద హరే జయ గోపాల హరే
Narayana Narayana 🌹



ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹

'దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభా దిగంబరా శ్రీ దత్తాత్రేయ' Sri Pada Vallabha Digambara (a devotional YT Short)


https://youtube.com/shorts/naX71jlb3sE

🌹 దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభా దిగంబరా శ్రీ దత్తాత్రేయ
Sri Pada Vallabha Digambara 🌹



ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

మూడు శతాబ్దాల తర్వాత కేరళలోని నీలా నదిపై జరిగే మహామఘ పండుగ – కేరళ కుంభమేళా The Kerala Kumbh Mela


🌹 మూడు శతాబ్దాల తర్వాత కేరళలో తొలిసారి మహామాఘ మహోత్సవం నీలా నది కేరళ కుంభమేళా 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹 After three centuries, the Mahamagha festival is being celebrated for the first time in Kerala on the Nila River – the Kerala Kumbh Mela 🌹
Prasad Bharadwaj


కేరళలో దాదాపు మూడు శతాబ్దాల తర్వాత కుంభమేళా జరుగుతోంది. నీలా నది(Nila river) (భారతపుళ) తీరంలో కేరళ (Kerala) కుంభమేళాగా ప్రసిద్దిగాంచిన' మహామాఘ మహోత్సవం' ప్రారంభమైంది.

మలప్పురం జిల్లా తిరునవయలో కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించి ఈ క్రతువును లాంఛనంగా ప్రారంభించారు. మాహామండలేశ్వర్ స్వామి ఆనందవనం భారతి మహారాజ్ నేతృత్వంలో మొదటి స్నానం నవముకుంద ఆలయ స్నాన ఘాట్‌లో జరిగింది. ఈ ఉత్సవాన్ని 270 ఏళ్ల తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత పూర్తిస్థాయిలో నిర్వహించడం చెప్పుకోదగ్గ అంశం. ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. 1755లో ఈ కుంభమేళా జరిగినట్లు సమాచారం.

50 వేల మందికిపైగా నీలా నదిలో పవిత్ర స్నానాలు

ఫిబ్రవరి 3 వరకు కొనసాగే ఈ కుంభమేళా ఉత్సవానికి కేరళ, తమిళనాడు , కర్ణాటక సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. రోజుకు దాదాపు 50 వేల మందికిపైగా నీలా నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు. వేడుకల్లో భాగంగా కాశీ పండితుల ఆధ్వర్యంలో రోజూ సాయంత్రం నీలానది హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు కేరళ ఆర్టీసీ.. 100 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అలాగే, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కేరళ సంప్రదాయ విద్య కలరిపయట్టు, యోగతో పాటు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ కుంభమేళాలో భాగమైన రథయాత్ర కు తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది తమిళనాడులోని ఉడుమల్‌పేట సమీపంలోని తిరుమూర్తి కొండ నుంచి సోమవారం ఉదయం రథయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా ప్రభుత్వం నిలిపివేసింది.

🌹 🌹 🌹 🌹 🌹


"పార్వతి తనయా శరణు గణేశా శంభు కుమారా శరణు గణేశా" Ganesha Vinayaka (a devotional YT Short)


https://youtube.com/shorts/YF1VOaHGKJ0


🌹 పార్వతి తనయా శరణు గణేశా శంభు కుమారా శరణు గణేశా Ganesha Vinayaka 🌹


ప్రసాద్‌ భరధ్వాజ

తప్పకుండా వీక్షించండి

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


మాఘ మాసంలో నది స్నాన విధి మరియు విశిష్టత / Significance of Taking a Holy River Bath in the Magha Masam


🌹 మాఘ మాసంలో నది స్నాన విధి మరియు విశిష్టత : ఆధ్యాత్మిక పుణ్యఫలం – మోక్ష మార్గం Significance of Taking a Holy River Bath in the Magha Masam 🌹

ప్రసాద్ భరద్వాజ


మాఘ మాసంలో సూర్యుడు మకర రాశిలో సంచరిస్తున్నప్పుడు నదులన్నీ గంగా నదితో సమానమైన పవిత్రతను పొందుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ కాలంలో చేసే తెల్లవారుజాము స్నానాన్ని ‘బ్రహ్మ ముహూర్త స్నానం’ అంటారు. ఇలా చేయడం వల్ల గత జన్మ పాపాలు తొలగిపోవడమే కాకుండా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం.

ముఖ్యంగా ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాలలో త్రివేణి సంగమ స్నానం అత్యంత శ్రేష్టమని చెబుతారు. ఈ మాసంలో నదీ జలాలు దైవ శక్తిని కలిగి ఉంటాయని ప్రతి రోజూ స్నానం చేయలేకపోయినా కనీసం మాఘ పూర్ణిమ నాడైనా నదిలో మునక వేస్తే సకల శుభాలు కలుగుతాయని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి.

ఆరోగ్య రహస్యం – శాస్త్రీయ కోణం: నదీ స్నానం వెనుక లోతైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. చలికాలంలో నదీ జలాలు ఖనిజ లవణాలతో నిండి ఉండి శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయి. తెల్లవారుజామున చల్లని నీటిలో స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మరియు శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సూర్యోదయానికి ముందు నదిలో మునిగినప్పుడు, గాలిలోని ఓజోన్ మరియు నీటిలోని ఔషధ గుణాలు చర్మ వ్యాధులను నివారిస్తాయి.

స్నాన విధి మరియు విశిష్టత : మాఘ స్నానాన్ని నదిలో చేయడం ఉత్తమం, కుదరని పక్షంలో ఇంట్లోనే నదులను స్మరిస్తూ స్నానం చేయవచ్చు. స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం వదిలి దీపదానం చేయడం విశేష ఫలాన్ని ఇస్తుంది. పవిత్రమైన ఆలోచనలతో భక్తి శ్రద్ధలతో ఆచరించే ఈ స్నానం కేవలం శరీరాన్ని శుభ్రం చేయడమే కాకుండా ఆత్మను కూడా పవిత్రం చేస్తుంది.

🌹🌹🌹🌹🌹




🌹 River Bath Ritual and Its Significance in the Month of Magha Spiritual Merit and the Path to Liberation (Moksha) 🌹

- Prasad Bharadwaj


According to the Puranas, during the sacred month of Magha, when the Sun transits through Makara Rashi (Capricorn), all rivers are believed to attain the sanctity of the Ganga. The early-morning bath taken in this period is known as the Brahma Muhurta Snanam. Devotees believe that observing this sacred bath not only washes away sins from past births but also bestows the divine grace of Lord Vishnu.

Among all holy places, taking a dip at the Triveni Sangam in Prayagraj—the confluence of the Ganga, Yamuna, and the invisible Saraswati—is regarded as supremely auspicious. Scriptures proclaim that the waters during this month are infused with divine energy. Even if one cannot bathe daily, taking a holy dip at least on Magha Purnima is said to bring prosperity, purity, and spiritual upliftment.


Health Secrets – A Scientific Perspective

Beyond spiritual beliefs, river bathing in Magha holds profound health benefits. During winter, river waters are rich in natural minerals that rejuvenate the body. Bathing in cold water at dawn improves blood circulation and strengthens the immune system. Immersing in river water before sunrise exposes the body to ozone-rich air and the medicinal properties of flowing water, which help prevent skin ailments and promote overall vitality.


Ritual Method and Spiritual Importance

Taking the Magha bath in a river is considered ideal; if that is not possible, one may bathe at home while mentally invoking sacred rivers. After bathing, offering Arghya (water oblation) to Surya Bhagavan and performing Deepa Daanam (lamp offering) are said to yield special merit. When performed with purity of thought, devotion, and faith, this sacred bath purifies not only the body but also elevates the soul.

🌹🌹🌹🌹🌹