1) 🌹. నిత్య పంచాంగము / Daily పంచాంగం గురువారం 4-సెప్టెంబర్-2021 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 250 🌹
3) 🌹. శివ మహా పురాణము - 448🌹
4) 🌹 వివేక చూడామణి - 125 / Viveka Chudamani - 125🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -77🌹
6) 🌹 Osho Daily Meditations - 66🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 125🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. శ్రీ వేంకటేశ్వర ద్వాదశమంజరికా స్తోత్రం-1 🍀*
శ్రీకల్యాణగుణోల్లాసం చిద్విలాసం మహౌజసమ్ |
శేషాద్రిమస్తకావాసం శ్రీనివాసం భజామహే || 1
వారాహవేష భూలోకం లక్ష్మీమోహనవిగ్రహమ్ |
వేదాంతగోచరం దేవం వేంకటేశం భజామహే || 2
సాంగానామర్చితాకారం ప్రసన్నముఖపంకజమ్ |
విశ్వవిశ్వంభరాధీశం వృషాద్రీశం భజామహే || 3
🌻 🌻 🌻 🌻 🌻
04, శనివారం, సెప్టెంబర్ 2021
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ
దక్షిణాయణం, వర్ష ఋతువు
చాంద్రమానం : శ్రావణ మాసం
తిథి: కృష్ణ ద్వాదశి 08:25:46 వరకు
తదుపరి కృష్ణ త్రయోదశి
పక్షం: కృష్ణ-పక్ష
నక్షత్రం, యోగం మరియు కరణం
నక్షత్రం: పుష్యమి 17:46:07 వరకు తదుపరి ఆశ్లేష
యోగం: వరియాన 09:38:56 వరకు తదుపరి పరిఘ
కరణం: తైతిల 08:22:46 వరకు
వర్జ్యం: 01:04:00 - 02:44:12 మరియు
30:45:12 - 32:22:36
దుర్ముహూర్తం: 07:41:51 - 08:31:30
రాహు కాలం: 09:08:44 - 10:41:50
గుళిక కాలం: 06:02:33 - 07:35:39
యమ గండం: 13:48:01 - 15:21:06
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:38
అమృత కాలం: 11:05:12 - 12:45:24
సూర్యోదయం: 06:02:33, సూర్యాస్తమయం: 18:27:17
వైదిక సూర్యోదయం: 06:06:07
వైదిక సూర్యాస్తమయం: 18:23:44
చంద్రోదయం: 03:17:53, చంద్రాస్తమయం: 16:45:40
సూర్య సంచార రాశి: సింహం,
చంద్ర సంచార రాశి: కర్కాటకం
ఆనందాదియోగం: మిత్ర యోగం - మిత్ర లాభం 17:46:07
వరకు తదుపరి మానస యోగం - కార్య లాభం
పండుగలు : ప్రదోష వ్రతం, శని త్రయోదశి
*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -249 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 27
*🍀 26. యోగ యుక్తుడు - జీవుడు దేవునితో కూడి యుండుట దైవయోగము. అట్లు దైవముతో కూడియున్నవాడు ఎందున్నను ఒక్కటియే. అతడెచ్చట యున్నను, అచట దైవముతోనే యుండును గనుక, దైవమును చేరుట అను భ్రమ యుండదు. విడిపోయిన వాడు చేరు ప్రయత్నము చేయవలెను. కూడియున్న వాడు అట్లుండుటయే గాని చేయుట యుండదు. అట్టి వానినుండి దైవీగుణములగు ఇచ్ఛా జ్ఞాన క్రియలు ప్రకాశించుచునే యుండును. అట్టి వానినుండి దివ్య కార్యములు జరుగుచు నుండును. జరుగుచున్నది చూచుచు, దివ్య వైభవమున కానందించుటయే గాని, తాను చేయుచున్నాననే మెర మెర జ్ఞానికి యుండదు. తాను దైవమందుండుట వలన తన నుండి నిర్వర్తింపబడ వలసిన కార్యములు దైవ ప్రకృతే నిర్వర్తించును. 🍀*
నైతే సృతి పార్థ జాన న్యోగీ ముహ్యతి కశ్చన |
తస్మాత్సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున || 27
తాత్పర్యము : జ్ఞానయోగి శుక్ల కృష్ణ మార్గముల యందు మోహపడడు. కనుక ఓ అర్జునా! నీవు యోగయుక్తుడవు కమ్ము.
వివరణము : యోగయుక్తు డనగా సర్వకాల సర్వావస్థల యందును దైవముతో కూడియున్న వాడని అర్థము. యోగమనగా కూడిక. పతి, పత్నియోగము, సంతానయోగము, ధనయోగము,
అట్లే వియోగము అను పదములను వినుచుందుము. కూడి యుండుట యోగము లేక భక్తి. విడిపోవుట వియోగము లేక విభక్తి.
జీవుడు దేవునితో కూడి యుండుట దైవయోగము. అట్లు దైవముతో కూడియున్నవాడు ఎందున్నను ఒక్కటియే. అతడెచ్చట యున్నను, అచట దైవముతోనే యుండును గనుక, దైవమును చేరుట అను భ్రమ యుండదు. విడిపోయిన వాడు చేరు ప్రయత్నము చేయవలెను. కూడియున్నవాడు అట్లుండుటయే గాని చేయుట యుండదు. అట్టి వానినుండి దైవీగుణములగు ఇచ్ఛా జ్ఞాన క్రియలు ప్రకాశించుచునే యుండును. అట్టి వానినుండి దివ్య కార్యములు జరుగుచు నుండును. జరుగుచున్నది చూచుచు, దివ్య వైభవమున కానందించుటయే గాని, తాను చేయుచున్నాననే మెర మెర జ్ఞానికి యుండదు.
అట్టి జ్ఞానయోగికి ఇహమైనను, పరమైనను ఒకటే. ఏ జాతి యందు జన్మించినను ఒకటే. ఏ కులమందు జన్మించిననూ ఒకటే. ఏ లోకమందున్నను ఒకటే. అట్టి వానికి ఎక్కువ తక్కువలు గాని, జ్ఞానాజ్ఞానములు గాని భేదముండదు. తాను దైవమందుండుట వలన తన నుండి నిర్వర్తింపబడ వలసిన కార్యములు దైవ ప్రకృతే నిర్వర్తించును. కనుకనే జ్ఞానియగు భక్తునికి, యోగికి మోహ ముండు అవకాశమే లేదు. అతడు సర్వకాలము లందు, సర్వ దేశములందు దైవముతో కూడియుండుట వలన మాయ చేరనేరదు. కనుక మోహము కలుగదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 448🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 30
*🌻. పార్వతి గృహమునకు మరలి వచ్చుట - 2 🌻*
తరువాత ఆమెకు బంధువులగు ఇతరస్త్రీలు, సోదరుల భార్యలు గూడ మహానందముతో పరమప్రీతితో ఆమెను గట్టిగా కౌగిలించుకొనిరి (15). నీవు వంశమును తరింపజేయు పుణ్యకార్యమును చక్కగా సాధించితివి. నీ పవిత్రమగు ఆచరణచే మేమందరము కూడా పవిత్రులమైతిమి (16). ఇట్లు వారందరు మహాహర్షముతో ఆమెను బాగుగా కొనియాడి, సుగంధ ద్రవ్యములతో, మరియు మంచి పుష్పములతో ఆ శివాదేవిని ఉల్లాసముగా చక్కగా పూజించిరి (17). ఆ సమయములో ఆకసమునందు విమానములలో నున్న దేవతలు ఆనందముతో మంగళకరమగు పుష్పవృష్టిని గురిపించి ఆమెకు నమస్కరించి స్తోత్రములను చేసిరి (18).
అపుడు బ్రాహ్మణులు మొదలగువారందరు ఆనందముతో ఆమెను ప్రకాశించే గొప్ప రథములో కూర్చుండబెట్టి నగరములో ప్రవేశబెట్టిరి (19). అపుడు బ్రాహ్మణులు, పురోహితుడు, చెలికత్తెలు మరియు ఇతర స్త్రీలు పార్వతిని సన్మాన పూర్వకముగా ఇంటిలో ప్రవేశపెట్టిరి (20). స్త్రీలు ఆమెకు దిష్టి తీసిరి. బ్రాహ్మణులు ఆశీర్వచనములను పలికిరి. ఓ మహర్షీ! తల్లిదండ్రులగు మేనా హిమవంతులు మిక్కలి ఆనందించరి (21). తన గృహస్థాశ్రమము సఫలమైనదనియు, చెడు పుత్రునికంటె పుత్రికయే శ్రేష్ఠమనియు భావించిన హిమవంతుడు నిన్ను (నారదుని)'బాగు, బాగు' అని స్తుతించెను (22).
ఆ పర్వతరాజు బ్రాహ్మణులకు, వందిమాగధులకు ధనము నిచ్చెను. బ్రాహ్మణులచే మంగళ పాఠములను చదివించెను. గొప్ప ఉత్సవమును చేయించెను (23). ఓ మహర్షీ! ఈ తీరున తమ కుమార్తెచే సంతసించిన తల్లిదండ్రులు, సోదరులు మరియు వారి భార్యలు మహానందముతో వాకిట గూర్చిండిరి (24).
ఓ కుమారా! తరువాత మిక్కిలి ఆనందించి, ప్రసన్నమగు మనస్సును కలిగియున్న ఆ హిమవంతుడు అందరిని ప్రీతి పూర్వకముగా ఆదరించి స్నానము చేయుటకు గంగానదికి వెళ్లెను (25). ఇంతలో భక్తవల్సలుడు, లీలలను చూపువాడు నగు శంభుడు నాట్యము చేసే నటుని రూపమును ధరించి మేనాదేవి వద్దకు వెళ్లెను (26).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 125 / Viveka Chudamani - 125🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀. 26. ఆత్మ మార్పులేనిది - 12 🍀*
413. ఎపుడైతే శరీరము నుండి ప్రాణము వెళ్ళి ఎముకల గూడుతో కూడిన శరీరము మిగులుతుందో, యోగి తాను తిరిగి సమాధి స్థితి నుండి బయటకు వచ్చిన తరువాత కూడా ఆ శరీరానికి అంటిపెట్టుకొని ఉండడు. అది కంటికి కనిపించనప్పటికి దాని గూర్చి పట్టించుకోడు. మనిషి యొక్క నీడలా అది పక్కనే ఉన్నప్పటికి దాన్ని పట్టించుకోడు. ఆ నీడలన్ని గత జన్మల కర్మ ఫలితాలే.
414. ఆత్మను తెలుసుకొన్నవాడు శాశ్వతమైన, స్వచ్ఛమైన జ్ఞానాన్ని ఆనందాన్ని అనుభవిస్తూ శరీరము యొక్క పరిమితులకు అతీతముగా జీవిస్తాడు. ఈ శరీరము అపవిత్రమైన మురికితో ఉన్నది. ఎవడైన కక్కిన కూటికి ఆశిస్తాడా! అలానే యోగి దాన్ని గుర్తుతెచ్చుకొనుటకు కూడా ఇష్టపడడు.
415. ఈ ప్రాపంచిక వస్తు విశేషములన్నింటిని దగ్దముచేసి మూలము కూడా లేకుండా, నిజమైన జ్ఞాని తరువాత ఒంటరిగా ఆత్మగా స్వచ్ఛమైన, శాశ్వతమైన విజ్ఞానముతో కూడిన ఆనందములో ఉండును.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 VIVEKA CHUDAMANI - 125 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 26. Self is Unchangeable - 12 🌻*
413. After the body has once been cast off to a distance like a corpse, the sage never more attaches himself to it, though it is visible as an appearance, like the shadow of a man, owing to the experience of the effects of past deeds.
414. Realising the Atman, the eternal, pure Knowledge and Bliss, throw far away this limitation of a body, which is inert and filthy by nature. Then remember it no more, for something that has been vomited excites but disgust when called in memory.
415. Burning all this, with its very root, in the fire of Brahman, the Eternal and Absolute Self, the truly wise man thereafter remains alone, as the Atman, the eternal, pure Knowledge and Bliss.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 77 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. నా పాదాల మీద పడటం కాదు, నీ పాదాల మీద నీవు నిలబడు. 🌻*
ఏడు సంవత్సరములు నిండుదనముగా ఉండుటను అభ్యసించినచో తిండికి, గుడ్డకు ఎన్నడూ లోటు రాదు.
నీ ప్రకారము ధర్మము ఉండదు. ధర్మముము అనుసరించి నీవే నడువవలెను.
ఎవ్వరికిని అడ్డురాకుండా నీ పనిని నీవు సక్రమముగా చేసికొనుము.
నీలో సోమరితనమును పోగొట్టుకొనవలెను. ఇతరులు బాగుపడుచున్నారని, పనులు చేసుకొనుచున్నారని ఏడ్చుట అసూయను సూచించును.
.....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 66 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 66. VERBS 🍀*
*🕉 Authenticity is a verb. All that is beautiful in life is a verb; it is not a noun. Truth is Q verb; it is not a noun. Love is not a noun; it is a verb. Love is in loving. It is a process. 🕉*
Authenticity is one of the greatest values in life. Nothing can be compared to it. In the old terminology, authenticity is also called truth. The new terminology calls it authenticity- which is better than truth, because when we talk about truth, it seems like a thing, like a phenomenon somewhere that you have to find. Truth looks more like a noun. But authenticity is a verb. It is not something waiting for you. You have to be authentic, only then is it there. You cannot discover it. You have to create it continuously by being true. It is a dynamic process.
Let this sink into you as deeply as possible, that all that is beautiful in life is a verb; it is not a noun. Truth is a verb; it is not a noun. Language is fallacious. Love is not a noun; it is a verb. Love is in loving, It is a process. When you love, only then is love there, When you don't love, it has disappeared. It exists precisely when it is dynamic. Trust is a verb, not a noun. When you trust, it is there. Trust means trusting and love means loving. Truth means being truthful.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 125 / Sri Lalita Sahasranamavali - Meaning - 125 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 125. క్లీంకారీ, కేవలా, గుహ్యా, కైవల్య పదదాయినీ |*
*త్రిపురా, త్రిజగద్వంద్యా, త్రిమూర్తి, స్త్రిదశేశ్వరీ ‖ 125 ‖ 🍀*
🍀 622. క్లీంకారీ -
' క్లీం ' అను బీజాక్షరమునకు కారణభూతురాలు.
🍀 623. కేవలా -
ఒకే ఒక తత్వమును సూచించునది.
🍀 624. గుహ్యా -
రహస్యాతి రహస్యమైనది.
🍀 625. కైవల్యపదదాయినీ -
మోక్షస్థితిని ఇచ్చునది.
🍀 626. త్రిపురా -
మూడు పురములను కలిగి ఉంది.
🍀 627. త్రిజగద్వంద్యా -
మూడు లోకములచే పూజింపబడునది.
🍀 628. త్రిమూర్తిః -
త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, రుద్రుల రూపములో ఉండునది.
🍀 629. త్రిదశేశ్వరీ -
దేవతలకు ఈశ్వరి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 125 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 125. klīṁkārī kevalā guhyā kaivalya-padadāyinī |*
*tripurā trijagadvandyā trimūrtis tridaśeśvarī || 125 || 🌻*
🌻 622 ) Klim karee -
She who is the shape of “Klim”
🌻 623 ) Kevalaa -
She who is she herself
🌻 624 ) Guhya -
She who is secret
🌻 625 ) Kaivalya Padha dhayini -
She who gives redemption as well as position
🌻 626 ) Tripura -
She who lives everything in three aspects
🌻 627 ) Trijagat vandhya -
She who is worshipped by all in three worlds
🌻 628 ) Trimurthi -
She who is the trinity
🌻 629 ) Tri daseswari -
She who is the goddess for all gods
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment