శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 429 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 429 - 1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 429 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 429 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 91. తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।
నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥ 🍀
🌻 429. 'మదశాలినీ' - 1 🌻
ఆనందముచే ప్రకాశించునది శ్రీమాత అని అర్థము. 'శాలిని' అనగా ప్రకాశించునది అని అర్థము. 'మద'మనగా ఆనందమని అర్థము. అతిశయించిన ఆనందమే మదము. తెనుగున మదమను పదము గర్వమునకు పర్యాయ పదముగ వాడుదురు. నిజమునకు మద మనగా ముదమే, ఆనందమే.
భక్తి పారవశ్యమున ఆనందము కలిగినపుడు భక్తుడు అట్లతిశయించిన ఆనందమున యిక దేనిని లెక్కచేయడు. "తక్కుమేమి మనకు, రాముండొక్కడుండు వరకూ” అనుచు భక్తుడు కీర్తించునపుడు అతడు విషమును కూడ లెక్కచేయడు. రామదాసు రామభక్తిలో ఆనంద పరవశుడై తానీషా శిక్షను లెక్కచేయలేదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 429 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 91. Tatvasana tatvamaei panchakoshantarah sdhita
Nisima mahima nitya-yaovana madashalini ॥ 91 ॥ 🌻
🌻 429. 'Madashalini' - 1 🌻
It means that Srimata is radiant with joy. 'Shalini' means shining. 'Mada' means happiness. Mada is an exaggerated pleasure. In Telugu, mada is used as a synonym for pride. But in fact, mada means exaggerated joy.
When the devotee enjoys the ecstasy of devotion, the devotee does not count anything more than the bliss. When a devotee glorifies saying, 'Takkumemi to us, Ramundokkdundu' as sung by Ramadas meaning that he does not care anything as long as Lord Rama is there by his side, he does not even count the poison. Ramadasu was very happy in his devotion of Rama and did not count Tanisha's punishment.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment