🌹 22, JUNE 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹

🍀🌹 22, JUNE 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 22, JUNE 2023 THURSDAY గురువారం, బృహస్పతి వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 388/ Bhagavad-Gita - 388 🌹
 🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 16 / Chapter 10 - Vibhuti Yoga - 16 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 235 / Agni Maha Purana - 235 🌹 
🌻. గణపతి పూజావిధి కధనము / Mode of worshipping Gaṇeśa (gaṇeśapūjā) 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 100 / DAILY WISDOM - 100 🌹 
🌻 9. పరిపూర్ణత లేని చోట ఆనందం ఉండదు / 9. Happiness is Nowhere to be Found where Perfection is Absent 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 366 🌹
6) 🌹. శివ సూత్రములు - 102 / Siva Sutras - 102 🌹 
🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 5 / 2-07. Mātrkā chakra sambodhah   - 5 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 22, జూన్‌, JUNE 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : వినాయక చతుర్థి, Vinayaka Chaturthi 🌺*

*🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 11 🍀*

*21. రాత్రిరూపో దివారూపః సంధ్యాఽఽత్మా కాలరూపకః |*
*కాలః కాలవివర్ణశ్చ బాలః ప్రభురతుల్యకః*
*22. సహస్రశీర్షా పురుషో వేదాత్మా వేదపారగః |*
*సహస్రచరణోఽనంతః సహస్రాక్షో జితేంద్రియః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : భక్తి, ఆకాంక్ష విలసిల్లదగు స్థానం - హృదయ కుహరపు ప్రశాంతత యందు ఈశ్వరుని యెడ నిక్కమైన భక్తి, ఆకాంక్ష పాదుకొనడం అవసరం. అప్పుడే నీ స్వభావం దానంతటది విచ్చుకొంటుంది. నిక్కమైన అనుభూతి నీకు కలుగుతుంది. జగజ్జనని శక్తి నీలో పనిచేయ మొదలిడుతుంది. నీకు కావలసిన జ్ఞాన సాక్షాత్కార మవుతుంది. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
ఆషాఢ మాసం
తిథి: శుక్ల చవితి 17:29:09 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: ఆశ్లేష 28:18:55 వరకు
తదుపరి మఘ
యోగం: హర్షణ 27:31:05 వరకు
తదుపరి వజ్ర
కరణం: విష్టి 17:29:09 వరకు
వర్జ్యం: 15:43:24 - 17:31:12
దుర్ముహూర్తం: 10:06:16 - 10:58:57
మరియు 15:22:23 - 16:15:04
రాహు కాలం: 13:56:46 - 15:35:33
గుళిక కాలం: 09:00:25 - 10:39:12
యమ గండం: 05:42:51 - 07:21:38
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:43
అమృత కాలం: 26:30:12 - 28:18:00
మరియు 28:36:54 - 30:24:58
సూర్యోదయం: 05:42:51
సూర్యాస్తమయం: 18:53:06
చంద్రోదయం: 09:03:00
చంద్రాస్తమయం: 22:18:53
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: అమృత యోగం - కార్య
సిధ్ది 28:18:55 వరకు తదుపరి ముసల
యోగం - దుఃఖం
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 388 / Bhagavad-Gita - 388 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 16 🌴*

*16. వక్తుమర్హస్యశేణ దివ్యా హ్యాత్మవిభూతయ: |*
*యాభిర్విభూతిభిర్లోకానిమాంస్త్వం వ్యాప్య తిష్టసి ||*

🌷. తాత్పర్యం :
*నీవు ఏ దివ్యవిభూతుల ద్వారా ఈ లోకములన్నింటి యందును వ్యాపిచి యుందువో వాటన్నింనిటిని దయతో నాకు విశదముగా తెలియజేయుము.*

🌷. భాష్యము :
*దేవదేవుడైన శ్రీకృష్ణుని గూర్చిన తన అవగాహనచే అర్జునుడు సంతుష్టి చెందియే ఉన్నట్లుగా ఈ శ్లోకమున గోచరించుసునది. కృష్ణుని కరుణ వలన అతడు స్వానుభావమును, బుద్ధిని, జ్ఞానమును మరియు వాని ద్వారా తెలిసికొనదగిన సర్వవిషయములను ఏరుగజాలి శ్రీకృష్ణుని దేవదేవునిగా అవగతము చేసికొనగలిగెను. తనకెటువంటి సందేహము లేకున్నను ఇచ్చట అర్జునుడు శ్రీకృష్ణుని సర్వవ్యాపకక లక్షణమును వివరింపుమని అడుగుచున్నాడు.*

*శ్రీకృష్ణభగవానుని ఈ సర్వవ్యాపక లక్షణమునకే సామాన్యజనులు, ముఖ్యముగా నిరాకారవాదులు ఎక్కువ ప్రాముఖ్యము నొసగుటయే అందులకు కారణము. కనుకనే వివిధశక్తుల ద్వారా శ్రీకృష్ణుడు ఏ విధముగా సర్వవ్యాపియై యుండునో అర్జునుడు ప్రశ్నించుచున్నాడు. ఈ ప్రశ్నను అర్జునుడు సామాన్యజనుల పక్షమున అడిగినట్లుగా ప్రతియొక్కరు గుర్తింపవలెను.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 388 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 10 - Vibhuti Yoga - 16 🌴*

*16. vaktum arhasy aśeṣeṇa divyā hy ātma-vibhūtayaḥ*
*yābhir vibhūtibhir lokān imāṁs tvaṁ vyāpya tiṣṭhasi*

🌷 Translation : 
*Please tell me in detail of Your divine opulences by which You pervade all these worlds.*

🌹 Purport :
*In this verse it appears that Arjuna is already satisfied with his understanding of the Supreme Personality of Godhead, Kṛṣṇa. By Kṛṣṇa’s grace, Arjuna has personal experience, intelligence and knowledge and whatever else a person may have, and through all these agencies he has understood Kṛṣṇa to be the Supreme Personality of Godhead. For him there is no doubt, yet he is asking Kṛṣṇa to explain His all-pervading nature.*

*People in general and the impersonalists in particular concern themselves mainly with the all-pervading nature of the Supreme. So Arjuna is asking Kṛṣṇa how He exists in His all-pervading aspect through His different energies. One should know that this is being asked by Arjuna on behalf of the common people.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 235 / Agni Maha Purana - 235 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 71*

*🌻. గణపతి పూజావిధి కధనము 🌻*

*ఈశ్వరుడు పలికెను; విఘ్నవినాశమునకై గణపతిపూజను గూర్చి చెప్పెదను. ఇది సకలాభీష్టములను ఇచ్చును.*

*''గణంజయాయస్వాహా హృదయాయనమః; ఏకదంష్ట్రాయ హుం ఫట్‌ శిరసే నమః, అచల కర్ణినే నమో నమః శిఖాయై నమః, గజవక్త్రాయ నమో, నమః కవచాయ నమః, మహోదరాయ చణ్డాయ నమః నేత్రాభ్యాం నమః, సుదణ్డహస్తాయనమః అస్త్రాయనమః'' అని అంగన్యాసములు చేసికొనవలెను. ముఖ్యకమలమండలముపైదళములందు, క్రింది దళములందును గణ - గురు - గురుపాదుకా - శక్తి - అనంత - ధర్మములను, పూజించి కమలకర్ణికమీద బీజమును పూజింపవలెను. తీవ్రా, జ్వాలినీ, నందా! భోగదా, కామరూపిణీ, ఉగ్రా-తేజోవతీ, సత్యా, విఘ్ననాశినీ అను తొమ్మిది పీఠశక్తులను పూజించవలెను. పిమ్మట చందన చూర్ణను అసనముగ సమర్పించవలెను. 'యం' అనునది శోషకవాయుబీజము, 'రం'అగ్ని బీజము. 'లం' పృథివీబీజము, 'వం' అమృతబీజము,* 

*'' ఓం లమ్బోదరాయ విద్మహే మహోదరాయ ధీమహి, తన్నో దన్తిః ప్రచోదయాత్‌''*

*అనునది గణేశ గాయత్రీ మంత్రము, గణపతి-గణాధిప-గణేశ-గణనాయక-గణక్రీడ-వక్రతుండ-ఏకదంష్ట్ర-మహోదర-గజవక్త్ర - లంబోదర-వికట-విఘ్ననాశన-ధూమ్రవర్ణులను, మహేంద్ర దిక్పాలకులను గణపతి పూజంగముగ పూజించవలెను.*

*శ్రీ అగ్ని మహాపురాణమునందు గణపతి పూజావిధి కథన మను డెబ్బదియొకటవ అధ్యాము సమాప్తము.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 235 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 71*
*🌻 Mode of worshipping Gaṇeśa (gaṇeśapūjā) 🌻*

The God said:
1-2. I shall describe the (mode of) worship of Gaṇa [i.e., gaṇapūjā, gaṇeśapūjā]. (Gaṇeśa) which removes obstacles and confers the desired. objects. (The worship of six kinds should be done as follows): The heart with “oblations to Gaṇeśa”, the head with “(obla-tions) to the one-tusked”, the tuft with “(oblations) to the one who has the ear like that of an elephant”, the armour with “(oblations) to the elephant-faced”, the eye with “(oblations) to the big-bellied,” the weapons with “(oblations) to one who has his own tusk in his hands”.

3-5. One should worship the gaṇa, the preceptor, the sandals, the (divine) energy, Ananta, the dharma, and the collection of bones in the lower part of the pedestal, the cover, the petals of the lotus, the lotus and the principal letter, (should be worshipped) in the upper part. (The energies) (are) Jvālinī, Nandā, Sūryeśā, Kāmarūpā, Udayā, Kāmavarttinī, Satyā, and Vighnanāśā. The seat (should be worshipped) with perfumes and earth. (With the following letters the appropriate acts should be performed): the drying with Yaṃ, the burning with raṃ, the agitating with laṃ and making it to nectar with vaṃ.

The gāyatrī-mantra is:
Om bodarāya vidmahe mahodarāya dhīmahi tanno dantī pracodayāt.

    [“May we know the Supreme person. For that, we meditate upon Lambodara (long-bellied) and Mahodara (big-bellied). May Dantin (one who has the tusk) impel us towards it.”]

6-7. The following are the names of Gaṇeśa to be worshipped: “Gaṇapati (Lord of gaṇas), Gaṇādhipa (chieftain of the gaṇas), Gaṇeśa (Lord of gaṇas), Gaṇanāyaka (the lord of gaṇas), Gaṇakrīḍa (one who sports with the gaṇas), Vakratuṇḍa (having a bent trunk), Ekadaṃṣṭra (having one tusk), Mahodara (big-bellied), Gajavaktra (elephant-faced), Lambakukṣi (long-bellied), Vikaṭa (dreadful), Vighnanāśana (destroyer of impediments), Dhūnravarṇa (tawny-coloured) and Mahendra.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 100 / DAILY WISDOM - 100 🌹*
*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 9. పరిపూర్ణత లేని చోట ఆనందం ఉండదు 🌻*

*వర్ణం అంటే ‘రంగు’ కాదు. అంటే ఇది చర్మంలోని ఆర్య లేదా ద్రావిడ వ్యత్యాసాన్ని సూచించడంలేదు. మానవుల సామాజిక సంస్థలో ఉన్నతమైన మరియు తక్కువ వంటి దేనినీ సూచించదు. అలా అనుకోవడం వాస్తవాన్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నట్టే. వర్ణం అనేది కళ్లకు కనిపించే ‘రంగు’ కాదు. మనసుకు అర్థమయ్యే ఒక స్థాయి. అంటే 'వర్ణ' అనే పదం ద్వారా మనం మానవ సమాజంలో ధర్మం యొక్క వ్యక్తీకరణ స్థాయిలను అర్థం చేసుకోవాలి, తద్వారా వారి కలయిక లేదా సమన్వయం మానవ సమాజాన్ని మరియు ఉనికిని నిలబెట్టుకుంటుంది.*

*జీవితం అనేది విభజించనలవికానిది. దాని విజ్ఞానం, శక్తి, ఐశ్వర్యం మరియు శక్తితో నిరంతరం ఏకీకృతమైనప్పటికీ, ఏ నిర్దిష్ట మానవుడిలోనూ అంత సమగ్ర పద్ధతిలో వ్యక్తీకరించ బడదు. అతను అతి మానవుడైతే తప్ప. సాధారణ మానవులలో, ఈ నాలుగు పార్శ్వాల సమగ్ర కలయిక అసాధ్యం. పరిపూర్ణత లేని చోట ఆనందం ఎక్కడా ఉండదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 100 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 9. Happiness is Nowhere to be Found where Perfection is Absent 🌻*

*Varna does not mean ‘colour’ referring to the Aryan or the Dravidian difference of skin, nor indicating anything like the superior and the inferior in the social organisation of human beings. To think so would be a total misconstruing of fact. Varna is not a ‘colour’ visible to the eyes but a ‘degree’ conceivable by the mind; which means to say that by the term ‘varna’ we are to understand the degrees of expression of dharma in human society in such a way that their coming together or coordination will sustain human society and existence.*

*Though life is a continuous and single whole enshrining in its bosom knowledge, power, richness and energy, it cannot be manifest in any particular human individual in such a comprehensive fashion unless he is a Superman (ati-manava). In ordinary human beings, such a blending of the four factors is impossible. Happiness is nowhere to be found where perfection is absent.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 365 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. అంతిమ సత్యాన్ని తెలిసిన వాళ్ళు దాని విరోధాభావ తత్వాన్ని గ్రహిస్తారు. అది భిన్న ధృవాల్ని కలిగి వుంటుంది. అది ఏకకాలంలో రాత్రీపగలూ, పుట్టడం, గిట్టడం, అనుభవం నీకు వ్యతిరేకత లేవని తెలుపుతుంది. 🍀*

*జీవితం యొక్క అంతిమ అనుభవం విరోధాభాసమే. భిన్న ధృవములు కలిగినది. అది నిశ్శబ్ద శబ్దం. హేతుదృష్టితో చూస్తే అది అసంగతం. ఎందుకంటే నిశ్శబ్దం వుంటుంది. లేదా శబ్దముంటుంది. రెండూ ఒకేసారి వుండవు. కానీ తెలిసిన వాళ్ళు నిశ్శబ్ద శబ్దాన్ని ఆమోదిస్తారు. అది ఒంటి చేతి శబ్దం. అంతిమ సత్యాన్ని తెలిసిన వాళ్ళు దాని విరోధాభానతత్వాన్ని గ్రహిస్తారు. అది భిన్న ధృవాల్ని కలిగి వుంటుంది.*

*అది ఏకకాలంలో రాత్రీపగలూ, పుట్టడం, గిట్టడం, అనుభవం నీకు వ్యతిరేకత లేవని తెలుపుతుంది. అన్ని వ్యతిరేకతలూ అభినందనలే. వాస్తవంలో వైరుధ్యముంటుంది. దాంట్లో భిన్న ధృవాలుంటాయి. సరయిన దృష్టితో చూస్తే అవి వ్యతిరేకతలు కావు. అవి ఒకదానికొకటి పూరకాలు. అత్యల్పస్థాయి నించీ చూస్తే అవి వైరుధ్యాలనిపిస్తాయి. వాస్తవంలోని విరోధాభాస అదే.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 102 / Siva Sutras - 102 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 5 🌻*
*🌴. ఒక గురువు సహాయంతో, యోగి మాతృక చక్ర జ్ఞానాన్ని మరియు మంత్ర శక్తులను స్వీయ-శుద్ధి మరియు స్వీయ-సాక్షాత్కారం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. 🌴*

*ఒకరు తరచూ ఒకే అనుభవానికి గురైనప్పుడు, అతను స్వయంగా ఆ అనుభూతి సారాంశంగా రూపాంతరం చెందుతాడు. అనుభవం ద్వారా మాత్రమే స్వీయ సాక్షాత్కారం జరుగుతుంది. కానీ శివుని ప్రాథమిక కదలికకు దర్శించువారు ఎవరూ లేనందున శివుని ప్రాథమిక కదలికను అనుభూతి చెందలేము. శివుని ఈ మొదటి కదలిక చైతన్యాన్ని సృష్టిస్తుంది. ఇక్కడే చైతన్యం ప్రారంభమవుతుంది. దాని తదుపరి ప్రయాణంలో, అది బ్రహ్మానందంగా రూపాంతరం చెందుతుంది. ఈ పరివర్తన శివునిలోనే జరుగుతుంది. అతని అంతర్గత పరివర్తన యొక్క అంతిమదశలో, విశ్వం యొక్క అభివ్యక్తి జరగదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 102 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-07. Mātrkā chakra sambodhah   - 5 🌻*
*🌴. With the help of an guru, a yogi gains the knowledge of matruka chakra and how to harness the mantra shaktis, for self-purification and self-realization.  🌴*

*When one frequently undergoes the same experience, he himself gets transformed as the subject of that experience. This is how Self Realisation happens, by experience and experience alone. But the preliminary move of Śiva cannot be experienced as there is none to witness His first move. This first move of Śiva gives rise to consciousness. This is where consciousness begins and during its further journey, it gets transformed into bliss. This transformation happens within Śiva Himself. At the end of His internal transformation, manifestation of the universe does not happen.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

No comments:

Post a Comment