శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 551 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 551 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 551 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 551 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।
సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀

🌻 551. 'సర్వవ్యాధి ప్రశమనీ' - 2 🌻


మనస్సు నిర్మలమైనచో వ్యాధులు శమించును. మనసు నిర్మల మగుటకు కూడ శ్రీమాత ఆరాధనము విశేషముగ ఉపకరించును. నిత్యమూ శ్రద్ధా భక్తులతో శ్రీసూక్త పారాయణ చేయువారికి శ్రీమాతయే వ్యాధి శమనము గావించ గలదు. ఆమె ప్రశమని, అనగా ప్రశస్తమైన శమమును ప్రసాదింప గలదు. మనస్సున, దేహమున వ్యాధులు ప్రబలి దీనుడైన జీవునకు శ్రీమాత ఆరాధనము దివ్యౌషధము. ఆర్తులను బ్రోచుటలో తల్లికన్న దయకలవా రెవ్వరు? కేవలము ఒక్క పిలుపుతో శ్రీమాత పిలుచువాని హృదయము నుండి స్పందించి శమనము కలిగింప గలదు. అందరి హృదయములలో నుండునది ఆమెయే. సమస్త జగత్తు ఆమె హృదయము నుండియే యేర్పడినది. కావున ఒక్క పిలుపుతో పలుకు శ్రీమాత వ్యధల నుండి జీవులకు పరిష్కార మీయగలదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 551 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh
sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻

🌻 551. 'Sarvavyadhi Prashamani' - 2 🌻


If the mind is pure, diseases will subside. Worshiping Sri Mata is also very helpful in making the mind clear. Shree Mata is able to heal those who recite Shree Sukta daily with devotion and diligence. She is prasmani, i.e. she can bestow great peace. Worship of Sri Mata is a divine medicine for a soul afflicted with diseases in mind and body. Who is more benevolent than a Mother for the afflicted? With just one call, Srimata can respond from the heart of the caller and bring relief. She is the one who is in everyone's heart. The whole world is made up of her heart. Therefore, with a single call, Srimata can cure the living beings of their afflictions.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment