🌹 11 DECEMBER 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹

🍀 🌹 11 DECEMBER 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹🍀 
1) 🌹సర్వ విఘ్నాలను తొలగించి, శుభాలను, ఐశ్వర్యాలను, జ్ఞానాన్ని ప్రసాదించే మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్రం మరియు అర్ధం. 🌹
2) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 579 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 579 - 2 🌹 
🌻 579. 'మృణాల మృదుదోర్లతా' - 2 / 579. 'Mrunala Mrududorlata' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹సర్వ విఘ్నాలను తొలగించి, శుభాలను, ఐశ్వర్యాలను, జ్ఞానాన్ని ప్రసాదించే మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్రం మరియు అర్ధం. 🌹*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ.*

*మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్రం ఒక భక్తుడు వివిధ శక్తుల అనుగ్రహాన్ని కోరుతూ శ్రీ లక్ష్మీ గణపతిని వర్ణిస్తూ ప్రార్ధించే అందమైన స్తోత్రం. దీనిలోని ప్రతి శ్లోకం గణపతిని ఆరాధిస్తూ, ఆయనకు చెందిన విశేషాలను, భక్తులపై ఆయన కురిపించే కృపలను, మరియు ఆయనకు చెందిన దివ్య లక్షణాలను వర్ణిస్తుంది. భక్తితో ఈ స్తోత్రం చదివిన వారికి, విన్న వారికి కూడా ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం వల్ల అంతరంగ శాంతిని, విజయాలను, మరియు సుఖాలను పొందగలమనే విశ్వాసం కలుగుతుంది.*

*Chaitanya Vijnaanam చైతన్య విజ్ఞానం*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 📖. గీతా జయంతి శుభాకాంక్షలు అందరికి, Gita Jayanthi Good Wishes to All 📖🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻. గీతామృత మహాత్మ్య శ్లోకము 🌻*

*గీకారం త్యాగరూపం స్యాత్ తకారమ్ తత్వబోధకమ్*
*గీతా వాక్య మిదమ్ తత్వం జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:*
*సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః|*
*పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం - గీతామృతమ్మహత్||*

*🍀. గీతా మహాత్మ్యము / Gita Mahatmya 🍀*
*(వరాహ పురాణాంతర్గతం)*

01. భూదేవి విష్ణుభగవానుని గూర్చి ఇట్లు ప్రశ్నించెను. ఓ భగవానుడా! పరమేశ్వరా! ప్రభూ! ప్రారబ్ధము అనుభవిం చే వానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగగలదు?

02. ఓ భూదేవీ! ప్రారబ్ధము అనుభవిస్తున్ననూ ఎవరు నిరంతరము గీతాభ్యాస మందు నిరతుడై ఉండునో అట్టివాడు ముక్తుడై కర్మలచే అంటబడక ఈ ప్రపంచము నందు సుఖముగా ఉండును.

03. తామరాకును నీరంటనట్లు గీతాధ్యానము చేయు వానిని మహాపాపములు కూడా కొంచమైనను అంటవు.

04. ఎచ్చట గీతా గ్రంధము ఉండునో మరియు ఎచ్చట గీతా పారాయణము జరుగుచుండునో అచ్చట ప్రయాగ మొదలగు సమస్త తీర్ధములు ఉండును.

05. ఎచ్చట గీతాపారాయ ణము జరుగుచుండునో అచటికి దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపికలు, గోపాలురు భగవత్స్పర్శ్యా స్యాసక్తులగు నారద, ఉద్ధవాదులు వచ్చి శీఘ్రముగా సహాయమొనర్తురు.

06. ఓ భూదేవీ! ఎచట గీతను గూర్చి విచారణ, పఠనము, భోధన, శ్రవణము జరుగు చుండునో అచట నేను ఎల్లప్పుడు తప్పక నివసింతును.

07. నేను గీతనాశ్రయించి ఉన్నాను, గీతయే నాకు ఉత్తమగు నివాస మందిరము మరియు గీతాజ్ఞానమును ఆశ్రయించియే మూడు లోకాలను నేను పాలించుచున్నాను.

08. గీత నా యొక్క పరమ విద్య అది బ్రహ్మస్వరూపము దీనిలో సందేహము లేదు, మరియు అది ప్రణవములో నాలగవ పాదమగు అర్ధమాత్రా స్వరూపము, నిత్యమైనది, నాశరహితమైనది, అనిర్వచ నీయమైనది.

09. సచ్చిదానంద స్వరూపు డగు శ్రీ కృష్ణ పరమాత్మచే స్వయముగా అర్జుననుకు ఉపదేశింప బడినది. ఇది మూడు వేదముల సారము, పరమానందమయినది, తన్నాశ్రయించిన వారికి శీఘ్రముగా తత్వజ్ఞానాన్ని కలుగచేయును.

10. ఏ నరుడు నిత్యమూ గీతయందలి పద్దెనిమిది అధ్యాయములను పఠించునో అతడు జ్ఞానసిద్ధిని పొంది తద్వారా పరమ పదమును (మోక్షమును) పొందును.

11. గీతని మొత్తము పఠించలేని వారు అందులో సగమైనను పఠించవలెను దీనివలన అతడికి గోదాన ఫలము వలన కలుగు పుణ్యము లభించుననుటలో సందేహము లేదు.

12. గీతయొక్క మూడవ భాగము(ఆరుఅధ్యాయములు) పఠించినవానికి గంగా స్నాన ఫలము లభించును, ఆరవ భాగము (మూడు అధ్యాయములు)పఠించువారికి సోమయాగ ఫలము లభించును.

13. ఎవడు గీతయొక్క ఒక అధ్యాయము భక్తితో పఠించునో అతడు రుద్ర లోకమును పొంది రుద్ర గణములలో ఒకడుగా శాశ్వతముగా నివసించును.

14. ఓ భూదేవీ ఎవరు గీత నందలి ఒక అధ్యాయము నందలి నాల్గవ భాగమును నిత్యమూ పఠించునో అతడు ఉత్కృష్టమైన మానవ జన్మ ఒక మన్వంతర కాలము పొందును.

15. ఎవరు గీతనందలి పది శ్లోకములను కానీ, ఏడు శ్లోకములను కానీ, ఐదు శ్లోకములను కానీ, నాలుగు శ్లోకములను కానీ, మూడు శ్లోకములను కానీ, రెండు శ్లోకములను కానీ, ఒక శ్లోకమును కానీ, అర్ధ శ్లోకమును కానీ నిత్యము ఏవరు పటింతురో,

16. వారు చంద్రలోకములో పదివేల సంవత్సరములు సుఖముగా జీవించుననుటలో సందేహము లేదు మరియు గీతను పఠిస్తూ ఎవరు మరణిస్తారో అతడు ఉత్తమ మగు మానవ జన్మను పొందుట నిశ్చయము.

17. అట్లాతడు మానవుడై జన్మించి గీతాభ్యాసమును మరల మరల గావించి ఉత్తమమగు మోక్షమును పొందుననుటలో సంశయము లేదు. గీతా గీతా అనుచు ప్రాణమును వదలువాడు సత్గతిని పొందుననుటలో సందేహము లేదు.

18. మహా పాపాత్ముడైనను అతడు గీతార్ధమును తెలుసుకొనుటలో ఆసక్తుడై నచో అతడు విష్ణు లోకమును పొంది శ్రీమహా విష్ణు సన్నిధిలో ఆనందమును అనుభవించు చూ ఉండును.

19. ఎవడు గీతార్ధమును నిత్యము చింతన చేయుచుం డునో అతడు అనేక కర్మల నాచరించిననూ జీవన్ముక్తు డేనని చెప్పబడెను, మరియు దేహ పతనానంతరము పరమ పదమును (కైవల్యమును) పొందును.

20. ఈ ప్రపంచమున గీతను ఆశ్రయించి జనకాది రాజులు అనేకులు పాపరహితులై ముక్తిని పొందియున్నారు.

21. గీతని పఠించి పిదప మహత్యమును ఎవరు పఠించకుందురో అట్టి వారి గీతా పఠనము వ్యర్ధమే (నిష్ఫలమే). అట్టివారి గీతాపఠనము శ్రమ మాత్రమే నని చెప్ప బడినది.

22. గీతా మహత్యముతో గీతా పారాయణము చేయువారు పైన చెప్పబడిన ఫలములను పొంది, దుర్లభ మగు సద్గతిని పొందుతురు.

23. శౌనకాది ఋషులారా! ఈ ప్రకారముగా సనాతనమైన గీతా మహత్యమును మీకు తెలుపుచున్నాను. దీనిని గీతా పారాయణానంతరము ఎవరు పఠింతురో అతడు పైన చెప్పిన ఫలమును పొందును.

24. ఇట్లు వరాహ పురాణమునందలి గీతా మహత్యము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 579 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 579 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 117. మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా ।*
*మహనీయా, దయామూర్తీ, ర్మహాసామ్రాజ్యశాలినీ ॥ 117 ॥ 🍀*

*🌻 579. 'మృణాల మృదుదోర్లతా' - 2 🌻*

*మహత్తరమగు బలము కలిగియు తామరతూడువంటి మృదువైన భుజములు కలిగియుండుట అద్భుతమైన విషయము. త్రిమూర్తులు కూడ గెలువలేని భండాసుర, మహిషాసురాది అసురులను తన భుజ శక్తితోనే సంహరించినది కదా! అమిత శక్తివంతమైననూ సుకుమారముగ నుండుట వైభవమునకు చిహ్నము. కావుననే ప్రత్యేకించి హయగ్రీవుడు శ్రీమాత భుజములను కీర్తించుచూ ఈ నామము తెలిపినాడు. శ్రీమాత రూప సౌందర్య సందర్భమున గాక ఆమె మాహాత్మ్యమును తెలుపు సందర్భముగ తెలిపినాడు. మహాకైలాసమందు శివునితో నృత్యము చేయు శ్రీమాత భుజములను, మాహాత్మ్యమును వర్ణించుచున్నాడు. కావుననే తరువాతి నామము 'మహనీయా' అని పేర్కొనినాడు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 579 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 117. Mahakailasa nilaya mrunala mrududorlata*
*mahaniya dayamurti rmahasamrajya shalini ॥117 ॥ 🌻*

*🌻 579. 'Mrunala Mrududorlata' - 2 🌻*

*Having tender, delicate arms akin to lotus stalks yet possessing immense strength is an extraordinary trait. Despite her unmatched power, Śrī Māta defeated the mighty demons like Bhaṇḍāsura and Mahiṣāsura, whom even the Trimūrti (Brahma, Vishnu, and Shiva) could not vanquish. Her ability to combine immense strength with tender beauty is a mark of her magnificence. This unique quality prompted Hayagrīva, while describing Śrī Māta, to highlight her arms with this specific name. This name not only reflects her physical beauty but also her immense greatness. Hayagrīva extols Śrī Māta's arms in the context of both her beauty and her valor. When Śrī Māta dances with Śiva on Mount Kailāsa, her arms and her grandeur are vividly described. Hence, the next name in the series is 'Mahanīyā', signifying her greatness.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/FkxpuODbEy62n58Xnsq3eO 
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad
https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. Chaitanya Vijnaanam YouTube FB Telegram groups 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
Like, Subscribe and Share 👀
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment