శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 585 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 585 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀
🌻 585. 'శ్రీవిద్యా’ - 2 🌻
ముఖ భాగము ప్రజ్ఞావంతముగను, మధ్య భాగము శక్తివంతముగను, అధోభాగము సూక్ష్మపదార్థముగను శ్రీమాత వెలుగొందుచుండును. ఈ త్రికూట రూపము ఆధారముగనే జీవుల రూపము లన్నియూ యేర్పడు చున్నవి. చతుర్విధ పురుషార్థము లను ఈ మూడింటి ఆధారముగనే జీవులు నిర్వర్తించు కొనుచున్నారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము అను నాలుగునూ పురుషార్థములు. ధర్మముతో కూడియుండి అర్థకామముల ననుభవించుట మోక్షప్రదము. ధర్మము వీడి అర్థమును కూడబెట్టుట, కోరికలు తీర్చుకొనుట నిర్వర్తించినచో జీవులు బంధమున పడుదురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻
🌻 585. 'Shree Vidya' - 2 🌻
Sri Mata radiates divine energy in three aspects: her "facial region" shines with "intelligence and wisdom", her "midsection" radiates power and strength, and her lower region embodies the essence of "subtle elements". This "threefold form" serves as the foundation for the creation of all beings. The lives of all creatures are structured around this triadic form, which also underpins the pursuit of the four "Purusharthas" (human goals): Dharma (righteousness), "Artha" (wealth), "Kama" (desires), and Moksha (liberation). Experiencing "Artha" and "Kama" while rooted in "Dharma" leads to "Moksha." However, abandoning Dharma in the pursuit of wealth and fulfilling desires traps beings in the cycle of bondage.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment