🍀 ఈ మాఘ పూర్ణిమ, శ్రీ లలితా జయంతి, థైపూసం ఉత్సవం, రవి పుష్య యోగం, సర్వార్థ సిద్ధి యోగం కలిసి వచ్చిన అరుదైన యోగం! అపమృత్యు దోషం నివారణకు అనుకూలం. బ్రహ్మాండ పురాణ రహస్యం. 🍀
ప్రసాద్ భరధ్వాజ
🍀 This Magha Purnima is a rare and auspicious occasion, coinciding with Sri Lalita Jayanti, Thaipusam festival, Ravi Pushya Yoga, and Sarvartha Siddhi Yoga! It is favorable for the removal of the Apamrityu Dosha (premature death affliction). A secret from the Brahmanda Purana. 🍀
Prasad Bharadwaj
మఘా నక్షత్రంలో చంద్రుడి సంచారాన్ని మాఘ పౌర్ణమి గా జరుపుకుంటారు. ఈ ఏడాది మాఘ పౌర్ణమి 2026 ఫిబ్రవరి 1వ తేదీన వచ్చింది. మాఘ పూర్ణిమ చంద్రుని శక్తి గరిష్టంగా ఉండే పవిత్రమైన రోజు. నదీ స్నానం తప్పక చేయాలి, ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజున సముద్ర స్నానం కోటి జన్మల పాపాలు తొలగిస్తుంది అని శాస్త్ర వాక్యం. ప్రయాగ లో మాఘ పౌర్ణమి రోజున సమస్త దేవతలు స్నానం చేస్తారు,ఆ నీటిలో దైవ శక్తి అపరిమితంగా ఉంటుంది,కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగించడం ఎంత గొప్పదో మాఘ పౌర్ణమి రోజున స్నానం అంతకు పది రెట్లు విశిష్టమైంది, వీలైతే నది, కుదిరితే సముద్రం, లేదా ప్రయాగ స్నానం చేయండి,లేదా ఇంట్లోనే గంగా యమున మొదలైన నదులను స్మరిస్తూ సూర్యోదయం లోగా నే స్నానం చేయాలి.
ఈ ఏడాది వచ్చే మాఘ పౌర్ణమి అరుదైన యోగంతో వచ్చింది. అయితే ఎప్పుడైనా మఘ నక్షత్రం చంద్రుడు ఉన్నప్పుడు పౌర్ణమి రోజు చేసే పరిహారం అపమృత్యు దోషం నుంచి కాపాడుతుందట. అలాగే ఆయుష్షును పెంచుతుందట. అలాగే మిగతా గ్రహాలన్నీ ఒక్కొక్కటి మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళుతున్నాయి. ఫిబ్రవరిలో చూస్తే పంచగ్రహ కూటమి 12 నుంచి 15 రోజులు ఉంటుంది. అయితే.. మాఘ పౌర్ణమి రోజు ఎవరైతే సూర్యుడిని, అమ్మవారిని ప్రార్థిస్తారో.. వారికి ఆయుష్షు పెరగడంతో పాటు మానసిక రుగ్మతలు, ఆరోగ్య సమస్యలు తొలగుతాయి.
శ్రీ లలితా దేవి భండాసుర సంహారం కోసం దేవతలు చేసిన మహాయగం నుండి ఆవిర్భవించిన రోజు ఈ మాఘ పౌర్ణమి. సాధారణంగానే పౌర్ణమి రోజున లలితా ఆరాధన ఎంతో గొప్ప ఫలాలు ఇస్తుంది, అందులోనూ యోగం తో కూడిన, మాఘ పౌర్ణమి రోజున రాత్రి వేళ చంద్రబింబం పాలలో చూస్తూ అందులో లలితా దేవిని ధ్యానిస్తూ లలితా సహస్ర నామాలు చదివితే ఎలాంటి కోరిక అయిన వెంటనే తీరుతుంది ఇది బ్రహ్మాండ పురాణం చెప్పిన గొప్ప రహస్యం.
మఖ నక్షత్రం వచ్చినప్పుడు అమ్మవారిని పూజించడంతో పాటు పితృదేవతారాధన చేయడం అత్యంత శుభప్రదం. పితృదేవతారాధన వల్ల కలిగి ప్రయోజనం ఏమిటంటే.. జన్మయోగంలో పిశాచ యోగం పట్టడం, దోషాలు కలగడంతో పాటు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తగ్గి దేవతాశక్తి పెరుగుతుంది. ఇవి జరగాలంటే మాఘ పౌర్ణమి రోజు అమ్మవారి ఆరాధనతో పాటు పితృదేవతారాధన ఖచ్చితంగా చేయాలట. ముఖ్యంగా మఖ నక్షత్రం రోజు చేసే పితృదేవారాధన విశేషమైన ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే మఖ నక్షత్రానికి పితృదేవతలను అధిదేవతలుగా చెబుతారు.
థైపూసం : ఇది తమిళుల ఉత్సవం, తారకాసుర సంహారం కోసం జన్మించిన సుబ్రహ్మణ్య స్వామికి పార్వతి దేవుడు శక్తి ఆయుధాన్ని ఇచ్చిన రోజు. జ్ఞాన సిద్ధికి, ఈ రోజున తమిళ నాట విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు.
సర్వార్థ సిద్ధి & సిద్ధ యోగం: మీరు చేసే ఏ ప్రయత్నానికైనా విజయాన్ని చేకూర్చే అద్భుత ఘడియలు ఇవి.
🍀 మాఘ పౌర్ణమి రోజు పాటించాల్సిన పరిహారాలు 🍀
ఈ మాఘ పూర్ణిమ రోజున స్వయంపాకం దానం చేయడం, గోశాల దగ్గరకు వెళ్లి గోవులకు మేత వేయడం, వీలైనంత వరకు ధ్యానం చేయడం, తెల్లటి వస్త్రాలను దానంగా ఇవ్వడంతో పాటు మాఘ పౌర్ణమి రోజు క్షేత్ర దర్శనం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మరీ ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి రోజు అమ్మవారి మంత్ర సాధన చేయడం విశిష్టమైన ఫలితాలను ఇస్తుంది. త్వరగా మంత్ర సిద్ధి జరుగుతుంది. పౌర్ణమి రోజున అమ్మవారి మంత్రాలతో పాటు గణపతి మంత్రాలను పఠించడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది.
ఈ రోజు చేసే చిన్న దానమైనా, పూజ అయినా కొన్ని వందల రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కనుక యధాశక్తి పూజ,ధ్యానం,జపం, స్నానం చేయడం ఉత్తమం, ఈరోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం శుభప్రదం, అనేక దేవాలయాలలో లక్ష్మి నరసింహ కళ్యాణం జరుగుతుంది ఈరోజు. కనుక ఆధ్యాత్మికముగ ఎన్నో విశిష్టతలు ఉన్న ఈ గొప్ప సమయాన్ని వినియోగించుకొని దైవానుగ్రహం పొందండి.
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment