Facebook:
https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2139540320165771
🌹 మాతృ దినోత్సవం – సనాతన ధర్మంలో అమ్మ మహిమ 🌹
✍️ ప్రసాద్ భరద్వాజ
భారతీయ సంస్కృతిలో “తల్లి” స్థానం దేవతలకన్నా గొప్పది అని పురాణాలు చెబుతున్నాయి. “మాతృదేవో భవ” అనే వాక్యం కేవలం ఉపదేశం కాదు – అది సనాతన ధర్మపు జీవన సత్యం. తల్లి ప్రేమలో స్వార్థం ఉండదు; ఆమె ఆశీర్వాదంలో దైవత్వం దాగి ఉంటుంది.
పురాణాలలో శ్రీకృష్ణుడి జీవితాన్ని చూస్తే, యశోదమ్మ ప్రేమ ఎంత అపారమో తెలుస్తుంది. జగన్నాథుడైన శ్రీకృష్ణుడు కూడా యశోదమ్మ ఒడిలో చిన్న బాలుడిగా మారిపోయాడు. ఆమె ప్రేమ ముందు దైవమూ సైతం మమతకు బంధీ అయింది.
అలాగే గణపతి దేవుడు తన తల్లిదండ్రులనే ప్రపంచంగా భావించి, వారి చుట్టూ ప్రదక్షిణం చేసి “లోక విజేత” అయ్యాడు. ఈ కథ మనకు తల్లి స్థానం ఎంత ఉన్నతమో తెలియజేస్తుంది.
తల్లి మన జీవితానికి మొదటి గురువు, మొదటి దేవత, మొదటి ఆశ్రయం. ఆమె ఆశీర్వాదమే మన జీవితానికి నిజమైన బలం. ఈ మాతృదినోత్సవం సందర్భంగా ప్రతి తల్లికి కృతజ్ఞతలు తెలియజేయడం మన ధర్మం.
🌻 అమ్మ ప్రేమే ఈ సృష్టిలో శాశ్వతమైన దైవం. 🌻
🌹🌹🌹🌹🌹
🌸 Mother’s Day – The Glory of Motherhood in Ancient Dharma 🌸
✍️ Prasad Bharadwaj
In Indian culture, the position of a mother is considered even greater than that of the gods. The sacred saying “Matru Devo Bhava” means “Mother is Divine.” A mother’s love is pure, selfless, and filled with divine grace.
In Hindu mythology, the love of Mother Yashoda for Lord Krishna beautifully reflects the greatness of motherhood. Though Krishna was the Supreme Lord of the universe, he became a playful little child in the loving embrace of Yashoda. Even divinity surrendered before a mother’s affection.
Similarly, Lord Ganesha proved the greatness of parents by considering them his entire world. Instead of circling the universe, he circled his parents and attained victory, showing that parents – especially the mother – are above all worlds.
A mother is the first teacher, the first protector, and the first form of God in one’s life. Her blessings become the true strength behind every success and happiness.
🌻 A mother’s love is the eternal divinity that sustains creation. 🌻
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment