🌹అద్భుతమైన లైఫ్ ఖచ్చితంగా ఇలా సాధ్యం 🌹

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

🌹అద్భుతమైన లైఫ్! 🌹

ఓర్పుగా చివరిదాకా చదవండి!
మీకే తెలుస్తుంది అద్భుతం!!

                      ➖➖➖✍
🌴 అద్భుతమైన లైఫ్ ఖచ్చితంగా ఇలా సాధ్యం! 🌴

ఈ క్షణం మీరెలా ఫీలవుతున్నారు? అద్భుతంగానా, డిజప్పాయింటెడ్‌గానా, బోర్‌గానా, చిరాకుగానా…? ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మన లైఫ్‌ని డిసైడ్ చేసే అతి పెద్ద ఫేక్టర్ ఇది!

బ్రెయిన్‌కి పంపించబడాల్సిన instructions చాలాసార్లు తప్పుగా హైజాక్ అవుతుంటాయి. అందుకే మనం ఫెయిల్యూర్డ్ పీపుల్‌గా మిగిలిపోతున్నాం. ఇంకో మాటలో చెప్పాలంటే “నెగిటివ్ ప్రోగ్రామింగ్” చేయబడుతోంది బ్రెయిన్.

బ్రెయిన్‌కి మంచీ చెడూకి మధ్య తేడా తెలీదు. మనం ఏది చెయ్యమంటే అది గుడ్డిగా చేస్తుంది.

చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మీరు “ఈ మధ్య జనాల పేర్లు మర్చిపోతున్నాం” అని రిపీటెడ్‌గా అనుకుంటూ ఉన్నారనుకోండి.. బ్రెయిన్ అలాగే ప్రోగ్రామింగ్ చెయ్యబడుతుంది.

మీరు గుర్తుంచుకోవాలని ట్రై చేసిన ప్రతీసారీ గుర్తుంచుకోవలసిన పేరుని డెఫినెట్‌గా మర్చిపోయి… మన నెగిటివ్ ప్రోగ్రామింగ్‌ని విజయవంతంగా ప్రాసెస్ చేసి పారేస్తుంది బ్రెయిన్.

మీకు హెల్త్ బాలేదని అనుకుంటూ ఉండండి…. ఖచ్చితంగా ఏదో ఒక సమస్య వస్తుంది.

“బాలేదు బాలేదు” అనుకుంటున్న క్షణం నుండి బ్రెయిన్ వివిధ organsకి ఆదేశాలు జారీచేసి, బాడీ మెటబాలిజాన్ని తారుమారు చేసి ఏదో ఒక discomfort తలెత్తేలా చేసి తీరుతుంది. దానికి మనం అప్పజెప్పిన task ఏదైతే ఉందో… “మన హెల్త్ బాలేదని” దాన్ని కంప్లీట్ చెయ్యడమే దాని లక్ష్యం.
————
చాలామంది ఉద్యోగాలు రావట్లేదనో, లైఫ్‌లో తాము ఎందుకూ పనికిరామనో, సంతోషం అంటే ఏమిటో తెలీదనో.. రకరకాల మెంటల్ ట్రాప్‌లలో ఇరుక్కుపోతుంటారు. ఇవి రిపీటెడ్ సజెషన్లని బ్రెయిన్‌కి పంపిస్తుంటాయి. దాంతో ఉద్యోగం కోసం ట్రై చేసే ప్రతీ ప్రయత్నంలోనూ ఏదో ఒక లోపం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది, సంతోషంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా చిరాకుగానే ఉండిపోతుంటాం.
————–
ప్రతీ క్షణం మన ఆలోచనల ద్వారానో, నోటితో మాటల ద్వారానో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. ఆ ఆలోచనలు ప్రోగ్రామింగ్ లాంటివి.  ఈ ప్రోగ్రామింగ్‌లో పాజిటివ్ ఏటిట్యూడ్ సాధించగలిగితే ఖచ్చితంగా ప్రతీ క్షణం చాలా అద్భుతంగా ఉంటుంది.

అంటే మనల్ని మనం blame చేసుకోవడం తగ్గించాలి, ఇతరులు మనల్ని చులకన చేస్తూ మాట్లాడే వాటిని బ్రెయిన్‌కి తీసుకుని కుంగిపోవడం తగ్గించాలి.

ఎంత నెగిటివ్ ఎనర్జీ మనం లోపలకు పంప్ చేస్తే అంత నెగిటివ్ output వస్తుంది. సరిగ్గా అలాగే  ఎంత పాజిటివ్ ఎనర్జీ పంప్ చేస్తే అంత పాజిటివ్ output వస్తుంది.

ఇక్కడా మరో చిన్న ఉదాహరణ తీసుకుంటే… ఓ పబ్లిక్ గేదరింగ్‌లో అందరితో కలవలేక ఓ మూలన ఇరుక్కుంటే అందరూ సంతోషంగా ఉన్నట్లు కన్పిస్తారు. మనం ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అరమరికలు మర్చిపోయి మనుషుల మధ్య దూసుకుపోతే మన సంతోషం ముందూ, కలివిడితనం ముందూ అందరూ సరెండర్ అయిపోతారు.

సో లైఫ్‌లో ప్రతీ క్షణం ఏ సిట్యుయేషన్‌ని ఎలా లీడ్ చేయాలన్నది మన చేతిలోనే ఉంటుంది. సో ఎలాంటి ఛాయిస్ తీసుకుంటే లైఫ్ అలా ఉంటుంది.
—————————

ప్రోగ్రామింగ్ ట్రాప్ అని మరొకటి ఉంటుంది. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే దానికి సంబంధించిన పాత జ్ఞాపకాలూ, అనుభవాలూ ఏమైనా మన బ్రెయిన్ డేటాబేస్‌లో ఉన్నాయేమో బ్రెయిన్ చకాచకా స్కాన్ చేస్తుంది.

ఉదా.కు.. రోజూ మీకు టీ తాగే అలవాటు ఉంటే గతంలో ఎప్పుడో ఓరోజు సాయంత్రం టీ తాగలేదనుకుందాం. బాగా తలనొప్పి వచ్చి ఉంటుంది.

సో ఈరోజు మీరు మళ్లీ టీ తాగలేదనుకుందాం. వాస్తవానికి తలనొప్పి వచ్చే అవకాశం లేకపోయినా.. బ్రెయిన్ ఒక కండిషన్‌కి ఓ రిజల్ట్‌ని match చేసుకుని ఆ outcome ఎలాగైనా సాధించి పెడుతుంది.

ఇక్కడ కండిషన్ ఏంటంటే.. టీ తాగలేదు.

రిజల్ట్స్ ఏమిటంటే తలనొప్పి రావాలి.

సో తలనొప్పి వచ్చే ఛాన్స్ లేకపోయినా డేటాబేస్‌లోని పాత రికార్డుల ప్రకారం శరీరంలో బయలాజికల్ మార్పులను సృష్టించి మొత్తానికి తలనొప్పి తెప్పించేస్తుంది.
————

సో ప్రతీ కండిషన్‌నీ, ప్రతీ అనుభవాన్నీ, ప్రతీ రోజునీ, ప్రతీ క్షణాన్నీ కొత్తగా చూస్తే, కొత్తగా రెస్పాండ్ అవుతూ పోతే బ్రెయిన్ డేటాబేస్‌లోని పాత రికార్డులూ, పనికిమాలిన చేదు జ్ఞాపకాలూ అన్నీ కొట్టుకుపోతాయి. లైఫ్ ఎప్పుడూ కొత్తగా ఉంటుంది.. ఇప్పుడే లైఫ్ మొదలెట్టినంత తాజాగా ఉంటాం._

మరి మీరేమంటారు....?
🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺
🙏 ప్రసాద్

🌹గురువు అపార కరుణాసముద్రుడు 🌹

🌹గురువు అపార కరుణాసముద్రుడు 🌹

అయోమయావస్థలో ఉన్న వారి బుద్ధి పరిధిలో బోధించాలంటే గురువు అపార కరుణాసముద్రుడు కావాలి. ఇట్టి అర్హతలు కల గురువే సద్గురువు.

కనుక
1) అచంచలమైన ఆత్మానుభవం
2) ప్రేమపూరిత హృదయం

ఇవి గలవాడే సద్గురువుగా పరిగణింపబడతాడు.

శిష్యుల యొక్క సందేహాలను తీర్చి వారికి సరియైన జ్ఞానాన్ని అందించాలంటే గురువుకు అవసరం అయిన శాస్త్ర పాండిత్యం ఉండాలి, అంతేగాదు. అతడు బుద్ధి కుశలత కలిగినవాడై ఉండాలి.

ఎప్పుడు - ఏ స్థితిలో ఉన్న శిష్యునికి ఎట్టి జ్ఞానాన్ని అందించాలో - ఎట్టి ఉపదేశం చేయాలో తెలివిగలిగి ఉండాలి. శిష్యునికి అర్థమైన భాషలో చెప్పగలిగే భాషాసౌష్ఠవం ఉండాలి. దీనితో పాటు ఆత్మానుభవం లేకపోతే చెప్పిన మాటలన్నీ ఓటికుండ మ్రోతలే అవుతాయి. కొందరు పూర్తి ఆత్మానుభవంలో ఉంటారు.

మౌనంగా తమ గుహలలో కూర్చొని ఆనందంలో ఉంటారు. తమ అనుభవాన్ని సాధకులకు తెలియజేసే భాష వారి వద్దలేదు. వారి స్థాయి నుండి దిగివచ్చి శిష్యుల బుద్ధి స్థాయిలో బోధించలేరు. వర్ణనాతీతమైన అనుభవాన్ని వర్ణించలేరు. ఇట్టివారి వల్ల సాధకులకు ప్రయోజనం లేదు. అందుకే శాస్త్ర పాండిత్యం - అనుభవం రెండూ ఉండాలి - అట్టివానినే 'దేశికం' - పండితుడు - ఆచార్యుడు అని సంబోధిస్తున్నారిక్కడ.

అట్టి గురువును శిష్యుడు - 'సముపేత్య' - సమీపించాలి. ఉపేత్య అనక 'సముపేత్య' అంటున్నారు. గురువును సమీపించే విధానం కూడా ఎంతో ముఖ్యమైనది అని ఈ పదం యొక్క ఆంతర్యం.

గురువు ఎంత గొప్ప వాడైనప్పటికీ శిష్యునిలో మానసిక పరిపక్వత - బుద్ధి కుశలత అల్ప విషయాలకు ప్రాధాన్యతనివ్వని గుణం మొదలైన అర్హతలుంటేనే ప్రయోజనం. గురువు చెప్పిన వాక్యాలు అర్థం కాకపోతే శిష్యునిలో ఉత్సాహం, ఉత్తేజం ఉండదు. జ్ఞానం కలగదు. అందుకే 'సముపేత్య' అని శిష్యుడు ఎలా గురుసన్నిధిలో ప్రవేశించాలో చెబుతున్నారు.

(i) తాను తెలుసుకోబోయే జ్ఞానం యొక్క విలువ ఏమిటో తెలుసుకున్నవాడై, నేర్చుకోవాలనే ఆతృత గలవాడై యుండాలి.

(ii) గురువుపట్ల అత్యంత భక్తి శ్రద్ధ వినయము విధేయత ఆరాధనా భావం ఉండాలి. గౌరవం చూపాలి.

కొందరు గురువులవద్ద మహాత్ములవద్ద తమ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తారు. గురువును పరీక్షించాలనే భావంతో తమకు తెలిసిన విషయాలనే తెలియనట్లు అడుగుతారు. కొందరు ఉబుసుపోకకు అడుగుతారు. కొందరు గురువుకు తామెంతో దగ్గర వారైనట్లు, హడావుడి చేస్తుంటారు. ఫోజులు ఇస్తుంటారు. కొందరు భయంతో తమ సందేహాలను దాచుకుంటారు. ఇవేవీ సరైన పద్ధతులు కావు.

గురువును ఎలా సమీపించాలో, ఎలా ప్రశ్నించాలో ఆధ్యాత్మిక రంగంలో ఒక అతి ప్రధానమైన విషయం, అందుకే భగవద్గీత (4-34) లో "తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా" 'ఉపదేక్ష్యంతి' - అంటూ సాష్టాంగ నమస్కారం చేస్తూ తమ అహంకారాన్ని వదలి వినయంతో గురువును సేవించి - పాదాలొత్తి అనుకూల సమయంలో; తెలుసుకోవాలనే కాంక్షతో తెలుసుకోవాలి - అని చెప్పారు.

అణకువగా ఉండటం వల్లనే అహంకారం తగ్గిపోతుంది. అహంకారం తగ్గితే అర్హత వచ్చినట్లే. కనుకనే గురువు మీద గౌరవం, ప్రేమ, జ్ఞానాన్ని అందిస్తున్నందుకు కృతజ్ఞతా భావం, విశ్వాసం, ఆయన పాండిత్యం పట్ల ఆరాధనా భావం ఉండాలని శాస్త్రం నిర్దేశించి చెబుతున్నది

అలా గురువును ఆశ్రయించినప్పుడు తగిన ఉపదేశం చేస్తాడు, జ్ఞానాన్ని బోధిస్తాడు, సాధనలెలా చేయాలో తెలియజెబుతాడు. గురువు కేవలం సూచనలు చేయగలడేగాని ఆ సూచనలను గ్రహించి ఆచరణలో పెట్టుకోవాల్సిన వాడు శిష్యుడే.

సేకరణ : శ్రీ ఆదిశంకరాచార్యులవారి 'వివేకచూడామణి'

🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్

🌹 వ్యక్తిగా ఎదుగుదాం.. మంచి వ్యవస్థని నిర్మించుకుందాం..! 🌹

🌹 వ్యక్తిగా ఎదుగుదాం..🌹

🍃 మంచి వ్యవస్థని నిర్మించుకుందాం..! 🍃

వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఎదగాలంటే ముందు నువ్వు వ్యక్తివా..? కాదా..? అన్నది నిర్ణయించుకో ..

ఆ తర్వాత నీ వ్యక్తిత్వం ఎంటో తెలుసుకో.!

నీ ప్రపంచంలో నువ్వు చేసే పనులు, నీ చుట్టూ ఉన్న, నువ్వు ఎంచుకున్న మనుషులు నీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబింప చేస్తాయి.

ఇది ప్రపంచానికి అనుగుణంగా బలవంతంగా నువ్వు భుజాన వేసుకున్న పద్దతులు లేదా ఈ ప్రపంచం బలవంతంగా నీపై రుద్దబడిన అభిప్రాయాలు..

కానీ ప్రపంచానికి ఇంకా పరిచయమవ్వని నువ్వెంటో, నీ శక్తి ఏంటో నువ్వు తెలుసుకోవాలి ఆ తర్వాత ప్రపంచానికి పరిచయం చెయ్యాలి..

వ్యవస్థ వ్యక్తిని శాసించలేదు, కానీ, వ్యక్తి తలుచుకుంటే  వ్యవస్థని శాసించగలడు అలాంటి వ్యక్తిత్వాన్ని నిర్మించుకుందాం..

నువ్వు ఏ స్థాయి లో ఉన్న నీ కంటే మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని కలువు, నువ్వు ఎలా ఉన్నావో, వారు ఎలా ఉన్నరో గమనించు కేవలం మౌనంగా గమనించు గ్రహించు... అవకాశం వచ్చినప్పుడే మాట్లాడు, మౌనం అనేది మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళ దగ్గర  పాటిస్తే అది ఒక అపురూపమైన ఆభరణం, ఎందుకంటే అది మనలోని మంచి గుణాలని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది...

మంచి గుణాలు కలిగిన గొప్ప వారు చాలా అరుదుగా ఉంటారు, అందులోనూ వారు మీతో స్నేహ హాస్తం అందిస్తే అస్సలు వదులుకోకండి.. ఎందుకంటే ఇలాంటి వారు మన జీవితాలకి ఒక ప్రత్యేకమైన కోణాన్ని చూపిస్తారు .. వీరి ఆలోచనలు, వీరి లక్ష్యాలు చాలా భిన్నంగా ఉంటాయి వీరితో ఉంటే మీ జీవితానికి అంటూ ఒక అర్థం ఉంటుంది అని తెలుసుకుంటారు..                     

చివరగా ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీ వ్యక్తిత్వం ఎలాంటిదో ఇలాంటి వాటితో పోల్చుకోవచ్చు..

ఒక వ్యక్తి తనకి జీతం వస్తున్నా కూడా లంచం తీసుకునే అలవాటు ఉంది,  కానీ ఆ లంచం ఇచ్చే వ్యక్తికి కొన్ని అనారోగ్య కారణాల వల్ల నెల నెల వైద్యానికి కూడా డబ్బు సరిపోదు.. అలాంటి వ్యక్తి మనసు కి కష్టమనిపించిన ఆ లంచం ఇచ్చి పని పూర్తి చేయించుకుంటాడు..

లంచం తీసుకున్న వ్యక్తి పిల్లల జల్సాల కోసం, భార్య బంగారు నగల కోసమో ఖర్చు  చేస్తాడు .. నెల తిరిగే సరికి ఆ వ్యక్తి అనారోగ్యం కారణంగా మరణిస్తాడు ఈ విషయం లంచం తీసుకున్న వ్యక్తికి ఎలాగోలా   తెలిసింది...

ఆ లంచం తీసుకున్న వ్యక్తి స్థానం లో మీరు ఉన్నట్టు ఊహించుకోండి.* *(క్షమించండి కేవలం మీకు అర్థమవ్వాలన్న ఉద్దేశ్యంతో)..!

ఇందులో లంచం తీసుకున్న వ్యక్తికి కరుణ, జాలి, దయ, విధి నిర్వహణ కర్తవ్యం ఎక్కడ ఉంది..? ఇవి లేకుండా వ్యక్తిత్వం ఎలా నిర్ణయింపబడుతుంది ..

ఒక వేళ ఆ లంచం ఇచ్చే స్థానం లో మీరు ఉంటే  ఆ అనారోగ్య కారణాల వల్ల మీరు ఎంత వేదనను అనుభవిస్తారు... ఈ సమాజం పై ఎంత అసహనాన్ని ప్రకటిస్తారు... మీరు ఎన్నుకున్న పాలకులను ఎంతగా అసహ్యించుకుంటారు.. ఒక్కసారి ఆలోచించండి... !

మీరు ప్రాపంచిక అవసరాల కోసం ఎంత కష్టపడిన కేవలం సుఖాన్ని మాత్రమే పొందగలుగుతారు కానీ ఆనందాన్ని,సంతోషాన్ని, మానసిక తృప్తిని పొందలేరు..

మీరు ప్రేమను మాత్రమే ప్రపంచానికి పంచండి..

కోపాన్ని, పగని పెంచుకునే వారిని వదిలేయండి.

అవసరమైతే వారి వల్ల మీ మనసుకు కష్టం అనిపిస్తే మనస్పుర్తిగా క్షమించేసి మీ దారిలో మీరు సమయం వృధా చేసుకోకుండా సాగిపోండి....

🌹🌹🌹🌹🌹🌹🌹
🙏  ప్రసాద్

🌹 జ్ఞానికి విధి నిషేధాలు ఉండవు !!! 🌹

🌹 జ్ఞానికి విధి నిషేధాలు ఉండవు !!! 🌹

🌻 అష్టావక్రగీత
9, 10 ప్రకరణల నుండి (240) 🌻

కారణం లేకుండా కార్యం ఉండదు. కార్యం లేకుండా కర్మ ఉండదు. ఇవి వస్త్రంలోని ఏతపోతల వంటివి. వస్త్రంలో ఉన్న నిలువుపోగులను కానీ... అడ్డు పోగులను కానీ... ఏవి తీసినా అక్కడ వస్త్రం ఉండదు.

అలాగే జ్ఞానికి కారణం ఉండదు కనుక కార్యం ఉండదు... అనుగుణంగా కర్మలు కూడా ఉండవు. మరి జ్ఞానికి నిత్య నైమిత్తిక కర్మలు, దైనందిన క్రియలు ఉండవా ? అనే సందేహం వస్తుంది.

జ్ఞానికి కూడా మనలాగే ఆకలి దప్పులు ఉంటాయి. అవి ప్రకృతి గతమైన దైహిక ధర్మంగా ఉంటాయి. తనకంటూ ఒక సంకల్పం లేకుండా తన దైహిక కర్మలు అన్నీ పరమాత్మ ప్రమేయంతో జరిగే విధి నిషేధాలు జ్ఞానికి ఉండవు. అంటే నిషిద్ధ కర్మలు చేస్తారని కాదు.

జ్ఞానులు చేసే కర్మలను మన మనసుతో కొలిచి లోపాలు వెతకకూడదని అర్ధం చేసుకోవాలి.

🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹
🙏 సేకరణ : ప్రసాద్

🌹 భగవంతుడు సర్వకారణ కారణము🌹

🌹 భగవంతుడు సర్వకారణ కారణము🌹
✍ మాస్టర్ ఇ.కె

🌸 శ్రీమద్భాగవతము 🌸

జీవుడు కోపము మరియు అభిమానము తొలగించుకొనవలెను. కోపము‌ తొలగించు కొనుటయనగా కోపమును ఆపుట కాదు. సంతుష్టిని అలవరచుకొనుట.

జీవుని యొక్క ఈశ్వరుని యొక్క యథార్థ జ్ఞానము గ్రహింపవలెను. జీవుడు తత్త్వము చేత ఈశ్వరుడే అని తెలియవలెను. ఒక గృహము కట్టినపుడు గదులలో చోటుండును. ఆ చోటు వంటివాడు జీవుడు. ఆరుబయలు లాంటి వాడు దేవుడు. ఇల్లు కట్టక ముందు గదులలో ఉన్న చోటు కూడ ఆరు బయలులోని చోటే. కట్టిన తరువాత కూడ దాని అఖండత్వము, పవిత్రత్వము చెడలేదని ఊహింపవచ్చును. గదిలో దుర్వాసన యున్నను, అది చోటునకు అంటదు. అట్లే జీవుడు కూడ ఈశ్వరుడే అని తెలియవలెను.

ఈ తెలివి వలన బుద్ధి ఇంద్రియముల వైపునకు మనస్సుగా ప్రసరించుట మాని, తన వైపునకు మరలి, తానుగా ఉండును. బుద్ధి యందలి సంకల్ప వికల్పములు మొదలగు స్థితులన్నియు కరగి, తానుగా ఉండును. కరుగక ముందు సంకల్పములు ఘనీభవించి యుండును. అవియే తన నమ్మకములు. ఈ నమ్మకములు అన్నియు కరిగి ఒకే నమ్మకముగా ఉండవలెను. అదియే భగవంతుడు. పాత్రలోని మంచుగడ్డలన్నియు కరగినచో ఒకే జలముగా ఉండును‌కదా!

జీవుడు పరమాత్మయని తెలిసిన వెనుక పరమాత్మనే అన్నిటియందును సూటిగా దర్శించును. కంటికి సూర్యుడు ఎంత స్పష్టముగా ప్రత్యక్షమగుచున్నాడో అట్లే వానికి దేవుడును. ఈ సాధనతో ఆత్మలకు నాయకుడైన శ్రీమన్నారాయణుని దర్శించును. అపుడు తన యందు అహంకారమునకు తావుండదు. అది అసత్యమగును.

సత్యమైన దేవుని వెలుగుచే అసత్యము మాయమగును. ఈ దృష్టితో చూచినవానికి సృష్టి మొత్తమునకు కారణముండదు. అందలి సన్నివేశములకు కూడా కారణములేదని తెలియును. కార్య కారణములవలె కనిపించుచున్నవి అన్నియు ఒక దాని యందు భాగములై దర్శనమిచ్చును.

స్థూల దృష్టితో చూసినచో మనము అన్నము తినుటకు కారణము బియ్యము మొదలగునవి. నిమిత్తకారణము బియ్యపు కొట్టువాడు, వండిపెట్టు భార్య మొదలగు వారు. ఇంకను విశదపరచుకొన్నచో ధాన్యము పండించు రైతు నిమిత్తకారణము. అంతకు ముందు వరి మొక్క యున్నది. దానికి కారణము విత్తనము. దానికి కారణము వరి మొక్క. ఈ రెండిటి పరస్పరత్వమునకు కారణము బీజాంకుర పరిపాక ప్రకృతి.

ప్రకృతికి కారణము యోగమాయ. దానికి కారణము భగవంతుడు. భగవంతుడు సర్వకారణ కారణము. వాని యందు లోకములోని కార్యకారణములన్నియును అంతర్భాగములై ఒకే వెలుగుగా దర్శనమిచ్చును.

ఈ వివరము తెలియుట వలన జీవి పరిపూర్ణుడై సర్వవ్యాపియై పరబ్రహ్మమును పొందును.......

🌹 🌹 🌹 🌹 🌹
🙏  ప్రసాద్

🌹 అసలైన సిసలైన సాథన.. 🌹

🌹 అసలైన సిసలైన సాథన.. 🌹

🌴 మానవుడు ఆద్యాత్మికత విషయంలో చాలా నిర్లక్ష్యం వహించడం వలననే బహు జన్మలెత్తవలసి వస్తుంది. బాల్యంలో ఉన్నపుడు అపుడే ఆద్యాత్మికత ఎందుకని పెద్దలు పాడుచేయగా, వయసులో ఉన్నపుడు విఱ్ఱవీగుచూ, వృద్ధాప్యంలో ఊగిపోతూ కాలమునూ వృథా చేసుకుంటూ ఏ అవయవమూ సహకరించని సమయంలో పశ్చాత్తాపం పడినా ఏమి ఉపయోగం??! 

ఈ బంధాలనుండి బయట పడాలంటే అత్యంత సులువైన మార్గం భగవన్నామస్మరణ తప్ప వేరే లేదు. భగవంతుడు మనలను పస్తులుండి, పూజలు చేయండని ఎక్కడా, ఏనాడూ చెప్పలేదు. తైలధార వలే అవరోధం లేకుండా స్థిర చిత్తముతో నామస్మరణ చేయమని చెబుతున్నాడు.

దీనర్థం ముక్కు మూసుకుని మూల కూర్చుని తపస్సు చెయ్యమని కాదు. ఏ పని చేస్తున్నా మనస్సు మాత్రం భగవంతుని దివ్య నామస్మరణలో నిమగ్నమయ్యేలా అభ్యాసం చేయాలి. ఇదే అసలైన సిసలైన సాథన.. 🌴

🌹🌹🌹🌹🌹🌹🌹
🙏 ప్రసాద్

🌹 *హోళీ_అనగా...అగ్ని కార్యం.!!!* 🌹

🌹 హోళీ_అనగా...అగ్ని కార్యం.!!! 🌹

🌹 హోళిక రాక్షసి కాదు దేవత 🌹

1. పండుగలు, ధార్మిక ఉత్సవములు మరియు వ్రతాలు హిందూ ధర్మములోని అవిభాజ్య అంగములు.

వీటిని ఆచరించుటలో విశేషమైన నైసర్గిక, సామాజిక, ఐతిహాసిక మరియు ఆధ్యాత్మిక కారణములు ఉన్నాయి. వీటిని సరియైన పద్ధతిలో ఆచరించుటవలన సమాజములోని ప్రతి వ్యక్తి వారి వ్యక్తిగత మరియు సామాజిక జీవితములో అనేక లాభాలు పొందుతారు.

దీనివలన సంపూర్ణ సమాజము యొక్క ఆధ్యాత్మిక అభివద్ధి జరుగుతుంది. అందుకని పండుగలు, ధార్మిక ఉత్సవాలు, మరియు వ్రతాలు ఆచరించుటకు వాటి శాస్త్రాధారాలను, ప్రాముఖ్యతను తెలుసుకొనుట చాలా అవసరము.

2. హోళి

హోళి కూడా సంక్రాంతిలాగ ఒక దేవతయే. షడ్వికారాలపై విజయాన్ని సాధించే సామర్థము హోళికా దేవిలో కలదు. ఈ వికారాలపై విజయాన్ని సాధించే సామర్థమును పొందుటకు హోళికా దేవిని ప్రార్థిస్తారు. అందుకే హోళిని ఉత్సవరూపములో జరుపుకుంటారు.

3. హోళి పండుగకు అగ్నిదేవుని పట్ల కతజ్ఞత వ్యక్తపరుచుటకు కారణము

అగ్నిదేవుని ఉపాసనలో హోళి ఒక భాగమైనది. అగ్నిదేవుని ఉపాసనతో వ్యక్తిలో తేజతత్వము వద్ధి చెందుటకు తోడ్పడుతుంది. హోళి రోజున అగ్నిదేవుడి తత్వము 2 శాతము కార్యనిరతరమౌతుంది. అగ్నిదేవుని పూజించుట వలన మనుష్యునిలోని రజో- తమో గుణాల ప్రభావము తగ్గుతాయి.

హోళి రోజున చేసే యజ్ఞముల వలన ప్రకతి మానవునికి అనుకూలమౌతుంది. దీని వలన అవసరమైన సమయములో బాగుగా వర్షాలు కురుస్తుండటము వలన సష్టి సంపన్నమౌతుంది. అందుకే హోళి రోజున అగ్నిదేవుని పూజించి కతజ్ఞత వ్యక్తపరచాలి. ఉదయము ఇంటిలో పూజ జరుపుకుంటారు మరియు రాత్రికి సార్వజనికంగా హోళిని జరుపుకుంటారు.

4. హోళి ఆచరించుటకు కారణాలు

పృథ్వి, ఆప, తేజ, వాయు మరియు ఆకాశము ఈ పంచతత్వముల సహయముతో దేవతల తత్వాలను పథ్విపై ప్రక్షేపింప జేయుటకు యజ్ఞము ఒక్కటే మాద్యమమైనది. పథ్విపై ఏ స్పందనతరంగాలు లేనప్పుడు, ప్రథంగా త్రేతాయుగములో పంచతత్వములలో విష్ణుతత్వము ప్రక్షేపించే సమయము వచ్చెను. అప్పుడు పరమేశ్వరుని ద్వారా ఒకేసారి సప్త (ఏడుగరు) ఋషులకు స్వప్నదష్టాంతములో యజ్ఞము గురించి జ్ఞానము కలిగింది. తరువాత వారు యజ్ఞము యొక్క సామగ్రులను తయారు చేయుటకు ప్రారంభించారు.

నారద ముని యొక్క మార్గదర్శనమునకనుసారంగా యజ్ఞము ప్రారంభమైనది. మంత్రపఠనతో అందరు విష్ణుతత్వమును ఆహ్వానించారు. యజ్ఞము యొక్క జ్వాలతో పాటు యజ్ఞకుండములో విష్ణుతత్వము ప్రక్షేపితమౌతుండెను. దీనితో పథ్విపై ఉన్న అనిష్ట శక్తులకు కష్టమై అవి పారిపోవుట ప్రారంభమైనది. అవి ఈ కష్టము యొక్క కారణము తెలుసుకోలేకపోయాయి. మెల్ల-మెల్లగా శ్రీవిష్ణువు పూర్తి రూపములో సాక్షాత్కారమైనాడు.

ఋషిమునులతో పాటు అక్కడ ఉన్న భక్తులందరు శ్రీవిష్ణువు యొక్క దర్శనము పొందారు. ఆ రోజు ఫాల్గుణ పూర్ణిమ. ఈ విధంగా త్రేతాయుగములోని ప్రథమ యజ్ఞము యొక్క గుర్తుగా హోళిని జరుపుకుంటారు. హోళి గురించి శాస్త్రాలలో మరియు పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి.

5. భవిష్యపురాణము యొక్క కథ

భవిష్యపురాణములో ఒక కథ ఉన్నది. ప్రాచీన కాలములో ఢుంఢా మరియు ఢౌంఢ పేరు గల ఇద్దరు రాక్షసులు ఒక ఊరిలో ప్రవేశించి చిన్న పిల్లలను పీడించేవారు. రోగములను మరియు వ్యాధులను కలిగింపజేసేవారు. ఆ రాక్షసులను ఊరిలో నుండి తరిమేయుటకు ప్రజలు ఎంత ప్రయత్నించినను అవి వెళ్ళలేదు. చివరకు ప్రజలు వాటిని చెడు మాటలు తిట్టి, శాపనార్థములు పెట్టి, అంతట నిప్పు అంటించి, భయపెట్టించి వాటిని తరిమివేసారు.

అప్పుడు అవి భయపడి పారిపోయాయి. ఈ విధంగా అనేక కథలనుసారంగా భిన్నభిన్న కారణాలవలన ఈ ఉత్సవమును దేశ-విదేశాలలో అనేక రకాలుగా జరుపుకుంటారు. ప్రాంతానుసారంగా ఫాల్గుణ పూర్ణిమ నుండి పంచమి వరకు ఐదు-ఆరు రోజులు, కొన్ని చోట్ల రెండు రోజులు, మరికొన్ని చోట్ల ఐదు రోజుల వరకు ఈ పండుగను జరుపుకుంటారు.

6. హోళి యొక్క మహాత్మము

హోళి యొక్క సంబంధము మనుష్యుని వ్యక్తిగత మరియు సామాజిక జీవనముతో కలిసి ఉంటుంది, అలాగే నైసర్గిక, మానసిక మరియు ఆధ్యాత్మిక కారణాలతో కూడా ముడిపడి ఉంటుంది. ఇది మంచి ద్వారా చెడుపై విజయమును సాధించిన దానికి ప్రతీకము. దుష్టప్రవత్తి మరియు అమంగళకరమైన ఆలోచనలను నాశనము చేసి, సత్ ప్రవత్తి గల మార్గమును చూపించే ఉత్సవము ఇది.

అనిష్టశక్తులను నశింపజేసి ఈశ్వరుని చైతన్యమును ప్రాప్తించుకునే దినమిది. ఆధ్యాత్మిక సాధనలో వేగంగా వెళ్ళుటకు బలము ప్రాప్తించుకునే అవకాశమును ఇచ్చేది. వసంత ఋతువు యొక్క ఆగమనము నిమిత్తంగా జరుపుకొనబడే ఉత్సవమిది. అగ్నిదేవుని పట్ల కతజ్ఞత వ్యక్తపరిచే పండుగ ఇది.

7. శాస్త్రానుసారంగా హోళి పండుగను ఆచరించే పద్ధతి

కొన్ని ప్రాంతాలలో హోళి ఉత్సవమును జరుపుకొనుటకు నెల రోజుల ముందు నుండే హోళి పండుగకు కావలసిన వస్తువులను సిద్ధము చేస్తుంటారు. పిల్లలు ప్రతి ఇంటింటికి వెళ్ళి కట్టెలను కూడబెడుతుంటారు. పూర్ణిమ రోజున ఆ కట్టెలను విశిష్ట పద్ధతిలో పెట్టుతారు. తరువాత వాటిని పూజిస్తారు. పూజ జరిపిన తరువాత అగ్నిని ప్రజ్వలింపజేస్తారు. హోళిని వెలిగించే పద్ధతిని తెలుసుకునుటకు దీనిని మనము రెండు భాగాల్లో విభాజించుదాము.

1. హోళి పూజ జరుపుకొనుటకు కావలసిన సామగ్రులు మరియు
2. దాని ప్రజ్వలన

8. హోళిని అలంకరించే పద్ధతి

8(అ). హోళిని అలంకరించుటకు కావలసిన సామగ్రులు :

ఆముదము చెట్టు, కొబ్బరి చెట్టు, లేదా పోక చెట్టు యొక్క కర్రలు ఉండవలెను. చెట్టు యొక్క కాండము ఐదు లేదా ఆరు అడుగులు పొడవైనవి ఉండవలెను. ఆవుపేడ పిడకలు, ఇతర కట్టెలు కూడా ఉండవలెను.

8(ఆ) . హోళిని అలంకరించే ప్రత్యక్ష పద్ధతి

సామాన్యంగా గ్రామదేవత ఆలయము ఎదుట హోళిని వెలిగించవలెను. ఇది వీలుకానిచో సౌకర్యవంతంగా ఉన్న స్థలమును ఎన్నుకోవలెను. ఏ స్థలములో హోళిని వెలిగిస్తారో, ఆ స్థలమును సూర్యాస్తమయమునకు ముందు ఊడ్చి శుభ్రపరచవలెను. ఆ తరువాత ఆ స్థలమును పేడతో అలకవలెను. ఆముదము చెట్టు, కొబ్బరిచెట్టు లేదా పోకచెట్టు యొక్క కాండములను (ఏవి ఉన్నాయో అవి) నిలబెట్టవలెను. ఆ తరువాత పిడకలను లేదా కట్టెలను శంఖ ఆకారములో పెట్టి హోళి చుట్టు ముగ్గును వేయవలెను. దీనినే హోళిని శాస్త్రానుసారంగా ఆలంకరించే పద్ధతి అంటారు.

9. హోళి యొక్క శంఖ ఆకారం

9 అ. హోళి యొక్క శంఖ ఆకారము ఇచ్ఛాశక్తికి ప్రతీకమైనది.

9 ఆ. శంఖ ఆకారము వలన పాతాళము నుండి భూగర్భము యొక్క దిశలో ప్రక్షేపించే కష్టదాయక స్పందనతరంగాల నుండి భూమి యొక్క రక్షణ జరుగుతుంది. ఈ శంఖ ఆకారము వలన భూమండలములో విద్యమానమైన స్థానదేవత, వాస్తుదేవత మరియు గ్రామదేవతలాంటి క్షుద్రదేవతల తత్వము జాగతమౌతుంది. అందుచేత భూమండలములో ఉన్న అనిష్టశక్తులు నశింపబడుతాయి.

9 ఇ. శంఖ ఆకారములో ఘనీభూతమై ఉన్న అగ్నిరూప తేజస్సుకు దగ్గర రావడము వలన మనుష్యుని మనఃశక్తి జాగతమగుటకు దోహదపడుతుంది. దీని వలన స్వల్పమైన కోరికలు నెరవేరుతాయి. మనుష్యునికి వాంఛిత ఫలప్రాప్తమౌతుంది.

10. హోళికి తియ్యని పదార్థములను అర్పించుటకు గల శాస్త్రీయ కారణము

హోళిక దేవికి నివేదించుటకు మరియు హోళిలో సమర్పించుటకు ఉడకబెట్టిన శనగ పప్పు మరియు బెల్లము మిశ్రితమైన పదార్థమును తయారు చేస్తారు. దీనిని ‘పూర్ణము’ అని అంటారు. దీనిని నీటితో చిక్కగా కలపిన పిండిలో ముంచి నూనేలో వేగిస్తారు. ఈ తియ్యని పదార్థాన్ని నైవేద్యంగా హోళిని ప్రజ్వలింప జేసిన తరువాత అందులో సమర్పిస్తారు. ఈ నైవేద్యాన్ని నివేదించే వ్యక్తి దేహములో పంచప్రాణములు జాగతమౌతాయి.

మిగిలిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించుట వలన మనుష్యునిలో తేజోమయ తరంగాలు సంక్రమిస్తాయి మరియు వారి సూర్యనాడి కార్యనిరతమగుటకు సహాయమౌతుంది. సూర్యనాడి కార్యనిరతమగుటవలన మనుష్యునికి కార్యము చేయుటకు శక్తి లభిస్తుంది.

హోళీ రంగులతో మీ జీవితం ఆనంద రంగులమయం కావాలని ఆకాంక్షిస్తూ...

🌹🌹🌹🌹🌹🌹🌹
🙏  ప్రసాద్