03 - JUNE - 2022 శుక్రవారం, భృగు వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 03, జూన్ 2022 శుుక్రవారం, భృగు వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 211 / Bhagavad-Gita - 211 - 5- 07 కర్మ యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 610 / Vishnu Sahasranama Contemplation - 610🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 289 / DAILY WISDOM - 289🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 189 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 128 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*భృగు వాసరే, 03, జూన్‌ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : వినాయక చతుర్థి, Vinayaka Chaturthi🌻*

*🍀. 8. ధనలక్ష్మి స్త్రోత్రం 🍀*

*ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే*
*ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే |*
*వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే*
*జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : హనుమంతుని వలె కాలనేమిని జయించినప్పుడే భూమిపై సర్గావతరణ అనే గురుకార్యం సాధ్యపడుతుంది.- మాస్టర్‌ ఆర్‌.కె. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: శుక్ల చవితి 26:43:46 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: పునర్వసు 19:05:55 వరకు
తదుపరి పుష్యమి
యోగం: వృధ్ధి 27:33:17 వరకు
తదుపరి ధృవ
కరణం: వణిజ 13:30:08 వరకు
వర్జ్యం: 05:35:30 - 07:23:26
మరియు 28:01:40 - 29:49:00
దుర్ముహూర్తం: 08:18:12 - 09:10:39
మరియు 12:40:28 - 13:32:56
రాహు కాలం: 10:35:53 - 12:14:15
గుళిక కాలం: 07:19:11 - 08:57:32
యమ గండం: 15:30:57 - 17:09:18
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:40
అమృత కాలం: 16:23:06 - 18:11:02
సూర్యోదయం: 05:40:50
సూర్యాస్తమయం: 18:47:40
చంద్రోదయం: 08:34:35
చంద్రాస్తమయం: 22:09:55
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: జెమిని
లంబ యోగం - చికాకులు, అపశకునం
19:05:55 వరకు తదుపరి ఉత్పాద 
యోగం - కష్టములు, ద్రవ్య నాశనం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 211 / Bhagavad-Gita - 211 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 07 🌴*

*07. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేన్ద్రియ: |*
*సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే ||*

🌷. తాత్పర్యం :
*భక్తియోగముతో కర్మనొనరించువాడును, విశుద్ధాత్ముడును, ఇంద్రియ, మనస్సులను జయించినవాడును అగు మనుజుడు సర్వులకు ప్రియుడై యుండును. సర్వుల యెడ అతడు ప్రియమును కలిగియుండును. అట్టివాడు సదాకర్మల నాచారించుచున్నను ఎన్నడును బద్ధుడు కాడు.*

🌷. భాష్యము :
కృష్ణభక్తి భావన ద్వారా ముక్తి మార్గమున పయనించువాడు సర్వజీవులకు పరమప్రియుడై యుండును మరియు సర్వజీవులు అతనికి ప్రియులై యుందురు. అతని కృష్ణభక్తి భావనమే అందులకు కారణము. పత్రములు, కొమ్మలు వంటివి వృక్షము నుండి వేరు కానట్లుగా, ఏ జీవియు కృష్ణుని నుండి వేరు కాదని అట్టి భక్తుడు భావించును. వృక్షపు మొదలుకు నీరుపోయుట ద్వారా ఆకులు మరియు కొమ్మలన్నింటికిని నీరు సరఫార యగుననియు లేదా ఉదరమునకు ఆహారము నందించుట ద్వారా దేహమంతయు అప్రయత్నముగా శక్తిని పొందుననియు అతడు ఎరిగియుండును. కృష్ణభక్తిభావన యందు కర్మనొనరించువాడు సర్వులకు దాసుని వలె వర్తించును కావున సర్వులకు ప్రియుడై యుండును. 

“అట్టి యెడ అర్జునుడు ఏ విధముగా యుద్దరంగమున ఇతరులకు అపకారము చేసెను? అతడు కృష్ణభక్తిపూర్ణుడు కాడా?” అని ఎవ్వరైనను ప్రశ్నించు అవకాశము కలదు. కాని వాస్తవమునకు ఆత్మ చంపబడని కారణముగా యుద్ధరంగమునందు నిలిచినవారందరును వ్యక్తిగతముగా ఆత్మరూపములో నిలువనున్నందున (ద్వితీయాధ్యాయమున ఇది వరకే తెలుపబడినట్లు) అర్జునుడు చేయు అపకారము కేవలము బాహ్యమునకు మాత్రమే అయియున్నది. అనగా ఆధ్యాత్మికదృష్టిలో కురుక్షేత్రమునందు ఎవ్వరును మరణింపలేదు. స్వయముగా రణరంగమున నిలిచియున్న శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞ మేరకు వారు దుస్తులవంటి దేహములు మాత్రమే మార్చబడినవి. 

అనగా అర్జునుడు కురుక్షేత్రరణరంగమున యుద్ధము చేసినను కేవలము శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞలను సంపూర్ణభక్తిభావనలో నిర్వర్తింపజేసి యున్నందున నిజముగా యుద్ధము చేయనివాడే అయినాడు. అట్టివాడు ఎన్నడును కర్మఫలములచే బద్ధుడు కాడు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 211 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 5 - Karma Yoga - 07 🌴*

*07. yoga-yukto viśuddhātmā vijitātmā jitendriyaḥ*
*sarva-bhūtātma-bhūtātmā kurvann api na lipyate*

🌷 Translation : 
*One who works in devotion, who is a pure soul, and who controls his mind and senses is dear to everyone, and everyone is dear to him. Though always working, such a man is never entangled.*

🌹 Purport :
One who is on the path of liberation by Kṛṣṇa consciousness is very dear to every living being, and every living being is dear to him. This is due to his Kṛṣṇa consciousness. Such a person cannot think of any living being as separate from Kṛṣṇa, just as the leaves and branches of a tree are not separate from the tree. He knows very well that by pouring water on the root of the tree, the water will be distributed to all the leaves and branches, or by supplying food to the stomach, the energy is automatically distributed throughout the body. 

One may ask, “Why then was Arjuna offensive (in battle) to others? Wasn’t he in Kṛṣṇa consciousness?” Arjuna was only superficially offensive because (as has already been explained in the Second Chapter) all the assembled persons on the battlefield would continue to live individually, as the soul cannot be slain. So, spiritually, no one was killed on the Battlefield of Kurukṣetra. Only their dresses were changed by the order of Kṛṣṇa, who was personally present. 

Therefore Arjuna, while fighting on the Battlefield of Kurukṣetra, was not really fighting at all; he was simply carrying out the orders of Kṛṣṇa in full Kṛṣṇa consciousness. Such a person is never entangled in the reactions of work.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://www.tumblr.com/blog/bhagavadgitawisdom
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 610 / Vishnu Sahasranama Contemplation - 610🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻610. శ్రీధరః, श्रीधरः, Śrīdharaḥ🌻*

*ఓం శ్రీధరాయ నమః | ॐ श्रीधराय नमः | OM Śrīdharāya namaḥ*

*జననీం సర్వభూతానాం వహన్ స్వే వక్షసి శ్రియమ్ ।*
*మహావిష్ణుః శ్రీధరః ఇత్యుచ్యతే పరమేశ్వరః ॥*

*సర్వ జీవ జననియగు శ్రీని తన వక్షము నందు ధరించును గనుక శ్రీ విష్ణుదేవునకు శ్రీధరః అని నామము.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 610🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻610. Śrīdharaḥ🌻*

*OM Śrīdharāya namaḥ*

जननीं सर्वभूतानां वहन् स्वे वक्षसि श्रियम् ।
महाविष्णुः श्रीधरः इत्युच्यते परमेश्वरः ॥

*Jananīṃ sarvabhūtānāṃ vahan sve vakṣasi śriyam,*
*Mahāviṣṇuḥ śrīdharaḥ ityucyate parameśvaraḥ.*

*Since He bears on His bossom, Śrī who is the mother of all creatures, Lord Viṣṇu has the divine name 'Śrīdharaḥ'.*

:: श्रीमद्बागवते द्वादशस्कन्धे द्वादशोऽध्यायः ::
यशः श्रियामेव परिश्रमः परो वर्णाश्रमाचारतपः श्रुतादिषु ।
अविस्मृतिः श्रीधरपादपद्मयोर्गुणानुवादश्रवणादरादिभिः ॥ ५४ ॥

Śrīmad Bāgavata - Canto 12, Chapter 12
Yaśaḥ śriyāmeva pariśramaḥ paro varṇāśramācāratapaḥ śrutādiṣu,
Avismr‌tiḥ Śrīdharapādapadmayorguṇānuvādaśravaṇādarādibhiḥ. 54.

*The great endeavor one undergoes in executing the ordinary social and religious duties of the varn‌āśrama system, in performing austerities, and in hearing from the Vedas culminates only in the achievement of mundane fame and opulence. But by respecting and attentively hearing the recitation of the transcendental qualities of the Supreme Lord, the husband of the goddess of fortune, one can remember His lotus feet.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥
శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥
Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 289 / DAILY WISDOM - 289 🌹*
*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 15. దేవుని నుండి బహుశా ఎటువంటి స్పందన లేదు🌻*

*భగవంతుడు విశ్వానికి అవతల ఉన్నాడు మరియు మనకు వెలుపల ఉన్నాడు, చేరుకోలేడు, మరియు ప్రార్థనలో మనం ప్రయత్నించి నప్పటికీ, అతని నుండి ఎటువంటి ప్రతిస్పందనను పొందలేము అనే ఈ ఆలోచనలన్నీ మనస్సులోని కొన్ని నిక్షిప్తాల కారణంగా ఉన్నాయి. , మనస్సును కప్పి ఉంచే తామసిక గుణాలు దానిని మళ్లీ సూక్ష్మంగా ఇంద్రియ వస్తువుల వైపు మొగ్గు చూపేలా చేస్తాయి. ఇంద్రియ వస్తువుల కోసం కోరిక, ఉపచేతన స్థాయిలో చాలా గుప్త రూపంలో సూక్ష్మంగా ఉంటుంది. బహుశా భగవంతుని నుండి ఎటువంటి ప్రతిస్పందన లేదని మనస్సులో సందేహానికి ఇదే కారణం అవుతుంది.*

*ఎందుకంటే మన ప్రేమ భగవంతుని పట్ల కాదు-అది ఇంద్రియ వస్తువులు మరియు సమాజంలో హోదా మరియు ప్రపంచంలోని వివిధ రకాల ఆనందాల కోసం. తపస్సు లేదా యమనియమాల ద్వారా, మనం మన ఇంద్రియాలను అణచి వేసినప్పుడు, వాటి కార్యకలాపాలకు తాత్కాలిక విరమణ ఉంటుంది. కానీ తన మంత్రివర్గం నుండి త్రోసి వేయబడిన వ్యక్తి మరోసారి మంత్రిగా ఉండాలనే కోరికను కోల్పోకుండా ఉండలేనట్లే, విషయాల పట్ల ఉపచేతన కోరిక ఆగిపోదు; వీలైతే మరో సారి ఎన్నికల బరిలో నిలుస్తాడు. సూక్ష్మమైన ఉపచేతన కోరిక అలాగే ఉంది కనుక స్థానాభిమానం పారద్రోలినా కూడా మనస్సులో శాంతి లేకుండా అశాంతిగా ఉంటాడు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 289 🌹*
*🍀 📖 from The Study and Practice of Yoga 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 15. Perhaps there is No Response from God🌻*

*The idea that God is extra-cosmic and outside us, incapable of approach, and that we are likely not to receive any response from Him in spite of our efforts at prayer, etc.—all these ideas are due to certain encrustations in the mind, the tamasic qualities which cover the mind and make it again subtly tend towards objects of sense. The desire for objects of sense, subtly present in a very latent form in the subconscious level, becomes responsible for the doubt in the mind that perhaps there is no response from God.*

*This is because our love is not for God—it is for objects of sense, and for status in society and enjoyments of various types in the world. And when, through austerity, or tapas, we have put the senses down with the force of our thumb, there is a temporary cessation of their activity. But the subconscious desire for things does not cease, just as a person who is thrown out of his ministry may not cease from desiring to be a minister once again; he will stand for election another time, if possible. The subtle subconscious desire is there. He will be restless, without any peace in the mind, because the position has been uprooted.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 189 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. వ్యక్తి ఏ క్షణంలో జ్ఞానం పొందడం ఆరంభిస్తాడో అతను హృదయంతో సంబంధాన్ని కోల్పోతాడు. హృదయం నిజమైన బృందావనం. అది మనలో వుంది. మనతో తీసుకుపోతూ వుంటాం. మనం దాన్ని మరిచి పోయాం. 🍀*

*ప్రతి మనిషి ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు ఫీలవుతాడు. తను ఎక్కడి నించో వచ్చేసినట్లు భావిస్తాడు. అది అతనికి స్పష్టం కాదు. కానీ ప్రతి మనిషి అట్లా భావిస్తాడు. అస్పష్టంగా వూహిస్తాడు. నేను సరైన స్థలంలో లేను. నేను సరయిన పరిస్థితిలో లేను. యిక్కడ వుండాల్సింది కాదు. 'ఏదో పొరపాటు జరిగింది' అనుకుంటాడు. వ్యక్తి ఏ క్షణంలో జ్ఞానం పొందడం ఆరంభిస్తాడో అతను హృదయంతో సంబంధాన్ని కోల్పోతాడు.*

*హృదయం నిజమైన బృందావనం. అది మనలో వుంది. మనతో తీసుకుపోతూ వుంటాం. మనం దాన్ని మరిచిపోయాం. దాన్ని నిర్లక్ష్యం చేశాం. మనం తలకు అతుక్కుపోయాం. మనం మరీ ఎక్కువగా జ్ఞానానికి అతుక్కుపోయాం. అస్తిత్వంలో ఎదగడం బదులు, అస్తితవ్వంతో పుష్పించడం బదులు, మనం కేవలం సమాచారాన్ని పోగు చేసుకుంటున్నాం. పనికి మాలిన సమాచార సేకరణలో వున్నాం. హృదయం స్వర్గం. నా ప్రయత్నమంతా మీరు స్వర్గంలో అడుగుపెట్టడానికి సాయపడడం. ఒకసారి మీరు దానిలో అడుగుపెడితే, అనుభవం పొందితే మీరు రూపాంతరం చెందుతారు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 128 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 99. సమయస్ఫూర్తి - 1🌻*

*కార్యములకు శుభలగ్నములు, తేదీలు నిర్ణయించు కొనుట వానిని సకాలమున పూర్తి గావించు కొనుట ఒక క్రమశిక్షణ. దైనందిన జీవితమున నిదురలేచుటకు, స్నానాదికములను గావించు కొనుటకు, దైవప్రార్థనలు నిర్వర్తించుకొనుటకు, దైనందిన కార్యముల కొరకు ఆహార విహారముల కొరకు కాలనిర్ణయము జరుగవలెను. కాలమును నిర్ణయించి పాటించిన వారికి సంకల్పబలము పెరుగును. బలము సంకల్పసిద్ధిని కూడ నిచ్చును.*

*కాలము విషయమున అశ్రద్ధ పనికి రాదు. అలసత్వముండ రాదు. నిర్ణీత సమయమునకు కార్యములు నిర్వర్తించువారు సమర్థులు కాగలరు. సర్వసమర్థతకు సమయ పాలనమే ముఖ్యము. సూర్యచంద్రులు, గ్రహగోళాదులు కాలమునే దైవముగ భావించి ప్రవర్తింతురు. అట్లే సమస్త దేవతలును. కాలమును వ్యర్థము చేయువారు, నిజమగు వ్యర్థులు. వారు ఊబినేలపై నడుచునటు వంటివారు. ఇట్టి వారియందు అశ్రద్ధ, సోమరితనము తెలియకయే పెరిగి, తామున్న స్థితి నుండి కూడ దిగజారుట జరుగును.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #ChaitanyaVijnanam #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 376 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 376 -1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 376 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 376 -1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।
శృంగార రస సంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀

🌻 376-1. 'శృంగార రస సంపూర్ణా' 🌻


శృంగార మనెడు రసముచే లెస్సగా నిండినది శ్రీమాత అని అర్ధము. 'శృంగ' అనగా రెండు అని అర్థము. 'అర' అనగా దళము అని అర్థము. 'రస’ అను పదమునకు ఆరు అని అర్థము. ఇట్లు గ్రహించినచో ఆరు జతల దళముల పేర్పు అని తెలియవచ్చును. అనగా పండ్రెండు దళముల పద్మము. అదియే హృదయ పద్మము. అనాహత పద్మమని కూడ అందురు. హృదయము వ్యక్త, అవ్యక్తముల యొక్క కూటమి. అచట అనాహతము, ఆహతము కలియును. సూక్ష్మము, స్థూలము కలియును. ప్రకృతి, పురుషుడు కలియును. నిత్యము, అనిత్యము కలియును.

అన్ని లోకములు ప్రకృతి పురుషుల కలయికచే యేర్పడు చున్ననూ హృదయ పద్మము యొక్క ప్రత్యేకత యేమనగా అచ్చట యిరువురును సమపాళ్ళుగ నుందురు. అందువలన ఆనందము సమ్యక్ పూర్ణమై నిలచును. ప్రకృతి, పురుషుడు అను శృంగములు రెండునూ సమమై వర్తించినపుడు పొందదగిన ఆనందము యితర స్థితులలో వీలుపడదు. సంపూర్ణమగు ఆనందమును ప్రేమ అందురు. అట్టి ప్రేమ యందు ఆధిక్యత, న్యూనత లేవు. సమత్వమే గోచరించును. లక్ష్మీనారాయణు లని, భవానీ శంకరు లని, వాణీ హిరణ్యగర్భు లని, శచీ పురందరు లని, అరుంధతీ వశిష్ఠు లని, సీతారాము లని కొనియాడబడు ఈ ఆరు జంటలు ఈ నామమునకు ఉదాహరణము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 376-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 82. Kameshari prananadi krutagyna kamapujita
Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻

🌻 376-1. Śṛṅgāra-rasa- saṁpūrṇā शृङ्गार-रस-संपूर्णा 🌻


She is in the form of essence of love. Previous nāma discussed about four pīṭha-s and in particular the previous nāma referred to kāmagiri pīṭha or mūlādhāra cakra. In this nāma a reference is being made to the pūrṇagiri pīṭha or the navel cakra. The previous nāma made a reference to kāmagiri pīṭha.

Parā vāc that originated from the mūlādhāra cakra or kāmagiri pīṭha, enters the next phase of evolution at the navel cakra or this pūrṇagiri pīṭha. The dot which was known as kāraṇa bindu at the navel cakra-s becomes kārya bindu in this cakra. Details of these bindu-s have been been discussed in nāma 366.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


02 Jun 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 192. గతం యొక్క వంతెనలను బద్దలు కొట్టడం మంచిది / Osho Daily Meditations - 192. BREAKING BRIDGES


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 192 / Osho Daily Meditations - 192 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 192. గతం యొక్క వంతెనలను బద్దలు కొట్టడం మంచిది 🍀

🕉. గతంలోని వంతెనలను బద్దలు కొట్టడం ఎల్లప్పుడూ మంచిది. అప్పుడు ఒక సజీవతను, అమాయకత్వాన్ని నిలుపుకుంటాడు. ఒకరి తమ బాల్యాన్ని ఎప్పటికీ కోల్పోరు. చాలా సార్లు అన్ని వంతెనలను బద్దలు కొట్టాలి, శుభ్రంగా ఉండాలి. మొదటి నుండి మళ్లీ ప్రారంభించాలి. 🕉

మీరు ఒక పనిని ప్రారంభించినప్పుడల్లా, మీరు మళ్లీ పిల్లలే. మీరు వచ్చారు అని మీరు ఆలోచించడం ప్రారంభించిన క్షణం, మళ్ళీ వంతెనలను బద్దలు కొట్టడానికి సమయం ఆసన్నమైంది, ఎందుకంటే ఒక మృత్యువు స్థిరపడుతుందని అర్థం. అప్పుడు మీరు సమాజంలో కేవలం ఒక సంస్థ, వస్తువుగా మారుతున్నారు. సృజనాత్మకంగా ఉండాలనుకునే ఎవరైనా గతానికి ప్రతిరోజూ చనిపోవాలి. ప్రతి క్షణం వాస్తవంగా జీవించాలి. ఎందుకంటే సృజనాత్మకత అంటే నిరంతర పునర్జన్మ. మీరు పునర్జన్మ పొందకపోతే, మీరు సృష్టించేది పునరావృత మవుతుంది. మీరు పునర్జన్మ పొందినట్లయితే, అప్పుడు మాత్రమే మీ నుండి కొత్తది వెలువడుతుంది.

గొప్ప కళాకారులు, కవులు మరియు చిత్రకారులు కూడా తమను తాము పదే పదే పునరావృతం చేస్తూనే ఒక స్థితికి వస్తారు. కొన్నిసార్లు వారి మొదటి పనే వారి అత్యున్నతమైనది అవడం జరిగింది. ఖలీల్ జిబ్రాన్ తన ఇరవై లేదా ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సులో ద ప్రాఫెట్‌ను వ్రాసాడు. అయితే అదే అతని మొదటి మరియు చివరి గొప్ప రచన. తరువాత కూడా అతను అనేక ఇతర పుస్తకాలను వ్రాసాడు, కానీ మొదటి పుస్తకం యొక్క శిఖరాన్ని ఏదీ చేరుకోలేదు. సూక్ష్మంగా, అతను అదే పుస్తక రచనను పునరావృతం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఒక కళాకారుడు, చిత్రకారుడు లేదా కవి, సంగీతకారుడు లేదా నృత్యకారుడు, ప్రతిరోజూ ఏదో ఒక క్రొత్తదాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంది. వారి జ్ఞాపకం కూడా లేనంతగా నిన్నటిని పూర్తిగా మరచిపోవలసిన అవసరం ఉంది. శుభ్ర పడిన కొత్తదనం నుండి మాత్రమే నూతనమైనది, సృజనాత్మకమైనది పుడుతుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 192 🌹

📚. Prasad Bharadwaj

🍀 192. BREAKING BRIDGES 🍀

🕉 It is always good to break bridges with the past. Then one retains an aliveness, an innocence, and one never loses one's childhood. Many times one needs to break all the bridges, to be clean and to start again from ABC. 🕉


Whenever you begin a thing, you are again a child. The moment that you start thinking that you have arrived, it is time to break the bridges again, because that means that a deadness is settling in. Now you are becoming just an entity, a commodity in the market. And anyone who wants to be creative has to die every day to the past, in fact every moment, because creativity means a continuous rebirth. If you are not reborn, whatever you create will be a repetition. If you are reborn, only then can something new come out of you.

It happens that even great artists, poets and painters, come to a point at which they keep repeating themselves again and again. Sometimes it has happened that their first work was their greatest. Kahlil Gibran wrote The Prophet when he was only twenty or twenty-one, and it was his last great work. He wrote many other books, but nothing reaches the peak of the first book, in a subtle way, he goes on repeating The Prophet. So an artist, a painter or a poet, a musician or a dancer, one who has to create something new every day, has a tremendous necessity to forget the yesterdays so completely that there is not even a trace of them. The slate is clean and out of that newness, creativity is born.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


02 Jun 2022

శ్రీ శివ మహా పురాణము - 573 / Sri Siva Maha Purana - 573


🌹 . శ్రీ శివ మహా పురాణము - 573 / Sri Siva Maha Purana - 573 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 55 🌴

🌻. శివ పార్వతుల కైలాసగమనము - 4 🌻


శివుడు కూడ పార్వతితో ఆనందముగా విహరిస్తూ కైలాస పర్వతము నందుండెను. గణములందరు సుఖమును పొంది పార్వతీ పరమేశ్వరులను చక్కగా సేవించిరి (30). కుమారా! నీకు ఇంతవరకు పరమమంగలము, శోకమును నశింపజేయునది, ఆనందమును కలిగించునది, ఆయుర్దాయము నిచ్చునది, ధనమును వర్ధిల్ల జేయునది అగు పార్వతీకల్యాణమును చెప్పి యుంటిని (31). ఎవడైతే దీనిని నిత్యము శుచియై దాని యందు మనస్సును లగ్నము చేసి వినునో, లేక నియమముతో వినిపించునో వాడు శివలోకమును పొందును (32). అద్భుతము, మంగళములకు నిలయము, విఘ్నముల నన్నిటినీ పోగొట్టునది, వ్యాధులనన్నిటినీ నశింపజేయునది అగు ఈ వృత్తాంతమును చెప్పితిని (33).

కీర్తిని కలిగించునది,స్వర్గము నిచ్చునది, ఆయుర్దాయము నిచ్చునది, పుత్ర పౌత్రులనిచ్చునది, గొప్పది, ఇహలోకములో సర్వకామనల నీడేర్చునది, భక్తిని ఇచ్చునది, నిత్యముక్తిని ఇచ్చునది (34), అపమృత్యువును తొలగించునది, గొప్ప శాంతిని కలిగించునది, శుభకరమైనది, దుష్ట స్వప్నములనన్నిటినీ శమింపజేయునది, బుద్ధిని ప్రజ్ఞను ఇచ్చునది (35), శివునకు సంతోషమును కలిగించునది అగు ఈ వృత్తాంతమును శుభమును గోరు జనులు శివోత్సవములన్నిటి యందు శ్రద్ధతో ప్రీతితో పఠించవలెను (36).

దేవాదులను, శివుని ప్రతిష్ఠించు సమయములో మరియు సర్వకార్యముల నారంభించు సమయములో దీనిని ప్రత్యేకించి మిక్కలి ప్రీతితో పఠించవలెను (37). లేదా, శుచియై పార్వతీ పరమేశ్వరుల ఈ మంగళ చరితమును వినవలెను. అట్లు చేసినచో సర్వకార్యములు సిద్ధించును. ఇది ముమ్మాటికీ సత్యము. సందేహము లేదు (38).




శ్రీ శివ మహాపురాణములోని రుద్రసంహితయందు పార్వతీ ఖండలో శివుడుకైలాసమునకు వెళ్లుట అనే ఏబది అయిదవ అధ్యాయము ముగిసినది (55).

పార్వతీ ఖండ సమాప్తమైనది.

శ్రీకృష్ణార్పణమస్తు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 573 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 55 🌴

🌻 Śiva returns to Kailāsa - 4 🌻


30. On the mountain, Śiva stayed with Pārvatī and continued his divine sports with joy. The Gaṇas too were happy and they worshipped the married couple.

31. O dear, I have thus narrated the auspicious story of the marriage of Śiva, that dispels sorrow, generates delight and increases wealth and longevity.

32. He who hears this story with pure mind fixed on them or narrates the same, shall attain Śivaloka.

33. This narrative is said to be wondrous and the cause of everything auspicious. It quells all hindrances and ailments.

34. It is conducive to glory and the attainment of heaven. It bestows longevity, sons and grandsons, all cherished desires, worldly pleasures and salvation too.

35. It wards off premature death. It is auspicious and it causes peace. It makes bad dreams subside. It is an instrument for the acquisition of keen intellect.

36. It shall be read on all occasions of Śiva’s festivals by the people who desire auspicious results. It gives satisfaction to Śiva.

37. At the installation of the idols of the deities this shall be particularly read. At the beginning of all auspicious rites it shall be read with pleasure.

38. With purity in mind and body it shall be heard. All affairs become fruitful thereby. This is true, really true.


Continues....

🌹🌹🌹🌹🌹


02 Jun 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 57 / Agni Maha Purana - 57


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 57 / Agni Maha Purana - 57 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 21

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. విష్ణ్వాది దేవతా సామాన్య పూజా నిరూపణ - 2 🌻


ఇపుడు సామాన్య శివపూజ చెప్పబడుచున్నది. ప్రారంభమున నందిని పూజించవలెను. మహాకాలుని, గంగను, యమునను, గణాదులను, గీర్దేవిన, లక్ష్మిని, గురువును, వాస్తుపురుషుని, ఆధార శక్త్యాదులను, ధర్మాదులను పూజించవలెను.

వామ, జ్యేష్ఠ, రౌద్రి, కాలి, కలవికరిణి, బలవికరిణి, బలప్రమథని, సర్వభూతదమని, మనోన్మని, శివ అను తొమ్మండుగురు శక్తులను పూజింపవలెను.

''హాం. హూం. హాం శివమూర్తయే నమః'' అను మంత్రముతో ఆయా ఆవయవములను, ముఖములను పూజించుచు శివుని పూజించవలెను. ''హౌం శివాయ హౌం'' అని శివుని, 'హాం ' అను బీజాక్షరముతో ఈశానముఖమును పూజింపవలెను. ''హ్రీం'' అను బీజాక్షరముతో గౌరిని ''గం' అను బీజాక్షరముతో గణమును (గణాధిపతిని) పూజింపవలెను.

ఇంద్రుడు మొదలగు వారిని చండుని, హృదయము మొదలగు వాటిని క్రమముగ పూజించవలెను. ఇపుడు సూర్యర్చన మంత్రములు చెప్పబడుచున్నవి. ముందుగా దండిని పిదప పింగళుని పూజించవలెను.

ఉచ్చైః శ్రవస్సును, అరుణుని పూజించి ప్రభూతుని, విమలుని, సోముని, సంధ్యలను, పరసుఖుని, స్కందాదులను మధ్మయందు పూజింపవలెను.

దీప్తా, సూక్ష్మా, జయా, భద్రా, విభూతి, విమలా, అమోఘా, విర్యుతా, సర్వతోముఖీ అను నవశక్తులను పూజింపవలెను.

''హం'' ''ఖం'' ''ఖం'' అను బీజాక్షరములచే అర్కాసనమును ''సోత్కాయనమః అని మూర్తిని ''హాం హ్రీం సః సూర్యాయ నమః'' అని సూర్యుని, ''ఆం నమో హృదయాయ'' అని హృదయమును పూజింపవలెను.

''ఓం అర్కాయ నమః అని శిరస్సున పూజించవలెను అట్లే అగ్ని - ఈశ - అసుర - వాయువులను అధిష్ఠించి యున్న సూర్యుని పూజింపవలెను. ''భూః '' భువః స్వః జ్వాలిన్యై శిఖాయైనమః అని శిఖయు ''హుం'' అని కవచమును ''భాం'' అని నేత్రములను, హ్రః, అని అర్కాస్రమును పూజించవలెను. రాజ్ఞియను సూర్యశక్తిని, దానినుండి ప్రకటితయగ ఛాయాదేవిని పూజించవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 57 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 21

🌻 Method of worshipping Viṣṇu and other gods - 2 🌻


10-11. (Then) the speech, the goddess of prosperity, the preceptor, the Vāstu (deity), the different female energies and Dharma (the lord of death) and other gods (are worshipped). (The female energies) Vāmā, Jyeṣṭhā, Raudrī, Kālī, Kalavikariṇī, Balavikariṇī, Balapramathinī, Sarvabhūtadamanī, Manomanī and Śivā (are worshipped) in the due order.

12. (Saying) Hām, Hum, Ham (salutation) to the form of Śiva, Śiva is worshipped along with his limbs and mouth. Haum, (salutation) to Śiva, Haum and Hām (salutations) to Īsāna (one of the Pañcabrahman forms of Śiva) and other faced (forms of Śiva).

13. Hrim (salutation) to Gaurī (Pārvatī), Gam (salutation) to Gaṇa, face of Śakra (Indra), Caṇḍa, heart and others. The mystic syllables in the worship of the sun (are described now). The tawny-coloured Daṇḍin is to be worshipped.

14. One should adore Uccaiḥśravas (the horse of Indra), the very much pure Aruṇa (younger brother of the Sun-god). The moon and the twilight, the other faces and Skanda (progeny of Śiva) in the middle are worshipped.

15. Then (the female divinities) Dīptā, Sūkṣmā, Jayā, Bhadrā, Vibhūti, Vimalā, Amoghā, Vidyutā and Sarvatomukhī are worshipped.

16. Then the mantra Ham, Kham, Kham for the firebrand (is used for the worship) of the seat of the sun and (his) form. Hrām, Hrīm, salutation to the sun, Ām, salutation to the heart.

17. (Salutation) to the (rays of the) sun, to his head, and similarly to the flames reaching up the regions of demons,. wind, earth, ether, and heavens. Hum is remembered as the mystic amulet.

18. (Salutations are made) to the lustre, eye, Hraḥ, to the weapons of Sun, Rāji, Śakti, and Niṣkubha.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


02 Jun 2022

కపిల గీత - 17 / Kapila Gita - 17


🌹. కపిల గీత - 17 / Kapila Gita - 17🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴. కపిల భగవానుని స్వీయ సాక్షాత్కార జ్ఞాన వివరణ - 6 🌴


17. తదా పురుష ఆత్మానం కేవలం ప్రకృతేః పరమ్
నిరన్తరం స్వయంజ్యోతిరణిమానమఖణ్డితమ్

పరిశుద్ధమైన మనసుకు జ్ఞ్యాన వైరాగ్యాలు లభిస్తాయి. శరీరము వేరు ఆత్మ వేరు అని తెలుసుకోవడం. పరమాత్మ అంతర్యామిగా ఉన్న జీవాత్మ ఈ శరీరములో ఉన్నాడు అన్నది జ్ఞ్యానం. ప్రకృతి కంటే వేరుగా ఉన్న పురుషున్ని చూడగలగడం. పరమాత్మ అంతర్యామిగా ఉన్న జీవాత్మ, జీవాత్మ అంతర్యామిగా ఉన్న ప్రకృతి. ప్రకృతి పురుషులు పరమాత్మ విధేయులు. ఇది తెలుసుకున్న వాడికి వెంటనే కలిగేది వైరాగ్యం. ఆత్మ స్వరూపం తెలిసిన వాడికి విషయముల మీద వైరాగ్యం కలుగుతుంది. ఈ రెండూ కలిగితే భక్తి కలుగుతుంది.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Kapila Gita - 17 🌹

✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj

🌴 Lord Kapila Begins to Explain Self-realization - 6 🌴


17. tada purusa atmanam kevalam prakrteh param
nirantaram svayam-jyotir animanam akhanditam

At that time the soul can see himself to be transcendental to material existence and always self-effulgent, never fragmented, although very minute in size.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


02 Jun 2022

02 - JUNE - 2022 గురువారం, బృహస్పతి వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 02, గురువారం, జూన్ 2022 బృహస్పతి వాసరే 🌹
2) 🌹 కపిల గీత - 17 / Kapila Gita - 17🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 57 / Agni Maha Purana - 57🌹 
4) 🌹. శివ మహా పురాణము - 573 / Siva Maha Purana - 573🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 192 / Osho Daily Meditations - 192 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 376 / Sri Lalitha Chaitanya Vijnanam - 376 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*బృహస్పతి వాసరే, 02, జూన్‌ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు.🌻*

*🍀. దక్షిణామూర్తి స్తోత్రము - 7 🍀*

*బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి*
*వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతః స్ఫురంతం సదా*
*స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా*
*తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే*

*తాత్పర్యము: ఎవరి ఉనికి అయితే దేహము, బుద్ధి యొక్క వివిధ అవస్థల (దేహమునకు బాల్యం, యౌవనం, వృద్ధాప్యం; బుద్ధికి జాగ్రత్, చేతన, సుషుప్తా మొదలగునవి) వచ్చే మార్పులకు అతీతంగా ఉండునో, జ్ఞాన ముద్ర (అభయ హస్తమున బొటన వేలు, చూపుడు వేలు కలిపిన ముద్రను జ్ఞాన ముద్ర అంటారు) ద్వారా ఆత్మ జ్ఞానమును కలుగ జేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : నీ లోపల ఉన్న కాంతిని గుర్తిస్తే బయటి కాంతి యొక్క పరిణామం అర్ధం అవుతుంది. సాధనే గురువు అనుగ్రహానికి మూలము. - సద్గురు శ్రీరామశర్మ 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
 తిథి: శుక్ల తదియ 24:18:13 వరకు
తదుపరి శుక్ల చవితి
నక్షత్రం: ఆర్ద్ర 16:04:41 వరకు
తదుపరి పునర్వసు
యోగం: దండ 26:36:14 వరకు
తదుపరి వృధ్ధి
కరణం: తైతిల 11:02:22 వరకు
వర్జ్యం: 29:34:30 - 31:22:34
దుర్ముహూర్తం: 10:03:00 - 10:55:26
మరియు 15:17:35 - 16:10:01
రాహు కాలం: 13:52:23 - 15:30:42
గుళిక కాలం: 08:57:28 - 10:35:47
యమ గండం: 05:40:51 - 07:19:10
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:40
అమృత కాలం: 04:47:45 - 06:35:57
సూర్యోదయం: 05:40:51
సూర్యాస్తమయం: 18:47:19
చంద్రోదయం: 07:42:43
చంద్రాస్తమయం: 21:22:32
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: జెమిని
కాల యోగం - అవమానం 16:04:41
వరకు తదుపరి సిద్ది యోగం 
- కార్య సిధ్ధి , ధన ప్రాప్తి 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. కపిల గీత - 17 / Kapila Gita - 17🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴. కపిల భగవానుని స్వీయ సాక్షాత్కార జ్ఞాన వివరణ - 6 🌴*

*17. తదా పురుష ఆత్మానం కేవలం ప్రకృతేః పరమ్*
*నిరన్తరం స్వయంజ్యోతిరణిమానమఖణ్డితమ్*

*పరిశుద్ధమైన మనసుకు జ్ఞ్యాన వైరాగ్యాలు లభిస్తాయి. శరీరము వేరు ఆత్మ వేరు అని తెలుసుకోవడం. పరమాత్మ అంతర్యామిగా ఉన్న జీవాత్మ ఈ శరీరములో ఉన్నాడు అన్నది జ్ఞ్యానం. ప్రకృతి కంటే వేరుగా ఉన్న పురుషున్ని చూడగలగడం. పరమాత్మ అంతర్యామిగా ఉన్న జీవాత్మ, జీవాత్మ అంతర్యామిగా ఉన్న ప్రకృతి. ప్రకృతి పురుషులు పరమాత్మ విధేయులు. ఇది తెలుసుకున్న వాడికి వెంటనే కలిగేది వైరాగ్యం. ఆత్మ స్వరూపం తెలిసిన వాడికి విషయముల మీద వైరాగ్యం కలుగుతుంది. ఈ రెండూ కలిగితే భక్తి కలుగుతుంది.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 17 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*

*🌴 Lord Kapila Begins to Explain Self-realization - 6 🌴*

*17. tada purusa atmanam kevalam prakrteh param*
*nirantaram svayam-jyotir animanam akhanditam*

*At that time the soul can see himself to be transcendental to material existence and always self-effulgent, never fragmented, although very minute in size.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 57 / Agni Maha Purana - 57 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 21*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. విష్ణ్వాది దేవతా సామాన్య పూజా నిరూపణ - 2 🌻*

ఇపుడు సామాన్య శివపూజ చెప్పబడుచున్నది. ప్రారంభమున నందిని పూజించవలెను. మహాకాలుని, గంగను, యమునను, గణాదులను, గీర్దేవిన, లక్ష్మిని, గురువును, వాస్తుపురుషుని, ఆధార శక్త్యాదులను, ధర్మాదులను పూజించవలెను.

వామ, జ్యేష్ఠ, రౌద్రి, కాలి, కలవికరిణి, బలవికరిణి, బలప్రమథని, సర్వభూతదమని, మనోన్మని, శివ అను తొమ్మండుగురు శక్తులను పూజింపవలెను.

''హాం. హూం. హాం శివమూర్తయే నమః'' అను మంత్రముతో ఆయా ఆవయవములను, ముఖములను పూజించుచు శివుని పూజించవలెను. ''హౌం శివాయ హౌం'' అని శివుని, 'హాం ' అను బీజాక్షరముతో ఈశానముఖమును పూజింపవలెను. ''హ్రీం'' అను బీజాక్షరముతో గౌరిని ''గం' అను బీజాక్షరముతో గణమును (గణాధిపతిని) పూజింపవలెను. 

ఇంద్రుడు మొదలగు వారిని చండుని, హృదయము మొదలగు వాటిని క్రమముగ పూజించవలెను. ఇపుడు సూర్యర్చన మంత్రములు చెప్పబడుచున్నవి. ముందుగా దండిని పిదప పింగళుని పూజించవలెను.

ఉచ్చైః శ్రవస్సును, అరుణుని పూజించి ప్రభూతుని, విమలుని, సోముని, సంధ్యలను, పరసుఖుని, స్కందాదులను మధ్మయందు పూజింపవలెను.

దీప్తా, సూక్ష్మా, జయా, భద్రా, విభూతి, విమలా, అమోఘా, విర్యుతా, సర్వతోముఖీ అను నవశక్తులను పూజింపవలెను.

''హం'' ''ఖం'' ''ఖం'' అను బీజాక్షరములచే అర్కాసనమును ''సోత్కాయనమః అని మూర్తిని ''హాం హ్రీం సః సూర్యాయ నమః'' అని సూర్యుని, ''ఆం నమో హృదయాయ'' అని హృదయమును పూజింపవలెను.

''ఓం అర్కాయ నమః అని శిరస్సున పూజించవలెను అట్లే అగ్ని - ఈశ - అసుర - వాయువులను అధిష్ఠించి యున్న సూర్యుని పూజింపవలెను. ''భూః '' భువః స్వః జ్వాలిన్యై శిఖాయైనమః అని శిఖయు ''హుం'' అని కవచమును ''భాం'' అని నేత్రములను, హ్రః, అని అర్కాస్రమును పూజించవలెను. రాజ్ఞియను సూర్యశక్తిని, దానినుండి ప్రకటితయగ ఛాయాదేవిని పూజించవలెను. 


సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 57 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 21*
*🌻 Method of worshipping Viṣṇu and other gods - 2 🌻*

10-11. (Then) the speech, the goddess of prosperity, the preceptor, the Vāstu (deity), the different female energies and Dharma (the lord of death) and other gods (are worshipped). (The female energies) Vāmā, Jyeṣṭhā, Raudrī, Kālī, Kalavikariṇī, Balavikariṇī, Balapramathinī, Sarvabhūtadamanī, Manomanī and Śivā (are worshipped) in the due order.

12. (Saying) Hām, Hum, Ham (salutation) to the form of Śiva, Śiva is worshipped along with his limbs and mouth. Haum, (salutation) to Śiva, Haum and Hām (salutations) to Īsāna (one of the Pañcabrahman forms of Śiva) and other faced (forms of Śiva).

13. Hrim (salutation) to Gaurī (Pārvatī), Gam (salutation) to Gaṇa, face of Śakra (Indra), Caṇḍa, heart and others. The mystic syllables in the worship of the sun (are described now). The tawny-coloured Daṇḍin is to be worshipped.

14. One should adore Uccaiḥśravas (the horse of Indra), the very much pure Aruṇa (younger brother of the Sun-god). The moon and the twilight, the other faces and Skanda (progeny of Śiva) in the middle are worshipped.

15. Then (the female divinities) Dīptā, Sūkṣmā, Jayā, Bhadrā, Vibhūti, Vimalā, Amoghā, Vidyutā and Sarvatomukhī are worshipped.

16. Then the mantra Ham, Kham, Kham for the firebrand (is used for the worship) of the seat of the sun and (his) form. Hrām, Hrīm, salutation to the sun, Ām, salutation to the heart.

17. (Salutation) to the (rays of the) sun, to his head, and similarly to the flames reaching up the regions of demons,. wind, earth, ether, and heavens. Hum is remembered as the mystic amulet.

18. (Salutations are made) to the lustre, eye, Hraḥ, to the weapons of Sun, Rāji, Śakti, and Niṣkubha.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #AgniMahaPuranam
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 573 / Sri Siva Maha Purana - 573 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 55 🌴*

*🌻. శివ పార్వతుల కైలాసగమనము - 4 🌻*

శివుడు కూడ పార్వతితో ఆనందముగా విహరిస్తూ కైలాస పర్వతము నందుండెను. గణములందరు సుఖమును పొంది పార్వతీ పరమేశ్వరులను చక్కగా సేవించిరి (30). కుమారా! నీకు ఇంతవరకు పరమమంగలము, శోకమును నశింపజేయునది, ఆనందమును కలిగించునది, ఆయుర్దాయము నిచ్చునది, ధనమును వర్ధిల్ల జేయునది అగు పార్వతీకల్యాణమును చెప్పి యుంటిని (31). ఎవడైతే దీనిని నిత్యము శుచియై దాని యందు మనస్సును లగ్నము చేసి వినునో, లేక నియమముతో వినిపించునో వాడు శివలోకమును పొందును (32). అద్భుతము, మంగళములకు నిలయము, విఘ్నముల నన్నిటినీ పోగొట్టునది, వ్యాధులనన్నిటినీ నశింపజేయునది అగు ఈ వృత్తాంతమును చెప్పితిని (33).

కీర్తిని కలిగించునది,స్వర్గము నిచ్చునది, ఆయుర్దాయము నిచ్చునది, పుత్ర పౌత్రులనిచ్చునది, గొప్పది, ఇహలోకములో సర్వకామనల నీడేర్చునది, భక్తిని ఇచ్చునది, నిత్యముక్తిని ఇచ్చునది (34), అపమృత్యువును తొలగించునది, గొప్ప శాంతిని కలిగించునది, శుభకరమైనది, దుష్ట స్వప్నములనన్నిటినీ శమింపజేయునది, బుద్ధిని ప్రజ్ఞను ఇచ్చునది (35), శివునకు సంతోషమును కలిగించునది అగు ఈ వృత్తాంతమును శుభమును గోరు జనులు శివోత్సవములన్నిటి యందు శ్రద్ధతో ప్రీతితో పఠించవలెను (36).

దేవాదులను, శివుని ప్రతిష్ఠించు సమయములో మరియు సర్వకార్యముల నారంభించు సమయములో దీనిని ప్రత్యేకించి మిక్కలి ప్రీతితో పఠించవలెను (37). లేదా, శుచియై పార్వతీ పరమేశ్వరుల ఈ మంగళ చరితమును వినవలెను. అట్లు చేసినచో సర్వకార్యములు సిద్ధించును. ఇది ముమ్మాటికీ సత్యము. సందేహము లేదు (38).

శ్రీ శివ మహాపురాణములోని రుద్రసంహితయందు పార్వతీ ఖండలో శివుడుకైలాసమునకు వెళ్లుట అనే ఏబది అయిదవ అధ్యాయము ముగిసినది (55).

పార్వతీ ఖండ సమాప్తమైనది.

శ్రీకృష్ణార్పణమస్తు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 573 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 55 🌴*

*🌻 Śiva returns to Kailāsa - 4 🌻*

30. On the mountain, Śiva stayed with Pārvatī and continued his divine sports with joy. The Gaṇas too were happy and they worshipped the married couple.

31. O dear, I have thus narrated the auspicious story of the marriage of Śiva, that dispels sorrow, generates delight and increases wealth and longevity.

32. He who hears this story with pure mind fixed on them or narrates the same, shall attain Śivaloka.

33. This narrative is said to be wondrous and the cause of everything auspicious. It quells all hindrances and ailments.

34. It is conducive to glory and the attainment of heaven. It bestows longevity, sons and grandsons, all cherished desires, worldly pleasures and salvation too.

35. It wards off premature death. It is auspicious and it causes peace. It makes bad dreams subside. It is an instrument for the acquisition of keen intellect.

36. It shall be read on all occasions of Śiva’s festivals by the people who desire auspicious results. It gives satisfaction to Śiva.

37. At the installation of the idols of the deities this shall be particularly read. At the beginning of all auspicious rites it shall be read with pleasure.

38. With purity in mind and body it shall be heard. All affairs become fruitful thereby. This is true, really true.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 192 / Osho Daily Meditations - 192 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 192. గతం యొక్క వంతెనలను బద్దలు కొట్టడం మంచిది 🍀*

*🕉. గతంలోని వంతెనలను బద్దలు కొట్టడం ఎల్లప్పుడూ మంచిది. అప్పుడు ఒక సజీవతను, అమాయకత్వాన్ని నిలుపుకుంటాడు. ఒకరి తమ బాల్యాన్ని ఎప్పటికీ కోల్పోరు. చాలా సార్లు అన్ని వంతెనలను బద్దలు కొట్టాలి, శుభ్రంగా ఉండాలి. మొదటి నుండి మళ్లీ ప్రారంభించాలి. 🕉*
 
*మీరు ఒక పనిని ప్రారంభించినప్పుడల్లా, మీరు మళ్లీ పిల్లలే. మీరు వచ్చారు అని మీరు ఆలోచించడం ప్రారంభించిన క్షణం, మళ్ళీ వంతెనలను బద్దలు కొట్టడానికి సమయం ఆసన్నమైంది, ఎందుకంటే ఒక మృత్యువు స్థిరపడుతుందని అర్థం. అప్పుడు మీరు సమాజంలో కేవలం ఒక సంస్థ, వస్తువుగా మారుతున్నారు. సృజనాత్మకంగా ఉండాలనుకునే ఎవరైనా గతానికి ప్రతిరోజూ చనిపోవాలి. ప్రతి క్షణం వాస్తవంగా జీవించాలి. ఎందుకంటే సృజనాత్మకత అంటే నిరంతర పునర్జన్మ. మీరు పునర్జన్మ పొందకపోతే, మీరు సృష్టించేది పునరావృత మవుతుంది. మీరు పునర్జన్మ పొందినట్లయితే, అప్పుడు మాత్రమే మీ నుండి కొత్తది వెలువడుతుంది.*

*గొప్ప కళాకారులు, కవులు మరియు చిత్రకారులు కూడా తమను తాము పదే పదే పునరావృతం చేస్తూనే ఒక స్థితికి వస్తారు. కొన్నిసార్లు వారి మొదటి పనే వారి అత్యున్నతమైనది అవడం జరిగింది. ఖలీల్ జిబ్రాన్ తన ఇరవై లేదా ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సులో ద ప్రాఫెట్‌ను వ్రాసాడు. అయితే అదే అతని మొదటి మరియు చివరి గొప్ప రచన. తరువాత కూడా అతను అనేక ఇతర పుస్తకాలను వ్రాసాడు, కానీ మొదటి పుస్తకం యొక్క శిఖరాన్ని ఏదీ చేరుకోలేదు. సూక్ష్మంగా, అతను అదే పుస్తక రచనను పునరావృతం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఒక కళాకారుడు, చిత్రకారుడు లేదా కవి, సంగీతకారుడు లేదా నృత్యకారుడు, ప్రతిరోజూ ఏదో ఒక క్రొత్తదాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంది. వారి జ్ఞాపకం కూడా లేనంతగా నిన్నటిని పూర్తిగా మరచిపోవలసిన అవసరం ఉంది. శుభ్ర పడిన కొత్తదనం నుండి మాత్రమే నూతనమైనది, సృజనాత్మకమైనది పుడుతుంది.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 192 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 192. BREAKING BRIDGES 🍀*

*🕉 It is always good to break bridges with the past. Then one retains an aliveness, an innocence, and one never loses one's childhood. Many times one needs to break all the bridges, to be clean and to start again from ABC. 🕉*
 
*Whenever you begin a thing, you are again a child. The moment that you start thinking that you have arrived, it is time to break the bridges again, because that means that a deadness is settling in. Now you are becoming just an entity, a commodity in the market. And anyone who wants to be creative has to die every day to the past, in fact every moment, because creativity means a continuous rebirth. If you are not reborn, whatever you create will be a repetition. If you are reborn, only then can something new come out of you.*

*It happens that even great artists, poets and painters, come to a point at which they keep repeating themselves again and again. Sometimes it has happened that their first work was their greatest. Kahlil Gibran wrote The Prophet when he was only twenty or twenty-one, and it was his last great work. He wrote many other books, but nothing reaches the peak of the first book, in a subtle way, he goes on repeating The Prophet. So an artist, a painter or a poet, a musician or a dancer, one who has to create something new every day, has a tremendous necessity to forget the yesterdays so completely that there is not even a trace of them. The slate is clean and out of that newness, creativity is born.*
 
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 376 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 376 -1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।*
*శృంగార రస సంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀*

*🌻 376-1. 'శృంగార రస సంపూర్ణా' 🌻* 

*శృంగార మనెడు రసముచే లెస్సగా నిండినది శ్రీమాత అని అర్ధము. 'శృంగ' అనగా రెండు అని అర్థము. 'అర' అనగా దళము అని అర్థము. 'రస’ అను పదమునకు ఆరు అని అర్థము. ఇట్లు గ్రహించినచో ఆరు జతల దళముల పేర్పు అని తెలియవచ్చును. అనగా పండ్రెండు దళముల పద్మము. అదియే హృదయ పద్మము. అనాహత పద్మమని కూడ అందురు. హృదయము వ్యక్త, అవ్యక్తముల యొక్క కూటమి. అచట అనాహతము, ఆహతము కలియును. సూక్ష్మము, స్థూలము కలియును. ప్రకృతి, పురుషుడు కలియును. నిత్యము, అనిత్యము కలియును.*

*అన్ని లోకములు ప్రకృతి పురుషుల కలయికచే యేర్పడు చున్ననూ హృదయ పద్మము యొక్క ప్రత్యేకత యేమనగా అచ్చట యిరువురును సమపాళ్ళుగ నుందురు. అందువలన ఆనందము సమ్యక్ పూర్ణమై నిలచును. ప్రకృతి, పురుషుడు అను శృంగములు రెండునూ సమమై వర్తించినపుడు పొందదగిన ఆనందము యితర స్థితులలో వీలుపడదు. సంపూర్ణమగు ఆనందమును ప్రేమ అందురు. అట్టి ప్రేమ యందు ఆధిక్యత, న్యూనత లేవు. సమత్వమే గోచరించును. లక్ష్మీనారాయణు లని, భవానీ శంకరు లని, వాణీ హిరణ్యగర్భు లని, శచీ పురందరు లని, అరుంధతీ వశిష్ఠు లని, సీతారాము లని కొనియాడబడు ఈ ఆరు జంటలు ఈ నామమునకు ఉదాహరణము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 376-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 82. Kameshari prananadi krutagyna kamapujita*
*Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻*

*🌻 376-1. Śṛṅgāra-rasa- saṁpūrṇā शृङ्गार-रस-संपूर्णा 🌻*

*She is in the form of essence of love. Previous nāma discussed about four pīṭha-s and in particular the previous nāma referred to kāmagiri pīṭha or mūlādhāra cakra. In this nāma a reference is being made to the pūrṇagiri pīṭha or the navel cakra. The previous nāma made a reference to kāmagiri pīṭha.*

*Parā vāc that originated from the mūlādhāra cakra or kāmagiri pīṭha, enters the next phase of evolution at the navel cakra or this pūrṇagiri pīṭha. The dot which was known as kāraṇa bindu at the navel cakra-s becomes kārya bindu in this cakra. Details of these bindu-s have been been discussed in nāma 366.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

మైత్రేయ మహర్షి బోధనలు - 127


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 127 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 98. అశ్వఘోషుడు - 2🌻

నిత్య జీవితమే ఒక సినిమా. దీనిని గమనించుట నేర్చినచో దాని దర్శకుడు. నిర్మాత యొక్క చాతుర్యము మనలను అబ్బుర పరచగలదు. ప్రకృతి యందుగాని, మానవుని ప్రవర్తనయందు గాని, అంతర్యామిని దర్శించుట, అందమును దర్శించుటే. అతని లీలలుయే పశుపక్ష్యాదులు, సమస్త మానవుల ప్రవర్తనలును. అంతర్యామి సృష్టి నుండి, సృష్టి జీవులనుండి తొంగి చూచుచుండును. తొణికిసలాడు చుండును. మిరుమిట్లు కొలుపుచుండును. దిగ్భ్రాంతి కలిగించు చుండును. భయభ్రాంతులను కూడ కలిగించు చుండును.

అతనిని చూచువారికి సృష్టి అందమే గోచరించును. అశ్వఘోషుడట్లు దర్శించి, స్పందించి, చిత్రించి జనసమూహములను ఉత్తేజపరచినాడు. అతడు కేవలము చిత్రకారుడు కాదు. తీవ్రమగు సాధకుడు. తాను దర్శించిన అంతర్యామి అందమును చిత్రముల బంధించు ప్రయత్నమున సిద్ధుడైనాడు. అతడు నిజమగు యుపాసకుడు. అందము తీరుతెన్ను లెరిగినవాడు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


01 Jun 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 188


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 188 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ప్రేమ ఎక్కడికి తీసుకుపోతుందో ఎవరికీ తెలీదు. వూహకందనివి. పాతదాన్ని పునరుక్తం చెయ్యదు. అది ఎప్పుడు వర్తమానాన్నే ఆవిష్కరిస్తుంది. 'తల' ఎప్పుడూ గతంలో జీవిస్తుంది. అందువల్ల మేథ ఎప్పుడూ సంప్రదాయంలో వుంటుది. హృదయమెప్పుడూ విప్లవాత్మకం. 🍀


హృదయం ప్రేమగుండా జీవిస్తుంది. ప్రేమ అదుపులకు లొంగదు. అది సులభంగా తిరగబడుతుంది. ప్రేమ ఎక్కడికి తీసుకుపోతుందో ఎవరికీ తెలీదు. వూహకందనివి. హఠాత్తుగా జరిగేది. పాతదాన్ని పునరుక్తం చెయ్యదు. అది ఎప్పుడు వర్తమానాన్నే ఆవిష్కరిస్తుంది. 'తల' ఎప్పుడూ గతంలో జీవిస్తుంది. అందువల్ల మేథ ఎప్పుడూ సంప్రదాయంలో వుంటుది. హృదయమెప్పుడూ విప్లవాత్మకం.

కానీ నువ్వు హృదయం గుండానే విజయం సాధించగలవు. ప్రేమ గుండానే విజేతవవుతావు. లాజిక్ ద్వారా కాదు. ఇక్కడ అద్భుతం ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు గుంపు మనస్తత్వానికి వ్యతిరేకంగా తిరగబడినప్పుడు జరుగుతుంది. నువ్వు మరింత మరింత స్వతంత్రంగా మారతావు. అప్పుడు నువ్వు హఠాత్తుగా అనంతంలో భాగంగా అనుభూతి చెందుతావు. విశ్వంలో భాగమవుతావు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


01 Jun 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 288 - 14. భగవంతుడు సర్వోన్నత కర్త / DAILY WISDOM - 288 - 14. God is the Supreme Doer


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 288 / DAILY WISDOM - 288 🌹

🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 14. భగవంతుడు సర్వోన్నత కర్త 🌻


జీవితం యొక్క ప్రతి దశలోనూ జీవితం యొక్క లక్ష్యం భగవంతుని దర్శనం, భగవంతుని అనుభవం, భగవంతుని సాక్షాత్కారం - భగవంతుడు సర్వోన్నత కర్త మరియు అత్యున్నత ఉనికి. శ్రీమద్ భాగవత మహాపురాణం లేదా ఇలాంటి గ్రంథాల ద్వారా మళ్లీ మళ్లీ మనస్సులోకి చొప్పించబడే సూత్రం ఇదే. అటువంటి గ్రంథాల యొక్క నిరంతర అధ్యయనాన్ని అభ్యసిస్తే, అది శుద్ధి చేస్తుంది. ఇది స్వతహాగా ఒక తపస్సు, మరియు ఇది చివరికి తన స్వయం యొక్క స్వభావాన్ని అధ్యయనం చేస్తుంది. ఈ అధ్యయన ప్రక్రియను సూచించడానికి ‘స్వ’ అనే పదం ఇక్కడ ఉపయోగించబడింది-స్వాధ్యాయ.

అలాగే, మనము పతంజలి యొక్క ఒక సూత్రం, తదా ద్రష్టుః స్వరూపే అవస్థానం (I.3)లో ఇలా చెప్పబడింది. వృత్తులు లేదా మనస్సు యొక్క వివిధ మనోవిక్షేపాలు నిరోధించ బడినప్పుడు చూసేవారు తన స్వభావాన్ని కనుగొంటారు. ప్రతి సాధన యొక్క ఉద్దేశ్యం ఇంతే: మనస్సును దాని అసలు మూలానికి తిరిగి తీసుకురావడం. గ్రంధాలలో మనస్సుకు అందించబడిన వివిధ రకాల వివరాలు మనస్సును విలాసపరచడం లేదా బుజ్జగించడం కోసం ఉద్దేశించబడవు, కానీ మనసుకు పరధ్యానం మరియు బాహ్య వస్తువులతో అనుబంధం యొక్క అనారోగ్యాన్ని చికిత్స చేయడం కోసమే. ఈ లక్ష్యం అత్యంత ఆధ్యాత్మికమైనది.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 288 🌹

🍀 📖 from The Study and Practice of Yoga 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 14. God is the Supreme Doer 🌻


The goal of life in every stage of its manifestation is the vision of God, the experience of God, the realisation of God—that God is the Supreme Doer and the Supreme Existence. This is the principle that is driven into the mind again and again by the Srimad Bhagavata Mahapurana or such similar texts. If a continued or sustained study of such scriptures is practised, it is purifying. It is a tapas by itself, and it is a study of the nature of one's own Self, ultimately. The word ‘sva' is used here to designate this process of study—svadhyaya.

Also, we are told in one sutra of Patanjali, tada drastuḥ svarupe avasthanam (I.3), that the seer finds himself in his own nature when the vrittis or the various psychoses of the mind are inhibited. The purpose of every sadhana is only this much: to bring the mind back to its original source. The variety of detail that is provided to the mind in the scriptures has an intention not to pamper or cajole the mind, but to treat the mind of its illness of distraction and attachment to external objects. The aim is highly spiritual.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

01 Jun 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 609 / Vishnu Sahasranama Contemplation - 609


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 609 / Vishnu Sahasranama Contemplation - 609🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 609. శ్రీవిభావనః, श्रीविभावनः, Śrīvibhāvanaḥ 🌻


ఓం శ్రీవిభావనాయ నమః | ॐ श्रीविभावनाय नमः | OM Śrīvibhāvanāya namaḥ

వివిధాస్సర్వ భూతానాం విభావయతి యః శ్రియః ।
తత్తత్కర్మానురూపేణ స హరిః శ్రీవిభావనః ॥

సర్వ భూతములకును తమ తమ కర్మములకు తగిన విధముగా వివిధములగు శ్రీలను విశేషముగా కలుగజేయు వాడు గనుక హరికి శ్రీవిభావనః అను నామము గలదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 609🌹

📚. Prasad Bharadwaj

🌻609. Śrīvibhāvanaḥ🌻

OM Śrīvibhāvanāya namaḥ


विविधास्सर्व भूतानां विभावयति यः श्रियः ।
तत्तत्कर्मानुरूपेण स हरिः श्रीविभावनः ॥

Vividhāssarva bhūtānāṃ vibhāvayati yaḥ śriyaḥ,
Tattatkarmānurūpeṇa sa hariḥ śrīvibhāvanaḥ.

Since Lord Hari accords appropriate Śrī or different kinds of opulence on the beings in accordance to their deeds, He is known as Śrīvibhāvanaḥ.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।
श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥

శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।
శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥

Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,
Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


01 Jun 2022

01 - JUNE - 2022 బుధవారం, సౌమ్య వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 01, జూన్ 2022 బధవారం, సౌమ్య వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 210 / Bhagavad-Gita - 210 - 5- 06 కర్మ యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 609 / Vishnu Sahasranama Contemplation - 609🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 288 / DAILY WISDOM - 288🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 188 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 127 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*సౌమ్య వాసరే, 01, జూన్‌ 2022 జేష్ట మాసము*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺*

*🍀. నారాయణ కవచము - 5 🍀*

*9. షకారం తు భ్రువోర్మధ్యే ణకారం శిఖయా న్యసేత్ |*
*వేకారం నేత్రయోర్యుంజ్యాన్నకారం సర్వసంధిషు*
*10. మకారమస్త్రముద్దిశ్య మంత్రమూర్తిర్భవేద్బుధః |*
*సవిసర్గం ఫడన్తం తత్సర్వదిక్షు వినిర్దిశేత్*
*ఓం విష్ణవే నమః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ప్రకృతి జాగరణకు రామాయణము, పంచకోశ జాగరణకు మహాభారతము, చక్ర జాగరణకు భాగవతము దోహద పడతాయి. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: శుక్ల విదియ 21:48:34 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: మృగశిర 13:01:36 వరకు
తదుపరి ఆర్ద్ర
యోగం: శూల 25:34:43 వరకు
తదుపరి దండ 
కరణం: బాలవ 08:32:46 వరకు
వర్జ్యం: 22:29:03 - 24:17:15
దుర్ముహూర్తం: 11:47:43 - 12:40:08
రాహు కాలం: 12:13:56 - 13:52:11
గుళిక కాలం: 10:35:40 - 12:13:56
యమ గండం: 07:19:10 - 08:57:25
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:39
అమృత కాలం: 03:07:22 - 04:55:18
మరియు 28:47:45 - 30:35:57
సూర్యోదయం: 05:40:55
సూర్యాస్తమయం: 18:46:56
చంద్రోదయం: 06:52:44
చంద్రాస్తమయం: 20:32:15
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: జెమిని
అమృత యోగం - కార్య సిధ్ది 13:01:36
వరకు తదుపరి ముసల యోగం 
- దుఃఖం  

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 210 / Bhagavad-Gita - 210 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 06 🌴*

*06. సన్న్యాసస్తు మాహాబాహో దుఃఖమాప్తుమయోగత: |*
*యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేనాధిగచ్ఛతి ||*

🌷. తాత్పర్యం :
*భక్తియుతసేవ యందు నియుక్తుడు కాకుండా కేవలము కర్మలను త్యజించుట ద్వారా ఎవ్వరును సుఖమును పొందలేరు. కాని భక్తియోగమునందు నియుక్తుడైన మననశీలుడు పరబ్రహ్మమును శీఘ్రముగా పొందగలడు.*

🌷. భాష్యము :
సన్న్యాసుల యందు(సన్న్యాసాశ్రమము నందున్నవారు) రెండు తరగతులవారు కలరు. మయావాద సన్న్యాసులు సాంఖ్యతత్త్వమును అధ్యయనము చేయుట యందు నియుక్తులై యుండగా, వైష్ణవసన్న్యాసులు వేదాంతసూత్రములకు చక్కని భాష్యమైన శ్రీమద్భాగవతతత్త్వమును అధ్యయనము చేయుట యందు నియుక్తులై యుందురు. మయావాదులు సైతము వేదాంతసూత్రములను అధ్యయనము చేసినను దాని కొరకు వారు శంకరాచార్యులు వ్రాసిన శారీరికభాష్యమనెడి తమ స్వంత వ్యాఖ్యానమును ఉపయోగింతురు. 

భాగవతధర్మము నందు భక్తులు “పాంచరాత్రిక” విధానము ద్వారా భగవానుని భక్తియుక్తసేవ యందు నెలకొనియుందురు. కనుకనే భాగవతధర్మము ననుసరించు వైష్ణవసన్న్యాసులు భగవానుని దివ్యసేవ యందు పలురకములైన కర్మలను కలిగియుందురు. భౌతికకర్మలతో ఎట్టి సంబంధము లేకున్నను వారు భాగవత్సేవ కొరకై పలువిధములైన కర్మలలో నియుక్తులగుదురు. సాంఖ్యమునందు, వేదాంతాధ్యయనము నందు, మనోకల్పనల యందు మునిగియుండెడి మయావాద సన్న్యాసులు అట్టి దివ్యసేవా మధురిమను అనుభవింపలేరు. 

అతిదీర్ఘమైన తమ అధ్యయనముల వలన వారు కొన్నిమార్లు పరబ్రహ్మమును గూర్చిన మానసికకల్పనల యెడ విసుగుచెంది శ్రీమద్భాగవతము నాశ్రయింతురు. కాని సరియైన అవగాహన లేకనే భాగవతమును స్వీకరించుచున్నందున వారి అధ్యయనము శ్రమ కారణమే కాగలదు. వాస్తవమునకు అట్టి శుష్క మానసికకల్పనలు మరియు కృత్రిమమైన నిరాకారభావపు వ్యాఖ్యానములు మయావాద సంన్యాసులకు నిరర్ధక కార్యములు. భక్తియోగమునందు చరించుచున్న వైష్ణవసన్న్యాసులు తమ దివ్య కర్మాచరణమునందు ఆనందము ననుభవించుచు అంత్యమున భగవద్ధామమును చేరుదుమనెడి అభయమును కలిగియుందురు. 

కాని మాయావాద సన్న్యాసులు కొన్నిమార్లు ఆత్మానుభవమార్గము నుండి పతనము నొంది భౌతికకలాపములేయైన ధర్మకార్యములు మరియు పరహితముల వంటి లౌకికకర్మలలో తిరిగి ప్రవేశింతురు. కనుక సారాంశమేమనగా ఏది బ్రహ్మము మరియు ఏది బ్రహ్మము కాదనెడి మనోకల్పనల యందే నియుక్తులై యుండు మాయావాద సన్న్యాసుల కన్నను కృష్ణ భక్తిరస భావిత కర్మల యందు నియుక్తులైనవారు సరియైన స్థితిలో నెలకొనినట్టివారు. అయినను మయావాద సన్న్యాసులు సైతము బహుజన్మల పిదప కృష్ణభక్తిభావనకు పొందగలరు. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 210 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 5 - Karma Yoga - 06 🌴*

*06. sannyāsas tu mahā-bāho duḥkham āptum ayogataḥ*
*yoga-yukto munir brahma na cireṇādhigacchati*

🌷 Translation : 
*Merely renouncing all activities yet not engaging in the devotional service of the Lord cannot make one happy. But a thoughtful person engaged in devotional service can achieve the Supreme without delay.*

🌹 Purport :
There are two classes of sannyāsīs, or persons in the renounced order of life. The Māyāvādī sannyāsīs are engaged in the study of Sāṅkhya philosophy, whereas the Vaiṣṇava sannyāsīs are engaged in the study of Bhāgavatam philosophy, which affords the proper commentary on the Vedānta-sūtras. The Māyāvādī sannyāsīs also study the Vedānta-sūtras, but use their own commentary, called Śārīraka-bhāṣya, written by Śaṅkarācārya. 

The students of the Bhāgavata school are engaged in the devotional service of the Lord, according to pāñcarātrikī regulations, and therefore the Vaiṣṇava sannyāsīs have multiple engagements in the transcendental service of the Lord. The Vaiṣṇava sannyāsīs have nothing to do with material activities, and yet they perform various activities in their devotional service to the Lord. But the Māyāvādī sannyāsīs, engaged in the studies of Sāṅkhya and Vedānta and speculation, cannot relish the transcendental service of the Lord. Because their studies become very tedious, they sometimes become tired of Brahman speculation, and thus they take shelter of the Bhāgavatam without proper understanding.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://www.tumblr.com/blog/bhagavadgitawisdom
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 609 / Vishnu Sahasranama Contemplation - 609🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 609. శ్రీవిభావనః, श्रीविभावनः, Śrīvibhāvanaḥ 🌻*

*ఓం శ్రీవిభావనాయ నమః | ॐ श्रीविभावनाय नमः | OM Śrīvibhāvanāya namaḥ*

*వివిధాస్సర్వ భూతానాం విభావయతి యః శ్రియః ।*
*తత్తత్కర్మానురూపేణ స హరిః శ్రీవిభావనః ॥*

*సర్వ భూతములకును తమ తమ కర్మములకు తగిన విధముగా వివిధములగు శ్రీలను విశేషముగా కలుగజేయు వాడు గనుక హరికి శ్రీవిభావనః అను నామము గలదు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 609🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻609. Śrīvibhāvanaḥ🌻*

*OM Śrīvibhāvanāya namaḥ*

विविधास्सर्व भूतानां विभावयति यः श्रियः ।
तत्तत्कर्मानुरूपेण स हरिः श्रीविभावनः ॥

*Vividhāssarva bhūtānāṃ vibhāvayati yaḥ śriyaḥ,*
*Tattatkarmānurūpeṇa sa hariḥ śrīvibhāvanaḥ.*

*Since Lord Hari accords appropriate Śrī or different kinds of opulence on the beings in accordance to their deeds, He is known as Śrīvibhāvanaḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥
శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥
Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 288 / DAILY WISDOM - 288 🌹*
*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 14. భగవంతుడు సర్వోన్నత కర్త 🌻*

*జీవితం యొక్క ప్రతి దశలోనూ జీవితం యొక్క లక్ష్యం భగవంతుని దర్శనం, భగవంతుని అనుభవం, భగవంతుని సాక్షాత్కారం - భగవంతుడు సర్వోన్నత కర్త మరియు అత్యున్నత ఉనికి. శ్రీమద్ భాగవత మహాపురాణం లేదా ఇలాంటి గ్రంథాల ద్వారా మళ్లీ మళ్లీ మనస్సులోకి చొప్పించబడే సూత్రం ఇదే. అటువంటి గ్రంథాల యొక్క నిరంతర అధ్యయనాన్ని అభ్యసిస్తే, అది శుద్ధి చేస్తుంది. ఇది స్వతహాగా ఒక తపస్సు, మరియు ఇది చివరికి తన స్వయం యొక్క స్వభావాన్ని అధ్యయనం చేస్తుంది. ఈ అధ్యయన ప్రక్రియను సూచించడానికి ‘స్వ’ అనే పదం ఇక్కడ ఉపయోగించబడింది-స్వాధ్యాయ.*

*అలాగే, మనము పతంజలి యొక్క ఒక సూత్రం, తదా ద్రష్టుః స్వరూపే అవస్థానం (I.3)లో ఇలా చెప్పబడింది. వృత్తులు లేదా మనస్సు యొక్క వివిధ మనోవిక్షేపాలు నిరోధించ బడినప్పుడు చూసేవారు తన స్వభావాన్ని కనుగొంటారు. ప్రతి సాధన యొక్క ఉద్దేశ్యం ఇంతే: మనస్సును దాని అసలు మూలానికి తిరిగి తీసుకురావడం. గ్రంధాలలో మనస్సుకు అందించబడిన వివిధ రకాల వివరాలు మనస్సును విలాసపరచడం లేదా బుజ్జగించడం కోసం ఉద్దేశించబడవు, కానీ మనసుకు పరధ్యానం మరియు బాహ్య వస్తువులతో అనుబంధం యొక్క అనారోగ్యాన్ని చికిత్స చేయడం కోసమే. ఈ లక్ష్యం అత్యంత ఆధ్యాత్మికమైనది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 288 🌹*
*🍀 📖 from The Study and Practice of Yoga 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 14. God is the Supreme Doer 🌻*

*The goal of life in every stage of its manifestation is the vision of God, the experience of God, the realisation of God—that God is the Supreme Doer and the Supreme Existence. This is the principle that is driven into the mind again and again by the Srimad Bhagavata Mahapurana or such similar texts. If a continued or sustained study of such scriptures is practised, it is purifying. It is a tapas by itself, and it is a study of the nature of one's own Self, ultimately. The word ‘sva' is used here to designate this process of study—svadhyaya.*

*Also, we are told in one sutra of Patanjali, tada drastuḥ svarupe avasthanam (I.3), that the seer finds himself in his own nature when the vrittis or the various psychoses of the mind are inhibited. The purpose of every sadhana is only this much: to bring the mind back to its original source. The variety of detail that is provided to the mind in the scriptures has an intention not to pamper or cajole the mind, but to treat the mind of its illness of distraction and attachment to external objects. The aim is highly spiritual.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 188 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ప్రేమ ఎక్కడికి తీసుకుపోతుందో ఎవరికీ తెలీదు. వూహకందనివి. పాతదాన్ని పునరుక్తం చెయ్యదు. అది ఎప్పుడు వర్తమానాన్నే ఆవిష్కరిస్తుంది. 'తల' ఎప్పుడూ గతంలో జీవిస్తుంది. అందువల్ల మేథ ఎప్పుడూ సంప్రదాయంలో వుంటుది. హృదయమెప్పుడూ విప్లవాత్మకం. 🍀*

*హృదయం ప్రేమగుండా జీవిస్తుంది. ప్రేమ అదుపులకు లొంగదు. అది సులభంగా తిరగబడుతుంది. ప్రేమ ఎక్కడికి తీసుకుపోతుందో ఎవరికీ తెలీదు. వూహకందనివి. హఠాత్తుగా జరిగేది. పాతదాన్ని పునరుక్తం చెయ్యదు. అది ఎప్పుడు వర్తమానాన్నే ఆవిష్కరిస్తుంది. 'తల' ఎప్పుడూ గతంలో జీవిస్తుంది. అందువల్ల మేథ ఎప్పుడూ సంప్రదాయంలో వుంటుది. హృదయమెప్పుడూ విప్లవాత్మకం.*

*కానీ నువ్వు హృదయం గుండానే విజయం సాధించగలవు. ప్రేమ గుండానే విజేతవవుతావు. లాజిక్ ద్వారా కాదు. ఇక్కడ అద్భుతం ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు గుంపు మనస్తత్వానికి వ్యతిరేకంగా తిరగబడినప్పుడు జరుగుతుంది. నువ్వు మరింత మరింత స్వతంత్రంగా మారతావు. అప్పుడు నువ్వు హఠాత్తుగా అనంతంలో భాగంగా అనుభూతి చెందుతావు. విశ్వంలో భాగమవుతావు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 127 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 98. అశ్వఘోషుడు - 2🌻*

*నిత్య జీవితమే ఒక సినిమా. దీనిని గమనించుట నేర్చినచో దాని దర్శకుడు. నిర్మాత యొక్క చాతుర్యము మనలను అబ్బుర పరచగలదు. ప్రకృతి యందుగాని, మానవుని ప్రవర్తనయందు గాని, అంతర్యామిని దర్శించుట, అందమును దర్శించుటే. అతని లీలలుయే పశుపక్ష్యాదులు, సమస్త మానవుల ప్రవర్తనలును. అంతర్యామి సృష్టి నుండి, సృష్టి జీవులనుండి తొంగి చూచుచుండును. తొణికిసలాడు చుండును. మిరుమిట్లు కొలుపుచుండును. దిగ్భ్రాంతి కలిగించు చుండును. భయభ్రాంతులను కూడ కలిగించు చుండును.*

*అతనిని చూచువారికి సృష్టి అందమే గోచరించును. అశ్వఘోషుడట్లు దర్శించి, స్పందించి, చిత్రించి జనసమూహములను ఉత్తేజపరచినాడు. అతడు కేవలము చిత్రకారుడు కాదు. తీవ్రమగు సాధకుడు. తాను దర్శించిన అంతర్యామి అందమును చిత్రముల బంధించు ప్రయత్నమున సిద్ధుడైనాడు. అతడు నిజమగు యుపాసకుడు. అందము తీరుతెన్ను లెరిగినవాడు.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #ChaitanyaVijnanam #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹