నిర్మల ధ్యానాలు - ఓషో - 203
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 203 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మన అస్తిత్వం అపరిమితం. శాశ్వతం. దానికి మూడు లక్షణాలున్నాయి. మొదటిది సత్యం. నువ్వు నీ అస్తిత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్నపుడు మొదటిసారి సత్యాన్ని రుచి చూస్తావు. రెండోది చైతన్యం. చైతన్నాన్ని రుచి చూస్తావు. మూడోది పరమానందం. అది అంతిమమైనది. 🍀
మన శరీరం చిన్నది. మన మనసు చిన్నది. కానీ మన అస్తిత్వం విశాలమైంది. సముద్రమంత విశాలమైంది. పెద్ద సముద్రాల కన్నా గొప్పది. సముద్రాలకు సరిహద్దులుంటాయి. మన అస్తిత్వం అపరిమితం. శాశ్వతం. దానికి మూడు లక్షణాలున్నాయి.
మొదటిది సత్యం. నువ్వు మొదటిసారి నీ అస్తిత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్నపుడు మొదటిసారి సత్యాన్ని రుచి చూస్తావు. అంత వరకూ నీకు సత్యానికి సంబంధించిన సిద్ధాంతాలు మాత్రమే తెలిసి వుంటాయి. ఆహారం గురించి వినడం లాంటిదది. తినడంలాంటింది. శరీరాన్ని దాటి, మనసును దాటి మొదటి సారి సత్యాన్ని రుచి చూస్తావు.
రెండోది చైతన్యం. చైతన్నాన్ని రుచి చూస్తావు. లేకుంటే అది పదంగానే వుంటుంది. జనాలు నిద్రపోతుంటారు. వాళ్ళకు చైతన్యమంటే ఏమో తెలీదు. వాళ్ళు యంత్రప్రాయంగా రోబోట్లలా వుంటారు.
మూడోది పరమానందం. అది అంతిమమైనది. శిఖరప్రాయం. నీలోలోతుల్లోకి వెళితే మొదట సత్యం ఎదురవుతుంది. తరువాత చైతన్యం వస్తుంది. అంతిమంగా ఆనందం అల్లుకుంటుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
01 Jul 2022
నిత్య ప్రజ్ఞా సందేశములు - 303 - 29. ఇది బంధం యొక్క కారణం / DAILY WISDOM - 303 - 29. This is the Reason of Bondage
🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 303 / DAILY WISDOM - 303 🌹
🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 29. ఇది బంధం యొక్క కారణం 🌻
ఇంద్రియ సంపర్కంలో మనం ఎందుకు ఆనందాన్ని పొందుతున్నామో, అదంటే మనకు ఎందుకు ఇష్టమో అనుభూతి యొక్క నిర్మాణం మనకు తెలియకపోతే తెలుసుకోవడం కష్టం. మనం వస్తువులను ఎందుకు చూస్తున్నాము? ఏది మనల్ని బలవంతం చేస్తుంది లేదా వస్తువుల వైపు నడిపిస్తుంది? మనం విషయాలతో సంప్రదించ వలసిన అవసరం ఎక్కడ ఉంది? శారీరక శాస్త్రముు యొక్క లోతైన అధ్యయనం చేస్తే, ఈ పరిస్థితికి కారణమును, మనం బాధను, ఆనందంగా తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటున్నామో మరియు ఇంద్రియాలు సృష్టించే ఈ మాయలో ఎందుకు పడతామో కొంతవరకు తెలుసుకో గలుగుతాము.
నరాల ఒత్తిడి నుంచి లభించే కొద్ది ఉపశమనాన్ని మనం ఆనందం అనుకుంటాము. దానినే సత్యం అనుకుంటాము. ఈ విషయాలను గ్రహించలేక పోవడం వల్లనే శారీరక ప్రక్రియలు మరియు వాటి అనుభవాలు తమంతట తాముగానే ఒక వాస్తవంగా వ్యవహరిస్తాయి అనే దురభిప్రాయాన్ని కలిగి ఉంటున్నాము. ఇదే బంధాలు ఏర్పడడానికి ప్రధాన కారణం. దాని నుండి బయటపడటం ఎంత కష్టమో ఉపరితలంపై స్పష్టంగా తెలుస్తుంది. కారణాలను కాకుండా కేవలం వాటి ప్రభావాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రయత్నాలు విఫలమవుతాయి. ఇది కొంతవరకు సందర్భోచిత కారణాల వల్ల జరుగుతుంది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 303 🌹
🍀 📖 from The Study and Practice of Yoga 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 29. This is the Reason of Bondage 🌻
It is difficult to know why we feel happiness, why there is pleasure at all in sense contact, unless we know the anatomy of perception itself. Why is it that we are seeing objects? What is it that compels us or drives us towards objects? Where is the need for us to come in contact with things? If the history and the anatomical background of this situation are properly grasped, we may also be able to know to some extent why it is that we wrongly mistake pain for pleasure, and how is it that we can get fooled by the senses in creating a notion of falsehood—how a negative reaction, which is merely a little bit of freedom from tension of nerves, can look like a positive bliss.
It is the inability to grasp these things that has created an impression that bodily experiences and phenomenal processes are independent by themselves—a reality taken by themselves. This is the Reason for bondage; and how difficult it is to get out of it is clear on the very surface. Most of the endeavours in spiritual practice become failures on account of the causes being left untouched and the effects being taken into consideration with great ardour and force of concentration. This is partly due to circumstantial reasons.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
01 Jul 2022
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 624 / Vishnu Sahasranama Contemplation - 624
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 624 / Vishnu Sahasranama Contemplation - 624🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻624. ఉదీర్ణః, उदीर्णः, Udīrṇaḥ🌻
ఓం ఉదీర్ణాయ నమః | ॐ उदीर्णाय नमः | OM Udīrṇāya namaḥ
సర్వభూతేభ్యః ఉద్రిక్త ఉదీర్ణ ఇతి కథ్యతే
అన్నిటి కంటెను మిక్కిలిగా ఉద్రేకించి పై స్థితికి చేరి ఉన్నవాడు ఉదీర్ణః.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 624🌹
📚. Prasad Bharadwaj
🌻624. Udīrṇaḥ🌻
OM Udīrṇāya namaḥ
सर्वभूतेभ्यः उद्रिक्त उदीर्ण इति कथ्यते / Sarvabhūtebhyaḥ udrikta udīrṇa iti kathyate
As He is apart from and above all beings, increased, He is Udīrṇaḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
उदीर्णस्सर्वतश्चक्षुरनीशश्शाश्वतस्स्थिरः ।
भूशयो भूषणो भूतिर्विशोकश्शोकनाशनः ॥ ६७ ॥
ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।
ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।
భూశయో భూషణో భూతిర్విశోకశ్శోకనాశనః ॥ 67 ॥
Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,
Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,
Bhūśayo bhūṣaṇo bhūtirviśokaśśokanāśanaḥ ॥ 67 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
01 Jul 2022
Continues....
🌹 🌹 🌹 🌹🌹
01 Jul 2022
01 Jul 2022 Daily Panchang నిత్య పంచాంగము
🌹 01, July 2022 పంచాగము - Panchagam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : జగన్నాధ రధయాత్ర, Jagannath Rathyatra 🌻
🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 4 🍀
4. సర్వార్థసిద్ధిదే విష్ణుమనోఽనుకూలే
సమ్ప్రార్థితాఖిలజనావనదివ్యశీలే ।
దారిద్ర్యదుఃఖభయనాశిని భక్తపాలే
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : మానవ ప్రాణంలో అనంతమైన క్రియాశక్తి దాగి వుంది. కానీ కోరికలు, విషయ వికారాల వల్ల అది తగ్గుతూ ఉంటుంది. వాటి నుండి తప్పించగలిగితే అనంత సామర్థ్యం మానవుని సొంతం అవుతుంది. - సద్గురు శ్రీరామశర్మ.🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, ఆషాఢ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: శుక్ల విదియ 13:10:42 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: పుష్యమి 27:57:40 వరకు
తదుపరి ఆశ్లేష
యోగం: వ్యాఘత 10:46:06 వరకు
తదుపరి హర్షణ
కరణం: కౌలవ 13:08:42 వరకు
వర్జ్యం: 10:04:20 - 11:51:36
దుర్ముహూర్తం: 08:23:07 - 09:15:44
మరియు 12:46:11 - 13:38:48
రాహు కాలం: 10:41:13 - 12:19:52
గుళిక కాలం: 07:23:55 - 09:02:34
యమ గండం: 15:37:10 - 17:15:49
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:45
అమృత కాలం: 20:47:56 - 22:35:12
మరియు 28:44:44 - 30:31:00
సూర్యోదయం: 05:45:16
సూర్యాస్తమయం: 18:54:28
చంద్రోదయం: 07:22:39
చంద్రాస్తమయం: 20:52:16
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: కర్కాటకం
ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం
27:57:40 వరకు తదుపరి మృత్యు యోగం
- మృత్యు భయం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
01 - JULY - 2022 FRIDAY MESSAGES శుక్రవారం, భృగు వాసర సందేశాలు
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 01, జూలై 2022 శుక్రవారం, భృగు వాసరే Friday 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 225 / Bhagavad-Gita - 225 - 5- 21 కర్మ యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 624 / Vishnu Sahasranama Contemplation - 624🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 303 / DAILY WISDOM - 303🌹
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 203 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 142 🌹
7) 🌹. పూరీ జగన్నాధ రథయాత్ర. 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 01, July 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : జగన్నాధ రధయాత్ర, Jagannath Rathyatra 🌻*
*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 4 🍀*
*4. సర్వార్థసిద్ధిదే విష్ణుమనోఽనుకూలే*
*సమ్ప్రార్థితాఖిలజనావనదివ్యశీలే ।*
*దారిద్ర్యదుఃఖభయనాశిని భక్తపాలే*
*శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : మానవ ప్రాణంలో అనంతమైన క్రియాశక్తి దాగి వుంది. కానీ కోరికలు, విషయ వికారాల వల్ల అది తగ్గుతూ ఉంటుంది. వాటి నుండి తప్పించగలిగితే అనంత సామర్థ్యం మానవుని సొంతం అవుతుంది. - సద్గురు శ్రీరామశర్మ.🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, ఆషాఢ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: శుక్ల విదియ 13:10:42 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: పుష్యమి 27:57:40 వరకు
తదుపరి ఆశ్లేష
యోగం: వ్యాఘత 10:46:06 వరకు
తదుపరి హర్షణ
కరణం: కౌలవ 13:08:42 వరకు
వర్జ్యం: 10:04:20 - 11:51:36
దుర్ముహూర్తం: 08:23:07 - 09:15:44
మరియు 12:46:11 - 13:38:48
రాహు కాలం: 10:41:13 - 12:19:52
గుళిక కాలం: 07:23:55 - 09:02:34
యమ గండం: 15:37:10 - 17:15:49
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:45
అమృత కాలం: 20:47:56 - 22:35:12
మరియు 28:44:44 - 30:31:00
సూర్యోదయం: 05:45:16
సూర్యాస్తమయం: 18:54:28
చంద్రోదయం: 07:22:39
చంద్రాస్తమయం: 20:52:16
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: కర్కాటకం
ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం
27:57:40 వరకు తదుపరి మృత్యు యోగం
- మృత్యు భయం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 225 / Bhagavad-Gita - 225 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 21 🌴*
*21. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విన్దత్యాత్మని యత్ సుఖము |*
*స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయ మశ్నుతే*
🌷. తాత్పర్యం :
*అట్టి ముక్తపురుషుడు బాహ్యేంద్రియ సుఖమునకు ఆకర్షితుడు గాక ఆత్మయందే సౌఖ్యమనుభవించు సదా ధ్యానమగ్నుడై యుండును. పరబ్రహ్మమును ధ్యానించు కారణమున ఆత్మదర్శి ఆ విధముగా అనంతసౌఖ్యము ననుభవించును.*
🌷. భాష్యము :
కృష్ణభక్తిపరాయణుడైన శ్రీయామునాచార్యులు ఈ క్రింది విధముగా పలికియుండిరి.
యదవధి మమ చేత: కృష్ణపాదారవిన్దే |
నవనవరసధామాన్యుద్యతం రంతు మాసీత్
తదవధి బట నారీసంగమే స్మర్యమాణే |
భవతి ముఖవికార: సుష్టు నిష్ఠీవనం చ ||
“శ్రీకృష్ణభగవానుని దివ్యమైన ప్రేమయుక్తసేవ యందు నియుక్తమై, ఆ దేవదేవుని యందు నిత్యనూతనమైన ఆనందమును నేను అనుభవించుచున్నందున మైథునసుఖభావన కలిగినంతనే ఆరుచిచే నా ముఖము వికారము నొంది నేనా భావముపై ఉమ్మివేయుదును.” బ్రహ్మయోగము (కృష్ణభక్తిరసభావనము) నందున్నవాడు శ్రీకృష్ణభగవానుని దివ్యమైన భక్తియుతసేవ యందు నిమగ్నుడై యున్నందున భౌతికభోగముల యెడ రుచిని కోల్పోవును.
భౌతికభావనలో అత్యంత ఘనమైన సుఖము మైథునభోగము. జగమంతయు దీనిపై ఆధారపడియే పనిచేయుచున్నది. దీని ప్రోద్బలము లేకుండా లౌకికుడు ఎట్టి కర్మల యందును పాల్గొనలేడు. కాని కృష్ణభక్తిభావన యందున్నవాడు అట్టి సుఖమును వాచింపకయే అత్యంత ఉత్సాహముతో కర్మను ఒనరింపగలడు. దాని నతడు సంపూర్ణముగా త్యజించును. అట్టి సుఖత్యాగము ఆత్మానుభవమునకు ఒక పరీక్ష వంటిది. ఏలయన ఆత్మానుభవమునకు మరియు మైథునభోగమునకు పొత్తు ఎన్నడును కుదరదు. కృష్ణభక్తిభావన యందున్నవాడు ముక్తపురుషుడై యున్నందున ఏ విధమైన ఇంద్రియభోగముల యెడను ఆకర్షణను కలిగియుండడు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 225 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 5 - Karma Yoga - 21 🌴*
*21. bāhya-sparśeṣv asaktātmā vindaty ātmani yat sukham*
*sa brahma-yoga-yuktātmā sukham akṣayam aśnute*
🌷 Translation :
*Such a liberated person is not attracted to material sense pleasure but is always in trance, enjoying the pleasure within. In this way the self-realized person enjoys unlimited happiness, for he concentrates on the Supreme.*
🌹 Purport :
Śrī Yāmunācārya, a great devotee in Kṛṣṇa consciousness, said:
yad-avadhi mama cetaḥ kṛṣṇa-pādāravinde
nava-nava-rasa-dhāmany udyataṁ rantum āsīt
tad-avadhi bata nārī-saṅgame smaryamāne
bhavati mukha-vikāraḥ suṣṭhu niṣṭhīvanaṁ ca
“Since I have been engaged in the transcendental loving service of Kṛṣṇa, realizing ever-new pleasure in Him, whenever I think of sex pleasure I spit at the thought, and my lips curl with distaste.” A person in brahma-yoga, or Kṛṣṇa consciousness, is so absorbed in the loving service of the Lord that he loses his taste for material sense pleasure altogether.
The highest pleasure in terms of matter is sex pleasure. The whole world is moving under its spell, and a materialist cannot work at all without this motivation. But a person engaged in Kṛṣṇa consciousness can work with greater vigor without sex pleasure, which he avoids. That is the test in spiritual realization. Spiritual realization and sex pleasure go ill together. A Kṛṣṇa conscious person is not attracted to any kind of sense pleasure, due to his being a liberated soul.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://www.tumblr.com/blog/bhagavadgitawisdom
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 624 / Vishnu Sahasranama Contemplation - 624🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻624. ఉదీర్ణః, उदीर्णः, Udīrṇaḥ🌻*
*ఓం ఉదీర్ణాయ నమః | ॐ उदीर्णाय नमः | OM Udīrṇāya namaḥ*
*సర్వభూతేభ్యః ఉద్రిక్త ఉదీర్ణ ఇతి కథ్యతే*
*అన్నిటి కంటెను మిక్కిలిగా ఉద్రేకించి పై స్థితికి చేరి ఉన్నవాడు ఉదీర్ణః.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 624🌹*
*📚. Prasad Bharadwaj*
*🌻624. Udīrṇaḥ🌻*
*OM Udīrṇāya namaḥ*
*सर्वभूतेभ्यः उद्रिक्त उदीर्ण इति कथ्यते / Sarvabhūtebhyaḥ udrikta udīrṇa iti kathyate*
*As He is apart from and above all beings, increased, He is Udīrṇaḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
उदीर्णस्सर्वतश्चक्षुरनीशश्शाश्वतस्स्थिरः ।भूशयो भूषणो भूतिर्विशोकश्शोकनाशनः ॥ ६७ ॥
ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।భూశయో భూషణో భూతిర్విశోకశ్శోకనాశనః ॥ 67 ॥
Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,Bhūśayo bhūṣaṇo bhūtirviśokaśśokanāśanaḥ ॥ 67 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 303 / DAILY WISDOM - 303 🌹*
*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 29. ఇది బంధం యొక్క కారణం 🌻*
*ఇంద్రియ సంపర్కంలో మనం ఎందుకు ఆనందాన్ని పొందుతున్నామో, అదంటే మనకు ఎందుకు ఇష్టమో అనుభూతి యొక్క నిర్మాణం మనకు తెలియకపోతే తెలుసుకోవడం కష్టం. మనం వస్తువులను ఎందుకు చూస్తున్నాము? ఏది మనల్ని బలవంతం చేస్తుంది లేదా వస్తువుల వైపు నడిపిస్తుంది? మనం విషయాలతో సంప్రదించ వలసిన అవసరం ఎక్కడ ఉంది? శారీరక శాస్త్రముు యొక్క లోతైన అధ్యయనం చేస్తే, ఈ పరిస్థితికి కారణమును, మనం బాధను, ఆనందంగా తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటున్నామో మరియు ఇంద్రియాలు సృష్టించే ఈ మాయలో ఎందుకు పడతామో కొంతవరకు తెలుసుకో గలుగుతాము.*
*నరాల ఒత్తిడి నుంచి లభించే కొద్ది ఉపశమనాన్ని మనం ఆనందం అనుకుంటాము. దానినే సత్యం అనుకుంటాము. ఈ విషయాలను గ్రహించలేక పోవడం వల్లనే శారీరక ప్రక్రియలు మరియు వాటి అనుభవాలు తమంతట తాముగానే ఒక వాస్తవంగా వ్యవహరిస్తాయి అనే దురభిప్రాయాన్ని కలిగి ఉంటున్నాము. ఇదే బంధాలు ఏర్పడడానికి ప్రధాన కారణం. దాని నుండి బయటపడటం ఎంత కష్టమో ఉపరితలంపై స్పష్టంగా తెలుస్తుంది. కారణాలను కాకుండా కేవలం వాటి ప్రభావాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రయత్నాలు విఫలమవుతాయి. ఇది కొంతవరకు సందర్భోచిత కారణాల వల్ల జరుగుతుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 303 🌹*
*🍀 📖 from The Study and Practice of Yoga 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 29. This is the Reason of Bondage 🌻*
*It is difficult to know why we feel happiness, why there is pleasure at all in sense contact, unless we know the anatomy of perception itself. Why is it that we are seeing objects? What is it that compels us or drives us towards objects? Where is the need for us to come in contact with things? If the history and the anatomical background of this situation are properly grasped, we may also be able to know to some extent why it is that we wrongly mistake pain for pleasure, and how is it that we can get fooled by the senses in creating a notion of falsehood—how a negative reaction, which is merely a little bit of freedom from tension of nerves, can look like a positive bliss.*
*It is the inability to grasp these things that has created an impression that bodily experiences and phenomenal processes are independent by themselves—a reality taken by themselves. This is the Reason for bondage; and how difficult it is to get out of it is clear on the very surface. Most of the endeavours in spiritual practice become failures on account of the causes being left untouched and the effects being taken into consideration with great ardour and force of concentration. This is partly due to circumstantial reasons.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 203 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. మన అస్తిత్వం అపరిమితం. శాశ్వతం. దానికి మూడు లక్షణాలున్నాయి. మొదటిది సత్యం. నువ్వు నీ అస్తిత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్నపుడు మొదటిసారి సత్యాన్ని రుచి చూస్తావు. రెండోది చైతన్యం. చైతన్నాన్ని రుచి చూస్తావు. మూడోది పరమానందం. అది అంతిమమైనది. 🍀*
*మన శరీరం చిన్నది. మన మనసు చిన్నది. కానీ మన అస్తిత్వం విశాలమైంది. సముద్రమంత విశాలమైంది. పెద్ద సముద్రాల కన్నా గొప్పది. సముద్రాలకు సరిహద్దులుంటాయి. మన అస్తిత్వం అపరిమితం. శాశ్వతం. దానికి మూడు లక్షణాలున్నాయి.*
*మొదటిది సత్యం. నువ్వు మొదటిసారి నీ అస్తిత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్నపుడు మొదటిసారి సత్యాన్ని రుచి చూస్తావు. అంత వరకూ నీకు సత్యానికి సంబంధించిన సిద్ధాంతాలు మాత్రమే తెలిసి వుంటాయి. ఆహారం గురించి వినడం లాంటిదది. తినడంలాంటింది. శరీరాన్ని దాటి, మనసును దాటి మొదటి సారి సత్యాన్ని రుచి చూస్తావు.*
*రెండోది చైతన్యం. చైతన్నాన్ని రుచి చూస్తావు. లేకుంటే అది పదంగానే వుంటుంది. జనాలు నిద్రపోతుంటారు. వాళ్ళకు చైతన్యమంటే ఏమో తెలీదు. వాళ్ళు యంత్రప్రాయంగా రోబోట్లలా వుంటారు.*
*మూడోది పరమానందం. అది అంతిమమైనది. శిఖరప్రాయం. నీలోలోతుల్లోకి వెళితే మొదట సత్యం ఎదురవుతుంది. తరువాత చైతన్యం వస్తుంది. అంతిమంగా ఆనందం అల్లుకుంటుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 142 🌹*
*✍️. రచన : సద్గురు కె. పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻 107. రహస్య భాషణము - 1🌻*
*యతీశ్వరుడొకడు తరచు జంతువులతో మాటాడుచుండెడి వాడు. అతని నివాసము ఒక వనప్రదేశమున నుండెడిది. ఆ వనమందు తేనెపట్లు యున్నవి. చీమలు పెట్టిన పుట్టలున్నవి. రామచిలుక లుండెడివి. ఇన్నిటితోపాటు కోతి యొకటి యుండెడిది. యతి వానితో తరచు సంభాషించు చుండెడి వాడు. అతడు చీమలతో యిట్లను చుండెను. "శ్రామికులారా! మీ పరిశ్రమ నెవరు గుర్తింతురు. మీ పరిశ్రమ కారణముగనే ఉన్నతోన్నతమైన మహానగరములు నిర్మింప బడచున్నవి. విష సర్పములు అందుచేరి మిమ్ములను పారద్రోలుచున్నవి.”*
*అతడు తేనెటీగలను చూచి యిట్లు సంబోధించుచుండెను. "జ్ఞానులారా! శ్రమకోర్చి, స్వాధ్యాయము కావించి, జాతి ఉన్నతికై మాధుర్యమును పోగుచేయుచున్నారు. అట్లు ప్రోగు చేయుటలో గల మాధుర్యము మిమ్ము ఈ కార్యమున నిలిపినది. జాతి మీరందించు మాధుర్యమును అంగళ్ళలో అమ్ముకొనుచున్నారే, కాని అనుభవించుట లేదు. మీ శ్రమా మాధుర్యము యీ జాతి కబ్బదు. ఐనను మీరు కొనసాగించు శ్రమ దైవమునకు ప్రీతి కలిగించుచున్నది. అట్లే కానిండు.”*
*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #ChaitanyaVijnanam #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. పూరీ జగన్నాధ రథయాత్ర. 🌹
రథయాత్ర అనగానే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది పూరీజగన్నాథ రథయాత్ర. ప్రతీ సంవత్సరమూ అత్యంత వైభవంగా జరిగే ఈ రథయాత్రలో దేశం నలుమూలల నుంచీ అసంఖ్యాక భక్తులు పాల్గొంటారు. అత్యద్భుతంగా అలంకరించిన రథంలో దివ్యమూర్తుల విగ్రహాల్ని ప్రతిష్ఠించి నృత్యగానాలతో పురవీథుల్లో ఊరేగిస్తారు. భక్తులు ఆనందపారవశ్యంతో రథయాత్రను తిలకిస్తారు. ఫలపుష్పాదులను అర్పించి, భక్తిప్రపత్తులతో రథం ముందు ప్రణమిల్లుతారు. రథానికి వేలాదిమంది భక్తులు తమ శిరస్సులు వంచి ప్రణతులర్పించడానికి కారణం అందులో భగవంతుని దివ్యమూర్తులు కొలువుతీరి ఉండడం అని మనకు విదితమే. సంవత్సానికి ఒకసారి జరిగే ఈ రథయాత్రకు ఇంత ప్రాముఖ్యం ఉంటే, మరి మన జీవన యాత్రలో నిత్యం జరిగే రథయాత్రకు మరెంత ప్రాముఖ్యత ఉండాలి? అయితే మన జీవనయాత్ర కొనసాగించేందుకు ఉపయోగించే రథం ఏది? ఆ రథంలో ఆసీనుడై ఉన్న రథికుడెవరు?
బాహ్యప్రపంచంలో గమ్యాన్ని చేరుకోవడానికి ఎన్నో రకాల వాహనాలు ఉన్నాయి. కానీ అంతర ప్రపంచంలో పయనించి పరమపదాన్ని చేరుకోవడానికి మనకున్న ఒకే ఒక వాహనం ఈ ’శరీరం’. శరీరం అనే రథంలో ఆసీనుడై ఉన్న రథికుడు చైతన్య స్వరూపుడైన భగవంతుడు (ఆత్మ).
రథంయెక్క బాహ్యాలంకారాల్ని తిలకిస్తూ రథికుణ్ణి మరచిపోతే అలాంటి రథయాత్ర నిష్ప్రయోజనం. అలాగే మనం దేహాలంకారాల్లోనూ, దేహ సౌందర్య ఆకర్షణల్లోనూ మునిగి దేహాంతర్గతంగా ఉన్న ఆత్మస్వరూపాన్ని ఆదమరచిన నాడు మన జీవనయాత్ర నిరర్థకం.
ఆత్మ సాక్షాత్కార యాత్రలో మనిషిని పశుప్రవృత్తి నుంచి పశుపతి స్థితికి చేర్చే ఏకైక సాధనం ఈ మానవ దేహం. ఎన్నోజన్మల సుకృత ఫలమైన ఈ మానవ దేహమనే రథాన్ని బాహ్య విషయాలవైపు పరుగులు తీయనీయకుండా అంతర్ముఖంగా ప్రయాణం కొనసాగించి అంతరాత్మను చేరుకోవడానికి ప్రయత్నించినపుడు మానవ జన్మ సార్థకమవుతుంది.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Escaping the chain of Bondage
🌹 Escaping the chain of Bondage 🌹
Prasad Bharadwaj
There are seven links in the chain of bondage. Misery is the final link in the chain of cause and effect. Every link depends for its existence upon the previous link.
The seven links are:
(l) Misery, (2) Embodiment, (3) Karma, (4) Raga, (5) Dvesha, (6) Aviveka and (7) Ajnana.
If the root cause Ajnana (ignorance of the Selfl is removed by Atma-jnana or knowledge of the Self, the other links will be broken by themselves. From ignorance, non-discrimination is born; from non-discrimination, Abhimana; from Abhimana, Raga-Dvesha; from Raga-Dvesha, Karma; from Karma, this physical body; from the physical body, misery. If you want to annihilate misery, you must get rid of embodiment. [f you want to get rid of embodiment, you must not perform actions.
If you wish to cease to act, you must abandon Raga-Dvesha. If you want to free yourself from Abhimana, you must destroy Aviveka and develop Viveka or discrimination between the Self and non-self. If you want to get rid of Aviveka, you must annihilate Ajnana. If you want to get rid of Ajnana, you must get knowledge of the Self. There is no other way of escaping this chain.
🌹 🌹 🌹 🌹 🌹
30 Jun 2022
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 382-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 382-2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 382-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 382-2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।
రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀
🌻 382. 'రహస్తర్పణ తర్పితా' - 2🌻
శ్రీమాత పరతత్వమున కర్పితయై పరమానంద భరితయై యుండును. జీవులు శ్రీమాత అనుగ్రహమును పొందుటకు గాని, దైవ సాన్నిధ్యము చేరుటకు గాని, దైవానుగ్రహము పొందుటకు గాని, దైవమే తాముగ వైభవోపేతమైన జీవితమును జీవించుటకు గాని, సర్వోత్తమమైన మార్గము సమర్పణ మార్గము. ఈ మార్గ మత్యంత సాహసముతో కూడినది. దైవము నందు పరిపూర్ణ భక్తి విశ్వాసములు గలవారు మాత్రమే నిర్వర్తింపగలరు.
అట్టి విశ్వాసము కూర్చువాడు కూడ దైవమే. కలియుగమున అనేకులు ఇట్టి సమర్పణ మార్గము ననుసరించి అనుగ్రహము పొంది, భూమిపై దైవమే తానుగ శాశ్వతముగ నిలచి జీవుల నుద్ధరించు చున్నారు. ఇట్టి మహాత్ములు ఎందరో హిమాలయములను కేంద్రముగ నేర్పరచుకొని జీవుల వృద్ధిని గూర్చి, సంవృద్ధిని గూర్చి కృషి సల్పుచున్నారు. మైత్రేయుడు, ఉద్ధవుడు, విదురుడు, సూర్య వంశపు క్షత్రియుడగు మరువు, చంద్ర వంశపు క్షత్రియుడగు దేవాపి మొదలుగ ఎందరో మహాత్ములు ఈ సమర్పణ మార్గమున దైవప్రతినిధులై భూమిపై దివ్యదేహములు దాల్చి చరించు చున్నారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 382 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 83. Odyana pita nilaya nindu mandala vasini
Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻
🌻 382. Rahastarpaṇa-tarpitā रहस्तर्पण-तर्पिता -2 🌻
Second is the mantra itself that infuses life to the visualized form. This situation is applicable only in the initial stages and as one progresses, further guidance is received from the concerned deity itself by way of communion. This nāma says that such mantra-s should be recited only mentally.
There is another interpretation for this nāma. This nāma could also be interpreted as ‘secretive oblations’ offered into the internal fire (fire generated and persists at the mūlādhāra cakra to keep the body alive).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
30 Jun 2022
ఓషో రోజువారీ ధ్యానాలు - 206. ఐక్యత / Osho Daily Meditations - 206. UNION
🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 206 / Osho Daily Meditations - 206 🌹
📚. ప్రసాద్ భరద్వాజ్
🍀 206. ఐక్యత 🍀
🕉. ఉనికితో సాధ్యమైనంత ఎక్కువ పరిచయాలను ఏర్పరచుకోవడం ప్రారంభించండి. ఒక చెట్టు దగ్గర కూర్చొని, చెట్టును కౌగిలించుకుని, మీరు దానితో కలుస్తున్నట్లు మరియు కలిసిపోతున్నట్లు అనుభూతి చెందండి. జలములో, మీ కళ్ళు మూసుకుని మరియు మీరు నీటిలో కరిగిపోతున్నట్లు భావించండి; ఒక ఐక్యతా భావనను ఉండనివ్వండి. 🕉
మీరు విశ్రాంతి తీసుకోవడానికి మరియు దేనితోనైనా ఏకం కావడానికి వీలున్న చోట ఐక్యతా మార్గాలను కనుగొనండి. పిల్లి, కుక్క, పురుషుడు, స్త్రీ, చెట్టు వంటి ఏ రూపంలోనైనా మీరు మీ శక్తిని ఇతర శక్తితో ఎంతగా ఏకం చేస్తే, అంతగా మీరు ఉనికికి దగ్గరగా ఉంటారు. ఇది ఆహ్లాదకరమైన పని; నిజానికి, ఇది పారవశ్యం కలిగించే పని. ఒక్కసారి అనుభూతి చెందితే, ఒక్కసారి దాని నేర్పు తెలుసుకుంటే, మీ జీవితంలో మీరు ఎంత కోల్పోయారో అని ఆశ్చర్యపోతారు. మీరు దాటిన ప్రతి చెట్టు మీకు గొప్ప ఉద్వేగాన్ని అందించగలదు, మరియు ప్రతి అనుభవం-ఒక సూర్యాస్తమయం, సూర్యోదయం, చంద్రుడు, ఆకాశంలోని మేఘాలు, భూమిపై గడ్డి - పారవశ్య అనుభవాలు కావచ్చు.
పచ్చికలో పడుకుని, మీరు భూమితో ఒక్కటి అవుతున్నారని అనుభూతి చెందండి. భూమిలోకి కరిగి పోయి దానిలో అదృశ్యం అయిపోండి. భూమిని మీలోకి చొచ్చుకు పోనివ్వండి. ఇదే ధ్యానం: వీలైనన్ని విధాలుగా ఐక్యతను పొందండి. దేవునికి పదివేల తలుపులు ఉన్నాయి, మరియు అతను ప్రతిచోటా అందుబాటులో ఉన్నాడు. కానీ అతను ఐక్య భావన స్థితిలో మాత్రమే అందుబాటులో ఉంటాడు. అందుకే కొన్నిసార్లు ప్రేమికులు లోతైన ప్రేమ భావనలో ఉన్నప్పుడు ధ్యానం గురించి తెలుసుకుంటారు. ఇది ఐక్యతను, ఏకత్వమును సృష్టించే మార్గాలలో ఒకటి, కానీ అది మార్గాలలో ఒకటి మాత్రమే; కోట్ల కొద్ది మార్గములు ఉన్నాయి. వెతుకుతూ వెళితే దానికి అంతు లేదు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 206 🌹
📚. Prasad Bharadwaj
🍀 206. UNION 🍀
🕉. Start making as many contacts with existence as possible. Sitting by a tree, hug the tree and feel that you are meeting and merging with it. Swimming, close your eyes and feel you are melting into the water; let there be a union. 🕉
Find ways and means wherever you can to relax and unite with something. The more you unite your energy with some other energy, in any form-a cat, a dog, a man, a woman, a tree-the closer home you will be. It is pleasant work; in fact, it is ecstatic work. Once you have come to feel it, once you have come to know the knack of it, you will be surprised at how much you have missed in your life. Each tree that you have passed could have given you a great orgasm, and each experience-a sunset, a sunrise, the moon, the clouds in the sky, the grass on the earth--could have been ecstatic experiences.
Lying down on the lawn, feel you are becoming one with the earth. Melt into the earth, disappear into it; let the earth penetrate you. This is a meditation: Attain union in as many ways as possible. God has ten thousand doors, and from everywhere he is available. But he is available only in the state of union. That's why sometimes it happens that lovers come to know of meditation in deep orgasm. That is one of the ways of creating union, but that is only one of the ways; there are millions. If one goes on searching, there is no end to it.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
30 Jun 2022
శ్రీ శివ మహా పురాణము - 587 / Sri Siva Maha Purana - 587
🌹 . శ్రీ శివ మహా పురాణము - 587 / Sri Siva Maha Purana - 587 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 02 🌴
🌻. కుమారస్వామి జననము - 7 🌻
ఓ కుమారా! ఆ ఆర్గురు ఋషిపత్నులు తమకు పాతిపత్య లోపము కలిగినదని గమనించి మహా దుఃఖమును పొందిరి. వారి మనస్సులు అల్లకల్లోమయ్యెను (63). ఆ మునిపత్నులు గర్భరూపమున నున్న శివతేజస్సును హిమవత్పర్వతముపై విడిచి పెట్టి తాపశాంతిని పొందిరి (64). హిమవంతుడా శివతేజస్సును సహింప జాలక వణకి పోయెను. ఆయన తాపముచే పీడింపబడిన వాడై సహింప శక్యముకాని ఆ శివతేజస్సును వెంటనే గంగలో పడవైచెను (65). ఓ మహర్షీ! గంగ కూడ సహింప శక్యము కాని ఆ పరమాత్మ తేజస్సును తన తరంగములతో రెల్లుగడ్డి యందు భద్రము చేసెను(66).
అచట నిక్షిప్తమైన ఆ శివతేజస్సు వెంటనే సుందరుడు, సౌభాగ్యవంతుడు,శోభాయుక్తుడు, తేజశ్శాలి, ప్రీతిని వర్ధిల్ల జేయువాడు అగు బాలకునిగా మారిపోయెను(67). ఓ మహార్షీ! మార్గశీర్ష శుక్లపక్షములో షష్ఠినాడు ఆ శివపుత్రుడు భూమండలముపై అవతరించెను (68). అదే సమయములో కైలాసము నందు శివపార్వతులు అకస్మాత్తుగా సుఖభావనను పొందిరి (69). పార్వతి స్తవముల నుండి ఆనందముచే స్తన్యము స్రవించెను. ఓ మహర్షీ! అచటకు వెళ్లిన వారందరికీ ఆనందము కలిగెను(70).
కుమారా!ముల్లోకములు సత్పురుషులకు సుఖములనిచ్చి మంగళ మయములాయెను.దుష్టులకు, విశేషించి రాక్షసులకు విఘ్నము కలిగెను (71).అకస్మాత్తుగా ఆకాశమునందుగొప్ప దుందుభిధ్వని బయల్వెడలెను. ఓ నారదా! ఆ పిల్లవానిపై వెంటనే పుష్పవృష్టి గురిసెను (72). ఓ మహర్షీ! విష్ణువు మొదలగు దేవతలందరకీ అకస్మాత్తుగా పరమానందము, పరమోత్సాహము కలిగెను (73).
శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు కుమార ఖండలో శివపుత్ర జననమనే రెండవ అధ్యాయము ముగిసినది(2).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 587 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 02 🌴
🌻 The birth of Śiva’s son - 7 🌻
63. O dear, on seeing their own state the six ladies felt very miserable and distressed.
64. The wives of the sages cast off their semen in the form of a foetus at the top of Himavat. They felt then relieved of their burning sensation.
65. Unable to bear that semen of Śiva and trembling much, Himavat became scorched by it and hurled it in the Gaṅgā.
66. O great sage, the intolerable semen of lord Śiva was deposited by Gaṅgā in the forest of Śara grass by means of its waves.
67. The semen that fell was turned in a handsome good-featured boy, full of glory and splendour. He increased everyone’s pleasure.
68. O great sage, on the sixth day of the bright half of the lunar month of Mārgaśīrṣa, the son of Śiva was born in the world.
69. At that time, O Brahmin, on their mountain, Pārvatī the daughter of Himavat and Śiva became very happy.
70. Out of joy, milk exuded from the breasts of Pārvatī. On reaching the spot everyone felt very happy.
71. O dear, there was auspiciousness in the three worlds, pleasing to the good. There occurred obstacles to the wicked and particularly to the demons.
72. O Nārada, there was a mysterious sound of Dundubhi drum in the sky. Showers of flowers fell on the boy.
73. O excellent sage, there was great delight to Viṣṇu and the gods. There was great jubilation everywhere.
Continues....
🌹🌹🌹🌹🌹
30 Jun 2022
శ్రీ మదగ్ని మహాపురాణము - 71 / Agni Maha Purana - 71
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 71 / Agni Maha Purana - 71 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 25
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
🌻. "వాసుదేవ' 'సంకర్షణ' 'ప్రద్యుమ్న' 'అనిరుద్ధ' మంత్రముల లక్షణములు - 3 🌻
కనిష్ఠక మొదలైన కరాగ్రములందు దేహముపై ప్రకృతిని అర్చించవలెను. పరమ పురుషాత్మయే పరుడు. ప్రకృత్మాత్య ద్విరూపము. ''ఓం పరాయాగ్న్యత్మనే నమః" ఇది వ్యాపక మంత్రము. వసు - అర్క - అగ్నులు త్రివ్యూహాత్మక మార్తులు. ఈ మూడింటిపై అగ్ని న్యాసముచేసి కరదేహములపై వ్యాపకమును విన్యసించి, అంగుళల యుందును, సవ్యాపసవ్య హస్తములయందును, హృదయమునందును, మూర్తియందును, తుర్యరూప మగు త్రివ్యూహమైన తనువునందను వాయ్వర్కులను విన్యసించవలెను.
వ్యాపక మైన ఋగ్వేదమును హస్తమునందును, అంగుళలపై యజుర్వేదము, రెండు అరచేతులలో అథర్వమును శిరోహృదయచరణములయందు సామవేదమును పంచవ్యూహమునందు ఆకాశమును విన్యసించి కరములందును, దేహము నందును అంగుళీ - శిరో - హృదయ - గుహ్య - పాదములందును వాయ్వాదికమును పూర్ముము చెప్పనట్లు న్యసించవలెను.
వాయువు, అగ్ని, జలము, భూమి (ఆకాశము) వీటి సముదాయము పంచవ్యూహము నమస్సు, శ్రోత్రము, త్వక్కు, నేత్రము, జిహ్వ, ఘ్రణము వీటి సముదాయము షడ్వ్యూహము.
వ్యాపక మైన మానసమును విన్యసించి పిమ్మట క్రమముగా అంగుష్ఠాదులందును, శిరస్సు, ముఖము, హృదయము, గుహ్యప్రదేశము, పాదములు - వీటి యందును న్యాసము చేయవలెను. ఇది "పరమాత్మకవ్యూహన్యాసము". ఆదిమూర్తి అగు జీవుడు సర్వవ్యాపకుడు.
భూః, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం అను ఈ ఏడింటిని ముందుగా కరమునందును, దేహము, నందును అంగుష్ఠాది క్రమమున విన్యసించవలెను.
ఏడవది తలములం దుండును. లోకేశు డైన దేవుడు దేహమునందు క్రమముగా శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, గుహ్యము, పాదములు - వీటియందు ఉండును.
అగ్నిష్టోమము, ఉక్థము, షోడశి, వాజపేయము, అతిరాత్రము, ఆప్తోర్యామము అని యజ్ఞాత్మ సప్తరూపములు కలది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 71 🌹
✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj
Chapter 25
🌻 Worship regarding Vāsudeva, Saṅkarṣaṇa, Pradyumna and Aniruddha - 3 🌻
20-21. Om (salutation) to the supreme being, the foremost or the first soul. The air and the sun (are his) two forms. The fire the third form having been assigned to pervade hands and the body, wind and the sun in the fingers of hand, this is embodied in the three parts in the two arms, left and the other arm, in the heart, in the body forming the fourth state.
22. The Ṛgveda (is made) to pervade hand. The Yajus (Yajurveda) is assigned to fingers. The form of Atharva (is assigned) to two palms. Thus (assignments are made) in (different limbs) head, heart, upto the feet.
23. As before having assigned the extensive sky to his arm and body, wind and other (elements), to fingers, head, heart, generative organ and the feet.
24. The wind, fire, water, earth (and sky or ether) are spoken as his five forms. The mind, ear, skin, eye, tongue (and) nose are said to be the six forms.
25-28. The extensive mind is assigned from the thumb onwards to the head, mouth, generative organ and the organ of excretion. The prime form is said to be consisting of compassion. It is known as the jīva (life) (which is) all pervasive. The seven (words), earth, ether, heaven, mahas, jana, tapa and satya[5] are assigned duly to hands and the body beginning with thumb. The Lord of the world, the seventh one and existing in the palm (is taken) gradually to the body, head, forehead, mouth, heart, generative organ and feet. This is said to be the Agniṣṭoma.[6] (Next follows the description of) the Vājapeya[7] (and) the Ṣoḍaśī[8] rites.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
30 Jun 2022
కపిల గీత - 31 / Kapila Gita - 31
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
📚. ప్రసాద్ భరధ్వాజ
🌴. 14. భక్తియే అంతిమ విముక్తి - 1 🌴
31. మైత్రేయ ఉవాచ
విదిత్వార్థం కపిలో మాతురిత్థం జాతస్నేహో యత్ర తన్వాభిజాతః
తత్త్వామ్నాయం యత్ప్రవదన్తి సాఙ్ఖ్యం ప్రోవాచ వై భక్తివితానయోగమ్
కపిల మహర్షి, తల్లి మనసులో ఉన్న దాన్ని తెలుసుకున్నాడు. ఏ శరీరము నుండి పుట్టాడో, ఆ శరీరం ఉన్న ఆమె యందు ప్రేమ పుట్టింది. ఇప్పటిదాకా భక్తిని చెప్పాడు. ఏ యోగముతో భక్తి వ్యాప్తి (వితానం) చెబుతుందో ఆ యోగమైన సాంఖ్య యోగాన్ని చెప్పాడు. పేరుకు సాంఖ్య (జ్ఞ్యాన) యోగమైనా, పరమాత్మ చివరకు భక్తిలోకే తీసుకు వస్తాడు. దీన్ని పెద్దలు సాంఖ్యం అంటారు. ఇది భక్తిని విస్తరించే యోగం.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 31 🌹
✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj
🌴 14. Bhakti as Ultimate Liberation - 1 🌴
31. maitreya uvaca
viditvartham kapilo matur ittham jata-sneho yatra tanvabhijatah
tattvamnayam yat pravadanti sankhyam provaca vai bhakti-vitana-yogam
Sri Maitreya said: After hearing His mother's statement, Kapila could understand her purpose, and He became compassionate toward her because of having been born from her body. He then described the Sankhya system of philosophy, which is a combination of devotional service and mystic realization, as received by disciplic succession.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
30 Jun 2022
30 Jun 2022 Daily Panchang నిత్య పంచాంగము
🌹30, June 2022 పంచాగము - Panchagam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
🌻. బోనాలు శుభాకాంక్షలు మిత్రులందరికి 🌻
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : చంద్ర దర్శనము, గుప్త నవరాత్రులు, బోనాలు ప్రారంభం, Chandra Darshan, Gupta Navratri, Bonalu Begins🌻
🍀. దక్షిణామూర్తి స్తోత్రము - 11 🍀
వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి
తాత్పర్యము: సంసార బంధములు, జనన మరణ ఋణములు తొలగించే, వట వృక్షము కింద ఆసీనుడై యోగులకు, మునులకు జ్ఞానోపదేశము చేసే వానిగా ధ్యానించ బడే, త్రిలోక వంద్యుడైన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : సేవ వల్లనే సాధన ఫలిస్తుంది. ఇతరులకు సేవ చేస్తూ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోండి. సాధన, స్వాధ్యాయము, సంయమం, సేవ- ఈ నాల్గింటి ద్వారా మీ లోపాలను సరిచేసుకోండి. - సద్గురు శ్రీరామశర్మ 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, ఆషాఢ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: శుక్ల పాడ్యమి 10:50:11 వరకు
తదుపరి శుక్ల విదియ
నక్షత్రం: పునర్వసు 25:08:32 వరకు
తదుపరి పుష్యమి
యోగం: ధృవ 09:50:59 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: బవ 10:49:10 వరకు
వర్జ్యం: 11:38:30 - 13:26:26
దుర్ముహూర్తం: 10:08:07 - 11:00:45
మరియు 15:23:53 - 16:16:30
రాహు కాలం: 13:58:22 - 15:37:02
గుళిక కాలం: 09:02:20 - 10:41:00
యమ గండం: 05:44:59 - 07:23:39
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:45
అమృత కాలం: 22:26:06 - 24:14:02
సూర్యోదయం: 05:44:59
సూర్యాస్తమయం: 18:54:23
చంద్రోదయం: 06:30:06
చంద్రాస్తమయం: 20:07:12
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: జెమిని
సిద్ది యోగం - కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
25:08:32 వరకు తదుపరి శుభ
యోగం - కార్య జయం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
30 - JUNE - 2022 THURSDAY MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 30, గురువారం, జూన్ 2022 బృహస్పతి వాసరే Thursday 🌹
2) 🌹 కపిల గీత - 31 / Kapila Gita - 31 🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 71 / Agni Maha Purana - 71🌹
4) 🌹. శివ మహా పురాణము - 587 / Siva Maha Purana - 587🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 206 / Osho Daily Meditations - 206🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 382 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 382-2 🌹
*🌹. ఆధ్యాత్మికుడికి జూదరి మనస్తత్వము అవసరం 🌹*
*🌹 Escaping the chain of Bondage 🌹*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹30, June 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*🌻. బోనాలు శుభాకాంక్షలు మిత్రులందరికి 🌻*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : చంద్ర దర్శనము, గుప్త నవరాత్రులు, బోనాలు ప్రారంభం, Chandra Darshan, Gupta Navratri, Bonalu Begins🌻*
*🍀. దక్షిణామూర్తి స్తోత్రము - 11 🍀*
*వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం*
*సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్*
*త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం*
*జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి*
*తాత్పర్యము: సంసార బంధములు, జనన మరణ ఋణములు తొలగించే, వట వృక్షము కింద ఆసీనుడై యోగులకు, మునులకు జ్ఞానోపదేశము చేసే వానిగా ధ్యానించ బడే, త్రిలోక వంద్యుడైన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు.*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : సేవ వల్లనే సాధన ఫలిస్తుంది. ఇతరులకు సేవ చేస్తూ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోండి. సాధన, స్వాధ్యాయము, సంయమం, సేవ- ఈ నాల్గింటి ద్వారా మీ లోపాలను సరిచేసుకోండి. - సద్గురు శ్రీరామశర్మ 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, ఆషాఢ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: శుక్ల పాడ్యమి 10:50:11 వరకు
తదుపరి శుక్ల విదియ
నక్షత్రం: పునర్వసు 25:08:32 వరకు
తదుపరి పుష్యమి
యోగం: ధృవ 09:50:59 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: బవ 10:49:10 వరకు
వర్జ్యం: 11:38:30 - 13:26:26
దుర్ముహూర్తం: 10:08:07 - 11:00:45
మరియు 15:23:53 - 16:16:30
రాహు కాలం: 13:58:22 - 15:37:02
గుళిక కాలం: 09:02:20 - 10:41:00
యమ గండం: 05:44:59 - 07:23:39
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:45
అమృత కాలం: 22:26:06 - 24:14:02
సూర్యోదయం: 05:44:59
సూర్యాస్తమయం: 18:54:23
చంద్రోదయం: 06:30:06
చంద్రాస్తమయం: 20:07:12
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: జెమిని
సిద్ది యోగం - కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
25:08:32 వరకు తదుపరి శుభ
యోగం - కార్య జయం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 31 / Kapila Gita - 31🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴. 14. భక్తియే అంతిమ విముక్తి - 1 🌴*
*31. మైత్రేయ ఉవాచ*
*విదిత్వార్థం కపిలో మాతురిత్థం జాతస్నేహో యత్ర తన్వాభిజాతః*
*తత్త్వామ్నాయం యత్ప్రవదన్తి సాఙ్ఖ్యం ప్రోవాచ వై భక్తివితానయోగమ్*
*కపిల మహర్షి, తల్లి మనసులో ఉన్న దాన్ని తెలుసుకున్నాడు. ఏ శరీరము నుండి పుట్టాడో, ఆ శరీరం ఉన్న ఆమె యందు ప్రేమ పుట్టింది. ఇప్పటిదాకా భక్తిని చెప్పాడు. ఏ యోగముతో భక్తి వ్యాప్తి (వితానం) చెబుతుందో ఆ యోగమైన సాంఖ్య యోగాన్ని చెప్పాడు. పేరుకు సాంఖ్య (జ్ఞ్యాన) యోగమైనా, పరమాత్మ చివరకు భక్తిలోకే తీసుకు వస్తాడు. దీన్ని పెద్దలు సాంఖ్యం అంటారు. ఇది భక్తిని విస్తరించే యోగం.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 31 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*
*🌴 14. Bhakti as Ultimate Liberation - 1 🌴*
*31. maitreya uvaca*
*viditvartham kapilo matur ittham jata-sneho yatra tanvabhijatah*
*tattvamnayam yat pravadanti sankhyam provaca vai bhakti-vitana-yogam*
*Sri Maitreya said: After hearing His mother's statement, Kapila could understand her purpose, and He became compassionate toward her because of having been born from her body. He then described the Sankhya system of philosophy, which is a combination of devotional service and mystic realization, as received by disciplic succession.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 71 / Agni Maha Purana - 71 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 25*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*🌻. "వాసుదేవ' 'సంకర్షణ' 'ప్రద్యుమ్న' 'అనిరుద్ధ' మంత్రముల లక్షణములు - 3 🌻*
కనిష్ఠక మొదలైన కరాగ్రములందు దేహముపై ప్రకృతిని అర్చించవలెను. పరమ పురుషాత్మయే పరుడు. ప్రకృత్మాత్య ద్విరూపము. ''ఓం పరాయాగ్న్యత్మనే నమః" ఇది వ్యాపక మంత్రము. వసు - అర్క - అగ్నులు త్రివ్యూహాత్మక మార్తులు. ఈ మూడింటిపై అగ్ని న్యాసముచేసి కరదేహములపై వ్యాపకమును విన్యసించి, అంగుళల యుందును, సవ్యాపసవ్య హస్తములయందును, హృదయమునందును, మూర్తియందును, తుర్యరూప మగు త్రివ్యూహమైన తనువునందను వాయ్వర్కులను విన్యసించవలెను.
వ్యాపక మైన ఋగ్వేదమును హస్తమునందును, అంగుళలపై యజుర్వేదము, రెండు అరచేతులలో అథర్వమును శిరోహృదయచరణములయందు సామవేదమును పంచవ్యూహమునందు ఆకాశమును విన్యసించి కరములందును, దేహము నందును అంగుళీ - శిరో - హృదయ - గుహ్య - పాదములందును వాయ్వాదికమును పూర్ముము చెప్పనట్లు న్యసించవలెను.
వాయువు, అగ్ని, జలము, భూమి (ఆకాశము) వీటి సముదాయము పంచవ్యూహము నమస్సు, శ్రోత్రము, త్వక్కు, నేత్రము, జిహ్వ, ఘ్రణము వీటి సముదాయము షడ్వ్యూహము.
వ్యాపక మైన మానసమును విన్యసించి పిమ్మట క్రమముగా అంగుష్ఠాదులందును, శిరస్సు, ముఖము, హృదయము, గుహ్యప్రదేశము, పాదములు - వీటి యందును న్యాసము చేయవలెను. ఇది "పరమాత్మకవ్యూహన్యాసము". ఆదిమూర్తి అగు జీవుడు సర్వవ్యాపకుడు.
భూః, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం అను ఈ ఏడింటిని ముందుగా కరమునందును, దేహము, నందును అంగుష్ఠాది క్రమమున విన్యసించవలెను.
ఏడవది తలములం దుండును. లోకేశు డైన దేవుడు దేహమునందు క్రమముగా శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, గుహ్యము, పాదములు - వీటియందు ఉండును.
అగ్నిష్టోమము, ఉక్థము, షోడశి, వాజపేయము, అతిరాత్రము, ఆప్తోర్యామము అని యజ్ఞాత్మ సప్తరూపములు కలది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 71 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *
*Chapter 25*
*🌻 Worship regarding Vāsudeva, Saṅkarṣaṇa, Pradyumna and Aniruddha - 3 🌻*
20-21. Om (salutation) to the supreme being, the foremost or the first soul. The air and the sun (are his) two forms. The fire the third form having been assigned to pervade hands and the body, wind and the sun in the fingers of hand, this is embodied in the three parts in the two arms, left and the other arm, in the heart, in the body forming the fourth state.
22. The Ṛgveda (is made) to pervade hand. The Yajus (Yajurveda) is assigned to fingers. The form of Atharva (is assigned) to two palms. Thus (assignments are made) in (different limbs) head, heart, upto the feet.
23. As before having assigned the extensive sky to his arm and body, wind and other (elements), to fingers, head, heart, generative organ and the feet.
24. The wind, fire, water, earth (and sky or ether) are spoken as his five forms. The mind, ear, skin, eye, tongue (and) nose are said to be the six forms.
25-28. The extensive mind is assigned from the thumb onwards to the head, mouth, generative organ and the organ of excretion. The prime form is said to be consisting of compassion. It is known as the jīva (life) (which is) all pervasive. The seven (words), earth, ether, heaven, mahas, jana, tapa and satya[5] are assigned duly to hands and the body beginning with thumb. The Lord of the world, the seventh one and existing in the palm (is taken) gradually to the body, head, forehead, mouth, heart, generative organ and feet. This is said to be the Agniṣṭoma.[6] (Next follows the description of) the Vājapeya[7] (and) the Ṣoḍaśī[8] rites.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #AgniMahaPuranam
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 587 / Sri Siva Maha Purana - 587 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 02 🌴*
*🌻. కుమారస్వామి జననము - 7 🌻*
ఓ కుమారా! ఆ ఆర్గురు ఋషిపత్నులు తమకు పాతిపత్య లోపము కలిగినదని గమనించి మహా దుఃఖమును పొందిరి. వారి మనస్సులు అల్లకల్లోమయ్యెను (63). ఆ మునిపత్నులు గర్భరూపమున నున్న శివతేజస్సును హిమవత్పర్వతముపై విడిచి పెట్టి తాపశాంతిని పొందిరి (64). హిమవంతుడా శివతేజస్సును సహింప జాలక వణకి పోయెను. ఆయన తాపముచే పీడింపబడిన వాడై సహింప శక్యముకాని ఆ శివతేజస్సును వెంటనే గంగలో పడవైచెను (65). ఓ మహర్షీ! గంగ కూడ సహింప శక్యము కాని ఆ పరమాత్మ తేజస్సును తన తరంగములతో రెల్లుగడ్డి యందు భద్రము చేసెను(66).
అచట నిక్షిప్తమైన ఆ శివతేజస్సు వెంటనే సుందరుడు, సౌభాగ్యవంతుడు,శోభాయుక్తుడు, తేజశ్శాలి, ప్రీతిని వర్ధిల్ల జేయువాడు అగు బాలకునిగా మారిపోయెను(67). ఓ మహార్షీ! మార్గశీర్ష శుక్లపక్షములో షష్ఠినాడు ఆ శివపుత్రుడు భూమండలముపై అవతరించెను (68). అదే సమయములో కైలాసము నందు శివపార్వతులు అకస్మాత్తుగా సుఖభావనను పొందిరి (69). పార్వతి స్తవముల నుండి ఆనందముచే స్తన్యము స్రవించెను. ఓ మహర్షీ! అచటకు వెళ్లిన వారందరికీ ఆనందము కలిగెను(70).
కుమారా!ముల్లోకములు సత్పురుషులకు సుఖములనిచ్చి మంగళ మయములాయెను.దుష్టులకు, విశేషించి రాక్షసులకు విఘ్నము కలిగెను (71).అకస్మాత్తుగా ఆకాశమునందుగొప్ప దుందుభిధ్వని బయల్వెడలెను. ఓ నారదా! ఆ పిల్లవానిపై వెంటనే పుష్పవృష్టి గురిసెను (72). ఓ మహర్షీ! విష్ణువు మొదలగు దేవతలందరకీ అకస్మాత్తుగా పరమానందము, పరమోత్సాహము కలిగెను (73).
శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు కుమార ఖండలో శివపుత్ర జననమనే రెండవ అధ్యాయము ముగిసినది(2).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 587 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 02 🌴*
*🌻 The birth of Śiva’s son - 7 🌻*
63. O dear, on seeing their own state the six ladies felt very miserable and distressed.
64. The wives of the sages cast off their semen in the form of a foetus at the top of Himavat. They felt then relieved of their burning sensation.
65. Unable to bear that semen of Śiva and trembling much, Himavat became scorched by it and hurled it in the Gaṅgā.
66. O great sage, the intolerable semen of lord Śiva was deposited by Gaṅgā in the forest of Śara grass by means of its waves.
67. The semen that fell was turned in a handsome good-featured boy, full of glory and splendour. He increased everyone’s pleasure.
68. O great sage, on the sixth day of the bright half of the lunar month of Mārgaśīrṣa, the son of Śiva was born in the world.
69. At that time, O Brahmin, on their mountain, Pārvatī the daughter of Himavat and Śiva became very happy.
70. Out of joy, milk exuded from the breasts of Pārvatī. On reaching the spot everyone felt very happy.
71. O dear, there was auspiciousness in the three worlds, pleasing to the good. There occurred obstacles to the wicked and particularly to the demons.
72. O Nārada, there was a mysterious sound of Dundubhi drum in the sky. Showers of flowers fell on the boy.
73. O excellent sage, there was great delight to Viṣṇu and the gods. There was great jubilation everywhere.
Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 206 / Osho Daily Meditations - 206 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*
*🍀 206. ఐక్యత 🍀*
*🕉. ఉనికితో సాధ్యమైనంత ఎక్కువ పరిచయాలను ఏర్పరచుకోవడం ప్రారంభించండి. ఒక చెట్టు దగ్గర కూర్చొని, చెట్టును కౌగిలించుకుని, మీరు దానితో కలుస్తున్నట్లు మరియు కలిసిపోతున్నట్లు అనుభూతి చెందండి. జలములో, మీ కళ్ళు మూసుకుని మరియు మీరు నీటిలో కరిగిపోతున్నట్లు భావించండి; ఒక ఐక్యతా భావనను ఉండనివ్వండి. 🕉*
*మీరు విశ్రాంతి తీసుకోవడానికి మరియు దేనితోనైనా ఏకం కావడానికి వీలున్న చోట ఐక్యతా మార్గాలను కనుగొనండి. పిల్లి, కుక్క, పురుషుడు, స్త్రీ, చెట్టు వంటి ఏ రూపంలోనైనా మీరు మీ శక్తిని ఇతర శక్తితో ఎంతగా ఏకం చేస్తే, అంతగా మీరు ఉనికికి దగ్గరగా ఉంటారు. ఇది ఆహ్లాదకరమైన పని; నిజానికి, ఇది పారవశ్యం కలిగించే పని. ఒక్కసారి అనుభూతి చెందితే, ఒక్కసారి దాని నేర్పు తెలుసుకుంటే, మీ జీవితంలో మీరు ఎంత కోల్పోయారో అని ఆశ్చర్యపోతారు. మీరు దాటిన ప్రతి చెట్టు మీకు గొప్ప ఉద్వేగాన్ని అందించగలదు, మరియు ప్రతి అనుభవం-ఒక సూర్యాస్తమయం, సూర్యోదయం, చంద్రుడు, ఆకాశంలోని మేఘాలు, భూమిపై గడ్డి - పారవశ్య అనుభవాలు కావచ్చు.*
*పచ్చికలో పడుకుని, మీరు భూమితో ఒక్కటి అవుతున్నారని అనుభూతి చెందండి. భూమిలోకి కరిగి పోయి దానిలో అదృశ్యం అయిపోండి. భూమిని మీలోకి చొచ్చుకు పోనివ్వండి. ఇదే ధ్యానం: వీలైనన్ని విధాలుగా ఐక్యతను పొందండి. దేవునికి పదివేల తలుపులు ఉన్నాయి, మరియు అతను ప్రతిచోటా అందుబాటులో ఉన్నాడు. కానీ అతను ఐక్య భావన స్థితిలో మాత్రమే అందుబాటులో ఉంటాడు. అందుకే కొన్నిసార్లు ప్రేమికులు లోతైన ప్రేమ భావనలో ఉన్నప్పుడు ధ్యానం గురించి తెలుసుకుంటారు. ఇది ఐక్యతను, ఏకత్వమును సృష్టించే మార్గాలలో ఒకటి, కానీ అది మార్గాలలో ఒకటి మాత్రమే; కోట్ల కొద్ది మార్గములు ఉన్నాయి. వెతుకుతూ వెళితే దానికి అంతు లేదు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 206 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 206. UNION 🍀*
*🕉. Start making as many contacts with existence as possible. Sitting by a tree, hug the tree and feel that you are meeting and merging with it. Swimming, close your eyes and feel you are melting into the water; let there be a union. 🕉*
*Find ways and means wherever you can to relax and unite with something. The more you unite your energy with some other energy, in any form-a cat, a dog, a man, a woman, a tree-the closer home you will be. It is pleasant work; in fact, it is ecstatic work. Once you have come to feel it, once you have come to know the knack of it, you will be surprised at how much you have missed in your life. Each tree that you have passed could have given you a great orgasm, and each experience-a sunset, a sunrise, the moon, the clouds in the sky, the grass on the earth--could have been ecstatic experiences.*
*Lying down on the lawn, feel you are becoming one with the earth. Melt into the earth, disappear into it; let the earth penetrate you. This is a meditation: Attain union in as many ways as possible. God has ten thousand doors, and from everywhere he is available. But he is available only in the state of union. That's why sometimes it happens that lovers come to know of meditation in deep orgasm. That is one of the ways of creating union, but that is only one of the ways; there are millions. If one goes on searching, there is no end to it.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 382-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 382-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।*
*రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀*
*🌻 382. 'రహస్తర్పణ తర్పితా' - 2🌻*
*శ్రీమాత పరతత్వమున కర్పితయై పరమానంద భరితయై యుండును. జీవులు శ్రీమాత అనుగ్రహమును పొందుటకు గాని, దైవ సాన్నిధ్యము చేరుటకు గాని, దైవానుగ్రహము పొందుటకు గాని, దైవమే తాముగ వైభవోపేతమైన జీవితమును జీవించుటకు గాని, సర్వోత్తమమైన మార్గము సమర్పణ మార్గము. ఈ మార్గ మత్యంత సాహసముతో కూడినది. దైవము నందు పరిపూర్ణ భక్తి విశ్వాసములు గలవారు మాత్రమే నిర్వర్తింపగలరు.*
*అట్టి విశ్వాసము కూర్చువాడు కూడ దైవమే. కలియుగమున అనేకులు ఇట్టి సమర్పణ మార్గము ననుసరించి అనుగ్రహము పొంది, భూమిపై దైవమే తానుగ శాశ్వతముగ నిలచి జీవుల నుద్ధరించు చున్నారు. ఇట్టి మహాత్ములు ఎందరో హిమాలయములను కేంద్రముగ నేర్పరచుకొని జీవుల వృద్ధిని గూర్చి, సంవృద్ధిని గూర్చి కృషి సల్పుచున్నారు. మైత్రేయుడు, ఉద్ధవుడు, విదురుడు, సూర్య వంశపు క్షత్రియుడగు మరువు, చంద్ర వంశపు క్షత్రియుడగు దేవాపి మొదలుగ ఎందరో మహాత్ములు ఈ సమర్పణ మార్గమున దైవప్రతినిధులై భూమిపై దివ్యదేహములు దాల్చి చరించు చున్నారు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 382 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 83. Odyana pita nilaya nindu mandala vasini*
*Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻*
*🌻 382. Rahastarpaṇa-tarpitā रहस्तर्पण-तर्पिता -2 🌻*
*Second is the mantra itself that infuses life to the visualized form. This situation is applicable only in the initial stages and as one progresses, further guidance is received from the concerned deity itself by way of communion. This nāma says that such mantra-s should be recited only mentally.*
*There is another interpretation for this nāma. This nāma could also be interpreted as ‘secretive oblations’ offered into the internal fire (fire generated and persists at the mūlādhāra cakra to keep the body alive).*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Escaping the chain of Bondage 🌹*
*Prasad Bharadwaj*
*There are seven links in the chain of bondage. Misery is the final link in the chain of cause and effect. Every link depends for its existence upon the previous link.*
*The seven links are:*
*(l) Misery, (2) Embodiment, (3) Karma, (4) Raga, (5) Dvesha, (6) Aviveka and (7) Ajnana.*
*If the root cause Ajnana (ignorance of the Selfl is removed by Atma-jnana or knowledge of the Self, the other links will be broken by themselves. From ignorance, non-discrimination is born; from non-discrimination, Abhimana; from Abhimana, Raga-Dvesha; from Raga-Dvesha, Karma; from Karma, this physical body; from the physical body, misery. If you want to annihilate misery, you must get rid of embodiment. [f you want to get rid of embodiment, you must not perform actions.*
*If you wish to cease to act, you must abandon Raga-Dvesha. If you want to free yourself from Abhimana, you must destroy Aviveka and develop Viveka or discrimination between the Self and non-self. If you want to get rid of Aviveka, you must annihilate Ajnana. If you want to get rid of Ajnana, you must get knowledge of the Self. There is no other way of escaping this chain.*
🌹 🌹 🌹 🌹 🌹
మైత్రేయ మహర్షి బోధనలు - 141
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 141 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 106. విచికిత్సలు - 2🌻
హాస్యమునకు పలికిన మాటలలో సత్యముల ప్రయత్నముగ బయల్పడును. ఈ సదస్సుల యందు ప్రజలు విశ్వాసమును కూడ కోల్పోయెదరు. కంటి తుడుపు సదస్సులే కాని మరియొకటి కాదను భావన కూడ వ్యక్తమగుచుండును. ఉదాహరణకు ప్రజాస్వామ్యమని ప్రస్తుత శతాబ్దముల యందు మీరు చేయు కేకలు మిన్నంటుచున్నవి కాని మచ్చునకైనను మానవ సంఘములలో ప్రజాస్వామ్యము గోచరింపదు.
సదస్సులు, విచికిత్సలు, తీర్మానములు, ఉల్లంఘనలు జాతి జీవనశైలియై నిలచినది. త్రికరణ శుద్ధి, దీక్షాయుత జీవనము మృగ్య మైనప్పుడు, వ్యక్తికిని సంఘమునకు కీడేగాని మేలు జరుగదు. పై కారణముగ నా అనుయాయులకును తెలియజేయు విషయమొక్కటే! తెలిసినది ఆచరింపుడు. విచికిత్సలు విసర్జింపుడు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
29 Jun 2022
నిర్మల ధ్యానాలు - ఓషో - 202
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 202 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. జ్ఞానానికి మొదటి అడుగు 'నాకేమీ తెలియదు' అని అంగీకరించడం. అట్లా ఆమోదిస్తే మార్పు జరుగుతుంది. అంతర్దృష్టి ఏర్పడుతుంది. జ్ఞానం నీ లోపలి నించీ రావాలి. అధ్యయనం ద్వారా రాదు. ధ్యానం గుండా వస్తుంది. బయటి నించీ నేర్చుకున్నవన్నీ వదిలిపెట్టు. అప్పుడు లోపల వున్నది నీతో మాట్లాడుతుంది. 🍀
ఇతరుల్ని సంపాందించిన జ్ఞానం నిజమైన జ్ఞానం కాదు. అది నీ అజ్ఞానాన్ని దాచిపెడుతుంది. కానీ నిన్ను వివేకవంతుణ్ణి చెయ్యలేదు. అది నీ గాయాల్ని దాచిపెడుతుంది. కానీ గాయాన్ని మాన్పలేదు. వ్యక్తి తన గాయాన్ని మరచి పోతాడు. అది ప్రమాదకరం. గాయం పెరుగుతూనే వుంటుంది. కాన్సర్గా మారే ప్రమాదముంది. గాయాల్ని గ్రహించడం మంచిది. గాయాలకు కాంతి తగలాలి. దాచిపెట్టడం వినాశకరం. బహిరంగపరిస్తే గాయాలు మానతాయి. జ్ఞానానికి మొదటి అడుగు 'నాకేమీ తెలియదు' అని అంగీకరించడం. అట్లా ఆమోదిస్తే మార్పు జరుగుతుంది. అంతర్దృష్టి ఏర్పడుతుంది.
జ్ఞానం నీ లోపలి నించీ రావాలి. అది ఆలోచనల నించీ రాదు. నీలోని ఆలోచనారహిత స్థలం నించే అది ఆవిర్భవిస్తుంది. అధ్యయనం ద్వారా రాదు. ధ్యానం గుండా వస్తుంది. మనసు మలినపడనపుడు, మనసు మాయమైనపుడు వస్తుంది. అన్ని అడ్డంకులూ తొలిగినపుడు నీలో నించీ అది పొంగి పోర్లుతుంది. అక్కడ వసంతం ప్రవహిస్తుంది. కానీ దారిలో ఎన్నో రాళ్ళుంటాయి. అది జ్ఞానమని భ్రమించే అవకాశముంది. అవి జ్ఞానం కాదు, జ్ఞానానికి శత్రువులు, బయటి నించీ నేర్చుకున్నవన్నీ వదిలిపెట్టు. అప్పుడు లోపల వున్నది నీతో మాట్లాడుతుంది. అప్పుడు నువ్వు నిజమైన జ్ఞానానికి సంబంధించిన పరిమళమవుతావు. తెలుసుకోవడమన్నది స్వేచ్ఛనిస్తుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
29 Jun 2022
నిత్య ప్రజ్ఞా సందేశములు - 302 - 28. మృత్యుభయం మరేమీ కాదు, ఆనందాన్ని కోల్పోతామనే భయం / DAILY WISDOM - 302 - 28. The Fear of Death is Nothing but the Fear of Loss of Pleasure
🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 302 / DAILY WISDOM - 302 🌹
🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 28. మృత్యుభయం మరేమీ కాదు, ఆనందాన్ని కోల్పోతామనే భయం 🌻
మన అభౌతిక అనుభవాలు సూక్ష్మ వాస్తవికతపై నమ్మకంతో పాటు మనలో భయం యొక్క అనుభూతిని కూడా సూక్ష్మంగా సృష్టిస్తుంది. ఇది మనం అనుకున్న నమ్మకానికి విరుద్ధంగా ఉంటుంది. మనం విషయాలకు ఎందుకు భయపడుతున్నాము? ఇంద్రియ వస్తువులతో సంపర్కం కోల్పోతామని భయం. మృత్యుభయం అనేది భౌతిక ఆనందాన్ని కోల్పోతామనే భయం తప్ప మరొకటి కాదు. ' మృత్యువు కబళిస్తే మన ఆనందాలన్ని కోల్పోతాము'. అనే భయం. ప్రతి వ్యక్తిలో జీవితం పట్ల ప్రేమ తో పాటు, మృత్యు భయం కూడా ఉంటుంది. రెండు కూడా విషయ వాంఛలపై మోహం తప్ప మరొకటి కాదు. లేకుంటే చావు అంటే భయం ఎందుకు?
ఎందుకంటే అస్మిత (అహంకారం) సృష్టించిన సంబంధాలు ఇక్కడ ఆనందానికి కేంద్రాలుగా ఉన్నాయని మరియు అవి మాత్రమే వాస్తవాలు మరియు వాటిని మించినది ఏమీ లేదు అనే అభిప్రాయాన్ని కలిగి ఉండడమే. ఇంద్రియ భోగాలకు మించిన ఆనందం ఏదయినా సాధ్యమవుతుందని, ఎవరైనా ఊహించగలరా? ఎవరూ ఊహించలేరు. మనం మేధోపరంగా, విద్యాపరంగా మాత్రమే ఊహించుకుంటాము - ఇంద్రియ సుఖాలలో ప్రతిదీ చేర్చబడింది, అదే సర్వస్వం అని భావిస్తాము. కాని నిజంగా, ఆచరణాత్మకంగా చూస్తే అలాంటిది ఏదీ లేదు అని తెలుస్తుంది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 302 🌹
🍀 📖 from The Study and Practice of Yoga 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 28. The Fear of Death is Nothing but the Fear of Loss of Pleasure 🌻
The confirmed belief in the substantiality of our phenomenal experiences subtly creates a feeling of fear in us simultaneously, which is contrary to the apparent belief in the reality of things. Why are we afraid of things? The fear is due to the subtle feeling of the possibility of one's being wrenched out of one's contact with the objects of sense. The fear of death is nothing but the fear of loss of pleasure. “I may lose all my centres of pleasure if the forces of death come and catch hold of my throat.” The love of life which is so inherent in every individual, accompanied by the fear of death, is another form of the love of pleasure; otherwise, why should one fear death so much?
It is because the so-called phenomenal relationships created by asmita have formed the impression that there are centres of joy here, and they are the only realities—there is nothing beyond. Can anyone imagine, even with the farthest stretch of thought, that there is any delight possible, or even conceivable, beyond the pleasures of sense? There is nothing conceivable. We only imagine intellectually, academically — Everything is included within sense pleasures. They are everything. But when we see practically, we understand there is none like that.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
29 Jun 2022
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 623 / Vishnu Sahasranama Contemplation - 623
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 623 / Vishnu Sahasranama Contemplation - 623🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻623. ఛిన్నసంశయః, छिन्नसंशयः, Chinnasaṃśayaḥ🌻
ఓం ఛిన్నసంశయాయ నమః | ॐ छिन्नसंशयाय नमः | OM Chinnasaṃśayāya namaḥ
కరతలామలకవత్ సర్వసాక్షాత్కృతేర్హరేః ।
సంశయః క్వాపి నాస్తి ఛిన్నసంశయ ఉచ్యతే ॥
ఏవని సంశయములన్నియు తెగినవియో, ఎవనికి ఏ సంశయములును లేవో అట్టివాడు. కరతలము నందలి అమలకమును అనగా అరచేతి యందు ఉన్న ఉసిరికాయ వలె ప్రతియొక విషయమును సాక్షాత్కరింప జేసినొనిన వాడగు ఈ పరమాత్మకు ఏ విషయము నందును సంశయము ఉండదు. అంతటి జ్ఞాన స్వరూపుడగు పరమాత్మ ఛిన్నసంశయః.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 623🌹
📚. Prasad Bharadwaj
🌻623. Chinnasaṃśayaḥ🌻
OM Chinnasaṃśayāya namaḥ
करतलामलकवत् सर्वसाक्षात्कृतेर्हरेः ।
संशयः क्वापि नास्तिछिन्नसंशय उच्यते ॥
Karatalāmalakavat sarvasākṣātkrterhareḥ,
Saṃśayaḥ kvāpi nāstichinnasaṃśaya ucyate.
One who has no doubts as everything is directly discernible. He understands everything as clearly has holding a Amalika (Indian gooseberry) in ones palm. To whom there is no doubt whatever is Chinnasaṃśayaḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
स्वक्षस्स्वङ्गश्शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः ।
विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्नसंशयः ॥ ६६ ॥
స్వక్షస్స్వఙ్గశ్శతానన్దో నన్దిర్జ్యోతిర్గణేశ్వరః ।
స్వక్షస్స్వఙ్గశ్శతానన్దో నన్దిర్జ్యోతిర్గణేశ్వరః ।
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్నసంశయః ॥ 66 ॥
Svakṣassvaṅgaśśatānando nandirjyotirgaṇeśvaraḥ,
Svakṣassvaṅgaśśatānando nandirjyotirgaṇeśvaraḥ,
Vijitātmā vidheyātmā satkīrtiśchinnasaṃśayaḥ ॥ 66 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
29 Jun 2022
Continues....
🌹 🌹 🌹 🌹🌹
29 Jun 2022
29 Jun 2022 Daily Panchang నిత్య పంచాంగము
🌹29 June 2022 పంచాగము - Panchagam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : జేష్ఠ అమావాస్య, Jeshta Amavasya 🌺
🍀. నారాయణ కవచము - 10 🍀
17. సనత్కుమారోఽవతు కామదేవాద్ధయాననో మాం పథి దేవహేలనాత్ |
దేవర్షివర్యః పురుషార్చనాంతరాత్కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్
18. ధన్వంతరిర్భగవాన్పాత్వపథ్యాద్ద్వంద్వాద్భయాదృషభో నిర్జితాత్మా |
యజ్ఞశ్చ లోకాదవతాజ్జనాంతాద్బలో గణాత్క్రోధవశాదహీంద్రః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : అంతఃకరణ ఆకాంక్షలే పరిస్థితులను నిర్మిస్తాయి. లక్ష్యము ఏదైతే చేతన యొక్క అన్ని ప్రయత్నాలు దాని కొరకే ఉపయోగపడతాయి. సద్గురు శ్రీరామశర్మ. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: అమావాశ్య 08:23:05 వరకు
తదుపరి శుక్ల పాడ్యమి
నక్షత్రం: ఆర్ద్ర 22:09:02 వరకు
తదుపరి పునర్వసు
యోగం: వృధ్ధి 08:50:21 వరకు
తదుపరి ధృవ
కరణం: నాగ 08:22:06 వరకు
వర్జ్యం: 04:34:42 - 06:22:50
దుర్ముహూర్తం: 11:53:10 - 12:45:48
రాహు కాలం: 12:19:29 - 13:58:11
గుళిక కాలం: 10:40:47 - 12:19:29
యమ గండం: 07:23:23 - 09:02:05
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:45
అమృత కాలం: 10:53:10 - 12:41:18
సూర్యోదయం: 05:44:42
సూర్యాస్తమయం: 18:54:17
చంద్రోదయం: 05:38:39
చంద్రాస్తమయం: 19:18:47
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: జెమిని
ముసల యోగం - దుఃఖం 22:09:02
వరకు తదుపరి గద యోగం -
కార్య హాని , చెడు
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Posts (Atom)















