శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 589 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 589 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀
🌻 589. 'కామకోటికా' - 2 🌻
పార్వతి తపస్సు అనన్య సామాన్యము. శివుని పొందుటకు శివానుగ్రహమే ఉపాయమని శివ ప్రార్థన గావించి శివుని చేరినది. శివుడు కోట్లాది కామ భావముల కతీతుడు. అతడు కోటేశ్వరుడు. కోటేశ్వరుని ఆరాధనమున శివపీఠమును జేరి, శివుడు అనుగ్రహింపగ శివ పర్యంకమున చేరి, అటుపైన శివునిలో అర్థ భాగమై నిలచినది. ఇట్లు కామకోటికా పీఠము శివునితో కూడి అధిష్ఠించినది. అతడు కోటేశ్వరుడు. ఆమె కోటిక. శివైక్యమున శివ శక్తియై సామరస్యమైన పరబ్రహ్మముగ వెలుగొందుచున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻
🌻 589. 'kamakotika' - 2 🌻
Pārvatī’s penance was unparalleled. She realized that Śiva’s grace alone was the means to attain him, and so she worshipped him with unwavering devotion, ultimately uniting with him. Śiva is beyond millions of desires —he is Koṭeśvara, the supreme lord who transcends all worldly cravings. Through the worship of Koṭeśvara, Pārvatī reached the Śiva Pīṭha. With Śiva’s grace, she ascended Śiva’s divine seat and, finally, became his Ardha-bhāga (half of his being). Thus, Kāmakoṭi Pīṭha is inseparably united with Śiva. He is Koṭeśvara, and she is Koṭikā. This oneness of Śiva and Śakti shines as the supreme Parabrahman, the absolute reality
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
04 సమబుద్ధి - సమదృష్టి - నిష్కామకర్మ 04 Equanimity - Equanimity Of Vision - Karma Without Aspirations
🌹 సమబుద్ధి - సమదృష్టి - నిష్కామకర్మ 🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹 Equanimity - Equanimity of vision - Nishkamakarma 🌹
Prasad Bharadwaja
పనుల Deeds (Karma)
🌹ఎప్పుడైనా మనం చేసే మంచి పనుల మూలంగా దుఖం లభించి, ఇంకొకరికి వారు చేసిన చెడు పనుల మూలంగా సుఖం లభిస్తే,... ఆలా సత్కార్యాలే చేయడం వల్ల, ధర్మాన్ని అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని ?🌹
ప్రసాద్ భరధ్వాజ
https://www.youtube.com/shorts/6Cs-YFB83o4
.
🌹🌹🌹🌹🌹
🌹If we experience sorrow because of the good deeds we do, and someone else experiences happiness because of the bad deeds they do,... what is the benefit of doing such good deeds and following the Dharma?🌹
Prasad Bharadwaj
https://www.youtube.com/shorts/6Cs-YFB83o4
🌹🌹🌹🌹🌹
Happy Saturday! Blessings of Sri Venkateswara and Lord Shani
🌹 ఓం నమో వేంకటేశాయ - వెంకట రమణుని కరుణ మీ ఆధ్యాత్మిక యాత్రను సఫలం చేయాలని కోరుకుంటూ శుభ శనివారం మిత్రులందరికి 22-FEB-2025🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹 Om Namo Venkatesaya - May the mercy of Venkata Ramana make your spiritual journey successful. Happy Saturday to all friends 22-FEB-2025🌹
Prasad Bharadwaja
------
🌹 శనైశ్చరుని దివ్య ఆశీస్సులతో శుభ శనివారం మిత్రులందరికి 22-Feb-2025 🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹 Happy Saturday to all friends with the divine blessings of Lord Shani 22-Feb-2025 🌹
Prasad Bharadwaja
------------
🌹 22 FEBRUARY 2025 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 589 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 589 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀
🌻 589. 'కామకోటికా' - 1 🌻
కామకోటి పీఠము నలంకరించి యున్నది శ్రీమాత అని అర్ధము. కోటి యనగా అత్యంత ప్రశస్తమైనది అని అర్థము. కామకోటి యనగా కోరికలలో అత్యుత్తమమైన, ప్రశస్తమైన కోరిక. శివ కామమును మించిన కామ మనగా తత్త్వమును గూర్చిన కామమే. తత్త్వ కామము ఇతర కామము లన్నియూ తీరిన వెనుకగాని కలుగని కామము. శ్రీమాత శివకామిని. శివుని తప్ప ఏమియూ కోరనిది. పార్వతిగ జనించిననూ సృష్టి వైభవమును కోరక శివునే కోరి శివుని చేరినది. శివునికై ఘోర తపస్సు చేసినది. ఇతరాకర్షణను గూర్చి కాముడు యత్నించిననూ ఆమె కాముని ఉపేక్షించి శివుని ప్రార్థించినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻
🌻 589. 'kamakotika' - 1 🌻
The meaning is that Śrīmāta adorns the Kāmakoṭi Pīṭha. The word "Koṭi" means the most excellent, the supreme. "Kāmakoṭi" refers to the highest and most auspicious desire - a desire that surpasses all others. Among all desires, the greatest is the desire for the ultimate truth—the Shiva Kāma, which is beyond worldly cravings. This Tattva Kāma (desire for truth) arises only after all other desires are fulfilled and transcended. Śrīmāta is Śiva Kāmini, the one who desires nothing but Śiva alone. Though she was born as Pārvatī, she did not seek the grandeur of creation but instead longed only for Śiva and ultimately attained him. She performed severe penance for Śiva. Even when Kāmadeva (the god of love) tried to distract her, she ignored him and remained steadfast in her prayer and devotion to Śiva.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
03 వ్యక్తిత్వ చైతన్యం యొక్క మేలుకొలుపు 03 Awakening of personal consciousness
✍️ ప్రసాద్ భరధ్వాజ
🌹 3. Awakening of personal consciousness 🌹
✍️ Prasad Bharadwaj
అధర్మం ఏ మనుష్యులనయితే పైకి తీసుకు వస్తుందో కాలం ముందుగా వారినే భక్షిస్తుంది (Time will first consume those people whom injustice brings to the top)
🌹 అధర్మం ఏ మనుష్యులనయితే పైకి తీసుకు వస్తుందో కాలం ముందుగా వారినే భక్షిస్తుంది. 🌹
ప్రసాద్ భరధ్వాజ
https://www.youtube.com/shorts/TW6DQ0-64DA
🌹🌹🌹🌹🌹
🌹 Join Chaitanya Vijnaanam Group, Follow the Prasad Bharadwaj channels. 🌹
https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.facebook.com/share/1bBuRvQkj3/
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం శుభాకాంక్షలు Happy International Mother Language Day
🌹 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం శుభాకాంక్షలు అందరికి 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Happy International Mother Language Day to all 🌹
Prasad Bharadwaj
🌹 🌹 🌹 🌹 🌹
జానకి జయంతి (సీతామాత) Janaki Jayanti (Sita Mata)
🌹 జానకి జయంతి సందర్భంగా సీతామాతకు వినమ్ర నివాళులు 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 Humble tributes to Goddess Sita on the occasion of Janaki Jayanti 🌹
Prasad Bharadwaj
శుభ శుక్రవారం 21-Feb-2025 Happy Friday
🌹 లక్ష్మి దేవి ఆశీస్సులతో శ్రేయస్సు, సౌభాగ్యం కలగాలని కోరుకుంటూ శుభ శుక్రవారం మిత్రులందరికీ - 21-Feb-2025 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Wishing all friends a blessed Friday with the blessings of Goddess Lakshmi and prosperity - 21-Feb-2025 🌹
Prasad Bharadwaj
🌹 🌹 🌹 🌹 🌹
🌹 21 FEBRUARY 2025 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹
Om Sri Dattatreya Namah - Happy Thursday 20-2-2025 ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః - శుభ గురువారం
🌹. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః - శుభ గురువారం 20-2-2025 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹. Om Sri Dattatreya Namah - Happy Thursday 20-2-2025 🌹
Prasad Bharadwaja
ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం శుభాకాంక్షలు Happy World Social Justice Day
🌹 ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం శుభాకాంక్షలు అందరికి 🌹
⚖️⚖️⚖️
ప్రసాద్ భరద్వాజ
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 588 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 588 - 3
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 588 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 588 - 3 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀
🌻 588. 'త్రికూటా' - 3 🌻
మూడింటిని తెలియవచ్చును. నాలుగవది తెలియుట యుండదు. అందు కలియుట యుండును. మన యందు మన దేహముగను, మనముగను, మన యందలి దైవముగను శ్రీమాతే యున్నది. అన్నిటి యందును ప్రజ్ఞగను, శక్తిగను, పదార్థముగను యున్నది. ఇట్లు మూడుగ నున్ననూ మూడింటిని అతిక్రమించి కూడ యుండును. వాని యందు తానున్ననూ నిజమునకు తనయందే అవి యున్నవి. రహస్య మేమనగా తానే యున్నది. అవిగా నుండుట ఆమె మాయ. ఇదియే రాజ విద్యయని, రాజ గుహ్యమని శ్రీకృష్ణుడు పలికినాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 588 - 3 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻
🌻 588. 'Trikuta' - 3 🌻
One can perceive the three, but the fourth remains unknown. However, it is present within everything. Within us, Śrīmāta exists as our body, mind (self), and the divine presence within us. She pervades everything as intellect (Prajñā), power (Shakti), and matter (Padārtha). Though she manifests in these three forms, she also transcends them. Even though they appear to exist within her, in reality, she alone exists. The secret is that she is the ultimate truth. The perception of these three as separate entities is merely her illusion (Māyā). This is what Śrī Krishna referred to as Rāja Vidyā (the supreme knowledge) and Rāja Guhya (the supreme secret).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
02 పరమ దైవము - అనంతము - అమరత్వము 02 Supreme God - Eternality - Immortality
🌹 పరమ దైవము - అనంతము - అమరత్వము 🌹
✍️ ప్రసాద్ భరధ్వాజ
🌹 Supreme God - Eternality - Immortality 🌹
✍️ Prasad Bharadwaja
జీవితం ప్రతి అడుగులోనూ నిర్ణయాలను తీసుకుంటుంది Life Involves Decisions At Every Step
🌹 జీవితంలోని ప్రతి క్షణమూ నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్క అడుగులోనూ రెండవ అడుగు గురించిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. 🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹🌹🌹🌹🌹
🌹 20 FEBRUARY 2025 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹
Happy Wednesday శుభ బుధవారం
🌹 గణపతి దేవుడి అనుగ్రహంతో చీకట్లు తొలగి, భక్తి కాంతితో మీ జీవితం ప్రకాశవంతంగా మారాలని కోరుకుంటూ, శుభ బుధవారం మిత్రులందరికీ 🌹
🌹 May the darkness be dispelled by the grace of Lord Ganapati and your life become bright with the light of devotion, Happy Wednesday to all friends 🌹
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 588 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 588 - 2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 588 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 588 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀
🌻 588. 'త్రికూటా' - 2 🌻
అంతయును మూడుగ తెలియుట త్రయీ విద్య. దేవుడు, జీవుడు, దేహము, కర్త, కర్మ, క్రియ, భూతము, వర్తమానము, భవిష్యత్తు. ఇట్లేమి చూచిననూ అందు మూడు దర్శించ వచ్చును. ఒక వస్తువు నందు మూడు అంశములుగ నున్నవి, మూడుగ గోచరించునవి ఒక్కటియే. శ్రీమాతను త్రిపుర అనియు, త్రిపురసుందరి అనియూ కూడ తెలుపుదురు. శ్రీమాత త్రికూట వైభవమును వర్ణించు టకు అలవి కాదు. ఈ తత్వమును వ్యాస మహర్షి ఇట్లని కీర్తించినాడు.
త్రయస్త్రింశత్సహస్రాణి త్రయస్త్రింశతృతానిచ ।
త్రయస్త్రింశశ్చదేవానాం సృష్టిస్సంక్షేప లక్షణా ॥
అంతయూ మూడే. ఒక తత్త్వమే మూడగు చున్నవి. మూడునూ ఆ తత్త్వము నందే యిమిడి యున్నవి. మూడుగ యేర్పరచి మూడిటి యందు ప్రవేశించి వసించి నిర్గమించునది నాలుగవది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 588 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻
🌻 588. 'Trikuta' - 2 🌻
In all aspects, we can see this triadic nature—God, the individual soul, and the body; doer (Karta), action (Karma), and execution (Kriyā); past, present, and future. Whatever we observe, we can perceive this threefold division in it. In any object, three aspects exist, and though they appear as three, they are essentially one. Śrīmāta is also known as Tripura and Tripurasundarī. However, even these names are insufficient to describe the magnificence of Śrīmāta’s threefold glory. To illustrate this profound truth, Vyasa Maharshi praised it as follows:
"Trayastrimśat sahasrāṇi trayastrimśat rutāni ca,
Trayastrimśaśca devānāṁ sṛṣṭiḥ saṁkṣepa lakṣaṇā."
This means that the entire creation is fundamentally based on the number three (triad). Everything is essentially one principle that manifests in threefold ways. These three exist within that fundamental principle itself. This principle creates the three, enters the three, resides within them, and ultimately transcends them as the fourth state.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Chatrapati Shivaji Maharaj Jayanti ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి
🌹 ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి శుభాకాంక్షలు అందరికి 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 Happy Chhatrapati Shivaji Maharaj Jayanti to everyone 🌹
Prasad Bharadwaj