నిర్మల ధ్యానాలు - ఓషో - 228


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 228 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అస్తిత్వం అద్దం లాంటిది. అది ప్రతిధ్వనిస్తుంది. జీవితంలో గాఢమయిన ప్రేమని ఏర్పరచుకుంటే అస్తిత్వం నిన్ను ఆలింగనం చేసుకుంటుంది. 🍀


అస్తిత్వం అందర్నీ ప్రేమిస్తుంది. ఎవర్నీ వేరుగా చూడదు. మనం వేరువేరుగా వున్నాం కాబట్టి అది వేరు వేరుగా కనబడుతుంది. అస్తిత్వం కేవలం ప్రతిఫలిస్తుంది. అది అద్దం లాంటిది. అది ప్రతిధ్వనిస్తుంది. మనం అరిస్తే అదీ అరుస్తుంది. మనం పాడితే అదీ పాడుతుంది. అది మన మేది యిస్తే దాన్ని వేయిరెట్లు తిరిగి యిస్తుంది.

అదెందుకు వేరుగా కనిపిస్తుందంటే మనకు ప్రేమించడం తెలీదు. ఒకసారి మనం ప్రేమించడం మొదలుపెడితే, నదుల్ని, నక్షత్రాల్ని, పర్వతాల్ని, పక్షుల్ని, ప్రజల్ని ప్రేమించడం మొదలు పెడితే, జీవితంలో గాఢమయిన ప్రేమని ఏర్పరచుకుంటే అస్తిత్వం నిన్ను ఆలింగనం చేసుకుంటుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


20 Aug 2022

No comments:

Post a Comment