🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 233 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. దేవుడికి సంబంధించిన విషయంలో తొందరపాటు పనికిరాదు. కారణం దేవుడు శాశ్వతత్వంలో వుంటాడు. అన్వేషకుడికి సహనమన్నది ప్రాథమిక లక్షణం. అసహనమన్నది అన్వేషణకు అడ్డు కట్ట. 🍀
అన్వేషకుడికి సహనమన్నది ప్రాథమిక లక్షణం. అసహనమన్నది అన్వేషణకు అడ్డు కట్ట. దేవుడికి సంబంధించిన విషయంలో తొందరపాటు పనికిరాదు. కారణం దేవుడు శాశ్వతత్వంలో వుంటాడు. తొందరపాటంటే నువ్వు గంటల్నీ క్షణాల్ని లెక్కపెట్టడం. అట్లా చెయ్యకూడదు. నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలన్నా, సత్యాన్ని గ్రహించాలన్నా నువ్వు శాశ్వతత్వానికి మార్గాన్ని తెలుసుకోవాలి. అందుకని సహనం అవసరం. కాలానికి సంబంధించిన విషయాన్ని మరచిపో. తొందరవద్దు. అసహనం వద్దు. ఎదురుచూడు.
అంచనాలు లేకుండా, ఏదీ ఆశించకుండా ఎదురు చూడు. గొప్ప ఆనందంతో అతిథి కోసం ఎదురు చూస్తున్నట్లు చూడు. ఏ క్షణమయినా రావచ్చన్న ఆతృతలో ఎదురు చూడు. అంతే కానీ అతనింకా రాలేదని చిరాకు పడకు. ప్రతిదీ అతని రాక కోసం సిద్ధంగా వున్నట్లు అమర్చు. అతను రాలేదంటే నువ్వింకా సిద్ధంగా లేవని అర్థం. నీ కాబట్టి దాన్ని గురించి చిరాకు వద్దు. చుట్టు చూడు, సిద్ధం చేయి, సిద్ధం చేయి, సిద్ధం చేయి. నువ్వు అమర్చడం పరిపూర్ణమయ్యాకా, నీ నిశ్శబ్ధం సమగ్రమయ్యాకా, నీ శూన్యత సంపూర్ణమయ్యాకా అతను వస్తాడు, వెంటనే అతను వస్తాడు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
30 Aug 2022
No comments:
Post a Comment