🌹 26 JANUARY 2025 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు🌹

🍀🌹 26 JANUARY 2025 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 శ్రీ కాలభైరవ అష్టకం - శ్లోకము తాత్పర్యము 🌹
ప్రసాద్‌ భరధ్వాజ
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 585 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 4 🌹 
🌻 585. 'శ్రీవిద్యా’ - 4 / 585. 'Shree Vidya' - 4 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*1) 🌹 శ్రీ కాలభైరవ అష్టకం - శ్లోకము తాత్పర్యము 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*మనోహరమైనది, జ్ఞ్యానమును, ముక్తిని కలిగించునది, అనేక పుణ్యములను పెంపొందించునది, శోకము, మోహము, దీనత్వము, కోపము, పాపములను నశింప చేయునది అగు కాలభైరవ అష్టకం ఈ వీడియోలో వీక్షించండి. కాలభైరవ పాద సన్నిధిని చేరుటకు దీనిని నిత్యము పఠించండి.*
*కాలభైరవం భజే!! కాలభైరవం భజే!!*
*కాశికాపురాధినాథ కాలభైరవం భజే!!*
*కాశికాపురాధినాథ కాలభైరవం భజే!!*

*🍀 కాలభైరవాష్టకం పఠించడం వల్ల లాభాలు 🍀*

*ప్రత్యేక రక్షణ - ఈ స్తోత్రం ప్రతికూల శక్తుల నుంచి మరియు చెడు ప్రభావాలనుంచి రక్షణ కవచం లాగా పనిచేస్తుంది.*
*భావనాత్మక స్వస్థత - భయం, ఆందోళన, మరియు ఒత్తిడిని తగ్గించి మనసుకు ప్రశాంతత మరియు భద్రతను కలిగిస్తుంది.*
*ఆధ్యాత్మిక ప్రగతి - కాలభైరవాష్టకం నిత్య పఠనం ద్వారా ఆధ్యాత్మిక ప్రయాణం మెరుగవుతుంది మరియు దైవంతో ఉన్న అనుబంధాన్ని మరింతగా గాఢం చేస్తుంది.*
*ఆత్మవిశ్వాసం - కాలభైరవాష్టకం పఠించడం ద్వారా ధైర్యం మరియు బలంతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం సులభమవుతుంది.*

*చైతన్య విజ్ఞానం ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి. - ప్రసాద్ భరద్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 585 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam  - 585 - 4 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।*
*శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀*

*🌻 585. 'శ్రీవిద్యా’ - 4 🌻*

*త్రికూట అయిన శ్రీమాతను అనుభూతి చెందుటకు కర్మము నందు ధర్మము తప్పనిసరి. ధర్మాచరణము లేని శ్రీవిద్యోపాసనము పతనమునకు దారితీయును. తనను ధర్మమున స్థిరముగ నిలుపమని కూడ శ్రీమాతనే ప్రార్థించవలెను. తాను ధర్మమున నిలువగలనని భావించుట అహంకారము. అహంకార మున్నచోట అజ్ఞానము తప్పదు. అజ్ఞాన మున్నచోట పతనము తప్పదు. ధర్మమున నిలచి మంత్రోపాసనము చేయుచు కనపడుచున్నది, వినపడుచున్నది అంతయు శ్రీమాతగా భావించుచూ నుండుట శ్రీ విద్యో పాసన మగును. అపుడు శ్రీవిద్య క్రమముగ ఫలించుట ఆరంభించును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 585 - 4 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita*
*shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻*

*🌻 585. 'Shree Vidya' - 4 🌻*

*To experience Sri Mata, who embodies the threefold form (Trikuta), adherence to Dharma in all actions is essential. Without practicing Dharma, the worship of Sri Vidya leads to downfall. One must also pray to Sri Mata for the strength to remain steadfast in Dharma, as believing oneself to be inherently firm in Dharma is a sign of ego. Where there is ego, ignorance prevails; and where ignorance exists, downfall is inevitable. Anchoring oneself in Dharma, performing mantra sadhana (spiritual practice), and perceiving everything seen and heard as manifestations of Sri Mata constitute the true worship of Sri Vidya. When this state of worship is achieved, Sri Vidya gradually begins to yield its divine results.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h

No comments:

Post a Comment